Shyam Rao Jhade

Shyam Rao Jhade

Shyam Rao Jhade, Bharata Prajakeeya Party. working for peoples empowerment through peoples manifesto.

12/08/2023

కొత్త దారిని ఎంచుకోవడానికి సంకోచించకు, ఒక్కోసారి ఒంటరి ప్రయాణమే.. గమ్యానికి సులభంగా, త్వరగా చేర్చుతుంది.

Adithya Chinni

20/07/2023
15/05/2023

హృదయంలో కల్మషం పెట్టుకుని నోటితో దేశభక్తి జపం ఎంతచేసినా సుగంధ పరిమళాలు వెదజల్లబడవు.

-భారత ప్రజాకీయ పార్టీ

25/12/2022

క్రిస్టియన్ సోదర సోదరీమణులందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు

29/04/2022

నాటి రాజుల గెలుపోటములు యుద్ధంలో పాల్గొనే సైనికుల భుజబలాలపై పోరాట పఠిమపై ఆధారపదేవి.

నేటి అభ్యర్థుల జయాపజయాలు ఓటర్ల నీతి నిజాయితీలపై ఆధారపడిఉన్నాయి.

నాడు కండబలంతో వీరోచిత పోరాటాలతో లక్షలాది సైనికుల భళిదానాలతో కిరీటాలు మారితే,

నేడు బుద్ధిబలంతో ఓటరు అంతర్మథనంలో జరిగే నిశ్శబ్దమహాసంగ్రామంతో కుర్చీలు మారుతున్నాయి.

ఏవిధంగా చూసిన నేటి ప్రజాస్వామ్య వ్యవస్థనే సర్వవిధాలా శ్రేయస్కరం.

ఓటరే సూపర్ పవర్. ఓటరును భయబ్రాంతులకు మరియు ప్రలోభాలకు గురిచేయడం ప్రజాద్రోహం. కనుక ప్రజాదండనకు అర్హులే.

04/03/2022

రాజులుచేసేది రాజకీయం, ఇప్పటివరకు మనకు తెలిసిన ప్రక్రియ రాజకియమే. ఈ వ్యవస్థ ద్వారా కొనసాగే పాలనలో బలవంతులు, ధనవంతులు భగస్వామ్యులై కుల మత ప్రాతిపధికన ప్రజలను విభజిస్తూ దేశాన్ని పాలిస్తారు. (ఇప్పటికీ వాటి అవశాలు కనిపిస్తాయి) దేశ సంపదను ధనవంతులకు, భలవంతులకు, పెట్టుబడి దారులకు దారాదత్తం చేస్తుంది రాజకీయ వ్యవస్ధ. ఇక్కడ పాలకులు ప్రజలను యాచకులుగ, పాలకుల దయాదక్షిణ్యాలమీద బ్రతుకుతున్న పరాన్నజీవులుగ పరిగణిస్తారు, ప్రజలు రాజుల ముందు బానిసలుగా చేతులు కట్టుకుని నిలబడవలసి వస్తుంది. ఇక్కడ ధనవంతుల, భలవంతుల, వ్యాపారవేత్తల ఆధిపత్యమే ప్రధాన భూమిక నిర్వహిస్తుంది.

ప్రజాకీయప్రక్రియ అంటే ప్రజలు తమ శ్రేయస్సుకొరకు తామే కృషిచేసుకోవడముకొరకు పాలనలో భాగస్వామ్యం కావడమనే అర్థంవస్తుంది. కుల,మత ప్రమేయం లేకుండ కేవలం పౌరసత్వ ప్రాతిపదికన, పౌరసాధికారతకు అంటే ప్రజలకు కావలసిన కనీస అవసరాలైన కూడు,గూడు,గుడ్డ,విద్యా, వైద్యం, ఉపాధికల్పన కేవలం ప్రభుత్వ ఆధీనంలో మాత్రమే కొనసాగుతూ దేశప్రజలందరికీ అందుబాటులోకి తేవడానికి కృషిచేసే ప్రజలపక్షపాత పాలనను ప్రజాకీయప్రక్రియ లేదా ప్రజాకీయ పాలన అంటారు. ఇక్కడ పౌరులే, పౌరులకొఱకు,పౌరులతో దేశం ప్రజాస్వామ్య స్పూర్తితో పాలించబడుతూ, కులమత ప్రమేయంలేకుండ తమలోని ఒకరిని తమ ప్రతినిధిగా ఎంచుకుని చట్టసభలకు పంపి పౌరమ్యనిఫెస్టో అమలుకై నడిచే పాలనను ప్రజాకీయపాలన అంటారు.

