basheerahmed_iuml

basheerahmed_iuml

president Indian Union Muslim League party Andhra Pradesh and High Court Advocate

28/01/2024

==

జహంగీర్ తల్లి - జోదాబాయ్, రాజ్ పుత్ హిందూ
షాజహాన్ తల్లి - మానవతిబాయ్, రాజ్ పుత్ హిందూ
అలంగీర్ ఈఈ తల్లి - అనూప్ బాయి, హిందూ
షా ఆలమ్ ఈఈ తల్లి - బిలాల్ కునార్, హిందూ
బహదూర్ షా ఈఈ తల్లి - లాల్ బాయ్, హిందూ

ముస్లిం/మొఘలాయుల పాలన అంత కాలం నిర్విరామంగా కొనసగడానికి ఇదే అసలు కారణం..మనకు మన ఆడపడుసు తరఫున అన్నీ అందుతున్నాయ్..ఇంక ఏం కావాలనుకున్న సామంత రాజ్ పుత్రులు మొఘలాయీలకు తమ పూర్తి సహకారం అందించారని చెరిత్ర చెబుతుంది.

ఇంకా నాకు తెలిసి హుమయూన్ భార్య, ఇంకా అక్బర్ తల్లి కూడా రాజ్ పుత్ స్త్రీనే..ఇంకా మరో విషయం ఏంటంటే శివాజీని ముప్ప తిప్పలు పెట్టిన మొఘల్ సైన్యాలకు ఆధిపత్యం వహించిన సేనానులందరూ..రాజ్‌పుత్ హిందూవులే..

కానీ శివాజీ సైన్యాధికారుల్లో,ఆయనకు విజయాలనందించిన వారిలో ఎక్కువ మంది ముసల్మానులే..శివాజీని అవమానించిన పండితులంతా హిందూవులే/బ్రహ్మణ పీష్వాల పూర్వీకులే.చరిత్రను చదవకుండా..ఇప్పటి ప్రచారాలను వాట్సాప్ ల్లో చూస్తూ..రెచ్చగోక్కుంటూ..దేశాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్న యువతరాన్ని చూస్తే జాలేస్తుంది.

-->>తిక్త👁

26/01/2024

*అద్భుతమైన లైఫ్ ఖచ్చితంగా ఇలా సాధ్యం!*

ఈ క్షణం మీరెలా ఫీలవుతున్నారు? అద్భుతంగానా, ఆనందం గాన
డిజప్పాయింటెడ్‌ గానా,
బోర్‌గానా, కోపం గానా
చిరాకు గానా…?

ఒక్కసారి అనలైజ్ చేసుకోండి. ఖచ్చితంగా మన లైఫ్‌ని డిసైడ్ చేసే అతి పెద్ద ఫేక్టర్ ఇది.

బ్రెయిన్‌కి పంపించబడాల్సిన instructions చాలాసార్లు తప్పుగా హైజాక్ అవుతుంటాయి. అందుకే మనం ఫెయిల్యూర్డ్ పీపుల్‌గా మిగిలిపోతున్నాం. ఇంకో మాటలో చెప్పాలంటే

*“నెగిటివ్ ప్రోగ్రామింగ్”* చేయబడుతోంది బ్రెయిన్.

*బ్రెయిన్‌కి మంచీ చెడూ కి మధ్య తేడా తెలీదు. మనం ఏది చెయ్యమంటే అది గుడ్డిగా చేస్తుంది.*

చిన్న ఉదాహరణ చెప్పాలంటే, మీరు *“ఈ మధ్య జనాల పేర్లు మర్చిపోతున్నాం” అని రిపీటెడ్‌గా అనుకుంటూ ఉన్నారనుకోండి.. బ్రెయిన్ అలాగే ప్రోగ్రామింగ్ చెయ్యబడుతుంది.*

మీరు గుర్తుంచుకోవాలని ట్రై చేసిన ప్రతీసారీ గుర్తుంచు కోవలసిన పేరుని డెఫినెట్‌గా మర్చిపోయి… మన నెగిటివ్ ప్రోగ్రామింగ్‌ని విజయవంతంగా ప్రాసెస్ చేసి పారేస్తుంది బ్రెయిన్.

మీకు హెల్త్ బాగా లేదని అనుకుంటూ ఉండండి…. ఖచ్చితంగా ఏదో ఒక సమస్య వస్తుంది.

*“బాలేదు బాలేదు” అనుకుంటున్న క్షణం నుండి బ్రెయిన్ వివిధ organs కి ఆదేశాలు జారీచేసి, బాడీ మెటబాలిజాన్ని తారుమారు చేసి ఏదో ఒక discomfort తలెత్తేలా చేసి తీరుతుంది.*

దానికి మనం అప్పజెప్పిన task ఏదైతే ఉందో… “మన హెల్త్ బాలేదని” దాన్ని కంప్లీట్ చెయ్యడమే దాని లక్ష్యం.
————
చాలామంది ఉద్యోగాలు రావట్లేదనో, లైఫ్‌లో తాము ఎందుకూ పనికి రామనో, సంతోషం అంటే ఏమిటో తెలీదనో..

*రకరకాల మెంటల్ ట్రాప్‌లలో ఇరుక్కు పోతుంటారు.* ఇవి రిపీటెడ్ సజెషన్లని బ్రెయిన్‌కి పంపిస్తుంటాయి. దాంతో ఉద్యోగం కోసం ట్రై చేసే ప్రతీ ప్రయత్నంలోనూ ఏదో ఒక లోపం ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది, సంతోషంగా ఉండాలని ఎంత ప్రయత్నించినా చిరాకుగానే ఉండి పోతుంటాం.
————–
ప్రతీ క్షణం మన ఆలోచనల ద్వారానో, నోటితో మాటల ద్వారానో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం. ఆ ఆలోచనలు ప్రోగ్రామింగ్ లాంటివి.

*ఈ ప్రోగ్రామింగ్‌లో పాజిటివ్ ఏటిట్యూడ్ తో సాధించ గలిగితే ఖచ్చితంగా ప్రతీ క్షణం చాలా అద్భుతంగా ఉంటుంది.*

అంటే *మనల్ని మనం blame చేసుకోవడం తగ్గించాలి, ఇతరులు మనల్ని చులకన చేస్తూ మాట్లాడే వాటిని బ్రెయిన్‌కి తీసుకుని కుంగిపోవడం తగ్గించాలి.*

*ఎంత నెగిటివ్ ఎనర్జీ మనం లోపలకు పంప్ చేస్తే అంత నెగిటివ్ output వస్తుంది. సరిగ్గా అలాగే ఎంత పాజిటివ్ ఎనర్జీ పంప్ చేస్తే అంత పాజిటివ్ output వస్తుంది.*

ఇక్కడా మరో చిన్న ఉదాహరణ తీసుకుంటే… ఓ పబ్లిక్ గేదరింగ్‌లో అందరితో కలవలేక ఓ మూలన ఇరుక్కుంటే అందరూ సంతోషంగా ఉన్నట్లు కన్పిస్తారు. మనం ఒంటరిగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అరమరికలు మర్చిపోయి మనుషుల మధ్య దూసుకు పోతే మన సంతోషం ముందూ, కలివిడితనం ముందూ అందరూ సరెండర్ అయిపోతారు.

*లైఫ్‌లో ప్రతీ క్షణం ఏ సిట్యుయేషన్‌ని ఎలా లీడ్ చేయాలన్నది మన చేతిలోనే ఉంటుంది. సో ఎలాంటి ఛాయిస్ తీసుకుంటే లైఫ్ అలా ఉంటుంది.*

*ప్రోగ్రామింగ్ ట్రాప్ అని మరొకటి ఉంటుంది. ఏదైనా సంఘటన జరిగిన వెంటనే దానికి సంబంధించిన పాత జ్ఞాపకాలూ, అనుభవాలూ ఏమైనా మన బ్రెయిన్ డేటాబేస్‌లో ఉన్నాయేమో బ్రెయిన్ చకాచకా స్కాన్ చేస్తుంది.*

ఉదా.కు.. రోజూ మీకు టీ తాగే అలవాటు ఉంటే గతంలో ఎప్పుడో ఓరోజు సాయంత్రం టీ తాగలేదనుకుందాం. బాగా తలనొప్పి వచ్చి ఉంటుంది.

సో ఈరోజు మీరు మళ్లీ టీ తాగలేదనుకుందాం. వాస్తవానికి తలనొప్పి వచ్చే అవకాశం లేకపోయినా..

*బ్రెయిన్ ఒక కండిషన్‌కి ఓ రిజల్ట్‌ని match చేసుకుని ఆ outcome ఎలాగైనా సాధించి పెడుతుంది.*

ఇక్కడ కండిషన్ ఏంటంటే.. టీ తాగలేదు.

రిజల్ట్స్ ఏమిటంటే తలనొప్పి రావాలి.

సో తలనొప్పి వచ్చే ఛాన్స్ లేకపోయినా డేటాబేస్‌లోని పాత రికార్డుల ప్రకారం శరీరంలో బయలాజికల్ మార్పులను సృష్టించి మొత్తానికి తలనొప్పి తెప్పించేస్తుంది.
————
*సో ప్రతీ కండిషన్‌నీ, ప్రతీ అనుభవాన్నీ, ప్రతీ రోజునీ, ప్రతీ క్షణాన్నీ కొత్తగా చూస్తే, కొత్తగా రెస్పాండ్ అవుతూ పోతే బ్రెయిన్ డేటాబేస్‌లోని పాత రికార్డులూ, పనికి మాలిన చేదు జ్ఞాపకాలూ అన్నీ కొట్టుకుపోతాయి. లైఫ్ ఎప్పుడూ కొత్తగా ఉంటుంది.. ఇప్పుడే లైఫ్ మొదలెట్టినంత తాజాగా ఉంటాం.*

జీవితం అందమైనది...అనంతమైంది
ఆనందంగా జీవించుదాం....

