iTDP Nandyal Town

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from iTDP Nandyal Town, Political organisation, Nandyal.

13/12/2023

ఐటిడిపి ఆధ్వర్యంలో డిజిటల్ స్క్రీన్స్ తో లోకేష్ అన్న కి ఘనస్వాగతం..🔥🔥

Photos from iTDP Nandyal Town's post 21/11/2023

నిన్న టేక్కె ఫైర్ స్టేషన్ ఎదురుగా నంద్యాల పట్టణానికి చెందిన మున్న గారి నూతన RAINBOW TILES & SANITARYWARE ను ప్రారంభించిన నంద్యాల నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి, మాజీ MLA భూమా బ్రహ్మానంద రెడ్డి గారు.

Photos from iTDP Nandyal Town's post 19/11/2023

ఈరోజు నంద్యాల ములమట్టం నందు ఉప్పరిపేటకి చెందిన జూటూరు పాపోడు కుమారుని వివాహానికి,S.N ఫంక్షన్ హాల్ నందు NGO's కాలనీ (నూనెపల్లె) కి చెందిన అమరం వెంకటేశ్వర్లు గారి కుమారుని వివాహానికి మరియు కానాల బుగ్గరమేశ్వరం దేవస్థానంలో H.S కొట్టాలకి చెందిన గుంటక కృష్ణారెడ్డి గారి కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన నంద్యాల నియోజకవర్గ టీడీపి ఇంఛార్జి మాజీ MLA భూమా బ్రహ్మానంద రెడ్డి గారు

Photos from iTDP Nandyal Town's post 19/11/2023

నంద్యాల టీడీపీ ఇంచార్జ్ భూమా ను కలిసిన జనసేన నాయకులు
ఈ రోజు నంద్యాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి భూమా బ్రహ్మానంద రెడ్డి గారితో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన నంద్యాల జనసేన పార్టీ ఇంచార్జి శ్రీ యదవల్లి విశ్వనాథ్ గారు. ఈ సందర్భంగా నంద్యాల టీడీపీ ఇంచార్జి భూమా బ్రహ్మానంద రెడ్డి గారు మాట్లాడుతూ జనసేన పార్టీ తరుపున ఇంచార్జ్ గా నియమితులైన విశ్వనాథ్ గారికి శుభాకాంక్షలు తెలిపారు అలాగే ఇకముందు కూడా రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం సాగిస్తున్న అరాచక పాలనపై టీడీపీ మరియు జనసేన పార్టీ లు కలిసి ఎప్పటికప్పుడు ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకుని ముందుకు సాగుతామని ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడతామని రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేంతవరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పిడతల సుధాకర్, సుందర్ రచమడుగు, సంగా జయంతి, పిచికె రాజశేఖర్, సందీప్ సాయి మరియు శ్రీను అవులపాటి తదితరులు పాల్గొన్నారు.

Photos from iTDP Nandyal Town's post 18/11/2023

ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు "గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది" అనే కార్యక్రమంలో టిడిపి,జనసేన నంద్యాల టిడిపి నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి గారి ఆధ్వర్యంలో ఉమ్మడి కార్యచరణలో భాగంగా నంద్యాల నుండి కానాల వెళ్లే రహదారులు గుంతలమయంగా మారడంతో మేము అభివృద్ధి చేసాము అంటూ ప్రగల్బాలు పలుకుతున్న వైసీపీ నాయకులు ఎక్కడ వేశారో చెప్పాలని టీడీపి జనసేన నాయకులు విమర్శించారు.
ఈ కార్యక్రమంలో నంద్యాల పట్టణ అధ్యక్షుడు మనియార్ ఖాలీల్ మహ్మద్, నంద్యాల నియోజకవర్గ మండల కన్వీనర్ గురునాధ్ రెడ్డి, SC సెల్ నాయకుడు మద్దికెర కైలాష్, ముడియం కొండా రెడ్డి, MNC ఫ్లోర్ లీడర్ మహబూబ్ వలి, కౌన్సిలర్ నాగార్జున, ఐటీడీపీ అధ్యక్షులు షేక్ బాబా ఫక్రుద్దీన్, జనసేన నాయకులు యదవల్లి విశ్వనాధ్, పిడికల సుధాకర్, సందీప్, పిచ్చికే రాజు, ఆకుల మల్లేష్ మరియు వార్డ్ ఇంఛార్జిలు, గ్రామ నాయకులు తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Photos from iTDP Nandyal Town's post 17/11/2023

నిన్న బొగ్గులైన్ నివాసితులకు పట్టాలు పంపిణీ చేసినందుకు నంద్యాల నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి గారిని వారి నివాసం లో నంద్యాల బొగ్గులైన్ లో నివసించేవారు కలిసి కృతజ్ఞత తెలియజేయడం జరిగింది.

