Srirāmapāda Bhāgavathar - ஸ்ரீராமபாத பாகவதர

Srirāmapāda Bhāgavathar - ஸ்ரீராமபாத பாகவதர

Singer - Philosopher - Researcher - Author
"Nāma Sankeerthana" with Eminent Musicians His articles appear in editorial of leading newspapers.

Srirāmapāda, a musician from his childhood and a senior executive rendering "Nāma Sankeerthana" concerts to relax audience from work and stress, and to give benefit to the humanity for the simple fact that Nāma Smarana will only reap benefits quickly in the modern testing times. He leads a team of eminent musicians who work with all well-known music directors. Srirāmapāda is supported on vocal by

06/03/2022

శృంగేరి జగద్గురువుల ఆశీర్వాదం లభించింది 💥
Happy to get Ubhaya Jagadgurus Krupa 🙏

Photos from Srirāmapāda Bhāgavathar - ஸ்ரீராமபாத பாகவதர்'s post 01/03/2022

మహాశివరాత్రి సందర్భముగా మైసూరు దత్త పీఠంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ, నన్ను సత్కరించడం ఈశ్వర సంకల్పము. ఈ సందర్భములో "సనాతన ధర్మ ఆచరణ" గూర్చి వివరించడం జరిగింది. 💥హర హర మహాదేవ💥

Mahādeva Pāhi by Sriramapada Bhagavathar 01/03/2022

Secret of Mahā Sivarāthri 💥

रत्नैः कल्पितमासनं हिमजलैः स्नानं च दिव्याम्बरं
नानारत्नविभूषितं मृगमदामोदाङ्कितं चन्दनम्।
जातीचम्पकबिल्वपत्ररचितं पुष्पं च धूपं तथा
दीपं देव दयानिधे पशुपते हृत्कल्पितं गृह्यताम्॥

Chennai, Feb 28 : In a brief public release, renowned Spiritualist and Devotional Singer Srirāmapāda Bhāgavathar said, the Eshwara Sakthi i.e the most powerful cosmic energy of Mahādev will enter the earth with highest velocity on this day, that will be available for us to absorb between 9 p.m and 2 a.m IST (Wednesday). He further said, this is precisely called "Lingodbhava Kālam" 💥

Srirāmapāda therefore suggested, for those, Eshwara energy is required, may chant "Om Namah Sivāya" during this time and this is the reason why Upavāsa and Jāgarana are prescribed by our Maharshis 👏

On this auspicious occasion, Srirāmapāda has conveyed his warm greetings to all of you a very happy blissful Mahā Sivarāthri 💥

Hara Hara Mahādeva Sambho Sankara 💥

https://youtu.be/9itXRQyv8DM

Mahādeva Pāhi by Sriramapada Bhagavathar Chanting for protection from Corona

Clipping of TelanganaReporter - Telangana Reporter 20/02/2022

My response, published in Telangana news paper on the comments passed by Sri Chinna Jeeyar of Hyderabad against the Jagadgurus.

http://epaper.telanganareporternews.com/c/66360592

Clipping of TelanganaReporter - Telangana Reporter Dated 20 Feb 2022

19/02/2022

చిన్నజీయర్ (తెలంగాణ) వైష్ణవ దురాచార్యులను కూడ ఖండిస్తే బాగుండేది !

చెన్నై, ఫిబ్రవరి 18 : శైవ సంప్రదాయ జగద్గురువుల మీద చిన్నజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలపై ఆధ్యాత్మికవేత్త శ్రీరామపాద భాగవతర్ స్పందించారు. చిన్నజీయర్ (తెలంగాణ) మాట వాస్తవమని, కొంతమంది దొంగ జగద్గురువులు ఉన్నారని, అటువంటివారి జగత్తు ఏమిటో తనకు జీయర్ స్వామికి తెలుసునని శ్రీరామపాద అన్నారు. అందరితోనూ సత్సంబంధాలు కలిగిన చిన్నజీయర్ (తెలంగాణ) నోట ఈ మాట ప్రత్యేకతను సంతరించుకుందని, ఆయన ఎంతో పరిశోధన చేస్తేగాని ఇంతటి విషయముపై బహిరంగ వ్యాఖ్య చేయరని శ్రీరామపాద అభిప్రాయం వ్యక్తపరిచారు. బహుశ ఈ మాట శైవ సంప్రదాయం అనుసరిస్తున్నామని చెప్పుకునే దొంగ స్వామీజీ/గురువుల వ్యాపార ధోరణి అయ్యుండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు 🙄

అలాగే, వైష్ణవ సంప్రదాయం అనుసరిస్తూ దురాచారం చేసే ఆచార్యులపై కూడ చిన్నజీయర్ (తెలంగాణ) స్వామి ఇదే భక్త సమూహం శ్రేయస్సు కోరి హెచ్చరిక చేస్తే ఆయనకున్న సమతా భావన, సమైక్య దృష్టి, సనాతన ధర్మ ఆచరణ శ్రద్ధకి అద్దం పట్టేదని శ్రీరామపాద అభిప్రాయపడ్డారు. మరొక విషయంలో కూడ స్పష్ఠత-సత్యం అవసరమని, ఈమధ్యే వెలుగులోకి వచ్చిన ఈ విషయం చిన్నజీయర్ దృష్టికి రాకుండా ఉండడానికి ఆస్కారము లేదని ఈ సందర్భముగా ఆయన అన్నారు. “కొన్ని సం.ల క్రితం ఒక వైష్ణవ కాషాయవస్త్రధారి అమెరికాలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నాడని, బయట మాత్రం సన్యాసి, శుద్ధ బ్రహ్మచారిగా వ్యవహరిస్తాడని, మరి అతగాడు ఆచార్యుడు ఎలా అవుతాడు?” అనేది దాని సారాంశమని గుర్తు చేశారు. మరి ఇది వైష్ణవ గురు సంబంధ విషయమని ఉలుకు పలుకు లేకుండ ఉండి, శైవ సంబంధిత గురువులు గూర్చి మాత్రమే మాట్లాడితే, తప్పుడు సంకేతాలు ప్రజలలోకి వెళ్ళడమే కాకుండా చిన్నజీయర్ స్వామి చేసే ఆధ్యాత్మిక శ్రమ-సేవకి కళంకము వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. ఇప్పటికే కొన్ని మీడియాలలో చిన్నజీయర్ (తెలంగాణ) మాటలు గర్హనీయం, అహంకార అపరిపక్వ పూరితం అని, ఆయన రియల్ ఎస్టేట్ ప్రమోటర్ అని, ఆయన చెప్పే కొత్తరకం భాష్యాలు రామానుజాచార్య ఉండి ఉంటే అంగీకరించేవారా అని, శాస్త్ర పురాణ ఇతిహాసాలలో లేని విషయములు కొత్తగా సృష్ఠించి మాట్లాడుతున్నారని, తిరుమల వేంకటేశ్వరస్వామికి రామానుజులు గురువని ప్రకటన విని వైష్ణవులు సైతం చిన్నజీయర్‌కు మతి భ్రమించియుంటుందని అంటున్నారని, ఇప్పటికే 216 అడుగుల విగ్రహ నామం విషయములో వైష్ణవులలోని రెండు గ్రూపులు కొట్టుకున్నాయని, అంతటి శైవ ద్వేషియై ఆదిశంకరులంటే గౌరవం లేని జీయర్, జగద్గురు ఆదిశంకరాచార్యులను ఆరాధ్యులుగా కొలిచే ప్రధాని మోడీజీ, అమిత్‌షాజీ, రాజనాథ్‌సింగ్‌జీ, రాష్ట్రపతి చేతుల మీద ఆవిష్కరింప చేయడం వెనుక ఏమి రహస్యముందో ప్రజలలో చర్చ జరుగుతోందని, ఆయన పని ఆయన చూసుకోక, ఇతర సంప్రదాయము మీదే ఎల్లప్పుడూ పడి ఏడవడం ఆయన స్థాయికి తగదని, ఇది ఆధ్యాత్మిక సాధనా అని పెద్దలు పండితులు విస్తుపోతున్నారని, వీటన్నిటినీ చూస్తూ ప్రసిద్ధ శ్రీరంగం దివ్యదేశ క్షేత్రములో కొలువైయున్న రామానుజాచార్య తిరుమేని (సహజమైన పార్థివ దేహం) ఎంతో వేదన చెందుతూ ఉంటుందని, తమిళనాడులో ఎన్నో దివ్యదేశాలు శిధిలావస్థలో, ధూప దీప నైవేద్యాలకి నోచుకోని పరిస్థితి ఉంటే, వాటి జీర్ణోధ్ధరణకి పాటుపడకుండా వాటి ప్రతిరూప ఆలయాలని రూ.1000 కోట్లతో నిర్మించడము వెనుక ఆధ్యాత్మిక ఉన్నతియా లేక లౌకిక ఖ్యాతి తపనా అని ఎంతోమంది ప్రశ్నిస్తున్నారని ఈ సందర్భముగా ఆయన గుర్తుచేసారు. సమాజంలోని బలహీనవర్గాల వారి కోసం ఉచిత విద్యాలయాలు, అనాథులు వయోవృద్ధులకు చేయూత, ఉచిత అన్నదానం మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న చిన్న జీయర్ స్వామి నిష్కళంకుడుగా ఉండాలనేదే తన తపన అని శ్రీరామపాద భాగవతర్ అన్నారు 😰

