Manasulo Maata

Manasulo Maata

You may also like

Ray_shop
Ray_shop

Information is Power Information is wealth Information is knowledge Information is liberating Inform

19/07/2022

ఒక క్షణం నీ గుండె చప్పుడు విన్నా చాలనిపిస్తుంది. . .!
ఒక క్షణం ప్రపంచాన్ని మరచి నా ప్రపంచం అయిన
నీతో మనసువిప్పి మాట్లాడాలని ఉంది . . .!
జీవితం ఎంత పెద్దదైనా నీతో గడిపే ఒక క్షణం చాలు
మిగిలిన జీవితం అవసరం లేదనిపిస్తుంది . !!! #

19/07/2022

ఏనాటికి కూడా నాకు శాశ్వతమైన బంధాలే కావలసింది..
ఆశాశ్వతమైన బంధాలు అసలే వద్దు..
అవి నాకు ఎంత లాభాన్ని చేకూర్చినా కూడా...✍️

19/07/2022

అందం అనేది చూపించే కోణంలో ఉండదు..
మనం చూసే కోణంలో ఉంటది..
మన ఆలోచన విధానంలో ఉంటది..
అందాన్ని అందంగా దాచడంలోనే అందానికి విలువ..✍️

16/07/2022

గాలిపటం ఆకాశపు అంచుల్లో
ఎంత దూరంలో ఉన్నా,,
దారం మన చేతిలోనే ఉంటుంది..
అలాగే,,
మన అనుకున్న వారు ఎంత దూరంలో ఉన్నా,,
మన మనస్సుకి దగ్గరగానే ఉంటారు..
మన ఆలోచనల్లో...✍️

16/07/2022

16/07/2022

తమ కోసం నేను పెట్టే ప్రతి వాట్సప్ స్టేటస్
ఎన్నో కన్నులని కన్నీటి తో తడుపుతున్నాయి
కానీ
తన కంట్లో ఒక కన్నీటి బొట్టు
తన మనసు లో నాపై చిన్న ఆలోచన
తన హృదయం లో కాస్త చోటు ఇవ్వలేక పోయాయి..✍️

13/07/2022

ఎందుకు నీకీ మొండితనం ప్రేమ..?

13/07/2022

ప్రతీ జీవితానికి ఓ కథ ఉంటుంది..
ప్రతీ కథలో ఓ వ్యధ ఉంటుంది..
అది జ్ఞాపకమో, గతమో..
ఏదైనా మనసుని తాకే ఉంటుంది... ✍️

07/07/2022

మనం కార్చే రెండు కన్నీటి చుక్కల వెనక
చెప్పుకోలేని భాద గుండెలో ఉంటే
మరి ప్రకృతి కార్చే
కన్నీటివర్షం వెనక
ఇంకెంత భాద ఉండాలో కదా..!!
✍🏻

07/07/2022

నా జీవితం ఎలా ఉందంటే
నా టేబుల్ పక్కన
చెత్త బుట్టలో
నేను చింపిపడేసిన తెల్లకాగితాల్లో
నలిగిన అక్షరాల్లా ఉంది..
✍🏻

07/07/2022

మరో ప్రపంచం....కేవలం ... నీవు నేను మాత్రమే....
మాటలే కరువైన...మౌన రాగం.....ఆ రాగం అర్థమయ్యేది ..మనసుకి మాత్రమే...!!

06/07/2022

నీ కోసం
నీ క్షేమం కోసం
ఎన్ని కాగితపు పడవల్ని
ప్రేమ లేఖలుగా వదిలానో..
నీ తీరాన్ని చెరుతాయాని
నా దరికి తిరిగొస్తాయని కాదు.
నాలో నువ్వంటే అంత ఇది..

06/07/2022

ఎన్ని వేల చుక్కల్లో... ఎక్కడ వెతికేది ... "నా" అయిన నిన్ను.
సాయం సంద్యావేలల్లో...... ఆ నింగివైపు, నీ...కోసం ఆశగా చూస్తూ ఉంటా....
ఒక్క సారి అయినా కనిపించకుండా ఉంటావా అని...... నీతో ఒకటి చెప్పాలి.
ఆ దేవుడిని అడిగేసా. “నీ తుదిశ్వాసనే.... నా చివరి శ్వాస కావలని”.
పిచ్చి అనుకుంటున్నావా.... అదేం కాదు…. “భయం”....,
“నీవే…. నా ప్రపంచం అనుకున్నప్పుడు.... నీవు లేని ఈ ప్రపంచంలో... ఎందరు ఉన్నా "నే" ఒంటరినేగా”. ..!!!

