Sri Krishna Ayurvedam

Sri Krishna Ayurvedam

ayurveda practitioner

Hand Writing: Slant Analysis 04/03/2024

https://youtu.be/NIqW8TyCpCg

Hand Writing: Slant Analysis This video deals about the analysis of SLANT in HANDWRITING and ASSESSMENT of ATTITUDE as well as THINKING pattern of an individual whether it be REGRESSIVE,...

16/02/2024

హిందూ బంధువులు అందరికి రధ సప్తమి శుభాకాంక్షలు

13/02/2024

కల్నల్ సంతోష్ బాబు
మహావీర్ చక్ర
16 BIHAR
ఈ రోజు వారి పుట్టిన రోజు.

గల్వన్ లోయ 2020 లో చైనా కుక్కలకు చుక్కలు చూపించి నేలకొరిగిన మహా వీరుడు.
ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వత్రత్రం ,ఇలాంటి అనేక వీరుల ప్రాణత్యాగ ఫలితం .
జై హింద్

22/01/2024

భండన భీముడార్తజన బాంధవుడుజ్జ్వల బాణతూణ కోదండ కళాప్రచండ
భుజ తాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్
గడగట్టి భేరికా ఢాండ డఢాండ ఢాండ నినదంబులజాండము నిండ
మత్త వేదండము నెక్కి చాటెదను ! దాశరథీ ! కరుణాపయోనిధీ !!

🚩 జై శ్రీరామ్ ... జై జై శ్రీరామ్🚩

22/01/2024

అయోధ్యరామమందిర ప్రతిష్ఠా ముహూర్త పరిశీలన

అయోధ్యలోని శ్రీరామ్ లల్లా ( బాలరాముని) విగ్రహ ప్రతిష్ఠ ఈనెల 22న మధ్యాహ్నము 12:29 - 12:30 సమయానికి జరుగనున్నట్లు మనందరకూ తెలిసిన విషయమే కదా! అయితే, ఆ ముహూర్తం సరియైనదేనా? పుష్యమాసంలో ప్రతిష్ఠ చేయవచ్చునా ? ఇటువంటి సందేహాలు చాలామంది లేవనెత్తుతున్నారు. అందువలన వివరంగా పరిశీలన చేద్దాం.

1. అసలు పుష్యమాసంలో_ప్రతిష్ఠ_సరియైనదేనా?

#సమాధానం : - నిస్సందేహముగా సరియైనదే ✅
దేవతా ప్రతిష్ఠలకు పుష్యమాసం పనికి వస్తుందని జ్యోతిష గ్రంథాలలో ఉన్నదే.

" #సర్వేషాం_పౌషమాఘౌ_ద్వౌ_విబుధస్థాపనే_శుభౌ " - అని బృహస్పతి తెలిపినదే. అంటే ఏ దేవతకైనా సరే పుష్యమాసం, మాఘమాసం శుభకరం అని అర్థము. పైగా, ఒక్కొక్క మాసంలోని ప్రతిష్ఠ కు ఫలితాలను కూడా తెలుపుతూ . . . #పౌషే_రాజ్యవివృద్ధిస్యాత్ .... అని కూడా తెలియజేయడం జరిగింది. దీనర్థమేమంటే... "పుష్యమాసం లో దేవతా ప్రతిష్ఠ జరిగితే ,రాజ్యం విశేషంగా అభివృద్ధి ని పొందుతుంది".

మనతెలుగు రాష్ట్రాలలో పుష్యమాసం అంటే శూన్య మాసం అని తలుస్తాము. అయితే, సూర్యుడు మకరరాశి లోకి ప్రవేశిస్తే పుష్యమాసం వివాహం, గృహారంభ- ప్రవేశాదులకు పనికి వస్తుందని ముహూర్త గ్రంథాలలో స్పష్టంగా ఉంది. #మకరస్థే_సూర్యే_పౌషే_శుభమ్ అని అంటూ #నిషేధస్తు_ధనురర్కవిషయః అని పీయూషధారయందు స్పష్టపరచటం జరిగింది.

2. తిథులలో ద్వాదశి తప్ప ఇంకేమీ దొరకలేదా ?

#సమాధానం : ద్వాదశీ తిథికి అధిపతి విష్ణుభగవానుడు.
#యద్దినే_యస్యదేవస్య_తద్దినే_తస్యసంస్థితిః" - అని నారదమహర్షి వాక్యము. అందువలన విష్ణు భగవానుని అవతారమైన శ్రీరామచంద్రుని ప్రతిష్ఠ కు ద్వాదశి ని మించిన తిథి ఏమున్నది? #ద్వాదశ్యాం_హరేశ్చ..... అని అగ్నిపురాణమందు కూడా ఉన్నది.

3. ప్రతిష్ఠ మిట్టమధ్యాహ్నం చేయడమేమిటి ?

#సమాధానం: అభిజిత్ - ముహూర్తంలో ఏమి చేసినా అక్షయఫలితాన్ని ఇస్తుందని మత్స్యపురాణ వచనం.
अपराह्णे तु संप्राप्ते अभिजिद्रोहिणोदये ।
यदत्र दीयते जन्तोस्तदक्षयमुदाहृतं” ॥ इति मत्स्यपुराणं ॥

అంతేకాక, శతృనిర్మూలనం కూడా జరిగి తీరుతుంది.
अभिमुखीभूय जयति शत्रून्.... इति वाचस्पत्यम्

4. శుభముహూర్తమేనా? గ్రహస్థితి బాగుందా? చరలగ్నంలో ప్రతిష్ఠ ఏమిటి?

