Save Education AP

Save Education AP

Save Education Movement - Need of the Hour

28/04/2024

జాతీయ విద్యా విధానం (NEP) - 2020 రద్దుచేసి, ప్రజా ప్రత్యామ్నాయ విద్యా విధానాన్ని అమలు చేయాలి.

ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ (AISEC) రూపొందించిన "ప్రజా ప్రత్యామ్నాయ విద్యా విధాన" మేనిఫెస్టోను తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, ఐన్ స్టీన్ విగ్రహం వద్ద విడుదల చేశారు.

Photos from Save Education AP's post 28/04/2024

జాతీయ విద్యా విధానం (NEP) - 2020 రద్దుచేసి, ప్రజా ప్రత్యామ్నాయ విద్యా విధానాన్ని అమలు చేయాలి.

ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ (AISEC) రూపొందించిన "ప్రజా ప్రత్యామ్నాయ విద్యా విధాన" మేనిఫెస్టోను తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, ఐన్ స్టీన్ విగ్రహం వద్ద విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో AISEC రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.గోవిందరాజులు గారు, సీనియర్ జర్నలిస్టు ఏ.రాఘవశర్మ గారు, జి. ప్రతాప్ సింగ్ గారు, ఏ.హరీష్ విద్యార్థి నాయకులు ఏ.రాహుల్, వి.వెంకటసుబ్బయ్య, ఎన్. నవీన్ ఇతరులు పాల్గొన్నారు.

27/04/2024
21/04/2024

*జాతీయ విద్యా విధానం (NEP) - 2020 రద్దుచేసి, ప్రజా ప్రత్యామ్నాయ విద్యా విధానాన్ని అమలు చేయాలి! ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ (AISEC) రూపొందించిన ప్రజా ప్రత్యామ్నాయ విద్యా విధాన మేనిఫెస్టో విడుదల!!*
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)-2020 గత రెండు, మూడు సంవత్సరాలుగా దేశంలోనూ, రాష్ట్రంలోనూ అమలవుతోంది. ఈ విధానం వలన తలెత్తుతున్న తీవ్ర పర్యవసానాలు ఎదురవుతుండడాన్ని విద్యార్థులు, ఉపాద్యాయులు, అధ్యాపకులు, మేధావులు అనుభవ పూర్వకంగానే గమనిస్తున్నారు. దీనివల్లనే వారు అభ్యంతరాలు లేవనెత్తుతున్నారు. అయితే కేవలం అభ్యంతరాలను లేవనెత్తడమే గాక ప్రత్యామ్నాయ విద్యా విధానాన్ని తయారు చేసి అమలు చేయాలని కోరుకుంటోంది ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ. కేవలం ప్రభుత్వాల విద్యా విధానాలను విమర్శించడమే కాక, విద్యకు సంబంధించి ప్రజల పక్షాన కొన్ని మౌలిక అంశాలను తప్పక ప్రతిపాదించవలసిన అవసరం ఉంది. ఈ దృష్ట్యా ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటి రూపొందించిన ప్రజా ప్రత్యామ్నాయ విధాన మేనిఫెస్టో 21 ఏప్రిల్ 2024 తేదీన హిందూపురం వద్దనున్న కొడిగెనహళ్లి లోని బాలవికాస వేదిక కార్యాలయంలో విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటి రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు సత్యసాయి జిల్లా ఇన్చార్జి మల్లిక్ దత్ కుమార్ మాట్లాడుతూ "విద్యా రంగానికి సంబంధించిన ఒక విధానాన్ని తీసుకువచ్చేటప్పుడు ఆ రంగంలో నిష్ణాతులైన విద్యావేత్తలను, అధ్యాపకులను, ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను, విద్యార్థులను సంప్రదించి వారి అభిప్రాయాలను క్రోడీకరించి ఒక ప్రజోపయోగకరమైన విధానాలు తీసుకురావాలి తప్ప విద్యార్థులను జ్ఞానవంతులుగా కాకుండా మర మనుషులుగా మార్చే విధానం ప్రజా వ్యతిరేకమైనదని, ఎన్నికల్లో ఓట్ల రాజకీయాలు చేస్తున్న ఏ రాజకీయ పార్టీ కూడా విద్య గురించి ఊసెత్తక పోవడం చాలా శోచనీయమని తెలిపారు. కేంద్ర బడ్జెట్లో 10 శాతం, రాష్ట్ర బడ్జెట్లో 30 శాతం నిధులను గ్యారంటీ చేయాలని, విద్య లక్ష్యాన్ని జ్ఞానంతో పరిపూర్ణమైన మనిషిని రూపొందించే ప్రక్రియగా, సామాజిక బాధ్యత స్పృహ కలిగిన పౌరునిగా మలిచే సాధనంగా నిర్వచించాలని కోరారు. ఇండియన్ నాలెడ్జీ సిస్టమ్ (ఐకేఎస్) అనే పేరుతో బోధిస్తున్న ప్రగతినిరోధక అశాస్త్రీయ భావాలను పాఠ్యాంశాల నుండి తొలగించాలని, మనదేశ నవజాగరణోద్యమ వైతాళికుల, స్వాతంత్ర్య పోరాట యోధుల ఉదాత్త భావనలచే ప్రేరేపితమైన శాస్త్రీయ, ప్రజాస్వామ్య, సెక్యులర్ విలువల ప్రాతిపదికగా పాఠ్యప్రణాళికలను రూపొందించాలని వారు విజ్ఞప్తి చేశారు. గతంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, ఎన్నికలలో పాల్గొనే రాజకీయ పార్టీలు అన్నింటికి ఈ జాతీయ విద్యా విధానం NEP-2020 ని రద్దు చేయాలని ఈ మెయిల్స్ ద్వారా కోరామని, ఇప్పుడు కూడా తాము విడుదల చేసిన మేనిఫెస్టోని అమలు చేయాల్సిందిగా కోరుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Photos from Save Education AP's post 05/02/2024

