Athmakur-S Police Station

Athmakur-S Police Station

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Athmakur-S Police Station, Police station, .

22/05/2021

మండల ప్రజలకు పోలీస్ వారి హెచ్చరిక......
ఇకపై లాక్ డౌన్ మరింత కఠినం గా అమలు చేయబడుతుంది..

1)కొంతమంది ఉదయం 10:00 గంటల వరకు కూడా వారి దుకాణాలు బంద్ చేయడం లేదు, అలాంటి వారి పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి షాప్ లు సీజ్ చేయడం జరుగుతుంది.

2)రోడ్డు ప్రక్కన ఉన్న షాప్స్ ని ఎట్టి పరిస్థితులు లో ఓపెన్ చేయకూడదు.

3)పాస్ లేని వ్యక్తులని మరియు వారి వాహనాలని
ఉదయం 10:00 గంటల తర్వాత రోడ్డు పైకి వస్తే వారి వాహనాలని సీజ్ చేయడం జరుగుతుంది..

4)సాయంత్రం ఎవరైనా వీధులలో ఆకారణం గా బయటికి వస్తే వారి పై కఠినం గా వ్యవహారించాల్సి ఉంటుంది..

5) ఈపాస్ ఉంటేనే బయటికి వెళ్ళడానికి అనుమతి ఉంటుంది పాస్ లేని వారిపైన కేసులు నమోదు చేసి వారి వాహనాలని సీజ్ చేయడం జరుగుతుంది... 6) ఈరోజు 10 టూ వీలర్స్ ని మరియు ఒక ఆటొ ని సీజ్ చేసి మొత్తం 53,900 రూపాయలు ఫైన్ విదించడం జరిగింది.

ఇట్లు
SI Athmakur (S)

Photos from Athmakur-S Police Station's post 12/01/2021

ప్రతి రోజు ఎస్‌ఐ ఆత్మకూరు -ఎస్ గారు తన సిబ్బందితో కలిసి ఆత్మకూర్ ఎస్ మండల పరిధిలో వాహన తనిఖీలు నిర్వహిస్తూ, వాహనదారులకు లైసెన్స్ మరియు బీమాపై అవగాహన కల్పిస్తూ ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు.

Timeline photos 12/01/2021

ప్రెస్ నోట్ 11/1/2021
- ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.
- వివాదాలకు దూరంగా ఉంటూ సంతోషంగా పండుగలు నిర్వహించుకోవాలి.
- బెట్టింగ్ లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
- యువత ఆదర్శనంగా ఉండాలి.
--- *R. భాస్కరన్ IPS, యస్.పి సూర్యాపేట*.

సంక్రాంతి సందర్భంగా జిల్లా పోలీసు తరపున ప్రజలకు జిల్లా యస్.పి R. భాస్కరన్ IPS గారు శుభాకాంక్షలు తెలిపినారు. ఈ సందర్బంగా యస్.పి గారు మాట్లాడుతూ ప్రజలు సంతోషంగా పండుగను నిర్వహించుకోవాలి అని వివాదాలకు దూరంగా ఉండాలని అన్నారు. బెట్టింగ్ లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఆటల పోటీల నిర్వహణలో యువత క్రీడాస్ఫూర్తి చూపుతూ ఆదర్శనంగా ఉండాలని అన్నారు. వివాదాలు, గొడవలు పెట్టుకోవద్దు అన్నారు.

- *గాలిపటం కోసం సీసం/సింథటిక్ తో తయారు చేయబడిన దారాలు అమ్మవద్దు*.

గాలిపటం ఎగరడానికి తయారు చేసే గ్లాస్/సింథటిక్ రకం దారం ఉపయోగించడం వల్ల పిల్లలకు, పక్షులకు ప్రమాదం పొంచి ఉన్నది, ఈ రకం దారం వల్ల గాయాల బారిన పడే అవకాశం ఉన్నది. కావున వ్యాపారులు ఇలాంటి రకం దారాలను గాలిపటం కోసం అమ్మవద్దు అని ఎస్పీ గారు తెలిపినారు. ఈ విషయంలో తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి అన్నారు. అమ్మకదారులు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు అని తెలిపినారు. ప్రజలు ఇలాంటి వాటిపై పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని తెలిపినారు.

DGP TELANGANA POLICE on Twitter 31/10/2020

this noon 4:00 PM
Unveiling of song * ప్రాణం పంచే మనస్సున్న పోలీస్ * by DGP- Telangana Dr. M. Mahendar Reddy IPS.,. in observance of .,

Song composed and sung by Sri. M. M. Keeravani, penned by Sri. Anantha Sriram


https://twitter.com/TelanganaDGP/status/1322440447172620288?s=20

DGP TELANGANA POLICE on Twitter “Unveiling of song * ప్రాణం పంచే మనస్సున్న పోలీస్ *. Composed and sung by Sri. Garu, penned by Sri. Anantha Sriram, in observance of ., LIVE HERE : THIS NOON 4:00PM.”

Telephone

Website