#సమాధానం : ముహూర్తం బాగుంది. లగ్నంలో గురుడున్నాడు. ఎన్నో దోషాలను పోగొట్టే విధంగా లగ్నబలాన్ని కలిగి ఉంది. స్థిర, ద్విస్వభావ లగ్నాలు ఏవీ కూడా మేషలగ్నమంత బలం కలిగి లేవు. మేషం చరలగ్నమైనా, నవాంశ లో ద్విస్వభావ లగ్నం అవడం, శుక్రుడు లగ్నాన్ని వీక్షిస్తూ ఉండటం వలన దోషరహితమైనది.
#లగ్నే_స్థిరే_చోభయరాశియుక్తే
#నవాంశకే_చోభయగే_స్థిరే_వా .... అని వసిష్ఠ సంహిత.

పైగా లగ్నంనుండి ద్వితీయభావమందు ( రాశియందు కాదని గమనించండి) చంద్రుడు ఉండటం ఎంతశుభప్రదమో వింశోపకబలం తెలిసినవారికి సులువుగా అవగతమౌతుంది. దీనివలన రాబోయే కాలంలో దేశమంతటా రామమందిరాలు నెలకొని, దేశం శుభపరిణామాలు చవిచూస్తుందని వసిష్ఠమహర్షి వచనం👇
లగ్నాద్ద్వితీయే శుభఖేచరేంద్రాశ్చంద్రాశ్చ పుత్రార్థశుభప్రదాస్స్యుః.....

అందువలన ముహూర్త విషయం లో సందేహాలు మాని.... ఆ శ్రీరామమందిర ప్రతిష్ఠా మహోత్సవాన్ని వీక్షించి....
ఆరోజు మనఇంట దీపమాలికలను వెలిగించి.....
దీపావళి పండుగ జరుపుకుందాం.......
.. రాసిన వారికి మన:పూర్వక ప్రణామములు🙏🏻

08/01/2024

నయా భారత్.

10/12/2023

చెక్క గానుగ నూనె పేరుతో మోసాలు. తస్మాత్ జాగ్రత్త.
ప్రజలలో పెరిగిన ఆరోగ్య అవగాహనను కాష్ చేసుకుంటున్న ఆయిల్ మాఫియా.
ఫుడ్ లైసెన్స్ లేకుండా, కనీసం GST నంబరు కూడా లేకుండా, సరయిన క్వాలిటీ మైంటైన్ చెయ్యకుండా నూనెలు అమ్మేస్తున్నారు ఫ్రెండ్స్.
నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది.స్తానిక అచుతాపురం రైల్వే గేటు రోడ్డులో ఇంటినే షాపు గా మార్చి బయట ఒక అవుట్ డోర్ స్క్రోలింగ్ బోర్డు పెట్టిన షాపు లో నేను నువ్వుల నూనే, దీపారాధన కోసం నల్ల నువ్వుల నూనె కొన్నాను. ఆ దీపారాధన నూనే ప్రమిద లో సగం ఉండగానే దీపం కొండెక్కు తుంది. ఇదేమని అడిగితె సరైన సమాధానం లేదు. నాకు ఆ వంట నూనే వాడాలంటే భయం పట్టుకుంది.

DIET in WINTER 22/11/2023

https://youtu.be/aeFf5A1JSjA?si=_ZUXaxPWICBtnn0M

DIET in WINTER This video emphasizes on PRINCIPLES of DIET and the necessity of changing the QUALITY and QUANTITY of FOOD taken in, during the WINTER Season.

Does SKIN DISEASES come to RESCUE us ? [Explained in Telugu] 27/08/2023

https://youtu.be/rEz4BTt67Ck?si=aap14p5ruYBagfUX

Does SKIN DISEASES come to RESCUE us ? [Explained in Telugu] How SKIN DISEASES are a BLESSING in DISGUISE forms the core concept of this video which especially deals with the principle of HERING's LAW of DISEASES and i...

06/08/2023

కొబ్బరినీళ్ళు
చెరుకురసం
సుగంధి షర్బత్
మజ్జిగ
సహజమైన ఈ పానీయాలకు cooldrinks ఎప్పుడు పోటి కాదు.
చిన్న పిల్లలకు ఈ వీడియో తప్పనిసరి గా చూపించండి.

04/08/2023
01/05/2023

ఈ మధ్యసో కాల్డ్ MBBS డాక్టర్ లు సోషల్ మీడియా లో ఒక జ్ఞానాన్ని బోధించడం ప్రారంభించారు . వారి ద్రుష్టి లో చెక్కర, బెల్లం, కొబ్బరి బెల్లం,తాటి బెల్లం, పాతబెల్లం అన్ని ఒకటే అంట.

చక్కర (whitesugar) తయారీలో వాడే కొన్ని ఔషధాలు మీ కోసం.
What goes into making ?
After reading this, decide for yourself if you want to consume these acids or not!

