KCR Fans

KCR Fans

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from KCR Fans, Social service, .

07/04/2024

24/12/2023

తెలంగాణ పౌరుషం...

27/11/2023
25/11/2023

BRS జోరు.. ప్రతిపక్షాల బేజారు..

18/09/2023

09/06/2023

విక‌లాంగుల‌కు సీఎం శ్రీ కేసీఆర్ శుభవార్త.

తెలంగాణ రాష్ట్రంలోని విక‌లాంగుల‌కు ఆస‌రా పింఛన్ రూ. 1000 పెంచుతున్న‌ట్లు ప్రకటించిన సీఎం శ్రీ కేసీఆర్. పెంచిన పింఛన్లు వ‌చ్చే నెల నుంచి అమ‌లు

#తెలంగాణదశాబ్దిఉత్సవాలు

Photos from KCR Fans's post 18/05/2023

See the change...

30/04/2023

నూతన సచివాలయం సంబరాల్లో బాణాసంచా వెలుగులు తప్పక చూడాల్సిందే..|| Telangana New Secretariat Night View

15/04/2023

తెలంగాణ రాష్ట్ర ప్రగతి అంబేడ్కర్ మార్గంలో అభివృద్ధి సాధిస్తుంది.. || JNTV TELANGANA || Ambedkar

21/03/2023

02/02/2023

కొద్దిసేపటి క్రితమే మరణించిన ప్రముఖ దర్శకులు కె విశ్వనాథ్ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను..
- ముఖ్యమంత్రి KCR

18/12/2022

ఇది హైదరాబాద్

04/12/2022

We are Strong.. We Rule the Country..
|| BRS VOICE ||
https://www.facebook.com/TelanganaFest?mibextid=ZbWKwL

29/11/2022

ఆరు దశాబ్దాల తెలాంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఆపూర్వ ఘట్టం. సబ్బండ వర్గాలని ఏకం చేసిన దీక్ష.
ప్రాణాలకి తెగించి కేసీఆర్ చేసిన ఆమరణ నిరాహారదీక్ష.
దీక్షా దివస్ నవంబర్ 29.

25/10/2022

చేనేత పై GST పూర్తిగా ఎత్తివేయాలని
కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ...
TRS పార్టీ ప్లీనరీ సమావేశంలో తీర్మానం
ఆమోదించింది...!

07/10/2022

Like and share BRS PARTY Social Media Force..
https://www.facebook.com/TelanganaFest

BRS Social Media Force Spread the word '' INDIAN "

05/10/2022

BRS జాతీయ అధ్యక్షులు KCR గారి అభిమాని

ఒక వ్యక్తి అభిమానంతో ఇలా తెలంగాణ BRS కార్యాలయం వద్ద సందడి కార్యక్రమంలో భాగంగా

05/10/2022

https://youtu.be/U4-Gx1-WsWg
TRS నుండి BRS (భారత్ రాష్ట్రీయ సమితి) గా స్వయంగా ప్రకటించిన KCR.. || Barath Rastriya Samithi ||

05/10/2022

TRS to BRS

03/10/2022

ఒక్కడితో మొదలై
అసాధ్యామనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి
కొత్త రాష్ట్రానికి స్వచ్ఛమైన పాలనను అందించి
భారతావని సేవకై కదులుతున్న #కేసీఆర్ గారికి జయిభవ-విజయిభవ

దేశ్ కా నేత కేసీఆర్

జై భారత్ జై తెలంగాణ జై #కేసీఆర్ జయహో కిషోరన్న ✊🏻✊🏻✊🏻

28/09/2022

దేశానికి కెసిఆర్ అడుగుజాడ..

వ్యవసాయ పాలసీ సమగ్రంగా అమలు చేయగలిగే ఆలోచన ఉన్న నాయకుడు కేసీఆర్‌ ఒక్కరే. రష్యాలో ఒక విధానం ఉంది. దేశ జనాభా ఎంత? ఏ పంట ఎక్కడ పండుతుంది? తదితర వివరాలతోపాటు ఆ దేశంలో ప్రతి పంటకు అగ్రిమెంట్‌ ఉంటుంది.

