Sri Lakshmi Venkateshwara Productions.

Movie production house

25/08/2023
26/07/2022

I just get on with my , and let the do their.........

https://t.co/dtPOyXWV7m

Photos from MohanReddy Kokkanti's post 29/05/2022
08/05/2022

నేడు ఉదయం శ్రీశైల మల్లికార్జునుడికీ మొక్కు చెల్లించడం జరిగింది.

10/01/2022

50% తో #సంక్రాంతికి వేసే #స్పెషల్_బస్సు లలో #ఆక్యుపెన్సి ఎంతో మాత్రం చెప్పలేదు కానీ..... #సినిమాకే_సినిమా_చూపిస్తున్నాడు YS Jagan Mohan Reddy

27/12/2021

Successfully with 2nd Dose with on 27-12-2021.

19/12/2021

If the doesn't work the , not the .

13/12/2021
28/11/2021

#గజ్జె_గొల్లు_మన్నది.....🥲
ఒక గొప్ప నృత్య దర్శకుడు, కళాకారుడు శివశంకర్ మాస్టర్ ని కోల్పోయిన కళామతల్లి.

29/10/2021

కన్నడ కంఠీరవుడు రాజ్ కుమార్ గారి కుమారుడు అద్భుతమైన అభినయ చాతుర్యం కలిగిన పునీత్ రాజ్ కుమార్ గారు ఇక లేరు అనే నిజం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ , వారి ఆత్మకు శాంతి చేకూరాలని దైవాన్ని ప్రార్ధిస్తూ..... 🙏🙏🙏🙏🙏

09/10/2021

ఎలెక్షన్స్ లో Vishnumanchu మంచు విష్ణు ను గెలిపించమని కోరుతున్న #కోటా_శ్రీనివాస_రావు

08/10/2021

🌹అర్ధశతాబ్దపు నటనాప్రభ... రమాప్రభ🌹

హాస్యనటిగా అనిర్వచనీయ ప్రతిభ...

పద్నాలుగు వందల చిత్రాల శోభ...

క్యారక్టర్‌ ఆర్టిస్ట్‌ గానూ సరికొత్త రికార్డ్‌...

ఇవీ...రమాప్రభ అనే నాలుగక్షరాల్లో ఒద్దికగా ఇమిడిన ఖ్యాతి.

నాలుగుకాలాలపాటు గుర్తుండే చరిత్ర.

నలుపు తెలుపు చిత్రాల నుంచీ కాలానుగుణ మార్పుల్ని స్వాగతిస్తూ ముందుకు సాగుతున్న తెలుగు సినిమాతో పెరిగి పెద్దయిన నటీమణి...రమాప్రభ.

నవ్వు...నవ్వించు...నవ్వులు నలుగురికి పంచు...అనే సిద్ధాంతాన్నే జీవితంగా మలచుకున్న హాస్య నటి తాను.

తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన గొప్ప నటీమణుల్లో ఒకరు రమాప్రభ. ఆమె పుట్టినరోజు అక్టోబర్‌ 5. ఈ సందర్భంగా ఈ నటి గురించి కొన్ని ఆసక్తిదాయకమైన విషయాలు పాఠకుల కోసం.

* మేనత్త దత్త పుత్రికగా

రమాప్రభ మేనత్త ఓ బెంగాలీ వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకొన్నారు. ఆవిడకు పిల్లలు లేకపోవడం వలన రమాప్రభను పెంచుకున్నారు. రమాప్రభ మావయ్య పేరు కృష్ణదాస్‌ ముఖర్జీ. నెల పసికందుగా ఉన్నప్పుడే రమాప్రభను వీరు తీసుకెళ్లిపోయారు. అలా పదమూడు సంవత్సరాల వరకు ఊటీలో పెరిగిన రమాప్రభ ఆ తరువాత మద్రాస్‌కు చేరుకున్నారు. రమాప్రభకు 14 సంవత్సరాల వయసు వరకు వీరు తన సొంత తల్లిదండ్రులు కారన్న విషయం తెలియదు. రమాప్రభ తండ్రి పేరు గంగిశెట్టి. మదనపల్లి దగ్గర వాయల్పాడు వీరి స్వగ్రామం. పద్నాలుగేళ్ల వయసున్నప్పుడు రమాప్రభతో నువ్వు మా తమ్ముడు కూతురువని చెప్పారు. రమాప్రభ తల్లిదండ్రులకు మొత్తం 13 మంది సంతానం. అయితే, రమాప్రభకు తప్ప మిగిలిన వారెవ్వరికీ సినిమా పరిశ్రమతో సంబంధం లేదు. ప్రస్తుతం రమాప్రభ మదనపల్లిలో నివాసముంటున్నారు.

