Zionchurchptp

Zionchurchptp

a place to worship

17/11/2020

రీబూట్ చేయండి
-
నేను జీవించిన 2020 సంవత్సరం ఒక పీడకలలా గడిచింది. నేను ఎపుడు ఒంటరిగా ఉంటానని భావించను. ప్రజలందరూ కూడా ఈ 2020 సంవత్సరం తిరిగి పునరుద్ధరించబడాలని భావించారు . ఈ సంవత్సరంలో వైరస్ వ్యాప్తిచెందడం, జాతుల మధ్య విబేధాలు కలగడం, అనేకమైన అసమానతలు ప్రపంచమంతా ఏర్పడడం, ఈ భయాల మధ్యలో నిరసనలు తెలియచేయడం, రాజకీయాల కోసం గొడవలు పడటం లాంటివి విషయాలు చాల మందికి అసౌకర్యాన్ని మరియు కోపాన్ని తెప్పించాయి.
-
మనలో చాలా మంది అన్యాయన్ని ఎదుర్కొన్నారు. కానీ మనం న్యాయం మరియు దయను ఎలా కోరుకుంటాము?
-
మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, అని ప్రకటన 21 :4 ద్వారా దేవుని వాక్యం మనకు ఒక ధైర్యాన్ని కలిగిస్తుంది. మనము ఆ దినము కొరకు వేచి ఉన్నపటికీ దేవుడు ఇపుడు జరుగుతున్న అన్యాయాన్ని చూసీచూడనట్టుగా ఉండడు. ఆయన న్యాయం చేయడానికి సిద్ధముగా ఉంటాడు. యేసు క్రీస్తు సామజంలో తృణీకరింపబడిన సమరయ స్త్రీతో మాట్లాడుతూ వారి మధ్యలో ఉన్న ఆ విబేధాలను తొలగించాడు. దేవుని మందిరంలో అధికారాన్ని ఉపయోగించి వ్యాపారం చేస్తున్న వారి బల్లలను
ఆయన త్రోసివేసాడు. మార్క్ సువార్త 11 :15 - 19
-
మన పరిధిలోనుండి బయటకు వచ్చినపుడే ప్రపంచంతో సంబంధం కలిగి జీవించగలుగుతాము అని నేను అనుకుంటాను. మనలని మనము ఇతరులకు అందుబాటులో ఉండేలాగా మన హృదయాలను సిద్ధపరచుకోవాలి. హృదయంతో పనిచేసినప్పుడే కస్టపడి పనిచేయగలుగుతాము. మనము బాధపడవచ్చు, తృణీకరింపబడవచ్చు , గాయపరచబడవచ్చు ఐనప్పటికీ ఇవేమి మనము చూపించే ఆప్యాయతను ఆపలేవు. యేసు క్రీస్తు పన్ను సేకరించువారితోను, పాపులతోను కలిసి భోజనం చేసాడు. ఆయన ఆలా చేసినందుకు ఇతరులచే తృణీకరింపబడ్డాడు, తప్పుగా అర్ధం చేసుకోబడ్డాడు. కానీ ఎవరుఏమనుకున్నప్పటికీ ఆయన పట్టుదలతో వారి ముందు సంతోషాన్ని ఉంచాడు. అదేవిధముగా క్రీస్తులో మనము కూడా పట్టుదలతో పరిగెడుతూ పరిపూర్ణతలోనికి ఎదగాలి. హెబ్రీ 12: 1-2.

14/11/2020

*Blowing Wind*
-
On windy day in December. An old lady was selling a news paper on the road side. She is almost in tears when a gusty wind had blown all her newspapers which scattered them along the road. Each passing car made the chaos worse. Passers-by were scrambling to help the old lady gather her precious papers. A few moments before, someone would have paid money to buy the newspaper. Now, dancing hopelessly in the wind, it was mere litter, a small nuisance to the passing motorist.
-
This incident brought to my mind the horrible message the job’s servant carried to Job (job 1:1-19). Job may seem more secure than the old lady’s. my financial status should seem better than that of a person who sells newspapers. Yet even a very prosperous man like job discovered that security does not lie entirely in his amount of wealth or his reserve.
-
The account in the book of Job, amplified by the sober incident of watching the wind scatter the newspapers, was good medicine to the growing pride I had about my success at work. I needed the timely reminder that security lies not in achievement, profit or success, but in God. Man’s achievement can be blown away. But we can outlast the wind of destruction if we place our abilities in God’s hands. Isaiah words are a piercing reminder. The grass withers and the flowers fall, but the word of our God stands forever. Isa 40:6-8)

12/11/2020

ఆత్మీయ గర్వం
-
ప్రస్తుతకాలంలో కొంతమంది క్రైస్తవులు మీరు పరిశుద్దాత్మ చేత నింపబడ్డారా ?
పరిశుద్ధాత్మలో బాప్తిస్మము తీసుకున్నారా? మీరు అభిషేకాన్ని పొందుకున్నారా? అని అడుగుతున్నారు.
-
ఈ రోజులలో క్రైస్తవులు యేసు క్రీస్తు జనన, మరణ, పునరుత్థానాల గురించి మరియు పరిచర్య గురించి, మానవ జీవితం గురించి వాక్యంలో అర్ధం చేసుకోవడానికి వారికీ సహాయం అవసరం. మనుషుల బావోద్రేకాలకు ప్రాధాన్యతనిస్తూ, వాక్యంలోని సత్యాలను మరుగు పరుస్తున్నారు. మానవులు క్రీస్తుపై చూపించే విశ్వాసము ద్వారానే రక్షించబడతారు అని మార్టిన్ లూథర్ వాక్యంలో సత్యాన్ని తెలియజేసాడు. మార్టిన్ లూథర్ నివసించిన కాలంలో సంఘము రాజకీయా శక్తులచేత ప్రభావితము చేయబడి, వారు పెట్టిన ఆచారాలను పాటిస్తేనే పరలోకానికి వెళ్తారు అని బోధించేవారు.
-
పరిశుద్దాత్ముడు ఒక విశ్వాసిలో అనేకమైన కార్యాలను జరిగిస్తాడు. పాపాలను ఒప్పింపచేయడానికి, మిషనరీలకు సహాయం చేయడానికి, సంఘాన్ని ఐక్యంగా ఉంచడానికి, ఒక పాపికి మారు మనసు కలిగేలా చేయడానికి, విశ్వాసులను ఆత్మ ఫలములు మరియు కృప వరాలతో నింపడానికి, క్రీస్తు స్వారూప్యతలోనికి మార్చడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు.
Com

