Smt. Gongala Jaggamma Vruddhashramam - for Brahmins
Oldage home exclusively for Brahmins, located at a serene location on the outskirts of Hyderabad, Te All rooms are provided with wall clocks.
Newly constructed building with Premium rooms available on twin-sharing basis. Total capacity is 24 only(10 rooms on twin sharing and one room with 4 beds). Each room comes with an attached bathroom, ( in 4 bedded room there are two attached bathrooms) and is furnished with cots & beds and separate writing desk and chair for each person. Other amenities include Dhyana Mandiram cm library, dining
కాంగ్రెస్ కు ఓటేస్తే.. మన ఉపాధికి మనమే చెక్ పెట్టినట్లు!!
కాంగ్రెస్ ఉచిత రాజకీయాల ఖర్మ ఇదీ
Subscribe to - https://www.youtube.com/
🎻🌹🙏వాల్మీకి సంస్కృత
శ్రీ రామాయణం...!!
🏹 🚩 🎪 🏹 🚩 🎪
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌹రాయణానుభవం....273 🌹
🌿హనుమ రామకథాగానం చేస్తున్నాడు.....
🌸‘యథా రూపాం యధా వర్ణాం। యథా లక్ష్మీంచ నిశ్చితాం. అశ్రౌషం రాఘవస్యాహం। సేయమాసాదితామయా'
🌿రాముడు చెప్పిన రూపము, రంగు, కాంతిగల సీతాదేవిని నేను చూడగల్గనని చెప్పి హనుమ ఊరకున్నాడు.
🌸శబ్దము వచ్చింది ఎక్కడ నుండి అని సీతాదేవి పైకి, క్రిందికి, ఈ ప్రక్క, ఆ ప్రక్క అన్ని వైపుల చూడసాగింది. మళ్లీ మళ్లీ తిరిగి చూడసాగింది. ఆమె ఆశ్చర్యంతో అన్ని వైపుల జాగ్రత్తగా గమనించింది. హనుమ చెప్పిన రామకథలో తాను రావణునిచే అపహరింపబడేవరకు జరిగిన విషయాలన్ని తనకు తెలిసినవే.
🌿ఈ విషయాలన్ని తెలిసినవారు ఇక్కడ ఎవ్వరు లేరు. ఇన్ని విషయాలు ఉన్నవి ఉన్నట్లుగా చెప్పిన వ్యక్తి ఎవ్వరో తనకు కావలసిన వాడే? ఎవ్వరాతడు?
🌸ఆమె ముఖము పైకెత్తి తాను నిలుచున్న స్థలంపైన ఉండే శింశుపా వృక్షాన్ని గమనించింది. చీకటిలో కాంతి రేఖవలె శింశుపా వృక్షశాఖపై గుబురాకుల మధ్య మెరుస్తుండే హనుమను చూచింది.
🌿హనుమ చెప్పిన రామ వృత్తాంతాన్ని మళ్లీ మళ్లీ నెమరు వేసుకొంటుంది. ఆమె మనస్సు సంతోషంతో ఊయలవలె ఊగిపోసాగింది..🚩🌞🙏
🌹...........సశేషం.........🌹
🌸రచయిత
చక్కెర.తులసీ కృష్ణ గారి సౌజన్యంతో
సేకరణ...💐🙏
🏹 🚩 🎪 🏹 🚩 🎪
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🎻🌹🙏వైశాఖ పురాణం - 21 ,వ అధ్యాయము....!!
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌷పాంచాలరాజు సాయుజ్యము..🌷
🌿నారదుడంబరీషునితో తరువాతి వృత్తాంతము నిట్లు చెప్పసాగెను.
శ్రుతదేవమహాముని శ్రుతకీర్తి మహారాజుతో నిట్లనెను.
🌸పాంచాలరాజు శ్రీహరిని జూచి సంతోషపడినవాడై వెంటనే లేచి శ్రీహరికి నమస్కరించెను.
🌿ఆనంద బాష్పములను విడుచుచుండెను. సర్వజగములను పావనము చేయు గంగానది పుట్టుకకు కారణములగు శ్రీహరి పవిత్ర పాదములను కడిగి ఆ పవిత్ర పాదములను కడిగి ఆ పవిత్రజలమును తనపై జల్లుకొనెను.
🌸విలువైన వస్త్రములు ఆభరణములు, గంధ పుష్పాదులు, పుష్పమాలలు, ధూపములు, అమృతప్రాయములగు నివేదనలు, తన శరీరము, తన ధనము,
🌿 తన సర్వస్వమును శ్రీహరికి సమర్పించెను. ప్రాచీన పురుషుడు నిర్గుణుడు సాటిలేనివాడునగు శ్రీమహావిష్ణువును యిట్లు స్తుతించెను.