ప్రజాకీయ పాలన కొరకు ఆవిర్భవించినదే భారత ప్రజాకీయ పార్టీ. దీనికి ఏఒక్కరు యజమానులు కారు. ఆయా నియోజకవర్గాల ఓటరులే ఈ పార్టీకి అదినేతలు.బాసులు.యజమానులు. ఇక్కడ సమిష్టి నిర్ణయాలు వ్యక్తిగత బాధ్యతలు ఉంటాయి.

20/02/2022

భారత స్వాతంత్రోద్యమానికిగాని, ఇటీవల మన కండ్ల ముందు విజయం సాధించిన తెలంగాణ సాధన ఉద్యమానికిగాని కేటాయించిన బడ్జెట్ ఎంత ?

పై ప్రశ్నను బాగా అధ్యాయనంచేస్తే వచ్చేజవాబు ఇక్కడ బడ్జెట్ లేదా పెట్టుబడి కేవలం *సంకల్పం* మరియు జరుగుతున్న నష్టాన్ని నివారించాలనే బలమైన కోరిక మాత్రమే అన్నవిషయం ఇట్టే అవగతమవుతుంది.

పై అంశాన్ని రాజకీయాలకు అన్వయించి చూస్తే, స్వాతంత్య్రం వచ్చిన మొదటి, మూడు నాలుగు దశాబ్దాలవరకు ఎన్నికలలో అభ్యర్థులు చేసిన ఖర్చుకూడా నామమాత్రమేనని స్పష్టం అవుతోంది. ఎప్పుడైతే రాజకీయాలు వ్యాపారదృక్పదంలోకి మార్చబడ్డావో అప్పటినుండే సామాజికస్పృహ... సేవాదృక్పధం.... మంచివారి పాలన తదితర పదాలు సిగ్గుతో తలవంచుకుని ఎన్నికల ముఖచిత్రము నుండి దాదాపు వైదొలిగాయనడంలో ఏలాంటి అనుమానమేలేదు.

ప్రస్తుతం మనుగడలో ఉన్న జాతీయ మరియు ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఇంతగనం ఖర్చు పెట్టడానికి ఓటువేయించుకోవడం ఒక్కటే ప్రధానమైనప్పుడు ఇంతగనం హడావిడి అవసరమా ?

అదే "ఓటు" ప్రజలు ఒక మంచిజరగాలనే దృఢమైన సంకల్పంతో తలుచుకుంటే ఏమవుతుందో ఒకసారి ఆలోచిద్దాం. రాజకీయ పార్టీలు తమ కార్యకర్తలకు పంచే డబ్బులకు ఓటర్లకు ఎలాంటి సంభంధంలేదు. రాజకీయ పార్టీలు తమ బలప్రదర్శన చేయడానికి ఓటర్లకు ఎలాంటి సంభంధంలేదు. రాజకీయ పార్టీల నాయకులు విలాసవంతమైన వాహనాలలో తిరగడానికి ఓటర్లకూ ఏలాంటి సంభందమేలేదు.

ఓటరు తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఏమైనా ఫీజులు ఉన్నాయా ? ఎన్నికల ప్రచారానికి, ఓటరు ఓటువేయడానికి డబ్బులతో సంభందం లేనప్పుడు. రాజకీయ పార్టీల కార్యక్రమాల నిర్వహణకు చేసే ఖర్చులకు ఓటువేసే ఓటరుకు ముడిపెట్టడం ఇదెక్కడి న్యాయమో !?
చట్టబద్ధంగ, న్యాయబద్దంగ, ధర్మబద్ధంగ ఆలోచించవలసిన అవసరం ఉంది.

అభ్యర్థులు లేదా పార్టీలు ఓటర్లకు తమవాదన, ప్రతిపాదించిన మ్యానిఫెస్టో వివరించడానికిగాను చేపట్టే కార్యక్రమాలకు కొంత (నామమాత్రపు) డబ్బు అవసరం ఉంటుంది. దాన్ని ఎవరూ కాదనే ప్రశ్న ఉద్భవించదు, కానీ ప్రతిపాదిత లక్ష్యాన్ని కేవలం డబ్బులతోనే ముడిపెట్టడం గరిష్టస్థాయిలో అంటే కోట్లాది రూపాయలు లేకపోతే, ఎంచుకున్న లక్ష్యసాధనకు పూనుకోక పోవడమనేది అత్యంత బాధాకరంగా తోస్తుంది.

ఇటీవల ఎవరినోట విన్నా ఒకటే మాట వినబడుతుంది. డబ్బులు లేవుకదా ఎట్లా ?
రాజకీయాలను పెట్టుబడితో కూడిన వ్యాపారాలతో ముడిపెట్టి, ఎన్నికలను ఒక పెద్ద కొరకరానికొయ్యగా మార్చి, ఒక అత్యంత సామాన్య ఎన్నికల క్రతువును డబ్బుతో ముడిపెట్టి, ఆర్థికంగ ఎదుర్కోలేని సామాజికసృహ మరియు సేవాదృకపదం కలిగిన మంచివారిని రాజకీయాలకు దూరంచేయాలనే పెట్టుబడిదారులు పన్నిన వ్యూహంలో మంచివారుకూడా చిక్కుకుని విలవిలాడే దుర్భర పరిస్థితి ఏర్పడింది.