11/11/2020

*నూనె అయిపోలేదు*
-
హెన్రీ తన జీతం అభివృద్ధి కోసం వేరొక కంపెనీకి మరలనుకున్నాడు. ఆయన మూడు కంపెనీల నుండి ఆఫర్ ను అందుకున్నాడు. అందులో రెండు కంపెనీలు ఎక్కువ జీతాన్ని ఇస్తాము అన్నారు. ఒక కంపెనీ మాత్రం తక్కువ జీతం మరియు ఎటువంటి ప్రోత్సాహకాలు లేవు. అతని కుమారుడు వెంటనే మూడోవ కంపెనీని ఏంచోకోమని దేవుడు కోరుతున్నాడు అని చెప్పాడు. అంతేకాకుండా డబ్బు గురించి చింతించవలసిన అవసరం లేదు అని, అక్కడ ఉన్నవారికి దేవుని సువార్తను ప్రకటించడానికి వీలుంటుందని చెప్పాడు. అతను కుటుంబ సభ్యులనుంచి ఎలాంటి వ్యతిరేకత ఎదురుకొనలేదు. అయన అబ్రాహాము లాంటి విశ్వాసాన్ని తనకు దయచేయమని దేవుడిని ప్రార్ధించాడు.
-
నెమ్మదిగా దేవుడు తన చిత్తాన్ని అతనికి తెలియచేయడం ప్రారంభించాడు. అతను దేవుని కోసం అతని సన్నిహితులతో కలసి ఎంతో పని చేసాడు. పరిచర్య కొరకు ప్రయాణం చేయడం, మందిరాలను నిర్మించడం వెలివేయబడినవారికి ఆశ్రయాన్ని కల్పించడం లాంటివి చేసారు. రోజులు ఆలాగున గడుస్తుండగా ఒక రోజు తాను పనిచేసే ఎయిర్లైన్స్ నుంచి అతనికి ప్రోత్సహకారముగ కొంత డబ్బును అందించారు. అతను పొందుకున్న డబ్బును కొంతమంది సేవకులకు అందచేయాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే అతని కుమారునికి స్కూల్ ఫీజు మరియు ఆరోగ్య భీమా కట్టాలి అని సమాచారం రావడం తో అతను నిర్ణయించుకున్న ఒడంబడిక నుండి విరమించుకుంటాడు. అదే సమయంలో దేవుడు అతనితో టీవీ ప్రసంగికుని ద్వారా మాట్లాడుతూ " దేవుడు ఏలీయాను సారెపతు పట్టణానికి వెళ్లి అక్కడ నివసించమని చెప్పాడు. దేవుడు ఎందుకని కాకుల ద్వారా ఏలీయాను పోషించాడు, ఎందుకని ఏలీయాను ఒక ఉన్నతమైన కుటుంబములోరికి పంపించలేదు? అపుడు అతనుకు అర్ధమైంది దేవుడు ఒకరి ద్వారా బహుమానాన్ని పంపించాలని ఇష్టపడుతున్నాడు.
-
తిరుగు ప్రయాణంలో దేవుడు ఒక కో-పైలట్ని నాతో పటు పంపినప్పుడు అతను తన సాక్షాన్ని నాతో పంచుకున్నాడు. తన కుమార్తె యేసు క్రీస్తు పట్ల చూపిన విశ్వాసాన్ని బట్టి నేను క్రీస్తును అంగీకరించాను నేను దేవుడికి ఒక వాగ్దానం చేశాను అదేమిటంటే నేను ఎప్పటికీ పిసినారితనముగా మరియు నిందలు వేసే వాడిగా ఉండను. ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. 1 రాజులు 17 :16
C

11/11/2020

My Oil Never Run Dry
-
A prayerful pilot henry would like to shift the company for the hike of salary. He received three offers first 2 option of airlines have a huge salary but the 3rd option has a less pay scale and there are no expatriate perks. His son’s insistently, said that God wanted him to be a liaison between his friends to share the gospel not to worry about money. After accepting the third option He was complaining for everything for what he is not having at the movement. but he never heard his family complaining about anything else. So he realized and asked God’s forgiveness and prayed to have faith like Abraham.
-
Slowly God started to reveal His plans to me. I have done a lot of work for God together with my colleagues , mission trips, built some churches arranged aid for refugees. While days are going I received my first bonus from my airlines, I committed it to sponsor an evangelistic rally and seminars for pastors. At that moment mu son called me that he needed a big sum of money to pay his school fees and health insurance. I started to drift from my commitment. In that moment of confusion God talked to me through television speaker Bayles conley “when the drought came God instructed Elijah to arise and go to zarephath and stay there. Why did God continue to feed Elijah from ravens. Why didn’t God send Elijah to a rich family? Then I got the message: what God wants is somebody to channel His gift.
-
On the return flight God sent a co-pilot shared his testimony with me. He said his daughter’s faith made him to accept Jesus as their personal Saviour. Then I promised God I would neither complain nor not to be stingy anymore. Then I spoke to myself “my flour jar is never used up, my oil jug never run dry”. 1 Kings 17:16.

