Siripangi Swamy

Siripangi Swamy

CPM Valigonda mandal Secretery
CPM District Committee member
yadadribhongir

01/01/2024
09/12/2023

ఒకటి రెండు రోజులే డబ్బులు అవసరం!
తర్వాత ప్రజలకి బ్రతుకు ముఖ్యం!!
బ్రతుకు నిచ్చేది ఎర్రజెండా
బ్రతుకు కోసం పోరాడేది కమ్యూనిస్టు..
ఇది జనమెరిగిన, జగమెరిగిన సత్యం.

04/12/2023

సీపీఎం కార్యకర్తలరా కమ్యూనిస్టు శ్రేయోభిలాషులారా ఓట్లు తక్కువొచ్చాయని సీట్లు రాలేదని మనకెందుకు బాధ ....ఎందుకు నిరాశతో బాధపడుతావ్....

నీవ్వు కాదు బాధ పడాల్సింది కాలే కడుపులకు కారణమైనవి బూర్జువా పార్టీలని తెల్సినకుడా వారిచ్చే రూ"500/2000 ఓటును అమ్ముకున్న పేదోడు భవిష్యత్ 5 ఏండ్లు బాధపడాలి

దళితులు తినే తిండి మీద కట్టే బట్టలమీద ఆంక్షలు పెట్టినప్పుడు కులం పేరుతో దాడులు జరిగినప్పుడు తక్కువ కులం వాడు అంటూ పండుగలు ఉత్సవాల్లో అవమణిచినప్పుడు నాకు ఎవ్వడురా దిక్కు అంటూ బాధపడాలి....

ఉపాధిహామీ పథకంలోనే వ్యవసాయ రంగంలోనే నీకు శ్రమకు తగిన వేతనం/కూలీ నెలల తరబడి రానప్పుడు పని ప్రదేశంలో అతన్ని/ఆమెను అవమణిచినప్పుడు నాకు తోడు నిలిచి నా పక్షాన మాట్లాడేందుకు ఎవ్వరూ లేరా అంటూ బాధపడాలి .........వారికి లేని బాధ నీకెందుకు...

ఒక కంపెనీలొనే ఒక మిల్లులోనో అసంఘటిత రంగంలోనో ప్రభుత్వ రంగంలో కాంట్రాక్ట్ కార్మికుణ్ణి ఒక యజమాని శ్రమను దోచుకున్నప్పుడు ప్రశ్నిస్తే ఉద్యోగంలో నుండి తొలగించినప్పుడు అండగా ఉండేవాడు లేడని వారు బాధపడాలి .......నీకెందుకు బాధ

రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక సరియైన ఎరువులు విత్తనాలు లేక చేసిన అప్పులు తీరక ఏమి చేయాలో అర్థం కాక ప్రభుత్వంపై ముందుండి కొట్లాడేవాడు లేక అతడు బాధ పడాలి .......నీకెందుకు బాధ

సరౌభౌమత్వ దేశంలో మతం పేరుతో కులం పేరుతో దళితులపై గిరిజనులపై ముస్లింలపై క్రిస్టియన్ల పై దాడులు జరుగుతున్నప్పుడు మాకు అండగా ఉండేవారు ఎవ్వరూ లేరే అని వారు బాధపడాలి ....నీకెందుకు బాధ

తాతల కాలం నుంచి వివిధ వృత్తి పరంగా జీవనాన్ని కొనసాగిస్తూ అనేక సమస్యలు ఎదుర్కొంటు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఎత్తయిన తాడిచెట్లు ఎక్కుతూ ఎప్పుడు కింద పడిపోతాడో తెలియని గీతన్నకు,24 గంటలు బట్టలు నేసే పుట గడవని నేతన్నకు దుమ్ముదులిలో పొద్దుందాక గొర్రెలు కాచి తెల్లవారని బ్రతుకుతో బాధపడే వారికి అండగా మాట్లాడేవారు లేనందుకు వారికి లేని బాధ .......నీకెందుకు??

అవును వారే బాధపడాలి నీవ్వు నేను కాదు ....పాలకులు దొంగలు మాటలతో కాలం గడిపేవారు అని తెల్సిన వారికే ఓట్లు వేసినందుకు గొర్రె కసాయోన్ని నమ్మినట్లు వారినే నమ్మే ప్రజలు బాధపడాలి నీకెందుకు బాధ ....

నియంతృత్వం తో మాయమాటలతో ప్రభుత్వాలను నడిపే పాలకులు తాత్కాలికంగా విజయాలను పొందవచ్చు కానీ వారిమీద ప్రజల భ్రమలు తొలిగిపోయినప్పుడు ప్రజలే చైతన్యవంతులైతారు ఎంత పెద్ద రాజ్యలైన కూలిపోక తప్పదు...ఎదురులేదన్న నియంతలు ఎందరో కాలగర్భంలో కలిసిపోయారు నేటి పాలకులకు కూడా ఏదో ఒక రోజు రానేవస్తుంది.చరిత్ర చెప్పే సాక్షం ఇదే

కమ్యూనిజంగాని, సీపీఎం గాని నేడు విజయాలు పొందకుండొచ్చు కానీ రానున్నది"" ఏయిజం''అదే అదే'' కమ్యూనిజం ''

05/09/2023

#తెలంగాణసాయుధ పోరాటం వర్ధిల్లాలి

05/09/2023

#వీరతెలంగాణ_సాయుధపోరాట_గాధలు
-----------------------/--------------------------
వలిగొండ మండల సుంకిశాల వీరుల చరిత్ర తెలుసుకుందాం...*

*తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు ( సెప్టెంబర్ 10-17-2023)
-------------------------------
తెలంగాణ పల్లెల్లో ప్రతి ఊరికి ప్రతి మనిషికి ఒక విప్లవ చరిత్ర ఉంది. నిరంకుశ ఫ్యూడల్ పరిపాలన నుండి విముక్తి చెందడానికి ఒక సర్వాయి పాపన్న,రాచరికం రాక్షసత్వాన్ని సవాల్ చేసిన సమ్మక్క సారలమ్మలు,అడవి బిడ్డల ఆత్మగౌరవం స్వపరిపాలన కోసం పోరు సల్పిన రాంజీ గోండు, జల్ జంగల్ జమీన్ కోసం ఫోరు సల్పిన కొమరం భీమ్ లు ఉన్నారు.

