Meeku Telusa

Meeku Telusa

Hello Everyone!! Meeku Telusa -with Pallavi Yalamanchili
Interview talk show /Things to know /Fun -entertainment .

Please like ,share & Follow my YouTube &Facebook

Thank you for your support ��

22/03/2020
22/03/2020

1 - Busiest Railway Station
2 - Busiest Bus Stand
3 - Busiest Benz Circle Junction
4 - Busiest MG Road

All busiest places turned mute in Vijayawada city during 👍👏

22/03/2020

ఇవ్వాళ అన్ని రాశి ఫలాల్లో
ఒకటే ఉంది

"మీరు ఇంట్లో ఉంటారు" అని
😂🤣😆

22/03/2020

Trivikram Srinivas Trivikram Trivikram pen Coronavirus

21/03/2020

ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల లోపు లేదా, సాయంత్రం నాలుగు నుండి అయిదు గంటల లోపు పదిహేను నిమిషాల పాటు ఎండలో ఉంటే శరీరానికి లభించే డీ విటమిన్ తో శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శుభోదయం☀️

20/03/2020

పిడికెడు ఉప్పు

"స్వామీజీ...
నా జీవితమంతా కష్టాలే.
ఈ జీవితాన్ని భరింoచలేకపోతున్నాను.
దయచేసి నా కష్టాలు తీరే మార్గo చెప్పండి."

గురువు ఆ యువకుడి వైపు చూశాడు.

ఒక గ్లాసు నీటిలో ఒక పిడికెడు ఉప్పు వేయమన్నాడు.

యువకుడు అలాగే చేశాడు.

"తాగు"

యువకుడు గ్లాసు పైకెత్తాడు. నీటిని తాగాడు.

వెంటనే ఉమ్మేశాడు...

"అబ్బ... భరిoచలేని ఉప్పు...."

ఇంకో పిడికెడు ఉప్పు తీసుకుని ఆ యువకుడిని చెరువు దగ్గరకు తీసుకెళ్లాడు గురువు.

"ఈ ఉప్పు ఈ చెరువులో వెయ్యి. ఈ నీటిని తాగు"

యువకుడు చెరువు నీటిని గడగడా తాగేశాడు.

"ఎలా ఉంది?"

"నీరు తీయగా ఉంది"

"అదే పిడికెడు ఉప్పు. అప్పుడెందుకు భరించలేకపోయావు.
ఇప్పుడెలా భరించావు?"

అది తక్కువ నీరు.
గ్లాసుడు నీరు.
అందుకే ఉప్పగా ఉంది.
ఇది చెరువు.
అంటే ఎక్కువ నీరు...
అందుకే ఉప్పదనం లేదు."
అన్నాడు యువకుడు.

"నాయనా...
సమస్యలు పిడికెడు ఉప్పు లాంటివి.
అది గ్లాసులోనూ పిడికెడే.
చెరువులోనూ పిడికెడే.

కానీ నీ జీవితం గ్లాసులా ఉండాలా...
చెరువులా ఉండాలా అన్నది మాత్రం నువ్వే నిర్ణయించుకోవాలి.

నీ పరిధి పెరిగితే పిడికెడు ఉప్పు తక్కువవుతుంది.

నీ పరిధి సంకుచితమైతే పిడికెడు ఉప్పు భరించలేనంత అవుతుంది"
అన్నాడు గురువు.

20/03/2020

Finally done

19/03/2020

Tag your friend🕺☺️....

19/03/2020

Current situation at home 😂😂😂😂....

16/03/2020

కోతుల సహజ మరణాన్ని మీరెప్పుడైనా చూసారా
నేను ఒక్కసారి చూసాను కానీ చాలా వరకు ఎవరూ చూడలేరంట

వాటికీ వారం ముందే మరణం అని తెలిసిపోతుందంట
అలా తెలుసుకున్నాక అవి ఎవరి కంట పడకుండా సంచారం లేని చోట ఏ ఆహారము తీసుకోకుండా తనకు కావాల్సినంత గుంతను తీసేసి అందులో పడుకుని ఉండిపోతాయంట
అవి చనిపోయాక భూమి తనంతట అదే మట్టితో కప్పేస్తుందంట

ఆ ఒక్క వారం అవి తపస్సు చేస్తుంటాయంట
ఎవరైనా గెంతుంతుంటేనో లేక అల్లరి చేస్తుంటేనో మనం కోతులతో పోలుస్తాం
ఒక్క నిమిషం ఒక్క చోట కూర్చోడు కోతిలాగా గెంతుతూనే ఉంటాడు అని
అలాంటిది ఒక వారం ఒకే చోటు కదలకుండా ఉండిపోతాయి అంటే ఆశ్చర్యం వేసింది

