Hyder Shehansha

Hyder Shehansha

Telangana Jagruthi Youth Wing State President

03/10/2022

9 days of pure joy, being around loved ones and celebrations.

My best wishes to all on the occasion of Saddula Bathukamma.

23/10/2021
04/06/2021

| లోగుట్టు......

■ కవితను టార్గెట్ చేయడం వెనుక ?

■ మాజీ మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం మీడియా కాన్ఫరెన్స్ లో MLC కవిత టార్గెట్ గా కొన్ని విమర్శలు గుప్పించడంపై,TRS శ్రేణులోనూ,ఇతర రాజకీయ వర్గాల్లో నూ చర్చ జరుగుతోంది.ఈటల విలేకరుల సమావేశం ఉద్దేశం ఆయన ప్రస్తుత పరిస్తితి, భవిష్యత్తు కార్యాచరణ కాగా సంబంధం లేని కవితను ఎందుకు లాగారన్నది చర్చ.కవిత ఓడిపోయారని,తాను ఓటమి ఎరుగని నేతనని ఈటల చెప్పుకున్నారు.సింగరేణి బొగ్గుగని కార్మికుల సంఘాలలో ఆమె పాత్ర ఏమిటని ఈటల 'అటాక్'చేశారు. నిజానికి ఆయన పక్కనున్న ఏనుగు రవీందర్ రెడ్డికి కూడా రెండు సార్లు ఓడిపోయిన చరిత్ర ఉన్నది.అది ఈటల విస్మరించారు.కవిత ప్రస్తావన కాకతాళీయంగా వచ్చిందా! లేక ఎవరైనా ఆమెను రాజకీయంగా దెబ్బతీయడానికి ఈటలను వాడుకున్నారా? తెలియదు.ఈటలకు,కవితకు మధ్య గతంలో వైరమున్న దాఖలాలు కూడా లేవు.కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కవిత అనేక అంశాల్లో‌ కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టిబిజికేఎస్)ను ఏర్పాటు చేసి, సింగరేణిలో 11 రీజియన్లకు గాను, 9 రీజియన్ లలో గెలిపించి, బొగ్గుగనుల్లో కవిత గులాబీ జెండా ఎగురవేశారు.లోక్ సభ ఎన్నికల సమయంలో 185 మంది పసుపు రైతులు నామినేషన్ వేసినా, పసుపు బోర్డు ఏర్పాటు పేరుతో బీజేపీ బాండ్ పేపర్ రాసి ఒత్తిడి పెంచినా, ఎమ్మెల్సీ కవిత గట్టిగా ఎదుర్కొన్నారనడానికి నిజామాబాద్ లోక్ సభ పరిధిలో టీఆర్ఎస్ ఓటు బ్యాంకును పెంచుకోగలగడం ఒక నిదర్శనం.అనంతరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో కవిత ఘన విజయం సాధించారు.రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నందుకే అనేకమంది ఎమ్మెల్సీ కవిత పైనే విమర్శలు ఎక్కుపెడుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.కొన్ని రోజులుగా ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు.అధికార పార్టీలో ఎందరో ప్రముఖులు ఉన్నా, ఎమ్మెల్సీ కవిత మాత్రమే ప్రతిపక్షాలకు ఎందుకు టార్గెట్ అయ్యారన్నది ప్రశ్న. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నాటి నుంచి నేటి వరకు రాష్ట్రంలో రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాల్లో ఎమ్మెల్సీ కవిత ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఉద్యమ సమయంలో సబ్బండ వర్ణాలను ఏకం చెయ్యడంలో ఎమ్మెల్సీ కవిత కీలకంగా పనిచేశారు. ‌మహిళలను సంఘటిత పరిచి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. 'తెలంగాణ జాగృతి' సంస్థను ఏర్పాటు చేసి, బతుకమ్మ పండుగను, తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేశారు.సమైక్య పాలనలో ట్యాంక్ బండ్ మీద బతుకమ్మ పండుగను జరుపుకునేందుకు అప్పటి పాలకులు అనుమతి ఇవ్వలేదు.న్యాయస్థానంలో పోరాడి హైదరాబాద్ లో లక్షలాది మంది ఆడబిడ్డలతో బతుకమ్మను‌ జరిపించారు. తెలంగాణ జాగృతి ద్వారా అనేక దేశాలలో బతుకమ్మ పండుగను‌ జరిపేలా చేశారు.ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ప్రవాసులు భాగస్వామ్యం అయ్యేలా చేయడంలో కవిత పాత్ర కీలకం.త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగనున్నట్టు వెలువడుతున్న వార్తలలో ఆమె పేరు కూడా వినిపిస్తోంది.ముఖ్యమంత్రి కేసీఆర్ మదిలో ఏమున్నదో ఎవరికీ తెలియదు.ఈ లోగా కవితను రాజకీయంగా damage చేయడం 'కొంతమంది'లక్ష్యంగా కనిపిస్తున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.

14/02/2021

తెలంగాణా బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలుగా మరోసారి ఏక్రీవంగా ఎన్నికైన సోదరి శ్రీమతి కల్వకుంట్ల కవిత అక్క గారికి హృదయ పూర్వక హర్థిక శుభాకాక్షలు...

Photos from Hyder Shehansha's post 10/01/2021

ఎడపెల్లి వద్ద రాజ్యాంగ నిర్మాత, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్సీ కవిత గారు.

Telephone

Website

Address

Telangana Bhavan, Banjara Hills
Road No:10
500048