Srinivasu Goud Mettu Bjp

Srinivasu Goud Mettu Bjp

జై హింద్ జై భారత్ జై శ్రీరామ్ జై బిజెపి జయహో మోడీజీ జయహో

23/11/2023

తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో నయా నైజాం నవాబు దొర కుటుంబీకులు చేసిన మోసాలను మర్చిపోం అంటున్న ప్రజానీకం...
కల్వకుర్తి నియోజక వర్గంలో ఇచ్చిన హామీలను మర్చిపోయిన మిమ్ములను మర్చిపోం అంటున్న ప్రజానీకం..
మార్పు కోసం - బిజెపి రావాలి అంటున్న ప్రజానీకం..
కల్వకుర్తి నియోజక వర్గం అభివృద్ది చెందాలంటే - కమలం పువ్వు వికసించాలి అంటున్న ప్రజానీకం..
కమలం పువ్వు గుర్తు కు ఓటు వేద్దాం - ఆచారి అన్నను గెలిపిద్దాం..
Vote for BJP Achary.
#అందరికీఇచ్చారుఅవకాశం #ఆచారిగారికిఇవ్వండిఓఅవకాశం

20/11/2023

కల్వకుర్తి నియోజక వర్గంలో 40 సంవత్సరాల నుండి ఈ నియోజక వర్గం పేద ప్రజల కోసం, అనేక ఉద్యమాలు చేసి, 5సార్లు ఓడిపోయిన, మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనను నమ్ముకోని, తనతో పాటు అడుగులో అడుగు వేసుకుంటూ, అనేక సంవత్సరాలుగా ఓకే పార్టీ, ఒకే జెండ, ఒకే ఎజెండాతో పని చేస్తున్న బిజెపి కార్యకర్తలు పడుతున్న కష్టాన్ని చూస్తు, చనిపోయిన కార్యకర్తలను తలుచుకొని, భావోద్రేకానికి గురై కన్నీరు పెడుతున్న ఆచారి అన్న గారు..
ఒక ఉద్యమ నాయకుడు, అలుపెరుగని పోరాటం చేస్తున్న నేత, కల్వకుర్తి గడ్డ మీద కన్నీరు పెట్టడం ఏమిటి?
కల్వకుర్తి నియోజక వర్గం సబండ వర్గాల ప్రజలారా ఒక సారి అలోచించండి..
ఈ గడ్డ మీద దాదాపు వేలాది మంది కార్యకర్తల జీవితాలు ముడిపడి ఉన్నాయి..
కమలం పువ్వు గుర్తు కు ఓటు వేసి - బిజెపి కార్యకర్తలను గెలిపించండి.. భాదతో వేడుకుంటున్నాం..
భారత్ మాతా కీ జై..
#అందరికీఇచ్చారుఅవకాశం #ఆచారిగారికిఇవ్వండిఓఅవకాశం

20/11/2023

కల్వకుర్తి నియోజక వర్గంలో ఎందరికో ఓటు వేసిన ఈ బామ్మ గారి మాట వినండి. బామ్మ ను చూసైనా మారండి. మార్పు రావాలి.. మార్చాలి..
ఈ సారి బిజెపి కమలం పువ్వు గుర్తు కు ఓటు వేసి, ఆచారి అన్న గారిని గెలిపించండి...
#అందరికీఇచ్చారుఅవకాశం #ఆచారిగారికిఇవ్వండిఓఅవకాశం

