Vyus.in

Vyus.in

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vyus.in, Media, .

11/08/2023
నడిబజార్లో జర్నలిజం.. మైకు తగవుతో మాటకు మాట| Vyus.in #vijayanthi #ntv #tv9 22/06/2023

https://youtu.be/JPJBhiRodDQ

నడిబజార్లో జర్నలిజం.. మైకు తగవుతో మాటకు మాట| Vyus.in #vijayanthi #ntv #tv9 నడిబజార్లో జర్నలిజం.. మైకు తగవుతో మాటకు మాట| Vyus.inTwo Women journalist spit fire among themselves at CMO Andhra Pradesh. One of the journalist posted the...

#NTR a wonderful personality | Exclusive with Chandrahas and KLN | #kvs #ntrcentenary 10/06/2023

https://youtu.be/0tmXVKWiD3M

#NTR a wonderful personality | Exclusive with Chandrahas and KLN | #kvs #ntrcentenary a wonderful personality | Exclusive with Chandrahas and KLN | NTR-A BIOGRAPHY is fascinating, comprehensive, gripping and long over ...

Durga Prasad Full Interview | యాబై ఏళ్లుగా అమ్మవారికి సేవ | #vijayanthi | VVyus.in #bezawada 07/04/2023

https://youtu.be/-Zo_LUmX994

Durga Prasad Full Interview | యాబై ఏళ్లుగా అమ్మవారికి సేవ | #vijayanthi | VVyus.in #bezawada Durga Prasad Full Interview | యాబై ఏళ్లుగా అమ్మవారికి సేవ | | VVyus.in us : https://vyus.in/Follow Us : https://www.fac...

Eenadu @ 50 Dolphin apparao Interview #Eenadu #Ramojirao Margadarsi 06/04/2023

https://youtu.be/RoGhJDo-NMg

Eenadu @ 50 Dolphin apparao Interview #Eenadu #Ramojirao Margadarsi Eenadu @ 50 Dolphin apparao Interview Margadarsiఈనాడు ఎదిగింది ఇలా...ఈనాడు @ 50పాత్రికేయ లోకానికి కొత్త అర్థాలు చెబుతూ.... సరికొత్త భాషను ...

Ujjain Mahakaleshwar Temple Founder Pattapagalu Venkat Rao Interview | Rajahmundry | Vyus.in 06/04/2023

https://youtu.be/rAjEnCnubMA

Ujjain Mahakaleshwar Temple Founder Pattapagalu Venkat Rao Interview | Rajahmundry | Vyus.in Ujjain Mahakaleshwar Temple Founder Pattapagalu Venkat Rao Interview | Rajahmundry | Vyus.inVisit us : https://vyus.in/Follow Us : https://www.faceb...

Subhalekha Sudhakar About K. Viswanath, ఆయ‌న చెప్పిందే అల్టిమేట్‌ | Vyus Subhalekha sudhakar| Vyus 26/12/2022

https://youtu.be/ATLdqV4W5ns

Subhalekha Sudhakar About K. Viswanath, ఆయ‌న చెప్పిందే అల్టిమేట్‌ | Vyus Subhalekha sudhakar| Vyus Subhalekha Sudhakar About K. Viswanath, ఆయ‌న చెప్పిందే అల్టిమేట్‌ | Vyus Subhalekha sudhakar| Vyus Visit us : https://v...

Jayati Lohitakshan a Couple's jounery in to Forest, Exclusive Interview | Vyjayanthi | Vyus 24/12/2022

వీరిని కలవాలని మేమిద్దరం అనుకుంటున్నాం. వారి అంగీకారం తీసుకున్నాం. వారితో కొద్ది సేపు మాట్లాడాక... "మీకు అభ్యంతరం లేకపోతే చిన్న ఇంటర్వ్యూ తీసుకుంటాం" అని అడిగాం. వారు అంగీకరించారు. అయితే మేం కెమెరా తీసుకురాలేదు. నా ఫోన్ లో పావు గంట, మా వారి ఫోన్ లో అరగంట చేయడానికి మాత్రమే స్పేస్ ఉంది. ట్రై పాడ్ మాతో ఉంది. వారు అంగీకరించడంతో మాకు ఆనందం కలిగింది. వీడియో క్వాలిటీ ఎలా ఉందని ఆలోచించకుండా, హాయిగా ప్రకృతిని ఆస్వాదిస్తూ సంభాషించాను. ఆకుల గలగలలు, ఆకుల మధ్య నుంచి సూర్య కిరణాల మిలమిలలు.. పక్షువ కిలకిలారవాల నడుమ మా ఇంటర్వ్యూ చాలా హాయిగా స్వచ్ఛంగా సాగింది. ఆ దంపతులకు అభినందనలు