🌸నిరంజనం విశ్వసృజామధీశం వందేపరం పద్మభవాదివందితం |
యన్మాయయా తత్త్వవిదుత్తమాజనాః విమోహితావిశ్వసృజామధీశ్వరం || 1
🌿ముహ్యంతిమాయా చరితేషు మూఢా గుణేషు చిత్రం భగవద్విచేష్టితం |
అనీహఏతద్ బహుధైక ఆత్మనా సృజ త్యవత్యత్తిన సజ్జతేప్యధ || 2
🌸సమస్తదేవాసుర సౌఖ్య దుఃఖ ప్రాప్త్యై భవాన్ పూర్ణమనోరథోపి |
తత్రాపికాలే స్వజనాభిగుప్త్యైబిభర్షిసత్త్వం ఖలనిగ్రహాయ || 3
🌿తమోగుణం రాక్షస బంధనాయ రజోగుణం నిర్గుణ విస్వమూర్తే |
దిష్ట్యాదంఘ్రిః ప్రణతాఘనాశన స్తీర్దాస్పదంహృదిధృతః సువిపక్వయోగైః || 4
🌸ఉత్సిక్త భక్త్యుపహృతాశయ జీవభావాః ప్రాపుర్గతింతవ పదస్మృతిమాత్రతోయే |
భవాఖ్యకాలోరగపాశబంధః పునఃపునర్జన్మజరాది దుఃఖైః || 5
🌿భ్రమామి యోనిష్వహమాఖు భక్ష్యవత్ ప్రవృద్ధతర్షస్తవ పాదవిస్మృతేః |
నూనం న దత్తం న చతే కధాశ్రుతా నసాధవో జాతు మయాసిసేవితాః || 6
🌸తేనారి భిర్ద్యస్త పరార్ధ్య లక్ష్మీర్వనం ప్రవిష్టః స్వహరూహ్యగుం స్మరన్ |
స్మతౌ చ తౌమాంసముపేత్య దుఃఖాత్ సంబోధయాం చక్రతురార్త బంధూ || 7
🌿వైశాఖధర్మ్రైః శ్రుతిచోదితైః శుభైః స్వర్గాపవర్గాది పుమర్ధహేతుభిః |
తద్భోధతో హంకృతవాన్ సమస్తాన్ శుభావహాన్ మాధవమాసధర్మాన్ || 8
🌸తస్మాదభూన్మేపరమః ప్రసాదః తేనాఖిలాః సంపద ఊర్జితా ఇమాః |
నాగ్నిర్నసూర్యోన చ చంద్రతారకా నభూర్జలంఖంశ్వసనో ధవాఙ్మనః || 9
🌿ఉపాసితాస్తేపి హరంత్యఘంచిరాద్విపశ్చితో ఘ్నంతి ముహూర్త సేవయా |
యన్మన్యసేత్వంభవితాపి భూరిశఃత్యక్తేషణాన్ త్వద్పదన్యస్తచిత్తాన్ || 10
🌸నమస్స్వతంత్రాయ విచిత్రకర్మణే నమః పరస్మై సదనుగ్రహాయ |
తన్మాయయోమోహితోహం గుణేషు దారార్థరూపేషు భ్రమ్యామ్యనర్ధదృక్ || 11
🌿త్వద్పాద పద్మే సతిమూలనాశనే సమస్త పాపాపహరే సునిర్మలే |
సుఖేచ్ఛయానర్ధ నిదాన భూతైః సుతాత్మదారైర్మమతాభియుక్తః || 12
🌸నక్వాపినిద్రాంలభతే న శర్మప్రవృద్దతర్షః పునరేవతస్మిన్ |
లబ్ద్వాదురాపం నరదేవజన్మత్వం యత్నతః సర్వపుమర్ధహేతుః || 13
🌿పదారవిందం న భజామి దేవ సమ్మూఢ చేతావిషయేషు లాలసః |
కరోమి కర్మాణి సునిష్ఠితః సన్ ప్రవృద్ధతర్షః తదపేక్షయాదద్ || 14
🌸పునశ్చభూయామహమద్యభూయామిత్యేన చింతాశత లోలమానసః |
తదైవ జీవస్య భవేత్కృపావిభో దురంతశక్తేస్తవ విశ్వమూర్తే || 15
🌿సమాగమః స్యాన్మహతాంహి పుంసాం భవాంబుధిర్యేనహి గోష్పదాయతే |
సత్సంగమోదేవయదైవ భూయాత్తర్హీశదేవేత్వయిజాయతేమతిః || 16
🌸సమస్త రాజ్యాపగమహిమన్యేహ్యనుగ్రహం తేమయి జాత మంజసా |
యధార్ధ్యతే బ్రహ్మసురాసురాద్యైః నివృత్త తర్షైరపిహంసయూధైః || 17
🌿ఇతః స్మరామ్యచ్యుతమేవ సాదరం భవాపహం పాదసరోరుహం విభో |
అకించన ప్రార్ధ్యమమందభాగ్యదం నకామయేన్యత్తవ పాదపద్మాత్ || 18
🌸అతోన రాజ్యం నసుతాదికోశం దేహేన శశ్వత్పతతారజోభువా |
భజామినిత్యం తదుపాసితవ్యం పాదారవిందం ముని భిర్విచింత్యం || 19
🌿ప్రసీదదేవేశ జగన్నివాస స్మృతిర్యధాస్యాత్తవ పాదపద్మే |