24/01/2024

*ఆంగ్ల మాధ్యమం బడులు 2011 నుండి ప్రారంభమైనట్లు*
*వెలువడిన ఒక వ్యాఖ్యకు స్పందనగా!*
------------------------------
*2011 కాదు ! 2010 కి ముందే ఇంగ్లీషుమీడియం మొదలైంది.*

నేను 2010 ఆగస్టులో ప్రకాశం జిల్లా, శీలం వారి పల్లె
ప్రధానోపాధ్యాయునిగా పదవీ విరమణ చేశాను!
ఆసంవత్సరం ప్రారంభంనుండీ
అంటే 2010 జూన్ నుండీ ఆంగ్లమాధ్యమం చదువులు మా ఉన్నత పాఠశాలలో అమలైంది!

నేను 1996-2005 వరకూ ప్రకాశం జిల్లా రావినూతల ఉన్నత పాఠశాలలో పనిచేశాను .

ఆంగ్లమాధ్యమం చదువులే పీడితుల విముక్తికి మార్గం అంటూ మాట్లాడుతూ ఉన్న
ఐ-లయ్య
*చరిత్రను వక్రీకరించడంలో*
*సిధ్ధహస్తుడు!*

తనని ఫ్రెంచి మేధావీ విమర్శకుడూ అయిన వోల్టేరుతో పోల్చుకొంటాడు!
అతనిని పాలకులు హతమార్చేరని
తప్పుగా మాట్లాడుతాడు!
తననీ వోల్టేరులాగా హతమారు
స్తారేమోనని కామెడీ చేస్తాడు!

వోల్టేరు సహజంగానే వృధ్ధాప్యంతో
మరణించేడు!
వోల్టేరుకు ప్రజలలో ఉన్న పలుకుబడి, ప్రపంచంలో టాల్ స్టాయ్ కి
తప్ప ఇంకెవరికీ లేదు!

వోల్టేరు పాలకుల విధానాలను
ఎండగట్టడంలో సిధ్ధ హస్తుడు?
వోల్టేరు పాలకుల ఏజంట్ కానేకాదు!
వోల్టేరుపై ఈగవాలినా ప్రజలు
తిరగబడతారని పాలకులు భయపడేటంత పలుకుబడి గలవాడు!

అతని కాలిగోటికీ సరితూగని వాడు
ఐ -లయ్య!!

శాస్త్ర సాంకేతిక శిఖరాలైన జర్మనీ,
ఇంగ్లండూ, రష్యా, ఇటలీ, ఫ్రాన్సు ,
స్కాండినేవియన్ దేశాలలో
ఏ మాధ్యమంలో చదువుతారో
ఐ-లయ్య జవాబు చెప్పాలి?

ఐన్ స్టీన్ తన సాపేక్ష సిధ్ధాంతం
సభికులకు అర్ధంకానపుడు, తన అభిప్రాయాలను స్పష్టంగా తెలియపరిచేందుకు ఆయన
జర్మన్ భాషనే ఎంచుకోవడం ఐ-లయ్యకు తెలియదా?

అమెరికా వారూ,
యూరోపియన్లూ, ఆఫ్రికా నీగ్రోలపై చేసిన అమానుష హత్యాకాండ,
అమలు చేసిన బానిసత్వంపై ఐలయ్య ఎందుకు నోరు మెదపడు?
అలాగే 10 కోట్లమంది రెడిండియన్లను
చంపినది తెలియనట్లు నటిస్తాడెoదుకు?

నేను రావినూతలలో 9సంవత్సరాలు
ఉపాధ్యాయునిగా పనిచేశా!
ఆ ఊరిలో కూడా 2010 తరువాతే
ఇంగ్లీషు మాధ్యమం మొదలు!
అంతకు ముందు అక్కడి చదువులు కూడా తెలుగు మాధ్యమoలోనే!

అక్కడ తెలుగు మాధ్యమంలో చదివిన వారిలో 700/800 మంది
అమెరికా ఇంగ్లండులలో
ఉపాధి పొందేరు!

ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్నవారే అమెరికా వెళ్ళగలుగుతారు అనే అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి అజ్ఞానానికి నిదర్శనం!

నేను 1996లో రావినూతల వెళ్ళే
సరికే, ప్రతి ఇంటిలో విదేశాలతో మాట్లాడే (ISD) ఫోన్లు ఉండేవి! దాదాపు ప్రతికుటుంబం నుండీ ఒకరు యు.యస్. లో అప్పటికే ఉన్నారు! విదేశాలనుండి కనీసం
₹2000 కోట్లకు పైగా ఆ ఊరిలోకీ
సంపద చేరింది!

ఆసక్తి ఉన్నవారు ఆ ఊరిని
స్వయంగా దర్శించి వాస్తవాలు నిర్ధారించుకోవచ్చు!

ఈనెల 2024 జనవరి14న రావినూతల హైస్కూల్లో చదివిన రెండు సమూహాల (బ్యాచ్ ల) విద్యార్దుల సమ్మేళనాలు జరిగాయి!
మాతృభాషలో చదివిన
ఈరెండు సంవత్సరాల వారిలో 80-90% మంది సాఫ్ట్ వేర్, ఇతర రంగాలలో స్థిరపడ్డారు!

అందుకు వారు మాపై చెప్పలేనంత కృతజ్జత చూయించేరు!

వారు సాధించిన ఆ ఫలితాలకు మూడు ముఖ్యమైన కారణాలు::

1)16 మంది ఉపాధ్యాయులతో అద్భుతంగా నడిచే ప్రాథమిక పాఠశాల!

2) మా ఉన్నత పాఠశాలలో దీక్షతో హృదయపూర్వకంగా చదువుచెప్పే
ఉపాధ్యాయ బృందం!

3) స్కూలులో ఏం జరుగుతోoదో
ప్రతిరోజు తెలుసుకొనే తల్లితండృలూ!

మాతృభాషలో చక్కగా అర్ధంచేసుకొంటూ విద్యార్థుల చదువు సాగటమే వారి విజయానికి అసలు సిసలు కారకం!

రావినూతల హైస్కూల్లో అటెండరు కొడుకూ-కోడలూ లండన్ లో ఉంటున్నారు. ఆ ఊరి వారే!
మా స్కూలులోనే *మాతృభాషలో చదివినవారే!!*

MV Krishnaiah
9441211570
*మొలకలపల్లి వెంకట క్రిష్ణయ్య*
24/01/2024

24/01/2024

** వాల్మీకి రామాయణంలో రాముడు
__డాక్టర్ దేవరాజు మహారాజు.

(దారి దీపం, జనవరి 2024 మాసపత్రిక నుండి)

వాల్మీకి రామాయణంలో రాముడు దేవుడు అనే మాట ఎక్కడా కనిపించదు. రామాయణం అసలు పేరు 'పౌలస్య ముని వ్యధ' లేదా 'సీత చరితం'. ఈ రెండు పేర్లు కాకుండా అందు లోని రాముడి పాత్రకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చి ఆ పాత్రను దేవుడి గా మార్చారు. తర్వాత కాలంలో వచ్చిన రచయితలు కల్పనలు జోడించి, మహిమాన్వితుణ్ణి చేశారు. వాస్తవాలు తెలుసుకోవడం కోసం- వాల్మీకి రామాయణంలోకి తొంగిచూస్తే, అసలు విష యం బయటపడుతుంది! వాల్మీకి రాముణ్ణి దేవుడిగా వర్ణించ లేదు. పైగా సాధారణ మానవుడిగా చిత్రించాడు. వాల్మీకి రామా యణంలో రాముడి మాటల్ని, చేష్టల్ని వాల్మీకి ఎలా రాశాడో, ఆ పాత్రను ఎలా చిత్రించాడో గమనించండి. నిశితంగా ఆలోచించండి. విషయాలు చెక్ చేసుకోండి, అంతేగాని, దయచేసి మనోభావాలు దెబ్బ తీసుకోవద్దు- సీతను వెతుకుతూ రాముడు అరణ్యంలో వెళుతున్నప్పుడు కనిపించిన వృక్షాలతో, జంతువులతో ఇలా మాట్లాడతాడు. సీత ఆచూకీ చెప్పండని బతిమాలుతాడు. వాల్మీకి రామాయణం అరణ్యకాండలోని కొన్ని విషయాలు ఇక్కడ ఉదహరిస్తున్నాను.

