భీశెట్టి వసంత లక్ష్మి
జనసేన కార్పొరేటర్, GVMC ఫ్లోర్ లీడర్
ఉత్తరాంధ్ర బిడ్డను, నా ప్రాంత అభివృద్ధి కోరుకునే యువతను
33 వ వార్డు లో కొన్ని రహదారులు మరమ్మత్తులు మరియు డ్రైనేజీలు బాగు చేయుట కొరకు జీవీఎంసీ కమిషనర్ గారికి ఈరోజు వినతిపత్రం అందజేయడం జరిగింది.
ఇట్లు
భీశెట్టి వసంత లక్ష్మి(GK),
33వ వార్డు కార్పొరేటర్,
GVMC ఫ్లోర్ లీడర్.
33 వ వార్డ్ లో గత 15 రోజులు క్రితం వేంకటేశ్వర మెట్ట వాస్తవ్యులు వాటర్ సమస్య ఉంది అని కార్పొరేటర్ గారిని సంప్రదించడం జరిగింది కాగా ఈరోజు సంబధిత అధికారుల చే మాట్లాడి వాలు వేయడం జరిగింది.
ఇట్లు,
భీశెట్టి వసంత లక్ష్మి(GK),
33వ వార్డు కార్పొరేటర్,
GVMC ఫ్లోర్ లీడర్.
33వ వార్దులోని ఒక ప్రాంతంలో కల్వర్టు సరిగా లేక ఇబ్బందులు పడుతూ కల్వర్టు మరమ్మతులు చెయించాల్సిందిగా స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేయగా ఈరోజు పర్యవేక్షించి, సంబంధిత అధికారులను ఆదేశించగా మరమ్మతి పనులను ప్రారంభించడం జరిగింది.
ఇట్లు,
భీశెట్టి వసంత లక్ష్మి(GK),
33వ వార్డు కార్పొరేటర్,
GVMC ఫ్లోర్ లీడర్
ఈరోజు ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది
దీపావళి శుభాకాంక్షలు! 🪔✨🧨
* *
జనసేనాని పవన్ కళ్యాణ్ గారి సేవా స్పూర్తి - జికె ఫౌండేషన్ స్థాపక విలువలతో
34వ వార్డు దక్షిణ నియోజకవర్గం లో నివసిస్తున్న *కడితి మంగంధ వర్ధన్* అను 10 సంవత్సరాల బాలుడు క్యాన్సర్ వ్యాధితో పోరాడుతుండడంతో, వైద్య ఖర్చుల నిమిత్తం 2024 అక్టోబర్
9వ నెల ₹1000 చెక్ ను (9*1000=₹9,000) వారి కుటుంబానికి ఫౌండేషన్ చైర్మన్ మరియు సభ్యులు అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ 33వ వార్డు అధ్యక్షులు ఆకుల రాజు గారు, 34వ వార్డు అధ్యక్షులు నీలం రాజు గారు మరియు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
చెడుపై మంచి గెలిచిన రోజు దసరా పండుగా జరుపుకుంటాం…
అలానే, మంచి చేయాలని, యువతకి ఉపయోగపడాలని సంకల్పంతో మొదలు పెట్టిన *వ్యాయామశాల* (GYM)నిర్మాణంకు ఎన్నో చెడు శక్తులు అడ్డుపడ్డ
ఈరోజు అనగా విజయదశమి నాడు విజయానికి చిహ్నం అన్ని పనులు పూర్తి చేసుకొని, ప్రారంభించడం జరిగింది.
ఇందుకు, సహకరించిన సహకరిస్తున్న చిన్న పెద్ద అందరికి నా కృతజ్ఞతలు 🙏
మీ
గోపి కృష్ణ (GK)
జికె ఫౌండేషన్ ఛైర్మన్
జనసేన దక్షిణ నియోజకవర్గం నాయకులు
VSLD అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్
33వ వార్దులోని ఒక ప్రాంతంలో రోడ్డు సరిగా లేక ఇబ్బందులు పడుతూ రోడ్డు మరమ్మతులు చెయించాల్సిందిగా స్థానిక ప్రజలు నిన్న విజ్ఞప్తి చేయగా నిన్న పర్యవేక్షించి, సంబంధిత అధికారులను ఆదేశించగా ఈరోజు మరమ్మతి పనులను ప్రారంభించడం జరిగింది.
