V.C. Sajjanar, IPS

V.C. Sajjanar, IPS

Personal Account | 1996 Batch IPS Officer of Telangana Cadre, ADGP | VC & MD TSRTC �

24/01/2024

ప్రజా రవాణా వ్యవస్థలో డ్రైవరన్నలది క్రియాశీల పాత్ర. వారి సేఫ్ డ్రైవింగ్ వల్లే టీఎస్ఆర్టీసీ పయ్యాలు సాఫీగా నడుస్తున్నాయి. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. నిబద్ధత, క్రమ శిక్షణతో పాటు ఓపిక, సహనంతో విధులు నిర్వర్తిస్తూ.. ని దేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతున్న డ్రైవరన్నలకు.. డ్రైవర్స్ డే శుభాకాంక్షలు.

డ్రైవర్స్ డే సందర్బంగా ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 97 డిపోల పరిధిలో ఉన్న డ్రైవ్లర్లను ఘనంగా సన్మానిస్తోంది.

15/01/2024

అందరికీ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు!

ఈ మకర సంక్రాంతి మీ జీవితంలో అందమైన క్షణాలను అందించాలని, పతంగుల మాదిరిగానే మీ కోరికలు, కలలు కొత్త శిఖరాలకు చేరుకోవాలని ఆశిస్తున్నాను.

TSRTC

14/01/2024

భోగి పండుగ శుభాకాంక్షలు!

ఈ భోగభాగ్యాల భోగి.. మీ జీవితంలో కొత్త వెలుగు నింపాలని, మీకు సంతోషాన్ని, అదృష్టాన్ని తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను. చెడును దహించే భోగి మంటలతో మీ కష్టాలు, బాధలన్ని పోవాలని కోరుకుంటున్నారు. ఈ శుభదినాన అనారోగ్యకరమైన చెడు అలవాట్లను, దుర్గుణాలను భోగి మంటల్లో వేసి మసి చేయండి. పాతదాన్ని మరిచి భవిష్యత్తు వైపునకు పయనించండి.

06/01/2024

It was a very gratifying and positive vibe as a result of free transport for women passengers in Telangana under the Maha Laxmi Scheme.

It is a great honor for TSRTC to contribute to women's health and well-being.

31/12/2023

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

Photos from V.C. Sajjanar, IPS's post 30/12/2023

ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు అత్యాధునిక హంగులతో అందుబాటులోకి తెచ్చిన కొత్త ఎక్స్ ప్రెస్, లహరి స్లీపర్ కమ్ సీటర్, రాజధాని ఏసీ బస్సుల ప్రారంభోత్సవం హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్‌ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి గారు, హైదరాబాద్ సీపీ శ్రీనివాస రెడ్డి గారు, రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్దా ప్రకాశ్ గారు, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారితో కలిసి ఆయన ‌కొత్త బస్సులను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కొత్త బస్సులో కలిసి వారంతా ప్రయాణించారు.

29/12/2023

హెల్మెట్‌ లేని కారణంగా ఎందరో బైకర్స్‌ దుర్మరణం చెందుతున్నారు. అలా ఎవరూ మరణించకూడదనే ఉద్దేశంతో హెల్మెట్‌లను పంచుతున్నారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం దుబ్బచర్లకు చెందిన డి.రమేశ్‌ కుమార్‌ గారు. గత వారం రోజులుగా 150 హెల్మెట్‌ లను ఆయన పంచారు. వ్యవసాయం చేసుకుంటూనే త‌న సొంత డ‌బ్బుల‌తో హెల్మెట్‌లు కొని.. అవ‌స‌రం ఉన్న వారికి పంపిణీ చేస్తుండటం ఆదర్శనీయం. ఈ సామాజిక సేవా కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు డి.రమేశ్‌ కుమార్‌ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

25/12/2023

Merry Christmas everyone!! 🎄 May this Christmas bring you endless joy and blessings.

అందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు! 🎄ఈ క్రిస్మస్ పండుగ మీ జీవితాల్లో సంతోషాన్ని నింపాలని, మీ ఇంట ఆనందపు కాంతులు వెదజల్లాలని ఆకాంక్షిస్తున్నాను.

23/12/2023

మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి! ఎక్స్‌ ప్రెస్‌ బస్సుల్లో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా వెళ్తున్నట్లు యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి.. సిబ్బందికి సహకరించాలని కోరుతున్నాం. అలాగే, కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపమని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ప్రయాణ సమయం పెరుగుతోంది. ఇక నుంచి ఎక్స్‌ ప్రెస్‌ బస్సులను అనుమతించిన స్టేజీల్లోనే ఆపడం జరుగుతుంది. దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి సహకరించాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది.

Photos from V.C. Sajjanar, IPS's post 16/12/2023

Ullas Trust, Polaris Employees' CSR initiative, hosted its 26th "Can Do" Annual Workshop at Sunadarayya Vignana Kendram Auditorium in Hyderabad. 350 Class 9 students from Government Schools in Hyderabad and Rangareddy received Young Achievers Awards and Scholarships. Special address by Chief Guest Sri VC Sajjanar, IPS, Vice Chairman and MD, TSRTC, inspired young minds. Krishna Yedula, Vice President, Virtusa, honored the event as the guest of honour. 🌟

Photos from V.C. Sajjanar, IPS's post 30/11/2023

My family and I have fulfilled our civic duty by casting our votes in the democratic process. Voting symbolises our control over the future. Encouraging all voters to actively participate in the Telangana Assembly election polling.

ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత పవిత్రమైన ఓటు హక్కును నా కుటుంబ సభ్యులతో కలిసి నేను వినియోగించుకున్నా. మన భవిష్యత్ మన చేతుల్లోనే ఉందనే విషయాన్ని ఓటు హక్కు చాటుతుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లో ఓటర్లందరూ పాల్గొని తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి.

29/11/2023

మన ఓటు.. మన బాధ్యత!

ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టయిన ఓటు హక్కు ఎంతో విలువైంది. దానిని దుర్వినియోగం చేసుకోవద్దు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు ప్రాధాన్యతను తెలుసుకోవడంతో పాటు నలుగురికి తెలియజేయాలి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లో మీరంతా తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలి.

12/11/2023

అందరికీ దీపావళి శుభాకాంక్షలు!

ఈ దీపావళి పర్వదినం సందర్భంగా మీకు సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని కోరుకుంటున్నాను. మీ జీవితాలు శోభాయమానంగా వెలుగొందాలని, ప్రతి ఇంటా ఆనంద కాంతులు విరాజిల్లాలని ఆకాంక్షిస్తున్నాను.

#शुभ_दीपावली

06/11/2023

సెల్‌ ఫోనే లోకం కాదు!

రహదారుల వెంట వెళ్లేటప్పుడు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. అజ్ఞాత వ్యక్తులు ఫాలో అవుతున్నారా... లేదో గమనించాలి. ఫోన్‌ మైకంలో పడి ఏమాత్రం ఏమరుపాటు ఉన్నా ఇలాంటి ఘటనలే జరుగుతాయి.

11/09/2023

మూలమలుపుల వద్ద అతివేగం ఏమాత్రం పనికి రాదు. మలుపుల వద్ద అప్రమత్తంగా ఉండాలి. ముందు వస్తున్న వాహనాలను గమనిస్తూ డ్రైవ్ చేయాలి. కాదు కూడదని అతివేగంతో దూసుకుపోతే అదుపుతప్పి ఇలాంటి ప్రమాదాలే సంభవిస్తాయి.

23/08/2023

India on Moon!

A remarkable day has been etched into India's history. Chandrayaan-3, bearing the hopes, ambitions, and trust of 1.4 billion people, has gracefully touched down on the Moon. Heartfelt congratulations to the dedicated team and tireless scientists behind this momentous achievement. Today, they have scripted an extraordinary chapter in space history that will echo through generations. A salute to their unwavering inspiration.

భారతదేశ చరిత్రలో ఇది మరుపురాని రోజు. 140 కోట్ల మంది కలల్ని, ఆశయాల్ని, నమ్మకాన్ని మోసుకెళ్లిన చంద్రయాన్‌-౩.. విజయవంతంగా జాబిల్లిపై ల్యాండవడం మనకెంతో గర్వకారణం. ఈ విజయం కోసం నిరంతరం శ్రమించిన బృందానికి, శాస్త్రవేత్తలకు అభినందనలు. తరతరాలు గుర్తుంచుకునే అద్భుతమైన అంతరిక్ష చరిత్రను వారు ఇవాళ లిఖించారు. వారి స్పూర్తికి సెల్యూట్‌.

Videos (show all)

ప్రజా రవాణా వ్యవస్థలో డ్రైవరన్నలది క్రియాశీల పాత్ర. వారి సేఫ్ డ్రైవింగ్ వల్లే టీఎస్ఆర్టీసీ పయ్యాలు సాఫీగా నడుస్తున్నాయి....
మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి! ఎక్స్‌ ప్రెస్‌ బస్సుల్లో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా వెళ్తున్నట్లు #TSRTC యాజమా...
సెల్‌ ఫోనే లోకం కాదు!రహదారుల వెంట వెళ్లేటప్పుడు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. అజ్ఞాత వ్యక్తులు ఫాలో అవుతున్నారా... లేదో గమన...
అతివేగం..ఎప్పుడూ విషాదమే! అభంశుభం తెలియని పాదచారుల బతుకులను ఇలా చిద్రం చేస్తుంది. బాధిత కుటుంబాలకు మానసిక క్షోభను మిగుల్...
Caption this..#kidstalent #childrens #talentedkids
అజ్ఞాత వ్యక్తుల నుంచి మీకు తరచూ వాట్సాప్‌ వీడియో కాల్స్‌ వస్తున్నాయా? వాటికి సులువుగా చెక్‌ పెట్టొచ్చు. మీ స్మార్ట్ ఫోన్...
మూలమలుపుల వద్ద అతివేగం ఏమాత్రం పనికి రాదు. మలుపుల వద్ద అప్రమత్తంగా ఉండాలి. ముందు వస్తున్న వాహనాలను గమనిస్తూ డ్రైవ్ చేయాల...

Telephone

Website