ఫ్యూడల్ నైజాం,రాజకారు, జాగీర్దార్,పటేల్,పట్వారీల పరిపాలన దోపిడీ,పీడనల నుండి విముక్తి కోరుతూ వారి బాధలు భరించలేక బంధుకులు పట్టించిన ''ఆంధ్ర మహాసభ'' ఆ తర్వాత సంఘమయింది అది క్రమంగా కమ్యూనిస్టు పార్టీగా మారి పీడిత జనాన్ని చైతన్యపరిచి కూడు,గూడు తమ విముక్తి కోసం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్వహించింది.
ఈ వీరోచిత పోరాటంలో అనేక పల్లెలలోని,పట్టణాల్లోని ప్రజలందరూ పాలుపంచుకొని తమ వంతు కర్తవ్యాన్ని నిష్టతో నిర్వహించారు.నాటి నల్లగొండ జిల్లా నేటి యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో భాగమైన వలిగొండ మండలంలోని సుంకిశాల కూడా దీనిలో భాగం అయింది అగ్రభాగాన నిలిచింది*
నాటి నైజాం నవాబు,జాగిర్దార్,పటేల్ పట్వారిల,దోపిడీ,పీడనలకు వ్యతిరేకంగా సాగిన మహత్తర వీర తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో వలిగొండ మండలానికి ఓ ప్రత్యేకత ఉంది సుంకిశాల గ్రామంలో నైజాం, జాగిర్దారులకు వ్యతిరేకంగా అనేకమంది పోరాడి నెలకొరిగిన చరిత్ర కలదు అందులో అగ్రగణ్యుడు కామ్రేడ్ ఫైళ్ల రామచంద్రారెడ్డి ఆయనను అలియాస్ పీఆర్ గా కూడా నాడు పిలుచుకునే వారు..ఆయనతో పాటు భూస్వామ్య కుటుంబంలో పుట్టి పెరిగిన
కామ్రేడ్ ఫైళ్ల పద్మారెడ్డి,దేశపాక ముత్తయ్య,పోలేపల్లి పెంటయ్య,గుర్రం కృష్ణా రెడ్డి,బొక్క బాల్ రెడ్డి,తొడిగెల సాయిరెడ్డి,తొడిగెల వెంకట్ రెడ్డి,బొక్క వెంకట్ నర్సింహారెడ్డి,సత్యనారాయణ రెడ్డి,రామలింగారెడ్డి ల జీవిత చరిత్ర వారి పోరాట అనుభవాలు తెలుసుకుందాం...
సుంకిశాల గ్రామంలో మాల్ పటేల్ గా ఉన్న పైళ్ల ఎల్లారెడ్డి కుమారుడే ఫైళ్ళ రామచంద్రారెడ్డి,గ్రామంలో మరో మాల్ పటేల్ గా ఉన్న ఫైళ్ల మల్లారెడ్డి కుమారుడు ఫైళ్ల పద్మారెడ్డి ల నాయకత్వం లో సుంకిశాలకే ఓ చరిత్రను ఏర్పరిచారు
ఫైళ్ల రామచంద్రారెడ్డి తన చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి అనాధగా మిగిలాడు తన మేనత్త వద్ద చోల్లేరు గ్రామంలో పెరిగాడు 10 సంవత్సరాల వయసు వచ్చేనాటికి పెంచిన మేనత్త కూడా అతనికి దూరమైంది ఆదరించే వారు కరువై ఎవరో సహకారంతో హైదరాబాదులోని ''మార్వాడి అనాధ ఆశ్రమంలో'' చేరి మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణుడై బయటికి వచ్చాడు.తర్వాత చదువుకోలేని పరిస్థితుల్లో రెడ్డి హాస్టల్ లో హౌస్ మాస్టర్ గా చేరాడు అప్పటికే రెడ్డి హాస్టల్లో ఒకవైపు స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో అనేకమంది యువత రగిలిపోతున్నారు,మరొకవైపు నైజాం దొరల అరాచకాల పై చర్చ జరుగుతుండేది. ఈ సందర్భంలో వాటన్నిటిని విని రెడ్డి హాస్టల్ లో ఉన్నటువంటి నాయకులకు చేరువై వారి దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు చదివి ఎలాగైనా తన సొంత గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఈ అరాచకాలను రూపుమాపాలని ఉద్దేశంతో కొన్నాళ్ల తర్వాత తాను చేస్తున్న వసతిగృహం ఉద్యోగం మారి తన సొంత గ్రామమైన సుంకిశాలకు తన మకాం మార్చాడు. సుంకిశాలలో తన సమీప బంధువుగా ఉన్న పైళ్ల రామక్కకు సంతానం లేదు అప్పటికే ఆమె భర్త చనిపోయాడు తనకున్న వ్యవసాయ పొలంలో వ్యవసాయం చేయించుకుంటూ ఉంటుంది తన బంధువులు ఎవరో సలహా ఇచ్చారు పైళ్ల ఎల్లారెడ్డి కుమారుడు ఫైళ్ల రామచంద్రారెడ్డి వసతిగృహంలో చదువుకొని తిరిగి ఊర్లోకి వచ్చాడని ఆ అబ్బాయిని నీవు దత్తత తీసుకుంటే నీకు చివరి రోజుల్లో ఆసరా ఉంటాడని చెప్పారు. దీంతో పైళ్ల రామక్క అతన్ని దత్తత తీసుకున్నది అప్పటికి ఆ గ్రామంలో ఫైళ్ల పద్మా రెడ్డి
ఈ నైజాం రజాకార్ల,దొరల,జాగిర్దారుల అరాచకాలకు వ్యతిరేకంగా గాంధీ వెంకట నరసింహారెడ్డి నాయకత్వంలో ప్రజల్ని చైతన్యం చేస్తున్నాడు ఆ సందర్భంలో ఊర్లోకి వచ్చిన ఫైళ్ల రామచంద్రారెడ్డి
ఫైళ్ల పద్మారెడ్డికి వరుసకు అన్న అవుతాడని మరోవైపు అతడు కమ్యూనిస్టు భావాజాలంతో ఉన్నాడని తెలియడంతో సంతోషపడి ఇద్దరు మంచి మిత్రులు అయ్యారు.
ఫైళ్ల పద్మారెడ్డిని వారి తండ్రి మల్లారెడ్డి బాగా చదివించాలని భావించి మోటకొండూర్ ప్రభుత్వ పాఠశాలలో చదివించాడు చదువుపై ఆసక్తితో పాటు పద్మారెడ్డి పేదలంటే దయతో మర్యాదతో ఉండేవాడు,ఎక్కడ నేను మాల్ పటేల్ కొడుకును అనే భావం లేకుండా అందరితో కలిసి పోయేవారు తన తండ్రి ఆరోగ్యం క్షీణీస్తోందని తెలిసి గ్రామానికి వచ్చి తన వ్యవసాయం చేస్తుండగా తండ్రి చనిపోయారు వ్యవసాయంలో పనిచేసే కూలీల శ్రమను చూసి చలించిపోయాడు 'రైతులనుండి జాగీర్దార్లు కౌలు రూపంలో ముప్పావు భాగం తీసుకోవడంతో వ్యవసాయం పై ఆధారపడిన రైతులు,కూలీలు అర్ధకలితో అలమటిస్తున్నారని'
ఈ దోపిడీ మా ముత్తాతల కాలం నుండే ఇదే తంతు కొనసాగుతుందని దీన్ని నిర్మూలించాలని భావించి రైతుల్ని కూలీలని ఏకం చేశాడు,మన కష్టాన్ని వారు దోచుకుని విలాసంతమైన జీవితం గడుపుతున్నారని ''మనం రెక్కలారా కష్టం చేసిన ఇలాంటి ఫలితం లేదని'' దీనికి పరిష్కార మార్గం వారిపై పోరాడడమే అని భావించి తాను భూస్వామ్య కుటుంబంలో పుట్టిన కష్టజీవుల పక్షాన ఆలోచించాడు.
ఆరోజుల్లోనే అతనికి తోడుగా పైళ్ల రామచంద్రారెడ్డి రావడం వారి యొక్క పోరాటానికి మరింత తోడు బలం ఏర్పడింది.
పైళ్ళ రామచంద్రారెడ్డి మంచి అధ్యయనశీలి అప్పుడప్పుడు నాలుగైదు రోజులకొక పర్యాయం హైదరాబాద్కు వెళ్లి వస్తుండేవాడు. ఇంటిలో మాత్రం చిన్నపాటి లైబ్రరీ ఉండేది దానిలో రష్యా, చైనా,వివిధ కమ్యూనిస్టు దేశాల నవలలు ఉండేవి వాటిని గ్రామంలోని యువకులకు ఇచ్చి చదవమని ప్రోత్సహిస్తుండేవాడు ముఖ్యంగా ఆ రోజుల్లో ప్రతి కమ్యూనిస్టు కార్యకర్త ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమ్మ నవల 'మాక్సింగ్గోర్కీ' చదివి ఇతరులతో చదివించేవారు ఆ విధంగా ఆ యొక్క నవలను గ్రామంలోని అనేకమందికి ఇచ్చి చదవమని చెప్తుండేవాడు తన తల్లి అయిన రామక్క కూడా నవలలో ఉన్న పాత్రల గురించి వివరించి నీ దగ్గరికి వచ్చిన వారికి ఈ విషయాలు చెప్పాలని చెప్తుండేవాడు ఆ గ్రామంలో ఉన్న యువతను చేరదీసి ఆంధ్ర మహాసభ కార్యక్రమాల గురించి కమ్యూనిజం గురించి అధ్యయన తరగతులు నిర్వహిస్తుండేవాడు కొద్దికాలంలోనే గ్రామంలో ప్రజలందరూ రామచంద్రారెడ్డి ని ఆప్యాయంగా చూడడం అలవాటు చేసుకున్నారు ఆరోజు నాటికి సుంకిశాలకు పోస్టు సౌకర్యం లేకుండేది పక్కన మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న వెలువర్తి లో పోస్ట్ ఆఫీస్ ఉండేది 'గోల్కొండ' పత్రిక కు చందా చెల్లించి తెప్పించేవాడు ప్రతిరోజు సాయంత్రం వెలువర్తికి అతడే స్వయంగా వెళ్లి తీసుకొచ్చేవాడు ఆ పత్రికను రాత్రిపూట రైతులందరినీ ఒక దగ్గరికి సమీకరించి చదివి వినిపించేవాడు రైతులందరూ రాత్రిపూట భోజనాలు చేసి రామచంద్రారెడ్డి ఇంటి వద్దకు చేరుకునేవారు గంటలకి గంటలసేపు గ్రామంలో గ్రామం చుట్టూ ఉన్నటువంటి ఇతర గ్రామాల్లో జరుగుతున్నటువంటి దోపిడీ,అరాచకాలకు వ్యతిరేకంగా అనేక విషయాలపై వారి మధ్యన చర్చ జరుగుతుండేది దేశంలో జరుగుతున్న జాతీయ ఉద్యమం గురించి ఒక పక్కన
మరో పక్కన జాగిర్దారుల పీడను వదిలించుకోవడం కోసం మనం అందరం ఆంధ్ర మహాసభలో సభ్యులుగా చేరాలని రైతులందరినీ ప్రోత్సహించేవాడు రామచంద్రారెడ్డి,పద్మారెడ్డి ల యొక్క ఉపన్యాసాల వల్ల అక్కడున్న రైతులందరిలో చైతన్యము ఐక్యమత్యము,నూతన ఉత్సాహము కలిగింది రామచంద్రారెడ్డి,పద్మా రెడ్డి గార్ల ఆహ్వానం మేరకు ఆంధ్ర మహాసభ నాయకుడైన ఆరుట్ల రామచంద్ర రెడ్డి వారి సతీమణి ఆరుట్ల కమలాదేవి, ఆరుట్ల లక్ష్మీనరసింహారెడ్డిలతో కూడిన బృందం సుంకిశాల గ్రామానికి చేరుకున్నారు అప్పటికే వీరి యొక్క పోరాట చరిత్ర గురించి తెలుసుకున్న ఆ గ్రామ ప్రజలు రైతులు కూలీలు రామచంద్రారెడ్డి ఇంటికి పెద్ద ఎత్తున గుమ్మిగూడినారు అక్కడికి వచ్చిన వారితో రైతులు కూలీలు అనేక సమస్యలను చెప్పుకున్నారు జాగీర్దార్ కు ధాన్యం రూపంలో గల్లా కొలిచే విషయంలో జరుగుతున్న దోపిడీ భావి మీద గాని చేలకల్లో గాని తాము పెంచుకున్న పండ్లచెట్లకాయలు తమ అనుభవించడానికి వీలు లేదు జాగిర్దారుల అనుమతి తీసుకోవాలని పెట్టిన ఆంక్షలు అనేక విషయాలపై పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి దీనికి మనం ఏం చేద్దాం చెప్పండి అంటూ అక్కడికి వచ్చిన నాయకులు గ్రామానికి చెందిన ప్రజల్ని ప్రశ్నించారు?
దీనికి మీరు మీ గ్రామంలో ఆంధ్ర మహాసభ గా ఏర్పడాలని దీని ద్వారా సంఘం పెట్టి మన హక్కులు సాధించుకోవాలని చెప్పారు వెంటనే ఆ గ్రామంలో ఆంధ్ర మహాసభ ఏర్పడింది