ధర కూడా ముందే ఫిక్స్‌డ్‌ ఉంటుంది. రొటేషన్‌ పద్ధతిలో రైతు.. పండే పంటనే వేస్తాడు
వెంటనే పార్టీ పెట్టాలి.. ఇప్పటికే ఆలస్యమైంది
మేమంతా చేరుతాం.. దేశమంతా తెలంగాణ కావాలి
సంక్షేమం.. అభివృద్ధి జరగాలి.. ద్వేష రాజకీయాలు పోవాలి

కర్ణాటక రాష్ట్ర ప్రజా ప్రతినిధుల మనసులో మాట
నమస్తే తెలంగాణ బృందం పర్యటనలో ఆసక్తికర విషయాలు

ఘనత వహించిన డబుల్‌ ఇంజిన్‌ సర్కారు పరిపాలనలో ఉన్న కర్ణాటకలో ఆ రాష్ట్ర గ్రామీణ రాజకీయ నాయకులు ముక్తకంఠంతో వ్యక్తంచేస్తున్న అభిప్రాయాలివి. బీజేపీ నిష్క్రియాపరత్వం.. అసమర్థ పాలనతో విసిగిపోయిన కర్ణాటకకు.. దేశానికి సరికొత్త దారి చూపించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక్కడే సమర్థుడని నాయకులు అంటున్నారు. తెలంగాణ రైతుబంధు చూసే మోదీ కూడా పీఎం కిసాన్‌ ఇచ్చారు. కేసీఆర్‌ దార్శనికతకు ఇదే నిదర్శనం. నమస్తే తెలంగాణ బృందం కర్ణాటకలోని పలు గ్రామాల్లో క్షేత్రస్థాయి పర్యటన జరిపినప్పుడు అక్కడి నాయకులు కేసీఆర్‌ జాతీయ రాజకీయ ప్రవేశంపై ఎంతో ఆసక్తి కనపరిచారు. పార్టీ పెడితే చాలు.. తాము అందులో చేరుతామని ఉత్సాహంగా చెప్పారు. కర్ణాటక నుంచి నమస్తే తెలంగాణ బృందం ప్రత్యేక రిపోర్ట్‌

వ్యవసాయ పాలసీ సమగ్రంగా అమలు చేయగలిగే ఆలోచన ఉన్న నాయకుడు కేసీఆర్‌ ఒక్కరే. రష్యాలో ఒక విధానం ఉంది. దేశ జనాభా ఎంత? ఏ పంట ఎక్కడ పండుతుంది? తదితర వివరాలతోపాటు ఆ దేశంలో ప్రతి పంటకు అగ్రిమెంట్‌ ఉంటుంది. ధర కూడా ముందే ఫిక్స్‌డ్‌ ఉంటుంది. రొటేషన్‌ పద్ధతిలో రైతు.. పండే పంటనే వేస్తాడు. అలాంటి విధానం అమలు చేయడం ఒక్క కేసీఆర్‌తోనే సాధ్యమవుతుంది. 90 శాతం కేసీఆర్‌ ఆలోచనలు ఇలానే సాగుతున్నాయి. కేసీఆర్‌ ఆలోచన చాలా గొప్పగా ఉంటుంది. కర్ణాటకలోనే ముగ్ధంపూర్‌ గ్రామానికి చెందిన స్థానిక వార్డు మెంబర్‌ రఘువీర్‌ బలమైన అభిప్రాయమిది.

'కేసీఆర్‌ అవరిగె బసవేశ్వరన ఆశీర్వాదవిదె. నావెల్ల నిమ్మ హిందె ఇద్దేవె. దేశవన్ను కాపాడలు నీవు దేశద రాజకీయక్కె బరబేకు. దేశదల్లి తెలంగాణ దల్లిరువ యోజెనగళు జారిగె తరబేకు. ఒందు అద్భుతవాద చరిత్ర సృష్టి ఆగుత్తదె. మత జగడగళ నడువె దేశద అభివృద్ధి క్షీణిసుత్తిరువ రాజకీయ నాయకరు గళిగె బుద్ధి కలిసలు నీవు బరబేకు. నమ్మజీవన పరిస్థితి బదలాగబేకు..(కేసీఆర్‌ ఆ బసవేశ్వరుడి ఆశీస్సులు మీకు పుష్కలంగా ఉంటాయి. మీ వెంటే మేమంతా. దేశాన్ని కా పాడేందుకు మీరు జాతీయ రాజకీయాల్లోకి రావాలి. దేశమంతా తెలంగాణ పథకాలను అ మలు చేస్తే ఓ అద్భుత చరిత్ర ఆవిష్కృతమవుతుంది. మతఘర్షణలతో అభివృద్ధిని కుంటుపట్టిస్తున్న నాయకులకు బుద్ధి చెప్పడానికి మీరు రావాలి. మా బతుకులు మార్చాలి) అని కర్ణాటకవాసులు బలంగా కోరుకొంటున్నారు. దేశం ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నదని, గట్టెక్కించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ జాతీయ పార్టీ స్థాపించాలని అక్కడి స్థానిక రైతులు, వ్యాపారులు, మహిళలు, వివి ధ కులవృత్తుల వారు ముక్తకంఠంతో కోరుతున్నారు. తెలంగాణ సరిహద్దుల్లోని కర్ణాటకలోని పలు గ్రామాల్లో 'నమస్తే తెలంగాణ' బృందం పర్యటించినప్పుడు అక్కడి స్థానిక నాయకులు అనేక అంశాలను పంచుకొన్నారు.