రాజకీయాలు అంటేనే డబ్బుతో ముడిపడ్డ భయంకరమైన అంశమనే ధృడాభిప్రాయం ఏర్పడిన కారణంగానే, భావస్వారూప్యం కలిగిన మేధావులకు, ప్రగతిశీల ఆలోచనాపరులైన పౌరులకు కలిగిన ఒక ఆలోచన *రాజులు చేసేది రాజకీయమైతే* ఇప్పడు రాజరిక వ్యవస్థ పోయి ప్రజాస్వామ్యవ్యవస్థ వచ్చింది కనుక ప్రజలు చేయవలసింది రాజకీయం ఎంతమాత్రం కాదనేది రూఢీఅయ్యింది. రాజకీయమనేపదం ప్రస్తుతం మనదేశంలో కుట్రలకు,కుతంత్రాలు, మోసాలకు పర్యాయపదంగా మారి తోటి ప్రజాస్వామిక దేశాలముందు తలవంపులకు గురిచేస్తుంది.

"ప్రజాకీయం" రాజకీయానికి సరైన ప్రత్యామ్నాయమని సరైన ప్రక్రియ అని ఒక నిర్ధారణకు వచ్చి ప్రజాకీయ ప్రక్రియకు పూనుకోవడంతో రాజకీయపార్టీలు ఎన్నికలను డబ్బుతో లెంకపెట్టి మంచివారిని బయటకు నెట్టే పరిస్థితికి అడ్డుకట్ట వేయడానికి, వారు వేసిన ఎత్తుగడకు వ్యూహానికి చెక్ పెట్టె అవకాశం కలిగిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ప్రజాస్వామ్య వాదులు, మేధావులు, విద్యార్థులు, యువతీ యువకులు, కార్మిక, కర్షక శ్రమజీవులు భారత ప్రజాకీయ పార్టీ ప్రతిపాదించిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ, భారత రాజ్యాంగ పరిరక్షణకు సాంఘిక మరియు రాజకీయ సమస్కరణలకు పూనుకోవాలని ఆహ్వానిస్తున్నాము.

భారత ప్రజాకీయ పార్టీ

20/02/2022

ఒకటికి రెండు సార్లు చదివి స్పందించండి. ఇది మన జీవితాలకు సంభందించిన అత్యంత కీలకమైన సందేశం మరియు అప్రకటిత నిశ్శబ్ద బ్యాలెట్ విప్లవం.
*******
స్వాతంత్ర్యం సిద్దించిన మొదటి రెండుమూడు దశాబ్దాలలోని రాజకీయ పరిస్థితులు నేటి పరిస్థితులకు పూర్తి భిన్నంగా ఉండేవని, నాటి నాయకులను చూసిన మన పెద్దలు అప్పుడప్పుడు గగ్గోలు పెడుతుంటారు. దానికికారణ ఆ నాటి నాయకులు రాజకీయాలను, ప్రభుత్వాలను నడపడం ఒక స్వచ్చంద సేవగా నిస్వార్థంగా, సమిష్టి నిర్ణయాలను వ్యక్తిగత బద్యతతగా భావించేవారు.

ఓటుకు నోటు వ్యవహారాలు ఉండేదవి కాదు. ప్రజలు కూడా నోటు ఆశించకుండానే ఓటు హక్కు వినియోగించుకునేవారు. ఇతర యేవిధమైన ప్రలోభాలకు ఆ నాటి ప్రజలు కానీ రాజకీయపార్టీల కార్యకర్తలు గానీ ఆశించకుండానే ఎన్నికల ప్రక్రియ పూర్తికానిచ్చేవారని వింటుంటేనే ఆత్సర్యం కలుగుతుంది ! అంటే నేటి మన రాజకీయవ్యవస్థ ఎంత అవినీతికి, రాజ్యాంగవిరుద్ధ ప్రక్రియకు పూనుటకుంటూ ప్రజాస్వామ్యస్పూర్తికి విఘాతం కల్పిస్తూ దిగజారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

మన దేశంలో వ్యక్త కేంద్రంగ రాజకీయాలు కొనసాగినంతకాలం ప్రజాస్వామ్యం ఇలాగే ఖూనీ అవుతూనే ఉంటుంది. ప్రజాస్వామ్యబద్దంగ ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధినేతలైన ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు అధికార పగ్గాలు చేతికి రాగానే ప్రభుత్వాలు వారి స్వంత జాగీరులైనట్టు ప్రవర్తిస్తూ ప్రజల మనో భావాలను సమాధిచేస్తున్నారు.

