BBC Cheyutha Foundation

BBC Cheyutha Foundation

BBC Cheyutha Foundation

04/05/2022

*విద్యుత్ వినియోగదారులకి ముఖ్య గమనిక*

👉ప్రతి యొక్క వినియోగదారుడు ఇంటి సర్వీస్ కి సంబంధించిన కరెంట్ బిల్లుని సరియైన సమయములో కట్టుకొని సర్ ఛార్జ్, ఇంధన ఛార్జ్ మరియు ఫినాల్టి లు పడకుండా జాగ్రత్త పడగలరు.

👉సరియైన సమయము అనగా మన విద్యుత్ మీటర్ కి బిల్ రీడర్ బిల్లు తీసిన రోజు నుండి10 రోజుల లోపు బిల్లు కట్టుకున్న యెడల 35 రూపాయలు నుండి 85 రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చును.

*ఉదాహరణ*
👉ఒక సర్వీస్ కి 100 రూపాయలు బిల్లు వచ్చింది అనుకుందాం. ఆ యొక్క బిల్లు 05/02/2022 న తీసినట్లైతే 14/02/2022 లోపు బిల్లు చెల్లిస్తే ఆ యొక్క వినియోగదారునికి తర్వాత నెలలో 25 రూపాయలు సర్ ఛార్జ్,10 రూపాయలు ఇంధన ఛార్జ్ పడకుండా ఆదా అవుతుంది.

👉అదే సర్వీస్ 20/02/2022 న కట్టారు అనుకుందాం అప్పుడు తర్వాత నెలలో 100 రూపాయలు బిల్లు వస్తె దానికి సర్ ఛార్జ్ 25 రూపాయలు,ఇంధన ఛార్జ్ 10 రూపాయలు కలిపి 135 రూపాయలు బిల్ వస్తుంది. ఒకవేళ 20 వ తారీఖు కూడా అనివార్య కారణాల వల్ల బిల్ కట్టకపోతే ఆ యొక్క 135 రూపాయల బిల్లుకు ఇంకొక 50 రూపాయలు R.c ఫీజు కలిసి మొత్తంగా 185 రూపాయలకి బిల్లు వస్తుంది.
*ఉదా*: బిల్లు 100
సర్ ఛార్జ్ 25 ఇంధన ఛార్జ్ 10
R.c ఫీజు 50
_____________
185
______________

👉ఈ యొక్క బిల్లుకి రెండవ నెల బిల్లు మరొక 100 రూపాయలు వస్తె మొత్తంగా (100+185) 285 రూపాయలు అవుతుంది.ఇలా నెల నెల బిల్లు ఆగే కొద్ది ఒక్కో 100 రూపాయలకి 35 రూపాయల ప్రకారం అదనపు రుసుము కట్టవలసి వుంటుంది.

👉అదే సకాలంలో బిల్లు కట్టుకుంటే 100 రూపాయల బిల్లుతో బిల్లు పూర్తవుతుంది.ఎలాంటి అదనపు చార్జెస్ లేకుండా డబ్బులు ఆదా చేసుకోవచ్చు.

👉కేటగిరీ 2 సర్వీసెస్ కి ఐతే సర్ ఛార్జ్ 150 రూపాయలు వరకు పడుతుంది.కావున ప్రతి యొక్క వినియోగదారుడు సకాలంలో బిల్లు చెల్లించి (బిల్లు ఇచ్చిన రోజు నుండి 10 రోజులు లోపు)డబ్బులు ఆదా చేసుకోగలరు. అంతే కాకుండా సకాలంలో బిల్లులు కట్టిన యెడల ఎటువంటి సంక్షేమ పథకాలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చును.

👉 *విద్యుత్ వినియోగదారులారా*
*ఆలోచించండి - ఆచరించండి*
*విద్యుత్ ఆదా చేయండి - డబ్బు ఆదా చేసుకోండి*
*డబ్బులు ఊరికే రావు - ఆలోచించి ఆచరిద్దాం*

17/04/2022

Happy Easter to All

14/04/2022
26/01/2022

Supermarket Fruits: సూపర్‌ మార్కెట్లో పళ్లు కొంటున్నారా..? వీటిని తప్పకుండా గమనించండి..!

