Vizag Samachar

Vizag Samachar

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vizag Samachar, Media/News Company, .

మీ దిండు ఇలా ఉండేలా చూసుకుంటే మెడనొప్పి, తలతిరగడం, నడుంనొప్పి మాయం! Dr S Bakhtiar choudary |Pillow 24/09/2022

దిండు/తలగడ/మెత్త/పిల్లో.. పేరేదైనా కావచ్చు. కంటినిండా నిద్ర పట్టాలంటే మాత్రం దిండు బాగుండాలి. దిండే ఓ గుదిబండ కాకూడదు. పిల్లో అన్నది కమ్మటి నిద్రను పాడుచేసే కల్లోలం కాకూడదు. ఎందుకంటే తలగడ సరిగా సెట్ అవకపోతే వచ్చిపడే మెడనొప్పులు, తలతిప్పుళ్లు చాలా ఉంటాయట. అందుకే దిండు ఎలా ఉండాలి? దిండు సెట్ అవకపోతే ఎలా సరిచేసుకోవాలి? ఒక దిండును ఎంతకాలం వాడొచ్చు? దిండు వల్ల ఎలాంటి లాభాలున్నాయి.. ఈ వివరాలను స్పోర్ట్స్ మెడిసిన స్పెషలిస్ట్, మిలిటరీ డాక్టర్, స్పైన్ స్పెషలిస్ట్, ఆక్యుపేషనల్ హెల్త్ ఎక్స్ పర్ట్ మేజర్, డాక్టర్ బఖ్తియార్ చౌదరి వివరిస్తారు. ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి. థాంక్యూ.
https://youtu.be/XUyHIR07VnA

మీ దిండు ఇలా ఉండేలా చూసుకుంటే మెడనొప్పి, తలతిరగడం, నడుంనొప్పి మాయం! Dr S Bakhtiar choudary |Pillow దిండు/తలగడ/మెత్త/పిల్లో.. పేరేదైనా కావచ్చు. కంటినిండా నిద్ర పట్టాలంటే మాత్రం దిండు బాగుండాలి. దిండే ఓ గుదిబండ కా.....

02/06/2022

వీరా మన పాలకులు..నాయకులు..?

వీరికి విలువల పట్ల ఎంత నిబద్ధతతో..!

"సన్నాసి.. చవట.. దద్దమ్మ..దున్న పోతు..ఒరేయ్ ఏమి పికుతావు.. వీధుల్లో తిరగనియ్యం.. పిచ్చికుక్క........(ఈ తిట్ల దండకానికి అంతు లేదు.)

ఈ మాటలు అటున్నది చదువు సంస్కారం లేనివారో, బుర్రలు పెరగక బుద్ధి మాంద్యంతో ఉన్న వారో లేకా మద్యం మధం మత్తు లో కొవ్వు ఎక్కి కన్ను మిన్ను కానక ఇల్లు గుల్ల చేసుకొని తిరిగే వ్యసనపరులో కాదు..వీరందరూ ప్రజల కోరకు (అని వారు చెప్పుకుంటున్నారు) పని చేస్తున్న పాలక వర్గ రాజకీయ నాయకులు కార్యకర్తలు నోటినుంచి గత కొన్ని ఏళ్లుగా వస్తున్న మాటలు ఇవీ.

"నా తల పై వెంట్రుక కూడా పికలేరు" - ఇది ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి వచ్చిన మాట.

"నీవూ ఏమైయనా పోటుగాడివా" - ఇది రాష్ట్రం లో అత్యంత సీనియర్ నాయకుడు,ఓ మాజీ ముఖ్యమంత్రి నోటినుంచి వచ్చిన మాట.

అధికార మత్తులో ఒకరు,అధికార దాహం తో మరోకరు విలువలను మంట కలుపుతూ రాష్ట్రం లో ప్రజా సమస్యల పరిష్కారాన్ని గాలికి వదిలేసి పాలక వర్గ అధికార ప్రతిపక్ష పార్టీలు లో ఉన్న నేతలు, కార్యకర్తలు మాటలాడుకుట్టున్న తీరు,ఒకరి పైన ఒకరు చేసుకుట్టున్న విమర్శల శైలి చూస్తే విరా మనలను పాలిస్తూ, మన పిల్లల భవిషయత్తును తీర్చిధ్చిదే నాయకులు అని రాష్ట్రం లో ఉన్న చదువులేని సామాన్య ప్రజలుకు కూడా అనిపిస్తుంది.

పాలక వర్గానికి పొలిటికల్ మేనేజర్గాలుగా పని చేసే ఈ పార్టీల నాయకులు గా చెలామణి అవుతున్న ఈ ప్రబుద్ధులు ప్రతి యేడు మన దేశ సంస్కరణోద్యమ, స్వాతంత్రోద్యమంలో ఆవిర్భవించిన ఎందరో ప్రముఖుల వర్ధంతులు జయంతులు నిర్వహిస్తుంటారు, ఈ సంస్మరణ లు సందర్భంగా వీరు వారి జీవిత పోరాటాల నుంచి నేర్చుకునే విలువల పాఠాలు ఇవేనా..? అని ప్రజలుకు అనుమానాలు వస్తున్నాయి.చిత్త శుద్ధి లేని శివపూజలేల, భాండశుద్ధి లేని బంతి భోజనాలు ఎలా అన్నట్టు విలువలు సంస్కారాలు గ్రహించి నేర్చుకొని అలవాటు ఆచరించలేని సంస్మరణ కార్యక్రమాలు,సామాజిక యాత్రలు ఎందుకు వీరు చేయడం ప్రజలను మోసగించడానికి కాకపోతే అని విమర్శిస్తున్నారు.

ఈ మధ్య అధికార పార్టీ మారో అడుగు ముందుకు వేసి ఫ్యాక్షన్ రాజకీయాలే జీవిత పరమావధిగా, ప్రపంచ బ్యాంకు బంటుగా బతికిన తమ నాయకుడి తండ్రిని సంస్కరణోద్యమ నాయకులతో పోలుస్తూ సంస్కరణోద్యమ రథసారథులు (స్వయంగా సంస్కరణోద్యమం నిర్వహించిన ఆ మహోన్నత వ్యక్తులే తమ ముందు తరాలకు చెందిన వారి వారి రంగాల్లోని మహోన్నత వ్యక్తుల తో వారిని పోల్చుకోలేదు సరికదా ఆ మహోన్నత వ్యక్తుల నుంచి మేము ఇంకా ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుందని చివరి క్షణం వరకు చెబుతూనే వచ్చారు) పాటించి బోధించిన విలువలను దిగజారుస్తూ ఈ తరానికి చూపెట్టే ప్రయత్నం చేశారు.కనుక ఇప్పటికైనా పాలకవర్గం అధికార ప్రతిపక్ష పార్టీల నాయకుల, కార్యకర్తల మాట తీరు మార్చుకోవాలని,వీరి సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం స్వాతంత్ర సంస్కరణోద్యమాల పోరాటల కొలిమిలో మహోన్నత వ్యక్తిత్వాలను సాధించిన ఆ రథసారధుల బోధించిన బోధనలను వక్రీకరించే ప్రయత్నాలు మానుకోవాలని సామాన్య ప్రజలు హితవు పలుకుతున్నారు.లేకపోతే శ్రీలంకలో జరిగిన విధంగా ప్రజల చేతుల్లో చెప్పు దెబ్బలు,చేంప దెబ్బలు తినాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

Writen by G.Suresh Kumar,
Freelance journalist.
[email protected]

Presenting by vizag samachar.

Website