20/11/2023

యావత్ తెలంగాణ బీసీ మిత్రుల పాదాలకు నమస్కరించి పెడుతున్న సమాచారం..
నేను అనగా కల్వకుర్తి నియోజక వర్గం బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి తల్లోజు ఆచారి గారిని..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో గానీ ఇప్పటి వరకు కాంగ్రెస్, టీడీపీ, టి ఆర్ ఎస్ లేదా బీ అర్ ఎస్ పార్టీలు అధికారాలు చేపట్టి, వెనకబడిన తరగతుల వారికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా, బీసీలకు అన్యాయం చేశారు...
అన్నిటిని దృష్టిలో ఉంచుకొని మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఇటీవలి కాలంలో తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే బహుజన బీసీ నేతను ముఖ్య మంత్రిని చేస్తామని చెప్పిన విషయం యావత్ తెలంగాణ సమాజానికి తెలిసిందే..
మిత్రులారా ఒక్క సారి ఆలోచించండి..
బీసీ సామజిక వర్గం నుండి ఒక ముఖ్య మంత్రి అయ్యే అవకాశం వచ్చింది. ఇలాంటి మంచి అవకాశం వదులుకోవద్దని మనసు పూర్తిగా అన్ని వర్గాల ప్రజలను కోరుచున్నాను..
ముఖ్య గమనిక:- మీరు చేయాల్సిన పని ఒకటే..
కమలం పువ్వు గుర్తు కు ఓటు వేద్దాం - బిజెపిని గెలిపించుకుందాం.. బీసీ ముఖ్య మంత్రి నీ చేసుకుందాం..
భారత్ మాతా కీ జై...
కమలం పువ్వు గుర్తు కే మన ఓటు..
ఇట్లు
సదా మీ సేవలో
తల్లోజు ఆచారి - కల్వకుర్తి నియోజక వర్గం
మాజీ జాతీయ బీసీ కమిషన్ మెంబర్..

17/11/2023

పాపిష్టి పాలన పాపం పండినట్టుంది..
వామ్మో ఇవేం తిట్ల పురాణం రా నాయనా!
అవినీతి, నియంతృత్వ, నయా నైజాం నవాబు దొర కుటుంబ పాలనకు చిల్లు పడుతుంది..
ప్రజలకు పూర్తిగా అర్థమైపోయింది కేసిఆర్ పాలన గురించి...

10/11/2023

కాషాయం రంగా మజాకానా! కమలం పువ్వు జెండా కదలివచ్చిన చిరు చిరుతల చిందులు..
కమల దళం దళపతి ఆచారి గారి ఆనందానికి అవధులు లేకుండా, చిన్నారుల ప్రేమ అభిమానం చూసి మంత్ర ముగ్ధుడైన ఆచారి అన్న గారు..

29/10/2023
29/10/2023

తెలంగాణలో బిజెపి చివరి క్షణం వరకు రాజకీయ ప్యూహాలకు పదును పెట్టి, ప్రత్యర్థుల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ, బ్రహ్మ అస్త్రాలు ప్రయోగిస్తూ, త్రిలింగ దేశం (తెలంగాణ)లో కాషాయం జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రజల్లోకి దూసుకుపోతున్న బిజెపి సేనాది పతులు..

27/10/2023

కల్వకుర్తి నియోజక వర్గం కర్షక, కార్మికులకు, ఉద్యోగ, నిరుద్యోగులకు,యువతీ, యువకులకు,రాజకీయ మేధావులకు, కవులు, రచయితలకు, కళాకారులకు, సబండ కుల సంఘాల నాయకులకు, పత్రికా, పాత్రికేయులకు ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం...........-:ఒక్కసారి ఆలోచించండి:-.......
మన కల్వకుర్తి నియోజక వర్గంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు, ఎందరో నాయకులను తయారు చేసి, కల్వకుర్తి నియోజక వర్గం ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన ప్రజలందరికీ ధన్యవాదములు..
దాదాపు 40సంవత్సరాలుగా కల్వకుర్తి నియోజక వర్గంలో ఒకే పార్టిలో ఉంటూ, ప్రజలకు ఉన్న సమస్యలను తన సొంత సమస్యగా పరిగణలోకి తీసుకొని, అనేక ఉద్యమాలు చేస్తు,ప్రజల సమస్యలపై పోరాటం చేసిన ఏకైక నాయకుడు ఆచారి గారు..
ఒక్కొక్కరికి రెండు, మూడు లేదా నాలుగు సార్లు అవకాశం ఇస్తే వారు ఏం చేశారో చూశాం..
ఆచారి గారు 5సార్లు ఓడిపోయిన వెనుదిరిగి చూడకుండా ముందుకు సాగుతున్న క్రమంలో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు తనకు జాతీయ బీసీ కమిషన్ సభ్యులుగా అవకాశం ఇస్తే,అందులో అనేక సమస్యల పై ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఓడిపోయిన కూడ ప్రజల కోసం పరితపించే నాయకుడు ఆచారి గారు. ఆలోచించండి ఒక్క అవకాశం కల్పించి, కల్వకుర్తి నియోజక వర్గం అభివృద్ది పథంలో ముందుకు తీసుకెళ్దాం..
కమలం పువ్వు గుర్తు కు ఓటు వేద్దాం, ఆచారి అన్నను గెలిపిద్దాం..