: సూపర్‌ మార్కెట్‌లో అమ్మే పళ్లు, కాయగూరలను గమనిస్తే వాటిపై ఏవో లేబుల్స్‌ అతికించి ఉంటాయి. కానీ చాలామంది వాటి గురించి పెద్దగా పట్టించుకోరు. ఆ లేబుల్‌… ఉత్పత్తి చేసేవాడికి, అమ్మేవాడికి మాత్రమే సంబంధించిన విషయంగా భావిస్తారు. నిజానికా లేబుల్‌ వినియోగదారుడు తను కొంటున్న వస్తువు ఎలాంటిదో తెలుసుకోవడానికి ఉద్దేశించినది.

ప్రస్తుతం ఎక్కడ ఎవరి నోట విన్నా ఆర్గానిక్‌ అనే మాట వినిపిస్తోంది. ఆర్గానిక్‌ కాయగూరలు, పళ్లు అంటే సేంద్రీయ ఎరువులు వేసి సహజ పద్ధతుల్లో పండించినవని మనకు తెలుసు. అందుకే అవి ఆరోగ్యానికి మంచివని కొంచెం ఖరీదు ఎక్కువైనా కొంటుంటాం. ముఖ్యంగా పళ్ల రసాలకి ఆర్గానిక్‌ పళ్లే శరణ్యం. ఎందుకంటే పళ్లరసాలు త్వరగా జీర్ణమై మన శరీరంలో కలిసిపోతాయి. ఆ పళ్లరసం పెస్టిసైడ్స్‌, ఫంగిసైడ్స్‌ వేసి, రసాయనిక ఎరువులు వాడి పండించిన పళ్లనుంచి తయారు చేసినదైతే… పళ్లరసం తీసుకున్న వెంటనే విష పదార్థాలు నేరుగా మన శరీరంలో కలిసిపోతాయి. దానివల్ల అప్పటికప్పుడు ఆరోగ్యం పాడు కావడంతో పాటు.. భవిష్యత్తులో క్యాన్సర్‌ వంటి ప్రమాదకర జబ్బుల బారిన పడే అవకాశం ఉంది.

మరి ఏవి సహజ పద్ధతుల్లో పండించినవి? ఏవి పురుగు మందులు, రసాయనిక ఎరువులు వేసి పండించినవి? ఏవి జన్యుమార్పిడి ద్వారా పండించినవి?… అని తెలుసుకోవాలంటే పళ్ళు, కాయగూరలపై వేసే లేబుల్స్‌ను జాగ్రత్తగా గమనించాలి.

► ఆపిల్‌కున్న లేబుల్‌పై నాలుగు అంకెలు ఉండి, మొదటి అంకె మూడు లేదా నాలుగు ఉంటే రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడి పండించిన పంట.

► లేబుల్‌పై అయిదు అంకెలు ఉండి… మొదటి అంకె ఎనిమిది అయితే జన్యుమార్పిడి ద్వారా పండించిన పంట.

► లేబుల్‌పై అయిదు అంకెలు ఉండి… మొదటి అంకె తొమ్మిది ఉన్నట్లయితే అది ఆర్గానిక్‌ పంట.

► ఇక పళ్లపై లేబుల్‌ని పిల్లలు చూసుకోకుండా తినేస్తే గాభరా పడాల్సిన అవసరం లేదు. ఆ లేబుల్‌ కాగితాన్ని తినదగిన పేపర్‌తోనే తయారు చేస్తారు. అంతేకాదు.. ఆ లేబుల్‌ని అతికించడానికి ఉపయోగించే జిగురు సైతం తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాలతోనే తయారవుతుంది.

26/01/2022

Happy Republic day to all

24/01/2022

*కరోనా థర్డ్ వేవ్ గురుంచి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు..*

నేడు కరోనా కొత్త రకం అంటే ఓమిక్రాన్ విస్తరిస్తోంది .

ఇది సోకితే వుండే లక్షణాలు లక్షణాలు.

1).జలుబు
2).గొంతు గరగర ,పొడిదగ్గు,
3).ఒంట్లో కొద్ది పాటినలకడ,
4).ఒకటి రెండు రోజులు జ్వరం,

*చేయాల్సినవి:-*

1.వారం రోజుల పాటు వేడి నీటిని తాగండి . రోజుకు నాలుగు లీటర్ లు - పెద్దలు ; పిలల్లు - రెండు లీటర్లు .