ఈ ఆంధ్ర మహాసభకు పైళ్ల రామచంద్రారెడ్డి,పద్మారెడ్డి,గాంధీ వెంకట నరసింహ రెడ్డిలు నాయకత్వం వహించారు సుంకిశాల గ్రామంలో ఏర్పడిన ఆంధ్ర మహాసభ కమిటీకి నాయకునిగా బొక్క వెంకట నరసింహారెడ్డిని ఎన్నుకున్నారు కానీ గ్రామంలో ఉన్న గ్రామ అధికారులు ఆంధ్ర మహాసభ సభ్యత్వం తీసుకోవడానికి నిరాకరించి ఎవరు తీసుకోవద్దని హెచ్చరికలు జారీ చేశారు 1941 ప్రాంతంలో సుంకిశాలలో ఏర్పడిన ఆంధ్ర మహాసభ జాగిర్దారుకు 'మహాజరు నామ' వ్రాసి అందజేసినారు అందులో రైతుల ఎదుర్కొంటున్న సమస్యలు సాగునీటి వసతికై రైతులు పడుతున్న ఇబ్బందులు మోటబావి తవుటకు అయ్యే ఖర్చు బావి నుండి నీరు తోడుటకు రైతులు ఎన్ని ఇక్కట్లు పడుతున్నారో చెప్పి ఇంత కష్టపడినా తర్వాత పొలంలో పండే పంట ఎంత వస్తుందో గల్లా సర్కారుకు ఎంత ఇవ్వవలసి ఉంటుందో అన్ని వివరాలు హాజరునామాలు పేర్కొన్నారు తాము సాగు చేస్తున్న భూమిలోనున్న చెట్లు పుట్టపై తమకే హక్కులు ఉండాలని కౌలు చెల్లింపు ఇతర గ్రామాల్లో సర్కారు నిర్ణయించిన రీతిగా డబ్బు రూపంలో ఉండాలని పేర్కొన్నారు వారు ఇచ్చిన డిమాండ్స్ తో ఒకేసారి జాగీర్దార్ అగ్గిమీద గుగ్గిలమయ్యాడు తన దయ ధర్మాలపై ఆధారపడి బతికే రైతులకు ఇంత ధైర్యం ఎలా వచ్చిందని తనతో హక్కులు డిమాండ్ చేస్తారా అని ఆగ్రహించాడు ఇలాంటి ధిక్కారస్వరాన్ని ఎలా అణచివేయాలో తన మిత్రులైన జాగీర్దార్లను సంప్రదించాడు ప్రభుత్వ అధికారులను ఆశ్రయించాడు ఈ రైతులంతా తిరగబడ్డది కేవలం పైళ్ల రామచంద్రారెడ్డి,పద్మా రెడ్డి లు ఊరిలో ఉండడం వల్లనే వారు రైతులకు ఎగదోస్తున్నారని ఇందులో రైతులది ఎలాంటి తప్పు లేదని మీకు మేము అండగా ఉంటామని కొంతమంది రైతులను హైదరాబాదుకు పిలిపించి జాగీర్దార్ వారితో మీటింగ్ ఏర్పాటు చేసి చెప్పాడు అయినా రైతులు వినలేదు. ఆంద్ర మహాసభగా ఏర్పడిన విషయం అందులో మేము సభ్యత్వం తీసుకున్న విషయం ప్రతిదీ అక్కడ చెప్పారు మా సమస్యల్ని పరిష్కారం కేవలం ఆంధ్ర మహాసభ మాత్రమే పరిష్కారం చేస్తుంది అని భావంతో ప్రజలు జాగీర్దార్ కు చెప్పి అక్కడ నుంచి వెళ్లి వచ్చారు కొద్ది రోజుల తర్వాత జాగీర్దార్ మంది మార్బలంతో సుంకిషాలకు వచ్చాడు రైతులందరినీ పిలిపించి మీరంతా ఎప్పటి మాదిరిగానే నిర్ణయించిన గల్లా చెల్లించండి ఇప్పుడెప్పుడో నిర్ణయించిన గల్లా కాదు ఇది మీ నాన్నలు మీ ముత్తాతలు నాటి నుండి వస్తున్న తతంగం కాదని కొత్తగా ఏర్పాటు చేయడానికి వీలు లేదు నేను సాగునీటి వసతి ఏర్పాటుకు చెరువులు బాగు చేయిస్తాను అని అన్నాడు అయినా అక్కడున్న రైతులు ఒప్పుకోకపోవడంతో ఆంధ్ర మహాసభకు నాయకులుగా ఉన్న బొక్క వెంకట నరసింహారెడ్డి రైతుల పక్షాన నిలిచి ఇది మేమంతా సమిష్టిగా చేసిన నిర్ణయంతోనే మీకు మా డిమాండ్స్ ను తెలియజేశాం మీకు వీలైతే చేయండి లేకపోతే మా భూముల పైకి మరొకడు ఎట్లా వస్తాడో చూస్తామని మూకుమ్మడిగా చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్లిపోయారు దీంతో ఊర్లో యుద్ధ వాతావరణం ఏర్పడింది జాగీర్దార్ గ్రామంలో ఉన్న గ్రామ అధికారులను పిలిపించి వారు చేస్తున్న భూములను బదలాయింపు చేయబోతున్నామని వారందరికీ వర్తమానం పంపమని ఆదేశించాడు అయినా రైతులు వినలేదు చావో బ్రతుకు ఈనెల మీదనే తేల్చుకుంటామని పట్టుదల పెరిగింది వారిలో అప్పటికే ఆంధ్ర మహాసభ రైతుల కూలీల పక్షాన పోరాడుతున్న సంఘం అండగా ఉందని ధీమా వారిలో పెరిగింది
జాగీర్దార్ చివరి ప్రయత్నం గా ''మోహితేమీన్ను'' కలిసి తన జాగిరి రైతుల పరిస్థితి వివరించాడు ప్రభుత్వ పరంగా మీకు ఏమి సహకారం చేయలేము ఆంధ్ర మహాసభ ధైర్యంతో వారు తిరుగుబాటు చేస్తున్నారని ఈ ఉద్యమాన్ని ఆదిలోనే తుంచుటకు ప్రభుత్వం కృషి చేస్తుందని మీరు విచారించకండి నేను రైతులతో మాట్లాడి చూస్తానని చెప్పాడు ఓ రోజు జాగిర్దారు 'మోహేతీమీన్' ఇద్దరూ కలిసి ప్రభుత్వ అధికారులను తీసుకొని సుంకిశాల గ్రామానికి వచ్చాడు రైతులందరికీ పిలిపించి తన తోటలో కూర్చోబెట్టుకొని మోహితీమీన్ రైతులపై గంభీరంగా చూశాడు కానీ ఎవరి ముఖంలో భయంగానీ ఆతృతకాని కల్పించలేదు అందరి ముఖంలో పట్టుదల కండ్లల్లో కసి లాంటిది పసిగట్టాడు తానేమీ మాట్లాడవలెనో ఎట్లా మాట్లాడవలనో ఒక నిర్ణయానికి వచ్చి మొదలు పెట్టాడు మొదట సుంకిశాల జాగిర్దారు రైతుల బాగు గురించి ఏమేమి చేసినాడు ఏమేమి చేయబోతున్నాడు జాకీర్దారు దయ గుణం గురించి వివరించాడు జాగిర్దారుకు ఏమేమి ఖర్చులు ఉంటాయో వాటికి ఎంతెంత ధనం కావలసి ఉంటుందో చెప్పి మీరు గల్లా ఇస్తేనే కదా జాగీర్దార్ ఖర్చుపెట్టగలిగేది నిజాం సర్కార్ ఔదార్యాన్ని పొగిడి సర్కారు చట్టం అమలు కావడానికి పోలీస్ వాళ్ళు ఏం చేస్తారో ఈ సమస్యను పోలీసుల వద్దకు పోవడానికి ప్రయత్నించవద్దు మీరు జాగిర్దారు మాట్లాడుకుని ఈ సమస్యను పరిష్కరించుకోండి ఇవాళ గల్లా మీరు కొత్తగా ఇవ్వడం లేదు ఇదివరకు ఉన్నదే ఇవ్వండి నేను మీకు ఒక సహాయం చేయగలను ఈ మధ్యకాలంలో గల్లా పెంచకుండా జాగిర్దారును ఒప్పిస్తాను మీరు సాగు చేసే భూమిలో పెరిగే చెట్లు వాటి ఫలితాన్ని మీరే అనుభవించే విధంగా నేను చేయించగలరు ఆలోచించండి నాకు ఇప్పుడే సమాధానం చెప్పవలసిన పనిలేదు
రేపు ఉదయం మీరు జాగిర్దారు నేను కలిసి అందరం కూర్చుని మాట్లాడుకుందాం ఇప్పటికి ఇక మీరు వెళ్ళండి మీరు బాగా ఆలోచించుకొని ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటే ఉభయులకు శ్రేయస్కరం అని ముగించాడు ఆ రాత్రి రైతులందరూ రామచంద్ర రెడ్డి ఇంటి వద్ద సమావేశం అయ్యారు రామచంద్ర రెడ్డి పద్మారెడ్డి వెంకట నరసింహ రెడ్డి గార్లు పరిస్థితిని సమీక్షించారు వారికి రైతుల మీద ప్రేమ ఉండి మాట్లాడడం లేదు మీ ఐకమత్యం చూసి పరిస్థితి బేడిసిపోనివ్వరాదని చూస్తున్నాడు మీకు ఇవ్వ చూపిన రాయితులు ఏ విధంగానూ గొప్పవి కావు ప్రధాన సమస్యను పక్కనపెట్టి మాటలు గారిడి చేశాడు ఇనుము వేడి గా ఉన్నప్పుడే దెబ్బలు కొడితేనే కావాల్సిన ఆకారంలో తేవచ్చు మీరంతా ఒకే మాటగా చెప్పండి మేం మాత్రం గల్లా చెల్లించమని ధైర్యంగా ఉండండి రేపు ఐక్యమత్యముతో వెంకట నరసింహారెడ్డి మాట్లాడతాడు మీ అందరి పక్షాన మనం చేయవలసినది మాత్రం వారిని అనుసరించడం మీలో ఎవరు వేరొక విధంగా మాట్లాడరాదు అని గట్టిగా చెప్పారు అప్పటికే కొంతమంది రైతులు భయంతో ఉన్న మనకు ఆంధ్ర మహాసభ సంఘం అండగా ఉంది అని భావంతో ఒకరికొకరు సర్ది చెప్పుకున్నారు మరుసటి రోజు మళ్లీ యధావిధిగా ప్రభుత్వ అధికారులతో జాకీర్దారు మోహతిమీన్ కలిసి తోటలో కూర్చున్నారు రైతులు ఒకరొక్కరుగా అక్కడికి చేరుకున్నారు వెంటనే మోహతి మీన్ నేను మీకు చెప్పవలసింది నిన్ననే చెప్పానని మీరు ఏమి నిర్ణయించుకున్నారో మీరే చెప్పండి అంటూ అడిగాడు. వెంటనే అక్కడున్నా రైతులంతా ఒకరి ముఖం ఒకరు చూసుకుని మేమందరం కలిసి ఒక పెద్ద మనిషిని ఎన్నుకున్నాము రైతుల యొక్క సాదక బాధకాలు వారే మీకు వివరిస్తారు వారి మాటను మేము మీరము అని చెప్పి కూర్చున్నారు మోహతిమీన్ బొక్క వెంకట నరసింహారెడ్డి వైపు చూసి చెప్పండి మీరే రైతు నాయకులటగా అని అన్నాడు వెంకట్ నరసింహారెడ్డి లేచి అయ్యా మేము చెప్పదలుచుకున్నదొకటే మీకు చెల్లించే గల్లా విషయంలో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం మాకు మా పిల్లలకు మూడు పూటలా అన్నం తినే పరిస్థితి కూడా లేదు మేము మీకు చెల్లించే గల్లా ఇకనుంచి ఇవ్వబోము న్యాయంగా మా యొక్క భూములన్ని సర్వే సెటిల్మెంట్ చేయించండి సర్కార్కు రుసుము ఎంత చెల్లించాలో అంతే చెల్లిస్తాం కానీ మీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయిస్తే మేము చెల్లించమంటూ చెప్పాడు ''మరోవైపు ఫిల్లినైనా గదిలో వేసి కొడితే ఊరుకుండదని మీకు తెలుసు'' మీ ఇష్టం మీరు ఏం చేస్తారో చేసుకోండి అంటూ అక్కడున్న రైతులను వెళ్ళిపోదామని చెప్పాడు కొన్ని రోజుల తర్వాత ఏమి చేయలేని పక్షంలో సర్వే అధికారులు పిలిపించి రైతులందరి భూములను సర్వే చేసి కొలతలు వేసి హద్దులు నిర్ణయించారు ఈ విషయంలో ఐక్యంగా పోరాడి ఆంధ్ర మహాసభ స్ఫూర్తితో విజయం సాధించారు
భూమిపై హక్కు భూమిలో ఉన్న చెట్లు పుట్టలపై హక్కులు సంపాదించి పెట్టారు తర్వాత గ్రామంలో ఆంధ్ర మహాసభ కార్యక్రమాలు పెరిగాయి తాము చేసిన పోరాటం విజయవంతమైనందుకు పైళ్ల రామచంద్రారెడ్డి,ఫైళ్ళ పద్మా రెడ్డి వారికి ఆర్గనైజర్ గా ఉన్న గాంధీ వెంకట నరసింహారెడ్డిలు రైతులను అభినందించారు 11వ ఆంధ్ర మహాసభ భువనగిరిలో జరుపుటకు నిర్ణయం అయినది కార్యకర్తలు ఊరు రా తిరిగి సభ్యత్వం కార్యక్రమం వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ప్రచారం మొదలైంది భువనగిరిలో ఆంధ్ర మహాసభ జరుగుటకు ముందుస్థాయి సంఘ సమావేశం జరిగింది రావినారాయణరెడ్డి పదకొండవ ఆంధ్ర మహాసభకు అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైనాడు అంతటితో మితవాదులు ఆంధ్ర మహాసభలకు దూరంగా ఉన్నారు దీనివల్ల 11వ ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టు మహాసభగా జరిగింది మార్క్సిజం అధ్యయనం చేసిన విద్యావంతులైన యువకులు రాజకీయ చైతన్యం ఉండి ఆంధ్ర మహాసభను వేదికగా చేసుకొని పనిచేయుటకు పూనుకున్నారు దీంతో ఆంధ్ర మహాసభ స్వరూపమే మారిపోయింది ఆంధ్ర మహాసభ నాయకత్వన గ్రామీణ ప్రజల పోరాటాలు అక్కడక్కడ ప్రారంభమయ్యాయి ఆంధ్ర మహాసభ నిజమైన ప్రజా సంస్థగా అభివృద్ధి చెందింది ఈ సభలో కౌలుదారులకు రక్షణ,వెట్టిచాకిరి నుండి తక్షణమే విముక్తి,బాధ్యతాయుతమైన ప్రభుత్వం వీటిని సాధనకు కార్యచరణ రూపొందించారు,
ఈ స్ఫూర్తితో సుంకిశాల గ్రామంలో వెట్టి చాకిరీ రద్దు చేయాలని వివిధ వృత్తి దారులు (చాకలి,మంగలి, కుమ్మరి,మాల,మాదిగవాళ్ళను) పిలిపించి ఈరోజు నుంచి వెట్టి చాకిరి మన గ్రామంలో చేయవద్దని మీ వెనుక మేము ఉంటామని ఆంధ్ర మహాసభ మీకు అండగా ఉందని పైళ్ల రామచంద్రా రెడ్డి,పైళ్ల పద్మా రెడ్డి ల ప్రోద్బలంతో కింది కులాల చెందిన వాళ్ళు గ్రామ అధికారులకు పెట్టి చేయమని నిరాకరించారు దీంతో సుంకిశాల గ్రామంలో వెట్టిచాకిరి రద్దయింది.

