Sireesha Reddy
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sireesha Reddy, Political Candidate, Nellore.
అందరికి శ్రీ రామ నవమి శుభాకాంక్షలు 🙏
🩵💙
*దివికేగిన విద్యా "రత్నం"*
విద్యావ్యవస్థలో నెల్లూరు కీర్తిని దేశవ్యాప్తంగా చాటిన స్నేహశీలి, మానవతావాది, నిగర్వి, విద్యా ప్రధాత శ్రీ కేవీ రత్నంగారు కొద్దిసేపటి కిందట శివైక్యం చెందారు. ముత్తుకూరు రోడ్డులోని అపోలో ఆసుపత్రి సమీపంలో ఉన్న వారి గెస్ట్ హౌస్ వద్ద భౌతికఖాయాన్ని సందర్శనార్ధం ఉంచారు. రత్నంగారి మృతి జిల్లాకి తీరని లోటు. ఎంతో మంది పేద విద్యార్ధులకి ఉచితంగా చదువులు చెప్పిన గొప్పవ్యక్తి ఆయన. ప్రముఖ విద్యావేత్త రత్నంగారి శిష్యరికంలో ఉన్నత విద్యలని అభ్యసించిన ఎన్నో వేల మంది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత శిఖరాల్లో ఉన్నారు. రత్నం అనే పేరుకి తగ్గట్టుగానే, చిన్నతనం నుంచి కష్టపడి చదివి, ఉన్నత శిఖరాలు అధిరోహించి, అత్యున్నత విలువలతో జీవన సమరం సాగించిన మహానీయుడు, మేలిమి రత్నమే ఆయన. పలువురు ప్రముఖులు, బంధువులు, స్నేహితులు, విద్యార్ధుల్లో రత్నంగారి మృతి తీరని లోటుని మిగిల్చింది. వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ....
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
SCHEDULE for General Elections to Andhra Pradesh Legislative Assembly. Details 👇
తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ MLA అభ్యర్థిగా పోటీ చేయుచున్న శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి శుభాకాంక్షలు..
-కేతంరెడ్డి వినోద్ రెడ్డి
Om Namasivaya
Shivaratri special 🙏🙏
Annual Day my son dance performance
https://youtu.be/-SPgREu-z_g?si=teHANYPsNrTCpmkG
కుప్పకూలిన వైసీపీ | Nellore YSRCP Leaders Like to Joins TDP | CM Jagan | TV5 News కుప్పకూలిన వైసీపీ | Nellore YSRCP Leaders Like to Joins TDP | CM Jagan | TV5 News Watch TV5 News LIVE : https://youtu.be/ox2rT1KRkFIS...
*🛕🪔అద్భుతం.. ఆధ్యాత్మికం- కార్తీక మాస లక్ష దీపోత్సవం🪔🛕*
పరమ పవిత్రమైన కార్తీక మాసంలో అద్భుత ఆధ్యాత్మిక కార్యక్రమానికి నెల్లూరులోని వీఆర్‌సీ మైదానం వేదిక కానుంది. శివ కేశవుల నామ స్మరణ, కార్తీక దీపాల వెలుగులతో మైదానం శోభిళ్లనుంది. గత ఎనిమిది సంవత్సరాలుగా కార్తీక మాసంలో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్తీక మాస లక్ష దీపోత్సవ వేడుకకు వీఆర్‌సీ మైదానం ముస్తాబయింది. డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో ఈ ఉత్సవాలు నిర్వహించేందుకు కార్తీక మాస లక్ష దీపోత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో భాగంగా మైదానంలో వైద్యనాథ్ శివలింగ నమూనాను, ఉడిపి కృష్ణ భగవాన్ నమూనా ఆలయాన్ని, ఆదియోగి విగ్రహ నమూనాలను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.
*📌 డిసెంబర్ 1 వ తేదీ కార్యక్రమాలు..*
🕘 ఉదయం 9 గం - గణపతి పూజ, శ్రీ వైద్యనాథ్ మహాశివుని శివలింగ ప్రతిష్ఠ, ఉడిపి కృష్ణభగవాన్ విగ్రహ ప్రతిష్ఠ, కలశ స్థాపన.
🕙 ఉదయం 10 గం - మహన్యాసపూర్వక శత రుద్రాభిషేకం.
🕔 సాయంత్రం 5 గం - 6.30 గం వరకు - సాంస్కృతిక కార్యక్రమాలు.
🕕 సాయంత్రం 6. 45 గం - శ్రీ సౌభాగ్య భువనేశ్వరీ పీఠం పరమహంస పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ రామానంద భారతి స్వామి వారి చేతులమీదుగా శ్రీ మాన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో కార్తీక మాస లక్ష దీపోత్సవం ప్రారంభం.
🕖 రాత్రి 7.00 గం - అభిషేకం
🕖 రాత్రి 7.30 గం - రామానంద భారతి స్వామి వారిచే అనుగ్రహ భాషణం
🕗 రాత్రి 8.15 గం - మహా శివునికి భస్మాభిషేకం, ప్రత్యేక హారతులు.
*📌 డిసెంబర్ 2వ తేదీ కార్యక్రమాలు..*
🕘 ఉదయం 9 గం - 108 మంది దంపతులచే శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి పంచ బిల్వార్చన.
🕙 ఉదయం 10 గం - విశేష రుద్ర హోమం, శ్రీ లక్ష్మీ కుబేర హోమం.
🕔 సాయంత్రం 5 గం - 6.30 గం వరకు - సాంస్కృతిక కార్యక్రమాలు.
🕕 సాయంత్రం 6.45 గం - శ్రీ హంపీ వీరూపాక్ష విద్యారణ్య మహా సంస్థానాధీశులు, శ్రీ మత్ పరమహంస పరవ్రాజకాచార్య జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ విద్యారణ భారతీ స్వామి వారి చేతుల మీదుగా శ్రీమాన్ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతి రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవం.
🕖 రాత్రి 7 గం - విద్యారణ్య భారతీ స్వామిచే అనుగ్రహ భాషణం.
🕗 రాత్రి 8 గం - శ్రీ కృష్ణ భగవానునికి నవనీత సేవ, విశేష అర్చన, హారతులు.
*📌 డిసెంబర్ 3వ తేదీ కార్యక్రమాలు..*
🕗 ఉదయం 8.30 గం - విశేష ఛండీయాగం
🕘 ఉదయం 9 గం - 501 మంది దంపతులతో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతం.
🕐 మధ్యాహ్నం 1 గం - వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం.
🕔 సాయంత్రం 5 గం - 6.30 గంటల వరకు - సాంస్కృతిక కార్యక్రమాలు.
🕕 సాయంత్రం 6.45 గం - మంచిర్యాలకు చెందిన అభినవశుఖ, భాగవత భాస్కర శ్రీ బుర్రా భాస్కర శర్మ గారి చేతుల మీదుగా, శ్రీమాన్ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతి రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవం కార్యక్రమం.
🕖 రాత్రి 7 గం - బుర్రా భాస్కర శర్మగారిచే కార్తీక దీప వైభవం, ప్రవచనం
🕗 రాత్రి 8 గం - శివ పార్వతుల శాంతి కల్యాణ మహోత్సవం.
*🪔 ఈ కార్తీక మాస లక్ష దీపోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని శివ కేశవుల చల్లని దీవెనలు పొందాలని ఆశిస్తున్నాం.🪔*
ఇట్లు..
*మీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, శ్రీమతి ప్రశాంతి రెడ్డి దంపతులు..*
Happy Diwali 🥳
Click here to claim your Sponsored Listing.