3rd Feb, 2024 All India Save Education Committee organized the All India Save Education Conference. Renowned scientists, historians and educationists from all over the country participated in this conference. The conference was Inaugurated by renowned historian Prof. Irfan Habib.

03/02/2024
03/02/2024

https://www.facebook.com/share/v/dYZx4bFFjdZPoi6w/?mibextid=K8Wfd2

All India Save Education Conference organized by
All Indi Save Education Committee
AISEC

01/02/2024

Make Success All India save education conference of AISEC
-----------------
Prof.Tarun kanti Naskar, Jadavpur University & General Secretary of AISEC

Share this facebook post

NCERT చరిత్ర పాఠ్యపుస్తకాల నుంచి పాఠాల తొలగింపు చారిత్రక తప్పిదం | కొప్పర్తి వెంకటరమణమూర్తి || AISEC 22/12/2023

https://youtu.be/dl2ptVS4gA4?si=SOXGx4oBU2cUWuDd

NCERT పాఠ్య పుస్తకాలలో పాఠ్యంశాల తొలగింపుపై & జాతీయ విద్యా విధానం (NEP) - 2020లో వస్తున్న మార్పులపై అనంతపురంలో జరుగుతున్న 2వ రాష్ట్ర సేవ్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్న
శ్రీ కొప్పర్తి వెంకటరమణమూర్తి,
రిటైర్డ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్,
పాఠ్యపుస్తకాల రచయిత

NCERT చరిత్ర పాఠ్యపుస్తకాల నుంచి పాఠాల తొలగింపు చారిత్రక తప్పిదం | కొప్పర్తి వెంకటరమణమూర్తి || AISEC NCERT పాఠ్య పుస్తకాలలో పాఠ్యంశాల తొలగింపుపై & జాతీయ విద్యా విధానం (NEP) - 2020లో వస్తున్న మార్పులపై అనంతపురంలో జరుగుతున్.....

03/12/2023

News published in the latest edition of an English fortnightly.

03/12/2023

ఈనాడు - అమరావతి

అప్పు కోసం చదువులకు నిప్పు!