To keep white sugar white, certain chemicals may be added during the refining process. Here are a few examples:

PHOSPHORIC ACID: This acid is sometimes used to remove any remaining impurities and color in the sugar. It reacts with metal ions and other impurities, causing them to precipitate out of the sugar solution.

ACTIVATED CARBON: This is a common decolorizing agent used in the refining process. Activated carbon is a form of charcoal that has been treated with oxygen to make it highly porous. When added to sugar, it absorbs any color compounds and impurities, resulting in a whiter product.

SULPHUR DIOXIDE: This gas is sometimes used to bleach sugar and remove any remaining color. It reacts with sugar molecules to break down any pigments or impurities that may be present.

CALCIUM HYDROXIDE: This is also known as slaked lime, and it is used in the refining process to neutralize any acids that may be present. It also helps to remove any impurities and improve the clarity of the sugar solution.

What do these chemicals do to our health is something each one of us should be curious about and learn!

31/12/2022

😂😂😂

07/12/2022

రోజూ పరగడుపునే ఉసిరికాయ జ్యూస్‌ను తాగండి.. ఈ అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు..

1. ఉసిరికాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువల్ల ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. మెటబాలిజంను మెరుగు పరుస్తాయి. దీంతో బరువు తగ్గడం సులభతరం అవుతుంది. అధిక బరువు ఉన్నవారు రోజూ ఉసిరికాయ జ్యూస్‌ను ఉదయాన్నే పరగడుపునే 30 ఎంఎల్‌ మోతాదులో తాగడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు.

2. ఉసిరికాయల్లో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. ఇది గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. చర్మాన్ని సంరక్షిస్తుంది. చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. చర్మంపై ఉండే మొటిమలు, మచ్చలు పోతాయి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది

3. ఉసిరికాయ జ్యూస్‌ను ఉదయాన్నే పరగడుపునే తాగడం వల్ల శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. చుండ్రు నుంచి బయట పడవచ్చు. శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి.

4.. ఉసిరికాయ జ్యూస్‌ను తాగడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ నియంత్రణలోకి వస్తుంది. రక్తం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.

5. ఉసిరికాయ జ్యూస్‌ను తాగడం వల్ల షుగర్‌ లెవల్స్‌ తగ్గుతాయి. డయాబెటిస్‌ అదుపులోకి వస్తుంది. కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గుతాయి. దీని వల్ల రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. హార్ట్‌ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది

06/12/2022

Vamu Water : వాము నీటిని ఇలా తాగితే.. ఎన్నో లాభాలు.. అస‌లు న‌మ్మ‌లేరు..!

మ‌న‌లో చాలా మంది అధిక బ‌రువు నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి, బాణ పొట్ట‌ను త‌గ్గించుకోవ‌డానికి అనేక ర‌కాల డైట్ ప‌ద్ద‌తుల‌ను పాటిస్తూ ఉంటారు. ఎన్ని ర‌కాల డైట్ ప‌ద్ద‌తుల‌ను పాటించిన‌ప్ప‌టికి స‌మ‌స్య త‌గ్గ‌క అనేక ర‌కాల ఇబ్బందుల‌కు గురి అవుతూ ఉంటారు. ఎటువంటి మందుల‌ను , ఆహార నియ‌మాల‌ను పాటించే ప‌ని లేకుండా చాలా సుల‌భంగా మ‌న ఇంట్లో ఉండే ఒక అద్భుత‌మైన ఔష‌ధాన్ని ఉప‌యోగించి మ‌నం అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు. ఈ ఔష‌ధాన్ని చ‌క్క‌గా ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం షుగ‌ర్ వ్యాధిని కూడా నియంత్ర‌ణ‌లో ఉంచుకోవ‌చ్చు. మోకాళ్ల నొప్పుల‌తో, కీళ్ల నొప్పుల‌తో బాధ‌ప‌డే వారు కూడా ఈ ఔష‌ధాన్ని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