కేసీఆర్‌ దార్శనికత కావాలి
కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెడితే.. తామే ముందుగా ఆ పార్టీలో చేరుతామని కాంగ్రెస్‌ నేత మల్లేశ్‌ ఢంకా బజాయించి మరీ చెప్తున్నారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ ప్రవేశం ఇప్పటికే ఆలస్యమమైందని.. ఇప్పటికైనా కేసీఆర్‌ జాతీయ పార్టీ పెట్టి దేశమంతా సంక్షేమ ఫలాలు కాయించాలని మరో నాయకుడు సంగన్న కోరుకొంటున్నారు. హైదరాబాద్‌ నుంచి తెలంగాణ శివారుల్లో పర్యటించిన 'నమస్తే తెలంగాణ'బృందంతో అక్కడి నేతలు కేసీఆర్‌ జాతీయ రాజకీయాలపై తమ ఆలోచనలు పంచుకొన్నారు. ప్రధాని మోదీ దేశమంతా ద్వేష రాజకీయాలకు బీజం పోస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్‌ లాం టి విజన్‌ ఉన్న నాయకుడు దేశానికి అవసరమని నినదించారు. తెలంగాణ పథకాలు దేశమంతా మార్మోగుతున్నాయని తెలిపారు.

బీజేపీపై విసిగిపోయిన కర్ణాటక నేతలు
దేశంలో పాలన మాటెలా ఉన్నా.. కర్ణాటక లో బీజేపీ సర్కారు రాజకీయానికి అక్కడి నేతలే విసిగిపోయారు. ఉద్యోగాల్లో, కాంట్రాక్టుల్లో బరితెగించి.. బాజాప్తాగా కమీషన్ల దందా నడిపిస్తుండటం.. దీనికితోడు.. రెండేండ్లకో ముఖ్యమంత్రిని మార్చుకొంటూ.. అస్థిరతను సృష్టించి అభివృద్ధిని గాలికి వదిలేశారని కుంచావరం పంచాయతీ సభ్యుడు చిరంజీవి ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వస్తేనే దేశంలో విద్వేష రాజకీయాలకు తెరపడుతుందని తాలూకా పంచాయతీ సభ్యుడు రమేశ్‌ మాసానీ అన్నారు. సంక్షేమం ఎలా చేయాలో.. తెలంగాణను చూసి నేర్చుకోవాలని మరో నాయకుడు శ్యామప్ప చెప్పారు. రైతు పథకాలపై కుంచారం నాయకుడు నర్సింహులు ప్రశంసలు కొనియాడారు. ఇలాంటి పథకాలు దేశమంతా విస్తరించాలని గ్రామాలు.. పట్టణ ప్రాంతాల నాయకులు ఆకాంక్షించారు.