* సినిమా కెరీర్‌..

14 సంవత్సరాల వయసులో తమిళ సినిమా ద్వారా ఫిల్మ్‌ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత ‘చిలకా గోరింకా’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఆ తరువాత నుంచి ఇప్పటివరకు వరుసగా సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు.

* రంగస్థలం నుంచి రంగుల ప్రపంచంలోకి
సినిమాల్లోకి రాకముందు రమాప్రభ నాటకాలలో నటించారు. నటన అంటే రమాప్రభకు ఎంతో ఇష్టం. ఎంత పెద్ద డైలాగు చెప్పినా రమాప్రభ ఎంతో సులభంగా చెప్పేవారు.

* తోటి నటీనటులతో సరదాగా..
రమాప్రభ షూటింగ్‌ టైంలో తోటి నటీనటులతో సరదాగా ఉండేవారు. సరదాగా, జాలీగా అందరితో స్నేహపూర్వకంగా మాట్లాడడం రమాప్రభకు అలవాటు.

* రాజబాబుతో కెమిస్ట్రీ

రమాప్రభ, రాజబాబుది అద్భుతమైన సినీ కెమిస్ట్రీ. వీళ్లిద్దరూ కలిసి రెండు, మూడు వందలకు పైగా సినిమాలలో నటించారు. రాజబాబుతో ఎంతో ఆత్మీయబంధం ఉంది రమాప్రభకు. ‘ఒరేయ్‌’ అని రాజబాబుని పిలిచేవారు రమాప్రభ. అదే సమయంలో మరో హాస్య నటుడు పద్మనాభంతో కూడా పలు చిత్రాల్లో నటించిన అనుభవం ఆమెకి ఉంది.

* హీరోయిన్‌ అవకపోవడానికి ఇదే కారణం
రమాప్రభ కాలంలో హీరోల పాత్రల్లో ఎంతో పెద్దవారు నటించేవారు. రమాప్రభ 14వ సంవత్సరంలోనే ఇండస్ట్రీలోకి వచ్చారు. ఈ కారణంగా రమాప్రభ హీరోయిన్‌ పాత్రలకు దూరమయ్యారు. రమాప్రభ హీరోయిన్ల పాత్రలకు దూరంగా ఉండడానికి మరొక కారణం కూడా ఉంది. హీరోయిన్‌ పాత్రలైతే, కేవలం అవి మాత్రమే వస్తాయని, అలాగే కొంతకాలానికే స్కీన్ర్‌కి దూరంగా ఉండాలని తెలిసినవారు రమాప్రభకు చెప్పారట. ఈ కారణంగా కూడా హీరోయిన్‌ పాత్రలకు దూరంగా ఉన్నారట రమాప్రభ. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా పాత్రలు చేయడం వలనే ఇంత కాలం ఇండస్ట్రీలో కంటిన్యూ అవగలుగుతున్నానని కూడా రమాప్రభ అంటుంటారు.

* హీరో, హీరోయిన్ల కంటే మంచి పాత్రలు
తాను హీరోయిన్‌ పాత్రలు చేయనప్పటికీ, హీరో హీరోయిన్ల పాత్రల కంటే మంచి పాత్రలు పోషించానని అంటుంటారు రమాప్రభ. అటువంటి సినిమాలు ఎన్నో తన ఖాతాలో ఉన్నాయని కూడా అన్నారు. అటువంటి బహుమతి అందరికీ రాదని కూడా రమాప్రభ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే, తన కాలంలో కమెడియన్స్‌కి కూడా ఒకటో, రెండో పాటలు ఉండేవని గుర్తుచేసుకున్నారు. తన పాటలు ఎన్నో పాపులర్‌ అయ్యాయని కూడా ఆనందంగా చెబుతారు. హీరోయిన్లకు కంటే మంచి పేరుని తెచ్చిపెట్టిన సినిమాలు తన ఖాతాలో ఉన్నాయని, ఇది నిజంగా అదృష్టమని రమాప్రభ అంటుంటారు.

* శోభన్‌బాబుతో రెండు సినిమాలలో కథానాయికగా

వాస్తవానికి, రమాప్రభ హీరోయిన్‌గా నటించారు. శోభన్‌బాబుతో హీరోయిన్‌గా రెండు చిత్రాలలో నటించారు రమాప్రభ. అయితే, ఆ సినిమాలు ఉన్నాయని చెప్పడానికి ప్రస్తుతం వాటి ప్రింట్లు కూడా లేవు. దాంతో, రమాప్రభ హీరోయిన్‌గా నటించారన్న విషయం చాలా మందికి తెలియదు.

