Chandu Sheks
BRS Party Social Media Representative
నిర్ధారణ లేకుండా ఆ అఖిల్ పహిల్వాన్ అనే వ్యక్తికి , కాంగ్రెస్ నేతలకు సంబంధం ఉన్నట్టు మన సోషల్ మీడియా పోస్టులు పెట్టింది ! ముఖ్యమంత్రికి అతనికి దగ్గర సంబంధం అని కూడా పెట్టారు !!
ఇప్పుడు వాళ్లు మన మంత్రులకు , ఎమ్మెల్యేలకు సంబంధం ఉంది అని మనకంటే పెద్ద ఎత్తులో పెడుతున్నారు !!
గాలికి పోయే కంపను గు*ద్దకు కొట్టుకోడం అంటే ఇదే !!
ఏమన్నా అంటే ? మాకు చెప్పేంత తోపువా అంటారు !!
మన గులాబీ జెండా మళ్ల రేప రేపలాడే వరకు యుద్ధం చెయ్యాల్సిందే !
రేప రేపలాడినంక మళ్ల సుట్టు ముట్టు జోకుడు బ్యాచ్ జమైతది అనుకో..
అది వేరే విషయం గానీ , ఇప్పుడు అయితే తిప్పలు తప్పదు !!
జై కేసీఆర్ !! జై తెలంగాణ !! 🔥🙏🏻
రేవంత్ రెడ్డి కి ఇంగ్లీష్ రాదు అని , మాట్లాడిన విడియోని ట్రోల్ చేసి పెడుతున్నారు.. పాపం పెద్దబడిలో చదువుకున్న వాడు అంత స్థాయికి వెళ్లాడు , వెళ్లినోడి మీద ఇంత చిన్న చూపు చూస్తార ? ఇంగ్లీష్ రానివాడు అంటే అంత చులకనన భావమా ? అని రేవంత్ రెడ్డి మీద సానుభూతి పెరుగుతుంది!!
వీడేంటి ఇలా పెట్టాడు ? అని వంకర బుద్ధితో ఆలోచించకండి బ్రోలు !
ఓటుకు నోటు విదియోని ఎంత వైరల్ చేసినా.. జనం చూసిన కూడా..
జనం ముఖ్యమంత్రిని చేసి కూర్చోబెట్టలేదా ? ఆలోచించండి !!
కనుక కొంచెం బలహీనతల మీద ట్రోల్ చెయ్యడం ఆపితే బెటర్ !!
సంక్రాంతి సంగతులు ఏమిటి ? దీని మీద రివ్యూ ఏమన్నా ఉందా ?
" అత్తారింటికి దారేది ? " లాగే " అమ్మారింటికి దారేది ? " అని పెడితే బావుండేది గురువు గారు !! ఒకటే కథను గుంజీ గుంజీ చెప్పడం వలన మీకు ఏం వస్తుందో తెలీదు కానీ జనాలకు మాత్రం సినిమా మీద ఉన్న నమ్మకం పోతుంది !! ఈ మాత్రం దానికి పక్కోడి సినిమాలను ఇబ్బంది పెట్టి మరీ రిలీజ్ చెయ్యడం అనవసరం కద..
ఇంట్లోకి వెళ్లడం , ఉన్న ఇంట్లో నుండి బయటికి రావడం !
ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకొని మళ్లీ సంపాదించడం !
లేని ఆస్తులను , అంతస్తులను పొందాలనుకోడం !
అమ్మనో..అత్తనో..మళ్లీ ఇంటికి తేవడం ఇదేనా ఇంకా తెలుగు సినిమా ?
నాకు అయితే నచ్చలేదు ! 250 రూపాయలు పెట్టి టికెట్ కొన్న అర్హత చాలు అనుకుంటా ఈ మాట చెప్పడానికి..
మా అక్క ఒకరు ఇందాక కాల్ చేసి.. ఒక సందేహం అడిగింది !!