శైవులైనా, వైష్ణవులైనా, వేరే కోవకు చెందిన మరెవరైనా సరే, శాస్త్రాలకు తమదైన శైలిలో కొత్త (వక్ర) భాష్యం చెప్పి, ప్రజల మనసులో గందరగోళం-గజిబిజి సృష్ఠిస్తూ, భక్తులనబడే అమాయక ప్రజలను మోసం చేసి, మహనీయులు, మహాస్వాములు, జగద్గురువులు జగదాచార్యులు, పరమహంస పరివ్రాజకులు, యోగులు, దూతలు-అవధూతలు, అవతారపురుషులు, సద్గురువులుగా చెప్పుకోవడం సిగ్గు చేటు, మహాపాపమని, భక్తుల అవివేకము, జ్ఞానరాహిత్యంతో వ్యాపారం చేయడము ఘోరనరకాలకు మార్గమని, ఇదే గరుడ-పురాణములో కూడ స్పష్ఠంగా చెప్పబడిందని, దీని అంతరార్థం “కలిప్రభావం సనాతనధర్మ భ్రష్ఠులపై ఎక్కువగా ఉంటుందని” శ్రీరామపాద అన్నారు 😡

ఈ భ్రష్ఠులలో ఎక్కువ మంది విశ్వసనీయమైన గురు-పరంపర లేని వారేనని, భౌతికముగా “పరమేష్ఠి గురు - పరాత్పర గురు - పరమ గురు – గురువు” వ్యవస్థ లేనివారే ఈ మోడరన్ స్వామీజీలు, ఆచార్యులని; ఈ క్రమం సక్రమంగా ఉన్నవారు ఏ సంప్రదాయమైనా పవిత్రులుగా బ్రహ్మనిష్ఠ, ధర్మనిష్ఠలోనే నిమగ్నమై సమతా మూర్తులుగా ఉంటారని, ఈ విషయములో అవగాహన రాహిత్యమే అమాయక భక్తులకి భారమౌతోందని, ఇది ప్రజలు గ్రహిస్తే వారికే మంచిదని శ్రీరామపాద భాగవతర్ అన్నారు. నిజం తెలుసుకునే లోపల జీవితకాలం ముగుస్తుందని, సంపదంతా ఖాళి అవుతుందని ఆయన హెచ్చరించారు. గురువు శిష్యుల అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన ప్రసాదం ఇవ్వాలి తప్ప, వారిని అజ్ఞానంలోనికి నెట్టి వ్యాపారం చేస్తే గురువు ఆచార్యుడు ఎలా అవుతాడని ఆయన ప్రశ్నించారు. ఇదే కలి ప్రభావమని, తెలుసుకున్నవాడు ధన్యుడు అవుతాడని, మూర్ఖుడుకి పీడ తొలగలేదని అర్థమని శ్రీరామపాద సూచించారు. శాస్త్రం నిర్దేశించిన విధముగా భారతదేశ కర్మ భూమిలోనే ఉంటూ, ధర్మాచరణ-ఉపాసన శక్తి-బ్రహ్మనిష్ఠ-అపారమైన ఆధ్యాత్మిక జ్ఞానానికి, ప్రపంచమే తన పాదాల వద్దకు వచ్చి ఆరాధింపబడితే జగద్గురువులౌతారు గాని, నిత్యం ప్రపంచం చుట్టూ తిరిగే స్వాములు, జగద్గురువులు-జగదాచార్యులు కాలేరని ఎంతోమంది పురుషోత్తముల చరిత్రను ఈ సందర్భముగా శ్రీరామపాద భాగవతర్ ఉటంకించారు 🙏

ఆదిశంకరులు శైవాచార్యులు కారని, షణ్మతాలను సమన్వయించిన అద్వైతాచార్యులని, శంకరపీఠాలు విష్ణుభక్తిలో ఏమీ తక్కువకావని వాటిని శైవపీఠాలు అనరాదని, అవి అభేదపీఠాలని శ్రీరామపాద భాగవతర్ వివరించారు. జగద్గురు ఆదిశంకరాచార్యులు పాదము మోపని క్షేత్రము, స్తుతించని భగవత్ స్వరూపము, అందించని స్తోత్రం భాష్యం వ్యాకరణ, తిరగని ప్రదేశములు లేవని, భగవంతుని అవతార కాలము చాలా తక్కువుగా ఉంటుంది, కాని మహిమ వర్ణించనలవి కాదని, అలాగే ఆదిశంకరాచార్య స్థాపిత చతురామ్నాయ పీఠాలు, సర్వజ్ఞ పీఠ పరంపర గురువులందరు శివకేశవుల అబేధ తత్వమునే బోధిస్తారని, పురుషోత్తములంటే అలా ఉంటారని శ్రీరామపాద జ్ఞప్తికి తెచ్చారు 💥