2. వేడి నీటిలో ఉప్పు వేసుకొని గార్గిల్ చెయ్యడం ;

3 .బి, సి , డి విటమిన్ మాత్రలు జింక్ మాత్రలు వారం పాటు తీసుకోవడం .

4 .అల్లం పసుపు కషాయాన్ని రెండు మూడు రోజుల పాటు తీసుకోవడం . { చాలా కొద్దిగా .. టీ తాగినట్టు.. రోజుకు ఒకటి లేదా రెండు సార్లు }

5.షుగర్ వ్యాధి లేని వారు రోజుకు ఒక అరటిపండు , అందరూ పాల కూర , నానపెట్టిన బాదాం - వారం పాటు తీసుకొంటే మంచిది .

6.ఎందుకైనా మంచిది - పల్స్ ఆక్సీ మీటర్ లో ఆక్సిజన్ చూసుకోవడం . అది 94 కంటే ఎక్కువ ఉండాలి ..

7.జ్వరం ఉంటే డోలో 650

*ఎప్పుడు ఆసుపత్రికి వెళ్ళాలి!*

1.అయిదు రోజులకు కూడా జ్వరం తగ్గక పొతే ;
2.ఆక్సిజన్ శాతం 92% దాటి ఇంకా కిందకు పడిపోతుంటే .

*అవసరం లేనివి:-*

కరోనా అవునా కాదో తెలుసు కోవడానికి టెస్ట్ చేసుకోవడం "HRCT" అంటే స్కానింగ్ చేయించుకోవడం ,

*కీడు చేసేవి*

భయపడడం , పైన చెప్పినవి కాకుండా ఇతరత్రా మాత్రలు ముఖ్యంగా మాలనుపైరవీర్ మాత్రలు, స్టెరాయిడ్ మాత్రలు ఇంజక్షన్ లు తీసుకోవడం - ఇవి చేస్తే మీ ఆరోగ్యం దారుణంగా దెబ్బతిని పోతుంది .

ఇది వేగంగా విస్తరిస్తుంది . కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఈ లక్షణాలు వున్నాయంటే ఇక అందరికీ సోకినట్టే .. కాబట్టి లక్షణాలు ఉన్న వారు ఒక రూమ్ లో ఐసోలేటె కావడం లాంటివి అక్కర లేదు . గర్భిణీ లు , చంటి పిల్లలు పాలిచ్చే తల్లులు ఇలాంటి వారి గురించి ఎటువంటి భయం వద్దు . ప్రత్యేక జాగ్రత్తలు అవసరం లేదు .

ఇది ఎవరికి డేంజర్? గతం లో ఒక సారి సోకిన వారికి దీనితో ఎలాంటి సమస్య లేదు . వారు వాక్సిన్ వేసుకున్నా వేసుకోకున్నా ఎలాంటి సమస్య లేదు . గతం లో సోకకుండా తప్పించుకున్న వారు వాక్సిన్ వేసుకొని ఉంటే కూడా దీనితో సమస్య లేదు . గతం లో సోకకుండా వాక్సిన్ వేసుకోకుండా ఉన్న వారు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి . వారి సహజ ఇమ్మ్యూనిటి బలహీనంగా ఉంటే వారికి దీనితో సమస్యలు రావొచ్చు .

తెలియని వారికి తెలియచెప్పండి . అనవసరంగా టెస్టింగ్ కేంద్రాలకు వెళ్లి డబ్బు తగలేసుకొంటున్నారు ,కొన్ని మాత్రలు తిని కాన్సర్ ముప్పు తెచ్చుకొంటున్నారు, సెకండ్ వేవ్ తరువాత బ్లాక్ ఫంగస్ వచ్చింది, కారణం స్టెరాయిడ్ లు ఇప్పుడు కాన్సర్ వస్తుంది, కారణం కొన్ని మాత్రలు, ఈ మెసేజ్ ని షేర్ చేయండి .

హ్యాపీ గా వుండండి . ఆలా బతకడానికి మిగతా వారికి కూడా అవహగాహన కల్పించండి . వేల మంది కోరి కోరి డబ్బును , ఆరోగ్యాన్ని నాశనం చేసుకొంటున్నారు.