ఇది నిజామా కాదా అని ఆలోచిస్తే
ఆంజనేయుడు శ్రీరాముడి వద్ద అడిగి పొందిన వరం అంట ఇది

మరణం ముందుగా గ్రహించి
ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా
పుట్టలోని జీవాలకు ఆహారంగా మారాలి
నా దేహం ఎవరి కంట పడనీక అని వరం అడిగాడట ఆ హనుమయ్య

అందుకే ఒక్క కోతి ప్రమాదంలో చనిపోయిన మిగతా అన్ని కోతులు కలిసి పుట్ట మన్ను ఉన్న చోట తీసుకెళ్లి ఆ దేహం మట్టితో పూర్తిగా కప్పబడేవరకు వదిలి రావంట

అందుకే కోతులకు వాటికి ఇష్టమైన అరటిపళ్ళు అంది ఇవ్వాలని చెప్తున్నారు

అలాగే మీరు రామాయణం చదువుతున్నా లేక ఎక్కడైనా రామాయణ పారాయణం జరుగుతుంటే అక్కడ కోతి ప్రత్యక్షమౌతాయని విన్నాను

అందుకేనేమో హనుమను మించిన భక్తుడు లేడు అంటారు

16/03/2020

A beautiful lovely couple pic♥️🤗♥️....

15/03/2020

ముక్యమైన హెచ్చరిక
Corona వైరస్ గురించి జపాన్ డాక్టర్లు ఇచ్చిన సలహా ప్రతి ఒక్కరూ వారి నోరు గొంతు తడిగా ఉండేలా చూసుకోవాలి. ప్రతి 15 నిమిషాలకు మంచి నీళ్లు తాగాలి. ఎందుకంటే ఒకవేళ వైరస్ మీ గొంతు లోకి వెళ్లినా, ఆ మంచి నీళ్లు వల్ల కడుపు లోకి వెళ్ళిపోతుంది. మన కడుపులో ఉన్న రసాయనాల వల్ల ఆ వైరస్ చనిపోతుంది. మంచి నీళ్లు ఎక్కువగా తీసుకోకపోతే ఆ వైరస్ మీ శ్వాస కొసాలు మరియు ఊపిరి తిత్తులు లోకి ఆ వైరస్ చేరుకునే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి.

14/03/2020

Carona Virusని Great China ఎందుకు ఎదుర్కోలేకతోంది? Dr Jayaprakash Narayana అద్భుతమైన Analysis

https://youtu.be/DJqMLBFI1dY

Carona Virusని Great China ఎందుకు ఎదుర్కోలేకతోంది? Dr Jayaprakash Narayana అద్భుతమైన Analysis For More Updates : ☛Subscribe to our ...

14/03/2020

Photography Tutorials By Photriya Venky | Lesson - 1 | How to become a professional photographer ?

Photriya Photography Photriya Academy

I embark on a new journey of teaching something that I learned in this long career of photography. Starting today every Thursday a new video by me will be re...

14/03/2020

వేటకి వెళ్తే కానీ పూట గడవదు...
సముద్రం దయ తలిస్తే కానీ కడుపు నిండదు...
అన్ని బాగున్నా దళారుల మోసం చేస్తే ఏమి చేయలేక బ్రతుకు చిత్రం ఇంతే అనుకోవడం తప్ప ఏమి చెయ్యలేని...... ఓ మత్స్యకారి.....🐟🐠🎣

14/03/2020

Meeku Telusa

14/03/2020

మానవత్వము....

ఒక ఊరిలో ఒక గురువు ఉండేవాడు అతనికి ఒక శిష్యుడు. ఒకసారి శిష్యుడికి ఒక సందేహం వచ్చింది.