• 1.ఓ బిల్వ వృక్షమా! బిల్వ ఫలముల వంటి స్తనములు గల నా ప్రియురాలిని చూచినచో చెప్పు(అరణ్యకాండ 60-13)

• 2.ఓ కుభ వృక్షమా ! నీ కాండము వంటి తొడలు గల సీతను గూర్చి నీకు తప్పక తెలిసి ఉండును (అరణ్యకాండ 60-15)

• 3. ఓ తాళ వృక్షమా! పక్వమైన ఫలముల వంటి స్తనములు గల సీతను చూచితివా? నీకు నాపై దయ ఉన్నచో అందమైన కటి ప్రదేశం గల సీతజాడ తెలుపు (అరణ్యకాండ 60-18)

• 4.ఓ గజమా! నీ తొండము వంటి తొడలు గల సీతను నీవు చూచి ఉండవచ్చు. చెప్పుము (అరణ్య కాండ 60-25)

• 5. మన్మథ పీడితుడైన రాముడు ఓ సీతా! అరటి స్థంభాలతో సమానమైన నీ రెండు తొడలను అరటి ఆమలు కప్పివేయు నట్లు చేసినావు కానీ, అవి నాకు కనబడినవి. వాటిని దాచ లేకపోయినావు (అరణ్య కాండ 62-4)

• 6. గుండ్రటి నా సీత స్తనములు ఎల్లప్పుడు చూచుటకు అందముగా ఉండి ఎర్రని మంచి గంధము పూసుకొనుటకు అలవాటు పడినవి. అట్టి స్తనములు రక్తపు బురద పూయ బడి, కాంతి హీనములై ఉండి యుండును. ఇది సత్యము. (వాల్మీకి రామాయణం : అరణ్యకాండ (63-8)

• 7. బంధువులెవరూ దగ్గర లేని నారు, సీత కూడా లేక పోవు టచే రాత్రులందు నిద్రపట్టక ఆ రాత్రులు చాలా దీర్ఘము లుగా కనబడుచున్నవి (ఆరణ్య కాండ 64-13)

ఇక రాముడి ఆలోచనలస్థాయి గూర్చి చూడండి. సీత కనబడ కుండా పోయిందన్న బాధ గానీ, ఆమె ఎక్కడ ఏ బాధలు పడుతు న్నదో అనే వ్యథ కాని రాముడిలో కనిపించడం లేదు. ఎంత సేపూ ఆమె అవయవాలు మాత్రమే గుర్తు © చేసుకుంటున్నాడు. ఇక్కడ రాముడు ఒక కావ్యంలో సృష్టించబడ్డ పాత్ర. తప్పు ఏదైనా ఉంటే ఆ పాత్రను ఆ విధంగా సృష్టించిన రచయిత అయిన వాల్మీకిది తప్పు. సహచరి అయిన సీత బాధలు అర్థం చేసుకునే స్థాయిలో రాముడి పాత్ర చిత్రణ చేయలేదు. కలిసి గడిపిన రోజులలో కష్ట సుఖాలు కూడా రాముడనే పాత్రకు గుర్తు కు రానీయలేదు. రామాయణం రాయబడ్డ కాలం నాటికి వాల్మికి ఎదగని మానవ ప్రవృత్తిలో ఉన్నవాడే - సున్నిత మైన ప్రేమ భావన, లాలిత్యం, విరహ వేదన వర్ణించ లేకపోయాడు. మనిషి మనిషిని ప్రేమించి నట్లు, మనిషి మనిషిని గౌరవించినట్లు, మనిషి, మనిషితోడు కోసం తపించినట్లు వాల్మీకి రామాయణంలో ఎక్కడైనా కనిపి స్తుందా ? ముడివడి పెనవేసుకుపోయిన రెండు జీవితాల మమ తానురాగాలు, దూరం పెరగడం వల్ల కలిగే లోతైన వెలితి, చెల రేగిన ప్రేమ తుపానులు ఏమైనా కనిపించాయా ? లేదు ఎందుకంటే అది ఎదగని కాలం, ఎదగని మనుషులు, అనాగ రిక ఆటవిక జీవితాలు, స్త్రీ పురుషుల మధ్య ఉండే లైంగిక సంబంధాన్ని అధిగమించి హుందాగా, ప్రేమికు డిగా, జీవిత భాగస్వామిగా చేసిన ఉన్నతమైన ఆలోచనలు ఏవీ ? 1950- 60లలో వెలువడ్డ ఏ పాత బాలివుడ్ సినిమా విరహ గీతం విన్నా
హృదయం ద్రవించిపోతుందే ? వాల్మీకి వర్ణించిన రాముడి బాధ-విరహంలో ఏ పరిపక్వతా లేదే ?

అలాంటి రచనకు ఒక మహా కావ్యమని పేరా ? అందులోని ఎదగని మనస్తత్వమున్న కధా నాయకుడు దేవుడా ? పోనీ మనిషిగా ఆదర్శప్రాయుడా ? అలా ఓ కల్పిత పాత్రకు కోట్లు ఖర్చు చేసి ఆలయం కట్టే వారిది ఎంత విజ్ఞత ? ఒక రకంగా వాల్మీకి, రాముడి పాత్రే నయం! ఎందుకంటే ఆ రచయితా, ఆ పాత్రా వారి కాలానికి సరిపోయే విధంగా ఆలోచించారు. అందు వల్ల వారిస్థాయి అప్పటికి అంతే అని మనం సరి పెట్టుకోవచ్చు. కానీ, ఇప్పుడు అత్యాధునిక యుగంలో జీవిస్తూ, మూడు వేల ఏళ్ళు వెనక్కి వెళ్ళి ఆలోచించే వారిని ఏమందాం? ఈ కాలానికి సరిపడని అనాగరిక మూర్ఖత్వాన్ని బలవంతంగా ప్రచారం చేస్తున్న అవివేకులను ఏమందాం? ఆ నాడు వాల్మీకి ఆలోచనలు స్త్రీ అవయవాల దగ్గరే ఆగిపోయినట్టు నేటి బూర్జువా రాజకీ య నాయకుల రాజకీయాలు అక్కడే ఆగిపోయాయి. స్త్రీ శరీ రాలు నేటి రాజకీయాలకు యుద్ద భూములు ఎందుకు అవుతు న్నాయీ? మణిపూర్ జాతుల మధ్య చిచ్చులేపి, మహిళలను నగ్నంగా ఊరేగించడం, బహిరంగంగా సామూహి కంగా రేప్ చేయడం దేనికి సంకేతం ? సమకాలీన సమాజం ఇలా తగల బడిందంటే తరతరాలుగా ఇలాంటి అశ్లీల ఘట్టాలు, అశ్లీల కావ్యాలు చదివినందు వల్ల కాదంటారా? సంస్కృత సంప్రదా యాల పేరుతో అశ్లీల భావజాలాన్ని వ్యాప్తి చేసినందు వల్ల కాదంటారా? స్త్రీ భోగ వస్తువు కాదు. మనసు, శరీరం, వ్యక్తిత్వం గల ఒక మనిషి అని ఏ పురాణమైనా, ఏ కావ్యమైనా చెప్పిందా? సంస్కృతి అనే ముసుగులో ఈ కాలానికి పనికిరాని భావజాలం ప్రచారం చేస్తారా? తమ స్వార్ధ చింతనతో యువతరాన్ని వెనక్కి నడిపించడమెందుకూ? జై శ్రీరామ్ నినాదాలు నేర్పించి వారి భవిష్యత్ను అంధకారంలోకి తోసెయడమెందుకు ? హిందూ సంప్రదాయం ప్రకారం వివాహితుడైన వాడు ఏ పూజ అయినా భార్యతో కలిసి చేయాలి. భార్యను తన్ని తగిలేసి, అధికారికంగా విడాకులు ఇవ్వకుండా, ఒక మహిళ జీవితాన్ని నాశనం చేసిన ఓ పెద్ద మనిషి ఒంటి లింగం లాగా ప్రతిచోటా, ప్రతి పూజ ఒంటరిగానే చేస్తుంటాడు. దానితో దేశ ప్రజలకు ఏ సందేశం ఇస్తున్నట్టు? - మీరు కూడా మీ భార్యలను తన్ని తగి లేయండి. విడాకులు తీసుకోకండి. దేశాల మీద పడి ప్రజల సొమ్ముతో బలాదూరు తిరుగుతూ ఉండండి. చదువుకోకండి. ఎప్పుడు మాట్లాడినా, మనసులో లేని మాటలు, మంకీ బాత్లో మాట్లా డండి ఆనా? ఆదానీ అంబానీల దగ్గర పెద పాలేరుగా పడి ఉండండనా? ఏం సందేశం ఇస్తున్నట్టూ ? సరే, రామాయణం గురించి చర్చించుకుంటున్నాం కాబట్టి, శ్రీరాముడి భక్తులకు, రామాయణ కావ్యాన్ని చదివే వారికి నేను మరొక రామాయణం చదవమని సూచిస్తాను. అది లివింగ్ రామాయణ (LIVING RAMAYANA) రచయిత అజీజ్ తరువాన. ఇది ఒక పరిశోధ నాత్మక గ్రంథం. కేరళలో ముఖ్యంగా వయనాడ్ ప్రాంతంలో జనం నాలుకల మీద ఉన్న అనేక కథలు సేకరించి, ఈయనగ్రంథస్థం చేశారు. రామాయణం అక్కడే తమ ప్రాంతంలో జరిగిందని అక్కడి జనం గట్టిగా విశ్వసిస్తు న్నారు. పుల్పల్లి దగ్గర ఆశ్రమ్ కొల్లి అనేచోట వాల్మీకి ఆశ్రమం ఉండేదని నమ్ముతున్నారు. అలాగే జడయట్టకవు అనేచోట సీత భూమిలోకి వెళ్లిపోయిందని.. అక్కడ భూమి చీలిపోయినట్టు ఉన్న చోటును చూపిస్తారు. అంతేకాదు, హనుమంతుడి తోక రాసుకుపోయిన మరకను కూడా అక్కడి గ్రామీణులు చూపెడతారు. అలాంటి గుర్తులు మనకిక్కడ భద్రాచలంలోనూ చూపిస్తారు. ప్రతిచోటా స్థల పురాణాలు ఉండడం మనకు కొత్తేమీ కాదు. అంటే వైదిక బ్రాహ్మణాచార్యులు జనాన్ని ఎంతగా ప్రభావితం చేశారన్నది మనం గ్రహించుకోవాలి. అందుకే తరచూ చెపుతుంటాను. బ్రాహ్మణిజాన్ని మోసుకుతిరిగేది ప్రస్తుతం బ్రాహ్మణులు కాదు. బ్రాహ్మణేతరులే ! రచయిత అజీజ్ తరువాన కాలికట్లోని ఫారూఖ్ కాలేజిలో మలయాళ విభాగానికి అధిపతి. కేరళా భాషా ఇనిస్టిట్యూట్ సంపాదకుడిగా, ట్రైబల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్లో అసిస్టెంట్ డెరెక్టర్గా పనిచేశారు. అంబేడ్కర్ నేషనల్ ఎక్స్ లెన్సీ అవార్డు పొందిన వీరి ‘వాయనదన్ రామాయణ' గ్రంథానికి ఇంగ్లీషు అనువాదమే ఈ 'లివింగ్ రామాయణ'. ఈ పుస్తకం ఆన్లైన్లో దొరుకుతుంది. ఇదికాక, మరో ఐదు గ్రంథాలు ఈ రచయిత ప్రకటించారు. కేరళలోని ఆదియ రామాయణం'లో కొన్ని హేతుబద్ధమైన అంశాలున్నాయి. కేరళ, వేనాడు జిల్లా త్రిసెల్లరీలో గల ఆదియ ఆదివాసీ తెగల వారు చెప్పుకునే కథలో కడుపుతో ఉన్న సీతను వదిలేయడాన్ని భరించలేక రాముణ్ణి దూషిస్తూ ప్రశ్నిస్తారు. అలాగే మాతంగ చెట్టీ జాతి వారి కథలో లవకుశుల గురించి భిన్నమైన కథ ఉంది. ఈ కథ ప్రకారం సీతకు ఒక్కడే కొడుకు. ఆమె వాణ్ణి వాల్మీకి దగ్గర ఉంచి, స్నానం కోసం నదీ తీరానికి వెళుతుంది. స్నానం చేసి వచ్చి కొడుకును తీసుకుని మళ్లీ బయటకు వెళు తుంది. వాల్మీకి అది గమనించాడు. తనకు అప్పగించిన పిల్ల వాడు తప్పిపోయాడని అనుకుంటాడు. సీతకు ఏం సమాధానం చెప్పాలో అని భయపడి, కుశ గడ్డి పరకతో ఒక పిల్లవాణ్ణి సృష్టిస్తాడు. వాడే కుశుడవుతాడు, సీతకు పుట్టినవాడు లవుడు, ఆ రకంగా లవకుశులవుతారు. వాల్మీకి సర్ది చెప్పిన మాటలకు సమ్మతించి సీత కుశుణ్ణి కూడా స్వీకరిస్తుంది. మనం ఆలోచిం చాల్సింది కుశగడ్డితో పిల్లవాణ్ణి సృష్టించగలిగిన వాల్మీకి తన దివ్య దృష్టితో లవుడి ఆచూకీ తెలుసుకోలేడా? ఇవన్నీ అభూత కల్పనలు, కట్టు కథలనేది. పురాణ పాత్రలు ఒక్కసారి మానవా తీత శక్తులు ప్రదర్శిస్తాయి. మరోసారి కనీసం మనిషికుండే అవ గాహన లేకుండా వ్యవహరిస్తాయి. ఇండోనేషియా, థాయ్ లాండ్లలో రామాయణం జానపద గీతాలుగా ప్రాచుర్యం పొందింది. 'హికాయత్ సెరిరామ' శ్రీ రామ పతయాని రామా యణం" రామ్ కె లింగ' వంటివి జానపద సాహిత్యంగా గుర్తించ
బడ్డాయి. టిబెట్ లోని రామాయణాన్ని 'వనవాసం' అని పిలుస్తారు. ఇందులో సీత, రావణాసురుడి కుమార్తె అని రాసుకున్నారు. రచయిత అజీజ్ తరువాన ప్రపంచంలోని వివిధ రామాయణాలలోని కథల్లో, పాత్ర చిత్రణల్లో వున్న వైవి ధ్యం గురించి విశ్లేషించాడు. ఇంత వైవిధ్యమున్న రామాయణాన్ని ఒక సృజనాత్మక రచనగా స్వీకరిస్తే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. ఇంత విస్తృతంగా పరిశోధించిన ఈ రచయిత దీన్ని ఒక సామాజికపరమైన కథగానే పరిచయం చేశారు. దేవుడు, భక్తి అనే మాటలు అసలు ఆయన పరిచయంలో ఎక్కడా కనిపిం చవు. ముస్లిం అయిన రచయిత హిందూ పురాణంపై విశేషంగా కృషి చేయడం అభినందించదగ్గ విషయం. పరమత సహనానికి, ప్రజాస్వామ్య విలువలకూ ఒక గొప్ప ఉదాహరణ !!
_____________________________________