ఆనాడు అర్జునుడి గురి పక్షి కన్నుపై ఉందో లేదో గానీ... నేడు ఆంధ్రప్రదేశ్‌లో జగనన్న కన్ను మాత్రం ఎంతసేపూ అప్పులపైనే! తెల్లవారి లేచింది మొదలు ఎక్కడ అప్పు పుడుతుందా ఎంత పుడుతుందా అనేదే ధ్యాస! అప్పిచ్చేవాడు ఏం షరతులు పెడుతున్నాడు... వాటితో నష్టమేంటన్న దృష్టే లేదు. ఆ అప్పు పేరిట ఇల్లు గుల్లైనా పర్వాలేదు అప్పు పుడితే చాలు... అదే పదివేలు అనేలా ఉంది పరిస్థితి!

నోరు తెరిస్తే చాలు...
మీకు పేద పిల్లలు బాగుపడటం ఇష్టం లేదా?
వాళ్లు ఆంగ్లం మాట్లాడటం ఇష్టం లేదా?
సర్కారు బడులు బాగుపడటం ఇష్టం లేదా?
మంచి చదువులిస్తామంటే వద్దంటారా...
అంటూ ప్రభుత్వ పాఠశాల విద్యను సంస్కరించటానికి వచ్చినట్లు మాట్లాడే జగన్‌ సర్కారు... రూ.1,862 కోట్ల ప్రపంచబ్యాంకు రుణం కోసం అదే బడుగుల చదువులకు తూట్లు పొడిచింది. ప్రపంచబ్యాంకును ప్రసన్నం చేసుకోవటానికి సర్కారు బడులను మూసేసింది. టీచర్‌ పోస్టులను రద్దు చేసింది. నిరుద్యోగుల పొట్టగొట్టింది. తాను పదేపదే వల్లించే పేదలు... ప్రభుత్వ బడులు వీడి ప్రైవేటు బాట పట్టేలా చేస్తోంది. రండి చూద్దాం... జగనన్న ఘనమైన విద్యావిధానాన్ని!
రూ.1,862 కోట్ల రుణం కోసం...

ప్రపంచ బ్యాంకు రుణం రూ.1,862కోట్ల కోసం జగన్‌ ప్రభుత్వం పాఠశాల విద్యలో కల్లోలం సృష్టించింది. ప్రపంచ బ్యాంకు రుణం కోసం మానవ వనరులపై చేసే వ్యయాన్ని తగ్గించుకుంటామని ప్రభుత్వమే స్వీయ నిబంధన పెట్టుకుంది. ఇందుకోసం ఉపాధ్యాయ నియామకాలను నిలిపివేసింది. సబ్జెక్టు టీచర్లతో బోధనంటూ 3, 4, 5 తరగతులను ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో కలిపేసి, సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీ)లను సర్దుబాటు చేసేసింది. 7,752 ఆర్ట్‌, క్రాఫ్ట్‌, డ్రాయింగ్‌, ఎస్జీటీ పోస్టులు రద్దు చేసింది. తరగతుల విలీనం కారణంగా విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి 587 ప్రభుత్వ బడులు మూతపడ్డాయి. ప్రభుత్వ విధానంతో 1,365 ఎయిడెడ్‌ బడులు కాలగర్భంలో కలిసిపోయాయి. పిల్లల సంఖ్య తగ్గిపోయి ఏకోపాధ్యాయ బడుల సంఖ్య పెరిగిపోయింది. ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు క్రమంగా తగ్గి ప్రైవేటుకు వలసపోతున్నారు. ప్రభుత్వ బడుల్లో చదివేవారిలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాల పిల్లలే!
ఎయిడెడ్‌ ఆస్తులపై కన్నేసి..