10/11/2020

*హెన్రి యొక్క సాక్ష్యం*
-
నేను చాల విలాసవంతమైన జీవితాన్ని జీవించాను. నాకు 2 భవనాలు, 3 కార్లు, 2 హెలికాప్టర్స్ ఉండేవి. నేను ఏమి చేయాలని ఇష్టపడతానో అవి వెంటనే చేసేవాడిని. ఇలా ఉండగా 1995 సంవత్సరంలో మా అమ్మగారికి హార్ట్ ఎటాక్ రావడం జరిగింది. దాని వలన నేను మా అమ్మగారిని చూసుకోవడానికి నా ఉద్యోగానికి సెలవు పెట్ట వలసి వచ్చింది. మూడు నెలలు మా అమ్మగారు ఐసీయూలో ఉన్న తరువాత మరణించారు.
-
ఒక వారం గడచిన తరువాత మా అధికారి నన్ను ఉద్యోగంలో సెలవులు పెట్టడం వలన ఉన్నత స్థానం నుండి క్రింది స్థానానికి తగ్గించారు. ఆలా చేసినందుకు నేను ఎంతో నిరుత్సాహపడ్డాను.
-
అలాంటి బాధల మధ్యలో నాకు ఒక కల వచ్చింది. అది ఏమిటంటే నేను ఒక పెద్ద ఖాళీ స్థలములో అనేక మంది మధ్య నుంచుని ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ ఉండగా, ఒక నక్షత్రం ఆకాశంలో నుండి క్రిందికి పడుతున్నది కానీ అది పడేకొద్దీ అది తన కాంతిని కోల్పోవటంలేదు. అది చుసిన ప్రజలు భయబ్రాంతులకు గురి అవటం మొదలుపెట్టారు. ఆ నక్షత్రం వారి మీదుగా నిలిచింది దాని కాంతి తగ్గినపుడు అది నక్షత్రము కాదు, యేసు క్రీస్తు అని గ్రహించి ప్రభువా నాకు సహాయం చేయుమని నేను ఏడవడం ప్రారంభించాను. నేను ఆ వేదనలో నిలువలేకపోయాను. అప్పుడు యేసు మా దాగరకు వచ్చి నిలువబడి నన్ను హత్తుకొని, నన్ను ఓదార్చడం నేను చూసాను. ఆ తరువాత రోజు ఉదయం నేను ఎంతో సంతోషముగా లేచి ఆ బాధనుంచి విడుదల పొందుకుని, వాక్యాన్ని చదవడం ప్రారంభించాను మరియు ప్రార్ధన చేయడం నేర్చుకున్నాను. ఆ తరువాత సంవత్సరం దేవుడు అద్భుతంగా నా కుమారుడుని మత్తుపదార్ధాలను తీసుకొనే బానిసత్వంనుంచి విడిపించాడు. నేను యేసు క్రీస్తుకు సమర్పించుకొని ఆయనను సేవించడం ప్రారంభించాను. మేము మా ప్రదేశములో ఒక మందిరాన్ని కూడా నిర్మించాము.

05/11/2020

When you Feast with God
-
There is an expectation to withdraw to a ‘safe’ place where one can allow God to speak afresh. Everything seems a decrescendo to help still the ‘noises’ in a person’s heart. Frequent gentle reminders are given - the utmost necessity of putting aside gadgets. Its encouraged to have a notebook as journal, sketch book, drawing pencils together with a bible to help record new impressions from the Lord.
-
A time for solitude is important for a person who has to deal every day with the tyranny of the urgent. In fast paced society, many have lost the art of thinking. To think about God’s word intently study it carefully and thoughtfully meditate a portion of scripture will get a new insights about God, the world he lives in himself! It reveals our spiritual fault lines and this hurts!
-
I went once to a retreat expecting a mountain top experience and a ‘well done, good and faithful servant’ verdict. I came home broken hear ted! I saw the difference between ‘my thoughts’ and Gods thoughts’. radical surgery is never pain less. But the God of Grace and mercy forgives, corrects and restores. There is nothing that can separate us form the love of God and there is no life situation that cannot be settled at the foot of the cross.
-
Have a passion to read and meditate the Word of God and Glorify Him!

31/10/2020

Whats Wrong with it?
-
Where do you get the moral code by which you live your life? There may be a whole numbers of different responses: “ I do what I feel is right” - my morals are entirely personal and arbitrary. Or “society decides what is right and wrong” - laws are made and as long as I stick within them everything is OK. Or anything in between those two responses.
-
Right and wrong for the christian come from a higher standard than any individual or group of humans -they come from God. The creator is the moral Law-giver.
-
How can s*x be wrong before marriage? God has designed this wonderful thing to be expressed within a lifelong marital relationship between one man and one woman. It is the divine image expressed equally in their physical, anatomical and procreative differences in their unity and diversity to leave their parents and unite each other and become one flesh.
-
The question of how s*x outside marriage could be wrong can be approached by looking at the beauty, intimacy and preciousness of s*x. God designed that this should happen in a safe and committed context of love and devotion. According to the maker. This is where s*x is at its best.

30/10/2020

*Not By Chance*
-
Everything God has done or does is mysterious(Job11:7;Dan 2:28). We all know that “In the beginning God made the heavens and the earth” but how did He do that? And have you not wondered how wonderfully He made the Universe out of atoms? How orderly and amazing it all is at the atomic and sub-atomic levels. Take the simple hydrogen atom has the same structure and number of particles and properties as any other hydrogen atom. Could such order and uniformity have come about by chance, as evolutionist presume?
-
There is a designer and creator of all the different parts of each kind of atom, so that each atom of an element is identical to every other atom of that element.
-
In an atom there are tiny electrons, revolving around the nucleus, we do not stop to wonder why the enormous crushing weight of Mount Everest, all those billions of tonnes, can be held up by those tiny electrons without the electrons being crushed into the nucleus. How amazing! Or how electrons flowing at the speed of light through an electric cable can be stopped dead, instantly, by the pressing of a switch, whereas a vehicle travelling at far lower speeds required tremendous braking power to bring it to a halt many meters down the road. We need to understand God a little better by looking at the creations and creatures He has made. How wonderful it is to go through life seeing the mind and hand of our God in the things around us.

