DMHO Siddipet

DMHO Siddipet

This Page provides information about Government Health activities in Siddipet District and provide

14/11/2023
Photos from DMHO Siddipet's post 04/11/2023

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ సమావేశ మందిరం లో జిల్లాలోని నర్సింగ్ ఆఫీసర్స్ కు ఐరిస్క్ ప్రెగ్నెన్సీ ట్రాకింగ్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్ మరియు దక్షత పైన 3 రోజులపాటు నిర్వహించిన శిక్షణ ముగింపు కార్యక్రమంలో గౌరవ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కాశీనాథ్ గారు మాట్లాడుతూ శిక్షణలో పొందిన స్కిల్స్ ఉపయోగించుకొని వారి వారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గర్భిణీల సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టి, ఆసుపత్రులలో ప్రసూతి సేవలను మెరుగుపరచాలని ఆదేశించారు .
అనంతరం శిక్షణలో పాల్గొన్న నర్సింగ్ ఆఫీసర్స్ కు పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ అందజేశారు.
ఈ శిక్షణ కార్యక్రమము లో పిఓఎంహెచ్ఎన్ డాక్టర్ రజిని గారు డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ సౌమ్య గారు పాల్గొన్నారు .

08/08/2023

వారం పాటు
మిషన్ ఇంద్రధనుష్ 5.0 టీకాల కార్యక్రమం :

ఆగస్టు 7 తేదీ నుండి 12 తేదీ ల మధ్య సిద్దిపేట జిల్లా లో మిషన్ ఇంద్రధనస్సు5.0 ప్రత్యేక వ్యాది నిరోధక టీకాల కార్యక్రమం, 12 రకాల వ్యాధుల నివారణ కు నిర్వహించడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కాశీనాథ్ గారు తెలియజేశారు.
ఈ కార్యక్రమం 3 విడతలుగా,3 మాసాల లో

ఆగష్టు 7నుండి 12తేదీ ల్లో, సెప్టెంబరు 11నుండి 16తేదీల్లో , అక్టోబరు 9నుండి 14తేదీల్లో నిర్వహించి,0-5 లోపు పిల్లలు ఇప్పటి వరకు అసలే టీకాలు తీసుకోని , ఏవైనా కొన్ని టీకాలు మిస్సైన వారికి ఈ కార్య క్రమం లో బాగంగా టీకాలు అందించడం జరుగుతుంది.

మన జిల్లాలో ప్రణాళిక ప్రకారం గుర్తించిన ,

0-1 సంవత్సరాల 180 పిల్లలకు,

1-2 సంవత్సరాల 141 పిల్లలకు,

2- 5 సంవత్సరాల 106 పిల్లలకు,

41గర్భిణీలకు
,
214 సెషన్స్ ఏర్పాటుచేసి టీకాలు వేయాలని ఆదేశించారు.

ఇక నుండి ఆశ సహాయంతో( self registration)ముందే U -WIN app లో పేర్లు నమోదు చేసుకొని టీకాలను పొందవచ్చని తెలిపారు.

జిల్లా ఇమ్యునైజేషన్ అదికారి డా.విజయ రాణి గారు ఈ సదవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకొని మిస్సైన పిల్లలందరికి టీకాలు వేయించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు

Photos from DMHO Siddipet's post 02/08/2023

ఈరోజు కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి మిషన్ ఇంద్రధనస్సు టాస్క్ ఫోర్స్ మీటింగ్ మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు ఐసిడిఎస్ సిడిపిఓ లకు అంగన్వాడి సూపర్వైజర్లకు జరిగిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న గౌరవ అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్ గారు ఈ సమీక్ష సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కాశీనాథ్ గారు ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ రజిని గారు డాక్టర్ విజయ రాణి గారు Dy DMHo s డాక్టర్ శ్రీనివాస్ గారు డాక్టర్ సౌమ్య గారు డాక్టర్ వినోద్ గారు డాక్టర్ అజీముద్దీన్ గారు ,డాక్టర్ శ్రీకాంత్ గారు, వైద్యాధికారులు పాల్గొన్నారు.