27/10/2023

తెలుగు రాష్ట్రంలో ఇప్పటివరకు ఎవరు కూడ 6సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి లేడు..
ఎవరైనా ఉన్నారంటే,మొక్కవోని గుండె దైర్యంతో, కఠోర దీక్షతో, పట్టుదలతో, అనుక్షణం మన వెన్నంటే ఉన్న ఏకైక నాయకుడు ఆచారి గారు మాత్రమే.
ఇతర పార్టీల నాయకులు వాళ్ల స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీలు మారిన వారు ఉన్నారు. అధికారం కోసం రంగులు మార్చిన వారు ఉన్నారు...
కాని ఒకే జెండా, ఒకే పార్టీ, ఒకే రంగు, ఒకే సిద్దాంతం తో కల్వకుర్తి నియోజక వర్గం అభివృద్ధియే లక్ష్యంగా పని చేస్తు, నా కల్వకుర్తి నియోజక వర్గం ప్రజలే నా బలం, నా బలగం అంటూ నిరంతరం ప్రజా క్షేత్రంలో లెక్కుకు మించిన ఉద్యమాలు చేసిన వ్యక్తి మన తల్లోజు ఆచారి గారు.
కావున కల్వకుర్తి నియోజక వర్గం ప్రజలారా! ఒక్క సారి ఆలోచించండి. మన కోసమే పనిచేస్తున్న ఆచారి అన్నను ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిపించుకునే భాధ్యత మన అందరి పై ఉంది. కమలం పువ్వు గుర్తు పై ఓటు వేద్దాం, ఆచారి అన్నను అసెంబ్లీకి పంపిద్దాం..
#అందరికీఇచ్చారుఅవకాశం #ఆచారిగారికిఇవ్వండిఓఅవకాశం

Photos from Srinivasu Goud Mettu Bjp's post 24/10/2023

రాష్ట్రీయ స్వయం సేవక్ (RSS) లో మెట్టు యాదగిరి గౌడ్..

23/10/2023

చెడుపై సాధించిన విజయానికి ప్రతీక దసరా..
ఈ పండగ సందర్బంగా అమ్మ వారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని .. మీ ఇంట సుఖ సంతోషాలు.. సిరి సంపదలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులకు విజయ దశమి శుభాకాంక్షలు
ఇట్లు
సదా మీ సేవలో
తల్లోజు ఆచారి
కల్వకుర్తి నియోజక వర్గం .

16/10/2023

🚩బిజెపి విజయ సంకల్ప సభ🚩
********************************
తేదీ:16/10/2023 న కల్వకుర్తి నియోజక వర్గంలో భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న విజయ సంకల్ప సభ కు ముఖ్య అతిథిగా విచ్చేయుచున్న కేంద్ర మంత్రి వర్యులు, పాడి పరిశ్రమ & మత్స్య పరిశ్రమ శాఖ మహాత్యులు శ్రీ పురుషోత్తం రూపాల గారికి హృదయ పూర్వక స్వాగతం - సుస్వాగతం..

09/10/2023

ఈ రోజు సాయంత్రం సమయంలో నాగర్ కర్నూల్ లో జరిగినటువంటి TV 9ఛానెల్ వారు నిర్వహించిన పబ్లిక్ బస్ యాత్ర డిబెట్ లో
నాగర్ కర్నూల్ BRS ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అడిగిన ప్రశ్న..
భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు జన్ దన్ ఖాతా లో ప్రతి ఒక్కరికి ₹15/- లక్షల రూపాయలు వేస్తానని చెప్పి వేసిండా?
కల్వకుర్తి ఉద్యమాల ముద్దు బిడ్డా, మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు,Bjp సీనియర్ నేత తల్లోజు ఆచారి గారు ధీటైన సమాధానం ఇచ్చారు.
భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఎక్కడైనా,ఎప్పుడైనా, జన్ దన్ ఖాతా లో ₹15/- లక్షల రూపాయలను వెస్తాననీ అన్న ఒక్క ప్రూఫ్ చూపిస్తే కల్వకుర్తి నియోజక వర్గంలో నేను పోటీ చేయనని ఛాలెంజ్ విసిరాడు.
అందుకు సమాధానం లేక సైలెంట్ అయిన మర్రి..