మ‌న ఆరోగ్యాన్ని సంర‌క్షించే ఈ ఔష‌ధం ఏమిటి… అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. మ‌న‌కు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని ప్ర‌సాదించే ఈ ఔష‌ధ‌మే వాము… వాము ప్ర‌తి ఒక్క‌రి వంటింట్లో ఉంటుంది. వాము చ‌క్క‌టి రుచితో పాటు ఔష‌ధ గుణాల‌ను కూడా క‌లిగి ఉంటుంది. ఆయుర్వేదంలో ఎంతో కాలంగా దీనిని ఔష‌ధంగా ఉప‌యోగిస్తున్నారు. మ‌న శ‌రీరంలో వాత‌, క‌ఫ‌, దోషాల‌ను తొల‌గించ‌డంలో వాము మ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. వాతం వ‌ల్ల ముందుగా మ‌న శ‌రీరంలో గ్యాస్ స‌మ‌స్య త‌లెత్తుతుంది. గ్యాస్ స‌మ‌స్యే క‌దా అని చాలా మంది తేలిక‌గా తీసుకుంటారు. కానీ గ్యాస్ స‌మ‌స్య వ‌ల్ల మ‌న‌కు ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు అనేకం తలెత్తుతాయి. ఈ గ్యాస్ స‌మ‌స్య కార‌ణంగా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, వెన్ను నొప్పి, క‌డుపు నొప్పి వంటి అనేక ర‌కాల స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు కార‌ణ‌మ‌య్యే ఈ గ్యాస్ స‌మ‌స్య‌ను మ‌నం మ‌న ఇంట్లో ఉండే వామును ఉప‌యోగించి త‌గ్గించుకోవ‌చ్చు. అలాగే ఈ వామును ఉప‌యోగించ‌డం వల్ల మ‌నం ఎసిడిటీ, త్రేన్పులు, గుండె సంబంధిత స‌మ‌స్య‌లను త‌గ్గించుకోవ‌డంతో పాటు షుగ‌ర్, బీపీ వంటి వ్యాధుల‌ను కూడా నియంత్రించుకోవ‌చ్చు. దాదాపు మ‌న శ‌రీరంలో వ‌చ్చే 80 శాతం రోగాల‌ను ఈ వామును ఉప‌యోగించి న‌యం చేసుకోవ‌చ్చు. అయితే ఈ వామును ఎలా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వామును నీటితో, పాల‌తో లేదా నేరుగా ఉప్పుతో క‌లిపి నోట్లో వేసుకుని న‌మ‌ల‌వ‌చ్చు. ఈ వామును వంట‌ల్లో లేదా మ‌జ్జిగ‌లో వేసుకుని తీసుకోవ‌చ్చు. అలాగే రాత్రి ప‌డుకునే ముందు ఒక గ్లాస్ నీటిలో ఒక ఒక టేబుల్ స్పూన్ వామును వేసి రాత్రంతా అలాగే ఉంచాలి.

ఉద‌యాన్నే ఈ నీటిని తాగి వామును న‌మిలి మింగాలి. ఈ విధంగా వామును తీసుకోవ‌డం వ‌ల్ల పొట్ట త‌గ్గుతుంది. బ‌రువు త‌గ్గ‌డానికి వాము ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. ఇలా త‌యారు చేసుకున్న వాము నీటిని కొద్దిగా వేసి అందులో బ్లాక్ సాల్ట్ ను వేసి క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల గ్యాస్, ఎసిడిటి, అజీర్తి, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి అనేక ర‌కాల స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. డ‌యాబెటిస్ తో బాధ‌ప‌డే వారు, అధిక ర‌క్త‌పోటుతో బాధ‌ప‌డే వారు ఈ వాము నీటిని రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున తాగ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఈ వాము నీటిని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగి ఇన్ఫెక్ష‌న్ ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. ఈ విధంగా వామును తీసుకోవ‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌గ్గు ముఖం ప‌ట్ట‌డంతో పాటు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి.

03/12/2022

తినేటప్పుడు చిన్న భాగాలు గా బాగా నమిలి తినడం వలన మనిషిఅమరుడు అవుతాడని ఆయుర్వేదం చెప్పింది.
ఖంగారుగా, నమలకుండా తినడం వల్ల రకరకాల మానసిక రుగ్మతలకు అవకాసం ఇచ్చిన వాళ్ళము అవుతాము.
అలానే, ఉదయం రాజుగారి భోజనం,
మద్యాహ్నం మంత్రిగారి భోజనం,
రాత్రి పూట సేవకుడి భోజనం .
తినాలని చెప్పబడింది.
రాత్రి భోజనం 7.30 కు ముగించాలని, నీళ్ళు త్రాగడం 8 గంటలకు ముగించాలని చెప్పబడింది.
ఈ రోజుల్లో స్కూల్ లలో ఇచ్చే లంచ్ బ్రేక్ చాలా తక్కువ అవడం వల్ల పిల్లలకు స్పోర్ట్స్ సరిగ్గా లేకపోవడడం వల్ల పిల్లలలో చాలా ఆరోగ్య సమస్యలకు కారణం అవుతున్నవి.

24/11/2022

ఆఖరికి వీటిని కూడా కల్తి వ్యాపారం వదలలేదు.
కేన్సర్లు వస్తున్నాయట వీటిలో వాడే కెమికల్స్ తో.

28/07/2022

‘‘మునగాకు తెచ్చాను తీసుకోండి‘‘ అని ఒక కూరల కొట్టువాడు కొనుగోలుదారుల్ని బ్రతిమలాడడం మాకు కనిపించింది. చాలా మంది మాకు వండుకోవడం రాదు అని అంటే, కొంతమంది మునగాకు కూడా తింటారా? అని ఆశ్చర్యం వ్యక్తం చేయడం కనిపించింది. చాలా విచిత్రమేమంటే ఆ రోజు తరువాత కూరల కొట్టువాడు మునగాకు తేవడం మానేశాడు.

ఈ ప్రహసనం చూస్తే నాకు గోదావరి జిల్లాలలో ఉన్న ఒకపలుకుబడి గుర్తుకువచ్చింది.

‘‘ఆషాఢమాసం ఆషాఢభూతిగాడు పోవాలంటే మునగాకు తెలగపిండి కలిపి తినాలి.‘‘ ఇది మా గురుపత్నిగారు ప్రతి ఏడాదీ చెప్పేవారు. ఆమె ఆషాఢమాసంలో ప్రయత్నించేవారు కూడా. అయితే రెండూ దొరికేవి కావు. ఇందులో తెలగపిండి దొరక్కపోవడానికి కారణాలు ఆధునిక నూనెయంత్రాలు గానుగలను పాతేయడంతో జరిగింది.