సక్తిస్సదాగచ్ఛతు దారకోశ పుత్రాత్మచిహ్నేషు గణేషు మే ప్రభో || 20
🌸భూయాన్మనః కృష్ణ పదారవిందయోః వచాంసితే దివ్యకధానువర్ణనే |
నేత్రేమమేతేతన విగ్రహేక్షణే శ్రోత్రేకధాయాం రసనాత్వదర్పితే || 21
🌿ఘ్రూణంచత్వత్పాద సరోజ సౌరభే త్వద్భక్త గంధాది విలేపనే సకృత్ |
స్యాతాంచ హస్తౌ తవమందిరేవిభో సమ్మర్జనాదౌ మమనిత్యదైవ || 22
🌸కామశ్చమే స్యాత్తవసత్కధాయాంబుద్ధిశ్చమే స్యాత్తవచింతనేనిశం |
దినానిమేస్యుస్తవ సత్కధోదయైః ఉద్గీయమానైః మునిభిర్గృహా గతైః || 23
🌿హీనః ప్రసంగస్తవమేనభూయాత్ క్షణం నిమేషార్థ మధాపి విష్ణో |
న పారమేష్ఠ్యం న చ సార్వభౌమం న చాపవర్గం స్పృహయామి విష్ణో || 24
🌸త్వత్పాదసేవాంచ సదైవకామయే ప్రార్ద్యాంశ్రియా బ్రహ్మభవాదిభిః సురైః || 25
🌹🌿🙏అని స్తుతించెను...🙏🌹🎻
🌸పాంచాలరాజు చేసిన యీ స్తుతి అర్ధవంతము శక్తిమంతమునగుటచే దీనికి భావము వ్రాయబడుచున్నది.
🌿 మనమందరమును పాంచాలరాజువలె పూర్వ కర్మననుసరించి ఉన్నదానిని పోగొట్టుకొని గురువు, పెద్దల వలన
🌸తరణోపాయము నెరిగి పాటించిన పాంచాలరాజు వలెనే కష్టములను దాటి సర్వసుఖములనంది పాంచాలరాజువలె భగవంతుని దర్శనమును పొందగోరువారమే కదా!
🌿అందుకని యీ స్తోత్రమునకు భావము చదివినచో వేలాది పాఠకులలో నొకరైన భగవంతుని దర్శనానుగ్రహమును పొందవచ్చునేమోయని తలచి భావమునిచ్చుచున్నాము.
🌸సహృదయతతో భక్తులు దీనిని ఉపయోగించకొనగలరు
వైశాఖ పురాణం 21,వ అధ్యాయము సమాప్తం....🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🎻🌹🙏 చంద్రుని రథం గురించిన వివరాలివి...!!
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌿సూర్యునికి ఉన్నట్లే, చంద్రునికి కూడ గొప్ప ప్రకాశమానమైన ప్రామాణికమయిన రథం ఉంది. మూడు చక్రాలతో - ఉదకగర్భం నూంచి పుట్టిన మల్లెమొగ్గల్లా తెల్లని గుర్రాలను పూంచినరథం చంద్రునిది.
🌸ఈ రథంనకు ఇవి రెండువైపులా చెరో ఐదు ఉన్నాయి. ధ్రువుడీ చంద్రరథాన్ని కూడా అదుపుచేస్తూ, మండలాకారంలో నక్షత్రవీధిలో సంచరింప జేస్తున్నాడు. ఇవి ఇట్లే కల్పాంతం వరకు ఉంటాయి.
🌿సూర్యకిరణాలలాగానే, చంద్రకిరణాలకూ తరుగుదల - పెరుగుదల లున్నాయి. దేవతలచేత పానం చేయబడి క్షీణదశ పొందిన చంద్రబింబాన్ని దీప్తిమంతుడై రవి తృప్తిపరుస్తాడు.
🌸అమావాస్య రోజున 15వ చంద్రకళ పితృదేవతల చేత పానము చేయబడుతుంది.
🌿కృష్ణపక్షంలో ఏ తిథిలో ఎంత త్రాగబడిందో, అంతపుష్ఠి శుక్లపక్షంలో భాస్కరుడు అందజేస్తాడు.
🌸పదిహేను రోజులపాటు ఊండే శుక్లపక్షంలో రోజురోజుకూ చండ్రుడు, సూర్యునినూంచి కాంతిని (పుష్ఠిని) పొందగా, అలా ప్రోగుపడినట్టి 'సుధా' రసమును (చంద్రబింబంలోని అమృతాన్ని) దేవతలు పానం చేస్తూ వుంటారు.
🌿అందువల్లనే అమరులు సుధాహారులు. (సుధకు వెన్నెలలోని అమృతం అని పేరు) ఈ ప్రకారం 33,333 మంది దేవతలు, చంద్రునిలోని అమృతాన్ని పానం చేస్తారు.