Jayati Lohitakshan a Couple's jounery in to Forest, Exclusive Interview | Vyjayanthi | Vyus Jayati Lohitakshan a Couple's jounery in to Forest, Exclusive Interview | Vyjayanthi | Vyus వారికి అడ‌వే లోకం. ఒంట‌రి ...

Jayati Lohitakshan a Couple's jounery in to Forest, Exclusive Interview | Vyjayanthi | Vyus 24/12/2022

https://youtu.be/1GFzcn54YOo

Jayati Lohitakshan a Couple's jounery in to Forest, Exclusive Interview | Vyjayanthi | Vyus Jayati Lohitakshan a Couple's jounery in to Forest, Exclusive Interview | Vyjayanthi | Vyus వారికి అడ‌వే లోకం. ఒంట‌రి ...

31/10/2022

జాతకరత్న మిడతంభొట్లు సినిమాలో రాణి , తోటమాలి పాత్రలు వేసిన వారు ఏ రికమెండేషనో మరి.
అస్సలు చూడలేకపోయాం.
పద్మనాభం సింగిల్ మ్యాన్ షో.

జ‌ల‌య‌జ్ఞం - పోల‌వ‌రం - Vyus 02/09/2022

జ‌ల‌య‌జ్ఞం - పోల‌వ‌రం - Vyus పోల‌వ‌రం ప్రాజెక్టుకు ఆనాడు డాక్ట‌ర్ వైయ‌స్ఆర్ చేసింది మిన‌హా ఈనాటి నేత‌లు చేసిందేమీ లేద‌ని.. క‌నీసం ఆ కృషిని .....

జ‌ల‌య‌జ్ఞం - పోల‌వ‌రం - Vyus 02/09/2022

https://vyus.in/index.php/2022/09/02/book-on-dr-ysrs-effort-for-polavaram-released/

జ‌ల‌య‌జ్ఞం - పోల‌వ‌రం - Vyus పోల‌వ‌రం ప్రాజెక్టుకు ఆనాడు డాక్ట‌ర్ వైయ‌స్ఆర్ చేసింది మిన‌హా ఈనాటి నేత‌లు చేసిందేమీ లేద‌ని.. క‌నీసం ఆ కృషిని .....

27/07/2022

ప్రముఖ సినీ నటుడు నాగభూషణం గారి అమ్మాయి, ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ డి లాల్ గారి అబ్బాయి.. ఈ దంపతులను ఈరోజు కలిసి ఇంటర్వ్యూ చేసే అవకాశం దొరికింది. సహృదయులు, ఆదర్శ దంపతులు. వీరి ఇంటర్వ్యూ త్వరలో మా vyus.in చానెల్ లో

రోజుకి 18 గంటలు.. ఆరోగ్యంగా విజయాలు.. 21/08/2021

రోజుకి 18 గంటలు.. ఆరోగ్యంగా విజయాలు.. పరిశుభ్రమైన ఆహారం... రుచికరమైన ఆహారం.. వచ్చినవారిని ఆప్యాయంగా పలకరించటం.. రుచి నచ్చిందా లేదా అని ప్రశ్నించటం.. కస్...

మంచి ఆలోచనకు ఒక్క తల చాలు! - Vyus 17/11/2020

మంచి ఆలోచనకు ఒక్క తల చాలు! - Vyus (రావి కొండలరావు) రావి కొండ‌ల‌రావు గారు… చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్యంత క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన హాస్య న‌టుడు. నిబ‌ద్ధ‌...

atla taddi అట్ల‌త‌ద్దోయ్‌..ఆర‌ట్లోయ్‌! 03/11/2020

అట్ల తద్ది లోని లౌకిక అంశాలను వివరించటానికి చేసిన ప్రయత్నం

atla taddi అట్ల‌త‌ద్దోయ్‌..ఆర‌ట్లోయ్‌! ప్ర‌తి పండుగ‌కీ ఒక ప‌ర‌మార్థం ఉంది. పూర్వం రోజుల్లో పుణ్యం-పాపంతో ముడిపెడితే త‌ప్ప వినేవారు కారు. కార‌ణం పాప భీ....