05/07/2022

ఈ జన్మ లో నాకు కేవలం నిన్ను
ప్రేమించే ప్రేమ మాత్రమే దొరికింది
కానీ
మరో జన్మ ఉంటుంది అనేది నిజమే అయితే
నీ ప్రేమ తో పాటు
నీతో కాలిసి జీవితాన్ని పంచుకొనే అవకాశం
ఇవ్వమని ఆ దేవున్నీ కోరుకుంట

05/07/2022

ఆనందానికే రెక్కలు ఉంటే..
అన్ని చోట్ల తిరిగేదేమో..
పేద,ధనిక తేడా లేకుండా..
అందరికి అందుబాటులో ఉంటూ... ✍️

05/07/2022

#ఏకాంతం..
మనం ఎలా ఉన్నామో
సమాజం చెబితే..
ఎలా ఉండాలో ఏకాంతం చెప్తుంది..
మనలోని మన ప్రతిబింబాన్ని చూపిస్తుంది..
నేను మొదటి నుండి ఒంటరినే..
కానీ,,
జాలి పడాల్సిన విషయం కాదు..
గర్వించదగ్గ విషయం...
ఎందుకంటే,,
ఎవరి తోడు లేకుండా ఉండటం అంటే..
మన మీద మనకు బోలెడంత నమ్మకం ఉండటం...✍️

05/07/2022

నువ్వు నీలా ఉండటం కంటే,
గొప్ప రియాలిటి ఏముంటుంది..?
ఎవరి మెప్పుకోసమో,
నిన్ను నువ్వు మార్చుకోవాల్సిన అవసరం లేదు... ✍️

05/07/2022

వద్దన్నా..వదలని..తలంపు నువ్వూ..
కనురెప్పల నీడలో..గూడు కట్టి..
స్థిరంగా..నిలిచిపోయావు..
నన్నొదలక..
నాకంటూ..ఏమి మిగలక..!!

నేనెంత వేడినా.. వీడని బంధమై..
మనసు మూలలో..నక్కి..
తలపుల..తలుపులు..తీసుకుని..
మరీ..నా జ్ఞాపకాల గూటికి చేరి..
నన్ను..నాకు..మిగల్చవు..!!

నన్ను..నాలా..ఉండనీ..
లావాలా..ముంచెయ్యకు..! #

04/07/2022

నా కథలోకి నువ్వు ఎలాగూ రాలేవు ...
అందుకే నా కలలకు మహారాజు ని చేసాను నిన్ను....
ఇప్పుడు కాదనగలవా నా ప్రేమను.....♥️

04/07/2022

కొన్ని సందర్భాలలో మౌనమే సరైన స్పందన..
సందర్భానికి వ్యతిరేకంగా... ✍️ # lordkrishna

04/07/2022

తొలి పరిచయంలోనే అనుకున్నాను ,
రూపం లేని నా ప్రేమకి వూపిరి నీవేనని.
కాని, అదే నీ ఆఖరి కలయిక అని తెలిసి,
మాట రాని నా హృదయానికి గాయం అయ్యెను.
గాయమైన గానీ నిన్ను మరువలేదు....
దూరమైన గానీ ఎదురు చూపులు ఆపలేదు....
ఎందుకో తెలుసా , మరచేది అయితే అది మనసే కాదు .....
#

03/07/2022

జీవితం అనే కథలో..
ఏ కథ అయినా,
చందమామ కథలా చాలా అందంగా ఉంటుంది..
కానీ,,
కొందరి కథలో..
ఎంత మంది పాత్ర ధారులు ఉన్నా..
రాత్రి ఏకాంత సమయంలో..
వారి ఊహలే వారికీ ప్రియ నేస్తాలు...✍️

03/07/2022

జీవితంలో ఎన్ని పరిచయాలు ఉన్నా..
కొన్ని పరిచయాలు చేసే జ్ఞాపకాలు ఎన్నో..
జ్ఞాపకాలు మిగిల్చే గుర్తులు ఇంకెన్నో...✍️