27/10/2020

సాక్ష్యం - క్రీస్తుకు రుణపడి ఉంటాను
-
నేను ఒక గొప్ప కుటుంబంలో పెరిగాను. మా కుటుంబంలో జూదము అనేది సార్వాసాధారణంగా ఉండేది. మా బంధువులు అందరూ కుటుంబాలుగా ఒకచోట కలిసినపుడు జూదము ఆడేవారము. ఒకానొక సమయంలో నా స్నేహితుడు యేసుక్రీస్తు గురించి చెప్పడం జరిగింది. నేను యేసుక్రీస్తును అంగీకరించిన తరువాత కొంత కాలానికి మళ్ళీ యేసుక్రీస్తును విడచి జూదము ప్రారంభించాను.
-
నా భార్య, నేను జూదము కోసము చేసిన అప్పులను తీరుస్తూ వచ్చింది. నేను సమస్తాన్ని కోల్పోయాను. అపుడు మళ్ళీ నా జీవితాన్ని తిరిగి ప్రారంభించాలి అనుకున్నాను. కానీ మూడు నెలల తరువాత నా స్నేహితుడు మళ్ళీ పోగొట్టుకున్న డబ్బు సంపాదించడానికి తిరిగి జూదాన్ని ఆడమని ప్రోత్సహించారు. ఆలా నా జీవితం ఓటమి పాలవడం, అప్పులు చేయడం, మళ్ళీ తిరిగి వాటిని చెలించడం ఇలా గడిచేది.
-
రికవరీ సెంటర్ సలహా ద్వారా నా భార్య నాకు ఆర్థికంగా సహాయం చేయడాన్ని ఆపివేసినప్పుడు, నేను ఏదో ఒక రోజు జూదములో ఎక్కువ సంపాదించి నన్ను నేను నిరూపించుకోవాలని అనుకున్నాను కానీ ఆలా అనుకున్న ప్రతి సారి నేను ఓడిపోతూనే ఉండేవాడిని చివరకు నేను సమస్తాన్ని కోల్పోయి ఎటు తోచని స్థితిలో ఉన్నపుడు నేను ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నాను.
-
నేను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించినపుడు ఎవరో ఒకరు ఏదో ఒక రకముగా ఆటంకం కలిగించేవారు. చివరకి నేను తిరిగి ఇంటికి వెళ్ళినపుడు నా కుమార్తె నేను చేసిన ఈ పనులకు నన్ను నిందించింది. అపుడు నేను ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తుండగా యేసుక్రీస్తుకు ప్రార్ధించాలని ఆశ కలిగింది.
ఆలా ప్రార్ధన చేసిన తరువాత చనిపోవడం సమస్యకు పరిష్కారం కాదు అని, నాకు ఉన్న ఈ సమస్యలనుండి కష్టపడి సంపాదించి బయటపడాలని నిర్ణయం తీసుకున్నాను. అప్పటి నుండి నేను జూదంలో కాకుండా నిజాయతీగా సంపాదించి నేను కోల్పోయినదానిని తిరిగి పొందుకొని ఇపుడు క్రీస్తులో ప్రశాంతమైన జీవనాన్ని జీవిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక.

24/10/2020

* ప్రచారంలో వచ్చే పొరపాట్ల వలన ఏర్పడే ప్రతికూలతలు *
-
కొంతమంది ప్రసిద్ధి చెందిన క్రైస్తవ నాయకులతో కలిసి ప్రచారం చేయడం వలన నేను కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నాను. అందులో ఏర్పడిన కొన్ని తప్పుడు విధానాల వలన నా క్రైస్తవ మరియు క్రైస్తవేతర స్నేహితుల దగ్గరనుంచి ఆటంకములు ఎదుర్కొన్నాను. క్రైస్తవులు అలాంటి పనులు ఎలా చేయగలరు లేదా అలాంటివి జరగడానికి దేవుడు ఎలా అనుమతించగలడు వంటి ఇబ్బందికరమైన ప్రశ్నలకు నేను ఎలా సమాధానం చెప్పగలను?
-
మొదట, విశ్వాసిగా మనం వివేచన మరియు జ్ఞానం కోసం ప్రార్థించాలి. మనము ప్రతిస్పందించేటపుడు తొందరపడకూడదు. నెహెమ్యా చేసిన ప్రార్ధనను మనము జ్ఞాపకము చేసుకోవాలి. అతను ఇశ్రాయేలీయులు చేసిన పాపాల కొరకు అతను దేవుని దగ్గర ప్రార్ధన చేసాడు. అదే విధముగా మనము కూడా మన పాపముల నిమిత్తము దేవుని దగ్గర క్షమాపణను కోరుకోవాలి.
-
మనము తప్పు మార్గంలో వెళ్తున్నాము అని ఆరోపణలు చేయడం మరియు మనము అన్యాయముగా నిందించబడుతున్నాము అని భావించి ఎదుటివారికి సమాధానం చెప్పడం సులభము. కానీ ఎవరు ఒప్పు ఎవరు తప్పు అని చెప్పడం కాదు గాని, తప్పుడు ప్రచారం ఎప్పటికీ అది సంఘాన్ని ప్రభువును బాధిస్తుంది.
-
రెండవది, మన వైఖరి ఇలా ఉండాలి: దేవుని కృపను బట్టి మనము పాపములో ఇతరులతో సమానముగా ఉండకపోవచ్చు కానీ మనమందరము పాపులమే అని గ్రహించాలి. మనము కేవలం దేవుని కృపను బట్టి మాత్రమే రక్షించబడతాము. మీలో పాపము చేయనివాడు మొదట రాయి వేయండి. యోహాను 8 :2 - 11 .
-
క్రైస్తవేతరుల నుండి వచ్చే ఏ ప్రశ్నకైనా మనం ఓర్పు మరియు వినయంతో సమాధానం చెప్పాలి (1 Pt 3:15).వారు మన పట్ల నిరాశ, అసంతృప్తి, అసహ్యం వ్యక్తం చేయడానికి అవకాశం ఉంటుంది. మన ప్రతిస్పందన కేవలము ఎదుర్కోవడానికి మాత్రం కాదు కానీ వారిని మన సమాధానము ద్వారా ఒప్పించేదిగా ఉండాలి. అదే సమయంలో, కొంతమంది చేసే తప్పులను బట్టి అన్ని క్రైస్తవ సంఘాలు మరియు క్రైస్తవులు అదే విధముగా ఉంటారు అని అనకూడదు అని వారికీ వివరించాలి. ఆదర్శప్రాయమైన క్రైస్తవ సంస్థల ద్వారా జరిగే మంచి పనులను జ్ఞాపకము చేసుకోవాలి అని చెప్పాలి.
-
మన వ్యక్తిగత సాక్షం యొక్క ప్రాముఖ్యత;మన జీవితాలు ఎప్పుడూ క్రీస్తు ప్రేమను కనపరిచేదిగా ఉండాలి. బయటివారు క్రైస్తవ్యాన్ని గూర్చి ఆలోచించినప్పుడు వారు చుట్టూ చూసే క్రైస్తవుల జీవితాలను బట్టి క్రైస్తవ్యాన్ని నిర్వచిస్తారు. వారికీ మనము మాత్రమే క్రైస్తవ జీవనాన్ని చూపించేవారముగా ఉంటె మనము క్రీస్తు ప్రేమను కనుపరచినపుడు వారు క్రైస్తవ్యం అంటే ఏమిటో అర్ధం చేసుకోగలుగుతారు.