24/01/2024

లౌకికత్వమా? మత రాజ్యమా!?
‐--------------------------------------------
-స్రావస్తి దాస్ గుప్త

అనువాదం : రాఘవశర్మ

"భగవంతుడు నన్ను భారత ప్రజల ప్రతినిధిగా నియమించాడు" అని ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన కోసం ఈనెల 12న దీక్ష చేపట్టిన సందర్భంగా అన్నారు.

“భారత రాజకీయాలు ఆచరణలో వేదాంతమే తప్ప మరొకటి కాదు” అని అంబేద్కర్ 1928లో భారత చట్టబద్ద కమిషన్ లో ప్రసంగిస్తూ పేర్కొన్నారు.

"ప్రభుత్వం బలహీనపడినప్పుడు లౌకికత్వం రాజకీయాలకు దూరమౌతుంది.

ఆచరణలో రాజకీయాలు వేదాంతమైనప్పుడు కూడా లౌకికత్వం బలహీననపడుతుంది.

ఈ వేదాంతం నుంచి అణగారిని వర్గాలను కాపాడాలి" అని అంబేద్కర్ మహాశయుడు పిలుపినిచ్చారు.

దేశంలో జరగనున్న 2024 లోక్ సభ ఎన్నికల ముందు సార్వభౌమాధికారం గల భారత లౌకిక దేశంలో, ఈ నెల 22న జరిగిన రామాలయ విగ్రహప్రతిష్టాపనలో ప్రధాని పాల్గొన్న సందర్భంగా "ఆచరణలో వేదాంతం” అన్న అంబేద్కర్ మాటలు దృశ్యమానమవుతున్నాయి.

మూడు దశాబ్దాల క్రితం అయోధ్యలో హిందుత్వవాదులు బాబ్రీ మసీదును కూలదోసిన సందర్భంగా జరిగిన మతఘర్షణల్లో రెండు వేలమందికి పైగా మరణించారు.

మసీదు కూలగొట్టిన చోటే రామమందిర నిర్మాణానికి అధికారిక అనుమతి లేదు.

నిబంధనలు లేకపోయినా, విగ్రహ ప్రతిష్టాపన రోజు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అర్ధరోజో, పూర్తి రో జో సెలవు ప్రకటించాయి.

"లౌకికత్వం మతానికి వ్యతిరేకం కాదు.

వ్యవస్థీకృత మత ఆధిపత్యానికి మాత్రమే వ్యతిరేకం" అని రాజనీతి శాస్త్రవేత్త రాజీవ్ భార్గవ్ 2013లో రాసిన వ్యాసంలో స్పష్టం చేశారు.

'ప్రభుత్వం అన్ని మతాల పట్ల విమర్శనాత్మక గౌరవం, తాత్విక ప్రాపంచిక దృక్పథం, అందరిపట్ల ఒకే దృక్పథం అన్న విధానాన్ని అనుసరించినప్పుడే లౌకిక రాజ్యం సాధ్యమవుతుంది." అని రాస్తారు.

ప్రభుత్వానికి, మతానికి మధ్య 'సూత్రబద్ధమైన దూరం' అస్పష్టంగా ఉన్నప్పుడు, స్వతంత్ర భారత దేశంలో జనవరి 22 నాటి సంఘటన అపూర్వమైన సందర్భమా?

" లౌకికత్వాన్ని దారుణంగా చిదిమేశారు” అని భార్గవ్ 'దవైర్'తో మాట్లాడుతూ అన్నారు.

"ప్రస్తుత సందర్భంలో లౌకికత్వం రంగంలో లేదు.

లౌకికత్వాన్ని వదిలేశారు.

ఏరకమైన నిర్వహణకైనా ఈ సమయం సిద్ధంగా ఉంది.

ఒక్క సారిగా లౌకికత్వాన్ని పక్కన పెట్టేస్తే, లౌకిక రాజ్యానికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం దేనిని తీసుకురానుంది?

ఇక్కడ మూడు అవకాశాలున్నాయి :

మొదటిది దైవ పాలన.

దైవపాలనలో సైద్ధాంతికంగా శంకరాచార్య ప్రధాన మంత్రి అవుతారు.

ఇలా జరగడానికి అవకాశం లేదు.

మత ప్రభుత్వానికి, మతవర్గ నాయకుడికి మధ్య సన్నిహిత సంబంధాలుండడమనేది రెండవ అవకాశం.

ప్రభుత్వాన్ని నడపడంలో దేశాధి నేతకు, మత నాయకుడికి సమాన భాగస్వామ్యం ఉంటుంది.

ఈ రెండు పద్ధతులు ఇక్కడ జరగబోవడం లేదు.

మరిక్కడ ఏం జరగబోతోంది?

ఇక్కడ మూడవ విధానం ప్రకారం తన నిబంధనలు ననుసరించి ప్రభుత్వం మతంతో కలిసిపోతుంది.”

"భారత ప్రజల ప్రతినిధిగా భగవంతుడు నన్ను నియమించాడు” అని ప్రధాని నరేంద్ర మోడీ అనడం “రాజుకు కల్పించిన దైవదత్త అధికారమన్న విషయాన్ని గుర్తు చేస్తోంది” అని భార్గవ్ అంటారు.

"ఎవరో ఒకరు దేవుడిలాగా వ్యవహరిస్తూ తన ద్వారా దైవ సందేశం వెలువడుతోందని, భగవంతుడిచేత ఎంపికై, దైవ స్వరంతో ఈ ప్రాణప్రతిష్టను చేస్తున్నట్టు ప్రకటిస్తారు.