01/10/2023

🚩🌹 ఛలో పాలమూర్🌹🚩
ప్రజా గర్జన భారీ బహిరంగ సభ
********************************
తెలంగాణ రాష్ట్రంలో వేలాది కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నా మన ప్రియతమ మహానేత, విశ్వ నాయకుడు, భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ రోజు మధ్యాహ్నం 12:00గంటలకు పాలమూర్ జిల్లాకు విచ్చేయుచున్న శుభ సందర్భంగా స్వాగతం సుస్వాగతం.🙏🙏🙏
#అందరికీఇచ్చారుఅవకాశం #ఆచారిగారికిఇవ్వండిఓఅవకాశం

01/10/2023

*ఛలో పాలమూర్ ప్రజా గర్జన*భారీ బహిరంగ సభ*
భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు పాలమూర్ ప్రజా గర్జన పేరుతో ఈ రోజు విచ్చేయూచున్నారు. వేలాది కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. కావున మన ప్రియతమ నేత భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి ఘన స్వాగతం పలకడానికి యావత్ తెలంగాణ ప్రజానీకం తరలి రావాలని మనవి..
ఇట్లు
తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు
కేంద్ర మంత్రి వర్యులు
శ్రీ గంగా పురం కిషన్ రెడ్డి గారు.

28/09/2023

తెలుగు రాష్ట్రాల విభజన హామీల విషయంలో కొన్ని కోర్టుల పరంగా గానీ, రెండు రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ లోపాల వల్లనో, సాంకేతిక లోపాల వల్లనో, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సఖ్యత లేనందు వల్లనో కొంత జాప్యం జరిగితే జరగొచ్చు నేమో కాని కేంద్ర ప్రభుత్వం హామీల విషయంలో క్లారిటీగా ఉందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి గారు మీడియా లైవ్ డిబేట్ లో చర్చించారు..

28/09/2023

కల్వకుర్తి నియోజక వర్గం ప్రజలకు హృదయ పూర్వక పాదాభివందనాలు..
🗓️:తేది:01/02/2023 న
⏰:మధ్యాహ్నం:12: 00గంటలకు
⛩️:స్థలం:ITI మైదానం,భూత్పూర్ లో తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ కు ముఖ్య అతిథిగా విచ్చేయుచున్న
మన ప్రియతమ మహానేత, విశ్వ నాయకుడు, భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మన ఉమ్మడి పాలమూరు గడ్డపై అడుగు పెడుతున్న సందర్భంగా, పెద్ద ఎత్తున్న ప్రతి ఒక్కరు తరలి రావాలని మనసు పూర్తిగా కోరుచున్నాము..
జై హింద్ జై భారత్ జై బిజెపి జయహో మోడీజీ జయహో..
ఇట్లు
సదా మీ సేవలో
తల్లోజు ఆచారి
మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు
కల్వకుర్తి నియోజక వర్గం.

28/09/2023

కేంద్రంలో,రాష్ట్రంలో గతంలో ఉన్న ప్రభుత్వాలు 55సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కంటే, ఇప్పుడు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి, బిజెపి ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల సుపరిపాలనలో రెట్టింపు స్థాయిలో అభివృద్ధి పనులు చేస్తున్న క్రమంలో, ఉమ్మడి పాలమూర్ జిల్లాకు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నది వాస్తవం. అందులో భాగంగానే పాలమూర్ గడ్డ పై అడుగు పెడుతున్నాడనీ కల్వకుర్తి నియోజక వర్గం ముద్దు బిడ్డా, ఉద్యమ నేత, మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి గారు మీడియా లైవ్ లో ప్రసంగించారు.

