AP Focus Media
#1 Telugu News Website for Telugu People.
సత్తెనపల్లి పట్టణంలోని శ్రీవిద్య హాస్పటల్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించిన హాస్పిటల్ యాజమాన్యం..
ఈ మెగా మెడికల్ క్యాంపులో ఆర్థోపెడిక్ విభాగానికి సంబంధించి.. ఎముకలు, కీళ్లు, మెడ వెన్నుముక సమస్యలు, నరముల సమస్య, కీళ్లవాతం, విరిగిన ఎముకలు, స్పోర్ట్స్ ఇంజురీస్, జనరల్ మెడిసిన్ కు సంబంధించి.. బిపి, షుగర్,థైరాయిడ్, నెమ్ము ఉబ్బసం, ఆయాసం, విష జ్వరాలు,గ్యాస్,లివర్ వ్యాధులు, గుండె దడ,కాళ్ళ వాపులు, చర్మ వ్యాధులు మొదలగు సమస్యలకు ఈ మెడికల్ క్యాంపులో రక్త పరీక్షలు,ఎక్సరేలు, ఎముకల సాంద్రత( అరుగుదల) పరీక్షలు మొదలగు పరీక్షలు చేసి ఆయా వ్యాధులకు సంబంధించి ఉచితంగా మందులు ఇచ్చారు. ఈ మెడికల్ క్యాంపు నందు శ్రీవిద్య హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్స్ డాక్టర్" కాట్రాజు చిరంజీవి..M. S.ORTHO (RANGARAYA MEDICAL COLLEGE)CPCR (REHMATALOGY),FLJR ఎముకలు, కీళ్లు, వెన్నుపూస నరముల వైద్య నిపుణులు,డాక్టర్" తడవర్తి నాగ శ్రీవిద్య..DNB FAMILY MEDICINE (FELLO IN Diyabetology), క్రిటికల్ కేర్, షుగరు,బిపి,థైరాయిడ్, మరియు జనరల్ వైద్యునిపుణులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్" కాట్రాజు చిరంజీవి మాట్లాడుతూ..
సత్తనపల్లి,పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సత్తనపల్లి పట్టణంలోని పాత బస్టాండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఎదురు శ్రీవిద్య హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలకు ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్ విభాగాలకు సంబంధించి,అవగాహన కొరకు ఈరోజు ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో సుమారు 500 మంది సత్తెనపల్లి,పెదకూరపాడు, ఫిరంగిపురం మండలాలకు చెందిన ప్రజలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి, వారికి మందులు పంపిణీ చేయడం జరిగిందన్నారు.పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే మా లక్ష్యం. 24 గంటలు హాస్పిటల్లో అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించబడునన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్" శ్రీవిద్య మాట్లాడుతూ..
బీపీ,షుగర్, థైరాయిడ్, క్రిటికల్ కేర్ కేసులు అన్నివేళలా చూడబడునని, ఈరోజు ఈ క్యాంపు నిర్వహించడం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు మేలు జరిగిందన్నారు. 24 గంటలు ఆసుపత్రిలో అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందిస్తామన్నారు.
పల్నాడు.. సత్తెనపల్లి
ఎన్నో సంవత్సరాలుగా అంగన్వాడి వర్కర్స్ గా ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్నాము..
అంగన్వాడికి సంబంధించిన సేవలను ప్రతి రోజు A to Z 24/7 సేవలను ఎంతో నిబద్ధతతో, నిజాయితీగా పనిచేస్తున్నాం..
ఒక పండుగ లేదు, ఒక పబ్బం లేదు నిత్యం అంగన్వాడి స్కూలే ధ్యాసగా ఎంతో కష్టపడుతూ.. పనిచేస్తున్నాం..
అనారోగ్యం బారిన పడితే వేలకు వేలు ఖర్చు అవుతుంది.
పిల్లలు చదువులకు, కుటుంబ పోషణ నిమిత్తం అధిక మొత్తంలో ఖర్చు అవుతుంది.
ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతూ.. ఎన్నో ఇబ్బందులను అధిగమిస్తూ.. ఇట్టి చాకిరి చేస్తూ కుటుంబాన్ని కూడా వదిలి సేవ చేస్తున్నాం..
బానిసలుగా చూస్తున్నారు తప్ప మమ్ములను గుర్తించడం లేదు ప్రభుత్వాలు..
అంగన్వాడి స్కూల్లో ఇద్దరు చేసే పనిని 9 మంది చేత అంగన్వాడి పనులను చేయించడానికి సిద్ధపడ్డ ప్రభుత్వం మాకు కనీస వేతనాలు, సౌకర్యాలు కల్పించడానికి ఎందుకు వెనకాడుతున్నారు..
అంగన్వాడి స్కూల్లో ఇద్దరు చేసే పనిని 9 మంది సచివాలయ సిబ్బంది చేత చేయించడం ద్వారా మా చాకిరిని ప్రభుత్వం గుర్తించడం అభినందనీయం..
మమ్ములను గుర్తించాలని, మా హక్కుల కోసం మేము ఇక్కడ పోరాటం చేస్తుంటే ప్రభుత్వం సచివాలయ సిబ్బంది చేత బలవంతంగా అంగన్వాడీ కేంద్రాలను తాళాలను పగలకొట్టి మరి దౌర్జన్య పద్ధతిలో ప్రవర్తించడం చాలా బాధాకరం..
అంగన్వాడికి సంబంధించిన యాప్స్, ఇంకా రెండు యాప్స్ మొత్తం మూడు యాప్స్ కు సంబంధించిన ఆన్లైన్ వర్క్ నుచేయాలి..
ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు చేసిన తప్పును భూతద్దంలో చూయించి (మీడియాలో),మేము చేసే వెట్టి చాకిరిని మాత్రం చూపించరు..
తెలంగాణలో రేవంత్ రెడ్డి మేము గెలిచిన తర్వాత 18,000 ఇస్తామన్నారు, మీరు కనీసం 19000 అయినా ఇచ్చుంటే బాగుండేదని, 26వేలు ఇవ్వలేమని మాకు చెప్పవచ్చు కదా..
గత ప్రభుత్వంలో 10,500 ఇస్తే ఇప్పుడున్న ప్రభుత్వం మొక్కుబడిగా వెయ్యి రూపాయలు పెంచి చేతులు దులుపుకుంది..
ఈ రాష్ట్రంలో అనేక మందిని అనేక రకాలుగా ప్రోత్సహిస్తూ.. వారికి జీతభత్యాలు పెంచుతూ.. మమ్ములను మాత్రం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మా సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ అంగన్వాడి కార్యకర్తలు డిమాండ్ చేశారు.
సత్తనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ళ మండలం తొండపి గ్రామంలో జరిగిన బోరుపోతు వారి పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్న సత్తనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ బొర్రా వెంకట అప్పారావు గారు మరియు సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి కన్నా లక్ష్మీనారాయణ గారు పాల్గొనడం జరిగింది
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో "డాక్టర్స్" ఆధ్వర్యంలో ర్యాలీ..
కార్తీక సోమవారం.. అమరావతి శైవక్షేత్రాలలో భక్తుల కోలాహలం..
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Category
Contact the business
Telephone
Website
Address
Guntur
522002
Door No. 13-5-46, 1st Floor, 4th Line, Gunturivarithota, Guntur-
Guntur, 522201
నిష్పక్షపాతంగా నిజమైన వార్తలు
Guntur
ExpectNews - A round-the-clock news station bringing the first account of latest news from Political
Guntur City
Guntur
Magazine Story is a news and information publishing page Daily we will post Genuine News on Facebook