🌸అప్పుడు కేవలం రెండుకళలచేత మాత్రం మిగిలి, సూర్యమండలాన ప్రవేశించి 'అమా' అనే కిరణంలో వసించుట చేత కృష్ణపక్షపు 15వ తిథి 'అమావాస్య' అనే పేరు వచ్చింది.
🌿ఆరోజున చంద్రుడు అహోరాత్రాలు నీటిలో వసిస్తాడు. తరువాత తరువులు - లతల లోనికి ప్రవేశిస్తాడు. (చెట్లు - ఔషధమొక్కలలోనికి కూడ) తదుపరి సూర్యునిలోనికి ప్రవేశిస్తాడు.
🌸కనుక అమావాస్య తిథియందు చెట్ల ఆకులను త్రుంచకుడదు. అది బ్రహ్మహత్యా పాతకంతో సమానం. ఈరోజున అపరాహ్ణసమయంలో సౌమ్యులు, బర్హషదులు, అగ్నిష్వాతులు అనే నాలుడుప్రధాన భాగాలనే ముడురకాల పితృదేవతలు చంద్రునిలో మిగిలిఉన్న కళను త్రాగేస్తారు.
🌿ఈ ప్రకారం దేవతల్ని, పితృదేవతల్ని, ఔషధులని పెంపొందించిన కారణంగావ్ మనుజుల్ని తృప్తి చెందిస్తాడు
🌸సూర్యుడు- సూర్య భగవానుడు
తూర్పువైపు తిరిగి ఉండే నవగ్రహాలలో సూర్యుడు మధ్య స్థానంలో ఉంటాడు. రవి అని కూడా పిలవబడే సూర్యుడు సింహరాశికి అధిదేవుడు. సూర్యుడి వాహనం ఏడు గుర్రాలు నడిపే రథం. ఈ ఏడు గుర్రాలు ఇంద్రధనుస్సులోని రంగులు (తెల్లటి కాంతిలోని ఏడురంగులు) మరియు వారంలో ఏడురోజులకు ప్రతీక.
🌿చంద్రుని పుత్రుడు బుధుడు. ఇతని రథం పింగళ వర్ణంలో ఉంటుంది. వాయువేగం గల 8 గుర్రాలు కలిగినది. వాయువు - అగ్ని అనే ద్రవ్యాలతో కూడినది.
🌸 భూమ్మీద జనీంచిన గుర్రాలను పూంచినట్టిది - వరూధము, కర్షము, పతాకము, ఉపాసంగము అనే నాలుగు ప్రధాన భాగాలు కలిగినట్టి రథం శుక్రునిది.
🌿కుజునిది బంగారు రథం. ఎనిమిది పద్మరాగమణులలాగ ఎర్రని గుర్రాలతో శోభాయమానమైనది. ఈ గుర్రాలు అగ్ని ద్వారా జనించాయి.
🌸బృహస్పతి రథానికి ఎనిమిది గుర్రాలున్నాయి. అయితే ఇవి లేతబంగారు రంగుతో ప్రకాశిస్తూ ఉంటాయి. ఈ రథం మీద బృహస్పతి ప్రతిరాశిలోను ఒక్కొక్క సంవత్సరం నివశిస్తాడుl.
🌿శనైశ్చరుని రథం మందగమనం కలది. ఇది శబలవర్ణ గుర్రాలున్న రథం. రాహువు రథం బూడిద వర్ణమ్లో ఉండి, తుమ్మెద రెక్కల్ని పోలిన నలుపురంగు గురాలను పూంచినట్టిది. గ్రహణసమయాలలో మాత్రం తన ఉనికి చాటుతాయి
🌸కేతుగ్రహానిది పొగరంగు రథం. ఈతడి రధాశ్వాలు ఎర్రని రంగులో ఉంటాయి. (లక్కరంగు అని కోందరు)
🌿ఈ తొమ్మిదీ గ్రహ రథాలు. ఇవన్నీ వాయురూపమ్లో ఉండే కట్టుత్రాళ్లతో ధ్రువుని ఆధీనంలో ఉంటాయి. ఇవేకాక నక్షత్రాల - గ్రహాల - సమస్త జ్యోతిర్మండలం పగ్గాలు ధ్రువుని అదుపులో ఉంటాయి.
🌸ఇవి 'ప్రవహము' అనే వాయువు చేత ప్రేరేపించబడి, తాము చలిస్తూ, గానుగను త్రిప్పేరీతిగా ధ్రువుని కూడ చలీంపజేస్తున్నాయి. ధ్రువస్థానానికి మొసలి రూపుధరించిన శ్రీమహావిష్ణువే, (శింశుమారుడు) సహాయకారిగా ఉండి ఈ చారణవిధినంతటినీ ఒక క్రమంలో జరిగేలా చూస్తాడు
🌿ఈ శింశుమార చక్రాన్ని ఏ మనుజుడు దర్శించగలడో, అట్టిమానవుని పాపాలన్నీ పటాపంచలవుతాయి. ఈ శింశుమార చక్రాన్ని అనుసరించి ఎన్ని తారకలుంటే, అన్ని ఏళ్లు దీన్ని దర్శించేవారు జీవిస్తారు.