రాజకీయాల ద్వారా మతాన్ని తనలో ఇముడ్చుకోవడం అంటే ఇదే.

మతానికి, రాజకీయాలకు మధ్య ఉన్న రేఖ చెరిగిపోయింది.

ప్రభుత్వ చొరవతో మత కార్యక్రమాలు ఎలా నిర్వహించాలో మతాన్ని శాసించేలా ఉంది.”

మతానికి, ప్రభుత్వానికి మధ్య ఉన్న సరిహద్దు రేఖను చెరిపేస్తున్నారని బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ను ఇండియన్ ఎక్సెస్ ఇంటర్వ్యూలో ప్రశ్నించారు.

" ఈ మహాఉత్సవానికి సదుపాయాలను సమకూరిస్తే, దాన్ని నిర్వహిస్తే సరిహద్దురేఖను చెరిపేయడం కాదు.

రాముడి నిజమైన భక్తుడిగా ప్రధాన మంత్రి అక్కడికి వెళుతున్నారు.

అవసరమైన క్రమశిక్షణను పాటిస్తున్నారు” అని రవిశంకర్ ప్రసాద్ సమాధానం ఇచ్చారు.

రాజ్యాంగ నైతికత అనేది చాలా కీలకంగా మారిందని సెంటర్ ఫర్ స్టడీస్ అఫ్ డెవలప్ మెంట్ సొసైటీస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ హిలాల్ అహ్మద్ అన్నారు.

"ఈ కార్యక్రమాన్ని రెండు భిన్నమైన దృక్పథాల నుంచి చూడవచ్చు.

ఇదొక సాంస్కృతిక కార్యమ్రమని కొందరు వాదిస్తారు.

ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న రాజకీయనాయకులు ప్రభుత్వ అధికార ప్రతినిధులుగా హాజరవడమే కాదు, ఆమోదించిన చట్టపరమైన సాంకేతిక అంశంగా వివరణ ఇస్తున్నారు.

చాలా మంది బీజేపీ నాయకులు ఈ విధమైన వాదనలను తీసుకొస్తున్నారు.

భారతీయ సందర్భంలో గుడికి కానీ, మసీదుకు కానీ, మతపరమైన కార్యక్రమాలకు కానీ డబ్బులు ఇవ్వడమనేది అమోదయోగ్య మవుతోంది.

దీన్ని మరొక దృష్టికోణం నుంచి కూడా చూడవచ్చు.

దీనికి సంబంధించి రాజ్యాంగ నైతికత అనే అలోచన కీలకం కానుంది.

మత విషయాల నుంచి ప్రభుత్వం సూత్రబద్ధమైన దూరాన్ని పాటిస్తుందని అంచనావేస్తున్నాం.

ఇక్కడ రెండు ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

ఆలయ ప్రారంభ కార్యక్రమానికి మత శక్తులను దూరంగా అట్టిపెట్టడం సాధ్యమా?

అసలిది మత కార్యక్రమమా, కాదా?

రెండవ అంశం ఈ ఉత్సవంలో అన్ని మతాల ప్రజలు పాల్గొనేటట్టు చేస్తున్నారా, లేదా?

ఈ దృష్టితో చూసినట్టయితే, భారతీయ దృష్టి నుంచి విలక్షణమైన లౌకికత్వం నుంచి, రాజ్యాంగ నైతికతనుంచి పక్కకు జరిగినట్టవుతుంది.

అయోధ్య కార్యక్రమానికి దూరంగా ఉండాలని 'ఇండియా' కూటమి నిర్ణయించుకుంది.

తమ హిందూ గుర్తింపు కోసం వేరే వేదిక కోసం అన్వేషిస్తోంది.

ఇది బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యక్రమం కనుక హాజరుకాకూడదని కాంగ్రెస్ నిర్ణయించింది.

అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా అస్సాంలోని ఒక గుడిని సందర్శించారు.

బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్కతాలోని కాళికాలయాన్ని దర్శించాక కోల్కతాలో మత సామరస్య ప్రదర్శన నిర్వహించారు.

ఢిల్లీని పాలిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి కేజ్రివాల్ రాజధానిలో మూడు రోజుల రామ్ లీల ను నిర్వహించనుండగా, ఉద్దవ్ థాక్రే వర్గానికి చెందిన శివసేన నాసిక్ లోని కలారాం గుడిలో ప్రార్థనలు చేయాలని చూస్తున్నారు.

రాజకీయాలన్నీ బీజేపీ కేంద్రంగా తిరుగుతుండగా, ఇతర రాజకీయ పార్టీలు అదేదారిని చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అహ్మద్ అంటారు.

“కొన్ని చట్టపరమైన సాంకేతిక అంశాలపై ఆధారపడి అయోధ్య పైన సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.

హిందుత్వవాదులు వాదిస్తున్నట్టు వారికేమీ కట్టబెట్టలేదు.

అయోధ్య తీర్పును మీరు చదివినట్టయితే, న్యాయస్థానం లౌకిక, చట్టపరమైన నియమాలను లేవనెత్తింది.

రామ్ లల్లా విరాజాన్ ప్రతినిధికి భూమినిచ్చింది.

బాబ్రీ మసీదును కూలగొట్టడాన్ని నేరంగా పరిగణించింది.

నూతన మసీదును నిర్మించడానికి అయిదు ఎకరాలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ వివరాల గురించి ఎవరూ మాట్లాడడం లేదు.

హిందుత్వవాదులు ఏదైతే తమదని వాదిస్తున్నారో దాన్ని న్యాయస్థానం అంగీకరించినట్టు భావించడమే కాకుండా, హిందుత్వ రాజకీయాలు అజేయమనే భావనను ఈ రాజకీయాలు కలిగిస్తున్నాయి.

బీజేపీకున్న రామాలయం, హిందుత్వ గుత్తాధిపత్యాన్ని ప్రతిపక్షాలు బద్దలు కొట్టాలనుకుంటున్నాయి.”

“ఈ సంఘటన ఇతర రాజకీయ పార్టీలను సందిగ్ధంలో పడేశాయి" అని సెంటర్ ఫర్ పాలసీ రిసెర్చ్ కు చెందిన రాహుల్ వర్మ అంటారు.

"వాళ్ళక్కడికి వెళితే ఒక సమస్య, వెళ్ళకపోతే ఒక సమస్య.

ఇది అడకత్తెరలో పోకలా తయారైంది.

దీనికి తేలికైన సమాధానం లేదు.

ఇదేమీ వారికి ఉపయోగపడేది కాదు.

దీనిపైన వారు ఆలోచించాలి.

ప్రస్తుతం ఉన్నపరిస్థితిపైన స్పందిస్తున్నారే తప్ప ఇప్పుడు జరుగుతున్న దానిపైన వారి రాజకీయాలేమిటో అలోచించడం లేదు.

తమ ప్రత్యర్థులు సందిగ్ధంలో ఉంటే, అది బీజేపీకి లాభిస్తుంది.

అది ఓట్లను రాలుస్తుందా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది.

దీనిపైన అనుమానమే లేదు, ఈ ప్రశ్నపైన ప్రతిపక్షాలు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది.”

“లౌకిక రాజకీయాలపైన రాజకీయ వర్గాలకు శ్రద్ధపోయింది.” అని 2014 లో అహ్మద్ అంటారు.

"అంటే లౌకికత్వం అసందర్భమైపోయిందనడానికి వీలులేదు.

ప్రజలు వివిధ మార్గాల్లో లౌకికత్వానికి కట్టుబడి ఉన్నారు.

రాజకీయంగా చెప్పాలంటే బీజేపీ 2024 ఎన్నికల కోసం అయోధ్యను వాడుకుంటోంది.

రాజకీయాలకు వచ్చేసరికి రామాలయానికి పరిమితులున్నాయన్న విషయం దానికి తెలియక కాదు.

హిందూ ఓట్ల కోసం తీవ్రమైనపోటీ నెలకొంది.

హిందు నమ్మకాన్ని ఉపయోగించుకోవాలని ప్రతి రాజకీయ పార్టీ భావిస్తోంది.

రాజకీయ ప్రయోజనాలకోసం బీజేపీ మాత్రమే హిందుత్వాన్ని ఉపయోగించుకోవడం లేదు" అని అహ్మద్ అంటారు.

“జనవరి 22 అనేది స్వాతంత్య్రానంతర భారత దేశ చరిత్రను మలుపు తిప్పిన రోజు" అని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం చరిత్ర విభాగపు మాజీ ప్రొఫెసర్ మృదులా ముఖర్జీ అంటారు.

“ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ప్రధానిది ముఖ్యమైన పాత్ర.

ఆయన మత కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ ప్రాణప్రతిష్టను నిర్వహించడం కంటే గుడిని ప్రారంభించడం భిన్నమైనది.

నాకు తెలిసినంతలో భారత రాజ్యాంగం పరిధిలో దీన్ని అనుమతించదగింది కాదు”

"గుడిని నిర్మించడమనేది మత కార్యక్రమాల్లో భాగం. కానీ 'కేవలం రాజకీయప్రయోజనాల కోసమే దీన్ని నిర్వహించారు” అని ముఖర్జీ అంటారు.

రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని వాడుకోవడం అంటే, హిందు మతమైనా, క్రైస్తవం అయినా, ఇస్లాం అయినా అది మతోన్మాదమే అవుతుంది.

'దవైర్' సౌజన్యంతో
నేటి 'మన తెలంగాణ'లో వచ్చిన కథనం

23/01/2024

ఎంతైనా ఉత్సవం చేసుకో...పరవాలేదు... నీ హక్కు...కానీ అబద్దాల ప్రచారం పై విశ్వాసం కట్టుకోకు.