‘‘మా చిన్నప్పుడు మా నాన్న నువ్వుల బస్తా కొని, గానుగ ఆడించేవారు. గానుగ ఖాళిగా ఉన్నప్పుడు కబురుపంపితే నువ్వులు తీసుకొని వెళ్ళేవాళ్ళం. వెండికడ్డీలా నువ్వుల నూనె ఉండేది. అతను గానుగ ఆడుతూ కొంచెం బెల్లం వేసేవాడు. ఉండచుట్టి అక్కడే కూర్చున్న మా ముందు ఉంచేవాడు. మేము ఇంకొంచెం కావాలనే వారం. దానికి ఆయన ఇదేం చిమ్మిలి నందికేశనోము కాదు. నూనె తగ్గితే తాతగారు నన్ను తిట్టిపోస్తారు అనేవాడు. మాదోవన మేము కూర్చుంటే ఎందుకు రుచిచూపావ్ అని దెబ్బలాడేవాళ్ళం. దానికి అతను నవ్వుతూ మీ నువ్వులూ మీరే తినండి అంటూ మరికొంత ఇచ్చేవాడు.‘‘

ఆ రోజులు పోయాయి. ఆ అనుభవాలు పోయాయి. అన్నిటికీ మించి ఆ ఆరోగ్యాలు కూడా గానుగనూనెతోనే నాశనం అయ్యాయి. ముఖ్యంగా తెలుక కులస్తులు గోసేవ చేస్తూ తమ కులవృత్తిగా గానుగలు ఆడేవారు. నేడు అవి పూర్తిగా నాశనం అవుతున్నాయి. వెండి కడ్డీల వంటి నూనెల స్థానంలో జంతువుల కళేబరాల నుంచీ వచ్చి చేరిన కొవ్వు నూనెలు గుండె వైద్యులకు బంజారాహిల్స్ లో మేడలు కడుతున్నాయి.

గానుగ నుంచీ వచ్చే తెలగపిండిలో అనేక పోషక విలువలు ఉండేవి. ముఖ్యంగా ఫైబర్ అనే పీచుపదార్థం ఉంటుంది. నూనె ఆడించేటప్పుడు వచ్చిన తెలగపిండిని ఏడాది పొడవునా అనేక వంటల్లో వాడేవారు. నేడు మిల్లు నూనెలల వలన కేవలం పిప్పి మాత్రమే తెలగపిండిలో వస్తోంది. కేవలం పిప్పి మాత్రమే కనుక దాన్ని పశువులకు వేస్తున్నారు. చెక్క దొరక్కపోవడంతో, మునగాకు కూడా ఉనికి కోల్పోయింది. మునగాకు, తెలగపిండి గతి తప్పడంతో సర్వరోగాలూ మనల్ని చుట్టుముడుతున్నాయి. విటమిన్ల పేరుతో రూపాయలు కుమ్మరించి ఆంగ్ల మందులు కొనుక్కుని తరిస్తున్నాము.

ఆషాఢమాసంలో ఆకలి ఎక్కువ వేస్తుందని అరుగుదల బలంగా ఉంటుంది కనుక ఈ సమయంలో మునగాకు, నువ్వుల తెలగచెక్క వండుకొని తినేవారు. ఆయుర్వేదంలో నువ్వులలో ఉన్న పోషకాల విలువలు మరే వస్తువులోనూ ఇవ్వలేదు. వస్తుగుణదీపిక ఎప్పుడూ కంచిపరమాచార్య నాలుకపై ఉండేది. అలాగే ఆకుకూరల్లో మునగాకు మహత్తరమైందని ప్రపంచాన్ని దోచుకుతింటున్న ఆంగ్ల వైద్యులు గుర్తించారు. కానీ వీటిని తింటే తమ లక్షల కోట్లాది రూపాయల విటమిన్ల మాత్రలు ఎవరు కొంటారు. కనుక ఈ ప్రచారాన్ని తొక్కిపెట్టారు. మా గురుపత్ని వంటి పూర్వతరాలు పోవడంతో నేడు ఈ ఆరోగ్య రహస్యం తెలిసిన వారు కూడా లేకుండాపోయి మునగాకు తింటారా? ఎలా వండాలనే తరాలు బయల్దేరాయి.

చాలా ఆశ్చర్యం ఏమంటే మేము సంన్యాసాశ్రమంలో భాగంగా ఉత్తరాది యాత్రలు చేస్తున్నప్పుడు ముఖ్యంగా హిందీభాషా ప్రాంతాల్లో పర్యటించేపప్పుడు నువ్వులతో చేసిన అనేక తినుబండారాలు షాపుల్లో, తోపుడు బళ్ళమీదా ఉన్నాయి. చిన్నపిల్లల నుంచీ ముసలి వారు వరకూ వాటిని చిరుతిళ్ళ రూపంలో తినడం మాకు కనిపించింది. దీనికి సంపూర్ణ వ్యతిరేకంగా తెలుగురాష్ట్రాల్లో నువ్వుల తినుబండారుల కేవలం అలంకారానికి మాత్రమే వాడుతున్నారు. నువ్వుల్లో ఇనుము ఉందని రక్తధాతువుకు ముఖ్యమని చాలా మంది ఆయుర్వేద వైద్యులు అనేవారు. కనుకనే బాలికలు యుక్తవయస్కులు అయ్యే తరుణంతో పనిగట్టుకొని చిమ్మిలి తినిపించేవారని ఇది తినని వారు శూలలకు గురై జీవితాంతం బాధపడతారని గతించిపోయిన బామ్మలు చెప్పేవారు. ఈ అలవాటు తప్పడంతో అసలు యుక్తవయస్సు రావడంలోనే సమస్యలు మొదలు అవుతున్నాయనే వారు లేకపోలేదు. నువ్వులు సేవించే బాలికలు 100 శాతం ఆరోగ్యంగా ఉండడం పల్లెటూళ్ళలో నేటికీ ఉంది. ప్రభుత్వం పాఠశాల బాలికలకు నువ్వులు బెల్లంతో తినుబండారాలు ఇవ్వడం ప్రారంభించడం శాస్త్ర రీత్య, ఆరోగ్యరీత్యా మంచిదే. చేయడం కూడా తేలిక.