ఒక్క మాటలో చెప్పాలంటే రాజ్యాంగ స్పూర్తిని తుంగలోతొక్కుతూ ఎవరికి తోచినట్టు వారు పాలన సాగిస్తున్నారు. వారి అనుచరలు, అనుభంద సంఘాలు తాము ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుతుంది నేటి రాజకీయవ్యవస్థతో ప్రజలకు ఎదురౌతున్న అవస్థలు కొలుస్తూ పోతే చేతాడు కొలత సరిపోదు.

ఈ పద్దతి మారాలంటే నిర్వీర్యమౌతున్న రాజకీయ వ్యవస్థలో సమూల మార్పులు, సంస్కరణలు జరగాలి. వ్యక్తి ఆధారిత మరియు వ్యక్తి ఆరాధిత వ్యవస్థకు స్వస్తిపలకాలి. ప్రతి పౌరుడు పాలనలో అభివృద్ధిలో ప్రత్యక్ష భాగస్వామ్యం కల్పిస్తూ

*సురాజ్య - సుపరిపాలన
*పౌరసాధికారత
*ప్రజామ్యానిఫెస్టో

విధానాల అమలుకు సగటు పౌరులచే ఏర్పడిన *భారత ప్రజాకీయ పార్టీ*ని ఆదరించి, స్వాతంత్ర్య సమర యోధులు మరియు తెలంగాణ అమరవీరులు ఆశించిన ప్రభుత్వఏర్పాటుకు పూనుకోవలసిన అవసరం మరియు అనివార్యత ఏర్పడింది.

13/02/2022

రాజకీయ సంస్కరణలు అనివార్యమని భావించేవారికి కొదవలేదు. ఈ ఆలోచన ఉన్నవారందరు ఏకాభిప్రాయానికివచ్చి కార్యోన్ములు కావడంలోనే కొంత అంతరాయం మరియు జాప్యం జరుగుతోంది.

ఎవరికివారు వ్యక్తులుగా తమవంతు ప్రయత్నాలు మొదలు పెట్టడం, వ్యక్తులుగా వారికి ఎదురైన చేదు అనుభవాలే అంతిమమని భవిస్తూ నిరాశతో ఎంచున్న ఆదర్శం నుండి వైదొలగడం సర్వసాధరణంగా జరిగిపోతుంది.

అలావచ్చి క్షేత్రస్థాయి నుండి నిష్క్రమించిన వారిని చూసి తటస్థులు తటస్తులుగానే మిగిలిపోతున్నారు. పైగా ఎవరైన మంచిఆలోచలతో ఒక పవిత్రపనికి పూనుకుంటే తాము చేయలేనిది ఇతరులు ఎలా చేస్తారని ఎగతాళికి సహితం పూనుకోవడం గమనార్హం.

తాము నమ్మి కృషిచేస్తున్న ఆదర్శానికి ప్రమాదం చేకూరినప్పుడు.. స్వార్థపరులు తప్పుకుంటారు. పిరికివారు పారిపోతారు. నిజాయితీ పరులు ప్రతిఘటిస్తారు, వీరులు పోరాడుతారు.

రాజకీయాలంటేనే బూతుపదంగ, కుట్రలకు కుతంత్రాలకు నిలయంగా మారినట్టు భావిస్తున్న తరుణంలో వ్యక్తిగత అనుభవాలు పక్కనపెట్టి చేపట్టవలసిన సంస్కరణలకు బాధ్యతగల పౌరులుగ....సమిష్టికృషితో పూనుకోవలసిన అనివార్యత ఏర్పడిందని భావించే ప్రతిఒక్కరు ఐక్యంకావలసిన సమయమిది.

07/02/2022

ఎన్నికల్లోనే ఓటర్లకు లంచాలు ఇస్తూ ప్రభుత్వం
ఏర్పడక ముందే అవినీతికి ఆజ్యంపోసే నీఛ, నిక్రుష్ట రాజకీయవ్యవస్థతో నీతివంతమైనపాలన ఆశించడమే పౌరులు చేస్తున్న పెద్ద తప్పు.

అదే తప్పు మల్లి మల్లి దొర్లకుండ ఉండడానికి సామాన్యపౌరులతో ఏర్పడిన పటిష్ట ప్రత్యామ్నాయ ప్రక్రియయే ప్రజాకీయం.

దీనికి పౌరులే అధిష్టానం, ఓటర్లే న్యాయనిర్ణేతలు, ప్రజలేపాలకులు, ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వ యంత్రాంగం కేవలం ప్రజలకు నీతివంతమైన సేవలు అందిస్తూ పేరు ప్రతిష్టలు ఘడిస్తూ, హాయిగా పౌరులుకల్పించిన అవకాశాన్ని పది మంది మేలుకై పయోగించుకుని పదవీ విరమణకు ఎదురు చూడడమే.