23/01/2022

నేడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు.🙏

Photos from BBC Cheyutha Foundation's post 07/11/2021

Today we have Donated Rice Bag ,Fruits and Pen Boxes and Pencil Boxes on Anniversary memorial day of My Mother .

15/10/2021

May all your troubles end this Dussehra! Sending you good wishes and peace.

* May God shower blessings on you. Happy Dussehra!

15/08/2021

Happy Independence day to All

08/08/2021

A dream of .
A dream of 130 crore Indians.
A dream fulfilled yet again!
Kudos for winning in athletics…
A massive moment for the Nation
👏🏻👏🏻👏🏻 JAI HIND. 🇮🇳🇮🇳🇮🇳

25/07/2021

నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము,అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడవగువుదు, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది.Ephesians 6:2-3

Honour thy father and mother; which is the first commandment with promise;
That it may be well with thee, and thou mayest live long on the earth.
Ephesians 6:2-3

22/05/2021

ఆనందయ్య తయారు చేసిన కరోనా మందు రాం దేవ్ బాబా కానీ తయారు చేసుంటే ఈ పాటికి విదేశాలకు ఎగుమతి చేసున్ను....

Photos from BBC Cheyutha Foundation's post 21/05/2021

*కృష్ణపట్నం ఆనందయ్య ఆయూర్వేదాన్ని 100% నమ్మొచ్చు.*

*ఒక కెమిస్ట్రీ లెక్చరర్ గారి విశ్లేషణ*

సైన్స్ పేరిట ఆ మందును హేళన చేస్తున్న వారికి ఈ పోస్ట్ అంకితం...

ఒక సైన్స్ విద్యార్థిగా కాదు ఒక కెమిస్ట్రీ లెక్చరర్ గా అందులో ఔషధ రసాయన శాస్త్రం పాఠాలు చెప్పిన బోధకుడిగా చెప్తున్నా...

సైన్స్ పేరిట ఆయూర్వేదాన్ని దుష్ప్రచారం చేయొద్దు.. ?

ఈ ప్రపంచానికి జ్జాన బిక్ష పెట్టింది భారతదేశ బౌద్ద విశ్వవిద్యాలయాలు.ఈ ప్రపంచానికి ఆరోగ్యాన్ని ప్రసాదించిన తక్షశీల, నలంద,వల్లాభీ,విక్రమశీల లాంటి అనేక బౌద్ద విధ్యాలయాలు.

వేల సంవత్సరాల క్రితమే శరీరధర్మ శాస్త్రం,ప్రకృతి శాస్త్రం,ఆయుస్సును ఇచ్చే విజ్జానం ఆయూష్ విజ్ఞానం మీద అనేక పరిశోధనలు చేసి మానవజాతికి ఆరోగ్య బిక్ష పెట్టారు.ఈ రోజు విజ్జానానికి ఊహకు అందని ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి మొక్క మీద పరిశోధనలు చేసి వాటి గూర్చి క్లుప్తంగా మూడు వేల సంవత్సరాల క్రితమే బోధించారు...

మూడువేల సంవత్సరాల క్రితమే బుద్దుడి ఆస్థాన వైద్యుడు జీవకుడు శస్త్ర చికిత్సలు చేశాడు.బ్రైన్ సర్జరీ కూడా చేశాడు.

దేనికి ఏవిడెన్స్ కావాలి ? ఆయుర్వేదానికా...

సరే నీవు నమ్ముతున్న సైన్స్ ఎవిడెన్స్ ఇస్తున్న వైధ్యం గూర్చి నీకు తెలుసా...???

WHO ప్రమాణాలతో తయారు చేస్తున్న ఏ ఒక్క ఔషదానికైనా ఒక్క సైడ్ ఎఫెక్ట్ లేదు అని నిరూపించండి చూద్దాము.

అప్పుడు సైన్స్ అందులో అల్లోపతి సైన్స్ గూర్చి మాట్లాడదాము.

ఈ విషయాలు తర్వాత చూద్దాము.

ప్రస్తుత కృష్ణపట్నం ఆనందయ్య కరోనా రోగులకు ఇస్తున్న ఆయూర్వేదిక్ మందు గూర్చి మాట్లాడదాము.

ఆనందయ్య తయారు చేస్తున్న మందులో ఈ క్రింది మూలికలు వాడుతున్నాడు.

