తెలంగాణ కేసీఆర్ సైన్యం

తెలంగాణ కేసీఆర్ సైన్యం

తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేది ఒక తెరాస పార్టీనే జై కేసీఆర్ జై తెలంగాణ���

30/04/2022
Photos from Kalvakuntla Taraka Rama Rao - KTR's post 07/03/2022
Photos from Minister for IT, Telangana's post 07/03/2022
23/02/2022

We❤ KCR Sir 🙏

22/02/2022
Photos from తెలంగాణ కేసీఆర్ సైన్యం's post 20/02/2022

దేశ రాజకీయాలలో కెసిఆర్ #నవశకం
దేశ్ కీ #నేత కేసీఆర్ పైన వెలసిన అభిమానం
జాతీయ రాజకీయాలలో కేసీఆర్ శకం ఆరంభం..❤❤❤
20 తేది కేసీఆర్ గారి ముంబై పర్యటనలో భాగంగా కేసీఆర్ గారి పైన వెల్లు వేత్తిన అభిమానం,హోర్డింగలు ఫ్లెక్సీలతో స్వాగతం పలకనున్న మహారాష్ట్ర అభిమానులు🙏
జై కెసిఆర్ జై హిందూస్తాను జై తెలంగాణ ✊️

Telangana CMO
Kalvakuntla Taraka Rama Rao - KTR
Kalvakuntla Kavitha
Harish Rao Thanneeru

16/02/2022

పోరాటాల గడ్డమీద ఉద్భవించిన వీరా పుత్రుడు...
స్వరాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యమ వీరుడు..
బంగారు తెలంగాణ కోసం పాటుపడుతున్న అవిశ్రాంత శ్రామికుడు..
మన కల్వకుంట్ల చంద్రశేఖరుడా అందుకో మా ముందస్తు హృదయ పూర్వక #జన్మదినశుభాకాంక్షలు 💐💐💐🙏

Kalvakuntla Taraka Rama Rao - KTR
Kalvakuntla Kavitha
Telangana CMO

Photos from తెలంగాణ కేసీఆర్ సైన్యం's post 15/02/2022

𝒜𝒹𝓋𝒶𝓃𝒸𝑒𝒹
ℋ𝒶𝓅𝓅𝓎 #ℬ𝒾𝓇𝓉𝒽𝒹𝒶𝓎 𝒦𝒞ℛ 𝓈𝒾𝓇💐💐

11/02/2022

తగ్గేదేలే మా కార్యకర్తల జోలికి వస్తే బీజేపీ కార్యకర్తలను నశం కింద కొడతాం
మీరు పిడికెడు కూడా లేరు
-సీఎం కేసీఆర్ గారు.!🔥❤️✊

KCR Kalvakuntla Taraka Rama Rao - KTR

Photos from తెలంగాణ కేసీఆర్ సైన్యం's post 10/01/2022

రైతు బంధు సాయం రూ. 50 వేల కోట్ల రికార్డు మార్క్ దాటిన నేపథ్యంలో తెలంగాణ భవన్ లో రైతుబంధు పథకం, సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ వేసిన ముగ్గు..



Kalvakuntla Taraka Rama Rao - KTR
Kalvakuntla Kavitha

Photos from తెలంగాణ కేసీఆర్ సైన్యం's post 01/01/2022

*ప్రగతి భవన్లో గౌరవ మంత్రివర్యులు KTR గారిని కుటుంబ సమేతంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన MLA డా.. వియం అబ్రహం గారు* 💐💐💐💐

*TRS రాష్ట్ర యువజన నాయకులు డా..వియం అజయ్ గారు*

◆ *అజయ్ అన్న సేవాదళం క్యాలెండర్ మంత్రి KTR గారి చేతుల మీదుగా ఆవిష్కరణ*-

◆ *మంత్రి వర్యులు KTR గారికి డా.. వియం అజయ్ గారు మంత్రి KTR గారి చిత్రపటాన్ని బహుకరణ*