* వ్యక్తిగతం బాధామయం

వృత్తిపరంగా తనకు ఎటువంటి చేదు జ్ఞాపకాలు లేవని రమాప్రభ అన్నారు. కేవలం వ్యక్తిగతంగానే ఎన్నో చేదు జ్ఞాపకాలను మూటగట్టుకోవాల్సి వచ్చిందని మీడియాతో అన్నారు.

* మానసికంగా ధనవంతురాలు

ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన రమాప్రభ ప్రస్తుతం ఆర్ధిక ఇబ్బందులలో కూరుకుపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకప్పటి అమాయకమైన నటీమణుల్లో రమాప్రభ కూడా ఒకరన్న చేదు నిజాన్ని అంగీకరించలేకపోతున్నారు. అయినప్పటికీ, రమాప్రభ మానసికంగా ధనవంతురాలు. ఆవిడ ఆలోచనల్లో ఎంతో ధైర్యం ఉంటుంది. వివాహం ప్రముఖ నటుడు శరత్‌బాబును వివాహమాడారు రమాప్రభ. కొన్ని సంవత్సరాల తరువాత విడాకులు తీసుకొన్నారు. వీరికి పిల్లలు లేరు.

* జాలి నచ్చదు

తన జీవితం గురించి తెలుసుకొన్నవారు జాలి పడితే, ఆమెకి అస్సలు నచ్చదు. తన పట్ల జాలి చూపించడానికి ఎదుటివారికి ఎటువంటి అర్హత ఉందని ప్రశ్నిస్తారు. ఒకప్పటి రమాప్రభ ఎంతో కష్టపడి ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులలో మంచి స్థానం సంపాదించుకొన్నారని, ఆ రమాప్రభను నేను గౌరవిస్తానని అంటారు రమాప్రభ. ఎదుటివాళ్లు తనని చూసి జాలి పడడం తనకి నచ్చదని ముక్కు సూటిగా చెబుతారు.

* ఎన్నో సినిమాలు... మరెన్నో విజయాలు
‘సంబరాల రాంబాబు’, ‘అక్కా చెల్లెల్లు’, ‘బొమ్మ బొరుసా’, ‘విచిత్ర బంధం’, ‘తాతా మనవడు, ‘ఇద్దరు అమ్మాయిలు, ‘బడి పంతులు’, ‘ఓ సీత కథ’, ‘జీవన జ్యోతి’, ‘వింత ఇల్లు సంత గోల’, ‘సోగ్గాడు’, ‘సిరి సిరి మువ్వ’, ‘శ్రీ రాజేశ్వరి విలాస్‌ కాఫీ క్లబ్‌’, ‘మనుషులంతా ఒక్కటే’, ‘అమర దీపం’, ‘అడవి రాముడు’, ‘దొంగల దోపిడీ’, ‘ప్రాణం ఖరీదు’, ‘నా ఇల్లు నా వాళ్ళు’, ‘ఇంటింటి రామాయణం’, ‘గోరింటాకు’, ‘కార్తీక దీపం’, ‘ఇది కథ కాదు’, ‘గడసరి అత్తా సొగసరి కోడలు’, ‘47 రోజులు’, ‘స్వయంవరం’, ‘పట్నం వచ్చిన పతివ్రతలు’, ‘జనని జన్మభూమి’, ‘స్వాతి’, ‘భార్యాభర్తల బంధం’, ‘కొంగుముడి’, ‘ముచ్చటగా ముగ్గురు’, ‘శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం’, ‘కలియుగ పాండవులు’, ‘కారు దిద్దిన కాపురం’, ‘వివాహ భోజనంబు’, ‘పుణ్య దంపతులు’, ‘కలెక్టర్‌ గారి అబ్బాయి’, ‘గాంధీనగర్‌ రెండవ వీధి’, ‘అప్పుల అప్పారావు’, ‘నిన్నే పెళ్లాడతా’, ‘గణేష్‌’, ‘ఆవిడా మా ఆవిడే’, ‘పండగ’, ‘ప్రేమంటే ఇదేరా’, ‘బద్రి’, ‘ఫామిలీ సర్కస్‌’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘నీ తోడు కావాలి’, ‘నేను పెళ్లి రెడీ’, ‘ఠాగూర్‌’, ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ శైలజా కృష్ణమూర్తి’, ‘ఔనన్నా కాదన్నా’, ‘దేవదాసు’, ‘అశోక్‌’, ‘హ్యాపీ’, ‘ఏవండోయ్‌ శ్రీవారు’, ‘దేశముదురు’, ‘నేనింతే’, ‘రెచ్చిపో’, ‘అదుర్స్‌’, ‘మనీ మనీ మోర్‌ మనీ’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ఒంగోలు గిత్త’, ‘టెంపర్‌’, ‘వినవయ్య రామయ్య’, ‘బెంగాల్‌ టైగర్‌’, ‘జెంటిల్‌ మ్యాన్‌’ తదితర సినిమాల్లో నటించారు.

* ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నప్పటికీ
ఇప్పుడు రోజుకొక నటీనటులు వివిధ సినిమా పరిశ్రమల నుంచి వస్తున్నారు. అయినప్పటికీ, రమాప్రభకు ఎన్నో అవకాశాలు వరిస్తున్నాయి. అందుకు కారణమేమిటని, మీడియా రమాప్రభను అడగగా... వాళ్లు అనుకున్నట్టుగా నేను చేస్తున్నానేమోనని అన్నారు. వివాహ జీవితం బాధాకరంగా మారిందని మీడియా ముఖంగా ఎన్నోసార్లు అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఆమె ఒంటరిగా జీవనం సాగిస్తున్నారు.

Copy and paste

08/10/2021

🙏🙏తీసింది పదే.. అయినా దేనికదే!🙏🙏

‘నా కెరీర్‌లో ఇలాంటి సినిమా ఒక్కటైనా తీస్తే బాగుణ్ణు’ అని ప్రతీ నిర్మాత కలలు కనేటంత మంచి సినిమాలు అందించిన సంస్థ.. పూర్ణోదయ మూవీ క్రియేషన్స్‌. కథకీ, కళకీ అగ్రతాంబూలం అందిస్తూ.. వ్యాపార విలువల కంటే మానవీయ సంబంధాంలకే పెద్ద పీట వేసిన నిర్మాత.. ఏడిద నాగేశ్వరరావు. ఆయన్నుంచి వచ్చిన సినిమాలు పదే. అయినా ఏ సినిమా తీసుకొన్నా.. తనదైన ప్రత్యేకత ప్రతిబింబించేదే. తెలుగు సినీ జగత్తులో ఆణిముత్యాలుగా భావించే మేలైన చిత్రాలను అందించిన మేటి నిర్మాత ఏడిద నాగేశ్వరరావు (అక్టోబర్‌ 4) వర్ధంతి. ఈ సందర్భంగా ఆయన అందించిన అపురూప చిత్రమాలిక విశేషాలు... పాఠకుల కోసం...

* సిరిసిరిమువ్వ...

నిర్మాణ రంగంలో ఏడిద నాగేశ్వరరావుకి తొలి అనుభవం.. ‘సిరిసిరిమువ్వ’. తన స్నేహితులతో కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారాయన. ఇందులో ఏడిద నాగేశ్వరరావు పెట్టుబడి పెట్టిందేం లేదు. కేవలం నిర్మాణ బాధ్యతల్ని చూసుకొన్నారంతే. చంద్రమోహన్, జయప్రద కలిసి నటించిన ఈ చిత్రం బక్సాఫీసు దగ్గర మ్యూజికల్‌ హిట్‌గా నిలిచింది. ఇందులో పాటలన్నీ హిట్టే. ఈ సినిమాతో మొదలైన కె.విశ్వనాథ్‌ - ఏడిదల అనుబంధం ‘ఆపబ్బాంధవుడు’ వరకూ కొనసాగుతూనే ఉంది. కథానాయిక హైమ పాత్రకు ముందు కూచిపూడి నర్తకి శోభానాయుడిని తీసుకొందామనుకొన్నారు. కానీ ఆ అవకాశం జయప్రదకు దక్కింది. 1976 డిసెంబర్‌ 24న ఈ చిత్రం విడుదలై అఖండ విజయం సాధించింది. ఈ చిత్రాన్ని విశ్వనాథ్‌ హిందీలో ‘సర్‌గమ్‌’ పేరుతో బాలీవుడ్‌లో రీమేక్‌ చేశారు. అదే జయప్రద తొలి హిందీ చిత్రమైంది.

* తాయారమ్మ బంగారయ్య...