1) అల్లం - అల్లం శ్వాసకోశ వ్యాధుల్లో ఉపయోగపడుతుందని సైన్స్ చెబుతుంది.

2) తాటిబెల్లం - ఆయుర్వేదంలో చేదు లేదా ఘాటైన మొక్కలను ఔషదంగా ఉపయోగెంచడానికి ఆ ఔషదాన్ని తాటిబెల్లంతో తీసుకుంటారు. తాటిబెల్లం రుచికి తియ్యగా ఉన్నా ఆ ఔషదం యొక్క గుణధర్మానికి నష్టం చేయదు కాబట్టి తాటిబెల్లాన్ని వాడతారు.

3) తేనే - తేనె ను ఆయుర్వేదంలో చాలా ఔషదాల్లో వాడతారు. ఔషధాలు డైరెక్ట్ గా రక్తంలో కలవడానికి చాలా రకాల ఔషధాలను తేనెతో కలిపి తీసుకుంటారు. తేనే కు కఫాన్నీ తగ్గించే గుణధర్మం ఉంటుంది.

4 ) నల్లజిలకర్ర - ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది.
అలసట,బలహీనతలను తగ్గిస్తుంది.
నల్లజిలకర్రకు యాంటీ మైక్రోబయాల్ లక్షణం ఉండటంచేత ఉదరంలో ఏర్పడే పురుగులను తొలగించడానికి , కడుపునొప్పికి , విరచనాల్లో మరియు గ్యాస్ట్రిక్ సమస్యల్ని తొలగిస్తుంది.
తేనే,నల్లజీలకర్ర,వెల్లుల్లి కలిపి వాడితే జలుబు , దగ్గు తగ్గుతుంది.
నల్లజిలకర్ర ఇన్సులిన్ ను అదుపులో ఉంచుతుంది కాబట్టి మధుమేహాన్ని తగ్గించడానికి ఉపయోగిస్తారు.
నల్లజిలకర్ర లో క్యాల్షియం, మెగ్నీషియం,పోటాషియం, పాస్ఫరస్,జింక్,మాంగనీస్ కాపర్ మరియు ఐరన్ ఖనిజ పోషకాలు ఉన్నాయి.
నల్లజిలకర్ర లో థైమోక్వీనోన్ ఉండటంచేత ఇది బయోయాక్టీవ్ కాంపోనెంట్ గా ఉపయోగపడుతుంది.
నల్లజిలకర్ర హనీకర , సూక్ష్మజీవుల నుండి మరియు బ్యాక్టీరియా నుండి శరీరాన్ని కాపాడుతుంది.
నల్లజిలకర్ర అధిక కోవ్వును కూడా తగ్గిస్తుంది.

5 ) తోకమిరియాలు ఆయుర్వేదంలో తోకమిరియాలను స్వరపేటిక దోషాలను తొలగించడానికి ఉపయోగిస్తారు మరియు జలుబు,దగ్గు,కండరాల నొప్పికి తోకమిరియాలను వాడతారు.

6) లవంగాలు - లవంగాల్లో ఉండే యాంటీ బ్యాక్టిరియల్ ,యాంటీ వైరల్ లక్షణాలు జలుబు,దగ్గను నివారిస్తుంది. లవంగాల్లోని యుజెనల్ అనే పధార్థానికి శక్తివంతమైన యాంటీ ఇన్ఫామెంటరీ గుణాలు ఉండటంచేత శరీరంలో సైటోకైన్లను తగ్గిస్తుంది కాబట్టి కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. లవంగాలను తలనొప్పిని తగ్గించడానికి ఉపయోగిస్తారు.

7) వేప - వేప మూడువేల సంవత్సరాల నుండి భారతదేశంలో వాడుతున్న ఒక ఔషధ మూలిక.
వేపలో సహజ కీటకనాసిని అజాదిరాచ్టిన్ కలిగి ఉంటుంది.
వేప రోగనిరోధక చర్యను మోరుఘుపరచడానికి, విభిన్న బ్యాక్టీరియా ,వైరస్ , శిలీంధ్రం మరియు పరాన్నజీవుల నుండి శరీరాన్ని రక్షిస్తుంది.
దగ్గు,ఆస్తమా,కఫం వంటి శ్వాసకోశ సమస్యల్లో వేప ఉపయోగపడుతుంది.
వేప తెల్లరక్తకణాలైన లింఫోసైట్స్ ,మోనోసైట్స్ లను గణనీయంగా పెంచుతుంది కాబట్టి శరీరంలో సంక్రమించే సూక్ష్మ జీవులపై పోరాడుతుంది.
వేపను కడుపునొప్పి , అతిసారం,గ్యాస్,అల్సర్ మొదలగు రోగాలను నయం చేయడానికి ఉపయోగిస్తారు.

