Nagaraj Chakravartin YSRTP
STATE PRESIDENT
YSR-TELANGANA PARTY STUDENTS WING
Ph.D Research Scholar
#Osmania university
ABVP,RSS బ్యాక్ గ్రౌండ్ ఉన్న "రెడ్డి " #రేవంత్ CM.
పార్టీ లాయలిస్ట్, సీనియర్ అయిన #భట్టివిక్రమార్క "SC " CM కి అనర్హుడు.
ఇది పరిస్థితి.
ఓట్ వెయ్యడం మన బాధ్యత !
మా #కోదాడ నియోజకవర్గం లో నేను నా ఓటు హక్కు వినియోగించుకున్నాను..!
మరి మీరు ?
ఓటమి ఎరుగని వ్యక్తి కన్నా
విలువలతో జీవించే వ్యక్తి మిన్న .
నాయకత్వమంటే దారిపొడవునా ముందు నడవడం కాదు.
బాట వెయ్యడం. త్రోవ చూపడం.
https://youtu.be/8R5Be9rCyEI?si=NgOrsmDVd7U_EHmw
షర్మిలకు అర్హత లేదు... మా రాజీనామాకు కారణం ఇదే | ysrtp leaders fires on ys sharmila | Tolivelugu TV షర్మిలకు అర్హత లేదు... మా రాజీనామాకు కారణం ఇదే | ysrtp leaders fires on ys sharmila | Tolivelugu TV ...
BIG shock to YS Sharmila | YSRTP Leader Nagaraju Face To Face Interview | Disha TV Telugu BIG shock to YS Sharmila | YSRTP Leader Nagaraju Face To Face Interview | Disha TV Telugu--- ...
https://youtu.be/b42LfB5hKwY?si=aiHJ9RtKpgLVKjtG
షర్మిల నట్టేట ముంచింది...! గగ్గోలు పెడుతున్న బాధితులు..! | YSRTP Leaders Fire On YS Sharmila | YSRTP షర్మిల నట్టేట ముంచింది...! గగ్గోలు పెడుతున్న బాధితులు...! |YSRTP Leaders Fire On YS Sharmila | Tolivelugu TV ...
https://youtu.be/BRDkUyhU4iU?si=q2TqmrE27YLh8BT8
మా శవాల మీద పాదయాత్ర చేసింది.! | YSR TP Coordinators F2F | Manatolilivelugu ా శవాల మీద పాదయాత్ర చేసింది.! | YSR TP Coordinators F2F | Manatolilivelugu ...
https://youtu.be/NUxgjAYP-ac?si=ibn15gWEkqNw760_
YSRTP Leaders Suspended YS Sharmila From YSRTP Party | 10TV News భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం ప్రకటిస్తాం: గట్టు | YSRTP Leaders Suspended YS Sharmila From YSRTP Party | 10TV News ...
ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు సమాచారం.
YS షర్మిల గారికీ ఉస్మానియా విద్యార్థి నేత,YSR తెలంగాణ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు బహిరంగ రాజీనామా లేఖ..
మలిదశ తెలంగాణ ఉద్యమకారుడిగా.. ఉస్మానియా విద్యార్థినేతగా.. గత 15 సంవత్సరాలుగా ఉస్మానియా వేదికగా అనేక ఉద్యమాలలో భాగస్వామ్యం అవుతూ నడుస్తున్న క్రమంలో తెలంగాణలో రాజన్న సంక్షేమ రాజ్యం తెస్తా అని చెప్పేసి వైఎస్ షర్మిల అక్క YSR తెలంగాణ పార్టీని స్థాపించే క్రమంలో నేను ఈ ప్రాంత కోడలిని, ఒక మహిళగా మీ ముందుకు వస్తున్నాను నన్ను ఆదరించండి అని తెలంగాణ ప్రజానీకాన్ని కొంగు చాచి మద్దతు కోరుతున్న క్రమంలో....
