Valiants - తిందాం పద
Exploring the tastes of Guntur. We are sharing some of the best with you.
Never heard before, THE IDLY PAKODI and the guntur's TEENMAAR dosa Island Arundalpet 4th lane main road guntur 522002 Ap India
𝕥𝕒𝕤𝕥𝕪 3 𝕚𝕟 1 𝕕𝕠𝕤𝕒 𝕒𝕟𝕕 ℝ𝕒𝕘𝕚 𝕦𝕝𝕝𝕚 𝕕𝕠𝕤𝕒
Naga Sai Tasty Foods
https://maps.app.goo.gl/xVtxeqHnJdQN6AXF6
తింటే 𝓑𝓲𝓻𝔂𝓪𝓷𝓲 నే తినాలి, తగ్గేదేలే...!
Could be very useful for Pro-Farmers 👍
ఎవడ్రా గుంటూరోళ్ళకు సిగ్గులేదూ అన్నది? (Face Book లో ఇండస్ మార్టిన్ అనే అతని రచన )
రేయ్... పేరులో ' వూరు ' ఉందని గుంటూరును వూరనుకున్నారేమో.... అది వట్టి వూరు కాదురా..
మాచర్లలో సహారాఎడారి, తెనాలిలో కేరళా తేమ, పొన్నూరులో కోనసీమ మాగాణీ, తాడికొండలో టిబెట్టు పీఠభూమి, పిడుగురాళ్ళలో కొలరాడో క్యాన్యన్స్, వినుకొండలో యాండీస్ పర్వత్ శ్రేణులు, బాపట్లలో మయామీ బీచ్, మంగళగిరిలో సుమత్రా అగ్నిపర్వతం, తుళ్ళూరులో ఒండ్రునేలలూ, సత్తెనపల్లిలో బ్లాక్ కాటన్ సాయిల్ ... ఇలా అన్ని టైం జోన్లనూ, వాతావరణాలనూ, మృత్తికా రూపాలనూ కలగలుపుకున్న ఒక భూగోళంరా ఇది.
యకసెక్కాలాడతారు, యటకారం తప్ప ఇంకేమీ లేని వాళ్ళనుకున్నార్రా....
పులిహార, బిస్కెట్టు, మావూలుగా వుండదూ, కెవ్వు కేక లాంటి ప్రయోగాలను సృష్టించి మీ సినిమాలకూ, స్కిట్లకూ, సాహిత్యానికీ, సంగీతానికీ నుడికారాలూ, జాతీయాలూ, పడికట్టు పదాలూ, పంచులూ అందించి కలం పట్టుకున్న ప్రతీ వాడి నోటికీ నాలుగు మెతుకులు అందించే అన్నపూర్ణరా ...
ఎర్రిబాగులోళ్ళూ, ఎచ్చులోళ్ళు అనుకున్నారేమో...
రాయలసీమలో వేటకొడవళ్ళు ఉంటాయో లేవో తెలియదు... కానీ పదేళ్ళ క్రితం వరకూ పల్నాడులో అడుగుపెట్టిన ప్రతీ ఒక్కడికీ స్వాగతం చెప్పింది నాటుబాంబేరా... ఎలక్షన్ గెలవాలన్నా, గెలిచిన సీటు ఐదేళ్ళూ నిలబెట్టుకోవలన్నా నరసరావు పేట నడిసెంటర్లో నిలబడి తొడకొట్టడమే కాదు, టిఫిన్ క్యారియర్లో తెచ్చిన బాంబును తీసి ధణేల్మని నేలకు కొట్టినోడేరా ఇక్కడ లీడర్
డబ్బాలు కొట్టుకోవడం, సెంటర్లలో బాతాఖానీ వెయ్యడమే తెలుసు అనుకుంటున్నారా... చరిత్ర తెలియని అమాయకులనుకుంటున్నారా లేక అసలు చరిత్రే లేని అభాగ్యులం అనుకుంటున్నారా...
క్రీస్తుకు అయిదు వందల సంవత్సరాల పూర్వమే ప్రతిపాలపుత్ర రాజ్యం మా సొంతం. దాన్నే ఇవాళ్ళ బట్టిప్రోలు అంటున్నారు. కుభేరుడు మా రాజు. శాతవాహనులూ, ఇక్వాకులూ, పల్లవులూ, ఆనందగోత్రికులూ, విష్ణుకుండినులూ, కోట వంశీయులూ, వేంగీచాళుక్యులూ లాంటి అనేక రాజపరంపరలకు ఆశ్రయం ఇచ్చిన నేల ఇది.. చరిత్ర చెప్పుకునే ఖర్మ మాకు లేదు.
నాటుగా ఉంటారూ, మోటుగా మాట్లాడతారూ ఆధునికత తెలియని అనాగరికుల వూరు ఇది అనుకుంటున్నారా...