8) నేరేడు - ఈ మొక్క లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల మూలంగా ఇది దివ్వ ఔషదంగా పనిచేస్తుంది. కాలేయాన్ని శుభ్రపర్చడానికి ఈ ఔషదాన్ని వాడతారు.
జ్వరాన్ని తగ్గించడానికి నేరెడు చెట్టు ను వాడతారు.
ఈ మొక్క బ్యాక్టీరియల్ , వైరల్ ఇన్ఫెక్షన్ ల నుండి కాపాడుతుంది.అధిక రక్తపోటు ను నివారిస్తుంది.

9) మామిడి - కడుపులో పురుగులను తొలగించడానికి,జ్వరాన్ని తగ్గించడానికి, కాలేయసమస్యలో ఈ చెట్టును వాడతారూ.

10) నేల ఉసిరి- వైరల్ జ్వరాలకు తగ్గించడానికి ఈ మొక్కను వాడతారు.

ఉదర మరియు మూత్ర సంబందిత రోగాలను తగ్గించడానికి మరియు హెపటైటిస్ -బి వైరస్ ను నిర్ములించడానికి వాడతారు.

11) కొండపల్లేరు ఆయాసం,ఉబ్బసంను తగ్గించడానికి వాడతారు. క్షయ వ్యాధితో దగ్గు మరియు దెర్బల్యాన్ని తొలగించడానికి ఉపయోగిస్తారు.
ఈ చెట్టు మూత్ర సంబందిత రోగాలను తగ్గించడానికి మరియు సంతోష శక్తిని పెంచడానికి ఉపయోగిస్తారు.

12) కుప్పింటాకు రోగనిరోధక శక్తిని పెంచడానికి, దగ్గు,జలుబు, గొంతునొప్పిని తగ్గించడానికి ఉపయోగిస్తారు. కడుపులో ఉన్న నూలిపురుగులను తొలగించడానికి,కీళ్ల నొప్పులకు ఈ మొక్కను వాడతారు.

13) తెల్లజిల్లేడు పువ్వు

దీర్ఘకాలికంగా ఉన్న అస్తమాను నివారించడానికి ఉపయోగిస్తారు.ఈ మొక్క వేర్లను పాముకుటుకు విరుగుడుగా ఉపయోగిస్తారు.

14) పట్టా,

15) బుడ్డబుడస ఆకు,

16 ) ముళ్ళ వంకాయ, గూర్చి నాకు తెలియదు.

తెలుసుకునే ప్రయత్నం చేస్తాను.

ఆనందయ్య తయారుచేసిన ఔషదం కరోన రోగులకు 100% ఉపయోగపడుతుంది.

Photos from BBC Cheyutha Foundation's post 21/05/2021

నేటినుండి కృష్ణపట్నం లో కరోనా నిబంధనలు పాటిస్తూ బోనిగి ఆనందయ్య మందు పంపిణీ చేయడం జరుగుతుంది...

దేశం చూపు నెల్లూరు వైపే ఉండబోతుంది🔥

*ఒకప్రక్క కరోనా కు సరైన మందులు లేక రెమిడెసివిర్ లాంటి ఇంజెక్షన్లు, అత్యంత ప్రభావవంతమైన స్టెరాయిడ్స్ కూడా పనిచేయక అల్లోపతిలో అనేక వేల మంది అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్పొరేట్ ఆసుపత్రుల్లో సైతం మరణిస్తుంటే...?????????*

*నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలం కృష్ణ పట్నం లో ఉచితంగా ఇస్తున్న ఆయుర్వేద మందు ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలలో కూడా పెను సంచలనం సృష్టిస్తోంది.*