11/02/2022

Sri Chinna Jeeyar Swamiji's response to my Editorial

శ్రీ చిన్నజీయర్ స్వామీజీ 'నా వ్యాసముపై' స్పందన 💥

ప్రముఖ దినపత్రిక ఎడిటోరియల్(సంపాదకీయం)లో ప్రచురితమైన నా వ్యాసానికి ప్రపంచం నలుమూలల నుండి అనూహ్య స్పందన. ఎన్నో వందల మెసేజ్‌లు/కాల్స్. విదేశాలలో నివశిస్తున్న కొందరు భారతీయులు, "ఆధ్యాత్మికం పేరుతో ఆధునిక స్వామీజీలు-వారి బృందాలు రకరకాలుగా మానసికముగా ఇబ్బందిని కలుగజేసి చందాలు వసూలు చేస్తున్నారని" ఆవేదన వ్యక్తపరిచారు. మరొక వ్యక్తి, "ఒక స్వామి ఇండియా నుండి ఇక్కడకు (అమెరికాలో) వచ్చినపుడు కొన్ని సం.ల క్రితం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నాడు. బయట మాత్రం బ్రహ్మచారి, సన్యాసి అని ఉద్ఘాటిస్తారు. మరి ఇటువంటి వాళ్ళు ఆచార్యులు, గురువులు ఎలా అవుతారు? నాకు అసహ్యమేసి అక్కడినుండి నిష్క్రమించాను" అని చెప్పినపుడు నిర్ఘాంతపోయాను. తేరుకున్న తరువాత అర్థమయ్యింది "కలిప్రభావం సనాతనధర్మ భ్రష్ఠులపై ఎక్కువగా ఉంటుందని". ఒక్క విషయాన్ని మనందరం గట్టిగా గ్రహించాలి. కుహక గురువు/స్వామీజీల నిజస్వరూపం తెలుసుకునే లోపు యవ్వనం, ప్రౌఢవయసు (జీవితములో అత్యంత విలువైన కాలం) గడిచిపోతుంది. సంపదంతా అటువైపుకి జమ ఐపోతుంది. సరైన సమయములో గ్రహించగలిగి బయటపడితే అదృష్టం-పరమాత్మ కృప ఉందని అర్థం. లేదంటే పీడ తొలగలేదని అర్థం. ఇది సత్యం. ఎవరికి వారు భగవన్నామస్మరణ (తోచిన నామజపం, ఇదే కలియుగ ధర్మం) చేస్తే, మూలం లేని మూడవ వ్యక్తి పాదం పట్టుకునే అవసరము రాదు కదా! ఆశక్తికరమైన విషయమేమంటే శ్రీ చిన్నజీయర్ స్వామీజీ నా వ్యాసముపై స్పందిస్తూ "దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో గురువులు అలానే ఉన్నారు, మనం జాగ్రత్తగా ఉండాలి" అని నాతో అన్నారు. అంటే, ప్రజలు ఎంతటి ప్రమాదకరమైన ఉచ్చులో పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. మరొక ప్రక్క, ఈ వ్యాసము ఇప్పటి సమాజానికి దోహదపడే గొప్ప అంశము-ధర్మాగ్రహమని ప్రముఖులు, ఆధ్యాత్మికవేత్తలు, పండితుల నుండి ప్రశంసలు. ఇదిలా ఉండగా, సుపరిచితులైన స్వామీజీలు ఒకరిద్దరు కలత చెందారని సమాచారము. సమాజానికి మంచి చెపితే కలత ఎందులకో ? 🙄 వ్యాసం సశేషము !

07/02/2022

Dear friends and bhaktās,

Please subscribe to my YouTube channel to stay up to date with my concerts ⚘ You may share your views and support me with your likes 🙏🏼

https://www.youtube.com/channel/UC3fdwNo8rx9YF9rBWKSvglg

Pahi Rama Prabho by Sriramapada Bhagavathar 04/02/2022

On the occasion of Sri Bhadrāchala Rāmadāsu 389th Jayanthi, a short video of his Keerthana rendered by me at Krishna Gāna Sabha, Chennai. Jai Srirām 🙏

శ్రీ భద్రాచల రామదాసు 389వ జయంతి సందర్భముగా, నేను పాడిన ఆయన కీర్తన మీతో షేర్ చేస్తున్నాను. జై శ్రీరామ్ 🙏

Pahi Rama Prabho by Sriramapada Bhagavathar Bhadrachala Ramadasu Keerthana by Sriramapada Bhagavathar

Photos from Srirāmapāda Bhāgavathar - ஸ்ரீராமபாத பாகவதர்'s post 02/02/2022

1) శైవ - వైష్ణవ దూషణ

చెన్నై, ఫిబ్రవరి 1 : నేడు నెలకొన్న విపత్కర పరిస్థితులలో ప్రతి ఒక్కరికి కుటుంబ సౌఖ్యము, జీవనమార్గ ఉన్నతి కోసం భగవన్నామ చింతనతో ఎక్కువ సమయం గడపవలసిన రోజులు ఇవని, కాలం-వయసు పరుగెత్తుతున్నాయని, బరువు-బాధ్యతలు తీరటం కష్టమౌతోందని ఆధ్యాత్మికవేత్త శ్రీరామపాద భాగవతర్ అభిప్రాయపడ్డారు. లోకం బాగా లేదని, ఇంటి ద్వారం తెరచి బయట అడుగుపెడితే మోసం, అసూయ, కల్మషము, అధర్మం, అవినీతి, అక్రమమే ఎక్కువ భాగము కనబడుతున్నాయని ఆవేదన వ్యక్తపరిచారు. తోడు-నీడగా నిష్కల్మషమైన స్నేహభావముతో మెలిగేవారు దొరకడం దుర్లభమైందని శ్రీరామపాద అన్నారు.

మరోప్రక్క కొంతమంది మహనీయులు సమాజ అభ్యున్నతి, శాంతి కోసం నిత్యం హోమాలు, సంగీత - సంకీర్తనలు, దానములు, వేద గోష్టిలు, భగవన్నామ పారాయణలు చేస్తున్నారని, ‘సర్వే జనా సుఖినో భవంతు’ అని నిత్యం పరితపించే సజ్జన సమూహాలలో బ్రాహ్మణులు ఎల్లప్పుడూ ముందుంటారని, వర్ణాలకి అతీతులు బ్రాహ్మణులని ఆయన చెప్పారు. నేటి పెంపక లోపమో, సజ్జన సహజీవన/సాన్నిహిత్య లోపమో కొంతమంది శైవ, వైష్ణవ బేధముగా పరస్పరం దూషించుకుంటున్నారని, ఇది ఎంతో బాధ కలిగిస్తోందని, ఇటువంటి పరిణామాలు దురదృష్టకరమని శ్రీరామపాద భాగవతర్ ఆవేదన వ్యక్తపరిచారు.

నారాయణుడు, మహాదేవుడు వీరిద్దరికి లేని బేధభావాలు, పూర్వజన్మ కర్మానుసారం మనుష్య జన్మనెత్తిన మనకు ఉండటం నీచ గుణానికి ప్రతీకని ఆయన వాపోయారు. పురాణ-ఇతిహాసాలలో ఎన్నోచోట్ల నిరూపితమైన ‘ఈశ్వర తత్వం’ సకల వేదశాస్త్రాలను ఖండ-ఖండాలుగా ఉపాసన చేసిన మహనీయులకు మాత్రమే అర్థమౌతుందని, అల్పజ్ఞానులమైన మనకు ఆ అద్భుతము తెలియదని, మాట్లాడటానికి అర్హత కూడా లేదని శ్రీరామపాద తెలిపారు.

2) “శివ ద్వేషిని నారాయణుడు, విష్ణు ద్వేషిని మహాదేవుడు రక్షించరు”

సకల శాస్త్ర కోవిదుడు, తపస్సంపన్నుడు, పరమ శివభక్తుడైన దశకంఠుడు (రావణుడు) విష్ణు-ద్వేషియై ప్రతిఘటించినపుడు పరమేశ్వరుడు రక్షించలేదని, విష్ణ్వావతారం శ్రీరాముని చేతిలో హతమయ్యాడని, అలాగే బ్రహ్మ పుత్రుడైన దక్షప్రజాపతి శివ-ద్వేషియై అహంకారముతో విర్రవీగినపుడు, అతని ఆరాధ్యుడైన విష్ణువు రక్షించలేదని, శివుని వెంట్రుక నుండి ఉద్భవించిన వీరభద్రుని చేతిలో హతమయ్యాడని, బృహస్పతిస్తవ యజ్ఞం పూర్తిచేయవలసిన విధి కోసం, దేవతల విన్నపము మీద పరమేశ్వరుడు దక్షునికి మేక తలతో పునర్జన్మనిచ్చాడని, ఆపై దక్షుడు కాశీ క్షేత్రములో శివనామ స్మరణతో జీవించాడని శ్రీరామపాద భాగవతర్ ఈ సందర్భముగా గుర్తుజేసారు. అంటే, భగవంతుని దృష్టిలో శివకేశవ బేధము లేకుండా పరమాత్మని అర్చించేవారు ఉత్తములుగాను, శివ/కేశవులను ద్వేషించేవారు శిక్షార్హులుగా పరిగణించబడతారని అర్థమౌతోందని ఆయన అన్నారు. నామయోగ వాశిష్టం ప్రకారం ఇతర సంప్రదాయాలను, వాటిని ఉపాసన చేసేవారిని కించపరచడం, హేళన చేస్తూ నామాన్ని ద్వేషించడం మహాపాపమని, పైగా ఇప్పటి వరకు చేసుకున్న పుణ్యం క్షీణించి, దోషం వెంటాడుతూనే ఉంటుందని శ్రీరామపాద భాగవతర్ ఉటంకించారు.