" నేను ఆర్టీసీ బస్సు ఎక్కిన , జీరో టిక్కెట్టు అడిగి... నేను దిగే స్టాప్ పేరు చెప్పిన.. కండక్టరు జీరో టిక్కెట్ ఇచ్చి వెళ్లాడు , టిక్కెట్టు మీద నేను ఎక్కిన స్టాపు.. దిగాల్సిన స్టాపు లేకుండా.. " డిపో - డిపో " టిక్కెట్ ఇచ్చాడు..
అంటే 10 రూపాయల టిక్కెట్ బదులు 25 రూపాయల టిక్కెట్ ఇచ్చాడు.. ఇలా ఒక్కసారి కాదు 5-6 సార్లు అయ్యింది ! అంటే , ఎంత జీరో టిక్కెట్టు అయితే మాత్రం దూరం ఎక్కువ ఉన్న టిక్కెట్టు ఇవ్వడం ఎందుకు ? అస్సలు ఏం జరుగుతుంది ? నీకేమన్నా తెలుసా ? "
అని అడిగింది..
ఏంటి ఎవ్వారం ?
" అప్పు చేసి పప్పు కూడు " తప్పని బ్రహ్మానందం గారు చాలా చిన్న వయసులో తెలుసుకున్నారు !! ఆయన అనుభవం , ఈతరానికి ఎంతో అవసరం !
ఒక్కొక్క పేజీ తిప్పుతుంటే..కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి...🥹
బ్రతుకంటే బ్రమ్మిదే ! ❤️🙏🏻
చిరిగిన నిక్కరు - రంగు వెలిసిన అంగీ " నేర్పిన జీవిత పాఠాలు ఎంత ఎత్తుకు ఎదిగినా..మన మనసులో ఆ గాయాలు అంత లోతుగా పాతుకుపోతుంటాయి..
బ్రహ్మానందం గారు రాసిన ఈ పుస్తకం ప్రతొక్కరు చదవాలి ! 📖
పేదరికంలో నుండే పెద్దరికం పుడుతుంది అని తెలుసుకోవాలి ! 🥹❤️
"Embarking on a journey of knowledge and laughter in 2024 with 'Nenu - Me Bramhanandam.' There's something magical about losing yourself in the pages of a book – it broadens your mind, fuels creativity, and offers a unique escape. Here's to a year filled with the joys of reading! 📚✨
Anvikshiki Publishers
2023 - ప్రభుత్వాన్ని కోల్పోయాం
2024 - పార్టీని బలపరుచుకుందాం...
Certainly! Plot points are pivotal moments in a story that influence its direction. They can include key events, revelations, or turning points. For example, in "Harry Potter," the discovery of the Sorcerer's Stone and Harry's encounter with Professor Quirrell are crucial plot points. In "The Lord of the Rings," the Fellowship's breakup at Amon Hen is another significant plot point, altering the course of the quest. These moments propel the narrative and engage the audience by introducing tension, conflict, or important information.
In “The Empire Strikes Back,” the revelation that Darth Vader is Luke Skywalker’s father is a major plot point that reshapes the entire “Star Wars” saga. In “The Matrix,” Neo taking the red pill and discovering the true nature of the Matrix is a crucial plot point that sets the story in motion. Additionally, in “The Shawshank Redemption,” Andy Dufresne’s escape from Shawshank State Penitentiary is a significant plot point that brings resolution to the film’s central conflict. These examples showcase how plot points drive the narrative and add depth to the storytelling in films.
ప్రభుత్వాన్ని ట్రోల్ చేయ్ అని మన అన్నదమ్ములు అడుగుతున్నారు !
ముఖ్యమంత్రిని ట్రోల్ చెయ్యు అని ఇంకొంత మంది !
నేను అడిగేది ఏందంటే ? ఇది కాసేపు పక్కనపెట్టి...
వాడిని - వీడిని ట్రోల్ చెయ్యడం కన్నా ముందు..
మన సంగతి ఏంది ? మన కార్యాచరణ ఏంది ?
మనం , మన పార్టీ కోసం ఏం పోస్ట్ చేద్దాం ?
తెలంగాణ ప్రభుత్వానికి ఇందిరాగాంధీ గారికి ఏం సంబంధం ?
ప్రభుత్వ ధరకాస్తూ పత్రంలో ఆమె బొమ్మ పెట్టడం ఎంత వరకు కరెక్టు ?
కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో పెట్టుకోండి !!
సరైన సమాధానం ఇవ్వగలరు..
నాకు తెలియకపోతే తెలుసుకుంటా !!
మన కులం వాడు గొప్పోడు అవ్వడానికి ఒక్కన కొడుకు పని చెయ్యడు ,
కానీ ఎవడన్నా గొప్పోడు అయితే వాడు మా కులపోడు అంటారు !!
కుల కాలం 🙏🏻
తెలంగాణ మట్టికి దక్కిన గౌరవం !! ❤️
సలార్ సీన్మలో మన కనకవ్వ ఎంట్రీ అదుర్స్ !! 🔥
❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌
టైం తీసుకొని చదువు బ్రో...
ఈ విధంగా నోటిఫికేషన్ వచ్చింది అంటే ?
అస్సలు నొక్కకండి దాని మీద... ❌
హ్యాకర్లు ఐడి పేరే డైరక్టు " need More Details " అని పెడుతున్నారు
ఆ పేరున్న ఐడితో మన ఫోటో షేర్ చేసి.. ఆ క్యాప్షన్లో లింక్ పెడుతున్నారు
మనం ఇది ఫేస్బుక్ నోటిఫికేషన్ అనుకొని పప్పులో కాలు వేస్తాం..
ఇంకా ఘోరం ఏంది అంటే ? వాట్సాప్ నంబర్ పెడతాడు..
మన అకౌంట్ మళ్లీ మనకు కావాలంటే.. ఒక ఓటీపీ వస్తుంది అని చెప్పి
మన బ్యాంకు ఓటీపీ అడుగుతారు అదే సమయంలో పంపి..
జాగ్రత్త ❌ ! అకౌంట్ పేరు సెంటెన్స్ పెట్టడం వలన మనం నోటిఫికేషన్
అనుకోడం చాలా సహజం !!
మన మంది అంత " పరమానందయ్య శిష్యలు " అయ్యిండ్రు 😂
సెక్రటేరియట్ , ప్రగతి భవన్ , రీల్స్ భవన్ గా మారడం ఏదైతే ఉందో..
అస్సలు , ఒక విలువ , గౌరవం , విశిష్టత కోల్పోయిన తెలంగాణ 💔
ఈటెల గారు కూడా పెద్దసారును కలిస్తే బావుంటుంది !
ప్రతి పని కేసీఆర్ సర్కార్ తో పోల్చుకొని..
మేము గొప్ప అని చెప్పుకోడంలో మీ లేఖితనం బయటపడుతుంది..
అప్పుడెప్పుడో రాసిన మాటలు..
ఈనాడు సింక్ అవ్వడం ఏమిటి ?
కొత్త బర్రె పెండ ! ఇంటిల్లాదులు తీసినట్టు..
ఈ స్కీములు ఏంది ? ఈ పీకులాట ఏంది ?
ఏం గతి పట్టింది ఈ రాష్ట్రానికి..
మన గులాబీ సైనికుల పట్టుదల , ఐకమత్యం చూస్తుంటే..
తప్పకుండా మనకు మంచి రోజులు వస్తాయి అని నమ్మకం వచ్చింది
ఇయ్యాల కెసిఆర్ అధికారం పోయింది అని , ప్రజలు ప్రతిపక్షానికి పంపారని , ఇంకా కెసిఆర్ జోలీ తెలంగాణ లో ఉండదు అని విర్రవీగుతున్న కొందరికి ఒకటే మాట చెప్తున్నా..
కెసిఆర్ ని తక్కువ అంచనా వెయ్యకండి !
ఈ తెలంగాణాలో ప్రతి వ్యక్తి ఎదో ఒక మూల కెసిఆర్ పక్షపాతి ,
ఆయనకు ఒక లిమిట్ వరకే వ్యతిరేకత ఉంటుంది ,
శృతి మించిన సమయంలో జనం ఆ మహానాయుకుడి కోసం
ప్రాణాలు ఇవ్వడానికి అయినా సిద్ధం అవుతారు ,
ఆరోజు వచ్చేవరకు తెచ్చుకోకండి ,
నా మాట వినండి ! ఇది రియాలిటీ !