22/10/2020

మార్గం
-
మనలో ఏర్పడే శారీరక మరియు మానసిక బలహీనతలను వ్యసనం యొక్క పరియవాసానలుగా గుర్తించవచ్చు. ఇవి మొదటిగా అశ్లీల దృశ్యాలను చుడటంతో మొదలవుతుంది. ఇది అలవాటు అయిన వారికి ఒక రకమైన కోరికలతోకూడిన భావోద్రేకాలు కలుగుతాయి. ఇలా ఏర్పడినపుడు అనేకమైన దుష్పరిణామాలకు వారి కోరికలు దారి తీస్తాయి. అంతే కాకుండా వారు రోజువారీ పనులను కూడా చేయడానికి ఇష్టపడరు.
-
దీనినుంచి బయటపడటానికి, ఆ వ్యక్తి జీవితం యొక్క ప్రాముఖ్యతను అతనికి తెలియజేయడం ద్వారా అతనిలో జయించే సామర్ధ్యాన్ని పెంపొందించడంవలన వీటినుంచి విడుదల పొందుకోవచ్చు.
-
అతడు ఈ ఆలోచనలతో ఎలా ప్రభావితుడయ్యాడో గుర్తించి ఆ ఆలోచనను అతని మన్సులోనుంచి తీసివేయడానికి ప్రయత్నించాలి. మంచి ఆలోచనలను ఆలోచించేలాగా సలహాలు ఇవ్వాలి. ఈ అశ్లీలతకు అలవాటుపడినవారిలో వారి బలహీనత గుర్తించి ఆ బలహీనతను తొలగించడానికి ప్రయత్నించాలి.
-
శారీరక వ్యాయామం చేయడం ద్వారా ఒత్తిడి మరియు భావోద్రేకాలపై నియంత్రణ కలుగుతుంది
-
ఈ వ్యసనముతో బాధపడే వ్యక్తులకు మనము ఇవ్వవలసిన సందేశం ఏమిటంటే “మీకు సహాయం చేయడానికి మేము ఇక్కడ ఉన్నాము మీరు ఒంటరిగా లేరు”అని వారికీ ఒక సలహాదారునిగా ఉండాలి. ఆలా ఉండటంవలన వారిని ఆ యొక్క వ్యసనం నుండి బయటపడేలా చేయవచ్చు .Shared with Only me
ఒక మార్గం అందిస్తోంది
-
మనలో ఏర్పడే శారీరక మరియు మానసిక బలహీనతలను వ్యసనం యొక్క పరియవాసానలుగా గుర్తించవచ్చు. ఇవి మొదటిగా అశ్లీల దృశ్యాలను చుడటంతో మొదలవుతుంది. ఇది అలవాటు అయిన వారికి ఒక రకమైన కోరికలతోకూడిన భావోద్రేకాలు కలుగుతాయి. ఇలా ఏర్పడినపుడు అనేకమైన దుష్పరిణామాలకు వారి కోరికలు దారి తీస్తాయి. అంతే కాకుండా వారు రోజువారీ పనులను కూడా చేయడానికి ఇష్టపడరు.
-
దీనినుంచి బయటపడటానికి, ఆ వ్యక్తి జీవితం యొక్క ప్రాముఖ్యతను అతనికి తెలియజేయడం ద్వారా అతనిలో జయించే సామర్ధ్యాన్ని పెంపొందించడంవలన వీటినుంచి విడుదల పొందుకోవచ్చు.
-
అతడు ఈ ఆలోచనలతో ఎలా ప్రభావితుడయ్యాడో గుర్తించి ఆ ఆలోచనను అతని మన్సులోనుంచి తీసివేయడానికి ప్రయత్నించాలి. మంచి ఆలోచనలను ఆలోచించేలాగా సలహాలు ఇవ్వాలి. ఈ అశ్లీలతకు అలవాటుపడినవారిలో వారి బలహీనత గుర్తించి ఆ బలహీనతను తొలగించడానికి ప్రయత్నించాలి.
-
శారీరక వ్యాయామం చేయడం ద్వారా ఒత్తిడి మరియు భావోద్రేకాలపై నియంత్రణ కలుగుతుంది
-
ఈ వ్యసనముతో బాధపడే వ్యక్తులకు మనము ఇవ్వవలసిన సందేశం ఏమిటంటే “మీకు సహాయం చేయడానికి మేము ఇక్కడ ఉన్నాము మీరు ఒంటరిగా లేరు”అని వారికీ ఒక సలహాదారునిగా ఉండాలి. ఆలా ఉండటంవలన వారిని ఆ యొక్క వ్యసనం నుండి బయటపడేలా చేయవచ్చు .

21/10/2020

*వ్యసనం*
-
వ్యసనం అంటే డ్రగ్స్ , మద్యం సేవించుట మాత్రమే కాదు . దేవునికి వ్యతేరేకముగా చేసే ప్రతి పని ఒక వ్యసనమే
-
ఒక వ్యక్తి తన సాక్ష్యాన్ని పంచుకుంటు తాను అశ్లీల చిత్రాలను చూసే వ్యసనం నుండి ఎలా విడిపించబడ్డాడో వివరించాడు, వాటిపై విజయం సాధించడానికి అతడు దేవుని దగ్గర ఎంతగానో ప్రార్ధన చేసాడు. ఆ ప్రార్ధనకు ఫలితంగా అతడు ఆ వ్యసనం నుంచి విడుదల పొందుకున్నాడు. కేవలం ప్రార్ధన మాత్రమే కాదు గాని, ప్రార్ధనతో పాటు అతడు దేవుని మాటకు లోబడి జీవించడం ద్వారా విజయం పొందుకున్నాడు.
-
దావీదు, తన రాజభవనం పై నుండి బత్షెబా ఆను స్త్రీ స్నానం చేస్తుండగా చూసి కోరుకున్నాడు. అతని కోరిక ఒక కుటుంబాన్ని నాశనం చేసి, హత్యకు దారితీసింది.
-
అశ్లీల దృశ్యాలను చూడడం వలన ఇతరుల పట్ల తప్పుడు ఆలోచనలు కలిగి ఉండటం మరియు భార్య భర్తల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని కోల్పోవడం, తద్వారా కుటుంబంలో అశాంతి ఏర్పడటం జరుగుతుంది. ఒక మనిషి తనలో తాను ఏమి ఆలోచిస్తాడో అదే కావాలని కోరుకుంటాడు. ఒక వ్యక్తి మంచి గురించి ఆలోచిస్తే తాను మంచినే కోరుకుంటాడు కానీ అతనిలో చెడు ఆలోచనలు ఉంటె అతను చెడ్డ విషయాలను ఆశ పడతాడు. సమెతులు 23: 7; ఫిలిప్ 4: 8.
-
మానవుడు దృశ్యరూపకంలో చూసే దాన్ని అంత తొందరగా మర్చిపోలేదు దానినే ప్రధానమైన ఆయుధంగా అపవాది ఉపయోగించుకుని నేత్రాశను కలిగిస్తాడు.
-
మనం మన పాపములను యేసు క్రీస్తు దగ్గర ఒప్పుకున్నట్లైతే అయన మన పాపములను క్షమించి మనలను పవిత్రులనుగా చేస్తాడు. పాపంపై విజయం పొందడం మన ఒకరి వలన జరగదు కానీ మనం విజయాన్ని సాధించడానికి దేవుని సహాయాన్ని కోరినపుడు దేవుడు కచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. అపుడు మాత్రమే మనము పూర్తిగా మన వ్యసనాలపై విజయాన్ని పొందుకోగలుగుతాము రోమా 6:14.