🌸శింశుమార స్వరూపంలో - ధర్మౌ శిరస్సు. ఒక దౌడ ఉత్తానపాదుడు, రెండో దౌడ యజ్ఞం. హృదయంలో నారాయణుడు. అశ్వినీ దేవతలు పాదాలు, వరుణుడు, సూర్యుడు ఊరుభాగము. మిత్రుడు అపానమార్గం, సంవత్సరం శిశ్నభాగాన్ని ఆశ్రయించి ఉన్నారు.
🌿హతోకను ధ్రువుడు - అగ్ని - కాశ్యపుడు - మహేంద్రుడు ఉన్నారు. ఈ నలుగురూ ఎన్నడూ అస్తమించరు...స్వస్తీ..సేకరణ...🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
నిన్న ఆదివారము నాడు మా ఆశ్రమంలో జరిగిన సంకష్ఠహర గణపతి హోమం
Some interesting facts unknown till now
🎻🌹🙏వాల్మీకి సంస్కృత శ్రీ రామాయణం...!!
🏹 🚩 🎪 🏹 🚩 🎪
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌹రామాయణానుభవం_ 67 🌹
🌿భరతుడు వచ్చాడని,కైకేయి గృహం లో ఉన్నాడని తెలిసి కౌసల్య సుమిత్రలు అక్కడకు చేరారు....
🌸నాయనా! నీ తల్లి క్రూరంగా ప్రవర్తించింది. నీకు రాజ్యం ప్రాప్తించింది. అకంటకంగా ఏలుకో. నా రాముణ్ని అడవులకు పంపేసింది.
🌿త్వరలోనే నన్నూ పంపుతుంది. లేదా నేనూ సుమిత్రా కలిసి ఎలాగూ అగ్నిలో దూకుతాం. దశరథుడు ఉన్నచోటకే పోతాం. నువ్వు మాత్రం ఈ సమృద్ధమైన రాజ్యాన్ని హాయిగా ఏలుకో.
🌸అమ్మా! నాకు ఏమీ తెలీదు.
ఏ పాపమూ ఎరుగను. నన్ను ఎందుకిలా దెప్పిపొడుస్తావు. రాముడంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు. అతడు అడవులపాలు అవ్వడంలో నా ప్రమేయం లేదు. ఉంటే నేను ఘోరనరకానికి పోతాను.
🌿 మహాపాపాత్ముణ్ని అవుతాను
అంటూ భరతుడు చాలా ఆవేశంగా మాట్లాడాడు. రాముడు అరణ్యమునకు పోవుటకు నేనే గనుక సమ్మతించి ఉంటే నన్ను పాప సమూహములు చుట్టుకొనుగాక! నేను నేర్చిన విద్య నశించునుగాక.
🌸 భృత్యునిచేత పనులు చేయించుకొని అతనికి వేతన మీయనివానికి పట్టు దుర్గతి నాకు కలుగుగాక. రాజద్రోహికి సంభవించు పాపము నాకు సంభవించునుగాక.
🌿ప్రజల యొద్ద పన్నులు పుచ్చుకొని ప్రజలను చక్కగా రక్షింపని రాజునకు కలుగు పాపము నాకు కలుగునుగాక. యజ్ఞములు చేయించి బ్రాహ్మణులకు దక్షిణలీయని వానిని పొందు పాపము నన్ను పొందునుగాక.
🌸యుద్ధము నుండి వెనుదిరిగి పారిపోయిన యోధునకు పట్టు దుర్గతి నాకు కలుగునుగాక. చంద్ర సూర్యులకు సరివచ్చు తేజస్సుగల శ్రీరాముడు ప్రభువై సింహాసనమును అలంకరించునప్పుడు సందర్శించు మహాభాగ్యము నాకు కలుగకుండునుగాక,
🌿ఇలా అనేక రకాల శపథాలు పెట్టుకొని చింతిస్తూ మూర్ఛ పోయాడు కౌసల్యకు నమ్మకం కలిగింది.పుత్రకా! నా ప్రాణాలను నిలబెట్టావు.
🌸అదృష్టవశాత్తూ నువ్వు ధర్మం తప్పలేదు. లక్ష్మణుడిలాగే ప్రవర్తిస్తున్నావు. నీకు సద్గతులు లభిస్తాయి
🌿ఈ నలుగురి దుఃఖంతోనూ ఓదార్పులతోనూ రాత్రి గడిచిపోయింది. తెల్లవారింది. వసిష్ఠుడు వచ్చాడు. భరతుణ్ణి లేవదీసి తండ్రికి ఉత్తర క్రియలు జరపమన్నాడు.
🌸 తైలపేటికనుంచి దశరథుడి పార్ధివశరీరాన్ని బైటకు తీసారు. పాలిపోయిన ముఖంతో నిద్రిస్తున్నట్టు ఉన్నాడు. భరతుడు శోకించాడు.