అక్కడ రామాలయం కూల్చి మసీదు కట్టారు అనేది అసత్యం . అక్కడ ఎటువంటి ఆధారాలు లేవు. - సుప్రీమ్ కోర్టు.

మసీదు కింద తవ్వకాల్లో రామాలయ అవశేషాలు బయట పడలేదు. - సుప్రీమ్ కోర్టు.

రామాలయ స్థంబాలు మసీదు కట్టడం కోసం కూడా వాడారు అనేది అసత్యం. వాటికి బయటపడ్డ స్తంభాలకు ఏమీ సంబంధం లేదు. - సుప్రీం కోర్టు.(పేజీ 906&907)


కానీ తమ రాజకీయం కోసం ప్రజల్ని తప్పుడు ప్రచారం తో ఏమార్చి మసీదు కూల్చి రామాలయం కట్టారు. ఇదీ సత్యం.

మసీదు ను కూల్చడం.. మసీదులో బలవంతంగా విగ్రహాలు పెట్టడం అపచారం - సుప్రీం కోర్టు.

స్కంద పురాణం లో ఉన్న శ్లోకాల ఆధారంగా మసీదు ఉన్నదే నిజమయిన జన్మ స్థలం అని సుప్రీమ్ కోర్టు చెప్పింది - కేవలం అసత్యం సుప్రీమ్ కోర్టు అటువంటి విశ్వాసాలను ఆధారంగా పరిగనించలేం ఆని చెప్పింది.

సో అక్కడ కూల్చడం అంటూ జరిగితే అది మసీదును మాత్రమే. కూల్చింది బాబరు కాదు...రాజకీయ నాయకుల వల్ల రెచ్చగొట్ట బడిన కరసేవకులు మాత్రమే.

ఒక సివిల్ టైటిల్ సూట్ లో కంటిన్యూడ్ పోసెషన్ కింద 1857 కు ముందు 1857 నుండి 1949 వరకు ఉన్న విషయాలను పరిగణన లోకీ తీసుకొని హిందువులకు ఈ స్థలం ఇచ్చారు. దానికి వాళ్ళు సాక్ష్యాలను అంగీకరించడం లో కొంత పక్షపాతం చూపారు అనేదానిపై ఆ తీర్పు తీవ్రమైన ఆక్షేపణ కు గురయ్యింది.

సత్యం చెప్పులు తొడిగే లోపల బీజేపీ ఐటీ cell , వాట్సాప్ యూనివర్సిటీ ఫూల్స్ అబద్ధాన్ని లోకం అంతా తిప్పెస్తారు.

23/01/2024

ఓపిక లేని వాళ్ళు లాస్ట్ లైన్స్ చదువుకొని...close చేసుకోండి

నిజమే... ఫైజాబాద్ లో బాబ్రీ మసీదును కూల్చేసి.. రామాలయం నిర్మించినందుకు... అక్షింతలు పంచ వలసిందే...

ప్రభుత్వ కార్యాలయాలకు... ఆసుపత్రులకు సెలవు ఇవ్వాల్సిందే...

కాంగ్రెస్ ఏం చేసింది? భాక్రణంగల్ డ్యాం కట్టినప్పుడు అక్షింతలు ఎందుకు పంచ లేదు .. కాంగ్రెస్ కు బుద్ధి లేదు కాబట్టి బాక్రణంగల్ డ్యాం కట్టింది... అప్పుడే రామాలయం కట్టి ఊరికే ఉంటే సరిపోయేది

కాంగ్రెస్ ఏం చేసింది?

నాగార్జున సాగర్ డ్యాం కట్టినప్పుడు శ్రీశైలం డ్యాం కట్టినప్పుడు అక్షింతలు ఎందుకు పంచలేదు....

కాంగ్రెస్ కు బుద్ధి లేదు కాబట్టి నాగార్జున సాగర్ డ్యాం కట్టింది... డ్యాం లకు బదులు అప్పుడే రామాలయం కట్టి ఊరికే ఉంటే సరిపోయేది.

కాంగ్రెస్ ఏం చేసింది?

1948 లోనే దామోదర్ రివర్ వ్యాలి ప్రాజెక్ట్ కట్టినప్పుడు అక్షింతలు ఎందుకు పంచలేదు...

కాంగ్రెస్ కు బుద్ధి లేదు కాబట్టి దామోదర్ రివర్ వ్యాలీ డ్యాం కట్టింది... అప్పుడే రామాలయం కట్టి ఊరికే ఉంటే సరిపోయేది

కాంగ్రెస్ ఏం చేసింది?

భిలాయ్ బోకారో స్టీల్ ప్లాంట్ లను సోవియట్ యూనియన్ సహాయంతో రూర్కెల స్టీల్ ప్లాంట్ ను జర్మనీ సహాయం తో దుర్గాపుర్ స్టీల్ ప్లాంట్ బ్రిటన్ సహాయంతో కట్టినప్పుడు అక్షింతలు ఎందుకు పంచలేదు..

కాంగ్రెస్ కు బుద్ధి లేదు కాబట్టే ఇన్ని స్టీల్ ప్లాంట్ లు కాబట్టి కట్టింది... దీనికి బదులు అప్పుడే రామాలయం కట్టి ఊరికే ఉంటే సరిపోయేది..

కాంగ్రెస్ ఏం చేసింది?

సైకిల్ మీద రాకెట్లు మోసుకొని పోయి ప్రయోగించిన స్థాయి నుండి PSLV GSLV వరకు అంతరిక్ష పరిశోధన అభివృద్ధి చేసినందుకు అక్షింతలు ఎందుకు
పంచలేదు..

కాంగ్రెస్ కు బుద్ధి లేదు కాబట్టి శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి చేసింది... దీనికి బదులు అప్పుడే రామాలయం కట్టి ఉంటే సరిపోయేది..

కాంగ్రెస్ ఏం చేసింది?

ఉన్నత విద్యా సంస్థలు అయిన IIT 1951 Khargapur) NIT , AIIMS(1956) AFMC(1948) JIPMER NIMHANS NIMS Govt Colleges Schools మొదలుపెట్టినప్పుడు అక్షింతలు పంచలేదు

కాంగ్రెస్ కు బుద్ధి లేదు కాబట్టి ఇవ్వన్నీ చేసింది.. అప్పుడే రామాలయం కట్టి ఉంటే సరిపోయేది.

NIT IIT IIM AIIMS JIPMER లకు బదులు అప్పుడే BHU లో భూత వైద్యం కోర్సులు.. జ్యోతిష్యం కోర్సులు మొదలు పెట్టి ఉంటే సరిపోయేది.. అప్పుడే రామాలయం కట్టి ఉంటే సరిపోయేది...

కాంగ్రెస్ ఏం చేసింది?

ఇంటిగ్రేటెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టీ.. పృథ్వి ఆకాశ్ అగ్ని బ్రహ్మైస్ క్షిపణులు అభివృద్ది చేసి చేసింది... ఇలా రక్షణ రంగాన్ని అభివృద్ధి చేసి...

మా వాడు 56 ఇంచుల ఛాతీ బల ప్రదర్శన కు అవకాశం లేకుండా చేసి కాంగ్రెస్ తప్పు చేసింది
వీటికి బదులు అప్పుడే రామాలయం కట్టి ఉంటే సరిపోయేది...

కాంగ్రెస్ ఏం చేసింది?

LIC NIC OIC HPCL IPCL BPCL ONGC GAIL SAIL NALCO BALCO OIL BSNL MTNL RIL BDL BHEL BEL ECIL MIDHANI.... లాంటి PSU నెలకొల్పి నప్పుడే అక్షింతలు పంచలేదు...

కాంగ్రెస్ ఏం చేసింది?

Pulse Polio Immunisation అనీ కార్యక్రమం చేపట్టి ఇప్పటికీ పోలియో ను తరిమేసింది... మశూచి...TB.. కుష్టు.... ఇలాంటి వ్యాధులన్నీ దేశం నుండి తరిమేసింది..
కానీ అక్షింతలు పంచలేదు....

ఈ రోగాలు లేకుండా చేసి కాంగ్రెస్ తప్పు చేసింది... లేకుంటే ఇప్పుడు అందరం ఫైజాబాద్ వెళ్లి రామాలయం ముందు అడుక్కు తినే అవకాశం లేకుండా చేసింది... కాంగ్రెస్ భారీ తప్పు చేసింది... దాన్ని అస్సలు క్షమించకoడి...

జై శ్రీరామ్

23/01/2024

యువ‌త‌కు ప్రేర‌ణ‌.. రామ్ కే నామ్ !