Photos from DMHO Siddipet's post 14/06/2023

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అసెంబ్లీ కాన్స్టెన్సీ పరిధిలోని విజయవంతంగా ఆరోగ్య దినోత్సవం నిర్వహించారు సిద్దిపేటలో జిల్లా పరిషత్ చైర్మన్ రోజా శర్మ గజ్వేల్లో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి వంటేరు ప్రతాపరెడ్డి దుబ్బాకలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు హుస్నాబాద్ లో ఎమ్మెల్యే వడదల సతీష్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కాశీనాథ్ డాక్టర్ వినోద్ బాబ్జి డాక్టర్ అజీముద్దీన్ డాక్టర్ రజని వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు

12/05/2023
Photos from DMHO Siddipet's post 06/05/2023

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ సిబ్బందితో ఆత్మీయ సమ్మేళనం మరియు వనభోజనాల కార్యక్రమం ఆక్సిజన్ పార్కులో నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథిగా గౌరవ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారు అతిథులు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీ డాక్టర్ శ్రీనివాస్ రావు గారు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి రోజా రాధాకృష్ణ శర్మ గారు పాల్గొన్నారు ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు నా కుటుంబ సభ్యులేనని నిత్యం పని ఒత్తిడిలో పని చేస్తున్న వారికి ఇలాంటి రిక్రియేషన్ కార్యక్రమాలు అవసరమని దీనివల్ల మళ్లీ రిజెనరేట్ అయి అనుకున్న పనులను కచ్చితంగా నిర్వహిస్తారని గౌరవ మంత్రివర్యులు తెలియజేశారు

Photos from DMHO Siddipet's post 24/03/2023

ప్రపంచ క్షయ వ్యాధివ్యాధి దినోత్సవం .
WORLD TB DAY-2023
March: 24th

ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మంత్రి క్యాంపు కార్యాలయంలో గౌరవ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి రోజా రాధాకృష్ణ శర్మగారు , జిల్లా మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి కడవేరు మంజుల రాజనర్స్ గారు ముఖ్యఅతిథిగా విచ్చేసి క్షయ వ్యాధి నివారణ అవగాహన ర్యాలీ జండా ఊపి ప్రారంభించారు. జడ్పీ చైర్పర్సన్ ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రజలకు క్షయ వ్యాధి పైన అవగాహన కల్పించాలని, క్షేత్రస్థాయిలో ఆరోగ్య కార్యకర్తలు లక్షణాలను గుర్తించి, వారిని ఆరోగ్య కేంద్రాలకు పంపించాలని ,వారికి కావలసిన పరీక్షలు నిర్వహించి , పూర్తి చికిత్స పొందే వరకు ఆరోగ్య సిబ్బంది సహకారాన్ని అందించాలని, జిల్లాను క్షయ రహిత జిల్లాగా చేయడంలో, స్వచ్ఛంద సంస్థలు, గ్రామ పెద్దలు అధికారులు, ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని, తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని తెలిపారు.వ్యాధి ,అనంతరం ఈ ర్యాలీని ప్రధాన రహదారి నుండి వెళ్తూ నినాదాలు చేస్తూ పాత ఎం సి హెచ్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు

🔷 ర్యాలీ అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి Dr.J.కాశీనాథ్ గారి ఆదేశాల మేరకు,Dr. అజిముద్దీన్, PO TB అధ్యక్షతన కలెక్టరేట్ కార్యాలయంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో క్షయ వ్యాధి పైన అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించడం అనంతరం సభాధ్యక్షులు డాక్టర్ అజీముద్దీన్ క్షయ వ్యాధి పైన అవగాహన కల్పించారు. అనంతరం క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో సేవలందించిన ఉత్తమ ఉద్యోగులకు ప్రశంస పత్రాలతో పాటు మెమొంటోళ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో Dy.DMHO Dr.Srinivas,Dr.Rajini POMHN,Dr.Umesh Director,Dr.Srinivas Vice principal Hamsa Homeopathy principal,Dy.DEMO,HE,STLS,STS,ANMS,and Ashas attended.

