Sthapathya Kala Parishad

Sthapathya Kala Parishad

The Council of Telugu Sthapathies

05/09/2022

HAPPY TEACHERS DAY to All Gurus and teachers...

Photos from Sthapathya Kala Parishad's post 21/05/2022

ఆలయ సంస్కృతి - స్థాపత్య కళాపరిషత్ కుటుంబ సభ్యులకు మనవి 💐🙏
మన శిల్ప కళాశాలలో చదువుకొని రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయంగా ఆలయ నిర్మాణాలు చేపట్టే స్థాయికి మన వారు ఎదగడం, మన అందరికే కాకుండా మన కళాశాలకు కూడా గర్వకారణం. ఈమధ్య మన తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించే విధంగా చారిత్రక ఆలయ నిర్మాణాలు పూర్తయ్యి వైభవపేతంగా ప్రారంభోత్సవాలు జరిగిన విషయం మనందరికీ తెలిసినదే.
మన స్థాపత్య కళాపరిషత్ ఆధ్వర్యంలో, మన గౌరవ సలహాదారు శ్రీ ఈమని శివనాగిరెడ్డి స్థపతి గారి ప్రోత్సాహం తో, శ్రీ రామానుజ సహస్రాబ్ది- సమతా మూర్తి స్ఫూర్తి కేంద్ర నిర్మాణంలో ప్రధాన స్థపతి గా వ్యవహరించి, రూప శిల్పి గా కీలక భూమిక పోషించి, మన తెలుగు స్తపతుల కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన శ్రీమాన్ డి ఎన్ వి ప్రసాద్ స్థపతి గారిని సత్కరించుకోవాలని అనుకోవడం, రెండు రోజుల క్రితం శ్రీ కిషన్ రెడ్డి గారు వారి కార్యాలయం ద్వారా "21 మే 2022 సాయంత్రం నాలుగు గంటలకు" తేదీని నిర్ణయించి తెలియజేయడం జరిగింది.
సమయం ఎక్కువ లేనందున అందరికీ ఫోన్ లో సమాచారం ఇవ్వడం జరుగుతోంది. మిగతా పనులు చేసుకోవడంలో సమయాభావం వల్ల అందరిని వ్యక్తిగతం గా ఆహ్వానించే అవకాశం లేనందున దయచేసి 21 మే, 2022 సాయంత్రం నాలుగు గంటలకు జరిగే ఆత్మీయ స్థపతి సత్కార కార్యక్రమానికి మన కుటుంబం వేడుకగా భావించి అందరూ హాజరు కావాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము 💐🙏🙏
ఇకముందు కూడా ఇలాగే మరిన్ని కార్యక్రమములను నిర్వహించుకుంటూ, ఉన్నత శిఖరాలను అధిరోహించిన మన స్తపతులందరినీ గౌరవించుకునే సాంప్రదాయాన్ని కొనసాగించు కొందామని తెలుపుతూ...🙏💐
మన సహోదరుడ్ని మనసారా అభినందిస్తూ...ఆశీర్వదించు కోవడానికై అందరికీ స్వాగతం...సుస్వాగతం.
మీ...
వి.సూరిబాబు స్థపతి,
అధ్యక్షులు,
స్థాపత్య కళాపరిషత్
మరియు
స్థాపత్య కళాపరిషత్ కార్యవర్గ సభ్యులు💐

Website