*రెండవ విజయాన్ని సాధించారు*
గ్రామాలలో ప్రజలంతా ప్రజా కమిటీల ద్వారా పరిపాలన సాధించాలన్నారు మన పోరాటం నిజాం నిరంకుశ పాలన వ్యతిరేకంగానే కానీ ''ముస్లింలకు వ్యతిరేకం కాదని'' ఇది హిందూ ముస్లింల ఐక్యత సాధించాలని నిజాం సర్కారు జాగిర్దారులకు వ్యతిరేకంగా పోరాడాలని శ్రమజీవులంతా ఒక్కటి కావాలని, రజాకార్ గుండాలకు వ్యతిరేకంగా ఆత్మ రక్షణ దళాలు ఏర్పాటు చేయాలని, వెట్టిచాకిరి అంతముందించాలని, బహిరంగంగా విజ్ఞప్తి చేశారు
*సుంకిశాల జాగీర్దార్ భూమిని పేదవారికి పంపకం...*
పైళ్ల రామచంద్రారెడ్డి,పైళ్ల పద్మారెడ్డి గారి యొక్క సూచనల ప్రకారం గ్రామంలో ఏర్పడిన ఆంధ్ర మహాసభ స్ఫూర్తితో
వెట్టి చేస్తున్న జీతగాలకు 120 ఎకరాల భూమిని కమ్యూనిస్టు పార్టీ పంచింది భూమిలేని నిరుపేదలను గుర్తించి భూమి కొలతలు వేసి హద్దులు నిర్ణయించి పంపిణీ చేశారు
*కంచనపల్లి దొర ఆగడాలపై*
పైళ్ల రామచంద్రారెడ్డి,గాంధీ వెంకట నరసింహారెడ్డిల నాయకత్వంలో ఆంధ్ర మహాసభ పిలుపుతో జరుగుతున్న పోరాటంలో ప్రజలు తిరగబడడంతో కంచనపల్లి జమిందార్ గా ఉన్న దొర తట్టుకోలేక ఆంధ్ర ప్రాంతానికి పారిపోయాడు వారి గడిలల్లో ఉన్న ధాన్యాన్ని చుట్టుపక్కల ఉన్న పది గ్రామాలకు చెందిన ప్రజలను పిలిపించి ఫైళ్ళ రామచంద్రారెడ్డి గాంధీ వెంకట నరసింహారెడ్డిలు ఎవరు మోసుకుపోయేంత వారు మోసుకుపోండి అంటూ ప్రజలకు సమాచారం అందించారు ఈ రకంగా ఒకవైపు తమ గ్రామంలో నైజాం రజాకార్లు జాగిర్దారులకు వ్యతిరేకంగా పోరాటాన్ని నడిపిన ఫైళ్ల రామచంద్రారెడ్డి పద్మారెడ్డిలు ఆ తరువాత కమ్యూనిస్టు పార్టీ ఆదేశానుసారం దళాల ఏర్పాటు పూనుకున్నారు గ్రామంలో దళాన్ని ఏర్పాటు చేసే పనిలోగా గ్రామంలో ఉన్న దేశపాక ముత్తయ్య పోలేపల్లి పెంటయ్య తొడిగేల వెంకటరెడ్డి తొడిగెల సాయి రెడ్డి గుర్రం కృష్ణారెడ్డి బొక్క బాల్రెడ్డి లాంటి అనేక మందికి శిక్షణను ఇచ్చి వివిధ ప్రాంతాల దళాల్లో బాధ్యతలు అప్పజెప్పి పంపించారు పైళ్ల రామచంద్రారెడ్డి దళ కమాండర్ గా రాచకొండ ప్రాంతానికి వెళ్లి పని చేస్తున్నారు
వెట్టిచాకిరీ రద్దు చేయాలని డిమాండ్ తో దున్నేవాడికే భూమి కావాలని నినాదాలతో నైజాం రజాకార్లు బెదిరిపోయి యూనియన్ సైన్యాలతో చేతులు కలిపాయి సుంకిశాల గ్రామానికి యూనియన్ సైన్యాలను రాకుండా కనిపెట్టుకుంటూ మిలిటరీ దాడులను గమనిస్తున్నాడు పైళ్ల పద్మా రెడ్డి ఊరిలోనే ఉంటూ వారి దాడులను ఎదుర్కొంటున్నాడు వారికి కొంత ఇబ్బందిగానే మారింది ఆయన మిత్రులు ఆయనకు కొన్ని సూచనలు చేశారు అప్పటికే సుంకిషాల గ్రామంలో ముఖ్యమైన నేతలందరిని పోలీసులు అరెస్టు చేశారు వారందరినీ మీ జాడ గురించి ఆరా తీస్తున్నారు మీకు ఇంత సాహసం అవసరం లేదు మిమ్మల్ని అభిమానించే మేమే మీకు రక్షణ ఇవ్వలేకపోతున్నాం మిమ్మల్ని పట్టుకోవడానికి గ్రామాన్ని అంతా తమ చేతుల్లోకి తీసుకున్నారు మీరు ఏదైనా వేరే ప్రాంతానికి వెళ్లి మీ ప్రాణాలు రక్షించుకోండి అని సూచనలు చేశారు ''పద్మా రెడ్డి మాత్రం నేను మిల్ట్రీ బాలగాలకు భయపడిపోయే పిరికివాడిని కాదు'' ప్రజలతోనే నా మనుగడ అధైర్య పడకండి నా వద్ద రైఫిల్ ఉంది నా వద్దకు వచ్చిన వారిని చంపకుండా నేను చావను నేను కమ్యూనిస్టు పార్టీలో చేరినప్పుడే పోరాటంలో పాల్గొనవలెనని తెలుసుకున్నాను పోరాటంలో వీరునిగా మరణిస్తాను కానీ భయంతో చావను
నా గురించి మీరు బెంగపడవద్దు అని ధైర్యాన్నిచ్చాడు కానీ పోలీస్ ఇన్ ఫార్మర్ వల్ల సుంకిషాల పక్కనే ఉన్న మర్లపాడు లో గల గుట్టలలో తీవ్రమైన జ్వరంతో ఆదమర్చి నిద్రపోతున్న పద్మా రెడ్డిని మిల్ట్రీ క్యాంప్ పట్టుకొని అనేక రకాలుగా చిత్రహింసలు పెట్టారు నాలుగు,ఐదు రోజుల తర్వాత భునగిరికి అటు నల్గొండ జైలుకు తీసుకొని వెళ్లారు చేతి గోర్లు పీకారు,ఒళ్లంతా సిగరెట్ తో కాల్చారు, అనేక చిత్రహింసలు పెట్టారు అయినా సంఘం గురించి ఫైళ్ల రామచంద్రారెడ్డి గురించి ఏమాత్రం చెప్పలేదు నల్గొండ జైలుకు తరలించి పది పదిహేను రోజులు గడిచాయి భువనగిరి కోర్టులో కేసు ఉందనే పేరుతో లారీలో ఎక్కించుకొని నందనం మిలటరీ క్యాంపు తిరిగి తీసుకువచ్చి హింసించారు భువనగిరి వద్దకు లారీ చేరుకోగానే పద్మా రెడ్డిని దింపి తప్పించుకుని పోయి ప్రాణాలు రక్షించుకోమన్నారు నిన్ను వదిలిపెడుతున్నామని పద్మా రెడ్డికి చెప్పారు ఆయన నమ్మలేదు మేజర్ ముఖంలోకి చూశాడు జావ్' అన్నాడు నాలుగైదు అడుగులు వేశాడో లేదో వెనకనుంచి తుపాకితో కాల్చారు
*సమ సమాజ నిర్మాణం కోసం భూమి కోసం భుక్తి కోసం పోరాడిన పద్మా రెడ్డి ప్రజాగాత్రల కుట్రకు బలైనాడు చివరి శబ్దంగా *కమ్యూనిస్టు పార్టీ వర్ధిల్లాలి* *''విప్లవం వర్ధిల్లాలి*'' అంటూ నేలకొరిగిపోయాడు మృత దేహాన్ని వారి కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా నందనం మిల్ట్రీ క్యాంప్ వద్దనే దహనం చేశారు