"గురుదేవా మానవత్వం అంటే ఏమిటి?." అని అడిగాడు.
గురువుగారు మౌనంగా ఉన్నారు. కొంతకాలానికి గురుశిష్యులు ఇద్దరు బయలుదేరి ఒక ఊరిలో వెళుతుండగా ఒక భూస్వామి ఒక బీద వాడిని పట్టుకుని కొడుతున్నాడు. ఈ గురు శిష్యులు అది చూస్తున్నారు. ఇంతలో ఒక దారినపోయే వ్యక్తి వచ్చి ఎందుకు అతన్ని అలా కొడుతున్నావు? అని అడిగాడు.
దానికి ఆ భూస్వామి వీడు తిండి లేక స్పృహ తప్పి నా ఇంటి ముందు పడి ఉంటే వీడికి తిండి పెట్టి నా నౌకరుగా పెట్టుకున్నాను వీడికి జీవితాంతం నా బానిసగా ఉండడానికి ఒప్పుకున్నాడు పత్రం రాసిచ్చాడు అంటూ ఆ పత్రాన్ని తీసుకుని వచ్చి అతనికి చూపించాడు అతను ఆ పత్రం తీసుకుని చింపివేసి నుండి నేటి నుండి నీకు బానిసత్వం లేదు విడుదల జరిగింది అని చెప్పి వెళ్ళిపోయాడు.

కొంత కాలానికి గురుశిష్యులు ఒక అరణ్యంలో నడుచుకుంటూ వెళుతుండగా ఒక ఆయుధ దారి అయిన యోధుడు పరిగెత్తుకుంటూ వచ్చి పులి వస్తున్నది పరిగెత్తండి అని చెప్పి అతను ఒక చెట్టు ఎక్కాడు గురువు శిష్యుడు కూడా ఇంకో చెట్టు ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నారు.

మరియొక సారి వీరిని దొంగలు అడ్డగించి వీరివద్ద ఉన్న కొంత ధనాన్ని దొంగిలించి వాళ్లని చంపడానికి కత్తులు ఎత్తారు‌. అప్పుడు వాళ్ల నాయకుడైనా దొంగ ఇలా అందర్నీ చంపుతుంటే మనకి ఎలా సాగుతుంది అంటూ వాళ్లకి కొంత ధనమిచ్చి సాగనంపాడు.

ఇంకొకసారి గురుశిష్యులు ఒక చెరువు కట్ట పైన నడుస్తూ ఉండగా ఒక ధనవంతుడు ఒక బీద వాడిని చెరువులోకి తోసివేశాడు అతని తొయ్యటంలో ఇతను కూడా జారీ చెరువులో పడ్డాడు. ఆ బీదవాడు ఈ ధనవంతుడిని ఒడ్డుకి లాక్కొని వచ్చాడు. ఆ మనిషిని చెరువులోకి ఎందుకు తొశావు అంటూ గురువు ధనవంతున్ని అడిగాడు?

దానికి ధనవంతుడు ఇలా చెప్పాడు.
" స్వామి ఇతనికి చాలా ద్రోహం చేశాను అన్ని చెబుతాను వినండి. ఈ బీదవాడు నా పొరుగున ఉంటాడు అసహయుడు అని చెప్పి ఇతని స్థలం దురాక్రమణ చేశాను ఇతను అందరికీ నా దురాక్రమణ విషయాన్ని చెబుతూ వచ్చాడు నా పరువు తీస్తున్నాడు అని చెప్పి ఇతని ఇంటికి నిప్పు పెట్టించాను. దాని గురించి విచారణ చేస్తే అతని అజాగ్రత్త వల్ల ఇల్లు కాలిందని లోకాన్ని నమ్మించాను. ఇలా ఎన్నో ద్రోహాలు ఇతనికి నేను చేశాను ఈరోజు ఇతను నన్ను చెరువు ఒడ్డున. "నన్ను సర్వ నాశనం చేశావు" అన్నాడు . దానికి కోపం వచ్చి నేను ఇతని చెరువులోకి తోసేశాను. జారీ నేను చెరువులో పడ్డాను నాకు ఈత రాదు ఇతను నన్ను రక్షించాడు అంటూ ఆ ధనికుడు ఆ బీదవాడికి అంతులేని ధనం ఇచ్చాడు.!

*ఇప్పుడు చెప్పండి. ఇందులో ఎవరికి మానవత్వం ఎక్కువగా ఉంది. పరిపూర్ణ మానవత్వం కలిగినవారు ఎవరు. భూస్వామి, దారినపోయే వ్యక్తి, దొంగ, యోధుడు, ధనవంతుడు, బీదవాడు,*

తిండి లేక ప్రాణాలు పోతున్న వ్యక్తిని రక్షించిన భూస్వామికి మానవత్వం ఎంత.

దారిన పోతూ ఇతని బానిస పత్రాన్ని చింపివేసి ఇతని ప్రాణాలు రక్షించిన అతనికి మానవత్వం ఎంత?.