ఆగస్ట్‌ 20, 2019. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ సోషియాలజీ విభాగంలో ‘రామ్ కే నామ్‌’ (రాముని పేర) డాక్యుమెంటరీ సినిమా ప్రదర్శన జరుగుతోంది. పోలీసులు దూసుకొచ్చారు. పర్మిషన్‌ లేకుండా వేస్తున్నారంటూ ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. పర్మిషన్‌ తీసుకున్నామని విద్యార్థులు చెప్పారు. వారం తిరక్కుండానే కోల్‌కతా ప్రెసిడెన్సీ యూనివర్సిటీలో అదే పరిస్థితి. మొదట సినిమా స్క్రీనింగు కోసం హాలు కేటాయించారు అధికారులు. సినిమా పేరు వినగానే జడుసుకుని, పర్మిషన్‌ క్యాన్సిల్‌ చేశారు. ఎందుకంత భయం? ఇదేమన్నా నిషిద్ధ సినిమానా? కాదే! సుమారు 28 సంవత్సరాల కిందట తీసిన ఈ సినిమా తాజాగా దేశ రాజకీయ, సామాజిక అంశాలపైన పెనుప్రభావాన్ని చూపించగలదన్న భయం పాలకులను వెంటాడుతోంది. అందుకే దీనిని ప్రదర్శించే ప్రతిచోటా ఏదో రూపంలో అంక్షలు ఎదురవుతున్నాయి. అయినా సరే విద్యార్థులు దీని ప్రదర్శనలని ఏర్పాటు చేయడానికి వెనుకాడడం లేదు. ఈ నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీ సినిమా విశేషాలు గమనించ తగ్గవి.....
రామ్‌ కే నామ్‌ అంటే రాముని పేర...అనే సమకాలీన కథాంశంతో 1991లో తీసిన ఈ డాక్యుమెంటరీ సినిమాకు అప్పట్లోనే భారత సెన్సార్‌ బోర్డు సర్టిఫికేట్‌ లభించింది. కోర్ట్‌ ఆదేశం మీద దూరదర్శన్‌ ప్రైమ్‌ టైంలో కూడా ప్రసారం చేశారు. ప్రభుత్వమే ఈ సినిమాకు 1992లో ఉత్తమ పరిశోధనాత్మక డాక్యుమెంటరీగా జాతీయ బహుమతి అందించింది. అదే సంవత్సరం ఫిలిం ఫేర్‌ వారు దీన్ని ‘బెస్ట్‌ డాక్యుమెంటరీ’ అన్నారు. జపాన్‌ యమగతా అంతర్జాతీయ డాక్యుమెంటరీ ఫిలిం ఫెస్టివల్లో సిటిజెన్‌ ప్రైజు, స్విట్జర్లాండ్‌ ఫ్రిబౌర్గ్‌ ఫెస్టివల్‌ ప్రైజు, న్యాన్‌ ఎకుమేనికాల్‌ ప్రైజు - ఇలా ఎన్నెన్నో అవార్డులు గెల్చుకున్న ప్రపంచ ప్రఖ్యాత సినిమాగా నిలిచింది.

• ఆనంద్‌ పట్వర్ధన్‌ దర్శకత్వంల...

భారత డాక్యుమెంటరీ చరిత్రలో పరిచయం
అఖ్ఖర్లేని పేరు ఆనంద్‌ పట్వర్ధన్‌. ప్రభుత్వ న్యూస్‌ రీళ్ళు తప్ప ఇండిపెండెంట్‌ డాక్యుమెంటరీ అంటే ఏమిటో తెలీని మన దేశంలో ఎమర్జెన్సీ కాలంలో జరిగిన అన్యాయాలను రికార్డు చేసింది అతని డాక్యుమెంటరీ ‘ప్రిజనర్స్‌ ఆఫ్‌ కాన్సైన్స్‌’ (1978). ఆ తర్వాత వచ్చిన వాటిలో ముఖ్యమైనవి ‘బొంబాయి హమారీ షెహర్‌’ (1985) ‘ఇన్‌ మెమోరీ ఆఫ్‌ ఫ్రెండ్స్‌’ (1990) పోఖ్రాన్‌ అనంతరం భారత్‌-పాక్‌ దేశాల్లో అణుయుద్ధ ఉన్మాదంపై ‘వార్‌ అండ్‌ పీస్‌’ సినిమాలు తీశాడు. ముంబై అల్లర్లపై రెండు భాగాల సుదీర్ఘమైన ‘ఫాదర్‌, సన్‌ అండ్‌ హోలీవార్‌’ నిర్మించాడు. హేతువాదుల వరుసహత్యలపై, హిందూత్వ ఉగ్రవాదంపై పది భాగాల ‘రీజన్‌’ తీశాడు. ఎవరికైనా అతని సినిమాలు ఉద్గ్రంథం చదివినంత తృప్తినిస్తాయి. ఈ సినిమాల ప్రేరణతోనే ఎందరో యువకులు డాక్యుమెంటరీ సినిమాను పోరాట ఆయుధంగా ఎంచుకున్నారు. అతని సినిమాలకు అవార్డులు ఇచ్చిన ప్రభుత్వాలే డిడి లో ప్రదర్శించడానికి నిరాకరించాయి. ప్రతిసారీ న్యాయపోరాటమే శరణ్యమైంది. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విమర్శిస్తే అద్వానీలకు భలే నచ్చింది కానీ, అద్వానీ రథయాత్రను విమర్శించడం మాత్రం హిందుత్వవాదులకు కంటగింపైంది. ఆ రథయాత్ర కాలం నుంచే మన దేశంపై విరుచుకు పడుతున్న కాషాయోగ్రవాద పెనుముప్పును హెచ్చరిస్తూ వస్తున్నాడు ఆనంద్‌. అప్పటినుంచే సంఘ పరివార్‌ అతని సినిమాల ప్రదర్శనలకు అడ్డుపడుతోంది.

• డాక్యుమెంటరీ నేపథ్య.....

మొఘలుల కాలంలో 1528లో బాబర్‌ సేనానాయకుడు మీర్‌ బాకి అయోధ్యలో ఒక మసీదును నిర్మించి, దానికి బాబర్‌ పేరు పెట్టారు. రామాయణ కథ ప్రకారం అయోధ్య రాముడి జన్మస్థలం. బాబ్రీ మసీదున్న స్థలంలోనే రాముడు పుట్టాడనీ, అక్కడ ఒక రామాలయం ఉండేదనీ, దాన్ని పడగొట్టించి, మసీదు కట్టారనీ ఒక వివాదం బ్రిటీషు కాలం నుండే ఉండేది. అయితే దానికొక సామరస్యమైన పరిష్కారం కూడా గతంలో జరిగింది. హిందువులు రామ్‌ చబుత్రా దగ్గర పూజలు, ముస్లింలు మసీదులో నమాజులు చేసుకునేవారు. కానీ 1949లో మసీదు లోపల రాముడి విగ్రహాలను రహస్యంగా పెట్టారు. చాలా రకాల కోర్టు కేసుల తర్వాత మసీదు ద్వారాలు మూతపడ్డాయి. 1980వ దశకంలో విశ్వ హిందూ పరిషత్‌ రంగం మీదకి రావడంతో రామాలయ నిర్మాణ ప్రచారం ఊపందుకుంది. దీనికి బిజెపి రాజకీయంగా మద్దతు ఇచ్చింది. 1990 సెప్టెంబరులో ఆ పార్టీ నాయకుడు ఎల్‌.కె.అద్వానీ ‘రామ జన్మభూమి’ సాధనకై సారనాథ్‌ నుండి అయోధ్య నగరానికి ఏ.సి.టొయోటా ‘రథయాత్ర’ ప్రారంభించాడు. ఈ యాత్ర పొడుగునా మత కలహాలు జరిగాయి. ఎందరో ప్రాణాలు కోల్పోయారు. అద్వానీని బీహారులో లాలూ ప్రభుత్వం అరెస్టు చేసింది. పెద్ద సంఖ్యలో విహెచ్‌పి వాలంటీర్లు అయోధ్యకు చేరుకుని, మసీదుపై దాడి చేశారు. అక్టోబర్‌ 30 నాటి దాడి సమయంలో ఆర్మీ కాల్పులు జరపలేదు. నవంబర్‌ 2న రెండోసారి మసీదుపై దాడి సమయంలో కరసేవకులకు ప్రభుత్వ పారామిలిటరీ దళాలతో పోరాటం జరిగింది. ఈ సినిమా బాబ్రీ మసీదు కూల్చివేతకు మునుపటి వరకు జరిగిన చరిత్రను నమోదు చేస్తుంది. 1992 డిసెంబర్‌ 6న కరసేవకులు మసీదును కూల్చివేసిన దృశ్యాన్ని సినిమా ఆఖర్లో చూపిస్తారు.

• బాబ్రీ చరిత్రపై దర్శకుడి దృష్టి కోణం ...

రామజన్మభూమి వివాదం పొడుగునా ఇది హిందువుల నమ్మకానికి చెందిన విషయం అని అద్వానీ తన ప్రసంగాలలో నొక్కి చెప్పడం ఈ సినిమాలో చూస్తాము. ‘కోర్టు తీర్పు ఎలా ఉన్నా మేము అక్కడ మందిరం నిర్మించి తీరుతాము’ అని విహెచ్‌పి ముందునుంచే చెబుతోంది. ‘అక్కడ రాముడు జన్మించాడా లేదా అన్నది కోర్టులా నిర్ణయించేది?’ అని ఒక సభలో అద్వానీ సవాలు విసురుతాడు. దీన్నిబట్టి, వీరికి చరిత్రపైనే కాక న్యాయవ్యవస్థపైనా ఎంత గౌరవముందనేది తెలిసిపోతుంది. అయినా సరే సినిమా ఆరంభంలోనే చాలా ఓపికగా బాబ్రీ చరిత్రను వివరించే ప్రయత్నం చేస్తాడు దర్శకుడు. బాబ్రీ నిర్మితమైన 50 ఏళ్ళ తర్వాత తులసీదాసు ‘రామ్‌ చరిత మానస్‌’ని రాశాడు. అక్కడికి కొద్ది సంవత్సరాల క్రితమే రామ మందిరాన్ని కూల్చివేస్తే, అంత పెద్ద రామభక్తుడు ఆ విషయాన్ని తన గ్రంథంలో ఉల్లేఖించే వాడు కదా! అన్నది చాలమంది విశ్లేషకుల అభిప్రాయం. 19వ శతాబ్దం నాటికి అయోధ్య ఎన్నో రామమందిరాలతో నిండిపోయింది. ప్రతి మందిరమూ తనున్నచోటే రాముడు పుట్టాడని చెబుతుంది. ఒకే రాముడు ఎన్నిచోట్ల పుట్టాలి? లేక బలవంతుడు చెప్పినచోటే పుట్టాలా? స్వాతంత్య్ర ఉద్యమకాలంలో బలపడుతున్న హిందూ-ముస్లిం ఐక్యత బ్రిటీషు వారికి కంటగింపుగా ఉంది. అందుకే మందిరం పడగొట్టి, మసీదు కట్టారన్న అపవాదుకు ఆమోదముద్ర వేసి, ప్రచారం చేశారని చెబుతాడు దర్శకుడు. మసీదులో రాముని విగ్రహం ప్రతిష్టించడంలో అప్పటి అయోధ్య జిల్లా మేజిస్ట్రేట్‌ నయ్యర్‌ పాత్రను కూడా విశ్లేషిస్తాడు దర్శకుడు. కలలో రాముడు చెప్పిన ప్రకారమే ‘రామ్‌ లల్లా’ విగ్రహాన్ని మసీదులో పెట్టాననీ, తనతో ఇంకొంత మంది కూడా ఉన్నారనీ, నయ్యర్‌ చెప్పిన మేరకు అలా చేశామనీ మహంత్‌ శాస్త్రి అనే ఆయన చెబుతాడు. ‘మా ప్లాను ప్రకారం చేశాం, నేను ఇంకా ఎక్కువ మాట్లాడితే అరెస్టు కాగలను’ అని కెమెరాకు ముఖం చూపడానికి నిరాకరించిన మరొక వ్యక్తి చెబుతాడు. విగ్రహాలను తొలగిస్తే శాంతి భద్రతల సమస్య వస్తుందన్న సాకు చూపి, విగ్రహాలను అక్కడే ఉండనిచ్చాడు నయ్యర్‌. ఈయన తర్వాతి కాలంలో జనసంఘ్‌ ఎం.పి. అయ్యారని చెబుతారు దర్శకుడు.