03/02/2022

భారతదేశం సంక్షేమ రాజ్యం. దేశంలోని ప్రజలందరి సంక్షేమం మరియు సాధికారతకల్పనే రాజ్యాంగంయొక్క ప్రధానలక్ష్యం కాబట్టి దేశంలో నిర్లక్ష్యానికిగురై, అభివృద్ధికినోచుకోక, వివక్షకుగురైన పౌరుల అభివృద్ధియే ప్రధానలక్ష్యంగ స్థానిక, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు పనిచేయాలన్నప్పుడు జాతిసంపద ఎక్కడికి చేరుతుంది ?

పాలకులను ఎవరు నడిపిస్తున్నారో ..... పాలకులు ఎవరి ప్రయోజనాలకోసం పాటుపడుట్జున్నారో.... పౌరులు దృష్టి సారించనంత వరకు పాలకులు ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుతుంది.

పౌరులు యాచకులుగా కుమిలి పోతూ..... పాలకులు సార్వభౌములుగా విర్రవీగుతూనే ఉంటారు.

ప్రజలు రాజ్యాంగ హక్కులతోపాటు, బాధ్యతలను, చేయవలసిన కర్తవ్యాన్ని అధ్యాయనంచేసి ప్రజాకీయప్రక్రియకు పూనుకుని నిశ్శబ్దమార్పుకు అడుగులువేయాలి.

02/02/2022

భారత రాజ్యాంగం మార్చడం వల్ల ఇంతకంటే ఎక్కువ లాభం చేకూరుతుందంటే దానికి అన్నివర్గాల మద్దత్తు లభిస్తుంది. ప్రస్తుతం అమలులో ఉన్న రాజ్యాంగంవల్ల ఏదైనా పూడ్చలేని నష్టం జరుగుతుందని విజ్ఞతతో ఆలోచిస్తే ఆ పరమార్థాన్ని ప్రజలకు వివరించవలసిన అవసరంకూడ అంతే ఉంటుంది.

మార్పు అనివార్య మైనప్పుడు మారడంతో తప్పులేదు. మార్పు వల్ల కలిగే లాభనష్టాలు విస్తృత చర్చకుపెట్టాలి. గత ఏడు దశాబ్దాలుగా రాజ్యాంగంలో బయటికి చెప్పకోలేని మార్పులు చేర్పులు చేసినట్లయితే ఆ మార్పుల కారణంగ దేశానికి జరగబోయే నష్టమేమిటో ప్రజల ముందు పెట్టాలి. రాజ్యాంగమంటే రాజకీయ పార్టీల అంతర్గత వ్యవహారం లాంటిది కాదు సర్వసభ్య సమావేశంలో తీర్మానించి సవరణలకు పూనుకోవడాని.

భారత రాజ్యాంగాన్ని రద్దుచేసి మరోరాజ్యాంగం రూపొందించాలనిగాని, తిరిగి రాయాలనిగాని రాజకీయ పార్టీలు భావించినంత మాత్రాన దేశప్రజల సమిష్టిసమ్మతి లేకపోతే రాజ్యాంగాన్ని కాదుకదా ఒక గడ్డిపోచనుకూడా పీకలేవు.

కోతి చేతికి కొబ్బరి బోండాం దొరికితే దాన్ని చేతిలో పట్టుకి ఆనందిస్తుందే తప్ప కోతి కొబ్బరిబోండాన్ని పగలగొట్టి తినజాలదు. అలాగే తమ స్వంత లాభాలకొరకు మాత్రమే పనిచేసే రాజకీయపార్టీలకు రాజ్యాంగంలో ఉన్న గొప్పతం ఎలా అర్థమవుతుంది ?

ఎందరో మహా మహా మేధావులు రేయింబవళ్లు కృషిచేసి రచించిన రాజ్యాంగాన్ని ప్రజల అభివృద్ధికి అనుగుణంగ అన్వయించి ఎలా పాలించాలో తెలియక కోతిచేష్టలతో గంతులువేసే రాజకీయ నాయకులను ప్రజాకీయస్పూర్తితో పౌరులు
శంకరగిరి మాన్యాలకు పంపడానికి నిశ్శబ్ద బ్యాలెట్ సమరాయనికి (Silent Battle with Ballet) సన్నద్ధమౌతున్న అంశం విదితమే.

రాజకీయ నాయకులకు సంపద పెరిగేకొద్దీ రాజ్యాంగంలో ప్రధానంగ ఉన్న ప్రజాస్వామ్య, సామ్యవాద, లౌకికవాదం లాంటి పదాలు ముళ్ళకిరీటాలుగా మారి కోతి చేష్టలకు పూనుకునేలాచేసి జై కోట్టించుకున్న రాజకీయ నాయకులే భవిష్యత్తులో
జైలుపాలవ్వడం కూడా అంతే ఖాయం.