మార్పు కేసీఆర్‌తోనే సాధ్యం
వ్యవసాయ పాలసీ సమగ్రం గా అమలు చేయగలిగే ఆలోచన ఉ న్న నాయకుడు కేసీఆర్‌ ఒక్కరే. రష్యాలో ఒక విధా నం ఉన్నది. దేశ జనాభా ఎంత ఉన్నది? ఏ పంట ఎక్కడ పండుతుంది? తదితర వివరాలతోపాటు ఆదేశంలో ప్రతి పం టకు అగ్రిమెంట్‌. ధర కూడా ముందే ఫిక్స్‌గా ఉంటుంది. రొటేషన్‌ పద్ధతిలో రైతు.. పండే పంటనే వేస్తాడు. అలాంటి విధానం అమలు చేయడం ఒక్క కేసీఆర్‌తోనే సాధ్యమవుతుంది. ఈ విధానం తో కేసీఆర్‌ సులభంగా ప్రధాని అయిపోతారు. 90 శాతం కేసీఆర్‌ ఆలోచనలు ఇలానే సాగుతున్నాయి. కేసీఆర్‌ ఆలోచన చాలా గొప్పగా ఉంటుంది. కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి రావాలి. మోదీ ప్రభుత్వానికి ఒక ఎజెండా ఉంది. ముస్లింలను, పాకిస్తాన్‌ను తిడితే ఓట్లు పడుతాయని వారి రాజకీయం నడుస్తుంది. కర్ణాటకలో ఉన్న డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ప్రజల నడ్డి విరుస్తున్నది. 40 శాతం కమీషన్‌ సర్కార్‌ అని కర్ణాటకలో ట్రెండ్‌ నడుస్తున్నది. కాంగ్రెస్‌ హయాం లో 10శాతం కమీషన్‌ సర్కార్‌ అని పేరు ఉండేది. ఈ రెండు పార్టీలు అవినీతితోనే నడుస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్‌ వస్తే మంచి జరుగుతుంది. మా ప్రాంతానికి ఇంతకుముం దు హైదరాబాద్‌ కర్ణాటక అని పేరు.. బీజేపీ వచ్చాక కల్యాణ కర్ణాటక అని పేరు పెట్టారు. అభివృద్ధి మాత్రం పట్టించుకోలేదు.
– రఘువీర్‌, వార్డ్‌ మెంబర్‌, ముగ్ధంపూర్‌, కర్ణాటక

తెలంగాణలో జవాబుదారీతనం
బీజేపీ పాలన చెత్తగా ఉన్నది. మోదీవి మాటలే. చేతలు లేవు. గొ ప్పలు చెప్పుకోవడం కాదు.. మనం చేసే పని మాట్లాడాలి. తెలంగాణలో పథకాల గురించి దేశవ్యాప్తంగా చ ర్చ జరుగుతున్నది. దానికి కారణం కేసీఆర్‌. తెలంగాణలో జవాబుదారీతనం ఉన్నది. మా కర్ణాటకలో లేదు. బెంగళూరు ఐటీ హబ్‌గా ఉండేది. ఇప్పుడు అన్ని కంపెనీలు ఇతర రాష్ర్టాల వైపు వెళ్తున్నాయి. అది మా దౌర్భాగ్యం. మా ప్రాంతాలకు సీఎం ఒక్కసారి మాత్రమే వచ్చారు. సమస్యలు పట్టించుకోలేదు.
– రమేశ్‌ మాసాని, వార్డు మెంబర్‌, బీఎస్‌పీ, పోచారం, కలబుర్గి

కేసీఆర్‌ పార్టీలో చేరుతాం
కర్ణాటకలో బీజేపీ పాలన అట్టర్‌ఫ్లాప్‌. కమీషన్‌ లేకుండా ఇక్కడ ప్రభుత్వం కనీసం రోడ్లు కూడా వేయదు. సమస్యలు చెప్పడానికి వెళితే కేసులు పెడతామని బెదిరిస్తుంది. కేంద్ర పాలన అట్టర్‌ ఫ్లాప్‌. తెలంగాణ పరిపాలన చాలా గొప్పగా ఉన్నది. రై తుబంధు, దళితబంధు, పింఛన్‌, రైతు బీమా చాలా గొప్ప పథకాలు. మేం చూస్తు న్నాం కదా వారి సంతోషం. మా దగ్గర అ లాంటి పథకాలు లేవని బాధపడుతున్నాం. జాతీయ రాజకీయ పార్టీని కేసీఆర్‌ అనౌన్స్‌ చేయడమే ఆలస్యం.. చాలా మంది కాంగ్రెస్‌ నాయకులు ఆ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. నేను ముందుగా చేరుతాను.
– మల్లేశ్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, కుంచారం, కర్ణాటక

బీజేపీ అంటే కమీషన్‌ దందా
కమీషన్‌ దందాతో బీజేపీ ప్రభుత్వం జోరు నడుస్తున్నది. కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి రావడాన్ని మేం ఆహ్వానిస్తున్నాం. రైతులకు తెలంగాణ ప్రభుత్వం కల్పించే ఏం పథకం ఇక్కడ లేదు. కేసీఆర్‌ విజన్‌ ఉన్న నాయకుడు. ఆయనలాంటి నేత దేశం కోసం పనిచేయడం గొప్ప విషయంగా భావించాలి. నరేంద్రమోదీ ప్రధాని అనే విషయం మరిచిపోయి ఓట్ల రాజకీయం చేస్తున్నాడు. ఇదేం ప్రజాస్వామ్యం? బీజేపీకి బుద్ధి చెపాల్సిందే.
– చిరంజీవి, తాలుకా పంచాయతీ సభ్యుడు, కుంచారం, కర్ణాటక.