26/09/2023

మొట్ట మొదటి సారిగా, పాలమూర్ గడ్డ పై అడుగు పెట్టనున్న, భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి పై కండ్లు ఓర్వలేక, కల్వకుంట్ల కుటుంబ సభ్యులకు మంత్రి గా పని చేస్తున్న డ్రామారావు విమర్శల పై,సవాల్ విసిరిన కల్వకుర్తి నియోజక వర్గం ముద్దు బిడ్డా, వెనకబడిన తరగతుల ఆశాజ్యోతి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు శ్రీ తల్లోజు ఆచారి గారు..

#అందరికీఇచ్చారుఅవకాశం #ఆచారిగారికిఇవ్వండిఓఅవకాశం

09/09/2023

మాడుగుల మండల ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు...

02/09/2023

🌹కల్వకుర్తి నియోజక వర్గం ప్రజలకు పాదాభివందనాలు 👉🙏🦶🙏🦶
కర్షక కార్మిక, ఉద్యోగ నిరుద్యోగ,రాజకీయ మేధావులారా!,తెలంగాణ రాష్ట్ర సాధనకై పోరాటం చేసిన ఉద్యమ నాయకులారా! యువతీ యువకులారా! కవులు కళాకారులారా! పత్రికా పాత్రికేయులారా!అన్ని వర్గాల JAC నాయకుల్లారా!గతంలో ఎందరినో నాయకులను ఎమ్మెల్యేలుగా చూసిన అనుభవం మీ అందరికి ఉంది.వారు చేసిన ప్రజా సేవ తీరును తిలకించారు. ఈ కల్వకుర్తి గడ్డకు దేశంలోనే అత్యంత రాజకీయ చరిత్ర ఉంది.మహానుభావులను సైతం ఓడించిన ఘనత ఈ గడ్డ కు ఉన్న ప్రత్యేకత.ఒక్కసారి ఆలోచించండి.. పేద కుటుంబంలో పుట్టి, పేదల కష్టాలను చూసి, "నేను సైతం పేద ప్రజల కోసం సమిదనొక్కటి అవుతాను" అంటూ,
ప్రజల కోసం, కల్వకుర్తి నియోజక వర్గం ప్రగతి కోసం, వివిధ ప్రజా సమస్యల పై ఉద్యమాలు చేసి,అనుక్షణం ప్రజల మధ్య తిరుగుతూ,అంచెలంచెలుగా ప్రజల మన్నలను పొందుతున్న ఉద్యమాల ముద్దు బిడ్డా, వెనకబడిన తరగతుల ఆశాజ్యోతి,భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, తల్లోజు ఆచారి గారు.అతనికి ఇతర పార్టీల్లో పలు సార్లు అవకాశాలు వచ్చినా, వాటన్నిటినీ కాదనుకుని నమ్మిన సిద్ధాంతం కోసం, ఒకే పార్టీ, ఒకే జెండాతో నలబై ఏళ్లుగా ప్రజలే నా కుటుంబ సభ్యులు అంటు,మంచికైన,చెడుకైన, పిలుపు అందితే చాలు సొంత కుటుంబ సభ్యునిగా, తను తొక్కని గడప లేదు.5సార్లు ఎన్నికల బరిలో నిలబడి ఓడినా ఏనాడు బాధపడలేదు. వెను దిరగని ధీరత్వంతో, అదే చిరునవ్వుతో ప్రజా క్షేత్రంలో తిరుగుతున్న ఒకేఒక నాయకుడు ఆచారి గారు. ఏదో ఒక రోజు నా ప్రజలు నన్ను ఆశీర్వదించక పోతారా!అనే ఒక చిన్న ఆశ, నమ్మకంతో ఇప్పుడు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో, మళ్లీ 6వ సారి బిజెపి తరుపున పోటీ చేయనున్నారు. ఇంత పట్టుదల ఉన్న నాయకుని, ఇంత మంచి మనసున్న నాయకుని, పిలిస్తే పలికే నాయకుని వదిలిపెట్టకుండా, ఈసారి ఎన్ని అడ్డంకులు ఎదురైనా, మనం వేసే ప్రతి ఓటుతో ఆచారి అన్న గారినీ గెలిపించి శాసన సభకు పంపిచాలని మనవి.
నా ఒక్క ఓటు వేయకపోతే ఏం కాదులే అనుకుంటే పొరపాటే, నీవు వేసే ఆ ఒక్క ఓటుతోనే గెలుపు ఖాయం. ఆ గెలుపుతో కల్వకుర్తి నియోజక వర్గం అభివృద్ధికి మలుపు.ఆలోచించండి.
కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి, బిజెపి జెండా ఎగరవేద్దాం..
#అందరికీఇచ్చారుఅవకాశం #ఆచారిగారికిఇవ్వండిఓఅవకాశం