03/07/2022

బరువనుకునే ప్రతీది, బద్దకంగానే ఉంటుంది..
కానీ,,
నిన్ను కన్న అమ్మని అడుగు.. తొమ్మిది నెలల బరువు, జీవితాంతం తీరని
సంతోషాన్ని ఇస్తుందని చెబుతుంది... ✍️

03/07/2022

ప్రేమంటే ఇవ్వడమే అని తెలిసినా కూడా,
ఆశించి మనమే తప్పు చేస్తున్నాం..
ప్రేమంటే ఆశించడం కాదని తెలిసినా కూడా, అందుకోలేదని మనమే తప్పు పడుతున్నాం.. ✍️

02/07/2022

ప్రాణం గా చుసుకుందాం
అని ప్రేమించాను
కానీ
ఇప్పుడు అదే జ్ఞాపకాలతో ప్రాణం పోతుంది ..!!

02/07/2022

నా ఆలోచనలే నాకు శాపం..
ఎందుకంటే,,
అనుకున్నవన్నీ అరచేతిలో రావుగా... ✍️

02/07/2022

పేరు పెట్టని బంధమొకటి
ప్రతీ మనసుని పలకరించి వెళ్తుంది..
తలరాతలో లేదని తెలిసినా,
తాపత్రయ పడేలా చేస్తుంది...✍️

02/07/2022

.
మనం ప్రేమించే వాళ్ళు మన నిర్ణయం ..
మనల్ని ప్రేమించేవాళ్ళు పైవాడి నిర్ణయం..
మన నిర్ణయం ప్రేమైతే..
పైవాడి నిర్ణయం "వరం "... ✍️

Want your business to be the top-listed Engineering Company in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Website

Address

Malakpet
Hyderabad
500036

Other Science, Technology & Engineering in Hyderabad (show all)
BlueSemi BlueSemi
T-Hub Foundation Catalyst IIIT-Hyderabad, Gachibowli, Telangana
Hyderabad, 500032

Bluesemi is a revolution in connected customer-centric Health Tech. We're on a mission to bring a positive transformation into people’s lives by making holistic wellness an integra...

Telugu Gawks Telugu Gawks
Hyderabad

Hi frnds .We have a youtube channel Telugu Gawks so we are posting our videos in facebook too.Our vidoes are mainly about space,science, origins,intresting faqs and etc.So if you ...

Machine Learning, IOT, Smart Cities & Applications Conference Machine Learning, IOT, Smart Cities & Applications Conference
CMR Institute Of Technology, Kandlakoya, Medchal Road
Hyderabad, 501401

International Conference on Recent Trends in Machine Learning, IOT, Smart Cities (ICMISC)

Hydro technology Hydro technology
Hyderabad

Aim to achieve zero-emission gases driven from water and hydrogen

knowabout.it knowabout.it
Hyderabad
Hyderabad, 500038

Information + Entertainment = Infotainment ♥️ Security, Science, Technology, Facts and Provide y

Raj's Tech in Telugu Raj's Tech in Telugu
Hyderabad, 500019

This page is like a Reflection of my YouTube channel " Raj's Tech in Telugu " https://www.youtube.com/channel/UCThPqu5XuO7xNDkNNw0bG4w

technophile_rj technophile_rj
Hyderabad
Hyderabad, 500079

Here i would be uploading my learning and technology related reels thorough which you can gain more insights on them

Crazy srikanth tech experiment Crazy srikanth tech experiment
Hyderabad Oldmalakpet
Hyderabad, 500036

Hello guys iam sreekanth i this page you will get science experiment and diy projects,dailylifehacks etc vudeos

ASIP Technologies ASIP Technologies
#507, Shangri-La Plaza, Road No 2
Hyderabad, 500034

ASIP is a complete turnkey solutions provider (package design, bumping, assembly, testing, dropship). We provide you the best in class quality and service.

Gagan information technologies Gagan information technologies
Level 1, Spacion Towers
Hyderabad, 500081

A best place for a fresher to start a career.

FOG security FOG security
R-218 2nd Floor AYUR KUSHAL COMPLEX , Abids
Hyderabad, 500001

We provide Fog security for safety of business like , banking , jewellery shops and other valuable stores