వెయ్యి కిలమీటర్ల కోస్తా తీరం ఉన్న తెలుగు నేల అయినా కూడా బ్రిటిష్ వాళ్ళు మొదట దిగి స్కూళ్లు కాలేజీలు కట్టించడానికి అనువైన ప్రదేశం అని ఎంచుకున్న జిల్లారా ఇది. మీరు దేశాలు దాటవచ్చు. కానీ దానికి కావాల్సిన చదువుల్ని ఇచ్చింది గుంటూరు తల్లే. దేశంలో మొదటి కోచింగ్ సెంటర్ గుంటూరుదే. మీరు ఇవాళ్ళ వెలగబెడుతున్న కార్పోరేట్ విద్యకు బొడ్డుకోసి పేర్లు పెట్టింది గుంటూరే. అసలు మీరు విమానాలు ఎక్కి ఖండాతరాల్లో సుఖంగా బతకడానికి మోసుకు వెళ్ళే కారాలూ, పచ్చళ్ళూ, పొడులూ ఎయిర్ లైన్స్ నిబంధనలకు అనుగుణంగా ప్యాకింగ్ చెయ్యడం నేర్పింది గుంటూరే. పాకిస్థాన్ ప్రధాని పేరుతో నిలువెత్తు జిన్నా టవర్ కట్టిన విశ్వనగరం గుంటూరు. జగజ్జేత చంఘీజ్ ఖాన్ పేరుతో కొండవీడు దుర్గం క్రింద ఒక పేటను కట్టిన ఎల్లలు లేని జిల్లా గుంటూరు.
రేయ్ రేయ్ రేయ్... అసలు గుంటూరు ఒక వూరు కాదురా... అదొక వడ్డించిన విస్తరిరా..... గోదావరిఖని నుండీ సూళ్ళురుపేట వరకూ విస్తరించిన తెలుగు నేలనుండి పట్టెడు అక్షరం మెతుకులు వెతుక్కుంటూ వచ్చే విద్యార్ధుల కోసం స్టూడెంట్ మెస్సుల్లో చెమటలు కక్కే ఆంటీరా గుంటూరు. ఘాటైన మిరపకాయలు పండిస్తూనే తీయనైన అంగలకుదురు సపోటాలూ తినిపిస్తుందిరా ఈ గుంటూరు. వూరి నడిబొడ్డున మిర్చీయార్డ్, వూరి గుండెలనిండా మాల్పూరీకోవా దట్టించుకున్న వైభోగమేరా ఈ గుంటూరు
అసలేం తెలుసురా మీకు...
గుంటూరు ఒక చెట్టురా.... నిలబడిన చోట కదలకుండా వుంటూనే రెండు రాష్ట్రాల్లో వేల కొలది గుంటూరు పల్లెల్ని వూడలు వేసిన మహావృక్షమ్రా అది. రెండు రాష్ట్రాలూ విడిపోతుంటే కూడా ఆ తిరస్కారంలో ' గుంటూర్ గో బ్యాక్ - గోంగూర గో బ్యాక్ ' అనే కీర్తిని విని ముసుముసిగా నవ్వుకున్న ఒక సుయోధన సార్వభౌముడి వంటి మెచ్యూర్ విలన్ రా గుంటూరు.
గుంటలో వుంటుంది, బురదలో ఈదుతుంది అనుకుంటున్నారేమో... నల్లరేగడి భూముల్లో మొదటి సారి శ్రీనాధుడి చేత వ్యాపార పంటల్ని పండించిన నేల ఇది. వానొస్తే మోకాలు లోతున దిగిపోయే భూముల్లో పుగాకూ పత్తీ పండించి బ్రిటన్ మార్కెట్టును గుప్పెట్లో పెట్టుకున్న చరిత్ర కలిగిన భూములు ఇవి. అంతెందుకు.. ఎందుకూ పనికిరాని భూములకు సైతం రియల్ ఎస్టేట్ విలువను అద్ది ఎందరో జేబుల్ని నింపి మరెందరో కడుపుల్ని నింపింది గుంటూరు మనుషులే. అసలు రెండు రాష్ట్రాలలో ఇవాళ్ళ జరుగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పునాదులు వేసింది గుంటూరని మర్చిపోతే ఎలారా?
గుంటూరు పొద్దున్నే నాలుగున్నరకు నిద్రలేచి తలుపులు తెరుచుకునే పల్లెటూరి కిరాణా షాపు. గుంటూరు రాత్రి రెండుగంటలకు కూడా ఇడ్లీలు వడ్డించే సిటీ రైల్వేస్టేషన్. గుంటూరు కళ్ళాపి వాసనల కుగ్రామం, హైటెక్ ఆసుపత్రుల మెట్రోపొలిస్. వానొచ్చినా వరదొచ్చినా, కరువొచ్చినా గత్తరవచ్చినా సాయంత్రం ఆరైతే తోటి మనుషుల్ని కలుసుకోడానికి ఎన్ని అడ్డంకులనైనా ఎదిరించి సెంటర్లో నిలబడే స్నేహనగరం. ఇది పునుగుల సరాగం, బజ్జీల అనురాగం, పచ్చళ్ళ అనుబంధం, పలావుల దాంపత్యం. మీరు పైకి గేళి చేస్తున్నా ఇవన్నీ మాకు లేవే అని లోలోన కుళ్ళుకుంటుంటే చూసి కిసుక్కున నవ్వుకునే కన్నెపిల్లరా గుంటూరు.