జై భారత్

జై ప్రజాకీయం

24/01/2022

*ప్రజాకీయప్రక్రియకు నాంది పలికిన*

*భారత ప్రజాకీయ పార్టీ*

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, ఆజాద్ హింద్ ఫౌజ్ (ఇండియన్ నేషనల్ ఆర్మ్)ని స్థాపించి నాటి ఉవకిశోరాలలో స్వాతంత్య్ర పిపాసను రగిల్చిన భారత మాత ముద్దు బిడ్డ *నేతాజీ సుభాష్ చంద్రబోస్* స్వాతంత్య్ర సంగ్రామంలో రాజీలేని పోరాటం చేసి బ్రిటీష్ పాలకుల వెన్నులో వణుకు పుట్టించిన ధీరుడని ప్రజాకీయ సిద్ధాంత కర్త డాక్టర్ షోయబ్ కొనియాడారు. సోమాజీగూడ, ప్రెస్ క్లబ్ ప్రాంగణంలో నివహించిన *నేతాజీ శుభాష్ చంద్రబోస్* జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న డాక్టర్ షోయబ్ మాట్లాడుతూ సుభాష్ చంద్ర బోస్. జాతికి జై హింద్ నినాదాన్నిఅందించి భారత జాతీయ సేన గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి బ్రిటీష్ ముష్కరులు వెన్నులో వణుకుపుట్టించిన ఘనుడని, దేశానికి స్వాతంత్య్రం సిద్దించిన తరువాత కుల, మత, ప్రాంతవివక్ష లేకుండా దేశం సుపరిపాలన మరియు ప్రజాసాధికారత సాధిస్తుందని కలలుకన్న అందరు సమరయోధుల్లాగే *సుభాష్ చంద్రబోస్* కూడ ఒకరని, సమరయోధుల ఆశయాలు ఆడియాసలైనానని ఆవేదన వ్యక్తపరిచారు.

ఈ వేడుకల్లో పాల్గొన్న *భారత ప్రజాకీయ పార్టీ* జాతీయ సమన్వకర్త ప్రొఫెసర్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ, దేశప్రజలకు కావలసిన కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ, విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి మరియు ఉపాధి నైపుణ్యాలకల్పన కేవలం ప్రభుత్వ ఆధీనంలో మాత్రమే కొనసాగాలని సమరయోధులు దృఢంగా నమ్మారు కాని దేశానికి స్వాతంత్య్రంసిద్దించి ఏడు దశాబ్దాలు గడిచిపోయినా దేశప్రజలకు ఆశించిన ఫలితాలు అందక తమజీవితాలు మార్చిదానికి *సుభాష్ చంద్రబోస్* లాంటి నాయకులు రావాలని ఎదురుచూస్తున్నారని అభిప్రాయపడ్డారు.

*నేతాజీ* జన్మదిన వేడుకల్లో ఆత్మీయ అతిథిగా పాల్గొన్న సమాజ్ వాదీ ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మురళీధర్ దేశ్ పాండే మాట్లాడుతూ, నానాటికి నిర్వీర్యమౌతున్న ప్రజాస్వామ్యవిలువలు, క్షీణిస్తున్న రాజ్యాంగస్ఫూర్తిని పునరుద్ధరించడానికి, పతనమౌతున్న రాజకీయ సంస్కరణలు కోరుకుంటున్న పరిస్థితి ఏర్పడిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి అధ్యక్షత వహించిన *భారత ప్రజాకీయ పార్టీ* వ్యస్థాపక అధ్యక్షులు జాడే శ్యామ్ రావ్ సభనుద్దేశించి ప్రసంగిస్తూ, సమకాలీన రాజకీయ ప్రక్రియతో దేశ పౌరులు విసిగిపోయారని, అందుకు సమరయోధుల వారసులైన సగటు పౌరులే ముందుకు వచ్చి *ప్రజాకీయ ప్రక్రియకు నాంది* పలికేలా చేసిందని, *ప్రజాస్వామ్య సంస్కరణలకు మరియు రాజ్యాంగ పరిరక్షణకు* పూనుకునేలా చేసిందని, సామాన్య పౌరుల సమిష్టి కృషితో ఆవిర్భవించిన *భారత ప్రజాకీయ పార్టీ* సమకాలీన రాజకీయప్రక్రియకు ప్రత్యామ్నాయ ప్రక్రియగా ముందుకు వచ్చినట్టు ధ్రువీకరించారు.