ఏడిద నాగేశ్వరరావుని పూర్తిస్థాయి నిర్మాతగా మార్చిన చిత్రమిది. ‘పూర్ణోదయ మూవీ క్రియేషన్స్‌’ అనే పేరు కూడా తెరపై ఈ సినిమాతోనే కనిపించడం మొదలైంది. సత్యనారాయణ బంగారయ్యగా, షావుకారు జానకి తాయారమ్మగా నటించారు. ముసలి దంపతులపై సినిమా ఏంటంటూ దర్శకుడు కొమ్మినేని శేషగిరిరావు రాసిన ఈ కథని తొమ్మిది మంది నిర్మాతలు తిరస్కరించారు. అయితే కథపై నమ్మకంతో ఏడిద నాగేశ్వరరావు ఈ చిత్రాన్ని టేకప్‌ చేశారు. ఈ చిత్రంలో చిరంజీవి తన ప్రస్థానం మొదలు పెట్టిన తొలి రోజులవి. ఆ పాత్ర ఎంత చిన్నదంటే ఒక్క డైలాగ్‌ కూడా ఉండదు. అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించి చిత్రబృందాన్ని అభినందించారు కూడా. జనవరి 12, 1979లో విడుదలైన ఈ చిత్రం కూడా మంచి లాభాలనే తెచ్చిపెట్టింది.

* శంకరాభరణం

తెలుగు సినీ చరిత్రలో ఆణిముత్యాలుగా భావించే అరుదైన చిత్రాల్లో ‘శంకరాభరణం’ ఒకటి. దర్శకుడిగా విశ్వనాథ్‌ కళాత్మకతకూ, నిర్మాతగా ఏడిద నాగేశ్వరరావు తెగువకూ నిలువుటద్దం.. ఈ చిత్రం. తెలుగు ప్రజలకు శాస్త్రీయ సంగీతంపై మక్కువ పెంచడంలో తనవంతు పాత్ర పోషించిందీ చిత్రం. ప్రతీ పాటా అద్భుతమే. ప్రతీ సన్నివేశమూ అజరామరమే. సోమయాజులు హీరో ఏంటీ? వ్యాంపు పాత్రలు పోషించే మంజుభార్గవి కథానాయిక ఏంటీ? అని అందరూ ఆశ్చర్యపోయారు అప్పట్లో. అయితే ఈ సందేహాలన్నీ పటాపంచలు చేస్తూ అద్భుత విజయాన్ని సాధించిందీ చిత్రం. ఫిబ్రవరి 2, 1980లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలైన తొలి నాలుగైదు రోజులూ...థియేటర్ల దగ్గర జనమే లేరు. అయితే ఆ తరువాత ప్రభంజనం సృష్టించింది. ఫ్రాన్స్‌లో జరిగిన బోసాన్‌కన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రంగా పురస్కారం అందుకొంది ‘శంకరాభరణం’. నాలుగు జాతీయ అవార్డులతో పాటు ఏడు నంది అవార్డుల్ని సొంతం చేసుకొంది. ఈ సినిమాపై ప్రేమతో చెన్నై, హైదరాబాద్‌లలోని తన ఇళ్లకి ‘శంకరాభరణం’ అని పేరు పెట్టుకొన్నారు ఏడిద నాగేశ్వరరావు. విడుదల అనంతరం ప్రముఖ దరద్శకుడు వంశీ (అప్పట్లో సహాయక దర్శకుడిగా పనిచేశారు) ఈ సినిమా నేపథ్యంలో వెండితెర నవల రాశారు. దానికీ విశేష ఆదరణ లభించింది.

* సీతాకోక చిలక

ప్రేమకథా చిత్రాల్లో ‘సీతాకోక చిలక’కు ప్రత్యేకమైన స్థానం ఉంది. భారతీరాజా దర్శకత్వ ప్రతిభ, ఇళయరాజా సంగీతం, మురళి (ఆ తరువాత కార్తిక్‌). ముచ్చర్ల అరుణల మధ్య పండిన అద్భుతమైన కెమిస్ట్రీ, అత్యంత సహజమైన సన్నివేశాలు వెరసి ఈ చిత్రాన్ని ఓ మాస్టర్‌ పీస్‌గా నిలబెట్టాయి.