Photos from DMHO Siddipet's post 23/03/2023

ఈరోజు మినిస్టర్ గారి క్యాంప్ కార్యాలయంలో MMDP కిట్లను ఫైలేరియా వ్యాధి గ్రస్తులకు గౌరవనీయ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి కరకమలములచే పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కాశినాథ్ గారు మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా బోదకాలు వ్యాధికి ఎండమిక్ ప్రాంతంగా ఉందని, రాష్ట్రంలో అన్నీ జిల్లాల కంటే అధిక సంఖ్యలో కేసులు ఉన్నాయని, ఈ కేసుల నియంత్రణకు మంత్రి గారి ఆదేశాల మేరకు హుస్నాబాద్ లో మంగళవారం మరియు శనివారం గజేవెల్ ఆసుపత్రిలో రాత్రి పూట ఈ రక్త పరీక్షలు చేయడం జరుగుతుందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

గౌరవనీయుల మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీశ్ రావు గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వము ఫైలేరియా నియంత్రణకు ప్రత్యేక కృషి చేస్తూ,దేశంలోనే మొట్టమొదటగా తెలంగాణ రాష్ట్రంలో మార్బిడిటీ మేనేజ్మెంట్ డిసీస్ ప్రివెన్షన్ కిట్లను అందించడం జరుగుతుందని తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇళ్లల్లో బోధ వ్యాధిగ్రస్తులు వాడుతున్నటువంటి వస్తువులను కొన్ని సందర్భాలలో వారి కుటుంబ సభ్యులు కూడా ముట్టుకోకపోవడం బాధాకరమని అందుకుగాను ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు ఈరోజు ప్రత్యేకంగా ఈ కిట్లను ఇస్తున్నట్లు తెలిపారు .
ఇందులో టబ్బు , జగ్గు , సోపు, టవలు, ఆంటీ ఫంగల్ క్రీములు ఈ ఎం ఎం డి పి కిట్లలో ఉంటాయని, వారంకు రెండు మూడు సార్లు పరిశుభ్రంగా ఫైలేరియా వచ్చిన బాగాలను చేతులను కాళ్ళను శుభ్రపరచుకొనుటగాను వీటిని అందిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు ఫైలెరియా డిపార్ట్మెంట్ ఇస్తున్నటువంటి డిఈ. సి. మరియు ఆల్బెండజోల్ టాబ్లెట్లను సక్రమంగా మింగాలని,ఫైలేరియా పెరగకుండా చూసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు. పారిశుద్ధ్యం చర్యలను తీసుకుంటూ దోమలు లేకుండా చూసుకోవాలని, అలాగే ఫైలేరియా రహితంగా ఉండేందుకు దోమలు కుట్టకుండా చూసుకున్నట్లయితేనే ఈ ఫైలేరియా వ్యాధి ఒకరి నుంచి ఒకరికి వ్యాపించకుండా ఉంటుందని వారు ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లాకు మొత్తము 8121 ఎంఎండీపి కిట్లను బోధ వ్యాధిగ్రస్తులకు అందజేయనున్నట్లు వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, పారామెడికల్ కౌన్సిల్ మెంబర్ పాల సాయిరాం గారు,
ఆర్.టీ.ఓ. మెంబర్ రషీద్, బీఆర్ఎస్ రాష్ట్ర సెక్రెటరీ వేలేటి రాధాకృష్ణ శర్మ, పి ఓ ఎన్ వీ బి డి సి పి డాక్టర్ ప్రభాకర్,
ఎస్సీ కొండయ్య,
పర్యవేక్షకులు కాల్వ చక్రధర్, కొండయ్య, ఫైలేరియా సిబ్బంది వివిధ పీ.హెచ్.సి.ల నుంచి వచ్చిన వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది మరియు ఆశాలు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఈరోజు మొత్తము 847 మందికి ఈ ఎం ఎం డి పి కిట్లను అందించినట్లు తెలిపారు. ఎవరికైతే ఈ ఎం ఎం డి పి కిట్లు అందలేదో వారికి వారి వారి పీహెచ్ సీలలోకి వెళ్లి ఈ కిట్లను ఇవ్వనున్నట్లు ఈ సందర్భంగా డాక్టర్ కాశీనాథ్ గారు తెలియపరిచినారు.