*భారత ప్రజాకీయ పార్టీ* ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ షేక్ షబ్బీర్ ఈ సందర్బంగ ప్రజాస్వామ్య సంస్కరణలకు మరియు రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమంలో భాగంగ చేపట్టడానికి చేసిన ఈ క్రింది తీర్మాణాలను చదివి వినిపించారు

1. *భారత దేశానికి గ్రామాలు పట్టు కొమ్మలని భావించిన జాతిపిత మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం సాధించినప్పుడే సంపూర్ణ భారతదేశం విరాజిల్లుతుందని ఇచ్చిన గొప్ప సందేశాన్ని సాకారం చేయడానికి గ్రామస్వరాజ్య కార్యక్రం కొనసాగించడానికి తగు కార్యక్రమాలు చేపట్టడం*.

2. *అవినీతి నిర్మూలనకు, సంపూర్ణ అక్షరాస్యత సాధించడానికి, పౌరసాధికారతకు సహకార వ్యవస్థను బలోపేతంచేస్తూ పౌరులందరికీ సంపద సృష్టించే మార్గాలను సుగమం చేయడానికి పౌరులను స్వయం సంమృద్ధివైపు అడుగులు వేయడానికి తోడ్పాటు అందిస్తూనే వ్యవసాయం మరియు దాని అనుబంధ పరిశ్రమలను అభివృద్ధికి తోడ్పాటు అందించడం*.

3. *ప్రభుత్వ ఉద్యోగుల్లో జవాబుదారీతనం నెలకొల్పడానికి తరుచుగా "ఓపెన్ హౌస్" పద్దతికి అటు ప్రభుత్వ ఉద్యోగులను ఇటు పౌరులను సమాయత్తపరచానికి కృషి చేస్తూ గ్రామస్థాయి నుండి నగర స్థాయివరకు తగు కార్యక్రమాలు నిర్వహిస్తూ పౌరులకు తోడ్పాటు అందించడం*.

4. *అధికారం మరియు పాలన వికేంద్రీకరణలో భాగంగా పౌరులు తీర్మానించిన విధంగ ప్రజకీయ ప్రక్రియను సాధనంగ మార్చి పౌరులకు అహర్నిశలు అందుబాటులో ఉండడం*.

5. *దేశానికి నాటి సమరయోధులు స్వాతంత్య్రం సంపాదించి ఇచ్చినట్టే దేశ సంపూర్ణ స్వాతంత్ర్యం కొరకు సమరయోధుల ఆశయాలు అమలు పరచడానికి పౌరులే పూనుకోవలసి వస్తుంది కనుక అందులో భాగంగా ఆయా నియోజక వర్గాలలలో నమోదైన ఓటర్లకు వ్యక్తిగత విజ్ఞప్తి పత్రాలు సమర్పించి ప్రజాస్వామ్య సంస్కరణలకు మరియు భారత రాజ్యాంగ పరిరక్షణకు ఓటే ఆయుధంగ యెంచి పూనుకొనడానికి విజ్ఞప్తి పత్రాలు అందజేస్తూ తదనుగుణంగ కార్యక్రమాలు చేపట్టడం ప్రజాకీయ ప్రక్రియలో అత్యంత ముఖ్యమైన నిరంతర కార్యక్రమంగా చేపట్టాలని తీర్మానించడం జరిగిందని సమావేశంలో వెల్లడించారు*.

ఈ కార్యక్రమంలో పార్టీ వ్యస్థాపక సభ్యులు ప్రొఫెసర్ మాజహర్ అలీ, పార్టీ కార్యవర్గ సభ్యులు పవన్ కుమార్ మెంబరస్, అలీ భాషా షేక్, శేఖర్, బాసిద్, ఫేయ్యజ్ తదితరులు పాల్గొన్నారు.

23/01/2022

నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 125వ జయంతి సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో భారత ప్రజాకీయ పార్టీ ప్రకటించిన కార్యాచరణ

23/01/2022

Addressing the press and electric media representatives in the press conference on the occasion of 125th birth anniversary celebrations of Nethaji Subhash Chandra Bose.

Event organized by the BHARATHA PRAJAAKEEYA PARTY today at Press Club Somajiguda, Hyderabad to announced the action of party as part of the BHARATHA PRAJAAKEEYA PRAKRIYA.

21/01/2022

ప్రజాకీయ ప్రక్రియ ప్రారంభం💐💐💐

20/01/2022

వేర్లు గట్టిగా లేనిచెట్లు చిన్నగాలినికూడా తట్టుకోలేవు. తల్లివేరు బలంగా ఉంటూ అంతే బలంగా భూమిలో పాతుకుపోయిన వేర్లకు చెందిన చెట్టుకు పెరిగిన
ఖాండము, కొమ్మలు, రెమ్మలు సహితం భయంకరమైన తుఫానును సహితం తట్టుకుని నిమ్మలంగా మనుగడ సాగిస్తాయి. ఇది ప్రకృతి మానవజాతికి నేర్పేన నిఘోడ సత్యం.