16/11/2023

పెద్దకొట్టాల గ్రామానికి చెందిన నాగ సరస్వతి ని అదే గ్రామానికి చెందిన చిందే రాఘవేంద్ర రావు కి ఇచ్చి వివాహం 15 సంవత్సరాల క్రితం వివాహం జరిపించడం జరిగింది,పెళ్లి అయ్యిన కొద్దీ రోజులకే సరస్వతి తండ్రి మరణించడం జరిగింది.అప్పటి నుంచి సరస్వతి భర్త రాఘవేంద్ర రావు అదనపు ఖట్నం కావాలని భార్యని వేధించడం,కొట్టటడం జరుగుతూ ఉండేది,గత కొద్ది రోజుల క్రితం నుంచి నాకు పిల్లలు పుట్టిన తర్వాత కూడా డబ్బుల కోసం అని రోజు కొట్టడం జరుగుతుంది,మా తమ్ముడు సురేంద్ర రావు ఎందుకు బావ అలా చేస్తున్నావు అని అడిగినందుకు మా తమ్మున్ని రడ్డు తో తలపై కొట్టి మా కుటుంబ సభ్యుల ను ఇంటి మీదకి వచ్చి కొట్టారు.మేము అందరం నంద్యాల తాలూకా స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లగా మా కంప్లైంట్ తీసుకోకుండా న్యాయా అన్యాలు తెలుసుకోకుండా మా కేసు తగిన రీతిలో ఫైల్ చేయడం లేదు అని నంద్యాల నియోజకవర్గ టీడీపి ఇంఛార్జి మాజీ MLA భూమా బ్రహ్మానంద రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్లగా న్యాయ అన్యాయలు తెలుసుకోకుండా అధికారులు అలా ప్రవర్తిచడం సబబు కాదు అని ఈరోజు నంద్యాల జిల్లా SP గారిని కలిసి విషయం తెలియజేసి వారికి న్యాయం చేయాలని కోరడం జరిగింది. SP రఘు వీర్ రెడ్డి గారు వెంటనే తగిన రీతిలొ స్పందించారు. మాజి శాసన సభ్యుడు భూమా బ్రంహ నంద రెడ్డి గారీ వెంట లాయరు రామ మోహన రెడ్డి, గురునాధ రెడ్డి కొండా రెడ్డి వున్నారు.

Photos from iTDP Nandyal Town's post 16/11/2023

డంపు యార్డ్ నుండి వచ్చే పోగతో పేద ప్రజల ప్రాణాలను కాపాడండి. మాజీ ఎమ్మెల్యే భూమా
నంద్యాల మాజీ MLA భూమా బ్రహ్మానంద రెడ్డి భీమవరం రాస్తా లోని మునిసిపాలిటీ డంపింగ్ యార్డ్ ను సందర్శించారు అనంతరం PV నగర్,హరిజనవాడ ప్రజలతో మాట్లాడాడు డంపింగ్ యార్డ్ నుంచి వెలువడే పొగ అనర్ధాల గురించి అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మాజీ MLA భూమా బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ

గత ఆరు నెలలుగా మున్సిపల్ డంపింగ్ యార్డ్ నుండి వెలువడుతున్న పొగ తో పివి నగర్ ప్రజలు తీవ్ర అనారోగ్య గురువుతున్నారని మున్సిపల్ కమిషనర్, చైర్మన్ మరియు శానిటేషన్ అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడం అందరికీ తెలిసిన విషయమే
నంద్యాల పట్టణ శివారులోని భీమవరం వెళ్లే దారిలో ఉన్న మున్సిపల్ డంపింగ్ యార్డ్ కు నంద్యాల లోని కొన్ని ఆసుపత్రుల నుంచి సర్జికల్ వేస్ట్ ట్రాక్టర్ల ద్వారా గుట్టు చప్పుడు కాకుండా క్రింది భాగంలో సర్జికల్ వేస్ట్ ను తీసుకొస్తూ,వాటిపై చెత్తా చెదారాన్ని తీసుకొస్తూ,సర్జికల్ వేస్ట్ ను చెత్త తో కాల్చడం వల్ల వచ్చే పొగతో కొందరు అనారోగ్యాల పాలవుతున్నారు.సర్జికల్ వేస్ట్ అంటే ఆసుపత్రుల్లో నుంచి వచ్చే సూదులు,గ్లౌజ్,మాస్క్,కాటన్,సెలైన్ బాటిల్స్,ఆపరేషన్ చేసి తొలగించిన పదార్థాలు,టాబ్లెట్స్,సిరప్ లు ప్లాస్టిక్ కవర్లలో చుట్టి వస్తున్నాయి.ప్రభుత్వ నిభందనల మేరకు ప్రతి ఆసుపత్రిలో రోజు వచ్చే సర్జికల్ వేస్ట్ ను పోల్యూషన్ బోర్డ్ కు సంభందించిన వాహనం లో సేకరించి ఏ రోజుకు ఆ రోజు సర్జికల్ వేస్ట్ ను కాల్చిపడేయాలనే నిబంధన వుంది.కాని నంద్యాలలో కొన్ని ఆసుపత్రుల నుంచి సర్జికల్ వేస్ట్ ప్రతి రోజూ ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డు కు చేరుతోంది. అయితే ఈ మున్సిపల్ డంపింగ్ యార్డు సుమారు 14 ఎకరాల విస్తీర్ణంలో వుంది. డంపు యార్డ్ పూర్తిగా నిండిపోవడంతో చెత్త ను తొలగించడానికి 56 వేల మెట్రిక్ టన్నులు ను తొలగించేందుకు ప్రభుత్వం దాదాపు5.50 కోట్లను విడుదల చేసినట్లు అధికారులు చెప్పుకొస్తున్నారు.ఈ ఏడాది ఫిబ్రవరి లోనే గడువు ముగిసినట్టు తెలుస్తోంది. ఇంతలో ఏమి అయిందో ఏమో గాని నాటి నుంచి నేటి వరకు చెత్త తరలించే సూచనలు కనిపించలేదు.లోగుట్టు పెరమాల్లకు ఎరుక అన్న చందంగా డంపింగ్ యార్డు లో ఈ తతంగమంతా నడుస్తుంది.కొన్ని ఆసుపత్రుల వద్ద చెత్త పన్నుతో పాటు ఆసుపత్రి స్థాయిని బట్టి ప్రతి నెల 1000,2000,3000 ఇంకా పెద్ద,పెద్ద ఆసుపత్రుల వద్ద పెద్ద మొత్తం లో తీసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బులు తీసుకుంటారు తప్ప బిల్లులు కూడా ఇవ్వరని కొందరుఆరోపిస్తున్నారు.కొందరు చెత్త పన్ను తో పాటు సర్జికల్ వేస్ట్ కు అదనంగా చెల్లిస్తామని బహిరంగంగా చెప్పలేమనిచెబుతున్నారు. డంపింగ్ యార్డ్ కు సర్జికల్ వేస్ట్ రావడంలో తప్పు ఆసుపత్రుల యాజమాన్యాలదా..? అధికారులదా..? మరియు సిబ్బందిదా. ? తేల్చాల్సి ఉంది. అదేవిధంగా డంపు యార్డులో వైద్య పదార్థాలకు నిప్పు పెట్టడంతో అందులో నుండి వెలబడే పొగ వల్ల డంప్ యార్డు కు సమీపంగా ఉన్న పివి నగర్ ప్రజలు ఆయాసం ఉబ్బసం శ్వాస కోసం తీవ్ర అనారోగ్య పాలవుతూన్నారు. ప్రధానంగా మున్సిపల్ డంప్యార్డు పొగ సమస్యను ఒకటవ వార్డు కౌన్సిలర్ పిచ్చికె నాగార్జున మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా అనేకసార్లు డంప్ యార్డ్ దగ్గర పీవీ నగర్ ప్రజలు డంప్ యార్డ్ ను ఇక్కడి నుండి తొలగించాలని అనేకసార్లు నిరసన తెలియజేశారు. ప్రతిరోజు డంపు యార్డ్ నుండి వెలువడే పొగతో పివి నగర్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపాల్సిన మున్సిపల్ అధికారులు పీవీ నగర్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అంతేకాకుండా డంప్ యార్డ్ నుండి వెలుపడే పొగ పివి నగర్, హరిజనవాడ, బయటిపేట, నీలి వీధి, సంజీవనగర్, గాంధీ చౌక్, జగజ్జనని నగర్, ఆత్మకూరు బస్టాండ్, ఫారుక్ నగర్, తదితర ప్రాంతాలలో ఈ పొగ వ్యాపిస్తున్నది. ముఖ్యంగా పివి నగర్ హరిజనవాడ ప్రాంతాల లో నివసించే ప్రజలు రెక్కాడితే తే గాని డొక్కాడని పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు మున్సిపల్ డంప్ యార్డ్ నుండి వెలుపడే పొగతో పాటు, పక్కనే ఉన్న స్మశాన వాటికలో శవాలను దహనం చేస్తుండడంతో వాటి నుండి వచ్చే పోగతో పివి నగర్ హరిజనవాడ లోని పేద ప్రజ లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఇకనైనా అధికారులు చర్యలు తీసుకోవాలని,ఈ విషయం గురించి కలెక్టర్ గారి తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని తెలియజేసారు.
ఈ డంపు యాడ్ నుండి వచ్చే పొగతో తమ ప్రాణాలు పోతున్నాయని, కాపాడమంటూ ప్రజల అధికారులు వేడుకుంటున్నారు.అలాగే 1 వార్డ్ హరిజన వాడ లో టీడీపీ ప్రభుత్వం లో 80% పూర్తి అయిన వాటర్ ట్యాంక్ వైసీపీ ప్రభుత్వం వచ్చి 4.1/2 సంవత్సరాలు అయిన ఇంకా పూర్తి చేయకుండా అలానే పెండింగ్ లో ఉంచడం,హరిజన వాడాలో మురుగు దొడ్లకి కనీస వసతులు లేవు,బోరింగ్ పనిచేయడం లేదు అని ప్రజలు బ్రహ్మానంద రెడ్డి గారికి తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో PV నగర్, హరిజనవాడ ప్రజలు,మహిళలు,కౌన్సిలర్స్ నాగార్జున,MNC ఫ్లోర్ లీడర్ మహబూబ్ వలి,ముడియం కొండా రెడ్డి,మారం వినయ్ కుమార్,రాంపల్లె రామి రెడ్డి,PV నగర్ మధు బాబు,మడ్డికేర కైలాష్,మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

11/11/2023

నంద్యాల తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే శ్రీ భూమా బ్రహ్మానంద రెడ్డి గారి ధర్మపత్ని శ్రీమతి భూమా ప్రతిభ రెడ్డి, వదినమ్మ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

06/11/2023

ఈరోజు నంద్యాల కి వచ్చిన మాజీ మంత్రివర్యులను, నంద్యాల ఇంద్రప్రస్థా హోటల్ నందు మర్యాదపూర్వకంగా కలిసిన నంద్యాల నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి గారు

Photos from iTDP Nandyal Town's post 05/11/2023

ఈరోజు KC కెనాల్ నూనెపల్లె ఛానల్ కింద ఉన్న రైతునగరం, గోస్పాడు, ఎం.చింతకుంట్ల, జులేపల్లె, కానాల, పాండురంగపురం, మిట్నాల, బ్రహ్మణపల్లె, గుంతనాల, A శివరామ పురం, B శివర్మపురం, పూసులూరు గ్రామలకి సంబంధించిన రైతుల పొలాలకు నీళ్లు సరిగా రాక ఇబ్బంది పడుతున్నారని ఆ గ్రామాలకు సంబంధించిన రైతులు భూమా బ్రహ్మానంద రెడ్డి గారికి తెలియజేయగా అక్కడికి వెళ్లి అక్కడ రైతులను కలిసి KC కెనాల్ E.E, D.E లతో మాట్లాడి సామరస్యంగా రైతుల నీటి పంపకం సమస్యను పరిష్కరించిన నంద్యాల నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి మాజీ, ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి గారు.

Photos from iTDP Nandyal Town's post 05/11/2023

రాష్ట్రం లో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దళితులపై దాడులను ఖండిస్తూ తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు
ఈరోజు నంద్యాల నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి మాజీ MLA భూమా బ్రహ్మానంద రెడ్డి గారి ఆధ్వర్యం లో బొమ్మలసత్రం లో ఉన్న అంబేద్కర్ విగ్రహనికి పూలమాల వేసి నిరసన తెలియజేయడం జరిగింది.