3) “శివస్య హృదయం విష్ణుః, విష్ణోశ్చ హృదయగ్ం శివః”

రామేశ్వరములో శ్రీరాముడు శివలింగమును ప్రతిష్ఠ చేసి, మహాలక్ష్మి అవతారమైన సీతాదేవి, ఆదిశేషావతారమైన లక్ష్మణుడు సహా పరమేశ్వరుడుని శ్రద్ధ-భక్తితో అర్చించాడని, దీనికి శివాంశతో జన్మించిన ఆంజనేయుడి సహకారం ఎంతో ఉందని, అలాగే జగన్మాత పార్వతితో పరమేశ్వరుడు ఉపదేశించిన విష్ణుసహస్రనామ సూక్ష్మం "శ్రీరామ రామ రామ" కదా అని శ్రీరామపాద భాగవతర్ గుర్తుచేసారు. మహాభారత యుద్ధము ముందు శ్రీకృష్ణుడు పరమేశ్వరుడుని పూజించిన విషయము అందరికి విదితమేనని ఆయన జ్ఞప్తికి తెచ్చారు. శివకేశవులు ఒకరికొకరు ఆరాధ్యముగా ఉన్నప్పుడు, వారిని పూజించే మనము వారిని అనుసరించి గౌరవించాలి కదా అని శ్రీరామపాద అన్నారు.

ఈ దృష్టాంతాల ద్వారా మనందరం అర్థం చేసుకొనవలసినది ఏమంటే, ఎవరికి వారు తమ-తమ సంప్రదాయాల ప్రకారం తమకి తోచిన భగవన్ మూర్తిని అర్చిస్తూ, ఇతర సంప్రదాయస్తులను గౌరవిస్తూ ఉండాలని, అవసరమైనపుడు దుష్ట సంస్కృతిని-సంఘ విద్రోహ శక్తులను అణచివేయడానికి సమిష్ఠిగా లోకక్షేమ కైంకర్యాలను నిర్వహించాలని శ్రీరామపాద తన అభిప్రాయమును వ్యక్తపరిచారు.

ఈ సందర్భములో మనందరం గ్రహించవలసిన హెచ్చరిక ఒకటి ఉందని, కొంత మంది పనిగట్టుకుని హిందువులని టార్గెట్ చేస్తూ సనాతన సంప్రదాయములను విచ్చిన్నం చేసే దిశగా విభజించి పాలించడానికి విస్తృతంగా ప్రయత్నం చేస్తున్నారని, ఇటువంటి నీచ సంస్కృతికి మనం లోనుకాకూడదని ఆయన హెచ్చరించారు. ‘లోకా సమస్తా సుఖినో భవంతు’ అనే మహోన్నత ఆశయం మన సనాతన హిందూ ధర్మానిదని, ప్రపంచమంతా భారతదేశ సనాతన ధర్మానికి ప్రణమిల్లుతున్న వేళ, హిందువులందరు కలిసిమెలసి ఉండవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, దీనికై కృషి చేసే పాలకులు మన దేశానికి ఇప్పటికి లభించడం ఎంతో శుభపరిణామమని శ్రీరామపాద భాగవతర్ అన్నారు. అందువలన, అందరం ఐకమత్యముతో సమాజ శ్రేయస్సు కోసం వాడ-వాడలా భగవన్నామ పారాయణలు, యజ్ఞాలు, గోశాలలు, దేవాలయాలను సమిష్టిగా పోషించడం నిరంతరము చేయాలని శ్రీరామపాద భాగవతర్ కోరారు.

27/01/2022

నేటి గురువులు/స్వామీజీలు ఏదో విధముగా డబ్బు లాగించడమే పనిగా పెట్టుకున్నారు కాని, ఆ ద్రవ్యం/ధనం దాత అనబడే తాత్కాలిక యజమాని వద్ద ఎటువంటి మూలముతో ఆర్జించబడినదో ధర్మాచరణ చేయడంలో ఆలోచనా జ్ఞానం లేనివారై ఉన్నారు. భక్తులనబడే ప్రజలను మూర్ఖులను చేయడమే ఈ కలిగురువులు/స్వామీజీల దినచర్య. మాయమాటలతో మన సంపద ఖాళీ చేయడమే వీరి లక్ష్యంగా కనబడుతుంది.

నిజమైన గురువు సర్వాంతర్యామిగా సర్వజ్ఞానియై ఉంటాడు. దివ్యదృష్టితోనే అన్ని తెలిసియుంటాడు. వీరి నిర్వహణలో సదా సర్వకాల సర్వావస్థలలోనూ ధర్మ కార్యమే జరుగుతుంది. మరి కంచి పరమాచార్య ఏమి చేశారో చదవండి.
______________________________________________

అన్నవిక్రయం మహాపాపం

చెన్నైకు చెందిన ఒక పెద్ద రెస్టారెంట్ యజమాని చాలా ప్రముఖ వ్యక్తి. ఆయన పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చాడు. అతని వ్యాపారం బాగా అభివృద్ధి చెందడంతో, చాలా ధనం సంపాదించాడు. అతడు మంచి భక్తితత్పరుడు, దానగుణం కలవాడు కూడా. 1958 - 1960లలో పరమాచార్య స్వామివారు చెన్నైలో మకాం చేస్తున్నప్పుడు, పాదపూజ చేసి, భిక్షావందనం చెయ్యాలని ఆశపడ్డారు.

“సరే చూద్దాంలే” అన్నారు స్వామివారు. కాని ఎన్నిసార్లు ఆయన తన కోరికను తెలిపినా, పరమాచార్య స్వామివారు అంగీకరించలేదు. అలా అని తిరస్కరించనూ లేదు. కాని ఇది తిరస్కారమే అని శిష్యులు అర్థం చేసుకున్నారు. శ్రీమఠంతో మంచి సంబంధాలు ఉన్న కొంతమంది పెద్దలు ఆయన తరుపున పరమాచార్య స్వామివారిని వేడుకున్నారు.

“అతను మంచి వ్యక్తీ, గొప్ప దానగుణం ఉన్నవాడు. మఠానికి ఎన్నో రకాలుగా సేవ చెయ్యగల సమర్థుడు. అతనికి సంతానం కూడా లేదు” అని చెప్పసాగారు.

మహాస్వామివారు అంతా మౌనంగా విన్నారు. “అతను మంచి వ్యక్తి అని నాకు కూడా తెలుసు. భక్తీ ప్రపత్తులు దానగుణం కలిగినవాడు కూడా. అతని గురించి తప్పుగా నేను ఏనాడైనా మాట్లాడానా?” అని అడిగారు.

“లేదు లేదు పెరియవ. కేవలం శ్రీమఠానికి ఎదోరకంగా సేవచేసుకోవాలి అనే ఆశ అతనిది”

“అదే నేను కూడా అడుగుతున్నా. అతను మంచివ్యక్తి అంటున్నారు కదా. ఆయన సేవచేయాలనుకుంటే ఎన్నో దేవాలయాలు ఉన్నాయి కదా! అతను మఠానికి డబ్బు ఇచ్చినా మరలా మనం చేసేది అదే కదా. మరి అతనే చెయ్యవచ్చు కదా!” అని అన్నారు స్వామివారు.

అందరూ మౌనం వహించారు.

“పుట్టుక చేత అతను వేదాధ్యయనం చెయ్యాలి. అన్నం అమ్ముకోకూడదు. అది పెద్ద పాపం. అతని సంపద అంతా అన్నం అమ్ముకోవడం వల్ల సమకూరినదే. మరి ఆ డబ్బు చంద్రమౌళీశ్వరునికి అవసరమా? చెప్పండి”

అందరూ మిన్నకుండిపోయారు. ఇక మాట్లాడడానికి వారికి అనకాశం లేదు. కాని ఆయన మాత్రం పదే పదే తన కోరికను తెలుపుతూనే ఉన్నాడు.