22/08/2023

కల్వకుర్తి నియోజక వర్గం ప్రజలకు పాదాభివందనాలు...
తల్లోజు ఆచారి అన్న గారికి మద్దతుగా నిలిచిన,నిలవబోతున్న ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి హృదయ పూర్వక కృతజ్ఞతలు..
రాబోయే ఎన్నికల్లో కల్వకుర్తి గడ్డ పై బిజెపి ఆచారి అన్న గారి నాయకత్వానికి పట్టం కట్టి,అసెంబ్లీకి పంపితే, కల్వకుర్తి నియోజక వర్గం అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే సత్తా ఉన్న ఏకైక నాయకుడు ఆచారి గారు..
భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదం పుష్కలంగా ఉంది ఆలోచించండి. ప్రతి పేద వారికి అండగా నిలబడే ఏకైక నాయకుడు ఆచారి అన్న గారు.
#అందరికీఇచ్చారుఅవకాశం #ఆచారిగారికిఇవ్వండిఓఅవకాశం

20/08/2023

రంగారెడ్డి జిల్లా, కల్వకుర్తి నియోజకవర్గం, మాడుగుల మండల కేంద్రంలో ఈ రోజు కురుమ సోదరుల ఆరాధ్య దైవంగా భావించే బీరప్ప స్వామి మరియు మహంకాళి అమ్మ వారి బోనాల పండుగ ఘనంగా జరిగిన సందర్భంగా, కల్వకుర్తి ఉద్యమాల ముద్దు బిడ్డా, మాజీ జాతీయ బీసీ కమిషన్ మెంబర్ శ్రీ తల్లోజు ఆచారి గారు ఈ అత్యంత వైభవంగా జరిగిన ఉత్సవంలో పాల్గొని డోలు వాయిస్తు అక్కడి యువతను ఉర్రూతలుగిస్తున్న ఆచారి గారు..

11/11/2021

పాలమూరులో యాదవ సదర్ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన ఉమ్మడి పాలమూరు జిల్లా ముద్దు బిడ్డా, కల్వకుర్తి నియోజక వర్గం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఉద్యమ నాయకుడు జాతీయ బీసీ కమిషన్ మెంబర్ శ్రీ తల్లోజు. ఆచారి అన్న స్వామి

07/11/2021

జై హింద్ జై భారత్ జై శ్రీరామ్ జై బీజేపి జయహో మోడీజీ జయహో.

Videos (show all)

తెలంగాణ రాష్ట్రంలో  నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో నయా నైజాం నవాబు దొర కుటుంబీకులు చేసిన మోసాలను మర్చిపోం అంటున్న ప్రజా...
కల్వకుర్తి నియోజక వర్గంలో  40 సంవత్సరాల నుండి ఈ నియోజక వర్గం పేద ప్రజల కోసం, అనేక ఉద్యమాలు చేసి, 5సార్లు ఓడిపోయిన, మళ్లీ...
కల్వకుర్తి నియోజక వర్గంలో ఎందరికో ఓటు వేసిన ఈ బామ్మ గారి మాట వినండి. బామ్మ ను చూసైనా మారండి. మార్పు రావాలి.. మార్చాలి..ఈ...
పాపిష్టి పాలన పాపం పండినట్టుంది..వామ్మో ఇవేం తిట్ల పురాణం రా నాయనా!అవినీతి, నియంతృత్వ, నయా నైజాం నవాబు దొర కుటుంబ పాలనకు...
కాషాయం రంగా మజాకానా! కమలం పువ్వు జెండా కదలివచ్చిన చిరు చిరుతల చిందులు..కమల దళం దళపతి ఆచారి గారి ఆనందానికి అవధులు లేకుండా...
తెలంగాణలో బిజెపి చివరి క్షణం వరకు రాజకీయ ప్యూహాలకు పదును పెట్టి, ప్రత్యర్థుల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ, బ్రహ్మ అస్త్రాలు...

Website