🌿అంతఃపురం దుఃఖించింది. అయోధ్య రోదించింది. ఉత్తరక్రియలు యథావిధిగా జరిగాయి. దశాహం అయ్యింది. మైల వెళ్ళిపోయింది. పన్నెండవ రోజున రాకుమారులిద్దరూ శ్రాద్ధకర్మలు నిర్వహించారు భూరిదానాలు చేసారు.
🌸 పదమూడవరోజు ఉదయాన చితిలో అస్థికలు ఏరుతూ - తండ్రీ! నువ్వు స్వర్గం చేరుకొన్నావు. అన్నయ్యను అడవులకు పంపావు. అనాథను చేసి నన్ను మాత్రం శూన్యంలో వదిలిపెట్టావా ! అని భరతుడు బావురుమన్నాడు.
🌿తండ్రి గుణాలనూ శరీరావయవాలనూ తలచుకుంటూ ఇద్దరూ ఉన్మత్తులై విలపించారు. వసిష్ఠుడు కల్పించుకుని తాత్త్విక ప్రసంగంతో ఓదార్చాడు.
🌸సుఖదు:ఖాలూ జననమరణాలూ వంటి ద్వంద్వాలు ప్రాణికోటికి సహజం” వాటికి విజ్ఞులు దు:ఖించరు - ధైర్యం తెచ్చుకోమని ప్రబోధించాడు.
సుమంత్రుడు శత్రుఘ్నుణ్ని ఓదార్చాడు.
🌿చాలా సేపటికి ఇద్దరూ తేరుకున్నారు. ఎర్రబడిన కళ్ళు
తుడుచుకుంటూ చేయవలసిన కార్యక్రమం యధావిధిగా పూర్తి చేసి అంతఃపురం చేరుకున్నారు...🌞🚩🙏🌹🎻
🌹.........సశేషం.........🌹
Note :
🌸వాల్మీకి మహర్షి
అయోధ్యా కాండ 75 వ సర్గలో
యస్యార్యోఽఅనుమతే గతః
అన్న అరణ్యాలకు వెళ్ళమని నేను అనుమతి ఇచ్చి ఉంటే నాకు ఆ గతి పట్టు గాక అని శపథాలు పెట్టుకొంటాడు.
🌿ఈ విధం గా భరతుని శపథములను వ్యాజ్యము గా వాల్మీకి మనకు ధర్మ బోధ చేస్తున్నాడు.....💐🙏
🌸 రచయిత
చక్కెర. తులసీ కృష్ణ గారి సౌజన్యంతో
సేకరణ...💐🙏
🏹 🚩 🎪 🏹 🚩 🎪
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🎻🌹🙏 మన మహర్షుల చరిత్రలు..
🌹🙏ఈరోజు 63వ రురు మహర్షి గురించి తెలుసుకుందాము...🙏🌹
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
రురు మహర్షి
🌸భృగు మహర్షికి పులోమయందు చ్యవన మహర్షిని కలిగారు .
🌿భృగు సంతతికి చెందిన గొప్ప ఋషి., చవన్య మహర్షి సుకన్య దంపతుల పుత్రుడు ప్రమతి.
🌸ప్రమతి మహాతపస్సంపన్నుడై విరాజిల్లుచుండెను. ఘృతాచి అను అప్సరస అతనిని వలచి జనించిన వారి సుపుత్రుడు రురు..
🌿అతడే రురు మహర్షి. మహా ధర్మాత్ముడు తపశ్శాలి, విద్యావంతుడు, మన్మదోపముడు అయి అలరారుచుండెను.
🌸విశ్వావసుడను గంధర్వరాజు, అప్సరస యగు మేనక, స్థూలకేశుడను మహర్షి ఆశ్రమ ప్రాంతమున విహరిస్తున్న సందర్భంలో వారికి కలిగిన పుత్రికను ఆ ఆశ్రమ ప్రాంతమున విడిచిపెట్టి వెడలిపోయెను.
🌿స్థూలకేశ మహర్షి ఆ బిడ్డను చేరదీసి, ప్రమద్వర అని నామకరణం
చేసి, విద్యాబుద్ధులు నేర్పి తీర్చిదిద్దెను.
🌸రురువు ఒకసారి స్థూలకేశ మహామునిని చూడడానికి వెళ్ళాడు . అక్కడ అందాలరాశి అయిన ప్రమద్వరని చూశాడు .
🌿అంతే! రురు మహర్షి బ్రహ్మచర్యం ఏమయిందో ? (ప్రమద్వరని ఇష్టపడ్డాడు.) ఇంటికి వెళ్ళి తండ్రికి చెప్పాడు .
🌸తండ్రి ప్రమతి పెద్దవాళ్ళని వెంట తీసుకుని స్థూలకేశ మహర్షి దగ్గరికి వెళ్ళి తన కొడుకు రురుడికి ప్రమద్వరనిచ్చి పెళ్ళి చెయ్యమని అడిగాడు .