షర్మిల అక్క నుంచి వచ్చిన పిలుపుమేరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో ఎంతో భవిష్యత్తు ఊహించుకొని YSR గారి కుటుంబం అంటే మాట మీద ఉంటారు, మాట ఇస్తే తప్పరు, నమ్మిన వాళ్లని నట్టేట్లో ముంచరు అని నమ్మి YSR తెలంగాణ పార్టీలో చేరడం జరిగింది.
చేరిన నాటినుండి నా శక్తి మేరకు పనిచేస్తూ వైఎస్ షర్మిలఅక్క నిర్వహించిన విద్యార్థి సంఘాల సమ్మేళనం విజయవంతం కావడంలో ప్రధాన పాత్ర పోషించడం జరిగింది.. అది అప్పుడు తనకు పెద్ద ఎత్తున పేరు తీసుకొచ్చిన మాట వాస్తవం, అలాగే ప్రతి మంగళవారం నిర్వహించిన నిరుద్యోగ దీక్షలలో ప్రధాన పాత్ర పోషించడం జరిగింది.., అంతేకాక తను నిర్వహించిన T-SAVE ఉద్యమంలో విద్యార్థి సంఘాల మద్దతు కూడగట్టి T-SAVE ఉద్యమం సక్సెస్ కావడం లో ప్రధాన పాత్ర పోషించడం జరిగింది.. ఇలా చెప్పుకుంటూ పోతే తన పాదయాత్రలో తన అడుగులో అడుగు వేస్తూ , తాను నిర్వహించిన నిరుద్యోగ పోరాటంలో పోలీసులతో దెబ్బలు తిని .. కేసుల వరకు తెచ్చుకొని తన వెంట నిలబడ్డ .. ఇన్ని చేసిన ఎప్పుడు తన నుంచి ఒక్క రూపాయి ఆశించలే .. కార్పొరేట్ కంపెనీలు జీతాలు ఇచ్చినట్టు రాజకీయ నాయకులకు జీతాలు ఇచ్చావు. . కానీ నీ దగ్గర జీతాలు తీసుకొని పనిచేసిన రాజకీయ నాయకులకు విన్న విలువ నీ దగ్గర ఏమి ఆశించకుండా కేవలం నీ ప్రేమే ఆశించి నిజాయితీగా, నిక్కచ్చిగా పనిచేసిన ఈ తమ్ముడు మీద లేకపాయే ..
మూడు సంవత్సరాల పాటు నీతో తిప్పుకొని , ఎలాంటి భరోసా లేకుండా నన్ను అయోమయ పరిస్థితిలోకి నెట్టి, నా రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసావ్ మీకోసం నిలబడతా.. మిమ్మల్ని కూడా నిలబెడతా.. అని పలికిన మాటలు ఎక్కడికిపోయినాయి... మీరు నిలబడి మమ్మల్ని నిలబెడతారని నమ్మకంతో నా విలువైన సమయాన్ని, శ్రమని, కష్టాన్ని, డబ్బుని దార పోసి నీ వెనుక నిలబడ్డ .. అనేకమంది ఉస్మానియా ఉద్యమ సహచర నాయకులు తెలంగాణ వ్యతిరేకి ఆంధ్ర పెట్టుబడిదారీ అమే వెంట ఎందుకు తిరుగుతున్నావ్.. ఆమె వెంట తిరగడం వల్ల నీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు, మోసపోతావ్ అని ప్రశ్నిస్తే తాను ఈ ప్రాంత కోడలు ఆడబిడ్డ కి తన మెట్టినిల్లే పుట్టినిల్లు అని చెప్పి రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంటే నమ్మిన వాళ్లను హక్కును చేర్చుకుంటారు అనీ చాలా సందర్భాల్లో డిఫెన్స్ చేశా ఇలా అనేక సందర్భాల్లో అనేక ప్రశ్నలు ఎదుర్కొన్న కానీ నిన్ను నమ్ముకున్న విద్యార్థి నాయకుడికి నేను ఉన్న అనే చిన్న భరోసా కూడా ఇవ్వలేకపోతివి.. నీ వ్యక్తిగత స్వార్థం కోసం నట్టేట ముంచావు, నడి బజార్లో నిలబెట్టావు అందరూ అవహేళనగా నవ్వుకునేలా చేసావ్.. నువ్వు చేసిన ఈ పనికి ఎంతో మనోవేదన అనుభవించా.. నిద్ర లేని రాత్రలు గడిపా ఇక చాలు.