◆ *అజయ్ అన్న సేవాదళం ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలకు అజయ్ గారికి అభినందించిన మంత్రి KTR గారు*

◆ *ఇలాగే సేవలు చేస్తూ ముందుకు సాగి - నియోజకవర్గ ప్రజా లకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ , ఎలాంటి సమస్యలు వచ్చిన తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు*

హైద్రాబాద్: ప్రగతి భవన్లో గౌరవ మంత్రి వర్యులు KTR గారిని కుటుంబ సమేతంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన *అలంపూర్ MLA డా.. వియం అబ్రహం గారు, TRS రాష్ట్ర యువజన నాయకులు డా.. వియం అజయ్ గారు* ఈ సందర్భంగా గౌరవ మంత్రి KTR గారు అజయ్ అన్న సేవాదళం ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలకు అజయ్ గారిని అభినందించి ఇలాగే మరింతగా సేవా కార్యక్రమాలు చేస్తూ , నియోజకవర్గంలో ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ఎలాంటి సమస్యలు వచ్చిన తమ దృష్టికి తీసుకురావాలని KTR గారు తెలిపారు.. అనంతరం అజయ్ అన్న సేవాదళం క్యాలండర్ గౌరవ మంత్రి KTR గారి చేతుల మీదుగా ఆవిష్కరన, తదనంతరం అజయ్ గారు KTR గారి చిత్ర పటాన్ని వారికి బహుకరించారు....

23/12/2021

రక్తంతో నేలను దున్ని.. స్వేదంతో సేద్యం చేసి..
తన బతుకును అన్నం మెతుకుగా మార్చే రైతన్నలకు వందనాలు,🙏

యావత్ రైతాంగానికి జాతీయ రైతుల దినోత్సవ శుభాకాంక్షలు.

Kalvakuntla Taraka Rama Rao - KTR

17/12/2021

తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖమంత్రివర్యులు గౌరవనీయులు, మా ప్రియతమ నాయకులు కల్వకుంట్ల తారకరామారావు అన్నగారికి, శైలిమ వదినమ్మకు హృదయ పూర్వక #పెళ్లిరోజు శుభాకాంక్షలు.💐💐💐
మీ దంపత్య జీవితం నిండు నూరేళ్లు ఇలాగే కళకాలం కొనసాగాలని కోరుకుంటూ ఎప్పటికి మీ అభిమాని 🙏🙏🙏

Kalvakuntla Taraka Rama Rao - KTR

17/12/2021

'తారక ' మంత్రం

20/11/2021

వ్యవసాయ చట్టాలతో పాటు విద్యుత్‌ చట్టాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలి..

- ముఖ్యమంత్రి కేసీఆర్ గారు






సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రైతు లోకం చాలా నలిగిపోయింది.. నష్టపోయింది.. కష్టపడ్డది కాబట్టి వారిని ఆర్థికంగా స్థితిమంతులను చేయడం కోసం, తెలంగాణ రైతాంగాన్ని ఆత్మవిశ్వాసంతో బతికేటట్టు తయారు చేయడం కోసం అనేక చర్యలు చేపట్టినం. ఆ చర్యల్లో భాగంగా నాణ్యమైన 24 గంటలు ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తున్నం. కానీ, మీరో నూతన విద్యుత్‌ చట్టం తెచ్చి రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తున్నరు.