న‌వ‌రాత్రి-2 18/10/2020

న‌వ‌రాత్రి-2 బాలా త్రిపుర సుంద‌రి అలంకారంలో అమ్మ‌వారు ఈరోజు కొలువుతీరుతారు. ఈ అవ‌తారం స‌మాజానికి ఏం చెబుతోంది. ఏ సందేశం ఇస్.....

Photos from Vyus.in's post 25/06/2020

ప్రశ్నోత్తర రామాయణం.

రచన పురాణపండ వైజయంతి

వెల..150.

రామాయణం ఆది కావ్యం. రచయిత అయిన వాడు రామాయణం రాయాలి అనుకుంటాడుట. ఇది మొదటి పుస్తకం. ఇందులో అన్ని కాండలు ప్రశ్నలు... జవాబుల రూపంలో ఉంటాయి. తండ్రి గారైన ఉషశ్రీ గారి రామాయణం ఆధారంగా సాక్షి దిన‌ప‌త్రిక‌లో ఒక శీర్షిక నిర్వహించారు. వాటికి పుస్తక రూపమే ఈ రామాయణం. పిల్లలు ఆసక్తిగా చదవడానికి బావుంటుంది. మొత్తం ప్రశ్నలు.. జవాబులను చదివితే రామాయణం పూర్తి అవుతుంది.

పుస్తకాలు దొరుకుచోటు విజయవాడ

హైదరాబాద్

ఇంటికే వచ్చి కొన్న వారికి 100 కే ఇవ్వాలని నిర్ణయించారు.

పోస్ట్ లో కావలసిన వారు కొరియర్ ఛార్జ్ అదనంగా పంపాలి. అందుకే 150 పంపితే పుస్తకం కొరియర్ లో పంపగలం.బహుమతులు ఇచ్చేవారికి ఇది మంచి పుస్తకం. ఎక్కువ కొన్న వారికి మరి కొంత డిస్కౌంట్ ఇవ్వగలం.సంప్రదించవలసిన నెంబర్.

Hyderabad:8008551232

Vijayawada: 9848113681

19/06/2020

నాన్నా!

ఇలా ఎన్నిసార్లు పిలిచినా నువ్వు స‌మాధానం చెప్ప‌వ‌ని మాకు తెలుసు.అయినా నిన్ను పిల‌వ‌కుండా ఎలా ఉండ‌గ‌లం నాన్నా! నీ ర‌క్తం పంచి మాకు జ‌న్మ‌నిచ్చావు. మా ఇద్ద‌రినీ రెండు క‌ళ్ల‌లా చూసుకుంటూ, కంటిపాప‌ల్లా కాపాడుతున్నావు.

ఇప్పుడు మ‌మ్మ‌ల్ని ఎవ‌రు కాపాడ‌తారు నాన్నా...

అని నిన్ను మేం ప్ర‌శ్నించం. నీ ర‌క్తాన్ని భ‌ర‌త‌మాత‌కు పంచ‌టం కోస‌మే క‌దా నువ్వు సైన్యంలోకి వెళ్లావు.

చైనా వారితో వీరోచితంగా పోరాడావు.

ర‌క్తం చిందించావు.

భ‌ర‌త‌మాత ఒడిలోకి చేరిపోయావు.

మేం ... నాన్నా! అని పిలిచినా ప‌ల‌క‌ని నువ్వు, నిన్ను నోరారా భ‌ర‌త‌మాత‌, నాన్నా! నా కోసం పోరాడావా, నా ద‌గ్గ‌ర‌కు రా... అని పిల‌వ‌గానే ఆ త‌ల్లి ఒడి చేరావు.

📷

నువ్వు స్వార్థ‌ప‌రుడివి నాన్నా. నీ ర‌క్తంలో దేశ‌భ‌క్తి అనే స్వార్థం నిండి ఉంది.