20/10/2020

వివక్ష
-
ఇతరులను పక్షపాత ధోరణితో చూడడం గురించి బైబిల్ ఏమి చెప్తుంది. మానవుల అందరి సృష్టికర్త దేవుడే అని వాక్యం చెబుతుంది. మానవత్వం అనేది సర్వాధికారియైన దేవుని చేత సృష్టింపబడింది. ఒక వేళ మన తోటి మనుష్యులను సమానంగా చూడలేకపోతే దేవుణ్ణి గౌరవించలేనివారమవుతాము.
-
మనలో ఎవరూ దేవుని దయ మరియు ప్రేమకు అర్హులు కాము కానీ దేవుడు వాటిని మన పట్ల చూపిస్తున్నాడు. ఎవరైతే దేవుని అపరిమితమైన ప్రేమను అనుభవిస్తున్నారో వారిలో గొప్పతనము ఏమి లేదు. కాబట్టి మనంకూడా దేవుడు మనలను ప్రేమించినట్లుగానే ఇతురులను కూడా మన సహోదరులుగా ప్రేమించాలి
-
ఒకవేళ మనము మన అజ్ఞానమువలన ఇతరులను బాధపెట్టే మాటలు లేదా క్రియలు చేస్తే దానికి నివారణ చాల సులభము. ఎవరితో అయితే ఆలా ప్రవర్తించామో వారిని ఇంటికి ఆహ్వానించి వారితో సమాధానపడి చక్కటి ఆతిధ్యం ఇవ్వడం ద్వారా సమస్య పరిష్కారం అవుతుంది.
-
యేసు సమరయ స్త్రీతో మాట్లాడటానికి బయలుదేరాడు (యోహాను 4). ఆ రోజుల్లో, యూదులు సమరయులతో సాంగత్యం చేయడానికి ఇష్టపడేవారు కాదు. ఒక యూదుడు సమరయులతో కలసి భోజనం చేయడం కానీ, కనీసం వారు ఇచ్చే నీరు త్రాగడానికి కూడా ఇష్టపడేవారు కాదు. అయినప్పటికీ యేసు సమరయ స్త్రీని, త్రాగడానికి నీళ్లు ఇవ్వమని అడగడం ద్వారా వారిపై చూపెడుతున్న అంటరానితనాన్ని తొలగించాడు. అలా చేయడం ద్వారా, యేసు మనకు అందరిని సమానంగా ప్రేమించాలని ఒక మాదిరిని చూపించాడు. మన జాతి కానీ మరొక జాతికి చెందిన వారిని కలవడానికి మరియు మాట్లాడటానికి మనం ఎంతవరకు సిద్ధంగా ఉన్నాము? వారిని భోజనానికి ఆహ్వానించడం మనకు కష్టముగా అనిపిస్తుందా?
-
మనమందరం ప్రేమించగలిగేతే మనము ఉంటున్న ప్రదేశములో ఎటువంటి విబేదాలు లేకుండా మాత సామరస్యతతో జీవించుట సాధ్యపడుతుంది. క్రైస్తవులుగా మనము అలాంటి జీవితాన్ని జీవించగలుగుతున్నామా? మనము ఆలాగున జీవించినట్లైతే ఇతరులు కూడా మనలాంటి జీవితాన్ని జీవించాలని కోరుకుంటారు.

17/10/2020

* దృశ్యం *
-
యేసు తన వాక్యాన్ని ఉపమానాలు ఉపయోగించి బోధించాడు, వినే వారికీ అర్ధంకావడానికి సరళమైన ఊహ చిత్రాలతో చక్కటి పాఠాలను బోధించాడు. ఒక తండ్రి తన బిడ్డలకు బోధించే రీతిగా దేవుడు కూడా తన ఉద్దేశాన్ని కథలను ద్వారా బోధించాడు.
-
ఒక చిత్రం రూపొందించబడిన విధానం బట్టే ఆ చిత్రాన్ని చూసి ఆనందించడానికి అవకాశం ఉంటుంది అదే విధముగా చెప్పే ఉదాహరణను బట్టి విషయాన్ని గ్రహించగలగడానికి అవకాశం ఉంటుంది.
-
ఈ ఉపమానాలు యేసు యొక్క జీవితంలో ఉన్న మాధుర్యాన్ని చూపించడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. అంతే కాకుండా ఆయనచుట్టు ఉన్న ప్రజలు ఎంతగానో ప్రభావితం అవడానికి మరియు దేవుని యొక్క మహిమను వెల్లడిపరచడానికి ఉపయోగపడ్డాయి.
-
కొంతమంది చిత్రకారులు వేసే చిత్రాలలో కొన్ని అర్ధాలు దాగి ఉంటాయి. వాటిని ఎంతో జాగ్రత్తగా పరిశీలించి చూస్తే తప్ప గ్రహించడం కష్టం అలాగే దేవుని వాక్యంలో మరియు అయన ఉపయోగించిన ఉపమానాలలో కొన్ని విషయాలు దాగి ఉంటాయి. మనము వాక్యాన్ని జాగ్రత్తగ పరిశీలించి చూస్తే వాటిలోఉన్న నిజమైన అర్ధాన్ని కనుగొనగలుగుతాము అపుడు దేవుని యొక్క ఉద్దేశ్యాలు మనకు అర్ధం అవుతాయి.
-
యేసు క్రీస్తు మాత్రమే దేవుని యొక్క పరిపూర్ణతను కలిగియున్నాడు మరియు తండ్రి మనకొరకు తన కూమారుడను బలిగా అర్పిచాడానికి పంపించాడు. యేసుక్రీస్తు సిలువ దృశ్యం మన పాపముల నిమిత్తము ఆయన చనిపోయినట్టు మనకు తెలియచేస్తుంది. అదేవిధముగా దేవుడు వెల్లడిపరచిన పావురము, అగ్ని, జలము లాంటి దృశ్యాలు పరిశుద్ధ ఆత్మ దేవునికి సూచనలుగా ఉన్నాయి. ఆయన మన పాపములను
ఒప్పించి మనము పరలోకంలో నిరంతరము జీవించడానికి సహాయం చేస్తాడు.