🌿అందరూ సమ్మతించి రురుడికి ప్రమద్వరకి పెళ్ళి నిశ్చయించినారు . రురు ప్రమద్వారల పెళ్ళికి రెండు రోజులే వ్యవధి వుందనగా..
🌸ప్రమద్వర పువ్వులు కోస్తూ క్రింద పడుకుని వున్న త్రాచుపాముని చూడకుండ తొక్కింది .
🌿అది ప్రమద్వరని కాటేయడం ప్రమద్వర ప్రాణం పోవడం జరిగిపోయింది . రురుడు బాధతో ఒక ఏకాంత ప్రదేశంలో కూర్చుని బాధపడ్తుంటే ఒక దేవదూత వచ్చి మనిషి ప్రాణం పోతే మళ్ళీ రాదు,
🌸అయినా నీకు ఒక ఉపాయం చెప్తాను . నీ ఆయుష్షును సగం ఆమెకిస్తానంటే ఆమెని బ్రతికించవచ్చన్నాడు .
🌿రురుడు సరేనని తన ఆయుష్షులో సగం ప్రమదకిచ్చాడు . వెంటనే ప్రమద్వర లేచింది . అక్కడున్న మునులు , ప్రమతి , స్థూలకేశుడు అందరూ ఎంతో ఆనందించారు .
🌸రురుప్రమద్వరల పెళ్ళి జరిగిపోయింది . ఇద్దరూ అన్యోన్యంగా గృహస్థాశ్రమం నిర్వర్తిస్తున్నారు . రురుడు పాములమీద పగబట్టి కనిపించిన ప్రతి పాముని చంపడం మొదలుపెట్టాడు .
🌿ఒకనాడు రురుడు వనంలో తిరుగుతుండగా డుండుభుడనే పాము కనిపించింది . రురుడు వెంటనే దాన్ని చంపబోయాడు .
🌸ఆ పాము.. మహర్షీ ! నేను నీకు అపకారం చెయ్యలేదు . నేను క్రూరసర్పాన్ని కూడా కాదు . నువ్వు భార్గవ వంశంలో పుట్టావు.
🌿ఇలాంటి పని చెయ్యకూడదని చెప్పాడు డుండుభుడు. రురుడు ఆపాముని చూసి నువ్వు ఎవరు ? నీకు పాము రూపం , మనిషి భాష ఎలా వచ్చాయని అడిగాడు .
🌸రురుడితో నేను పూర్వజన్మలో సహస్రపాదుడనే మహర్షిని . శాపం వల్ల ఇలా పాముగా మారాను . నీ దయవల్ల నిన్ను చూడగానే నాకు శాపవిమోచనం అయిందని చెప్పి మనిషిగా మారి రురుడిని ఆశీర్వదించి, వెళ్ళిపోయాడు డుండుభుడు .
🌿రురు మహర్షి ప్రమద్వరని పెళ్ళిచేసుకున్నాక కూడా తపోదీక్ష , వేదాధ్యయనం ఏదీ వదలకుండా గొప్ప తేజస్సుతో వెలుగుతున్నాడు .
🌸కొన్నాళ్ళకి రురుప్రమద్వరలకి ఒక కొడుకు కలిగాడు . అతడి పేరు శునకుడు .
🌿ఇదండీ రురు మహర్షి గురించి తెలుసుకున్న విశేషాలు రేపు మరో మహర్షి గురించి తెలుసుకుందాము స్వస్తి...🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
హైదరాబాద్ సమీపంలో, కీసరగ్రామానికి 10కిమీ దూరంలో, బొమ్మలరామారంగ్రామ శివార్లలో, మాచే నిర్వహంచబడుతున్న బ్రాహ్మణ వృధ్దాశ్రమం లోఉంటూ, ఆశ్రమ నిర్వహణ బాధ్యతలు చేపట్టటానికి, సేవాభావం గల బ్రాహ్మణులు(ఒంటిగాగాని,/జంటగాకాని) కావాలెను. కారుడ్రైవింగ్ వచ్చి ఉండాలి. అట్టివారికి, వసతిసౌకర్యం, ఉచిత భోజనసౌకర్యంతోబాటు తగినంత నెలవారి వేతనం గూడ ఇవ్వబడును. ఆసక్తి గలవారు -9440054149/9440011614 వాట్సాప్ మెస్సేజ్ చేయగలరు.
ప్రతీ గురువారం ఉదయం శ్రీ దత్తాత్రేయస్వామివారికి నమక చమకాలతో అభిషేకం తదనంతరం అష్టోత్తర పూజ నిర్వహించబడుచున్నది.
ప్రతి నెలా సంకష్టహర చతుర్ధినాటి ప్రదోషకాలంలో చంద్రోదయ వేళ మహాగణపతి, శ్రీలక్ష్మీగణపతి, సంకష్టహరగణపతి తో పాటుగా, నవగ్రహ హోమం నిర్వహించబడుతున్నది.