చివరిగా ఒక మాట గెలుపు కంటే, త్యాగం గొప్పది అన్నావ్ నీ త్యాగం ఏ వర్గం కోసం..? నేను పాదయాత్ర చేస్తే పొంగులేటి శీనన్న ప్రతిగడపకు నా వెంట వచ్చాడు అలాంటి వాడిని నేను ఓడించాల అన్నావు.. సరే ఇన్ని రోజులు నీతో పాటు నడిచిన నాతో పాటు మరెందరినో ఓడిస్తావా మరి..? సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ పైన ఉందని గుర్తుపెట్టుకో షర్మిళ అక్క .
నువ్వు ఏ ప్రయోజనాల కోసం ఇంతమంది కష్టాన్ని ఫణంగా పెట్టి ఏం ప్రయోజనాలు పొందుతున్నావు తెలియనంత మూర్ఖుడిని కాదు. ఈరోజు నీ ప్రయోజనాల కోసం మమ్మల్ని వాడుకొని నీ లక్ష్యం కోసం ఓడించొచ్చు కానీ.. నీకు ఏదో ఒక రోజు అలాంటి సందర్భం ఎదురైనప్పుడు ఆ బాధ ఏంటో అర్థమవుతుంది. నీవు ప్రేమగా పిలిచే పిలుపులో ఇంత కుట్ర కోణం దాగుంది అనుకోలేదు అక్క.
రాజకీయం అంటే వండినట్టు తిన్నట్టు కాదు అన్నావు.. నిజమే కావచ్చు కానీ నీలాంటి అపరి కత్వతతో కూడిన రాజకీయం ఎవరు చేయరు కనీసం జగన్ అన్నని చూసి ఆయన నేర్చుకోవాల్సింది. ప్రశ్నిస్తే శత్రువు అవుతానని తెలుసు కానీ.. ప్రశ్నించకపోతే బానిసను అవుతాను... బానిసత్వం కంటే శత్రుత్వం మంచిదే ..
ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదు అని గుర్తుపెట్టుకో అక్క.
నీకు, నీ పార్టీ కి
ఇక సెలవు.
పార్టీ లో ఇన్ని రోజులు నాకు అండగా నిలబడి నాన్ను ప్రోత్సహించిన అక్కలకి, అన్నల కి తమ్ముళ్ళ కి, నన్ను ప్రేమించిన రెండు తెలుగు రాష్ట్రాల వైఎస్ఆర్ అభిమానులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ... అర్థం చేసుకుంటారని ఆశిస్తూ..
భారమైన హృదయంతో ..
ఇట్లు
మీ నాగరాజు
రీసెర్చ్ స్కాలర్ ఉస్మానియా విశ్వవిద్యాలయం
రాష్ట్ర అధ్యక్షులు
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విద్యార్థి విభాగం.
ఉన్నత విద్యావంతుడిగా, ఉద్యమకారుడిగా, కష్ట నష్టాలు తెలిసినవాడిగా లక్షల మంది నిరుద్యోగ గొంతుకనై వస్తున్న... ఆశీర్వదించండి.
YSRTP అధినేత్రి YS షర్మిల అక్క ఆదేశాలతో లోటస్ పాండ్ లోని రాష్ట్ర కార్యాలయంలో
కోదాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఫామ్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది.
మీ తమ్ముడిగా, మీ అన్నగా , మీ స్నేహితుడు గా
మీ అందరి ప్రేమ, ఆశీర్వాదం ఉండాలని ఆశిస్తూ...🙏
తెలంగాణలో ఉద్యోగాల భర్తీ, రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ ఆత్మహత్యల గురించి మీడియాతో.
రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ ఆత్మహత్యలకు కారణం TSPSC చైర్మన్ జనార్దన్ రెడ్డి మరియు ఈ నియంతృత్వ ఫామ్ హౌస్ ప్రభుత్వంమే.. రాబోయే ఎన్నికల్లో నిరుద్యోగులంతా ఏకమై ఫామ్ హౌస్ దొరకి ఓటు తో బుద్ధి చెప్పాలి..
అశోక్ నగర్ బృందావన్ హాస్టల్ లో నిరుద్యోగ విద్యార్థినీ మృతి. హాస్టల్ ముందు వేలాది నిరుద్యోగులు ధర్నా. పోలీసులు స్వాధీనం చేసుకున్న సూసైడ్ లెటర్ చూపించాలని పోలీసులతో నిరుద్యోగుల తీవ్ర వాగ్వాదం. హస్టల్ లోపలికి ఏవరినీ అనుమతించని పోలీసులు.
.
నవంబర్ 30 న తెలంగాణ ఎన్నికలు డిసెంబర్ 3 న ఫలితాలు
బోర్డును రద్దుచేసి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. చైర్మన్ జనార్దన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే తన పదవి రాజీనామా చేయాలి.
students wing.
నక్సలైట్స్ ఎక్కడినుంచో పుట్టారు మన నుంచే పుడతారు .. ఎంత కడుపు మంట ఉంటే నక్సలైట్లుగా మారుతారు..
తెలంగాణలో ఒక సగటు నిరుద్యోగి చెల్లి ఆవేదన...
మీ ఆవేదన, మీ కడుపు మంట ఓటు రూపంలో రుచి చూపించండి.
లోటస్ పాండ్ పార్టీ కార్యాలయంలో అధినేత్రి వైఎస్ షర్మిల అధ్యక్షతన YSRTP రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం
33జిల్లాల నుంచి పెద్ద ఎత్తున హాజరైన ముఖ్యనేతలు,కార్యకర్తలు
పార్టీ విలీనం,ఎన్నికల వ్యూహం పై ప్రధాన చర్చ.
గిరిజన మహిళకు న్యాయం చెయ్యండి అని ధర్నా చేసే హక్కు కూడా లేదా,ఇది కేసీఆర్ గారి నియంత పాలన💥
నాడు దళిత మహిళ మరియమ్మపై..
నేడు గిరిజన మహిళ వనజపై..థర్డ్ డిగ్రీ
ఇదేనా ఈ లోఫర్ గాళ్లు చెప్పిన బంగారు తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసింగ్..?
నా తెలంగాణ తల్లులు ఈ విధంగా బలి కావాల్సిందేనా.?
ప్రజాకవి గద్దర్ సమాధి వద్ద నివాళులు అర్పించిన YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి & పార్టీ రాష్ట్ర నాయకులు,
గద్దర్ కుటుంబ సభ్యులను కలిసి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన వైఎస్ షర్మిల గారు.
#ప్రజాయుద్ధనౌకగద్దర్ #గద్దర్
ప్రజా యుద్ధ నౌక గద్దరన్న,
సియాసత్ పత్రిక మేనేజింగ్
ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ సాహెబ్ లకు
లెఫ్ట్ ,దళిత ,మైనారిటీ, మరియు వివిధ
విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో
కొవ్వొత్తుల నివాళి, ర్యాలీ నిర్వహించడం జరిగింది.
#గద్దర్
పాటకు మరణం లేదు... ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్నకు జోహార్లు.💐💔
మహా నేత వైయస్సార్ జయంతి మరియు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ 2వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
కేసీఆర్ ఒక రాక్షసుడు || YSRTP Leader Nagaraju Fires On KCR || GR TV Telugu || కేసీఆర్ ఒక రాక్షసుడు || YSRTP Leader Nagaraju Fires On KCR || GR TV Telugu || voice of weaker sections || ...