దేశం మొత్తం మతాల పేరుతో అల్లకల్లోలం అవుతూ ఉంటే ఖాశిం భాయ్ పలావు లేనిదే కాశీనాథ్ ఇంట్లో పెళ్ళి జరగని సమాజం గుంటూరు. కాలే మస్తాన్ దర్గా వురుసులో కమిటీ సభ్యులంతా మందిరం నుండే సరాసరి వస్తారు. ప్రపంచం మొత్తం నిన్ను వెలివేసినా గుంటూరు ఆటో స్టాండులో నీకూ నీ కుటుంబానికీ ఉపాధి ఎప్పటికీ గ్యారెంటీనే. గుంటూరు ఒక కటింగ్ చాయ్ ప్రేమ, గుంటూరు ఒక సినిమా పిచ్చి , గుంటూరు ఒక బిర్యానీ అడిక్షన్, గుంటూరు ఒక మిర్చీబజ్జీల ఉన్మాదం, గుంటూరు అసలు సిసలు జీవితం.
మీతో పొత్తు వద్దని తెలంగాణా తన్ని తరిమేస్తే చెప్పుకోడానికైనా అమృతం లాటి అమరావతి అనే ఒక రాజధాని పేరును ఇచ్చింది గుంటూరు. తోలేస్తే గుక్కెడు కృషానది నీళ్ళను గొంతులో పోసింది గుంటూరు.
ప్రేమించు... గుంటూరు తల్లిలా నిన్ను పొదువుకుంటుంది. ద్వేషించకు... అమ్మోరుతల్లిలా నిన్ను బలికోరుతుంది.
ఇది లాంగ్ అండ్ పర్వర్ట్ డైలాగ్ కాదు.... గుంటూరుకు జస్ట్ లవింగ్ అండ్ పర్ఫెక్ట్ ప్రొలోగ్ మాత్రమే.
ఎనీ క్వశ్చన్స్ ?
Credits: Ashok Jonnakuti
’s
ఎండలు పెరుగుతున్నాయి కదా , ఛిల్ల్ అవ్వడానికి లక్ష్మీపురం Belgian Waffle ..😋😋😋
శొంఠి కాఫీ @మద్రాస్ ప్రీమియం కాఫీ , విద్యానగర్..
ప్యారే గుంటూరు వాసియో! విద్యా నగర్ వైపు వెళ్తున్నారా? ఒక్కసారి మన బాబాయ్ టిఫిన్స్ దగ్గర ఆగి తీన్మార్ దోశ రుచి చూసి వెళ్ళండి! భలేగా ఉంటుంది మరి!
సమోసాలకి పెట్టని పేరు .. 9 రకాలకి పైగా రుచులతో .. వేడి వేడి సమోసా
GoChaatiz .. BakersFun పక్కనే మన లక్ష్మి పురం లో
ిందాం_పద
చూడడానికి రెండూ ఒకేలా ఉంటాయి, కానీ, దేని రుచి దానిదే. దహీపూరి, మసాలా పూరి. అడ్రెస్ తెలుసు కదా! 4th lane, brodipet.
ప్యారే గుంటూరు వాసియో!
ఈ చల్లని సాయంత్రం ఒక ఫిల్టర్ కాఫీతో సేద తీరండి.
Madras Premium Coffee, Drive O Polis, VidyaNagar
ిందాం_పద
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Contact the business
Telephone
Website
Address
Guntur
522002
F. No. 34, Indraprastha Apartment, Near Tenali Flyover, Mangalagiri
Guntur, 522509
Renovation in Purification
Guntur, 522403
We believe in bringing authentic taste with highest quality redefined the culinary art & diverse legacy of Indian kitchen Think Pickles , Think Delectable Indian Taste , Think Nost...
5th Line Devapuram Main Road
Guntur, 522006
Online grocery shopping is a way of buying Grocery and other household necessities using Android and
Door No:364, Ground Floor, Rajendra Nagar
Guntur, 522007
Organic clad is a food grocery store based at Guntur. We provide the best organic products right fro
3-414, Endroy Amaravathi Mandal, Endroy
Guntur, 522016
We Are One-Stop-Destination for Best Export Quality Spices and Food Products. We Deliver to Almost All Across India as Well as All Over The Worldwide.
JKC COLLEGE Road, OPP. VIKAS INN HOTEL
Guntur, 522006
JKC college road & Nagarampalem. SHOWROOMS: 1. JKC College Road-9100125565 2. Nagarampalem-8985295365