*పైళ్ళరామచంద్రారెడ్డి అమరత్వం*
★★★★★★★★★★★★★★
హైదరాబాద్ పై పోలీస్ యాక్షన్ జరిగే నాటికి కమ్యూనిస్టు పార్టీ పైళ్ల రామచంద్రారెడ్డిని ఏరియా కమిటీ కార్యదర్శిగా నియమించింది నల్గొండ రంగారెడ్డి జిల్లాలో ఉద్యమాన్ని చూస్తున్నాడు రాచకొండ గుట్టలను స్థావరంగా చేసుకుని కొద్దిమంది దళసభ్యులతో అక్కడే ఉండి ఉద్యమాన్ని సమీక్షిస్తున్నాడటా అనేక ప్రాంతాలకు ఈ ఉద్యమం విస్తృత పరుస్తున్నాడు రాచకొండ గుట్టల వరుస రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ నుండి కొన్ని వందల కిలోమీటర్ల దూరం వరకు నల్గొండ జిల్లాలోని రంగారెడ్డి జిల్లాలోని వ్యాపించి ఉంటాయి కొండలపైన దట్టమైన అడవులు అక్కడక్కడ మైదానం తో కూడిన కొన్ని వందల ఎకరాలు ఉంటాయి. ఆ ప్రాంతంలో చిన్న చిన్న పల్లెలు గిరిజన జాతులు నివాసం ఉండేది అక్కడ క్రూరమైన జంతువుల వల్ల ప్రమాదాలు ఏర్పడుతున్న దళాన్ని రక్షించుకుంటున్నాడు ఓ రోజు రహస్యంగా గృహలో నిద్రిస్తుండగా
ఓ ఎలుగుబంటి తన పంజాతో రామచంద్ర రెడ్డి పై దాడి చేసింది దీనివల్ల సుమారు మూడు నెలల పాటు హైదరాబాదులోని పార్టీ ఏర్పాటు చేసిన డెన్లో వైద్యం చేయించుకుని కోలుకొని మళ్ళీ తిరిగి బాధ్యతల్లోకి వచ్చాడు అప్పటికే సుంకిశాలలో పద్మా రెడ్డి మరణించిన విషయం తెలిసి ఆయన కుంగిపోయాడు యూనియన్ సైన్యాలపై కోపంతోను కసిగా వారి అంతు చూడాలంటూ దీక్షబూనాడు
1951 ఏప్రిల్ మాసంలో జనగామ ప్రాంతానికి చెందిన 6,7 దళాలు మూడు రోజులపాటు రాజకీయ శిక్షణ తరగతులు రాచకొండ గుట్టలో ఏర్పాటు చేశారు సుమారు 70 మంది వరకు దళ సభ్యులు ఈ శిక్షణ తరగతులకు హాజరయ్యారు రాష్ట్ర నాయకులుగా ఉన్న రాజ్ బహదూర్ గౌడ్ పైళ్ల రామచంద్రారెడ్డి సీతారాంరెడ్డి బి.ఎన్.రెడ్డి ఏ వెంకట నరసింహారెడ్డి వంటి రాష్ట్ర జిల్లా నాయకులు మరియు కాచం కృష్ణ మూర్తి గారి దళం, మైసయ్య గారి దళం సభ్యులు పాల్గొన్నారు శిక్షణ తరగతులు పూర్తయి ఎవరి ప్రాంతానికి వారు వెళ్లి పోయారు మరుసటి రోజు ఉదయం 8 గంటలకు సుమారు 600 మంది సైన్యం రాచకొండ గుట్టలను చుట్టుముట్టింది కాల్పులు ప్రారంభించారు అప్పటికే 11అయింది సీతారాంరెడ్డిని అరెస్టు చేశారు కృష్ణమూర్తి నేలపై పాకుతూ కాల్పులు జరుపుతూ తప్పించుకొని పోయాడు రాజ బహదూర్ గౌడ్ పైళ్ల రామచంద్రారెడ్డిని కూడా అరెస్టు చేశారు రాజ్ బహదూర్ గౌడ్ ను హైదరాబాదుకు రామచంద్ర రెడ్డి సీతారాంరెడ్డిని భువనగిరి తరలించారు అనేక విధాలుగా చిత్రహింసలు పెట్టి ఒళ్లంతా నలగొట్టారు రక్తలు కారుతుంటే కారంపొడి చల్లారు,గోర్లలో గుండుసూదులు కుచ్చారు, పార్టీ రహస్యాలు చెప్పమని తక్కిన నాయకులు ఎక్కడ ఉన్నారో చెప్పమన్నారు ఈ రకంగా వారం రోజులపాటు హింసిస్తూనే ఉన్నారు అనేకమార్లు హింసను భరించలేక మూర్చపోయేవారు మూర్చనుండి బయటికి రాగానే మళ్లీ యధావిధిగా హింసించేవారు కానీ ఈ ఇద్దరు నాయకుల నుండి చిన్న రహస్యాన్ని కూడా యూనియన్ సైన్యాలు రాబట్టలేకపోయాయి రాష్ట్ర నాయకులు ఏబిఎస్ కార్పస్ హైకోర్టులో వేశారు కోర్టులో హాజరుపరచమని తాకీదు వచ్చింది అదే రోజు రాత్రి రామచంద్రారెడ్డిని,సీతారాంరెడ్డిని రాచకొండ గుట్టల్లోకి తీసుకెళ్లి 30-5-1951 కాల్చివేశారు తప్పించుకు వెళ్తుంటే కాల్చివేసామని చెప్పారు..