‘పదునారు వయదునిల్లే’ (తెలుగులో పదహారేళ్ల వయసు) చిత్రాన్ని చూసిన ఏడిద నాగేశ్వరరావు.. భారతీరాజా దర్శకత్వ ప్రతిభకు ముగ్థుడై..ఆయన చేతిలో అడ్వాన్సు పెట్టేశారు. అలా..‘సీతాకోక చిలక’ చిత్రానికి అంకురార్పణ జరిగింది. అరుణ పాత్రకు రాధ, విజయశాంతిల పేర్లు పరిశీలనకు వచ్చాయి. చివరి క్షణాల్లో ఆ అవకాశం అరుణకు దక్కింది. ఈ చిత్రానికి ‘సాగరసంగమం’ అనే పేరును పెడదామనుకొన్నారు. అందుకే ‘సాగర సంగమమే’ అనే పాట కూడా రాయించుకొన్నారు. అయితే.. ఏడిద నాగేశ్వరరావు మాత్రం ఈ టైటిల్‌కి అభ్యంతరం తెలిపారు. తమిళంలో ‘అళయగళ్‌ ఒయివదిల్లై’ అనే పేరుతో ఈ చిత్రం విడుదలైంది. 12 లక్షల నిర్మాణ వ్యయంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం జూన్‌ 2, 1982లో విడుదలై అఖండ విజయం సాధించింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా రజత కమలం అందుకొంది. నాలుగు నంది అవార్డులు వరించాయి. ‘సితార’ పత్రిక కూడా 5 అవార్డులతో ఈ చిత్రాన్ని సత్కరించింది. వంశీ ఈ చిత్రాన్ని నవల రూపంలోకి తీసుకొచ్చారు.

సితార..

వంశీ-ఇళయరాజా కాంబినేషన్‌ అంటే సూపర్‌ డూపర్‌ హిట్టే. ఆ కలయికకు పునాది వేసిన చిత్రం ‘సితార’. పూర్ణోదయ సంస్థలో వంశీ సహాయ దర్శకుడిగా
పనిచేశారు. వంశీని తమ సంస్థ నుంచే దర్శకుడిగా పరిచయం చేయాలని ఏడిద నాగేశ్వరరావు ఆలోచన. అయితే అది సాధ్యం కాలేదు. అయితే రెండో చిత్రం ఈ సంస్థలో చేసే అవకాశం దక్కింది వంశీకి. ఆయన రాసిన ‘మహల్లో కోకిల’ నవల గురించి నాగేశ్వరరావుకి ముందే తెలసు. ఆ నవలను సినిమాగా తీసుకురావాలన్న వంశీ ఆలోచనకు ఏడిద నాగేశ్వరరావు నిర్మాతగా భుజం తట్టారు. దక్షిణాదిన రౌండ్‌ ట్రాలీని ఉపయేగించిన తొలి చిత్రం ఇదే. ఏప్రిల్‌ 26, 1984లో ఈ చిత్రం ప్రేక్షకులముందుకొచ్చింది. విడుదలైన తొలి రోజుల్లో ‘మరీ క్లాస్‌ ఉంది సినిమా’ అన్నవాళ్లే ఆ తరువాత ఎగబడి మరీ చూశారు. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఈ చిత్రానికి జాతీయ అవార్డు లభించింది. ‘వెన్నెల్లో గోదారి అందం’ పాటకుగానూ జానకికి ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ పురస్కారం లభించింది. వంశీ కెరీర్‌కి ఊతంలా నిలిచిన చిత్రమిది.

* సాగర సంగమం...

పూర్ణోదయ సంస్థ వారి మరో అద్భుత సృష్టి...‘సాగర సంగమం’. ‘శంకరాభరణం’ సంగీతం చుట్టూ తిరిగితే, ‘సాగర సంగమం’ నృత్య ప్రధానంగా సాగుతుంది. ‘నా అపురూప చిత్రాల్లో సాగర సంగమం మొదటి స్థానంలో ఉంటుంది’ అని కమల్‌ చాలా సందర్భాల్లో ఈ సినిమాని ప్రస్తావించారు. నిజానికి ఇందులో ఆయన బాలు పాత్ర పోషించడానికి ముందు భయపడ్డారట. దానికి కారణం ముసవి వేషం వేయాల్సి వస్తుంది. అయితే ఈ పాత్రకి కమల్‌హాసన్‌ మాత్రమే న్యాయం చేయగలరని పట్టుబట్టీ మరీ ఒప్పించారు ఏడిద నాగేశ్వరరావు. కథానాయిక పాత్రకు ముందు జయసుధని ఎంచుకొందామనుకొన్నారు. కానీ..జయప్రదకు ఆ అవకాశం దక్కింది. ‘మౌనమేల నోయి’, ‘తకిట తథిమి’ పాటలు ఇప్పటికీ మార్మోగుతూనే ఉంటాయి. ఉత్తమ సంగీత దర్శకుడిగా ఇళయరాజాకు జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన చిత్రమిది. గాయకుడిగా బాలు అవార్డు అందుకొన్నారు. తాష్కెంట్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ఫెస్టివల్‌కి ఎంపికైన చిత్రమిది.