ఆయుర్వేదం ఉపదేశించిన నువ్వుల నూనె, తెలగపిండి, మునగాకు సేవించే వారిని రోగాలు సోకవు. అద్భుతమైన రోగనిరోధక శక్తి రోగాలు చుట్టుముట్టే ఆషాఢాది వర్షాకాలాలలో కలుగుతుంది. కనుక వీటిని ఎప్పుడు సేవించాలో కూడా ఆయుర్వేదం చెప్పింది.

అయితే కొందరు మహానుభావుల కృషివల్ల మరలా ఆయుర్వేదం వెలుగులోకి వస్తోంది. తమ వైద్యవిధానం ప్రాచుర్యం పొందడం కోసం ఆంగ్లవైద్యం చేసిన సాంస్కృతిక హననంలో ఆయుర్వేదాన్ని మరలా నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ ఆయుర్వేద రహస్యాలు తెలియని వారు నేడు సామాజిక మాధ్యమాల్లో వ్యాసాలు రాస్తున్నారు. వాటిని చదువుకొని తరించేవారి వల్ల ఆంగ్లవైద్యులు బాగుపడుతున్నారు.

భారతీయ జీవనంలో నువ్వులకున్న ప్రాధాన్యత ఇంతా అంతా అని చెప్పడానికి వీలులేదు. సాక్షాత్తూ శ్రీకృష్ణభగవానుడే తిలల మాహాత్మ్యం మహాభారతంలో చెప్పి వాటిని తినండి అని చెప్పారు. ఇదే అనంతసాహితి స్తోత్రపారయణలో చేర్చింది. మహా మంత్రంగా తిలాన్ తిలాన్ తిలాన్ అని జపం చేయండి అని చెప్పాడు. దీన్ని బట్టీ నువ్వులకు వేదాలు, ఆయుర్వేదాలు ఇచ్చిన స్థానం గుర్తించవచ్చు. మృతులకు కూడా నివాళులు అర్పించడంలో నువ్వులు ప్రధానమైనవి. పితృదేవతార్చనకు నువ్వులు, మధ్యాహ్నకాలం, కుమార్తెకుపుట్టిన కుమారుడు అనే దౌహిత్రుడు ముఖ్యం.

చాలా ఆశ్చర్యం ఏమంటే నేడు మునగాకు పొడి రూపంలో ఆయుర్వేద దుకాణాల్లో దొరుకుతోంది. దీన్ని కూరల్లో వాడితే మంచిఫలితం ఉంటుంది. మునగాకు దొరికితే, నువ్వుల వేయించుకొని పొడి చేసుకొని వాడినా మంచి రుచిగా, అంతులేని ఆరోగ్యం ఇస్తుంది.

గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్యగారు అనువదించిన అష్టాదశమహాపురాణాల్లో ఆయుర్వేదం గురించి ఉంది. నేడు ప్రపంచంలో నెలకొన్న కరోనా అస్తవ్యస్తపరిస్థితుల్లో ఆయుర్వేదమే అద్భుతమైన నివారణ మార్గం. వైద్యులు పైసా పిశాచులై ప్రజల్ని పీక్కుతింటున్న తరుణంలో ఆయుర్వేద ప్రాభవాన్ని తిరిగి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటికే అనేక వ్యాసాలు ఆయుర్వేదంపై మేము వ్రాశాము. అవి బహుళ జనాదరణ పొందాయి.

పంచమ వేదం అయిన ఆయుర్వేదాన్ని ఏ విధంగా భారతదేశంలో నాశనం చేశారో? తెలియడానికి ఇటీవల రాందేవ్ బాబా కరోనీల్ అంశంతో మరోసారికి కళ్ళకు కట్టినట్టు స్పష్టంగా తెలిసివచ్చింది. రోగాల్ని కూడా వ్యాపారానికి, రాజకీయాలకూ వాడుకునే పిశాచాలు మరోసారి ఆయుర్వేదం దాడి చేస్తున్నాయి. దీన్ని అనంతసాహితి తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. కరోనిల్ నిషేధాన్ని ఆయుర్వేదంపై దాడిగా మేము భావిస్తున్నాము.