15/10/2020

సమయం
-
వేకువజామున దేవునిని కలవాలని ఎంతో ఆశ ఉంటుంది. అలాగే బైబిల్ చదువుతూ దేవుడు నాతో మాట్లాడలని, ఉదయాన్నే దేవుని దగ్గర గడపాలని నాకు కోరిక ఉంది. నా ఆత్మ మేల్కొంటుంది మరియు నేను అపుడు ప్రార్థిస్తు ఉంటాను. కాసేపటి తరువాత నేను కళ్ళు తెరిచినప్పుడు నేను ఇంకా పడుకొనే ఉంటాను. అపుడు నాకు ఇందంతా ఒక కల మాత్రమే అని అర్ధమౌతుంది.
-
నేను ప్రతిరోజూ చేసే పనులలో, పనికి వెళ్ళడం, కుటుంబంతో గడపడం , చర్చికి వెళ్లడం, స్నేహితులను కలవడం , క్రైస్తవ సమావేశాలకు హాజరు కావడం లాంటి విషయాలు నాకు సౌకర్యవంతంగా అనిపిస్తాయి . నాకు సంబంధించిన వారు ఎవరైనా తృణీకరించినట్లైతే వాటిని జయించగలము. రోజువారీ పనులను చేసేటపుడు మన శక్తీ మరియు మన సమయం ఖర్చు అవుతుంది కాబట్టి దేవునితో గడిపే సమయం తగ్గిపోతుంది.
-
తెల్లవారుజామున లేచి ప్రార్ధన చేయాలంటే అయిష్టంగానే ఉంటుంది. యేసు క్రీస్తు ఉదయాన్నే లేచి తన తండ్రితో ఏకాంతముగా మాట్లాడటానికి సమయం కేటాయించాడు. గెత్సెమనే తోటలో క్రీస్తు ప్రార్థనలో బాధపడుతుండగా నిద్రపోతున్న తన శిష్యులను చూచి ప్రార్ధించమని గద్దిస్తాడు.
-
క్రీస్తు తన అంతిమ ఉద్దేశ్యంపై గురి కలిగి ఉన్నాడు అది నెరవేరుటకు అయన ప్రతి రోజు తన తండ్రిపై ఆధారపడేవాడు తన తండ్రి చిత్తాన్ని నెరేవేర్చడమే అయన లక్ష్యం.
-
నేను దేవునికి సమయం ఇవ్వను.
నాకు గమ్యం గురించి ఎటువంటి చింతలేదు.
మరి నా జీవితంలో అంత సమయం ఉన్నపుడు నేను జీవితంలో నెరవేర్చాల్సినది ఏమిటి?
-
ఆలోచించండి .. దేవుడు నా పట్ల కలిగిన ఉద్దేశ్యాన్ని తెలుసుకోడానికి నేను వేకువనే దేవునికి సమయం ఇవ్వాలి.

13/10/2020

మీ జీవితం ఎలా ఉంది?
-
“మీ బిజీ షెడ్యూల్‌ను వివరించండి!” అని ఎవరినైనా మనము అడిగినపుడు వారు కొన్ని విషయాలను చెప్తూ ఉంటారు. ఆలా చెబుతూ ఉండగా కొంత సమయానికి నేను ఎందుకు అనవసరమైన వాటితో సమయాన్ని వృధా చేసుకుంటున్నాను అని, అలాంటివాటికి సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం లేదు అని వారు గ్రహిస్తారు.
-
కొంత మంది వారి ఆర్ధిక అవసరాల కొరకు బిజీగ ఉంటారు, కొంత మంది వారికీ ఉన్న ఉద్దేశ ప్రకారం బిజీగ ఉంటారు కానీ చాల మంది వారికీ వారు బిజీగ ఉన్నట్టు నటిస్తారు.
-
చాలామంది బిజీగా ఉంటారు కానీ వారికీ ఉన్న బిజీ నిజానికి ముఖ్యమైన పనులకు చేయుటకు మాత్రం కాదు.
బిజీ అంటే పని యొక్క విలువ దానిని ఎంత త్వరితముగా చేస్తాము అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. బిజీగా ఉండడం ప్రాముఖ్యత కాదు కానీ ఆలా బిజీగ ఉంటున్నవారు ఏ పని చేయకపోయినా తమలో తాము బిజీగా ఉన్నట్టు ఉప్పొంగిపోతుంటారు
-
చాలా సార్లు, బిజీగా ఉండటం అనేది ఒకరి అర్థరహిత జీవిత శూన్యతను కనపరుస్తుంది. తమని తాము తక్కువ అంచనా వేసుకునేవారు బిజీ అనే ముసుగు ధరిస్తారు. అంతిమంగా, ప్రతి ఒక్కరూ తమ విరిగిన మానవ స్వభావం మరియు జీవితాల యొక్క వాస్తవికతలను అంగీకరించాలి, మరియు బిజీగా ఉండటం దేవుని దయకు ప్రత్యామ్నాయం కాదని గుర్తించాలి.
-
డాక్టర్ బాబీ "జీవన విధానం సేవ భావాన్ని కనపరచాలి ." పరిచర్య అంటే కేవలం చేయడం మాత్రం కాదు గాని, అది ఒక జీవన విధానము. మీ జీవన విధానము ఎలా ఉంది?
-
BUSY అంటే bonded Under Satan Yoke ,మీరు మీ పనులలో బిజీగా ఉంటె ఇంకా మీకు దేవునితో గడిపే సమయం ఎక్కడ ఉంటుంది?
-
మనము దేవుని దృష్టిలో అనుకూలమైన పనులను చేయవలసి ఉంటుంది. మనపట్ల దేవుడు ఏ ప్రణాళికలు కలిగి ఉన్నాడో వాటినే తెలుసుకొని వాటికీ ప్రాధాన్యతలు ఇవ్వాలి.