భూమా బ్రహ్మానంద రెడ్డి గారు మాట్లాడుతూ
రాష్ట్రం లో దళితుల పై జరుగుతున్న దాడులను కండిస్తున్నామని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం లో శాంతి భద్రతలకు చోటు లేకుండా పోయిందని విమర్శించారు. అలాగే బొమ్మలసత్రం లో ఉన్న అంబేద్కర్ గారి విగ్రహాన్ని నంద్యాల లోని ప్రధాన కూడలిలో పెట్టాలిని దళిత నాయకులు, దళిత ప్రజా సంఘాలు నంద్యాల MLA రవి ని ఎన్ని సార్లు ఆడిగిన, వినతి పత్రాలు ఇచ్చిన కూడా పట్టిచుకోకుండా ఉన్నారని 2024 లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత నంద్యాల ప్రధాన కూడలిలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని భూమా హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నంద్యాల నియోజకవర్గ SC సామాజిక వర్గం నాయకులు,కార్యకర్తలు మరియు కౌన్సిలర్స్, వార్డ్ ఇంఛార్జిలు, గ్రామ నాయకులు, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Photos from iTDP Nandyal Town's post 01/11/2023

రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదల అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ఉదయం 6 గంటలకు ఉండవల్లి లోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భం చంద్రబాబు గారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆయనను చూసి భావోద్వేగానికి గురి అయ్యారు. వారికి చంద్రబాబు దైర్యం చెప్పారు. అంతా మంచే జరుగుతుందని దైర్యం గా ఉండాలని సూచించారు.

Photos from iTDP Nandyal Town's post 27/10/2023

ఈ రోజు నంద్యాల పట్టణంలోని హృదయ ఇన్ ఫంక్షన్ హాల్ నందు నంద్యాల నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి మాజీ MLA భూమా బ్రహ్మానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది.కార్యక్రమాలలో భాగంగా నియోజకవర్గంలో చేపట్టాల్సిన అంశాలపై పార్టీ ముఖ్య నాయకులు, క్లస్టర్ ఇన్ ఛార్జిలు,యూనిట్ ఇంఛార్జి లు,బూత్ ఇంఛార్జి లతో సమావేశం నిర్వహించారు.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ తరువాత మన మీద మరింత బాధ్యత పెరిగిందని.. ఆయన అక్రమ అరెస్ట్ గురించి ఇంటింటి ప్రచారం నిర్వహించాలని భూమా సూచించారు. మరోవైపు నవంబర్ '1'వ తేది నుండి బాబు ష్యూరిటీ భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమాన్ని కూడా విస్తృతంగా చేపట్టాలన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జిలతో మరియు పట్టణ, గ్రామాల నాయకులతో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ప్రముఖ సీనియర్ న్యాయవాది వెదుర్ల రామచంద్రరావు గారు, నియోజకవర్గం అబ్జర్వర్ పోతురాజు రవికుమార్ గారు, పట్టణ అధ్యక్షుడు మునియర్ మహమ్మద్ ఖలీల్ గారు, నంద్యాల మండల అధ్యక్షుడు గోపవరం గురునాథ్ రెడ్డి గారు, గోస్పాడు మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి గారు వారితో పాటు క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జిలు మరియు గ్రామ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Photos from iTDP Nandyal Town's post 19/10/2023

ఈ రోజు నంద్యాల పట్టణంలోని ఉప్పరి పేటలో ఏర్పాటు చేసిన నవరాత్రుల ఉత్సవంలో భాగంగా 5 వ రోజు శ్రీ మహాచండీదేవి అలంకరణలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన నంద్యాల నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి గారు . ఈకార్యక్రమంలో ఆయనతో పాటు మాజీ కౌన్సిలర్ ముడియం కొండా రెడ్డి, కౌన్సిలర్ మహబూబ్ వలి, మద్దిలేటి రెడ్డి, ఉప్పరి సురేష్ కుమార్, తిమ్మ రెడ్డి మరియు ఉప్పరి పేట ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Photos from iTDP Nandyal Town's post 18/10/2023

ఈ రోజు నంద్యాల పట్టణంలోని గిరినాథ్ సెంటర్లో ఏర్పాటు చేసిన నవరాత్రుల ఉత్సవంలో భాగంగా 4 వ రోజు మహాలక్ష్మి అలంకరణలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన నంద్యాల నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి & మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి గారు. ఈకార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ముడియం కొండా రెడ్డి, వాణిజ్య విభాగం కార్యదర్శి మారం వినయ్ కుమార్, చలపతి, మద్దిలేటి రెడ్డి, ఉస్మాన్, ఉప్పరి సురేష్ కుమార్, దూదేకుల దస్తగిరి, వేణు గోపాల్, అరవిటి రవి కుమార్, తోట రామయ్య తదితరులు పాల్గొన్నారు.

Photos from iTDP Nandyal Town's post 18/10/2023

గోస్పాడు మండలం సాంబవరం గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త సిరన్న గారి భార్య నాగమణి బ్రెయిన్ స్ట్రోక్ తో హాస్పిటల్లో చికిత్స చేయించుకున్న విషయం తెలుసుకొని వారిని పరామర్శించిన నంద్యాల నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి & మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి గారు. వారితో పాటు సాంబవరం మాజీ సర్పంచ్ మద్దిలేటి రెడ్డి, ఆదినారాయణ, విశ్వేశ్వర రెడ్డి, కుమార్ రెడ్డి తదితరులు పరామర్శించారు.