పరమాచార్య స్వామివారు పరమ దయాళువు. చెన్నై నగరం నుండి వెళ్ళిపోయే తేదీ నిశ్చయం అయ్యింది. సమష్టి భిక్షావందనం ఏర్పాటు చేశారు. సమష్టి అంటే అందరూ కలిసి. ఇటువంటి భిక్షావందనంలో భక్తులందరి సమర్పణని అంగీకరిస్తారు. చిన్నదా పెద్దదా ఎవరు ఎంత ఇచ్చారు అనే పట్టించుకోరు. అందరూ కలిసి గురువుగారికి భిక్ష సమర్పిస్తారు. అతణ్ణి కూడా ఇందులో పాల్గొనమని చెప్పారు. అదే భాగ్యంగా తలచి ఆయన కూడా పాల్గొన్నారు. వారికి చెట్ పేట్ లో కోట్లు విలువ చేసే ఇల్లు ఉంది. “నేను నా భార్య మరణించిన తరువాత ఈ ఇంటిని శ్రీమఠానికి ఇవ్వాలని, ఒకవేళ దాన్ని అమ్మిన పక్షంలో ఆ డబ్బును మఠానికి ఇవ్వాలని” విల్లు వ్రాశారు.

కాని మఠాన్ని పరమాచార్య స్వామివారు నిర్వహించినంతవరకూ ఆ రాజభవనాన్ని స్వాధీనపరుచుకోలేదు.

ధర్మం అంటే ధర్మమే! పరమాచార్య స్వామివారు అంటే పరమాచార్య స్వామివారే !

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం

Photos from Srirāmapāda Bhāgavathar - ஸ்ரீராமபாத பாகவதர்'s post 24/01/2022

శ్రీరామపాద భాగవతర్ కలం నుండి :

భక్త జన సందోహం అంటే ఇదే. దేవాలయము వీధిలో, గోపురము వద్ద. మరెక్కడో ప్రాయోజిత సభలో కాదు. భగవంతుని మూలమూర్తి దర్శనము కోసం. కొన్ని శతాబ్దాల ముందు మహర్షులు, దేవతలు, అవతార పురుషుల తపః ఫలముచే ప్రతిష్టించబడిన పరమాత్మ ప్రతిరూపాలు. ఇవే క్షేత్ర మహిమలు 🙌

కోట్ల మంది హిందువులు నిత్యం తరిస్తూనే ఉన్నారు. రథోత్సవం, గరుడ, నంది మొ. వాహన సేవలకు తరలివచ్చే భక్త జన "నామ ఘోష" వజ్రాయుధం, బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రాల కన్నా మిన్న 💥

వీటికి తోడు, ప్రతి హిందువు ఇంట్లో జరిగే భగవన్నామ స్మరణ, పారాయణ, వేదఘోష, హోమ కైంకర్యాలు సుదర్శన, త్రిశూలం ఆయుధ శక్తులతో సమానము, నేటి సమాజములో నెలకొనియున్న దుష్టశక్తులని, సంఘ విద్రోహ చర్యలను ఖచ్చితముగా హరించివేస్తాయి 👍🏻

लोकः समस्ताः सुखिनो भवन्तु

22/01/2022

శ్రీరామపాద భాగవతర్ కలం నుండి :

ఒక మహా మహిమాన్వితమైన భాగవతోత్తముడు శ్రీ త్యాగరాజ స్వామి. ఆయన భక్తి గానమునకు మెచ్చి శ్రీరాముడు (త్రేతాయుగంలో శ్రీమహావిష్ణు అవతారం) కేవలం 175 సం.ల క్రితం తిరువైయారు వచ్చి దర్శనం ఇచ్చాడంటే భగవంతుడు నిత్యం మన ప్రక్కనే ఉన్నాడనడానికి సాక్ష్యమే కాక, మనం వేదశాస్త్ర సమ్మతమైన ఏ రూపంలో కొలచినా, ఆ రూపంలో దర్శనమిస్తాడనేది సుస్పష్ఠం. ఈశ్వరుని చూడాలంటే కావలసిన అర్హత ఒక్కటే "నిష్కల్మష, నిష్కామ్య భక్తి" మాత్రమే. ఇదే సద్గురు త్యాగరాజస్వామి మనకు నిరూపణ చేశారు.

కర్ణాటక సంగీతంలో ఎన్నో తెలుగు సాహిత్య కీర్తనలను ఈ ప్రపంచానికి ఉపదేశించిన వాగ్గేయకార శిరోమణి త్యాగయ్య, తెలుగువాడిగా మనందరికి గర్వకారణం. తెలుగు బిడ్డలైన 'ఎందరో మహానుభావులు' తమిళనాట స్థిరపడి ప్రపంచానికి ఆరాధ్యులయ్యారు. వారిలో త్యాగరాజస్వామి అగ్రగణ్యులు.

కర్ణాటక సంగీత త్రిమూర్తులలో త్యాగరాజస్వామి, శ్యామశాస్త్రి (ఇద్దరు) మరియు సదాశివ బ్రహ్మేంద్ర ఆంధ్రరాష్ట్రానికి చెందిన బ్రాహ్మణ కుటుంబములో పుట్టిన మహనీయులు కావడం, తెలుగువారిగా మనందరికి ఎంతో గర్వకారణం. అంతే కాకుండా మన అన్నమాచార్య, భద్రాచల రామదాసు కీర్తనలు ఇతర భాష విద్వాంసులకు ఆరాధ్యము. ప్రాచీన భజన సిద్ధాంతకర్తలైన త్రిమూర్తులలో (ఇద్దరు) మరుదనల్లూర్ సద్గురుస్వామి, శ్రీధర అయ్యావాళ్ తెలుగు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన పురుషోత్తములే.

తరతరాలుగా భాష-ప్రాంతాలకి అతీతంగా ఎంతో మంది విద్వాంసులు ఆ మహానుభావులను ఆరాధిస్తూనే ఉన్నారు. వారి కీర్తనలను వినాలన్నా, గానం చేయాలన్నా, నేర్చుకోవాలన్నా పూర్వ జన్మ సుకృతం ఉండాలి. అంతటి మహనీయుని ఆరాధన ఉత్సవం సంధర్భంగా 'త్యాగరాజస్వామి' పాదపద్మములకు నా సాష్ఠాంగ ప్రణామాలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత విద్వాంసులు, విధుషీమణులకు ఈ సందర్భముగా నా భక్తి పూర్వక శుభాకాంక్షలు.

ఆ మహనీయుల వారసత్వాన్ని పొంది భక్తి సంగీతములో వేల సంఖ్యలో మన పిల్లలను తయారుజేసి కుటుంబాలు ధన్యమవ్వాలని ఆకాంక్షిస్తున్నాను.