పొరలు కమ్మిన పాము తన గుడ్లు తానే తిన్న చందంగా, ఆయుర్వేదాన్ని పరిరక్షించాల్సిన భారతప్రభుత్వ రంగ ఆయష్ సంస్థ కాలకూట విషాన్ని ఆయుర్వేదంపై కక్కుతోంది. భారతీయ విజ్ఞానం తెలియని యువత నేడు అదే నిజం అనుకుంటోంది. ఈ సమయంలో యువతను మేల్కొలిపే దిశలో భాగంగా మహాపురాణాల్లోని ఆయుర్వేదాన్ని పరిచయం చేస్తున్నాము.

ప్రాణం మీద తీపి ఉన్నవారు, అల్లోపతి అరాచకరాక్షసుల బారీన పడకూడదనుకునే వారు మా గురుదేవుల పురాణ సాహిత్యం ఆధారంగా వస్తున్న వైజ్ఞానిక వ్యాసాలు అనుసరించమని కోరుతున్నాము. ఇది ‘‘పాత చింతకాయ పచ్చడి‘‘ అనుకునేవారు, కాబూలీవాలాల ద్వారా ఆధునిక వైద్యకబేళాలలకు నిరభ్యంతరంగా చేరుకోవచ్చు.

సేకరణ
whatsapp నుండి .

17/07/2022

1. బెడ్ రెస్ట్ ని తగ్గించుకోండి:
లో బ్యాక్ పెయిన్ తో గత కొంతకాలం నుంచే ఇబ్బంది పడుతున్నవారు ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడం వలన వారిలో వెన్నునొప్పి సమస్య మరింత పెరిగినట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. దాంతో, వారు రోజువారి పనులకు కూడా ఎంతో శ్రమపడాల్సి వస్తోందట. కాబట్టి, బెడ్ రెస్ట్ ను మూడురోజులకు మించి తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. వీలైనంతగా శరీరాన్ని యాక్టివ్ గా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తే సమస్య తీవ్రత తగ్గుతుందని వారంటున్నారు.

2. వ్యాయామం చేయాలి:
వెన్నునొప్పికి సరైన మందు వ్యాయామమని గుర్తించాలి. నడక వంటి చిన్నపాటి వ్యాయామాలు వెన్నునొప్పి నుంచి ఉపశమనం అందిస్తాయి. ఐతే, మీ పరిస్థితిని బట్టి ఈ వ్యాయమాలుండాలి. పరిమితంగానే వ్యాయామం చేయాలి. గార్డెనింగ్ వంటి ఒత్తిడిపూర్వక పనులకు దూరంగా ఉండటం శ్రేయస్కరం

3. సరైన పోశ్చర్:

జిమ్ లో తీవ్రంగా కసరత్తులు చేయడం వలన ఈ సమస్య వెలుగులోకి వచ్చి ఉండవచ్చు. కానీ, ఈ సమస్య మాత్రం కొన్ని సంవత్సరాలుగా రూపుదిద్దుకుంటోంది. ఎలా అని సందేహమా? మీ శరీర భంగిమ వలెనే ఒత్తిడి పడి ఈ సమస్య అనేది రూపుదిద్దుకోవడం ప్రారంభించింది. రోజువారీ పనులను చేసేటప్పుడు వెన్నుపై అనవసర ఒత్తిడి పడటంతో వెన్నునొప్పి సమస్య తలెత్తే అవకాశం ఉంది. సింక్ దగ్గర సరైన పోజిషన్ లో నుంచోకపోవడంతో వెన్నుపై యాభైశాతం ఎక్కువ ఒత్తిడి పడటం జరుగుతుందని మీరు గ్రహించి ఉండకపోవచ్చు. సరైన పోశ్చర్ తో వెన్నుపై పడే ఒత్తిడిని తగ్గించడం సాధ్యం.

4. స్పెషలిస్ట్ ను కలవండి:

సమస్యను తగ్గించాలంటే ముందుగా మీరు స్పెషలిస్ట్ ను సంప్రదించాలి. వారు మీ సమస్య తీవ్రతను అంచనా వేసి మీకు తగిన సూచనలు చేస్తారు. లోయర్ బ్యాక్ పెయిన్ ను తగ్గించేందుకు మ్యాజిక్ పిల్ ఏదీ ఉండదు. కొంతమంది పేషంట్స్ కు కోర్ స్ట్రెంతెనింగ్ కి సంబంధించిన వ్యాయామాలు తోడ్పడతాయి. మరికొందరికి స్ట్రెచింగ్ వంటివి ఫ్లెక్సిబిలిటీను పెంపొందించడంలో సహాయపడతాయి. కాబట్టి, స్పెషలిస్ట్ లు మీకు తగిన సూచనలు అందించి సమస్యను పరిష్కరించడంలో తోడ్పడతారు.

5. కోర్ మజిల్స్ ను బలపరచడం:
అబ్డోమినల్ కండరాలను పటిష్టపరచడం ద్వారా చాలా మంది వెన్నునొప్పి సమస్య నుంచి ఉపశమనం పొందగలుగుతున్నారు. అబ్డోమినల్ కండరాలు బలహీనంగా ఉన్నప్పుడు వేరే ప్రదేశాలపై ఒత్తిడి పడుతుంది. కాబట్టి, ఒత్తిడిని తగ్గించేందుకు ఈ కండరాలను బలోపేతం చేసుకోవడం ముఖ్యం.