రాష్ట్రంలో ఘన చరిత్ర కలిగిన ఎయిడెడ్‌ విద్యా వ్యవస్థను నాశనం చేశారు. వాటిని మూసేసేలా ప్రభుత్వం కక్ష కట్టి వ్యవహరించింది. ఎయిడెడ్‌ విద్యా సంస్థలను ఆస్తులతో సహా అప్పగిస్తే ప్రభుత్వమే నిర్వహిస్తుందని లేదంటే ఎయిడెడ్‌ సిబ్బందిని ప్రభుత్వానికి అప్పగించి ప్రైవేటుగా నిర్వహించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీనికి విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత రావడంతో... తర్వాత ప్రభుత్వం వెనక్కి తగ్గినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఉపాధ్యాయ నియామకాలు లేకపోవడం, ఎయిడెడ్‌పై ప్రభుత్వ నిర్ణయాల కారణంగా పిల్లల సంఖ్య తగ్గిపోయి చాలా బడులు మూతపడ్డాయి. ఇటీవల ఎయిడెడ్‌ యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కొన్నింటి నియామకాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా పెద్దగా ప్రయోజనం లేకుండాపోయింది.
ఉపాధ్యాయ పోస్టులకు ఎసరు..

ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించుకునేందుకు ప్రభుత్వం పోస్టుల హేతుబద్ధీకరణ, తరగతుల విలీనం చేసింది. ఉన్నవారినే సర్దుబాటు చేసి, కొత్త నియామకాలు లేకుండా చేసింది. విద్యార్థులతోపాటు అర్హత కలిగిన సెకండరీ గ్రేడ్‌ టీచర్ల(ఎస్జీటీ)కు ఆయా బడుల్లో సర్దుబాటు చేసేసింది. పోస్టులను తగ్గించుకునేందుకు 1-9 తరగతుల్లో తెలుగు మాధ్యమం విద్యార్థుల్నీ ఆంగ్ల మాధ్యమంలో సర్దుబాటు చేసేసింది. 9, 10 తరగతుల్లో సెక్షన్‌కు విద్యార్థుల సంఖ్యను 60కు పెంచింది. 6-8 తరగతుల్లో సెక్షన్‌కు 52 మంది చొప్పున అమలు చేసింది. దీంతో ఉపాధ్యాయుల అవసరం తగ్గిపోయింది. 3-10 తరగతులు ఉండే హైస్కూల్‌లో 137 మందికి పైగా విద్యార్థులుంటేనే ప్రధానోపాధ్యాయుడు, పీఈటీ పోస్టులు ఇచ్చింది. ఇలా అనేక చర్యలతో పోస్టులను మిగుల్చుకుంది.
ప్రవేశాలు రివర్స్‌

కరోనా సమయంలో ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు చెల్లించలేక చాలా మంది ప్రభుత్వ బడుల్లో చేరారు. దీంతో మా వల్లే విద్యార్థుల సంఖ్య పెరిగిందని సీఎం జగన్‌ గొప్పగా ప్రచారం చేశారు. ఇప్పుడు ప్రవేశాలు రివర్స్‌లో ఉన్నా నోరు మొదపడం లేదు.

ఊరి బడికి ఉరి..

రాష్ట్రంలో ఒక్క పాఠశాల కూడా మూతపడదని, గతంలో మూసివేసిన వాటినే తెరిపిస్తున్నామని ఊదరగొట్టిన సీఎం జగన్‌.. ఇప్పుడు సంస్కరణల పేరుతో ఊరిలో బడికి తాళాలు వేసేస్తున్నారు. 3, 4, 5 తరగతులను ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు తరలించడంతో 1, 2 తరగతుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి చాలా బడులు మూతపడ్డాయి. బడుల దూరం పెంచేందుకు చివరికి విద్యా హక్కు చట్టాన్ని మార్చేశారు. కిలోమీటరు దూరంలో ఉండాల్సిన 3, 4, 5 తరగతులు మూడు కిలోమీటర్ల దూరం ఉండేలా సవరణ చేశారు.

ఏకోపాధ్యాయుడి.. బహుపాత్రాభినయం

రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు లేకుండా చేస్తామని, ప్రతి బడికీ ఇద్దరు ఉపాధ్యాయులను నియమిస్తామని బాకా ఊదిన జగన్‌ ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించింది. ఏకోపాధ్యాయ బడులు తగ్గకపోగా.. జగన్‌ ప్రభుత్వంలో మరింత పెరిగాయి. రాష్ట్రంలో 2020 అక్టోబరు నాటికి సింగిల్‌ టీచర్‌ బడులు 7,774 ఉండగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 9,602కు పెరిగింది. హేతుబద్ధీకరణ ఉత్తర్వుల ప్రకారం 20మంది విద్యార్థులక ఒక టీచర్‌ను నియమించాల్సి ఉన్నా ఎస్జీటీల కొరత పేరుతో 30-40 మందికీ ఒక్కరినే నియమించారు.