ప్రతి బోరు వద్ద, ప్రతి దాని వద్ద మీటరు పెట్టండని చెబుతున్నరు. మాకు కెపాసిటీ ఉన్నది.. మా రైతులకు ఉచితంగా సరఫరా చేసుకుంటమని చెబుతున్నం. ఏ రాష్ట్రాలు ఇట్ల ఇస్తయో ఆ రాష్ట్రాలను అనవసరంగా ఒత్తిడికి గురి చేయొద్దని డిమాండ్‌ చేస్తున్నం. మీరు తెచ్చిన విద్యుత్‌ చట్టం మీద ఈ రోజు విద్యుత్‌ కార్మికులు, ప్రజలు ఆందోళనతో ఉన్నరు. మరీ ముఖ్యంగా వ్యవసాయ క్షేత్రం చాలా ఆందోళనతో ఉన్నది. మేం మీటర్లు పెట్టేందుకు సిద్ధంగా లేం. మీరేమో పెట్టాలని ఒత్తిడి తెస్తున్నరు. రాష్ట్రాలు మీ చట్టం అమలు చేయమని మా మీద భయంకరమైన ఒత్తిడి తెస్తున్నరు. మాకొచ్చే నిధులు నిలిపేస్తమని ఇంకో రకమైన పద్ధతిని అవలంభిస్తున్నరు ఇది కరెక్టు కాదు. ఇది నియంతృత్వ వైఖరి అయిది.. ఇది ప్రజాస్వామ్య దేశం. రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని హక్కులు, బాధ్యలున్నయ్‌.

కాబట్టి రాష్ట్రాలపై రుద్దొద్దు ఎట్టి పరిస్థితుల్లో. మీ పాలసీ మంచిదని, ఒక వేళ మీ పార్టీ అధికారంలో ఉన్నకాడ అమలు చేసుకుంటమంటే చేసుకోండి. అందరిపై రుద్దేలా కఠినతరమైన చట్టాన్ని తెచ్చి, మెడమీద కత్తిపెట్టే ప్రయత్నం చేయొద్దని, ఆ విద్యుత్‌ చట్టాన్ని కూడా వెంటనే వాపస్‌ తీసుకోవాలని ప్రధానిని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నం. ఆ విద్యుత్‌ చట్టం పాస్‌ ఇంకా కాలేదు. పాసైతే చాలా తీవ్రమైన ఆందోళన దేశవ్యాప్తంగా చెలరేగుతుంది. మళ్లీ ఒకసారి రైతులంతా బజారునపడుతరు. ఇది గ్యారంటీగా జరుగుతుది. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు, ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్‌ ఇస్తున్నరు.

ఇది రైతాంగానికి భరోసాగా ఉన్నది. ఆ రైతుల నోట్లో మట్టిగొడుతం. మీరు మీటర్లు పెట్టాల్సిందే అని జబర్‌దస్త్‌ పద్ధతిలో విద్యుత్‌ చట్టం ఉంది కాబట్టి వెంటనే విద్యుత్‌ చట్టాన్ని విత్‌డ్రా చేసుకోండి. ఇది ఎంత వరకు సమంజసం కాదు. బాయిలకాడ మీటర్లు పెట్టండి. బోర్లకాడ మీటర్లు పెట్టం అనేది దుర్మార్గమైన చర్య.. అది కూడా వ్యవసాయ వ్యతిరేక చర్య. ఆ చట్టాన్ని కూడా వ్యవసాయ చట్టాలతో విద్యుత్‌ చట్టాన్ని పాస్‌ చేయకుండా వాపస్‌ తీసుకోవాలి. తాము టీఆర్‌ఎస్‌ నుంచి చట్టాన్ని వ్యతిరేకిస్తాం. లోక్‌సభలో, రాజ్యసభలో మాకున్న శక్తిమేరకు పోరాడుతాము

-

18/11/2021

25/10/2021

ఇరువైయెళ్ళ గులాబీ...

ద్విదశాబ్ది ఉత్సవాల వేళ... తెరాస ప్లీనరీ నేడు
భారీ ఎత్తున ఏర్పాట్లు... రానున్న ఆరున్నర వేల మంది

ఏడు తీర్మానాలకు సన్నాహాలు
గులాబీమయమైన హైదరాబాద్

రెండు పదుల వయసు...