*కరోనా ఏ స్థాయిలో ఉన్నా కేవలం రెండు రోజుల్లోనే నెగెటివ్ రావడం, CT SCAN లో చెస్ట్ సివియారిటీ స్కోర్ 24/25 ఉన్నా కేవలం రెండు రోజుల్లోనే 0 కి రావడం, ఆక్సిజన్ అందక తీవ్ర విషమ పరిస్థితుల్లో ఉన్న వారు కూడా ఒక్కరోజులో లేచి కూర్చోవడం పెను సంచలనం సృష్టిస్తోంది.*

*సోషల్ మీడియాలో గత మూడు రోజులుగా ఈ విషయం పెను దుమారం రేపడంతో కేరళ, కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో అందరి దృష్టి ఒక్కసారి గా కృష్ణపట్నం పైకి మళ్ళింది.*

*ఒక్క పైసా డబ్బు తీసుకోకుండా ఒక్కరోజు లోనే ఎంత తీవ్రమైన కేసైనా, తగ్గిపోవడం, ఎంత తీవ్రంగా కరోనా ఉన్నా కేవలం రెండు రోజుల్లోనే నెగెటివ్ రావడం, కార్పొరేట్ ఆసుపత్రులు చేతులెత్తేసిన కేసులు కూడా రెండు రోజుల్లోనే తగ్గిపోవడం, ఇంత వరకు ఈ వైద్యం పై ఒక్క రిమార్క్ కూడా రాకపోవడంతో వేలాది మంది కృష్ణ పట్నానికి క్యూ కట్టడానికి ప్రధాన కారణం అని తెలుస్తోంది.*

*ఏది ఏమైనప్పటికీ 25 లక్షలు ఖర్చు చేసిన ఏ మాత్రం గ్యారంటీ ఇవ్వని కార్పొరేట్ ఆసుపత్రులు కంటే ఒక్క పైసా తీసుకోకుండా రెండు రోజుల్లోనే నెగెటివ్ తెప్పిస్తామని భరోసా ఇస్తున్న ఆయుర్వేద వైద్యులు మనలాంటి సామాన్యులకు దేవుడితో సమానం అని అనడం అతిశయోక్తి కాదు..

20/05/2021

ఆక్సిజన్ లెవల్స్ 83 నుంచి కేవలం గంటలో 95 పెంచిన కృష్ణపట్నం ఆనందయ్య..

ప్రత్యక్షంగా చూసి ఆశ్చర్యపోయిన MDలు చేసిన డాక్టర్ల బృందం🙏🙏🙏🙏

Photos from BBC Cheyutha Foundation's post 18/05/2021

Arjun Bali : స్నేహితుడి తల్లికి రెమ్ ​డెసివిర్​ ఇచ్చేందుకు బైక్ పై 420కి.మీ ప్రయాణం

కరోనా విజృంభణ నేపథ్యంలో రెమ్ ​డెసివిర్​ ఇంజెక్షన్ కు అధిక ప్రాధాన్యం ఏర్పడిన విషయం తెలిసిందే.

Chandigarh-Alwar కరోనా విజృంభణ నేపథ్యంలో రెమ్ ​డెసివిర్​ ఇంజెక్షన్ కు అధిక ప్రాధాన్యం ఏర్పడిన విషయం తెలిసిందే. కరోనా రోగులకు అందించే ఔషధాల్లో రెమ్ ​డెసివిర్​ ప్రధానమైనది. అయితే కరోనా బారిన పడిన తన స్నేహితుడి తల్లికి రెమ్ డెసివర్ ఇంజెక్షన్ ను అందించేందుకు ఓ యువకుడు బైక్ పై ఏకంగా 420కి.మీ ప్రయాణించాడు.

పంజాబ్ రాష్ట్రంలోని చండీగడ్​కు చెందిన అర్జున్​ బాలీ, రాజస్తాన్ లోని అల్వార్ ​కు చెందిన సాహిల్​ సింగ్​ రాథోడ్​ స్నేహితులు. పంజాబ్​ విశ్వవిద్యాలయంలో వీరిద్దరూ విద్యనభ్యసిస్తున్నారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలు మూసివేయడంతో వీరిద్దరూ తమ తమ స్వస్థలాల్లో ఉంటున్నారు.