- శ్రీరామపాద భాగవతర్, చెన్నై
Ph : 89252 63906

Photos from Srirāmapāda Bhāgavathar - ஸ்ரீராமபாத பாகவதர்'s post 21/01/2022

From the pen of Srirāmapāda Bhāgavathar :

He was a glorious Purushottama. He was our very recent proof, just 175 years ago (perhaps our 2nd great grandparent’s time) that Bhagavān Srirāma had come in physical form, not in dream but in day light, to the Saint’s house at Thiruvaiyāru in praise of his devotion. That establishes the Bhagavān is near us the moment we call him with fine bhakti in any acceptable form as per the Veda-Sāstrās. Evidently Sri Mahāvishnu avatār of Tretāyuga period had now come in person recently several times 🙌

He is Holiness Sri Tyāgarāja Swāmi and His 175th arādhana utsav started globally. He had gifted us innumerable Keertanās in Telugu literature and being worshipped by one and all the carnātic musicians across the States and Nations worldwide 🙏🏼

In fact, there are "endaro mahānubhāvulu" from Andhra Pradesh settled in Tamil Nādu, being respected by the world. Saint Tyāgarāja is one such divine soul. The oldest among the trinity of carnātic music Shyāma Sāstry, Sadāsiva Brahmendra, Prācheena Bhajana Sampradāya Siddhānta karthās Maruthānallur Sadguru Swāmigal, Sridhara Ayyāval were also born in telugu brāhmin families. Similarly, the Keertanās of telugu vāggeyakārās namely Annamāchārya, Bhadrāchala Rāmadāsu, Nārāyana teertha (Krishna Leela Tarangini) also have primary place in the music of Tamil Nādu 🔔

Let us all immerse in the ocean of Saint Tyāgarāja's Kritis especially Pancharathna Keertanās on this holy occasion. To listen to, learn, practice or by way of rendering his Keertanās happen only with Poorva Janma Sukrutham. My humble namaskāram to all the Vidwāns and Vidhushis on this very special utsav 🙏

Photos from Srirāmapāda Bhāgavathar - ஸ்ரீராமபாத பாகவதர்'s post 16/01/2022

నేటి కలి గురువులు, స్వామీజీలు "అన్నీ నేను చూసుకుంటాను" అని ధర్మాచరణని వక్రీకరించి తమ వాలంటీర్లను భక్తులనబడే బాధితుల దగ్గరకి పంపి "స్వామివారు అది చేయమన్నారని, ఇది చేయమన్నారని" మనసులో గజిబిజి సృష్టించి, ఏదో సేవ పేరుతో డబ్బు కట్టించుకుంటున్న నేటి కలికాలంలో కూడా ధర్మనిష్ఠాపరుడైన పరమాచార్య ఏమి చేసారో చూడండి ...

ఇదే, సనాతనంగా, ఇప్పటికీ నడుస్తున్న గురు-పరంపరలోని పీఠాలకు చెందిన జగద్గురువుల నిజాయితి, ధర్మాచరణ 🙏🏼

- శ్రీరామపాద భాగవతర్
_____________________________________________________

కులదైవాన్ని మరచిపోతే ?

ఒక భక్తుడు కంచి మఠంలోనికి ప్రవేశిస్తూ, తూలుతూ తడబడతూ క్రింద పడిపోబోయాడు. అతని అవస్థ చూసి అక్కడ ఉన్నవారు పట్టుకున్నారు. అయినా అతను నోట్లో నుండి రక్తం కక్కుకున్నాడు. అక్కడున్నవారు భయపడిపోయారు. అక్కడ రేగిన కలకలం పరమాచార్య స్వామివారి చెవులను చేరింది.

వారు ఒక పరిచారికుని వంక చూసి “ఎందుకు అంత అలజడి అక్కడ?” అని అడిగారు.

మఠం మేనేజరు మహాస్వామి వారితో “ఎవరో భక్తుడు రక్తం కక్కుకున్నాడు” అని చెప్పాడు.

మహాస్వామి వారు మేనేజరుతో “అతనిదేవూరు? ఇప్పుడు ఎక్కడినుండి వస్తున్నాడు” కనుక్కోమన్నారు.

ఆ భక్తుడు తిరుచ్చి దగ్గర్లోని ఒక పల్లెటూరినుండి వచ్చాడు. చిదంబరంలోని నటరాజ స్వామి వారిని దర్శించుకుని కాంచీపురానికి వచ్చాడు. మహాస్వామి వారు ఆ పెద్దమనిషిని దగ్గర్లోని డాక్టరు దగ్గరకు తీసుకువెళ్ళమని చెప్పారు. రక్తం కక్కున్నాడు అని విన్న వెంటనే డాక్టరుగారు హెమొరేజ్ (రక్తస్రావం) వాల్ల ఇలా జరిగి ఉండొచ్చు అనుకున్నారు. హాస్పిటల్ లో చేర్పించమని సలహా ఇచ్చారు.

ఈ విషయాన్ని మహాస్వామి వారికి చేరవేసారు.

”ఇది హెమొరేజ్ కాదు. మీ నాన్నమ్మను అడిగితే అది వేడి చేయడం వల్ల అలా జరిగింది అని చెబుతారు. ఇంకొందరు దృష్టిదోషం వల్ల అలా జరిగింది అని చెబుతారు. నాకు తెలిసి ఈ పెద్దమనిషి వారి ఇంటి దైవం తిరువాచూర్ మదుర కాళి అమ్మన్. ఇప్పుడు వీరికి కాని వీళ్ల ఇంట్లో వాళ్ళకి ఇంటి దైవం విషయం గుర్తులేదు. కాని ఇప్పుడు వీరు అమ్మవారిని భక్తితో కొలవడం లేదు. కంచి కాళికాదేవికి పూజ చేసి ఇతనికి ప్రసాదం ఇవ్వండి. ఇతను చిదబరంలోని థిల్లై కాళి అమ్మవారిని దర్శించుకోకుండా ఇక్కడికి వచ్చాడు. అది తప్పు కదా? అంతే కాకుండా కాళి దేవి వారి ఇంటి ఆరాధ్యదైవం. మరి అటువంటప్పుడు కాళి దేవిని భక్తితో కొలవాలి కదా? సరే”

“అతనికి ఆరోగ్యం బాగుపడిన వెంటనే చిదంబరం వెళ్ళి థిల్లై కాళి అమ్మవారిని దర్శించుకోవాలి. వైద్యులు చెప్పినట్టు ఇతను అధిక రక్త పోటుతో బాధపడుతున్నాడు. అందుకే రక్తం కక్కున్నాడు. కావున అతని తిండిలో సాధ్యమైనంతవరకు ఉప్పు తగ్గించాలి.” ఇలా మహాస్వామి వారు చాలా సూచనలు చేసారు.

కాంచీపురం కాళి అమ్మవారి దేవస్థానం నుండి కుంకుమ తెచ్చి ఆ పెద్దమనిషి నుదుటిపైన రాసారు. అతన్ని శ్రీమఠం లోని హాల్లో పడుకోబెట్టారు. పరమాచార్య స్వామి వారు చెప్పినట్టు తరచుగా అతనికి చల్లటి నీటిని కొంచం కొంచం తాగడానికి ఇచ్చారు. రాత్రి అతను హాయిగా నిద్రపోయాడు. మరుసటి ఉదయం అతను మామూలుగా సంభాషించాడు. రాత్రి విశ్రాంతి వల్ల అతను కొంచం ఉత్సాహంగా కనపడ్డాడు. ఆయన మహాస్వామి వారి వద్ద ప్రసాదం తీసుకుని మేనేజరు గారికి ధన్యవాదాలు తెలిపి వెళ్ళిపోయాడు.

ఇంటికి వెళ్ళిన తరువాత తనకు ఎటువంటి ఆరోగ్య సమస్య లేదని అతను మేనేజరు గారికి ఉత్తరం రాసాడు. ఇంకా

“నేను ఇక ఎప్పుడూ మా ఇంటి దైవాన్ని మరచిపోను. కాని నాకు ఈనాటికి అర్థం కాని విషయం ఏంటంటే మహాస్వామి వారికి ఎలా తెలుసు నేను చిదంబరంలో థిల్లై కాళి అమ్మవారిని దర్శించుకోలేదని?” అది మనకి కూడా అంతుచిక్కని విషయం.

మన ఇంటి దైవం తరతరాలుగా మన చేత పూజింపబడుతూ మనల్ని రక్షిస్తున్న దైవం. కొత్త కొత్త దేవుళ్ళ మోజులో పడి ఇంటి దైవాన్ని ఎన్నటికి మరువరాదు. తల్లితండ్రులు కూడబెట్టిన ఆస్తులు కావాలి. కాని వారు అర్చించిన దైవం మాత్రం వద్దా?