నిండు జవ్వన ఉత్సాహం... ఊరూరా శ్రేణులతో పునాదిని బలోపేతం చేసే యత్నం... భవితకు అదే పటిష్ఠమైన వారధి అన్న విశ్వాసం... 20 ఏళ్ల ప్రస్థానపు విజయాల స్మరణతో... భావి లక్ష్యాలపై గురి పెట్టి... తెలంగాణ రాష్ట్రసమితి మరోసారి ప్లీనరీకి సిద్ధమైంది. ఆ పార్టీ రాష్ట్ర ప్రతినిధుల మహాసభ (ప్లీనరీ) సోమవారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరగనుంది. 2018 తర్వాత మూడేళ్లకు జరుగుతున్న ఈ సభను శ్రేణుల్లో నూతనోత్తేజం నింపేలా ఘనంగా నిర్వహించేందుకు పార్టీ ఏర్పాట్లు చేసింది. తెరాస 13 ఏళ్లపాటు ఉద్యమం నడిపి, ఏడేళ్ల క్రితం అధికారంలోకి వచ్చింది. మరో రెండేళ్లలో శాసనసభ... ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ సంకల్పించారు. దీని కోసం బస్తీ నుంచి రాష్ట్ర స్థాయి వరకూ సంస్థాగత ఎన్నికలను నిర్వహిస్తున్నారు. ప్లీనరీకి ప్రజాప్రతినిధులతో పాటు కొత్త సంస్థాగత కమిటీల ప్రతినిధులనూ ఆహ్వానించారు. పార్టీని పటిష్ఠం చేసే కార్యాచరణ ప్రణాళికను కేసీఆర్‌ ఈ వేదికపై వివరించనున్నారు. ద్విదశాబ్ది ఉత్సవాల సందర్భంగా వరంగల్‌లో వచ్చే నెల 15న విజయగర్జన పేరిట భారీ బహిరంగ సభను కూడా తెరాస తలపెట్టింది. ఉదయం 11 గంటలకు ప్లీనరీ ప్రారంభమవుతుంది. తొలుత అమరవీరులకు కేసీఆర్‌ నివాళులర్పించి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తారు. పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. పార్టీ అధ్యక్ష ఎన్నిక ప్రకటన, అనంతరం కేసీఆర్‌ ప్రసంగిస్తారు. ఆ తర్వాత పార్టీ రాజకీయ, జాతీయ, ప్రాంతీయ స్థాయి అంశాలపై ఏడు తీర్మానాలు చేయనున్నారు. వీటిని ఏడుగురు నేతలు ప్రతిపాదిస్తారు. అనంతరం వాటిపై చర్చించి, ఆమోదిస్తారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్లు, జడ్పీల ఛైర్‌పర్సన్లతో పాటు మండల పరిషత్‌ అధ్యక్షులు, జడ్పీటీసీ సభ్యులు, కార్పొరేటర్ల స్థాయి వరకు ఆహ్వానించారు. మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా ఆరున్నర వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. పురుషులు, మహిళలు గులాబీ రంగు వస్త్రాలు ధరించి రావాలని పార్టీ అధిష్ఠానం నిర్దేశించింది. సభ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు.

పాసులు ఉంటేనే లోనికి అనుమతి

తెరాస ప్లీనరీ సభలకు పోలీసులు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సైబరాబాద్‌, రాచకొండ, హైదరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బందికి బందోబస్తు విధులు కేటాయించారు. పోలీసులు ఆదివారం సాయంత్రం హైటెక్స్‌ ప్రాంగణాన్ని తమ అధీనంలోకి తీసుకుని తనిఖీలు చేపట్టారు. ఆరుగురు డీసీపీలు, 26 మంది ఏసీపీలు, 70 మంది ఇన్‌స్పెక్టర్లు, 192 మంది ఎస్‌ఐలు, 40 మంది ఏఎస్‌ఐలు, 1180 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు మొత్తం 1,514 మంది బందోబస్తు నిర్వహిస్తారు. 750 మంది ట్రాఫిక్‌ పోలీసులు వీరికి అదనం. ఆదివారం సాయంత్రం హైటెక్స్‌లో పోలీసు అధికారులు, సిబ్బందితో సమావేశమైన సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర.. ప్లీనరీ సందర్భంగా పటిష్ఠ నిఘా ఉంచాలని ఆదేశించారు. పాసులున్న వారినే లోనికి అనుమతించాలని స్పష్టం చేశారు.