కేసీఆర్‌ లేకుంటే కేంద్రం చేసేది కాదు
తెలంగాణ పథకాలు భేష్‌. అట్లాం టి పథకాలు ఒక్కటి కూడా మా రాష్ట్రం లో లేదు. కేసీఆర్‌ ఎందుకు రావాలి జాతీయ రాజకీయాల్లోకి అని అడిగితే సవాలక్ష కారణాలు చెప్పొచ్చు. రైతు కష్టం తెలిసిన వ్యక్తి కేసీఆర్‌. రైతులకు ఏం చెయ్యాలనే దానిపై ఆయనకు స్పష్టమైన అవగాహన ఉన్నది. బిడ్డ పెండ్లి చెయ్యాలంటే కష్టంగా ఉ న్న కుటుంబాలకు కల్యాణలక్ష్మితో ఆదుకొంటున్నారు. మేం కేసీఆర్‌ను ఆహ్వానిస్తున్నాం. ఇప్పటికే ఆలస్యమైంది. ఇప్పటికైనా రావా లి. కేసీఆర్‌ రైతుబంధు చూసే కేంద్రం పీఎం కిసాన్‌ ఇస్తున్నారు. కేసీఆర్‌ ఆలోచించకపోతే అది కూడా వారు చెయ్యకపోదురు.
– సంగన్న, వార్డు నెంబర్‌, శివరాంపురం, కర్ణాటక

దేశానికి కేసీఆర్‌ అవసరం చాలా ఉన్నది
కర్ణాటక రాజకీయాలు చిత్రంగా ఉంటాయి. సీఎంలు వారి కుర్చీ కాపాడుకోవడానికే సమయం వినియోగిస్తారు. సీఎంలను మార్చుకుంటూ బీజేపీ చోద్యం చూస్తుంటుంది. రెండేండ్లకు ఒక సీఎం మారుతుంటే అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది? గ్రామాల్లో రోడ్లు సరిగా లేవు. దవాఖానల్లో సౌకర్యాలు ఉండవు. ప్రజాప్రతినిధిగా ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోరు. తెలంగాణలో మాదిరిగా అభివృద్ధి జరగాలం టే సీఎం కేసీఆర్‌ లాంటి నాయకుడు దేశానికి చాలా అవసరం. రాష్ట్రం కోసం ప్రాణత్యాగానికైనా వెనుకాడని నాయకుడు కేసీఆర్‌. ఆయన జాతీయ రాజకీయాల్లోకి రా వాల్సిన అవసరం చాలా ఉన్నది. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశవ్యాప్తం కావాలంటే ఆయన జాతీయ రాజకీయల్లోకి అడుగుపెట్టాలి. రైతు చనిపోతే రూ.5 లక్షల రైతుబీమా పదిహేను రోజుల్లో అందుతుం ది. ఒక్క రూపాయి లంచం లేకుండా ఏకం గా బాధితుల ఖాతాల్లోనే డబ్బులు పడుతున్నాయి. ఇది చాలా గొప్ప విషయం. పిం ఛన్ల డబ్బులు పెంచాల్సిన అవసరం తెలంగాణను చూసైనా కర్ణాటక నేర్చుకోవాలి.
– శ్యామప్ప, వార్డ్‌ మెంబర్‌. కానగడ్డ, యాద్గిరి జిల్లా

రైతుబీమా గొప్ప పథకం
లంచాలు, దౌర్జన్యాలతో బీజేపీ నిలువు దోపిడీ చేస్తున్నది. ఉద్యోగాలను అమ్ముకొనే సంస్కృతి ఒక్క బీజేపీలోనే ఉన్నది. వ్యవస్థను మొత్తం నాశనం చేస్తున్నది. అభివృద్ధి ఏం జరగడం లేదు. అన్ని ధరలు పెంచారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచారు. నిత్యావసర సరుకుల ధరలు పెంచారు. పన్నుల పేరుతో సామాన్య జనంపై మోయలేనంత భారం వేశారు. తెలంగాణలో రైతుబీమా చాలా గొప్ప పథకం. అట్లాంటి పథకం దేశవ్యాప్తంగా ఉండాలి.
– నర్సింహులు, తాలూకా పంచాయతీ మాజీ సభ్యుడు, కుంచారం, కర్ణాటక

25/09/2022

అమ్మతో బతుకమ్మ😊😊

సబ్బండ వర్ణాల పండుగ సద్దుల‌ బతుకమ్మ శుభాకాంక్షలు: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క....!!

రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ సంస్కృతి,సాంప్రదాయాలకు ప్రతీకైన 'బతుకమ్మ' పండుగ శుభాకాంక్షలు.ఇంటిల్లిపాదీ ఏకమై,ఊరువాడ ఒక్కచోట చేరి రంగురంగుల పూలను పేర్చి ఆడబిడ్డలు ఆనందంగా జరుపుకునే ప్రకృతి పండుగ బతుకమ్మ.ఆదివారం నుండి తొమ్మిది రోజుల పాటు ప్రభుత్వం బతుకమ్మ వేడుకలను రాష్ట్ర పండుగగా అధికారికంగా ఘనంగా నిర్వహించడం మనందరికీ గర్వకారణం.బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ గారు పుట్టింటి కానుకగా కోటికి‌ పైగా చీరలను అందిస్తూ మహిళలకు గొప్ప గౌరవాన్ని అందిస్తున్నారు....

తెలంగాణ రాష్ట్రానికే ప్రత్యేకమైన బతుకమ్మ పండుగను కేవలం మన రాష్ట్రంలోనే గాక, దేశ విదేశాలలో ఉన్న తెలంగాణ బిడ్డలంతా వారి ప్రాంతంల్లో ఘనంగా నిర్వహిస్తూన్నారు.తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ ఏడాది ఎనిమిది దేశాలలో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలుపుటకు సంతోషిస్తున్నాను. దీంతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో,ముంబై లాంటి కీలక నగరాల్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది....

- ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క

Kalvakuntla Kavitha Kalvakuntla Kavitha Office

18/09/2022

తమ బిడ్డకు పేరు పెట్టుకోవాలనే ఆ తల్లిదండ్రుల తొమ్మిదేండ్ల కల సిఎం కెసిఆర్ గారి చేతుల మీదుగా ఫలించింది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన భూపాలపల్లి మండలం, నందిగామ గ్రామానికి చెందిన సురేశ్ అనిత దంపతులు 2013 లో ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. తమ బిడ్డకు నాటి ఉద్యమ రథసారథి నేటి ముఖ్యమంత్రి కెచంద్రశేఖర్ రావు గారితోనే నామకరణం చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ ఆడపిల్లకు ఇప్పటిదాకా పేరుపెట్టకుండానే పెంచుకుంటూ వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ స్పీకర్, స్థానిక నేత ఎమ్మెల్సీ మధుసూధనా చారి చొరవ తీసుకుని, తల్లిదండ్రులను బిడ్డను ప్రగతి భవన్ కు తోడ్కొని వచ్చారు.
విషయం తెలసుకున్న సిఎం కెసిఆర్ దంపతులు, సురేష్ అనిత దంపతులను దీవించి వారి తొమ్మిదేండ్ల ఆడబిడ్డకు..‘మహతి ’ అని నామకరణం చేసారు. తమ ఇంటికి వచ్చిన వారికి స్వయంగా సిఎం దంపతులు బట్టలు పెట్టి సాంప్రదాయ పద్దతిలో ఆథిత్యమిచారు. బిడ్డ చదువుకోసం ఆర్థిక సాయాన్నందించారు. తమ తొమ్మిదేండ్ల కల ఫలించడమే కాకుండా, వూహించని రీతిలో తమను ఆదరించి దీవించిన తీరుకు, సురేష్ కుటుంబం సంబ్రమాశ్చర్యాలకు లోనయ్యింది. ఈ సందర్భంగా వారు సిఎం దంపతులకు తమ కృతజ్జతలు తెలుపుకున్నారు.

Videos (show all)

#kcr
తెలంగాణ పౌరుషం...
Harish Rao
ఇది తెలగాణ పార్టీ..
దీక్షా దివస్..
పల్లా ప్రచార హోరు..
BRS జోరు.. ప్రతిపక్షాల బేజారు..
నూతన సచివాలయం సంబరాల్లో బాణాసంచా వెలుగులు తప్పక చూడాల్సిందే..|| Telangana New Secretariat Night View
దమ్ముంటే రా...

Website