పులి వస్తుంది అని చెప్పి వీళ్ళకి ప్రాణాలు నిలిపిన యోధుడు మానవత్వం ఎంత?
తన ప్రాణాలు కాపాడిన వారికి ఎంతో ధనమిచ్చి సంతోషపెట్టిన ధనవంతుడు మానవత్వం ఎంత?

తనకు ఎన్నో కష్టాలు కలిగించిన వ్యక్తి ప్రాణాలు కాపాడిన బీద వ్యక్తి మానవత్వం ఎంత.

14/03/2020

Tag your friends whom you want to wish on this special day☺️....

13/03/2020

*_నేటిమాట_*
*మానవ సేవయే మాధవ సేవ*

పువ్వులు అమ్మే వారి దగ్గర నుండి పూల పరిమళం వస్తుంది,
అలాగే అత్తరు అమ్మే వారి దగ్గరనుండి అత్తరు సువాసన ఎలా వస్తుందో,
ఇతరుల చేతికి మనము గోరింటాకు పెడుతుంటే మన చేతి వేళ్లకు గోరింటాకు రంగు అంటినట్లు,
ఇతరులకు మేలు చేయడం ద్వారా మనకు మేలే జరుగుతుంది.
*"పరోపకారం ఇదం శరీరం"*
ఇతరులకు మేలు చేసే వ్యక్తికి ఎప్పుడు ఏ కీడు జరగదు ...
నిష్కామ భావనతో సమాజానికి సేవ చేయడం వలన ఆ వ్యక్తికి అంతులేని సంతృప్తి కలుగుతుంది.
అందరి ఆశీర్వాదాలు లభిస్తాయి, మంచి ఆరోగ్యము దీర్ఘాయువు లభిస్తుంది... *అందుకే మానవసేవే మాధవ సేవ అని శాస్త్రాలు చెపుతున్నాయి*

*_🍁శుభమస్తు🍁_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

12/03/2020

*దేవుడి ఇంటికి సరైన దారి* - మల్లాది వెంకట కృష్ణ మూర్తి
〰〰〰〰〰〰〰〰
🔼 *'రామాపురం'* అనే ఊళ్ళో రైలు దిగండి.
⏺ *'నమ్మకం'* అనే రిక్షాని మాట్లాడుకోండి.
🔼 *భక్తి* అనే పేటలోకి తీసుకెళ్ళమనండి.
⏺ *పాపం* అనే డెడ్‌ ఎండ్‌ వీధి వస్తుంది.
🔼 *పుణ్యం* అనే దాని ఎదురు సందులోకి ముందుకి సాగండి.
⏺ *ప్రార్ధన* అనే వంతెనని దాటండి.
🔼 *కర్మ* అనే సర్కిల్‌ వస్తుంది.
⏺ *దుష్కర్మ* అనే రెడ్‌లైట్‌ అక్కడ వెలుగుతూండవచ్చు.
🔼 *సుకర్మ* అనే పచ్చలైటు వెలిగాక ముందుకి సాగండి.
⏺ *భజనమండలి* అన్న బోర్డున్న కుడి రోడ్డులోకి మళ్ళండి.
🔼అక్కడ రోడ్డు నాలుగు రోడ్లుగా చీలుతుంది.
⏺మొదటి మూడిటి పేర్లు - *అసూయ స్ట్రీట్‌, ద్వేషం సందు, ప్రతీకారం వీధి.*
🔼వాటిని వదిలి నాలుగో సందులోకి తిరగండి. దానిపేరు *సత్సంగం* వీధి.
⏺పక్కనే కనబడే *వందతుల* వీధిలోకి వెళ్ళకండి. అది వన్‌వే రోడ్డు.
🔼కాస్తంత ముందుకు వెళ్ళాక ఓ జంక్షన్‌ వస్తుంది.
అక్కడ ఎడమవైపు రోడ్డు పేరు *వ్యామోహం.*
⏺కుడివైపు రోడ్డు పేరు *వైరాగ్యం.* వైరాగ్యం వీధిలోకి వెళ్ళండి.
🔼ఎదురుగా మీకు *కైవల్యం* అనే మరో చౌరస్తా కనిపిస్తుంది.
⏺ *దయగల హృదయం - భగవన్నిలయం* అన్న బోర్డున్న తెల్లరంగు ఇల్లు కనిపిస్తుంది.
☯గేటు దగ్గరున్న *ముక్తి* అనే తలుపు మిమ్మల్ని చూడగానే తెరుచుకుంటుంది.
ఇది *దేవుడి ఇంటికి సరైన దారి.*

మీరు మీ బంధుమిత్రులకి కూడా ఈ దారిని తెలపండి. లేదా సరైన దారి తెలియక వారు దారి తప్పిపోవచ్చు.