*దేశపాక ముత్తయ్య...*
(జననం 9-11-1925)
నిరుపేద దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి దొరల వద్ద పసుల కాపరిగా పనిచేసేవాడు చిన్ననాటి నుండే మిల్టెంట్గా ఆలోచన పరుడు దళితులు ఊరికి దూరంగా ఎందుకు ఉండాలంటూ ఆలోచించే తత్వం తనలో వచ్చింది. ఊరికి దూరంగా పూరి గుడిసెల్లో మా బతుకులు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించే తత్వం ఆయనలో పెరిగింది వానొచ్చినా, ఎండొచ్చినా వాటిని తట్టుకుంటూ పూరి గుడిసెల్లో మనం ఎందుకు ఉంటున్నాం?? అని తల్లిదండ్రులని ప్రశ్నించే గుణం చిన్ననాటి నుంచే ఉంది. గ్రామంలో జరుగుతున్న ఆంధ్ర మహాసభ కార్యకలాపాలను పరిశీలిస్తూ క్రమక్రమంగా దానికి దగ్గర పైళ్ళ రామచంద్రారెడ్డి ఇంటికి చేరి సంఘం అంటే ఏంది? ఆంధ్ర మహాసభ అంటే ఏంది?? అంటూ ప్రశ్నించడం మొదలు పెట్టాడు ఆ రకంగా ఆయన ఆంధ్ర మహాసభలో సభ్యుడుగా మారి గ్రామానికి వచ్చే నైజాం రజాకార్ గ్రూపులను పసిగట్టే పనిచేసేవాడు ఎత్తైన చెట్లెక్కి గ్రామంలో ప్రజలకు ఆ సమాచారాన్ని అందించేవాడు రామచంద్ర రెడ్డి,పద్మారెడ్డిల స్ఫూర్తితో బాంచన్ అన్న అతని చేతులతో బంధుకులు పట్టించి రాచకొండ దళంలో వికారాబాద్ ప్రాంతంలో దళ సభ్యుడిగా పని చేసే విధంగా సుంకిశాల పోరాటం చైతన్యాన్ని నింపింది.
పోలీస్ యాక్షన్ తర్వాత వికారాబాద్ ప్రాంతంలో దళాలపై పెద్ద ఎత్తున దాడులు అరెస్టులు చేయడం వల్ల గ్రామానికి వచ్చి జీవితాన్ని గడుపుతూ తేదీ 3-11-1998లోఅమరుడయ్యాడు....