Photos from iTDP Nandyal Town's post 17/10/2023

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ కి నిరసనగా ఈరోజు ఉమ్మడి కర్నూల్ జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కర్నూల్ నగరంలో శాంతియుత నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ శాంతియుత నిరసన ర్యాలీలో నంద్యాల నుంచి 20 వెహికల్స్ లో తన అనుచరులతో బయలుదేరి కర్నూల్ నగరంలో అన్ని నియోజకవర్గ ఇంఛార్జిలతో, కార్యకర్తలతో కలిసి ర్యాలీలో పాల్గొన్న నంద్యాల నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి గారు.

Photos from iTDP Nandyal Town's post 17/10/2023

రాయలసీమ ప్రాంతానికి చెందిన CM జగన్ మోహనరెడ్డి కృష్ణా నీటి వాడుకలో సీమకు అన్యాయం జరుగుతున్న స్పందించక పోవడం దారుణమని నంద్యాల మాజీ MLA భూమా బ్రహ్మానందరెడ్డి విమర్శించారు.నంద్యాల పట్టణంలోని తన నివాస గృహంలో విలేకరులతో మాట్లాడారు.ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో కృష్ణనది జలాలను 511 TMC లను ఆంధ్రాకు,299 TMC లు తెలంగాణకు కేటాయించారు.అయితే ఆంధ్రాలో పోలవరం జాతీయ ప్రాజెక్టును నిర్మిస్తున్నందున కృష్ణా, ప్రకాశం బ్యారేజ్ లో మిగులు 80టీఎంసీలను,కర్ణాటకకు 21 టీఎంసీలను, మహారాష్ట్రకు 14 టీఎంసీలను కేటాయించి సీమకు అన్యాయం చేశారు. మళ్ళీ ఇప్పుడు 80టీఎంసీలలో ఎగువ రాష్ట్రాలకు 35టీఎంసీలు పోను మిగిలిన 45టీఎంసీలను పునః పంపిణి చెయ్యాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.45టీఎంసీలలో సగం నీటిని కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.పోలవరం నిర్మాణానికి '7'మండలాలను ఇచ్చాము కాబట్టి మాకు నీటి కేటాయింపులు చేయాలనీ చాలా కాలం నుండి కోరుతుంది.అయితే ఇప్పటి వరకు స్పందించిన కేంద్రం ఇప్పుడు CM జగన్మోహనరెడ్డి ఢిల్లీలో వున్న సమయంలో కృష్ణా జలాలను సమీక్సించమమని జీవో విడుదల చేసింది. కృష్ణా జలాల పంపిణీ వల్ల సీమ రైతులు తీవ్రంగా నష్ట పోతారని తెలిసి కూడా CM జగన్మోహనరెడ్డి నోరు మెడపక పోవడం దారుణం.అంబటి రాంబాబు ఈ జివో పై సుప్రీం కోర్టుకు పోతామని హడావుడి చేశారు.కానీ ఆచరణలో మాత్రం చేయలేదు.తెలంగాణ ప్రభుత్వం ఈ విషయం పై ఆంధ్ర కంటే ముందే కెవియట్ పిటిషన్ వేసింది. ఆంధ్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్ల స్టే వచ్చే అవకాశాలు కూడా లేకుండా పోయాయి.సీమ రైతులకు సాగు నీటి విషయంలో అన్యాయం జరుగుతున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులు స్పందించకపోవటం సిగ్గు చేటు.ఇప్పటికైనా రైతులకు అన్యాయం జరగకుండా కేంద్రం సంబందిత అధికారులతో చర్చలు జరపాలి. లేకపోతే ప్రస్తుత అధికార పార్టీ నాయకులు సీమ ద్రోహులుగా మిగిలి పోతారు. ఈ కార్యక్రమంలో రైతులు సంఘం నాయకులు బాలీశ్వర్ రెడ్డి,గోపాల్ రెడ్డి,రవి బాబు,గురునాధ్ రెడ్డి,మహేంద్ర రెడ్డి,పెద్దకొట్టాల కొండా రెడ్డి,లాయర్ మనోహర్ రెడ్డి,మరియు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Photos from iTDP Nandyal Town's post 17/10/2023

నిన్న నంద్యాలలోని RK ఫంక్షన్ హాల్ నందు జరిగిన నంద్యాల పట్టణానికి చెందిన షేక్ హసముద్దీన్ గారి కుమారుని వివాహానికి మరియు NTR షాదీ ఖానా నందు జగజ్జనని నగర్ కి చెందిన షేక్ దస్తగిరి గారి కుమారుని వివాహా కార్యక్రమాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకంక్షాలు తెలియజేసిన నంద్యాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి గారు

Photos from iTDP Nandyal Town's post 16/10/2023

ఈ రోజు నంద్యాల తెలుగుదేశం పార్టీ ఇంచార్జి భూమా బ్రహ్మానంద రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా తన నివాసంలో కలిసి రాష్ట్ర పరిస్ధితులు మరియు రాష్ట్రంలో జరుగుతున్న పలు అంశాలపై చర్చించిన రాష్ట్ర సీపీఐ పార్టీ సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వర్ రావు గారు, రాష్ట్ర మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి దుర్గా భవాని గారు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్. రంగ నాయుడు గారు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్ గారు, సీపీఐ పట్టణ కార్యదర్శి కె.ప్రసాద్ గారు, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సుగుణమ్మ గారు తదితర నాయకులు కలిసిన వారిలో ఉన్నారు.