ఆధ్యాత్మిక మార్గంలో భక్తి, మంత్రం, ధ్యానం ఇలా...రకరకాల సాధన ఏదైనా గాని, చేసేవారు ఎవరైనా గాని తెలుసుకోవలసిన సూక్ష్మ విషయం ఇదే!
🙏🙏🙏🙏☯🙏🙏🙏🙏

Lord SriRama Devotional Devotional India Devotional Telugu Om The Devotional Telugu Devotional Videos Devotional Devotional Lordkrishna Lordkrishna Saibaba Puttaparthi

10/03/2020

నీతి కథ

రామాపురం లో రాజు అనే కుర్రాడు ఉండేవాడు. అతను చాలా బద్దకస్తుడు. ప్రతీ పని సులభంగా అయిపోవాలని ఆశించేవాడు. కష్టమైన పనంటే చాలా ఇబ్బందిగా కదిలేవాడు.

ఒక రోజు ఆ ఊరిలో ఉండే పండితుడికి రాజు ఎదురయ్యాడు. రాజులో మార్పు వస్తుందేమోనని పరీక్షించేందుకు...'నీవు ధనవంతుడిగా మారేందుకు ఓ మార్గం ఉంది. ఈ ఊరి ఈశాన్యదిశలో రావిచెట్టుకి కుడివైపు పదిఅడుగుల దూరం లో గొయ్యి తవ్వితే బంగారు నగలు దొరుకుతాయి' అని చెప్పి వెళ్ళిపోయాడు పండితుడు.

'బంగారు నగల కోసం ఎంత లోతు తవ్వాల్సి ఉంటుందో! ఒకవేళ తవ్వినా అక్కడ నిజంగా బంగారం లేకపోతే? శ్రమంతా వృధా అయిపోతుంది' అనుకుంటూ అక్కణ్నుంచి వెళ్ళిపోయాడు రాజు. ప్రతీ పనీ ఇలాగే ఏదో ఒక వంకతో తప్పించుకునేవాడు.

కొంత కాలానికి ఆ ఊరిలో కరువు వచ్చింది. తాగడానికి నీరు లేక పశువులు, ప్రజలు ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వచ్చింది. బావి తవ్వుదామని ఎందరు ప్రయత్నించినా నీళ్ళు పడలేదు.
రాజుకి హఠాత్తుగా పండితుడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.
బంగారు నగలు దొరికితే తీసుకొని ఎక్కడికైనా వెళ్ళి హయిగా బతకొచ్చనుకున్నుడు.

వెంటనే పలుగు పార తీసుకొని ఈశాన్యదిశలో రావి చెట్టు దగ్గర తవ్వటం మొదలు పెట్టాడు. ఎంతతవ్వినా నగల జాడ కనిపించలేదు. అయినా ఈ కరువు నుంచి తప్పించుకోవాలంటే డబ్బు అవసరం. కాబట్టి ఎలాగైనా వాటిని చేజిక్కించుకోవాలని తవ్వుతూనే ఉన్నాడు రాజు. మూడు రోజులు గడిచాయి. నాలుగో రోజు ఉదయాన్నే రాజు కాళ్ళకి నీటి చెమ్మ తగిలింది. కొద్దిసేపటికి నీరు ఊరటం ప్రారంభించింది. రాజు గబగబా గుంటలో నుంచిపైకి వచ్చేశాడు. ఆ గుంటంతా నీళ్ళతో నిండిపోయింది. ఈ వార్త తెలుసుకున్న ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి రాజు శ్రమని మెచ్చుకున్నారు. ఊరికి గొప్ప ఉపకారం చేశాడని అందరూ రాజుకి ఎన్నెన్నో బహుమానాలు ఇచ్చారు.
*శ్రమపడితే అందరి ప్రశంసలతోపాటు విలువైన బహుమతులూ వస్తాయని గ్రహించిన* రాజు, ఆనాటి నుండి కష్టపడి పనిచేయడం ప్రారంభించాడు.

Videos (show all)

TAAI Sankantri Celebrations ❤️2020
Sarileru Nekevvaru.. pongal started with fun and mass..never before and ever after.👍👍👍❤️❤️❤️

Website