ప్రత్యేక పార్కింగ్‌ ప్రాంతాలు

సభకు వచ్చే ప్రతినిధుల వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్‌ ప్రదేశాలను సిద్ధం చేశారు. ఖానామెట్‌ జయభేరి సమీపంలో 3 నుంచి 4 వేల వాహనాలు నిలిపేలా మైదానాన్ని చదును చేసి ఉంచారు. న్యాక్‌ వెనుక భాగంలో మరో మైదానాన్ని కూడా కేటాయించారు. ప్రతినిధులు తమ వాహనాలను పార్కింగ్‌ ప్రాంతాల్లోనే నిలిపి హైటెక్స్‌ లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. రహదారులపై రద్దీ నెలకొనకుండా పోలీసులు ప్రత్యేక రూట్‌మ్యాప్‌లు తయారు చేసి ట్రాఫిక్‌ సిబ్బందికి అందజేశారు.

ఫ్లెక్సీలు.. స్వాగత ద్వారాలు

ప్లీనరీ వేదిక, ప్రాంగణాన్ని గులాబీ వర్ణంతో అలంకరించారు. సభావేదికపై కాకతీయ కళాతోరణంతో పాటు.. దుర్గం చెరువు తీగల వంతెన ప్రత్యేక ఆకర్షణ కానుంది. ప్రధాన ద్వారం వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు నమూనాను అలంకరించారు. కేసీఆర్‌ జీవితచరిత్ర, ఉద్యమఘట్టం నాటి ఛాయాచిత్రాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. నగరమంతా గులాబీమయంగా మారింది. పెద్దఎత్తున ఫ్లెక్సీలు, స్వాగత ద్వారాలు, తోరణాలు, పార్టీ జెండాలను ఏర్పాటు చేశారు.

22/10/2021

★ సీఎం కేసీఆర్ పేరు చెబితే వణుకుతున్న బీజేపీ నేతలు

★ హుజురాబాద్ లో సీఎం సభ జరగకుండా కుట్రలు

★ పక్క నియోజకవర్గంలోనూ సభ వద్దంటూ ఎన్నికల
కమిషన్ ఆర్డర్

★ ఓటమి భయంతో వణుకుతున్న బీజేపీ నాయకులు

★ ముందే సభలు పెట్టుకున్న బీజేపీ నేతలు

★ టి ఆర్ ఎస్ వ్యతిరేక శక్తుల నీచరాజకీయాలు

గౌరవ ముఖ్యమంత్రి , టి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ గారి పేరు చెబితేనే తెలంగాణ బీజేపీ నాయకుల వెన్నులో వణుకు పుడుతున్నది. హుజురాబాద్ నియోజకవర్గంలో ఓడిపోతామనే భయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి టి ఆర్ ఎస్ పార్టీ ఎన్నికల బహిరంగ సభను జరగకుండా బీజేపీ నేతలు కుట్రలు , కుతంత్రాలు చేస్తున్నారు. బెంగాల్ ఉప ఎన్నిక తరహాలో హుజురాబాద్ ప్రజలు కూడా ఛీ కొడతారేమోనని తెలంగాణ బీజేపీ నాయకులు గజ గజ వణికి పోతున్నరు. సీఎం కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ ఎదుగుదలను ఓర్వలేని దుష్ట శక్తులు హుజురాబాద్ లో టి ఆర్ ఎస్ విజయభేరిని అడ్డుకోగలమని కలలు కంటున్నాయి . ముందే హుజురాబాద్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రుల సభలు పెట్టుకున్న బీజేపీ నేతలు ఒక ముఖ్యమంత్రి సభను అడ్డుకునే నీచానికి పాల్పడుతున్నరు. ఇటీవల జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో కూడా బీజేపీ , కాంగ్రెస్ పార్టీలు ముఖ్యమంత్రి సభకు అనుమతి ఇవ్వవద్దని హైకోర్టు ను ఆశ్రయించి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశాయి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా హుజురాబాద్ లో టి ఆర్ ఎస్ భారీ విజయాన్ని అడ్డుకోలేరని టి ఆర్ ఎస్ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. ప్రజల క్షేమమే ద్యేయంగా పని చేస్తున్న టి ఆర్ ఎస్ ప్రభుత్వాన్ని , పార్టీని ప్రజలే కాపాడుకుంటారని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే కేంద్రంలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో పరువు పోగొట్టుకుంటున్న బీజేపీ వంటి పార్టీలు ఇకనైనా బుద్ది తెచ్చుకుంటే మంచిదని టి ఆర్ ఎస్ శ్రేణులు హెచ్చరిస్తున్నాయి.