Photos from DMHO Siddipet's post 15/03/2023

సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని 276 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు గాను 228 మందికి టి హెచ్ ఆర్ న్యూట్రిషన్ కిట్టు ఈనెల 6 తేదీన అందించడం జరిగింది మిగిలిన క్షయ వ్యాధిగ్రస్తులకు నిన్నటి రోజు టి హెచ్ ఆర్ న్యూట్రిషన్ కిట్స్ అందజేయడం జరిగింది కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జె కాశీనాథ్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ అజీమోద్దీన్ మంత్రి గారి PA రాము తదితరులు పాల్గొన్నారు

Photos from DMHO Siddipet's post 08/03/2023

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఈరోజు ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు తెలిపారు అందులో భాగంగా జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 35 మంది మహిళా సిబ్బందికి ప్రశంసా పత్రాలు మేమెంటో లను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జై కాశీనాథ్ అందించారు ఈ సందర్భంగా డాక్టర్ జే కాశీనాథ్ మాట్లాడుతూ మన డిపార్ట్మెంట్లో అత్యధికంగా మహిళా సిబ్బంది ఉన్నారని వారి సేవలు ఎంతో ప్రశంసించతగ్గవని తెలిపారు
సామాజికంగాను, రాజకీయాల్లోనూ, ఆర్థిక రంగంలోనూ మహిళలు చాలా ఎదిగారని
అక్కడక్కడ కొనసాగుతున్న అసమానతలపై అవగాహన పెంచేందుకు కృషి చేయాలని. ఈ సంవత్సరం థీమ్ 'బుక్స్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ'.సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాల్లో స్త్రీ, పురుషులు సమానమేననే భావనను ప్రచారం చేయాలని తెలిపారు
కార్యక్రమంలో ఆరోగ్య మహిళ కార్యక్రమ రాష్ట్ర అబ్జర్వర్ Dr శ్రీదేవి ప్రోగ్రాం అధికారులు Dr రజని Dy DMHO లు Dr విజయారాణి Dr శ్రీదేవి Dr వినోదబాబ్జి Dr అజీమోద్దీన్ Dr సాయి Dr శ్రీకాంత్ ,యేసు మేరీ DPHNO D.నాగజ్యోతి Sr Asst మాదన్ మోహన్ సత్యనారాయణ HE తదితరులు పాల్గొన్నారు

Photos from DMHO Siddipet's post 23/02/2023

Photos from DMHO Siddipet's post 16/02/2023

16 th ward

Photos from DMHO Siddipet's post 05/01/2023

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయంలో కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమంలో భాగంగా జూమ్ కార్యక్రమం ద్వారా డాటా ఎంట్రీ ఆపరేటర్లకు మరియు ఏఎన్ఎం లకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జే కాశీనాథ్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ రజని డాక్టర్ విజయరాణి డాక్టర్ శ్రీనివాస్ డాక్టర్ శ్రీకాంత్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Photos from DMHO Siddipet's post 31/12/2022

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో కంటి వెలుగు ఫేస్ 2 లో భాగంగా ఆప్తాలమిక్ ఆఫీసర్ తో వారు చేయవలసిన విధుల పై అవగాహన కల్పిస్తున్న జిల్లా వైద్యాధిక శాఖ అధికారి డాక్టర్ జె కాశీనాథ్ గారు అప్తాలమిక్ ఆఫీసర్స్ శ్రీనాథ్, భద్రయ్య, నవీన్ డిప్యూటీ డెమో పాల్గొన్నారు

Photos from DMHO Siddipet's post 07/12/2022

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయంలో కంటివెలుగు కార్యక్రమంలో లో భాగంగా ఆప్తాలమిక్ అధికారుల నియామక పత్రాలను అందచేసి వారికి అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది

Photos from DMHO Siddipet's post 07/12/2022

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ లో 50 పడకల ప్రభుత్వ మాతాశిశు ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన మరియు ఉచిత డయాలసిస్ కేంద్రం ప్రారంభోత్సవం.

- 2.85 లక్షలతో డయాలసిస్ ప్రారంభం చేసుకున్నాం

- రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 3 ఏంసీహెచ్ లకు ప్రతిపాదనలు పెట్టినట్లు వాటిలో మొదటిది హుస్నాబాద్.

- తెలంగాణ రాష్ట్రం రాకముందు 3 డయాలసిస్ కేంద్రాలు ఉండేవని, ఇవాళ 102 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నాం.

Videos (show all)

అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు

Website