చెట్టుకు తల్లివేరు ఎలాగో ఒక సంస్థకు సిద్ధాంతం అంతే దోహదపడుతుంది, సిద్ధాంతమంటే ఏదో బ్రహ్మపదార్థంకాదు. సిద్ధాంతమంటే నిర్దేశించుకున్న నైతిక నిబద్ధత, నిజాయితీ, కృషి, అనుసరణ, ఆచరణ అంతే.....

పటిష్టమైన సంస్థాగత నిర్మాణంలేని ఎంతగొప్ప సంస్థగాని వ్యాపారంగాని, వ్యవసాయంగాని, వ్యవహారంగాని ఎక్కువకాలం బతికి బట్టగట్టవు. అలాంటిదే ప్రజాకీయప్రక్రియకూడ. ఇక్కడ పౌరసత్వమే ప్రామాణికం దానికి రాజ్యాంగమే సిద్ధాంతం.

జై భారత్
జై ప్రజాకీయం

18/10/2021

Be an associate to Bharatha Prajaakeeya Party for Citizens Rule in India, to gain *Good Governance, Peoples Empowerment through Peoples Manifesto* by joining in the Social and Political Reformation Movement.

15/10/2021

ప్రజాస్వామ్య పరిరక్షణకు మరియు రాజకీయ సంస్కరణలకు పూనుకోవాలని అందుకు తగు వేదిక కావాలని కోరుకునే ఆభ్యుదయ ప్రజాస్వామ్య పిపాసకులను "భారత ప్రజాకీయ పార్టీ" ఆదరిస్తుంది రాజ్యాంగ హక్కులతోపాటు బాద్యతలపై అవగాహన కల్పిస్తుంది.

ఆట నియమ నిభందనలు వంటపట్టించుకోకుండా ఆడాలని ఆరాటపడితే మిగిలేది చేదుఅనుభవమే తప్ప చెప్పుకోవడాని ఏమీ మిగలనట్టే, చట్టసభలు వెళ్లి ప్రజలకు సేవచేయాలనే అభిరుచి అంకితభావం ఉన్నవారికి భారతస్వాతంత్ర్య సమరయోధులు వారి చరమాంకంలో భారత పౌరులకు (వారి వారసులకు) అందించిన సురాజ్యం, సుపరిపాలన,ప్రజాసాధికారత కేవలం ప్రజామ్యానిఫెస్టో ద్వారానే సాధ్యమని తలంచి ఆశక్తిగలవారికి రాజ్యాంగంపై శాస్త్రీయ శిక్షణ కల్పిస్తే భవిష్యత్తులోనైనా మంచి ప్రజాసేవకులు వస్తారనే ప్రగాడ విశ్వాసంతో ముందుకు వచ్చిందే భారత ప్రజాకీయ పార్టీ.

ఇందులో రాజరిక వ్యవస్థ స్వరూపంతో కాకుండ కేవలం ప్రజలకు సేవకులమనే భావన ఉన్నవారికే అవకాశాలు బాధ్యతలు అందజేయబడతాయి.

14/09/2021

దళిత బంధు
ఆదివాసీ బంధు
B.C బంధు
మైనారిటీ బంధు
అని దేశ పౌరులను కులాల పేర మతాల పేర విభజించి పాలించే
#రాజకీయ #వ్యవస్థ #దుకాణం బంధు చేద్దాం
అప్పుడే భారత ప్రజా సాధికారత సాధ్యం అవుతుంది.

Videos (show all)

డా.పసునూరి రవీందర్ గారి కలం నుండి జాలువారిన తరాల చరితను మార్చి, అక్షర విలువను తెలిపే అద్భుతమైన స్వేరో సర్కిల్ పాట
సమాజంలో ఉన్న నిరక్షరాస్యత ను పారద్రోలడానికి జ్ఞాన సమాజాం కోసం (అలంపూర్ లో  స్వేరో సంబురాలు )  10km పరిగెడుతున్న సుప్రీమ్...
#Happy #Birthday #Santhosh 💐💐💐ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న ఇండియన్ మోక్షిత డాన్స్ అకాడమీ మాస్టర్ సంతోష్ గారికి హృదయ...
స్వేరోయిజం లో  నేడు మరో మైలురాయి నిరుద్యోగులకు సాధికారత దిశగా గొప్ప ఆవిష్కరణ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో  మరి కొద్ది ...
I SHALL REPAY WHAT I BARROW 🌹🌹
పరమత సహనం ప్రతీ ఒక్కరూ అలవర్చుకోవాలి💐💐
చరిత్ర తెలియని వాడు చరిత్ర సృష్టించలేడు
#I #SHALL #NEVER #GIVEUPSwaero network  tsunami songs... Abhimanam ni matham aina  avamanale vedhisthunna ooooo...song p...

Website