ఇంత చిన్న పిల్ల‌ల్ని మ‌మ్మ‌ల్ని వ‌దిలేసి అక్క‌డ‌కు ఇంత తొంద‌ర‌గా వెళ్లిపోతావా.

రోజూ మ‌మ్మ‌ల్ని ఎవ‌రు ఎత్తుకుని ఆడిస్తారు..

మాకు బొమ్మ‌లు, చాకొలేట్లు, కొత్త బ‌ట్ట‌లు...

అన్నీ ఎవ‌రు తెస్తారు.

మేం ఏడిస్తే, మ‌మ్మ‌ల్ని ఎవ‌రు ఓదారుస్తారు..

ఇటువంటి మాట‌లు నిన్ను అడిగితే మేం ఒక వీర‌జ‌వాను పిల్ల‌లం ఎలా అవుతాం నాన్నా!

ఇవి ఎవ‌రిని అడిగినా తెస్తారు.

కాని ఎవ్వ‌రూ ఇవ్వ‌లేనిది, నువ్వు మాత్ర‌మే ఇవ్వ‌గ‌లిగేది స్వ‌చ్ఛ‌మైన తండ్రి ప్రేమ‌.

నువ్వు దేశం కోసం మ‌మ్మ‌ల్ని ఇక్క‌డ విడిచి బోర్డ‌ర్‌కి వెళ్లినా, రోజూ నిన్ను త‌ల‌చుకుంటూ...

మా నాన్న‌ను చూసి, భార‌త‌దేశం గ‌ర్విస్తోంది..

అనుకుంటున్నాం.

నీ గురించే కాదు నాన్నా, నీలాగే ఎంతోమంది దేశం కోసం ర‌క్తం ధార‌పోశారు.

వాళ్ల పిల్ల‌లు కూడా మాలాగే అనుకుంటూ ఉంటారు.

దేశ‌భ‌క్తుడి పిల్ల‌లుగా పుట్టే అదృష్టం ఎంత‌మందికి ద‌క్కుతుంది నాన్నా.

మాలాంటి కొంద‌రికి మాత్ర‌మే అందే ఆనందం ఇది.

ఇప్పుడు ప్ర‌తి ఇంట్లోనూ నువ్వే ఉన్నావు.

అంద‌రూ నిన్ను చూస్తున్నారు.

నీ గురించే మాట్లాడుకుంటున్నారు.

క‌ల్న‌ల్ సంతోష్ పిల్ల‌లు అనే మ‌ర‌పురాని కానుక మాకు ఇచ్చావు నాన్నా.

ఇంత‌కంటె మాకు వేరే ఏ బ‌హుమ‌తీ అక్క‌ర్లేదు.

నిజానికి ఎప్పుడూ మాకే బ‌హుమ‌తులు ఇచ్చే నువ్వు, ఇప్పుడు దేశానికి పెద్ద బ‌హుమ‌తి ఇచ్చావు.

నాలుగు రోజుల క్రితం వ‌ర‌కు మా ఇద్ద‌రి ఆలోచ‌న వేరేగా ఉంది.

జూన్ 21న ఫాద‌ర్స్ డే సంద‌ర్భంగా నీకు ఎన్నో బ‌హుమ‌తులు ఇవ్వాల‌ని మేమిద్ద‌రం ప్లాన్ చేసుకుంటున్నాం.

ఇప్పుడు మాత్రం మించిపోయిందేమీ లేదు.

నీకు కొన్న బ‌హుమ‌తులు నీకే ఇస్తాం.

నువ్వు అమ‌రుడివి నాన్నా.

నువ్వు మాతో ఎప్పుడూ దేశం గురించి మాట్లాడుతూనే ఉంటావు నాన్నా.

మేం నీకు ఇచ్చే బ‌హుమ‌తి ఏంటో తెలుసా.

మేం కూడా నీలాగే భార‌త సైన్యంలో చేరి వీరోచితంగా పోరాటం చేసి, భ‌ర‌త‌మాత‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకుంటాం.

ఇదే మేం నీకు ఇచ్చే బ‌హుమ‌తి నాన్నా.

ఈ బ‌హుమ‌తి నీకు న‌చ్చుతుంద‌ని భావిస్తున్నాం.

జైహింద్ నాన్నా

(సృజ‌నాత్మ‌క ర‌చ‌న‌)

- వైజ‌యంతి పురాణ‌పండ