*తొడిగల వెంకటరెడ్డి* (జననం 1930) విద్యార్థి దశలోనే ఏడవ తరగతి చదువుతున్న సమయంలో 1947లో నైజాం రజాకారు జాగిర్దారులకు వ్యతిరేకంగా జరుగుతున్న వెట్టిచాకిరి విముక్తి పోరాటంలో అగ్రభాగాన నిలుస్తున్న పైళ్ల రామచంద్రారెడ్డి పద్మా రెడ్డిల పోరాటానికి ఆకర్షితులై తొడిగెల వెంకటరెడ్డి వారి చెంతన చేరాడు క్రమక్రమంగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ గ్రామ రక్షణ దళాల్లో మిల్టెంట్ గా పని చేసేవాడు కమ్యూనిస్టు పార్టీ పుస్తకాలను అధ్యయనం చేయటం చదువురాని ప్రజలకు చెప్పటం చేస్తుండేవాడు ఉప్పల సంఘం ఏర్పాట్లు క్రియాశీలకంగా పనిచేసి భువనగిరి తాలూకాలోని దళంలో సభ్యుడై వికారాబాద్ దళానికి నాయకుడిగా వెళ్లాడు పోలీస్ సైన్యాలకు దొరికిపోయి 1953 నుండి 1956 వరకు జైలు జీవితం గడిపాడు
*గుర్రం కృష్ణారెడ్డి* 196 సంవత్సరంలో జన్మించాడు 1944 సంవత్సరంలో 11వ ఆంధ్ర మహాసభకు పైళ్ల పద్మా రెడ్డి రామచంద్రారెడ్డి తో కలిసి హాజరయ్యాడు రజాకారు ముస్తానపల్లి చోటే మియా క్యాంపు పై దాడి చేసినప్పుడు క్రియాశీలకంగా పని చేశాడు పైళ్ల రామచంద్ర రెడ్డి,పైళ్ల పద్మా రెడ్డి,గాంధీ వెంకట నరసింహారెడ్డి తదితర నేతలకు గుర్రం కృష్ణారెడ్డి బావి వద్దనే సమావేశం ఏర్పాటు చేసుకునేవారు మిల్ట్రీ సైన్యాలు పైళ్ల రామచంద్ర రెడ్డి,పైళ్ల పద్మా రెడ్డి,గాంధీ వెంకట నర్సింహారెడ్డిల అడ్రస్ చెప్పమంటూ రాత్రి సమయంలో పట్టుకొని వేములకొండ ప్రాంతానికి తీసుకెళ్లి కాళ్లు చేతులు కట్టి కాలువ పక్కనే ఉన్న వంకర తాటి చెట్టుకు కాళ్లు పైకి తలకిందికి కట్టి రాత్రంతా కొట్టి హింసించిన రామచంద్రారెడ్డి మరియు ఇతరుల జాడ చెప్పలేదు తన తల్లిదండ్రులకు ఒక్కడే ఆయన అయిన పార్టీ కోసం చావు దాక సిద్ధమయ్యాడు ఈ రకంగా ఆ గ్రామానికి చెందిన అనేకమంది పైళ్ల రామచంద్రారెడ్డి, పద్మారెడ్డిల నాయకత్వంలో వివిధ ప్రాంతాలకు ఉద్యమాన్ని విస్తరించారు అనేక కష్టాలు ఎదుర్కొన్న సరే పార్టీ రహస్యాలను నాయకుల యొక్క అడ్రస్లను చెప్పకుండా నైజాం రజాకార్ల పోలీస్ సైన్యాల చేతిలో చావు దెబ్బలు తిని అమరులయ్యారు....