Photos from iTDP Nandyal Town's post 15/10/2023

నంద్యాల గాంధీ చౌక్ కూరగాయల మార్కెట్ నందు నిన్న అర్ధరాత్రి షార్ట్ సర్క్యుట్ కారణంగా ఒక ఫ్రూట్ షాప్ పూర్తిగా మంటల్లో దగ్దమవడం జరిగింది. అక్కడే గులాబ్ షా వలి దర్గాహ్ ఉరుసు కార్యక్రమానికి వచ్చిన నంద్యాల తెలుగుదేశం పార్టీ ఇంచార్జి భూమా బ్రహ్మానంద రెడ్డి గారు విషయం తెలుసుకుని హుటాహుటిన సంఘట జరిగిన ప్రదేశానికి వెళ్లి చూసారు. అప్పటికే షాప్ మొత్తం మంటల్లో పూర్తిగా కాలిపోవడంతో బాధితునితో మాట్లాడిన భూమా, జరిగిన సంఘటనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బాధితునికి నష్టపరిహారం అందించేలాగా చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది.

Photos from iTDP Nandyal Town's post 14/10/2023

నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ నందు వెలసిన శ్రీశ్రీశ్రీ హాజరత్ సయ్యద్ గులాబ్ షా వలి రఫాయి అహమ్మది రహమతుల్లాహి అలైహి వారి ఉరుసు మహోత్సవ కార్యక్రమం లో పాల్గొని ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించిన నంద్యాల నియోజకవర్గ టీడీపి ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి గారు. ముంబై నుండి వచ్చిన ఖవ్వాలి గాయకుల చేత దర్గా కమిటీ వారు ఏర్పాట చేసిన ఖవ్వాలి ప్రోగ్రాంను ఆశాంతం కూర్చొని ఆసక్తిగా తిలకించిన భూమా.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి గారిని దర్గా కమిటీ సభ్యులు ప్రజలందరి సమక్షంలో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ నంద్యాల పట్టణ అధ్యక్షులు మనియర్ ఖలీల్, టీడీపీ ఫ్లోర్ లీడర్ మాబువలి, అబ్దుల్ వారిస్, అమీర్, మాజీ కౌన్సిలర్ మహమ్మద్ గౌస్, జాకెర్, జియా బాషా, ఐటీడీపీ అధ్యక్షులు షేక్ బాబా ఫక్రుద్దీన్, అయూబ్, అజీమ్, జయసింహ రెడ్డి, విశ్వం రెడ్డి, దూదేకుల నరేష్ బాబు, తదితర నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Photos from iTDP Nandyal Town's post 14/10/2023

నంద్యాల పట్టణంలోని బంగారు అంగళ్ల వీధి నందు వెలసిన శ్రీశ్రీశ్రీ హాజరత్ ఖ్వాజా సయ్యద్ షా జమాలొద్దిన్ బాద్షా చిష్టివుల్ ఖాద్రి మదని రహమతుల్లాహి అలైహి వారి ఉరుసు మహోత్సవ కార్యక్రమం లో పాల్గొని ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించిన నంద్యాల నియోజకవర్గ టీడీపి ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి గారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి గారిని దర్గా కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Photos from iTDP Nandyal Town's post 14/10/2023

చంద్రబాబు గారికి మెరుగైన వైద్యం అందిచాలని,జైలు అధికారుల నిర్లక్ష్యంతో తీవ్ర అనారోగ్యానికి గురి అవుతున్న చంద్రబాబు గారిని వెంటనే హాస్పిటల్లో చేర్పించి సరైన వైద్యం అందించాలని దీనికి నిరసనగా నంద్యాల నియోజకవర్గం ఖాలీల్ థియేటర్ దగ్గర మాజీ మంత్రి NMD FAROOK, మాజీ MLA భూమా బ్రహ్మానందరెడ్డి, జిల్లా టిడిపి అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ గౌడ్ నిరసన కార్యక్రమంలో భాగంగా కొవ్వొతులతో నిరసన తెలిపడం జరిగింది.

నిరసన కార్యక్రమంలో భాగంగా
భూమా బ్రహ్మానంద రెడ్డి, NMD ఫరూక్, అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ మాట్లాడుతూ....
చేయని నేరానికి జైల్లో పెట్టి 34రోజులుగా మాజీ సీఎం చంద్రబాబు ఆరోగ్యాన్ని ఎంత దెబ్బతీశారో వైద్యులిచ్చిన ఎమర్జెన్సీ మెడికల్ రిపోర్టే సాక్ష్యం, బాబు గారు 5 కిలోలు తగ్గితే వాస్తవాలు ఎందుకు బయటికి రావడం లేదు, నిర్లక్షంగా వ్యవహారిస్తున్న జైళ్ళ శాఖ అధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చెయ్యకుండా ఉన్నారు, ఆయన ఆరోగ్యం దెబ్బతీసే కుట్ర జరుగుతుంది. జైల్లో ఆయన ఆరోగ్యం క్షిణిస్తే దానికి బాధ్యత ఎవరు వహిస్తారని నిలదీశారు ఇప్పటికైనా జగన్ రెడ్డి కుట్ర రాజకీయాలు మాని చంద్రబాబు ను ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకోవాలని, అన్నింటికీ ప్రభుత్వనీదే బాధ్యత. పక్కా సాక్షాలతో పట్టుబడ్డ వారు బెయిల్స్ తీసుకొని బయట తిరుగుతున్నారు. ఏ అవినీతి చేయని నిప్పులాంటి చంద్రబాబు గారిని అక్రమంగా జైల్లో నిర్భందించారు. జగన్ మోహన్ రెడ్డి గారు వ్యవస్థలను ఎంతలా మ్యానేజ్ చేస్తున్నారో చెప్పేందుకు ఇదే నిదర్శనం, అవినీతి మచ్చలేని Nara Chandrababu Naidu గారికి మనందరం మద్దతుగా నిలుద్దాం. సైకో జగన్ రెడ్డి దుర్మార్గపు పాలనను ఎండగడదాం.
ఈ నిరసన కార్యక్రమంలో నంద్యాల పట్టణ అధ్యక్షుడు మనియార్ ఖాలీల్, ముడియం కొండా రెడ్డి, కౌన్సిలర్ మహబూబ్ వలి, రాష్ట్ర కార్యదర్శి జిల్లెల శ్రీరాములు, మారం వినయ్, మంచాల భాస్కర్ రెడ్డి, రాంపల్లె రామిరెడ్డి, మామిడి నాగరాజు, దూదేకుల దస్తగిరి, ఉప్పరి సురేష్, మద్దికెర కైలాష్, మంజుల సుబ్బారాయుడు, మంజుల వెంకట స్వామి, చలపతి, గోవిందు నాయుడు, పల్లె వెంకట సుబ్బయ్య, షైక్ జాకీర్ హుస్సేన్, మరియు నంద్యాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Photos from iTDP Nandyal Town's post 13/10/2023

నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ నందు వెలసిన శ్రీ హాజరత్ సయ్యద్ గులాబ్ షా వలి రఫాయి అహమ్మది రహమాతుల్లాయి అలైవారి ఉరుసు మహోత్సవ కార్యక్రమం లో పాల్గొని ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించిన నంద్యాల నియోజకవర్గ టీడీపి ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి గారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నదానం చేసిన భూమా అలాగే మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి గారిని దర్గా కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Photos from iTDP Nandyal Town's post 13/10/2023

ఈ నెల 13, 14 తేదీలల్లో నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ నందు ఉన్న హాజరత్ సయ్యద్ గులాబ్ షా వలి (ర.అ) దర్గా ఉరుసు మహోత్సవం సందర్బంగా దర్గా కమిటీ నిర్వాహకులు నిన్న నంద్యాల Telugu Desam Party (TDP) ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే శ్రీ Bhuma Brahmananda Reddy గారిని వారి స్వగృహంలో కలిసి దర్గా ఉరుసు కు రావాలని సాదారంగా ఆహ్వానించడం జరిగింది.

11/10/2023

టిడిపి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు దీక్షలు విరామం ఇవ్వాలని తెలియజేయడంతో ....
నంద్యాలలో జరుగుతున్నటువంటి రిలే నిరాహార దీక్షలకు విరామం ఇవ్వడం జరిగింది.
సోషల్ మీడియా లో ఫేస్ బుక్ లో ఈరోజు తెలుగుదేశం పార్టీ దీక్ష శిబిరం టెంట్ హౌస్ డబ్బులు ఇవ్వలేదని చేసిన పోస్ట్ అవాస్తవం అని సిరి సప్లైర్స్ ఓనర్స్ నంద్యాల జిల్లా DSP గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.తప్పుడు ప్రచారాలు,దుష్ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని,నంద్యాల తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి మాజీ MLA భూమా బ్రహ్మానంద రెడ్డి గారు ఆదేశిస్తే 42 వార్డ్ లాల్లో ఇటువంటి శిబిరాలు ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని,సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు,దుష్ప్రచారాలు చేసిన వారి వెనకాల ఉండి ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉప్పరి సురేష్ కుమార్,ఉప్పరి సుబ్రహ్మణ్యం,మునిసిపాల్ ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ మహబూబ్ వలి DSP గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.

Photos from iTDP Nandyal Town's post 01/10/2023

ఈరోజు నంద్యాల శివ గార్డెన్స్ లో నంద్యాల పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మనియార్ ఖాలీల్ అహ్మద్ గారి కుమార్తె నిఖా మహోత్సవానికి నంద్యాల నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి దంపతులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.

Photos from iTDP Nandyal Town's post 30/09/2023

Day - 13

చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా భూమా బ్రహ్మానంద రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార రీక్షలు - 13 వ రోజు దీక్షల్లో పాల్గొన్న ఆర్యవైశ్య సంఘం నాయకులు - దీక్షలకు సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి ఫరూక్, నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్.

మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసనగా మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు 13 వ రోజుకు చేరుకున్నాయి. ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా సాగుతున్న దీక్షల్లో 13 వ రోజు సోమవారం ఆర్యవైశ్య సంఘం నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున ధీక్షలో పాల్గొన్నారు.