* స్వయం కృషి

డిగ్నిటీ ఆఫ్‌ లేబర్‌ గురించి చెప్పాలంటే ‘స్వయంకృషి’ సినిమాని చూపించాల్సిందే. చెప్పులు కుట్టుకునే సామాన్య పాత్ర.. స్వయంకృషితో ఎదిగిన వైనమే ఈ చిత్రం. అప్పటి వరకూ మాస్‌ పాత్రలు చేస్తూ, కమర్షియల్‌ చిత్రాలకు చిరునామగా నిలిచిన చిరంజీవితో పూర్ణోదయ చేసిన వైవిధ్యభరితమైన ప్రయత్నమిది. ఎన్ని వాణిజ్య చిత్రాలు చేసినా రాని సంతృప్తి ఈ చిత్రంతో లభించిందని చిరంజీవి వీలున్నప్పుడల్లా ‘సృయంకృషి’ని గుర్తుచేసుకొటూనే ఉంటారు. దానికి తగ్గట్టు ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకొన్నారు చిరు. రమేష్‌ నాయుడు అందించిన పాటలన్నీ సూపర్‌ హిట్టే. 25 కేంద్రాల్లో ఈ చిత్రం వందరోజులు ఆడింది. ‘సృయంకృషి’ని రష్యన్‌ భాషలో అనువందించారు కూడా. మాస్కో చిత్రోత్సవంలో ప్రదర్శనకు నోచుకొని అరుదైన గౌరవం సంపాదించుకొంది.

* స్వర కల్పన

ఏడిడ శ్రీరామ్‌ కథానాయకుడిగా పరిచయం చేస్తూ పూర్ణోదయ సంస్థ నిర్మించిన చిత్రమిది. వంశీ దర్శకత్వంల వహించిన ఈ చిత్రంలో సీత కథానాయికగా నటించింది. ఇళయరాజా సోదరుడు గంగై అమరన్‌ సంగీతం అందించారు. ఇందులో ‘కేళివిలోల వేణుగోపాల’ అనే పాటను వంశీ రాశారు. నిజానికి ఈ చిత్రంలో కథానాయకుడిగా రాజశేఖర్‌ని ఎంచుకొన్నారు. చివర్లో ఆ స్థానం ఏడిద శ్రీరామ్‌కి దక్కింది. నవంబర్‌ 3, 1989లో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల స్పందన అంతంత మాత్రంగానే లభించింది. ‘ఈ పరాజయానికి కారణం నేనే. కథా చర్చల సమయంలో నేను పెద్దగా దృషిపెట్టలేదు’ అంటూ ఈ పరాజయాన్ని తన భుజాలపై వేసుకొన్నారు ఏడిద నాగేశ్వరరావు.

* ఆపద్బాంధవుడు

చిరంజీవికి ఉత్తమ నటుడిగా మరోసారి నంది అవార్డు తీసుకొచ్చిన చిత్రమిది. చిరు అభినయం ఇంటిల్లిపాదినీ కట్టిపడేసింది. ముఖ్యంగా మానసిక వికలాంగుడిగా చిరు ప్రదర్శించిన అభినయం తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కె.విశ్వనాథ్‌ - ఏడిద నాగేశ్వరరావు కలయికలో రూపొందిన ఆఖరు చిత్రం కూడా ఇదే. ఈ సినిమా తరువాత నిర్మాణానికి దూరమయ్యారు ఏడిద నాగేశ్వరరావు. అయితే నిర్మాతగా మాత్రం ఆయన్ని అన్ని విధాలా సంతృప్తిపరచిన చిత్రమిది. పూర్ణోదయ సంస్థ ప్రతిష్టని మరింత ఇనుమడింప చేసింది. జంధ్యాల తొలిసారి మేకప్‌ వేసుకొన్న చిత్రమిది. ఈ సినిమాకి సంభాషణలు అందించిన జంధ్యాల..ఇందులోని పరంధామరాజు పాత్రని ప్రేమించడం మొదలెట్టారు. చివరకి ఈ పాత్ర నేనే చేస్తా అని ఏడిద నాగేశ్వరరావుకి ఓ చీటి రాసిచ్చారు. చివరకి కె.విశ్వనాథ్‌ కూడా ఓకే అనడంతో తొలిసారి జంధ్యాల మేకప్‌ వేసుకొన్నారు.