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

Photos from Srirāmapāda Bhāgavathar - ஸ்ரீராமபாத பாகவதர்'s post 13/01/2022

India and Indians staying abroad have lit up in celebration of the 4-day Pongal / Makara Sankranthi festival, which started coincidentally with the auspicious Vaikunta Ekadashi, a good sign 👌

We all know Pongal is a harvest festival of thanksgiving. It is traditionally celebrated by the farmers to thank for a year of bountiful harvest blessed for their countrymen. For others, it is a strong reminder to be grateful to all the farmers for the good fortunes that we have reaped from them 👏

In the last 2 years, we have faced many challenges and able to overcome, and now looking forward to the future with hope for brighter days 💥

I wish this season brings all of us an abundance of blessings and prosperity 🙏

Photos from Srirāmapāda Bhāgavathar - ஸ்ரீராமபாத பாகவதர்'s post 12/01/2022

My best wishes to everyone on the most promising occasion of Vaikunta Ekādashi ⚘

Fasting and chanting Sree Mahāvishnu Nāma on this day gets the result equivalent to a crore of Ekādashi Vratās. Just gopura darshan of ‘divya Vaikunta dhams’ on this Ekādashi day fetch the bhaktha with countless punya 🙌

Om Namo Bhagavathe Vāsudevāya 🙏🏼🙏🏼🙏🏼

Chanting for protection from Corona by Srirāmapāda Bhāgavathar 09/01/2022

Please listen to the chanting in this 2min video 🎶💥
I pray Mahādev for everyone's safety and health 🙏🏼

https://youtu.be/9itXRQyv8DM

Chanting for protection from Corona by Srirāmapāda Bhāgavathar Chanting for protection from Corona

08/01/2022

తెలుగువాడిగా తమిళనాడులో గౌరవం పొందటం నా అదృష్టం.

06/01/2022

Short video clip from my yesterday's concert

04/01/2022

My concert tomorrow at 4 p.m @ Krishna Gana Sabha 🐚🎻🎶 Ram Ram 🙏🏼

Photos from Srirāmapāda Bhāgavathar - ஸ்ரீராமபாத பாகவதர்'s post 04/01/2022

Radhe Krishna. Please be present at Sri Ayikudy Kumar Bhagavathar Nama Sankeerthanam concert today from 4 to 6 p.m at Krishna Gana Sabha, T. Nagar, Chennai.

My concert is at 4 p.m tomorrow 🎶🔔🌻

31/12/2021

Om 🐚

Stay blessed and be happy always in the English new year 2022 ⚘

30/12/2021

ఉత్తరద్వార దర్శనము వేళ ప్రాతః కాలములో నా కచేరి ప్రసిద్ధ శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయములో. తీపి జ్ఞాపకం డిసెంబర్ 29, 2017 🐚

24/12/2021
Photos from Srirāmapāda Bhāgavathar - ஸ்ரீராமபாத பாகவதர்'s post 22/12/2021

శ్రీ గోవిందానంద సరస్వతి స్వామితో చర్చ

కొందరు పనిగట్టుకుని హిందూ సనాతన ధర్మ ఆయువు పట్టులైన ఉపనిషత్‌లను వక్రీకరించడానికి ఏ విధముగా సాహసిస్తున్నారో ప్రముఖ దండి సన్యాసి శ్రీ గోవిందానంద సరస్వతి స్వామి, చెన్నై వాస్తవ్యులు తెలుగు రాష్ట్రానికి చెందిన ఆధ్యాత్మికవేత్త శ్రీరామపాద భాగవతర్‌కి వివరించారు.

అల్లా ఉపనిషత్, ముల్లా ఉపనిషత్ అసత్యాలు, ఘోర తప్పిదాలు కాక మరేమిటని నిర్ఘాంతపోయారు. త్యాగోపనిషత్, శ్రీ వెంకటేశ తాపన్యుపనిషత్ మొ.వి అప్రామాణికమని ఆధారాలతో వివరించారు. ఎంతో మంది ప్రముఖులు ఇప్పటికే జారీ చేసిన శ్రీముఖ ప్రతులను చూపించారు.

శ్రీ వెంకటేశ తాపన్యుపనిషత్ విషయములో చాలా మంది పండితులు, వేద కోవిదులు, పీఠాలు తమ శ్రీముఖాల జారీలో తప్పులు దొర్లాయని గ్రహించి సరిదిద్దుకునే చర్యలు చేపట్టడం శుభ పరిణామమని ఈ సందర్భముగా చర్చకు వచ్చింది. శ్రీ గోవిందానంద సరస్వతి స్వామి చేస్తున్న హిందూ సనాతన ధర్మ పరిరక్షణ, ప్రచారానికి తమ మద్దతు, సహకారమును శ్రీరామపాద భాగవతర్ తెలియజేశారు.

హిందూ సనాతన ధర్మ ఆచరణ - నిష్ఠ, ప్రసిద్ధ క్షేత్రాలు, దేవాలయాల పట్ల జరుగుతున్న ఘోరాలను గళమెత్తి ప్రశ్నించే బ్రహ్మనిష్ఠ కలిగిన సన్యాసి దొరకటం సంతోషదాయకమని శ్రీరామపాద అన్నారు. అందునా జగద్గురు ఆదిశంకరాచార్యులు స్థాపించిన పశ్చిమామ్నాయ ద్వారక-శారదా పీఠం, ఉత్తరామ్నాయ బదరికాశ్రమ-జ్యోతిర్మఠం యొక్క ప్రస్తుత శంకారాచార్యుల వారి శిష్యుడు శ్రీ గోవిందానంద సరస్వతి స్వామి అని ఆయన తెలియజేశారు.

కుహక స్వామీజీలు-పీఠాలు-ప్రవచనకర్తలు, అజ్ఞానులు స్వలాభాపేక్ష కోసం హిందూ ధర్మాచరణకి భంగం కలిగించి భ్రష్టు పట్టిస్తున్నారని, ఇటు ప్రజలు అటు జ్ఞాన-పండితులు సైతం జాగ్రత్త వహించాలని ఈ సందర్భముగా శ్రీరామపాద భాగవతర్ కోరారు.

Photos from Srirāmapāda Bhāgavathar - ஸ்ரீராமபாத பாகவதர்'s post 19/12/2021

చెన్నైలో జరిగిన వాక్యార్థ విద్వత్ సభలో ఆచార్య మహా మహోపాధ్యాయ బ్రహ్మశ్రీ అవధాని డా.చిర్రావూరి శ్రీరామ శర్మ గారిని దర్శించే భాగ్యం లభించింది 🙏🏼 వారితో జరిగిన సంభాషణ ఎంతో ఆనందాన్ని కలిగించింది 🌻 జీవితములో కొందరి కలయిక పూర్వ జన్మ సుకృతం 💥

ఈమధ్యే తెనాలి వాస్తవ్యులు బ్రహ్మశ్రీ విష్ణుభట్ల ఆంజనేయ చయనులు గారి ఆశీర్వాదం లభించింది 🙏🏼

16/12/2021

My best wishes to all of you on the auspicious time and period of dhanurmāsam. It’s said to be the favourable time to do sādhana on Bhagavān Vishnu.

Andāl Thiruvadigale Saranam 🙏🏼
Om Namo Bhagavate Sriranganāthāya 🙏🏼

14/12/2021

Mokshada Ekādasi

By observing complete fast on this day, worshipping Bhagavān Vishnu with true devotion and with a realization that One will never commit mistake or cause hurt, trouble and harassment to others again in this lifetime would get rid of Sins and be liberated after death 💥

The ancestors if any in the hell for some reasons beyond our knowledge, would be liberated immediately and the way to Vaikuntha is opened for them 👏

"Be in the righteous path" 😑

Om Namo Bhagavate Vāsudevāya 🙏🏼

Photos from Srirāmapāda Bhāgavathar - ஸ்ரீராமபாத பாகவதர்'s post 13/12/2021

Historic development at Kāshi Viswanātha Mandir. This will add to the Kāshi's Spiritual vibrancy 💥

Hara Hara Mahādeva 🐚⚘🔔📯🎷🎶🎹🎻🥁🙏

Photos from Srirāmapāda Bhāgavathar - ஸ்ரீராமபாத பாகவதர்'s post 02/12/2021

నేడు గురు-ప్రదోషం. సా.4.45 నుండి 5.30 గం. వరకు. అందునా కార్తీక మాసం గురు దక్షిణామూర్తి (ఈశ్వర) ప్రీతి.