1-5 తరగతులున్న పాఠశాలల్లో ఒకటో తరగతి వారికి అక్షరాలు నేర్పించడం, ఐదో తరగతి వారికి పాఠాలు చెప్పడం ఒకే ఉపాధ్యాయుడికి కష్టంగా మారుతోంది. ఒకే గదిలో అందర్నీ కూర్చోబెట్టడం వల్ల ఎవరికి ఏ పాఠం చెబుతున్నారో తెలియని గందరగోళం ఏర్పడుతోంది. సింగిల్‌ టీచర్‌ బడికి వచ్చింది మొదలు ఇంటికి వెళ్లే వరకు బోధన చేస్తూనే ఉండాల్సి వస్తోంది. ఇవి కాకుండా బోధనేతర పనులు మరుగుదొడ్ల ఫొటోలు, మధ్యాహ్న భోజనం ఫొటోలు, విద్యార్థుల ఆన్‌లైన్‌ హాజరు, పరీక్షల సమయంలో మండల కేంద్రం నుంచి ప్రశ్నపత్రాలు తెచ్చుకోవడం, విద్యాకానుక లెక్కలులాంటి పనులు ఆ టీచరే చేయాలి.

Higher Education under NEP 2020 | Prof A Karunanandan 13/11/2023

Allahabad University has started a five-year integrated BBA-MBA course in which students can learn management mantras of Lord Krishna through Bhagavad Gita, Ramayana and Upanishads as well as those of Chanakya. but it is not known in which college Lord Krishnan studied a business management course.
Professor Karunanandan's thought-provoking, Thundering, Vibrant speech at the Save Education Conference at Anantapur.
https://youtu.be/byzSue2OLOY

Higher Education under NEP 2020 | Prof A Karunanandan On NEP-2020, Reforms in Higher Education & 4-Year Degree2nd Andhra Pradesh StateSave Education Conference Organised byAll India Save Education Committee(AISE...

Photos from Save Education AP's post 10/11/2023

4 సంవత్సరాల డిగ్రీ & జాతీయ విద్యా విధానం
(NEP) - 2020 & విద్యా రంగంలో వస్తున్న మార్పులపై నిన్నటి రోజున అనంతపురంలో (9వ తేది )
2వ రాష్ట్ర సేవ్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్
దిగ్విజయవంతం ముగిసింది.

Photos from Save Education AP's post 08/11/2023

రేపు అనంతపురంలో జరగబోతున్న
2వ రాష్ట్ర సేవ్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ కు
వివిధ జిల్లాల బయలుదేరిన ప్రతినిధులు

07/11/2023

4 సంవత్సరాల డిగ్రీ & జాతీయ విద్యా విధానం (NEP) - 2020 & విద్యా రంగంలో వస్తున్న మార్పులపై ఈ నెల 9వ తేదీన జరగబోతున్న 2వ రాష్ట్ర సేవ్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ ను విజయవంతం చేయండి!

Photos from Save Education AP's post 04/11/2023

4 సంవత్సరాల డిగ్రీ & జాతీయ విద్యా విధానం
(NEP) - 2020 & విద్యా రంగంలో వస్తున్న మార్పులపై ఈ నెల 9వ తేదీన జరగబోతున్న 2వ రాష్ట్ర సేవ్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ గురించి చిత్తూరు పట్టణంలోని పి. సి.ఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజి, పి.వి.కె.ఎన్ ప్రభుత్వ డిగ్రీ కాలేజి మరియు వెల్ఫేర్ హాస్టల్ నందు ప్రచారం

AISEC
చిత్తూరు

03/11/2023

4 సంవత్సరాల డిగ్రీ & జాతీయ విద్యా విధానం (NEP) - 2020 & విద్యా రంగంలో వస్తున్న మార్పులపై ఈ నెల 9వ తేదీన జరగబోతున్న 2వ రాష్ట్ర సేవ్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ ను విజయవంతం చేయండి!