13వ రోజు రిలే నిరాహారదీక్ష ను ప్రారంభించిన మాజీ MLA భూమా బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతు
బాబు గారికి మద్దతుగా13 వ రోజు ధీక్షలో కూర్చున్న ఆర్యవైశ్య పెద్దలకి,సభ్యులకి ధన్యవాదాలు తెలియజేసారు. మనమంతా అనుకున్నాము చంద్రబాబు గారు బయటకి వస్తారు అని అందరూ ఆశభవంతో ఉన్నాము, కానీ జగన్ మోహన్ రెడ్డి వ్యవస్థలను అంత కూడా మేనేజ్ చేసి ఇంకా బాబు గారిని
ఇబ్బంది పెట్టాలనే ఉదేశ్యంతో,కక్షపురితంగానే ఆయనని బయటికి రాకుండా చేసారని అందరూ భావిస్తున్నారు. అలాగే ఈరోజు సుప్రీంకోర్టు లో ట్రై చేస్తున్నారు ఈరోజు బయటికి వస్తారని మనకి పాజిటివ్ గా వస్తుందని అందరం బావిస్తున్నాము.ఇప్పుడు ప్రతి గ్రామ గ్రామాలనుంచి ప్రతి ఒక్క కార్యకర్త చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ గా మేమంతా ఉన్నామని ముఖ్యం గా మహిళలు కూడా రోడ్ల పైకి వచ్చి బాబు గారికి సపోర్ట్ తెలియజేస్తున్నారు. చంద్రబాబు గారు చేసిన మంచి పనులు కూడా ఆఫీస్ లల్లోఉద్యోగులు,ఇండ్లలో మహిళలు, చంద్రబాబు నాయుడు గారి వల్ల లబ్ది పొందిన ప్రతి ఒక్కరు స్వచ్చందంగా ఆయాణచేసిన అభివృద్ధి, మంచిపనుల గురుంచి చెప్పడం జరుగుతావుంది. మన రాష్ట్రం ఈరోజు బాగుపడింది అంటే ఐటీ కంపెనీ ను గాని యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయి అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే, కియా, సెల్ ఖాన్, కంపెనీ లు మన రాష్ట్రానికి వచ్చాయి అంటే లక్ష ల మంది యువతకి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి అంటే చంద్రబాబు నాయుడు గారి కృషివల్లనే అని,మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకొని పోవాలని తెలియజేసారు.
నంద్యాల జిల్లా వాణిజ్య విభాగం కార్యదర్శి వినయ్ నేతృత్వంలో ఈరోజు ధీక్షలో కూర్చున్న ఆర్యవైశ్య సంఘం నాయకులు సముద్రాల సూరయ్య, నేరేళ్ల వీరయ్య, మాలేపటి రాజా శేఖర్, కాల్వ విజయ శేఖర్, నేరేళ్ల అశోక్, బద్రి శెట్టి రవి కుమార్, అజయ్ గాంధీ, ఆరవేటి రవి కుమార్, గెలివి విజయ శేఖర్, సెగు శ్రీను, రాజా శేఖర్,సుబ్బయ్య,సుధాకర్,అశోక్, సురేష్,పార్థసారధి గుప్తా,నాగ దిలీప్,కళ్యాణ్ కుమార్,శ్రీనాధ్,శివ,ధనుంజయుడు ,సురేష్,జనార్దన్, నారాయణ,రవి, నాగరాజు,హరి,కిరణ్,సునీల్,రామకృష్ణ, ప్రమోద్,సుదీర్,బాలయ్య తదితరులు పాల్గొన్నారు....
టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లెల శ్రీరాములు,7 హిల్స్ హాస్పిటల్, కాత్యాయని మెడికల్స్ ఓనర్ మారుతి కుమార్ దీక్షకు సంగిభావం తెలిపారు. మరియు ఆర్యవైశ్యలు,నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని దీక్షకు సంగిభావం తెలిపారు. అనంతరం ధీక్షలో కూర్చున్న వారికి నంద్యాల నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి మాజీ MLA భూమా బ్రహ్మానంద రెడ్డి నిమ్మరసం ఇచ్చి దీక్ష ను విరమింపజేశారు.

Want your organization to be the top-listed Government Service in Nandyal?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

ఐటిడిపి ఆధ్వర్యంలో డిజిటల్ స్క్రీన్స్ తో లోకేష్ అన్న కి ఘనస్వాగతం..🔥🔥#YuvaGalamPadayatra #iTDPforTDP #YuvaGalamLokesh #Y...
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ కు నిరసనగా నిన్న నంద్యాలలో స్వచ్ఛందంగా బంద్ నిర్వహిస్తున్న టీడీపీ...
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ నంద్యాలలో స్వచ్ఛందంగా బంద్ ను నిర్వహించి విజయవంతం చే...
నంద్యాల చంద్రబాబు గారి బహిరంగ సభలో ప్రసంగించిన నంద్యాల టీడీపీ ఇంచార్జ్ భూమా బ్రహ్మానంద రెడ్డి.భూమా మైక్ తీసుకోగానే ప్రజల...
లోకేష్ పాదయాత్ర వద్ద ఉద్రిక్తత..చంద్రబాబు వద్దకు వెళ్ళకూడదు అంటూ లోకేష్ ను అడ్డుకున్న పోలీసులు..ఎలాంటి నోటీసులు లేకుండా ...
ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పకుండా ఓ మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తారా..??#WeWillStandWithCBNSir#G20India2023...
నేను ఏ తప్పూ చేయలేదు. ఎందుకు అరెస్టు చేస్తున్నారని అడిగా. నేను ఏం తప్పు చేశానని ఆధారాలేవీ అని అడిగా. ఇది తప్పుడు విధానం ...
బ్రహ్మమ మజాకా.బ్రహ్మం మాట్లాడుతుండగా అభిమానుల కోలాహలం కేకలు వీళ్ళతో మారుమోగిన సభ ప్రాంగణం యాంకర్ .. నంద్యాల పట్టణంలో మాజ...
నంద్యాల పట్టణంలో, నంద్యాల నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి శ్రీ భూమా బ్రహ్మానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగే తెలుగుదేశం పార్టీ...
రేపు మరియు ఎల్లుండి నంద్యాల పట్టణంలో, నంద్యాల నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి శ్రీ భూమా బ్రహ్మానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో జరి...
టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నంద్యాల స్వాగతం పలుకుతుంది.
టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నంద్యాల స్వాగతం పలుకుతుంది.

Website

Address

Nandyal

Other Political Organizations in Nandyal (show all)
YSRCP Social MEDIA Nandikotkur YSRCP Social MEDIA Nandikotkur
Nandikotkur
Nandyal, 518401

YSJ@2024

Nandyallo CBN Again Nandyallo CBN Again
Nandyal, 518501

Team Silpa Ravi Reddy Unofficial Team Silpa Ravi Reddy Unofficial
Nandyal, 518501

Silpa Ravi Reddy Cult Fans

Jagan Narendra Jagan Narendra
Nandyal

జగనన్న అభిమాని

YSRCP Nandyal 35Ward YSRCP Nandyal 35Ward
Saleem Nagar
Nandyal, 518501

35వ వార్డు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

TDP Adda Nandyala Gadda TDP Adda Nandyala Gadda
Nandyal, 518501

Jai TDP Jai Janma Bhoomi Jai Nara Chandra Babu Naidu Jai Nara Lokesh Johar Anna NTR