6. ఫ్లెక్సిబిలిటీను పెంపొందించుకోవడం:

ఫ్లెక్సిబిలిటీ తక్కువగా ఉన్నప్పుడు కూడా వెన్నునొప్పి సమస్య తలెత్తుతుంది. ఫ్లెక్సిబిలిటీను పెంపొందించడం ద్వారా శరీరంలోని వివిధ భాగాలపై అంటే తల నుంచి పాదాల దాకా సమాన బరువు పడుతుంది. దాంతో, ఒకే భాగంపై ఒత్తిడి పడటం తగ్గుతుంది. దీనికి సంబంధించి ఒక సింపుల్ ఎక్సర్సైజ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మంచానికి చివరగా కూర్చుని ఒక కాలును జాపి ఒక కాలును మాములుగా ఉంచి హామ్ స్ట్రింగ్ స్ట్రెచ్ చేయాలి. ఇదంతా శరీరాన్ని న్యూట్రల్ పోసిషన్ లో ఉంచి చేయాలి.

7. బ్రేసెస్ ను పక్కన పెట్టండి:

వెన్నునొప్పిని తగ్గించుకునేందుకు బ్రేసెస్ ను వాడటం ప్రారంభించి వాటికే అలవాటు పడిపోతారు చాలామంది. బరువైనవి ఎత్తేటప్పుడు అలాగే అధిక ఒత్తిడిని కలిగించేటటువంటి యాక్టివిటీస్ కి మాత్రమే బ్రేసెస్ ను పరిమితం చేయాలి. వీటిని పదిహేను నిమిషాలకు మించి వాడకూడదు. రోజంతా వీటిని వాడితే స్థిరత్వాన్ని అందించే కండరాలు బలహీనపడతాయి.

8. హీట్ మరియు ఐస్ ప్యాక్స్

హీటింగ్ పాడ్స్ అలాగే కోల్డ్ ప్యాక్స్ వంటివి ఇటువంటి సమయంలో కచ్చితంగా సౌకర్యాన్ని కలిగిస్తాయనడంలో సందేహం లేదు. ఇంజురీ బారిన పడిన మొదటి 48 గంటలవరకు ఐస్ ను వాడమని వైద్యులు కూడా సూచిస్తారు. ముఖ్యంగా వాపు వంటి లక్షణాలు కలిగినప్పుడు ఇటువంటి సూచనను అందిస్తారు. ఆ తరువాత హీట్ ప్యాడ్ ను సూచిస్తారు. ఐతే, ఐస్ అలాగే హీట్ లలో ఏది ఎక్కువ ఉపయోగకరమో చెప్పడం మాత్రం కష్టమే. చర్మాన్ని సంరక్షించుకుంటూ, వీటిలో ఏ పద్దతి సూట్ ఐతే ఆ పద్దతిని పాటించడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

9. సరైన భంగిమలో నిద్రించడం:

వెన్ను నొప్పి తగ్గాలంటే విశ్రాంతి అవసరమే. ఐతే, నిద్రించేటప్పుడు మీ పొజిషన్ కూడా సరైన విధంగా ఉండాలి. మీ పొజిషన్ సరైన విధంగా లేనప్పుడు అలాగే మీరు నిద్రించే పరుపనేది వెన్నునొప్పికి కారకమైనప్పుడు సమస్య మరింత తీవ్రమవుతుందని గమనించాలి.

కొన్ని ముఖ్యమైన విషయాలు:

వెల్లకిలా నిద్రించేవారు మోకాళ్ళకింద తలగడను పెట్టుకోవాలి.
పక్కకు తిరిగి నిద్రించేవారు మోకాళ్ళ మధ్యలో తలగడను పెట్టుకోవడం ద్వారా వెన్నును న్యూట్రల్ పొజిషన్ లో ఉంచగలుగుతారు.
బోర్లాతిరిగి పడుకునేవారు మెడపై అలాగే వెన్నుపై ఒత్తిడిపడుతుందని గ్రహించాలి.

10. స్మోకింగ్ కు దూరంగా ఉండాలి:

స్మోకింగ్ వలన ఊపిరితిత్తులు పాడవుతాయన్న విషయం తెలిసినదే. ఐతే, స్మోకింగ్ అనేది వెన్నుసమస్యలను కూడా తీసుకువస్తుందని తెలుసుకోవాలి. కాబట్టి, స్మోకింగ్ కు దూరంగా ఉండటం వలన కూడా వెన్నునొప్పి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

Videos (show all)

కొబ్బరినీళ్ళు చెరుకురసం సుగంధి షర్బత్ మజ్జిగ సహజమైన ఈ పానీయాలకు cooldrinks ఎప్పుడు పోటి కాదు.చిన్న పిల్లలకు ఈ వీడియో తప్...
తినేటప్పుడు చిన్న భాగాలు గా బాగా నమిలి తినడం వలన మనిషిఅమరుడు అవుతాడని ఆయుర్వేదం చెప్పింది.       ఖంగారుగా, నమలకుండా తినడ...
Yoga

Telephone

Website

Opening Hours

Monday 09:00 - 21:30
Tuesday 09:00 - 21:30
Wednesday 09:00 - 21:30
Thursday 09:00 - 21:30
Friday 09:00 - 21:30
Saturday 09:00 - 21:30
Sunday 09:00 - 14:00