నాడు నైజాం రజాకార్ మూకలకు జాగిర్దారులకు వ్యతిరేకంగా దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా సాగిన మహోత్తరమైన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో సుంకిశాల గ్రామానికి చరిత్రను సంపాదించిన పైల్ల రామచంద్రారెడ్డి,పైళ్ల పద్మా రెడ్డి, దేశపాక ముత్తయ్య,పోలేపల్లి పెంటయ్య,గుర్రం కృష్ణారెడ్డి,తొడిగల సాయిరెడ్డి,తొడిగల వెంకటరెడ్డి,

20/05/2023

సుందరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శం..
మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో సుందరయ్య 38వ వర్ధంతి

భూస్వామ్య కుటుంబంలో పుట్టి పెరిగిన జీవితాంతం పేదలు వ్యవసాయ కూలీల,కార్మికుల, పేద ప్రజల కోసం పనిచేసిన గొప్ప మహనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య అని ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శం అని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి,మండల కార్యదర్శి వర్గ సభ్యులు మెరుగు వెంకటేశం లు అన్నారు

ఈరోజు మండల పరిధిలోని తుర్కపల్లి, సంగం,వర్కట్పల్లి గ్రామాల్లో పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు
ఈ సందర్భంగా జరిగిన సభల్లో వారు మాట్లాడుతూ భూస్వామ్య కుటుంబంలో పుట్టి పెరిగిన పుచ్చలపల్లి సుందరయ్య పేద ప్రజలు వ్యవసాయ కూలీలు కార్మికుల కోసం తన జీవితాన్ని అంకితం చేశాడని అన్నారు ఉత్తమ పార్లమెంట్ సభ్యునిగా సైకిల్ పై వెళ్లి రాజకీయాల్లో అందరికీ ఆదర్శంగా నిలిచిన గొప్ప మహనీయుడని అన్నారు పిల్లలు పుడితే తనలో స్వార్థం పెరుగుతుందనే భావనతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుని తన జీవితం మొత్తం పేదల కోసం పనిచేసిన త్యాగమూర్తి అని అన్నారు స్వాతంత్ర ఉద్యమ సమయంలో బాల్యంలోనే ఉత్తేజితులై కమ్యూనిస్టు పార్టీకి ఆకర్షితులై దక్షిణ భారతదేశంలో సిపిఎం నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మహనీయుడని సిపిఎం మొదటి జాతీయ కార్యదర్శిగా పనిచేశారని ఎంపీ ఎమ్మెల్యేగా పార్లమెంటు,అసెంబ్లీలో చట్టసభలకు వన్నెతెచ్చిన రాజకీయ సిద్ధాంతకర్త అని అన్నారు ఆయన స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమైందని ఆయన చూపిన దోపిడీ,పీడనలేని సమ సమాజం కోసం,కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం నిర్వహించడమే ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి అని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు భీమనబోయిన జంగయ్య తుర్కపల్లి గ్రామ ఉపసర్పంచ్ వెలమకన్నే బాలరాజు,వలిగొండ పట్టణ కార్యదర్శి గర్దాసు నర్సింహ,సహాయ కార్యదర్శి ధ్యానబోయిన యాదగిరి, సిపిఎం వరకట్పల్లి శాఖ కార్యదర్శి మెట్టు రవీందర్ రెడ్డి సిపిఎం నాయకులు పల్సం స్వామి,సల్ల ఐలయ్య, రాధారపు మల్లేశం, కీసరి దామోదర్ రెడ్డి,పబ్బతి మల్లేశం,గోగు కిష్టయ్య, తుమ్మల సంజీవరెడ్డి, నర్సిరెడ్డి,వనం మురళి, కేసాని మల్లేశం,బండిగారి రాములు, బండిగారి శంకరయ్య,చేగురి రాములు,బొక్క వెంకట్ రెడ్డి, బద్దం మల్లారెడ్డి,సల్లా రాజయ్య,వట్టిపల్లి రాజు,తుమ్మల మల్లారెడ్డి,మాసంపల్లి యాదయ్య,కొలగాని మత్స్యగిరి,వేముల లక్ష్మయ్య,కవిడే కృష్ణ,వెల్మకన్నే ఉదయ్,పలుసం మనోజ్ తదితరులు పాల్గొన్నారు

20/05/2023

*మండల పరిధిలోని తుర్కపల్లి, సంగం,పొద్దుటూర్,జాలు కాల్వ,కెర్చిపల్లి గ్రామాల్లో 'మేడే'జెండావిష్కరణలు*

Photos from Siripangi Swamy's post 13/05/2023

#కేరళ లో 700కుటుంబాలు ో_చేరిక ఎర్రజెండా అందించి పార్టీలోకి ఆహ్వనించిన CPM రాష్ట్ర కార్యదర్శి గోవిందన్ మాస్టార్ …

13/05/2023

కర్ణాటకలో నెల రోజులు పాటు తిష్ట వేసి 600 కిలోమీటర్ల రోడ్ షోలు, వందల బహిరంగ సభల్లో ప్రచారం చేసిన మత ఉన్మాదాన్ని ప్రేరేపించినప్పటికి మత ఉన్మాదాన్ని తన్ని తరిమి 'మోడీ-షా' లకు కర్రు కాల్చి వాతపెట్టిన కన్నడీలు.

Photos from Siripangi Swamy's post 12/05/2023

#అమరజీవి కామ్రేడ్ రొడ్డ అంజన్నకు జోహార్లు...🌷🌷✊✊

అమరజీవి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ రోడ్డ అంజయ్య గారి మొదటి వర్ధంతి సందర్భంగా వలిగొండ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు కల్లూరి మల్లేశం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య మండల కార్యదర్శి సిర్పంగి స్వామి,జిల్లా కమిటీ సభ్యులు బొడ్డుపల్లి వెంకటేష్, అడ్డగూడూరు మండల కార్యదర్శి బుర్రు అనిల్ కుమార్ పోచంపల్లి మండల కార్యదర్శివర్గ సభ్యులు మంచాల మధు పిఎన్ఎమ్ జిల్లా అధ్యక్షులు గంటపాక శివ పార్టీ మండల కమిటీ సభ్యులు కందడి సత్తిరెడ్డి,ఎస్ఎఫ్ఐ రాష్ట్ర జిల్లా నాయకత్వం తోపాటు స్థానిక ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి వేముల నాగరాజు ఎస్ఎఫ్ఐ మండల ఉపాధ్యక్షుడు వేముల జ్యోతి బాబు పార్టీ స్థానిక నాయకులు మారబోయిన ముత్యాలు పల్లె సత్యం తదితరులు పాల్గొనడం జరిగింది*

Videos (show all)

#కమ్యూనిస్టుల ఎజెండా లేకుండా ఈ దేశానికి భవిష్యత్తు ఉందా?? #తమ్మినేని
ఓ మతం మత్తులో కళ్ళు మూసుకుపోయిన అంధ భక్తులారా! ఈ విడియో ను చూడండి మతోన్మాద శక్తుల గురించి వారి కుయుక్తుల గురించి చాల చక్...
#VRA ల హామీలు నెరవేర్చాలి..
#Byebyemodi#SiripangiSwamy
#అంబేద్కర్_విగ్రహావిష్కరణ_సభ రామన్నపేట మండలం నీర్ణముల గ్రామంలోముఖ్యఅతిధులు గా పాల్గొన్న #KVPS రాష్ట్ర అధ్యక్షులు #జాన్_వ...

Website