Bhagavan Sri Venkayya Swami

Bhagavan Sri Venkayya Swami

All about the blissful grace and leelas of Bhagavan Sri Venkayya Swami

19/03/2022

వెంకయ్య స్వామి లీలలు - 1

కారె రామస్వామి వెంకయ్య స్వామిని నమ్ముకుని జీవించేవాడు. అతడి రెండవ కుమారుడు ఇలా చెప్తున్నాడు.
"స్వామి నా చిన్నప్పటినుండి మా ఇంటికి వచ్చేవారు.
నా చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన మీతో పంచుకుంటాను. అప్పుదు నాకు పధ్నాలుగేళ్ళు. మా పొలంలో రెండెకరాలు వరి పైరు పెట్టాము. వర్షాలు లేవు, భూమిలోనూ నీళ్ళు లేవు. రోజురోజుకీ పైరు ఎండిపోతోంది. చేసేదేమీలేక మా నాయన యెడిపోతున్న పైరును కోయించడానికి సిద్ధపడ్డాడు.
కానీ స్వామి, "అయ్యో, పిచ్చా ఏమి? రేపు ఉదయం పదకొండు గంటలకి వాన వస్తుంది. ఇప్పుడు పైరు కోస్తానంటావే?!!" అన్నారు.
చిత్రంగా స్వామి చెప్పినట్టే మరురోజు పొద్దున పదకొండు గంటలకి పెద్ద వర్షం పడింది.
యెండిపోయింది, మొత్తం నష్టం అనుకున్న పైరు రెండు పుట్లు పండింది.
అంతా స్వామి లీల!"

Website