17/09/2021

గజ్వేల్ నియోజకవవర్గానికి ప్రతినిత్యం వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ఏడేళ్లకాలంలో చేసిన అభివృద్ధిని చూసి బొక్కబోర్ల పడ్డ బుడ్డర్ ఖాన్ బ్యాచ్ &co.
Kalvakuntla Taraka Rama Rao - KTR

17/09/2021

మొదలైంది...
రాజు ఆత్మహత్య పై హైకోర్ట్ లో పిల్ దాఖలు చేసిన మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ !

మానవత్వం లేని మానవ హక్కుల సంఘం 🤦
ఈ సంఘం చిన్నారి చైత్ర కోసం ఎందుకు మాట్లాడలేదు.
, , ,, మీ అభిప్రాయం ఎంటి ?

11/09/2021

ఆయన ఏమి చేసిన వినూత్నమే! ప్రత్యార్థుల ఊహలకు కూడా అందానిరీతిలో ఉంటాయి ఆయన ఎత్తుగాడాలు, భవిష్యత్ ను ముందుగానే ఊహిస్తారు, అందుకు తగ్గాటుగానే అములు చేస్తారు.
అందరు #ట్రెండును పాలో అవుతారు.. కానీ #ట్రెండ్ ను సెట్ చేయడం ఒక కేసీఆర్ గారికే సొంతం. That is KCR 🙏🙏🙏
Kalvakuntla Taraka Rama Rao - KTR

Photos from తెలంగాణ కేసీఆర్ సైన్యం's post 08/09/2021

#పొలిటికల్_బ్రోకర్

ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక పొలిటికల్ బ్రోకర్ కంటే హీనంగా తయారైనవ్...ముఖ్యమంత్రి #కేసీఆర్ గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం దేశ ప్రధానిని కలిస్తే ఒళ్ళు బలుపు మాటలు ఏంటి...ప్రతి అంశం బహుజన వాదం తో ముడి పెట్టడం నీకే చెల్లింది

ఉద్యోగం నుండి సస్పెండ్ అవుతున్నావ్ అని తెలిసి ముందుగానే స్వచ్ఛంద పదవి విరమణ చేసి...రహస్యంగా ఢిల్లీకి వెళ్లి అమిత్షా ముందు మొకరిల్లిన విషయం మాకు తెలువదు అనుకుంటున్నావా...అప్పుడు ఎటుపోయింది బహుజన వాదం...!!