అయితే సాహిల్​ తల్లి ఇటీవల కరోనా బారినపడ్డారు. ఆమె ఆక్సిజన్​ స్థాయి 84కు పడిపోయి ఆరోగ్యం క్షీణిస్తున్న తరుణంలో రెమ్​డెసివిర్ ఇంజెక్షన్​ వేయాలని డాక్టర్లు సూచించారు. ఈ నేపథ్యంలో సాహిల్​ దాని​ కోసం అల్వార్​ అంతా తిరిగినా ఫలితం లేకపోయింది. దీంతో మిత్రుడు అర్జున్​కు విషయం చెప్పి రెమ్​డెసివిర్​, ఇతర ఔషధాలను ఏర్పాటు చేయమని కోరాడు.

సాహిల్​ తల్లిని కాపాడటం తన బాధ్యత అని విశ్వసించిన అర్జున్..సమాచారం అందిన తక్షణమే సాహిల్​ సూచించిన ఔషధాలు తీసుకుని ఏమాత్రం ఆలోచించకుండా బైక్​పైనే బయల్దేరాడు. అలా సుమారు 420 కిలోమీటర్లు ప్రయాణించి కేవలం 8 గంటల్లోనే అల్వార్​కు చేరుకున్నాడు.కొవిడ్​పై పోరాటంలో తన సోదరుడి తప్పక విజయం సాధిస్తుందని అర్జున్​ బాలీ ఆశాభావం వ్యక్తం చేశాడు. తన మిత్రుడి కోసం అర్జున్​ చేసిన అసాధారణ సాయం గురించి తెలుసుకుని..అల్వారా జిల్లా బీజేపీ నేత సంజయ్​ నరుకా, కిసాన్​ మోర్చా జిల్లా అధ్యక్షుడు జితేంద్ర రాఠోడ్​ అతణ్ని ప్రశంసించారు. అర్జున్ ​కు పూలమాలలు వేసి, మిఠాయిలు తినిపించి అభినందనలు తెలిపారు.

16/05/2021

Dear Sir Please remove GST FOR OXYGEN AND COVID MEDICAL TREATMENT అత్యవసర ప్రాణౌషధాల పైన కనికరం లేని GST.
నిరుపేదలకు, సంపన్నులకు ఒకటే GST...అత్యంత ధారుణం.
Taraka Rama Rao - KTR

Photos from BBC Cheyutha Foundation's post 15/05/2021

*సోనూసూద్ సహాయం పొందిన ఇండియన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ !!!*

కరోనా సమయంలో అవసరం రాగానే సోనూసూద్ వైపు చూస్తున్నారు ప్రజలు.. సాధారణ పౌరులే కాదు.. సెలబ్రిటీలు సైతం సోనూసూద్ ద్వారా సాయం పొందుతున్నారు. ఇటీవల సురేష్ రైనా సైతం సోనూసూద్ నుంచి సాయం అందుకోగా లేటెస్ట్‌గా మరో ఇండియన్ క్రికెటర్‌కు సైతం అడగ్గానే సాయం చేశాడు సోనూసూద్.

ఫస్ట్ వేవ్ సమయంలో వలసకార్మికులను సొంత ఊళ్లకు పంపడానికి స్పెషల్‌గా రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేసి సాయం చేసిన సోనూసూద్.. సెకండ్ వేవ్ సమయంలో బెడ్, ఆక్సిజన్, ప్లాస్మా, ఇంజెక్షన్.. ఇలా ప్రతీ విషయంలో సాయం చేసి నయా మెస్సయ్యగా మారిపోయారు.

ఈ క్రమంలోనే టీమిండియా మాజీ క్రికెటర్, స్పిన్నర్ హర్భజన్ సింగ్ తనకు తెలిసినవారికి ఒకరికి రెండిసివర్ ఇంజెక్షన్ కావాలని దండం పెడుతూ సహాయం కోరగా.. సోనూసూద్‌ను అడగాలంటూ ఫాలోవర్స్ ట్యాగ్ చేశారు. వెంటనే స్పందించిన సోనూసూద్.. తప్పకుండా సహాయం అందుతుందంటూ భరోసా ఇచ్చేశాడు.

కర్ణాటకలో అవసరమైన వ్యక్తులకు ఇంజెక్షన్ అందుతుంది అని చెప్పగా.. హర్బజన్ ధన్యవాదాలు సోదరా.. దేవుడు ఆశీస్సులతో మీరు బాగుండాలి అని ఆశీర్వదించారు.

14/05/2021

to all

Telephone

Website