* స్వాతిముత్యం

మానసిక వికలాంగుడి పాత్ర ఎవరు చేయాలన్న ఆ నటుడికి డిక్షనరీలా ఉపయేగపడే చిత్రం ‘స్వాతిముత్యం’. కె.విశ్వనాథ్‌ - కమల్‌హాసన్‌ కలయిక ఎంత ఉన్నంతగా ఉంటుందో మరోసారి నిరూపించిందీ చిత్రం. కమల్, రాధిక జంటగా నటించిన చిత్రం అప్పట్లో అతి పెద్ద మ్యూజికల్‌ హిట్‌. ఇళయరాజా మరోసారి తన స్వర ప్రతాపం చూపించారు. ‘వటపత్రశాయికి వరహాల లాలి..’, ‘సువ్వీ సువ్వీ సువ్వాలమ్మా’, ‘చిన్నారి పొన్నారి కిట్టాయ్యా..’, ‘మనసు పలికే మౌనగీతం’ ఇలా ప్రతీ పాటా..స్వాతిముత్యమే. ఈ చిత్రానికి ‘శివయ్య’ అనే పేరు పెడదామనుకొన్నారు. ఎందుకంటే అది కథానాయకుడి పాత్ర పేరు. అయితే.. ‘స్వాతి ముత్యం’గా మార్చారు. చివర్లో శివయ్య పాత్ర తెలివైన వాడిగా మారిపోయేలా స్క్రిప్టు రాసుకొన్నారు విశ్వనాథ్‌. అయితే.. ఆ పాత్రని అమాయకంగా ముగించడమే మంచిదని ఏడిద నాగేశ్వరరావు అభిప్రాయం. ఆ మాటకు విశ్వనాథ్‌ విలువ ఇచ్చి..నిర్మాత కోరినట్టే సినిమాని ముగించారు. భారతదేశం తరపున ఆస్కార్‌కి నామినేట్‌ అయిన తొలి దక్షిణాది చిత్రం ఇదే కావడం విశేషం. పలు జాతీయ, నంది పురస్కారాలు ఈ స్వాతిముత్యాన్ని వరించాయి.

Copy and paste.....

10/09/2021

is an of also.

25/08/2021

మళ్లీ తెరపైకి #సినీ_స్టార్స్ #డ్రగ్స్‌_కేసు..

రంగంలోకి ఈడీ..

విచారణకు హాజరుకావాలని చార్మి, రకుల్‌ప్రీత్‌సింగ్, రానా, రవితేజ, తరుణ్, నందు, పూరీ జగన్నాథ్, నవదీప్, ముమైత్‌ఖాన్‌, శ్రీనివాస్‌కు ఈడీ సమన్లు..

ఈ నెల 31 నుంచి సెప్టెంబర్‌ 22 వరకు విచారణ

31/12/2019

Sri Lakshmi Venkateshwara Productions.

31/12/2019

Sri Lakshmi Venkateshwara Productions.'s cover photo

Want your business to be the top-listed Media Company in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

MAA
Hbd Chiranjeevi

Telephone

Website

Address

Hyderabad

Other Broadcasting & media production in Hyderabad (show all)
Solus Media Solus Media
409C, Babu Khan Estates, Basheerbagh 4th Floor
Hyderabad, 500029

Our gamut of services include : Public Affairs, Strategic advice, Image Management, Media Relations,

Crime Tapes Crime Tapes
Hyderabad, 500001

Nature Candid Productions Nature Candid Productions
Casa Rouge Appt
Hyderabad, 500084

We believe that high quality wildlife documentaries have an enormous role to play in wildlife conservation. A very small proportion of the Country’s population will ever travel to...

Telugu MultiPlex Telugu MultiPlex
37/A Susheela Sadan, VengalRao Nagar
Hyderabad, 500038

Telugu MultiPlex a new brand Broadcasting and Media Production Company

Maa Tv Mee voice Maa Tv Mee voice
Hyderabad, 500001

కొత్త విషయలతో. Please support, Like and subscribe Maatv Meevoice.

Ntoday News Ntoday News
Hyderabad

Broadcasting & Media

String Reveals String Reveals
Hyderabad, 500033

We need your support to fight the Anti-nationals and revive the glory of Bharath http://YT.stringrev

UTV Network UTV Network
Noor Khan Bazar Osmanpura
Hyderabad, 500024

UTV NETWORK ALWAYS AHEAD

Mark TV Telugu Mark TV Telugu
Hyderabad, 500072

MARK Media Telugu provides complete information about the Telugu News, Film News/Interviews and Polit

MSN Banjara MSN Banjara
Hyderabad, 500092

Deccan Pixels Deccan Pixels
Raghavendra Colony, Kondapur
Hyderabad, 500084

We are Deccanpixels startup based out of Hyderabad.. we take hidden and amazing talents of people to get gets out in the form a videos

OM CVR OM CVR
PLOT NO 573J, Road NO 82 JUBILEE HILLS CO-OPERATIVE HOUSE BUILDING SOCIETY
Hyderabad, 500033

CVR OM Spiritual TV is an Official Account by Image Broadcasting Pvt. Ltd.