ప్రతి నెలా సంకష్టహర చతుర్థి నాడు మా వృద్ధాశ్రమం లో జరిగే గణపతి హోమం ఈ నెల, అక్టోబర్ 24 నాడు నిర్విఘ్నంగా జరిగింది. సర్వే జనా సుఖినోభవంతు 🙏🏻.
నేడు మా వృద్ధాశ్రమం లో, శ్రీ దత్తాత్రేయ స్వామి కి అభిషేకం జరిగినది 🙏🏻
కీసరగ్రామీనికి 10 కి.మీ. దూరంలో, బొమ్మలరామారం గ్రామ శివార్లలో, మాచే నడుపబడుతున్న బ్రాహ్మణ వృధ్ధాశ్రమంలో Caretaker గా పనిచేయుటకు, సేవాభావం కల బ్రాహ్మణులు కావలెను. వారికి ఉచిత వసతి, భోజన సౌకర్యంతో పాటు నెలసరి జీతభత్యములు ఇవ్వబడును . Two wheeler ఉన్నవారికి మరియు car driving వచ్చినవారికి preference ఇస్తాము. సంప్రదించవలసిన వారు: గొంగాళ మధుకేశ్వర రావు - 9440054149. దయచేసి వాట్సప్ లో మెస్సేజ్ చేయండి. మేము తిరిగి call చేస్తాము. (Call చేయవద్దని మనవి)
మేము నిర్వహిస్తున్న వృధ్దాశ్రమం నకు, సేవాతత్పరత కలిగిన వంటబ్రాహ్మలు కావలయును. వారికి వసతి భోజనసౌకర్యాలతో పాటు నెలవారీ వేతనము కూడ ఇవ్వబడును. ఆసక్తి గలవారు, 9440054149(గొంగాళ మధుకేశ్వర రావు)/9440011614(గొంగాళ నరసింహం) సంప్రదించగలరు.
ఆశ్రమం లో అడుగు పెట్టిన తొలి గోమాత కి 'మహాలక్ష్మి' అని, దూడకి 'గీత' అని నామకరణం చేయబడినది .
ఆశ్రమ ప్రాంగణం లో గోశాల ప్రారంభం అయింది. మొదటి ఆవు -దూడ ల ప్రవేశము ఏప్రిల్ 18, 2021 నాడు జరిగినది.
ఆశ్రమం లో తెలుగు నూతన సంవత్సర శోభ. అందరికి ప్లవ నామ సంవత్సర శుభాకాంక్షలు 💐💐
బ్రాహ్మణ వృధ్ధాశ్రమము
హైదరాబాదు శివార్లలో గల కీసరగ్రామానికి 10కి.మీ దూరంలో బొమ్మలరామారం గ్రామ సమీపంలో డా. జ.వి.ఆర్.యమ్. సేవాట్రస్టు ఆధ్వర్యంలో శ్రీమతి గొంగాళ జగ్గమ్మవృధ్ధాశ్రమం, సుప్రసిద్ధ సినీవిలక్షణనటుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీ కోట శ్రీనివాసరావు గారి శుభహస్తములతో నవంబరు 21వ తేదీన ప్రారంభించబడినది. చాలా ఆహ్లాదకరమైన పరిసరాలలో,అన్ని సదుపాయలతో, మన బ్రాహ్మణ బంధువులందరకూ అనువైన రీతిలో సుమారు 3500 చ.గ.ల
స్థలంలోనిర్మితమైన ఈ ఆశ్రమంలో 24 మంది వృధ్ధులకు ఆశ్రయం కలదు. ఈ ఆశ్రమంలో ఉన్నవారివద్ద నుండి గదులకుగాని, మిగతా సదుపాయాల నిమిత్తంగగాని ఎటువంటి రుసుము ఉండదు. కేవలం వారి భోజన ఖర్చులు, ఆశ్రమ నిర్వహణ ఖర్చులు మాత్రం, తీసుకోవడం జరుగుతుంది.
ఈ సదుపాయం కావలసినవారు సంప్రదించలసిన వారి వివరాలు - శ్రీ నరసింహంగారు 9440011614/ శ్రీ మధుకేశ్వరరావు 9440054149.
సూర్యోదయ కిరణాలు
Our very first resident members of the Aashramam Smt and Sri. B.J. Rao garu celebrated their golden jubilee anniversary soon after joining the aashramam. They performed Sri Satyanarayana Swamy vratam in the aashramam’s Dhyana mandiram on Feb 6 2021. We welcome the new residents and wish the elderly couple peaceful and happy days ahead at the aashramam.
This oldage home has been newly constructed in a land taken exclusively for the purpose of the Vruddhashramam. It was inaugurated in the month of November 2020, and is managed by Dr. GVRM Seva Trust. All the furnishings in the premises have been purchased brand new. This was made possible by the generous contribution of immediate and extended family members of GONGALA family.
!!!ACCOMMODATION FREE!!!
Please refer to the About section of the page for more details on features and Amenities.