• ఎన్నో భిన్నస్వరాలు....

రామ్‌ జన్మభూమి ఆలయం కోసం కోర్టు నియమించిన ప్రధాన పూజారి మహంత్‌ లాల్‌దాస్ ‘విహెచ్‌పికి రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలే ముఖ్యం. అంతేతప్ప విహెచ్‌పి సభ్యులు ఏనాడూ ఒక్క సంతర్పణా చేయలేదు లేదా ఆలయంలో ప్రార్థించనూ లేదు’ అని ఈ సినిమాలోని ఇంటర్వ్యూలో చెబుతాడు. బిజెపి-విహెచ్‌పి రాజకీయ ప్రయోజనాలకు సేవ చేయడానికి ధైర్యంగా నిరాకరించిన ఇతడు తరువాతి కాలంలో హత్యకు గురయ్యాడు. దర్శకుడు ఈ సినిమాను అతనికి అంకితమిచ్చాడు. ప్రస్తుత పరిస్థితికి విరుగుడు ఏమిటి? అని ఒకచోట అతడిని ప్రశ్నిస్తే, రామాయణం నుండి ఒక దోహాను ఉటంకిస్తూ ‘వర్షాలు భారీగా ఉన్నప్పుడు, గడ్డి చాలా ఎత్తుగా పెరుగుతుంది.. సరైన మార్గాన్ని కనుగొనడం కష్టంబీ కాబట్టి తుచ్చులు మాట్లాడేటప్పుడు, నిజం మరుగునపడుతుందిబీ కానీ వర్షాకాలం స్వల్పకాలికం, అది గడిస్తే, ప్రజలు తమ తార్కిక సామర్థ్యాన్ని తిరిగి పొందుతారు’ అని చెబుతాడు. సాధువు అనే వాడు సర్వసంగ పరిత్యాగి కావాలి. కానీ, ఈ సాధువులు సుఖభోగాల కోసం అర్రులు చాస్తున్నారు అని లాల్‌దాస్‌ చెబుతున్నపుడు, ఏ.సి. గదుల్లో కునుకులు తీస్తున్న సాధువులను, సన్‌ గ్లాసెస్‌ ధరించిన సాధువులను, ఏ.సి. కార్ల నుండి దిగుతున్న సాధువులను ప్రముఖంగా చూపుతాడు దర్శకుడు. ‘శిలాన్యాస్‌’ పేర బోలెడు డబ్బు గల్లంతయిన విషయాన్నీ చెప్తాడు లాల్‌దాస్‌. ఇన్‌కమ్‌ టాక్స్‌ అధికారి విశ్వబంధు గుప్తా విహెచ్‌పి విదేశీ డొనేషన్లనూ, ఖాతలనూ తనిఖీ చేసినందుకు రాజకీయ బాధితుడయ్యాడు. ‘ఈ దేశానికి సేవ చేద్దామని అమెరికా నుండి వచ్చాను. నిజాయితీగా పనిచేసినందుకు ఇటువంటి వేదన ప్రతిఫలంగా దొరికితే ఈ దేశంలో మంచివాళ్లు మిగలరు’ అని కళ్ళనీళ్ళ పర్యంతం అవుతాడు. సినిమాలో అత్యంత శక్తివంతమైన క్షణాలలో ఈ దృశ్యం ఒకటి. అయోధ్య వాసులకే కాక, చుట్టుపక్కల గ్రామాల వారికి ఈ వివాదమేమిటో అర్థం కాదు. హిందు-ముస్లింలు చిరకాలంగా సఖ్యంగా ఉండేవారనీ, ఇక్కడ మతకొట్లాటలు జరిగేవి కావనీ చెబుతారు దర్శకుడికి చాలామంది. ముస్లిం రాజులు హిందూ దేవాలయాల కోసం భూములు దానం చేసిన విషయాన్ని చెబుతాడు ఒకాయన. గ్రామాల్లో ‘జై రాంజీకీ!’ అని పలకరించుకునే సంప్రదాయం ఉంది. అలా ముస్లింలు కూడా పలకరిస్తారు. అలానే ముస్లింలకు ‘అస్సాలామాలేకుం’ చెబుతారు హిందువులు కూడా. ఉత్తరప్రదేశ్‌ గ్రామాల్లో ఈ ‘గంగా-జమునీ తెహ్‌జీబ్‌’ (గంగా-యమునా సంస్కృతి) సజీవంగా ఉంది. దానికి విఘాతం కలిగిస్తూ, నేడు రాముడి పేర ‘జై శ్రీరామ’ హత్యల స్థాయికి దిగజార్చారు. యుద్ధానికి సన్నద్ధుడైన రాముడి చిత్రపటంతో ‘జై శ్రీరామ్‌’ అనేది ప్రజలపై యుద్ధ నినాదంలా మలిచారు. ఆ వొరవడి ఆనాటి నుంచే మొదలైందని ఈ సినిమా చెబుతుంది. నిరంతర అబద్ధాల ప్రచారాల పాత్ర ఆనాటి నుండీ సజావుగానే ఉంది. చదువుకున్న మేధావులూ నేడు అభినవ ‘నయ్యర్లు’గా తమ పాత్ర పోషిస్తున్నారు.

• నిమ్న కులాల తార్కికత...

పెట్టుబడికీ, మనువాదానికీ పుట్టిన ఈ అంశంలోని ఔచిత్యాన్ని ప్రశ్నించే సాధారణ గ్రామీణులు, నగర పేదలూ చాలా మందే ఇందులో ఉన్నారు. వారే ఈ సినిమా చూసే వారికి కామన్‌ సెన్స్‌ సరఫరా చేస్తారు. ‘ఆ బ్రాహ్మలకి పంటకోసి చేతికిచ్చేవరకే మేము కావాలి. ఆ పంట వారి చేతికి ముట్టగానే మేము అంటరాని వాళ్ళమైపోతాము’ అని చెబుతుంది ఒక మహిళ. ‘ఒక్క రాముడి జన్మస్థానం కోసం దేశమంతా గలాటా చేస్తున్నారు. కానీ ఈ గడ్డ మీదే పుట్టిన మమ్మల్నందరినీ ఈ నేల నుండి తరిమేస్తారట! ఈ నాయకుల వెనుక పరిగెత్తేవాళ్ళు చాలామంది ఉంటే ఉండొచ్చు. నిజమే! కానీ, నేనెందుకు ఈ నాయాళ్ళ వెంబడి పరుగెత్తాలి?’ అన్న ఆ గ్రామీణ మహిళ ప్రశ్నతో సినిమా ముగుస్తుంది. చివరిగా హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో చివరికి ఈ సినిమా ప్రదర్శన జరిగింది. అదే సమయానికి పెద్ద హాలును ఎబివిపికి కేటాయించారు. ‘రాముడి పేర’ చిన్న హాలే! అయినా సరే కిక్కిరిసిన చిన్న హాలులో 400 మంది నిల్చొని కూడా సినిమా చూశారు. 150 మంది స్థలం దొరక్క వెనుదిరిగారు. వారంతా యూట్యూబ్‌లో చూసుకుంటారు. ప్రెసిడెన్సీలో కూడా ఆగస్టు 30న కిక్కిరిసిన హాలులో ప్రదర్శన జరిగింది. కోల్‌కతా జాదవ్‌పూర్‌ యూనివర్సిటీలో కూడా హెచ్‌ సి యూ విద్యార్థులకు సంఘీభావం తెలుపుతూ ఈ సినిమాను ప్రదర్శించారు. ‘మందిర్‌ వహీ బనాయేంగే’ తరహాలో, ‘సినిమా వహీ దిఖాయేంగే’ అంటూ అధికారులు అడ్డుకున్న చోటనే ప్రదర్శనలు జరిపి, ప్రతిఘటించారు వివిధ నగరాల విద్యార్థులు.

- బాలాజీ, కోల్‌కతా
ఫోన్‌ : 9007755403

Telephone

Website