12/10/2020

Significance of Genealogy
-
In history or probable our own experience are full of people who are striving to avoid death. If their bodies can’t keep living, may be their ideas or personality or beliefs can. So they strive to leave a legacy; they build monuments.
-
In Genesis 5 shows us that sin makes all human attempts to grasp immortality to be futile. In the midst of death of patriarchs from Adam to Lamech, it shows the unavoidable punishment that has been brought upon the entire human race because of sin. But right here in the middle of this graveyard of the patriarchs is Enoch, taken, not died. In Romans, the Apostle Paul speaks of the ‘kindness and severity of God.” Genesis 5 shows us both Gods kindness for Enoch too deserved death, and His justice, His severity.
-
Gen 5:1 says that we’re not most intelligent on earth or the best communicator . But God made us as an image bearer and He is our master. V.2 Both male and female are equally made in Gods image.
-
Enoch walked with God - with God there is no compromise, no give and take. We walk with Him. We go God’s way, Take God’s direction and travel at God’s pace. God is the pace setter, the trail blazer; we’re the followers.
-
Walking with God means, quite simple, to believe Him to trust Him. You will walk in the way you believe.
-
Enoch walked with God by following Him and ignoring the pattern of the world, by not walking with bad company. Apparently one day Enoch kept walking with God so far that God invited him to come into His house to rest.

10/10/2020

*Parents*

The pain came in waves. Tears flowed freely. She cried not just for His pain, but for the infinite number of days she should have to endure without Him.
-
Jesus looked at His mother and felt with her all the loss she was going through as He hung on the cross. He was obedient to the point of death, even when that death involved painful, humiliating public ex*****on on the cross. His obedience, however, cost others something. Had his mother bargained for this when she said to the angel Gabriel those famous words, “ i am the Lord’s servant! Let it happen as you have said”?.
-
Missionary parents have the same pain of those they love. They made the decision to obey, to make certain sacrifices, but they sometimes wonder, have they the right to make decisions to sacrifice on their children’s behalf? What happens when their children become bitter and resentful, when they feel deprived?
-
Once a preacher had spoken about how people often honor God with their lips, but not with their actions and decisions. He gives an example of Christian parents who stop their children from becoming full-time minister or missionaries. Only few parent accept their children go happily to serve God?
-
It costs us something to obey God. it cost mother and father even more to let us go. They too are obeying God. They are also involved in mission. Daily we need to pray that our generous heavenly father will give them the same joy of serving that we know, and the joy of giving their daughter/ son to the Lord.

09/10/2020

*తప్పిపోకూడదు*
*
నేను ఏమైనా తెలుసుకుంటున్నపుడు దాని ముగింపు ఏమైయుంటుందో అని ఆలోచించడానికి ఇష్టపడతాను. బైబిల్లోని వ్యక్తుల జీవితాలను చదువుతున్నపుడు, చివరికి ఏమి జరిగిందో అని తెలుసుకోవడం కోసం ఆతృతగా ఎదురు చూస్తాను. బైబిలులోని యెహోషువ జీవితం నన్నుఎంతగానో ఆకర్షిస్తుంది . ఈ గొప్ప నాయకుడు ఇలా అన్నాడు ‘ఇశ్రాయేలీయులు దేవుడు చేసిన ప్రతి వాగ్దానం నెరవేరడం కనులార చూశారు; (యెహోషువ 23: 14). వారు నూరు శాతం ఫలితాన్ని చూడగలిగారు! అలాగే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో 100% ఉత్తీర్ణత పొందాలని కోరుకుంటారు. కానీ జీవితంలో ఎదురయ్యే పరీక్షలలో విజయం సాధించడం ఎలా?
*
వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడమే యెహోషువ జీవిత లక్ష్యం. దానిని సాధించడానికి ఆయన ఎంతగానో కృషి చేసాడు. అతను తన లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం చాలా ప్రయత్నాలు మరియు వ్యూహాలు చేసాడు. దేవుని నేతృత్వంలో ఆయన తన జీవిత గమ్యాన్ని చేరడానికి తనను తాను దేవునికి అప్పగించుకున్నాడు. తల్లిదండ్రులుగా, దేవుడు మన పిల్లల పట్ల కలిగియున్న ప్రణాళిక గూర్చి మనకు తెలుసా?. ఒక వేళా ఆలా తెలియకపోతే వారి జీవిత గమ్యానికి వారు చేరగలగడానికి మనము ఏవిధముగా సహాయము చేస్తాము?
*
కాబట్టి మన పిల్లల భవిష్యత్తును ఎక్కడ కనుగొనవచ్చు? మన పిల్లల భవిష్యత్తు దేవుని దగ్గర మాత్రమే కనుగొనగలమని నేను నమ్ముతున్నాను (యిర్మీయా 29:11) బైబిల్లో పిల్లలను ఏ విధముగా పెంచాలి భవిష్యత్తులో వారు దేవునికి ఇష్టమైనవారిగా జీవించే జీవన విధానాన్ని ఏ విధముగా నేర్పించాలి అని వ్రాయబడివున్నది. వారు దేవునిలో ఎదిగే కొద్దీ దేవుని చిత్తానికి లోబడేవారిగా జీవిస్తారు.
*
కాబట్టి దేవుని వాక్యన్నీ ముందుగా తల్లిదండ్రులు నిరంతరం ధ్యానించాలి. దేవుని జ్ఞానాన్ని తల్లిదండ్రులు కలిగి ఉండటం ద్వారా తమ పిల్లలను చిన్నతనం నుండి దేవుని భయభక్తులలో పెంచుతూ ఆయన మాటలను పిల్లల మనస్సులో ఉండేలాగా చేయగలము యెహోషువ 1: 7,8 .
*
మన పిల్లల జీవితంపై దేవుని వాక్యాన్ని ఉపయోగించి వారిని ఆశీర్వదించడం ద్వారా వారి భవిష్యత్తు సన్మార్గంలో నడిచేదిగా ఉంటుంది. దేవుని మాట వారి పాదాలకు దీపంగా మరియు వారి మార్గానికి వెలుగుగా ఉంటూ, వారిని నడిపించి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకొని, సరైన భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసుకొనేవారిగా వారిని నడిపిస్తుంది. వీటన్నిటి యొక్క తుది ఫలితంగా క్రీస్తు వారిలో ఉంటూ వారు ఈ లోకానికి క్రీస్తును చూపించేవారిగా జీవిస్తారు. గల 4:19.

Telephone

Website