ఇప్పటికే తెలంగాణలో రేవంత్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్ ధర్మపురిల రూపంలో జోకర్లు ఎక్కువైర్రు అనుకుంటే...కొత్తగా నువ్వు మొపైనవ్...సదుకున్నోనివి జరా తెలంగాణలో ఉన్న ప్రతిపక్ష సన్నాసుల కంటే ఒక మెట్టు ఎక్కువ ఆలోచిస్తవ్ అనుకుంటే ఆ చదువు రాని బండి సంజయ్ కంటే హీనంగా తయారైనవ్...తు..!!. Kalvakuntla Taraka Rama Rao - KTR

Photos from తెలంగాణ కేసీఆర్ సైన్యం's post 29/08/2021

Respected Shailima ma’am! Many more happy returns of the day! On this ocassion Praying god to shower his choicest blessings upon you. You may have all the happiness in the world.

💐💐💐💐

Photos from Harish Rao Thanneeru's post 11/08/2021
10/08/2021

Telangana Govt’s yet another pioneering program continues unabated even in the midst of pandemic.

Along with Agriculture Minister Singireddy Niranjan Reddy Garu handed over a cheque of ₹1,450 Cr to LIC towards life insurance cover of ₹5 lakhs to 40 lakh farmers 👍

10/08/2021

#జన్మదిన
శుభాకాంక్షలు మహేందర్ అన్నా.❤💐💐

Photos from తెలంగాణ కేసీఆర్ సైన్యం's post 07/08/2021

తెలంగాణ స్వయం పాలనలో ప్రజా పరిపాలన అత్యంత పారదర్శకంగా సాగుతున్నదని, అత్యాధునికత సాంకేతికత విధానాలను అందిపుచ్చుకుని సౌకర్యవంతమైన రీతిలో ప్రజల వద్దకే పాలనా ఫలాలు చేరుతున్నాయని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. దేశానికే ఆదర్శవంతమైన రీతిలో సుపరిపాలన కొనసాగుతున్న నేపథ్యంలో, అందుకు తగ్గట్టుగా రూపొందించి సచివాలయ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని ఏజెన్సీ ప్రతినిధులను, అధికారులను సిఎం ఆదేశించారు.

శనివారం సచివాలయ నిర్మాణ పనుల పురోగతిని సిఎం కేసీఆర్ పరిశీలించారు. నలుమూలలా కాలి నడకన కలియతిరిగి పరిశీలించారు. అనంతరం సమీక్ష నిర్వహించి, పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ... ఏడేండ్ల తెలంగాణ స్వరాష్ట్రంలో సాగుతున్న ఆదర్శవంతమైన పరిపాలనకు కేంద్ర బిందువు గా వుండే సెక్రటేరియట్ నిర్మాణ కౌశలం మన పాలనారీతులకు అద్దం పట్టేవిధంగా, గౌరవం ఉట్టిపడేలా ఉండాలని సిఎం అన్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతర పరిస్థితుల్లో,సిబ్బంది మరింత ప్రశాంతంగా తమ విధులను నిర్వహించుకునే విధంగా సచివాలయ నిర్మాణం వుండబోతోందని తెలిపారు. ప్రజలవద్దకే నేరుగా పాలనాఫలాలు చేరుకుంటున్న ప్రస్తుత తరుణంలో అందుకు అనుగుణంగానే నూతన సచివాలయాన్ని అన్ని హంగులతో నిర్మిస్తున్నామన్నారు. తెలంగాణ సచివాలయ నిర్మాణ పనులకు సంబంధించిన ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా సూక్ష్మస్థాయిలో పరిశీలిస్తూ వేగవంతంగా పూర్తిచేయాలని సిఎం తెలిపారు.