ఎవరికైతే గ్రహ దోషం ఉన్నదో, వారు ఈ సమయములో నందీశ్వరుని పూజించి, ఈశ్వర దర్శనం చేసి, మనసారా ఈశ్వరనామ స్మరణ చేస్తారో, వారి దోషం నీచమవడమే కాక, ధర్మమైన కోరికలు త్వరిత గతిన తీరగలవు. ఇది శాస్త్ర వచనము.

నందీశ్వరుని అనుమతి తీసుకుని మాత్రమే ఈశ్వర దర్శనము చేయాలి సుమా !

నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక
మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి 🙏

या ते रुद्र शिवा तनूरघोरापापकाशिनी
तया नस्तनुवा शन्तमया गिरिशन्ताभिचाकशीहि

ఓం నమః శివాయ 🙏🏼

30/11/2021

At 83 yrs, vocally she has a great tone and really good control on the notes. Her profession has been only sing and offer Keerthanas to the Perumal at home. For me, a blessed opportunity to listen to, on this Ekadasi day early morning. Om Kārtheeka Damodarāya Namah 🙏🏼

29/11/2021

Last Kārtheeka Somavāra (Chandramāna) today and is special for both Hari Hara avatārs 🔔

शिवाय विष्णुरूपाय शिवरूपाय विष्णवे
शिवस्य हृदयं विष्णुर्विष्णोश्च हृदयं शिवः
यथा शिवमयो विष्णुरेवं विष्णुमयः शिवः
यथा शिवस्तथा विष्णुर्यथा विष्णुस्तथा शिव: 💥

Sivāya Vishnu Roopāya, Siva roopāya Vishnave
Sivasya hridayam VishnurVishnoscha hridayam Sivah

శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణవే
శివస్య హృదయం విష్ణుః, విష్ణోశ్చ హృదయం శివః 🙏

25/11/2021

దురాచార పరులకు కూడ కార్తీకమాసం వరమే !

"బంధించి బాధించేవి - ఫలవాంచిత కర్మలు"
"ముక్తినిచ్చేవి - ఫలపరి త్యాగకర్మలు"

కాలసూత్రం, రౌరవం మున్నగు నరక బాధలు, యమ యాతన నుండి తప్పించుకోవడానికి సంవత్సరములో కొన్ని విశేషమైన తిథులు, దినములు, మాసములను ఈశ్వరుడు మనకు కరుణతో ప్రసాదించాడని, ఈ అవకాశాలను అప్రమత్తంగా ఉండి సముచితంగా సద్వినియోగం చేసుకోవాలని ఆధ్యాత్మికవేత్త శ్రీరామపాద భాగవతర్ సూచించారు. తమ కుటుంబం, సంతతి యొక్క మంచి కోరుకునేవారు తాము చేసిన దుష్కార్యాలకి పశ్చాత్తాపపడి, ఇక మీదట జీవితములో తప్పు చేయకూడదనే సంకల్పంతో ఈశ్వరుడిని శరణువేడటానికి కార్తీక మాసం పరమోత్తమమైనదని, దురాచార పరులకి కూడ ఒక గొప్ప వరమని శ్రీరామపాద తెలియజేశారు. అన్ని తప్పులను సరిదిద్దుకుంటానని, ఇక మీద సదాచారంతో ధర్మబద్ధంగా జీవిస్తానని పశ్చాత్తాపంతో కూడిన సత్సంకల్పం చేసుకోవడానికి ఇంతకు మించిన ఉత్తమమైన కాలం లభించదని శ్రీరామపాద చెప్పారు. శ్రీహరి నామ స్మరణతో, ఈశ్వరుడి కృపకోసం ఆరాధించే అద్భుత కాలం కార్తీక మాసమని; నది స్నానం, అఖండ పంచాక్షరి మంత్ర జపం, ఉపవాస దీక్ష, తులసి తీర్థమే ఆహారంగా స్వీకరించడం, సూర్యోదయ జప తపాదులు, సంధ్యాకాల అభిషేకాలు, వస్త్రం, తులసి, సాలగ్రామ, ఉసిరి, తిల, దీప, పండ్లు, ధన, అన్నదానములు స్వయంగా చేయడం వలన అనంతపుణ్యం కలిగి తెలిసి-తెలియక మూటగట్టుకున్న పాపారాశి క్రమేణా దహించివేయబడుతుందని ఆయన అన్నారు.

పుణ్య ఫలం ఎదురుచూడకుండా ఈశ్వరుడుని ఆరాధించటం, సదాచారమును విధిగా నిర్వర్తించడం అత్యుత్తమమని, ఇటు కుటుంబ క్షేమం, అటు సమాజం శ్రేయస్సుకు సదాచారం ఎంతో అవసరమని శ్రీరామపాద భాగవతర్ నొక్కి ఒక్కాణించారు 💥

ఎవరికి కాలసూత్ర, రౌరవ నరక బాధలు ?

ఇతరుల ఆస్తిని దొంగతనం, మాయ మాటలతో కాజేసినవాడు, దురాలోచన చేసినవాడు – సహకరించినవాడు, పరుల ఉద్యోగ-వ్యాపారములకు హాని కలిగించినవాడు, మిత్ర ద్రోహి, కష్టం-నష్టం-దుఃఖం-బాధ-అనారోగ్యంలో ఉన్నప్పుడు ఇతరుల సహాయం పొంది, పిదప వారికే అపకారం చేసేవారు, చక్కటి కుటుంబలో కలహాలు సృష్ఠించేవారు, వివాహ శుభ కార్యక్రమాలను చెడగొట్టేవాడు, వేద శాస్త్ర కోవిదులైన బ్రాహ్మణులను అగౌరవపర్చేవారు, సదాచారాన్ని నిర్లక్ష్యం చేసినా, పాటించేవారికి భంగం కలిగించినా, పరమాత్మ పేరుని దుర్వినియోగం చేసినా, తాను అపవిత్రుడై అపవిత్ర కూటమితో మిళితుడైయుండి కూడ, పరులకి నీతి బోధలు చెప్పేవాడు, అసత్యం-అధర్మం-అవినీతి- అన్యాయం-అసూయ-అక్రమం -అక్రమ సంబంధం-కుయుక్తి- కుతర్కం-మోసం-హింస గుణాలు కలవారు ఎంతటివాడైనా సరే కాలసూత్రము, రౌరవం మున్నగు ఘోరనరకాలని పొంది, పిదప పురుగులూ అమేధ్యముతో నిండిన తప్త రక్త కూపములో పడవేయబడతారు.

పశ్చాత్తాపానికి మించిన మందు, ధర్మాచరణకు మించిన పదవి లేదని ఈ సందర్భముగా శ్రీరామపాద భాగవతర్ ఉద్ఘాటించారు.

ఓం నమః శివాయ 🙏🏼
ఓం కార్తీక దామోదరాయ నమః 🙏🏼

Videos (show all)

Save the Cows at Srirangam Temple
నా కచేరి నుండి 20 సె. చిన్న వీడియో క్లిప్.
"దివ్యప్రబంధ" గోష్ఠి

Telephone

Opening Hours

Monday 07:00 - 21:00
Tuesday 07:00 - 21:00
Wednesday 07:00 - 21:00
Thursday 07:00 - 21:00
Friday 07:00 - 21:00
Saturday 07:00 - 21:00
Sunday 07:00 - 21:00