శ్రీ బిఏ.చంద్రశేఖర్
మానవహక్కుల వేదిక రాష్ట్ర నాయకులు

Photos from Save Education AP's post 02/11/2023

4 సంవత్సరాల డిగ్రీ & జాతీయ విద్యా విధానం (NEP) - 2020 & విద్యా రంగంలో వస్తున్న మార్పులపై ఈ నెల 9వ తేదీన AISEC ఆధ్వర్యంలో జరగబోతున్న
2వ రాష్ట్ర సేవ్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ గురించి తిరుపతిలోని వివిధ విద్యా సంస్థలలో ప్రచారం.

AISEC
తిరుపతి

Photos from Save Education AP's post 01/11/2023

ఆల్ ఇండియా సే ఎడ్యుకేషన్ కమిటీ ఆధ్వర్యంలో
నవంబర్ 9వ తేదీన జరగబోతున్న
రెండవ రాష్ట్ర సేవ్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్
ప్రచారంలో భాగంగా అనంతపురం నగరంలోని వివిధ పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులను కలిసి విషయాన్ని వివరించి మహాసభలకు ఆహ్వానించడంతో పాటు వివిధ విద్యా సంస్థల్లో ప్రచార కార్యక్రమాలు.

అనంతపురం
AISEC

Photos from Save Education AP's post 01/11/2023

AISEC రెండవ రాష్ట్ర మహాసభల ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లా కోవూరు YKR & K ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జరిగిన సమావేశం.
నెల్లూరు,
AISEC.

Photos from Save Education AP's post 01/11/2023

నవంబర్ 9వ తేదీన జరగబోయే
రెండవ రాష్ట్ర సేవ్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ ప్రచార కార్యక్రమం
విజయవాడ.
AISEC

Photos from Save Education AP's post 01/11/2023

ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ ఆధ్వర్యంలో నవంబర్ 9వ తేదీన జరగబోతున్న
రెండవ రాష్ట్ర మహాసభల ప్రచారంలో భాగంగా
సత్యసాయి జిల్లా హిందూపురంలో
వివిధ విద్యాసంస్థలలో ప్రచార కార్యక్రమాలు.
AISEC
హిందూపూర్

Photos from Save Education AP's post 01/11/2023

నవంబర్ 9న జరగబోతున్న
సేవ్ ఎడ్యుకేషన్ రాష్ట్ర కాన్ఫరెన్స్ ప్రచారంలో భాగంగా
గుంటూరు గురవయ్య ఇంటర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ,
బండ్లమూడి హనుమాయమ్మ మహిళా డిగ్రీ కాలేజీలలో
ఉన్నత విద్యలో మార్పులు, నాలుగేళ్ల డిగ్రీపై జరిగిన సమావేశాలు ప్రసంగిస్తున్న AISEC రాష్ట్ర కార్యదర్శి ఎస్.గోవిందరాజులు గారు,
AISEC
గుంటూరు.

24/10/2023

2nd Andhara Pradesh state
Save Education Conference

On NEP-2020, Reforms in Higher Education & 4-Year Degree

9th November, 2023 Anantapur

Organised by
All India Save Education Committee

Videos (show all)

Make Success All India save education conference of AISEC-----------------Prof.Tarun kanti Naskar, Jadavpur University &...
4 సంవత్సరాల డిగ్రీ & జాతీయ విద్యా విధానం (NEP) - 2020 & విద్యా రంగంలో వస్తున్న మార్పులపై ఈ నెల 9వ తేదీన జరగబోతున్న 2వ రా...
4 సంవత్సరాల డిగ్రీ & జాతీయ విద్యా విధానం (NEP) - 2020 & విద్యా రంగంలో వస్తున్న మార్పులపై ఈ నెల 9వ తేదీన జరగబోతున్న 2వ రా...
NEP 2020 - 4ఏళ్ల డిగ్రీ అమలు నేపథ్యంలో ఉన్నతవిద్య భవిష్యత్తు ఏమిటి?

Telephone

Website