ఇట్లు,
భీశెట్టి వసంత లక్ష్మి(GK),
33వ వార్డు కార్పొరేటర్,
GVMC ఫ్లోర్ లీడర్
నాకు ఎంతో ఇష్టమైన మా శానిటరీ కుటుంబంతో సరదాగా రోజు మొదలైంది. ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు
ఈరోజు 33వ వార్డులోని ఒక ప్రాంతంలో రోడ్డు సరిగ్గా లేకపోవడంతో వార్డు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని తెలియడంతో AE గారు మరియు వార్డు సెక్రటేరియట్లతో సంబంధిత ప్రాంతానికి చేరుకొని పర్యవేక్షించడం జరిగింది. ఆ రోడ్ల మరమ్మతుల పనులు రేపటి నుంచి మొదలు పెట్టాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది.
ఈ సమస్యను మా దృష్టికి తీసుకొచ్చిన వార్డు ప్రజలకు, సహకరించిన సంబంధిత సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
ఇట్లు
భీశెట్టి వసంత లక్ష్మి,
33వ వార్డు కార్పొరేటర్,
GVMC ఫ్లోర్ లీడర్
గౌరీ వీధి, వేంకటేశ్వర మెట్టలో నివసిస్తున్న పితాని మరియ అను మహిళ క్యాన్సర్ తో బాధపడుతుంది(Treatment at Mahatma Gandhi Cancer Hospital) ప్రతీ నెల లాగే ఈ నెల కూడా 1000/- చొప్పున వారి కుటుంబానికి ఆర్థికంగా GK ఫౌండేషన్ తరపున ఇవ్వడం జరిగింది. ఈ నెల అందించిన 55వ చెక్కు ఇవ్వడం జరిగింది 55*1000=₹55,000/-
కావున, సాహయం చేయాలి అనుకునే దాతలు ముందుకు వచ్చి ఫౌండేషన్ సభ్యులను సంప్రదించాలి అని కోరుకుంటున్నాం. 🙏🏻
జై జనసేన
జై హింద్
ఇటీవల GVMC కౌన్సిల్ లో ప్రస్తావించిన 33వ వార్డు అభివృద్ధి పనులకు కమిషనర్ గారు స్పందించి నిధులు మంజూరు చేయగా ఈరోజు జనసేన పార్టీ పేరుపై మరో శిలాఫలకం శంఖుస్థాపన చేయడం జరిగింది అని తెలియజేసేందుకు సంతోషిస్తున్నాను
ఇట్లు
భీశెట్టి వసంత లక్ష్మి,
GVMC ఫ్లోర్ లీడర్.
ఈ రోజు 33వ వార్డ్ లో కుమ్మరి వీధి, వివేకానంద కాలనీ,అల్లిపురం రోడ్ నిర్మాణ అంచనా విలువ 39.72 లక్షలు వ్యయంతో బీటీ రోడ్లు నిర్మాణం కొరకు శంకుస్థాపన దక్షిణ నియోజక వర్గ ఎమ్మేల్యే శ్రీ వంశీ కృష్ణ శ్రీనివాస్ గారు, టీడీపీ సౌత్ ఇన్చార్జి సుధాకర్ గారు, GVMC ఫ్లోర్ లీడర్ 33వ వార్డు కార్పొరేటర్ భీశెట్టి వసంతలక్ష్మి(GK) గారు ఆద్వర్యంలో జరిగింది.
ఈ ప్రారంభోత్సవంలో GVMC ZC మల్లయ్యనాయుడు గారు,33వ వార్డ్ అధ్యక్షులు ఆకుల రాజు గారు, కూటమి నాయకులు , జనసైనికులు వీర మహిళలు మరియు స్థానికులు పాల్గొన్నారు.
సంతాన మహాలక్ష్మి అవతారంలో కనక మహాలక్ష్మి తల్లి😍😍. అమ్మ దయ వళ్ళ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి🙏🏻
యువరాజ్ అనే బాలుడు అప్లాస్టిక్ అనీమియా బోన్ మారో( క్యాన్సర్) ట్రీట్మెంట్ తీసుకుంటున్న విషయం తెలుసుకున్న విశాఖ దక్షిణ నియోజకవర్గం నాయకులు శ్రీ గోపికృష్ణ(GK) గారు…
GK ఫౌండేషన్ ద్వారా ఎంతో విలువ గల ఆ అప్లాస్టిక్ అనీమియా మందులను ఫౌండేషన్ సభ్యులు అందరితో కలిసి అందించడం జరిగింది.
మీ
గోపి కృష్ణ (GK)
జికె ఫౌండేషన్ ఛైర్మన్
జనసేన దక్షిణ నియోజకవర్గం నాయకులు
VSLD అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్
జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ గారితో దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు వంశీ గారితో ఈరోజు పలు అభివృద్ధి పనుల కోసం చర్చించడం జరిగింది.
ఈ సమావేశంలో జిల్లాలో జనసేన పార్టీ ఇన్చార్జిలు, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ మరియు వార్డు కార్పరేటర్లు పాల్గొన్నారు .