సెక్రటేరియట్ ముందు, చుట్టుపక్కలనుంచి వర్షపు నీరు పోవడానికి అనువైన విధంగా వరద నీటి డ్రైనేజీ వ్యవస్థ ను నిర్మించాలన్నారు. విశాలమైన పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా, ఎక్కడికక్కడ నీరు తరలిపోయేలా వుండాలన్నారు. కాంక్రీట్ నిర్మాణపనులు పూర్తయ్యేలోపే ముందస్తు వ్యూహంతో అవసరమైన సామాగ్రిని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. దర్వాజలు, కిటికీలు, తదితర ఫర్నిచర్, విద్యుత్, ప్లంబింగ్ టైల్స్ వంటి సచివాలయ నిర్మాణంలో వినియోగించే అన్ని రకాల విభాగాలకు చెందిన ఇంటీరియర్ మెటీరియల్ ను ముందస్తుగా సమకూర్చుకోవాలన్నారు. తద్వారా పనుల్లో జాప్యం లేకుండా కొనసాగించడానికి వీలవుతుందన్నారు.
సచివాలయం ముఖద్వారాన్ని, బయటి గేటు నిర్మాణాలను, వాటికి అమర్చవలసిన గ్రిల్స్ తదితర అంశాలను, సీఎం కెసిఆర్ స్వయంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రహరీ గోడలకు అమర్చాల్సిన లాంప్ పోస్టుల గురించి సూచనలిచ్చారు. విశాలంగా నిర్మిస్తున్నకారిడార్ ప్రాంతాలను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. సిఎం సిఎస్ సహా మంత్రుల కార్యాలయాలు, ఇతర సిబ్బంది, సాధారణ పరిపాలన అధికారుల కార్యాలయాల నిర్మాణ వివరాలను తెలుసుకున్నారు.

సచివాలయం చుట్టూ కాలినడకన తిరిగి నిర్మాణ నాణ్యతను పరిశీలించారు. ఇతర రాష్ర్ట్రాలనుంచే కాక, విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులు ప్రముఖుల కోసం నిర్మితమౌతున్న‘వెయిటింగ్ హాల్’ ల నిర్మాణాల తీరును, సందర్శకులు కూర్చునే ప్రదేశాలను సిఎం పరిశీలించారు. పార్కింగ్ వ్యవస్థ గురించి ఆరాతీశారు. కార్లు, టూ వీలర్స్, బస్సులు తదితర వాహనాల పార్కింగు స్థలాలను పరిశీలించారు. హెలీపాడ్ నిర్మాణం గురించి తెలుసుకున్నారు. దివ్యాంగులు, వయో వృద్ధులు తదితర సందర్శకులు, సెక్రటేరియట్ కు వచ్చే విఐపీల కోసం తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలను సిఎం వివరించారు. అవసరమైన వారికోసం బ్యాటరీతో నడిచే వాహనాలను ఏర్పాటు చేయాలన్నారు. సచివాలయ నిర్మాణంలో కీలకమైన గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పనులు పూర్తయిన నేపథ్యంలో, ప్రత్యేక చర్యలు చేపట్టి పై అంతస్తుల పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. అందుకోసం ఎటువంటి చర్యలు చేపట్టాలో చర్చించి ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించాలని సిఎం కెసిఆర్ సూచించారు. సచివాలయ సందర్శనలో సిఎం కెసిఆర్ వెంట, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి , ఎమ్మెల్యేలు సి. లక్ష్మారెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, మైనం పల్లి హన్మంతరావు, రేగా కాంతారావు, అంజయ్య యాదవ్, కృష్ణ మోహన్ రెడ్డి, హన్మంత్ షిండే, రోహిత్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రోడ్లు భవనాల ఈఎన్సీ గణపతిరెడ్డి, ప్రభుత్వ నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, నిర్మాణ సంస్థ శాపూర్జీ పల్లోంజీ ప్రతినిధులు, ఇంజనీర్లు, తదితరులున్నారు.

Videos (show all)

Jai KCR jai Telangana
జై కెసిఆర్
జై కెసిఆర్ జై తెలంగాణ
జై కేసీఆర్ జై తెలంగాణ ✊️✊️
జై కేసీఆర్ జై తెలంగాణ
Jai kcr jai telangana
TARGET GHMC ELECTION
TARGET GHMC ELECTION
జై కేసీఆర్ జాయహో తెలంగాణ
జై కేటీఆర్ జయహో తెలంగాణ
జై తెలంగాణ జై kcar✊️✊️✊️🙏🙏

Website