Hi TV Spiritual

Hi TV Spiritual

Daily Prediction of 12 Zodiac Signs, update on All Festivals, pooja vidhanam, pooranam and Many More.

21/09/2022

నిజంగా జరిగిన సంఘటన🙏
మన పుణ్యభూమిలో ఆ భగవంతుడు తో సావాసం చేస్తూ ఆధ్యాత్మికం ప్రాణంగా జీవించిన ఎందరో మహానుభావులు ఉన్నారు
అందులో ఏలూరు కమలాంబికా దేవి గారు ఒకరు 🙏

లలితా సహస్త్రనామ పారాయణ గొప్పతనం గురించి ఈ లోకానికి తెలియజేయటానికి ఈ భూమ్మీద అవతరించిన మహానుభావులలో ఈవిడ ఒకరు..

రాజమండ్రి లో కొక్కొండం వెంకటరత్నం పంతులుగారు అని ఒకాయన ఉండేవారు ఆయన నిత్యం తనుమధ్యాంబికా దేవి ఉపాసన చేసేవారు .. ఈయన ఆ కాలంలోనె మొట్ట మొదటి మహామహోపాధ్యాయ భిరుదాంకితులు.. ఆయన ఉపాసనలో అమ్మవారి సాక్షాత్కారం పొందిన మహనీయుడు ఆయన అనుష్టానానికి ఇంట్లో ప్రత్యేకంగా ఒక గది ఉండేది.. ఒకనాడు ఆయన ఇంట్లో లేని సమయంలో వాళ్ళ ఇంట్లో చిన్న పిల్ల అకస్మాత్తుగా కనపడదు దాంట్లో ఇంట్లో అందరు కంగారు పడి ఊరు అంతా వెతికిస్తూ ఉండగా ఈ వెంకటరత్నం గారు ఇంటికి వస్తారు దాంట్లో ఇంట్లో అందరు పిల్ల అదృశ్యం సంగతి చెప్పగా ఆయన ఒక్కక్షణం కళ్ళు మూసుకుని చిరునవ్వుతో తన అనుష్టాన గది తెరిచి చూడగా పాప అక్కడ ధ్యానం చేస్తూ ఉంటుంది. ఆయన నెమ్మదిగా ఆ పాప దగ్గరకి వెళ్లి కదపగా కళ్ళు తెరుస్తుంది. ఆయన ఆ పాప తో తాళం వేసి ఉన్న గదిలోకి ఎలా వచ్చావ్ తల్లి అనగా ఏమో నాన్నగారు నాకు తెలీదు కిటికీ లోనుండి ఈ గదిలోకి చూస్తూ ఉండగా ఒకావిడ నన్ను లోపలకి పిలిచింది ఎలా వచ్చానో తెలీదు ఇప్పుడు లేపేవరకు ఏమైందో కూడా తెలీదు అంటుంది దాంతో ఆయన సంతోషించి నువ్వు కారణజన్మురాలివి అని దీవిస్తాడు.. ఆవిడే మన కమలాంబికా అమ్మ..

ఆవిడ నిత్యం పూజాలలో ఇంట్లో తండ్రితో పాటే కూర్చునేది ధ్యానం కూడా సాధన చేసేది కొన్నాళ్లకి ధ్యానస్థాయి మించి సమాధి స్థాయికి వెళ్లిపోయేది..

ఆవిడ యుక్త వయసుకి రాగానే సత్యన్నారాయణ అనే ఆయనకి ఇచ్చి వివాహం చేసి కాపురానికి పంపుతారు అక్కడ కూడా ఈవిడ ధ్యానం చేస్తూనే ఉండేది భర్త ఈవిడ దగ్గరకి ఎప్పుడు వచ్చిన ఒక రకమైన భయం కలిగేది దాంతో కాపురం ఇద్దరి మధ్యలో సజావుగా జరిగేది కాదు..

ఒకనాడు ఆ దంపతులు ఈ సమస్య తో మద్రాస్ దగ్గర తిరువత్తియ్యుర్ అనే క్షేత్రం లో బాలాజీ స్వామి అనే ఒక యోగి ఉండేవారు.. ఆయన వద్దకి వెళ్లగా ఆయన ఒక్క క్షణం ధ్యానం లొకి వెళ్లి ఇద్దరికీ తలో మంత్రం ఇచ్చి మండలం పాటు ఇక్కడే ఆశ్రమం లో ఉండి ధ్యానం చేయండి అంటారు.. ఆ దంపతులు అలాగే ధ్యానం చేసిన తర్వాత స్వామి పిలిచి నీకు జరిగిన అనుభవాలు చెప్పు అని కమలాంబిక అమ్మ ని అడుగుతారు దానికి ఆవిడ ఇంతకుముందు ధ్యానం లో అమ్మవారు ఉగ్రం గా కనిపించేవారు ఇప్పుడు శాంతమూర్తి గా వాత్సల్యం తో కనిపిస్తోంది అంటుంది సరే ఇక మీ కాపురానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు వెళ్ళిరండి అని చెప్తారు ఆ స్వామితర్వాత వాళ్ళు ముంబై వెళ్లి కొన్నాళ్ళు కాపురం చెసి మళ్ళీ ఏలూరు వస్తారు వాళ్లకి సంతానం కలుగుతుంది..

రెండవ ఆడపిల్ల గర్భంలో ఉన్న సమయంలో ఆవిడకి స్వప్నం లో రెండు కోరలతో ఒక చిన్న పిల్ల తనకి పుట్టినట్టు కనపడుతుంది.. వెంటనే బాలాజీ స్వామి వారి దగ్గరకి వెళ్లగా ఆయన ధ్యానం చేసి నీ ఇంట్లో మరో కారణ జన్మురాలు పుడుతోంది ఇక్కడ నుండీ నీ జీవితం మొత్తం మారిపోతుంది అని చెప్తారు.

అలాగే కొన్నాళ్ళ తర్వాత రెండు కోరలతో ఒక పాప జన్మిస్తుంది కమలాంబికా అమ్మ రోజు లలితా పారాయణం, ఖడ్గమాల 22 రోజుల పాటు చేయగా ఆ కోరలు ఊడిపోతాయి పాప నిర్మలం గా నవ్వుతూ ఉంటుంది...

ఈవిడ చిన్నప్పటి నుండీ లలిత పారాయణం చేస్తూ ఉండటం అందరితోనూ చేయిస్తూ ఉండటం వల్ల ఆవిడకి అమ్మవారి కరుణ కలుగుతుంది..

ఈవిడ దగ్గరకి సమస్య అని వచ్చిన అందరితోనూ లలితా పారాయణం ఖడ్గమాల పారాయణం చేయించి పానకం నైవేద్యం గా పెట్టించేది చిత్రంగా వారు ఏ సమస్యలతో వచ్చారో ఆ సమస్యలు తీరిపోయేవి.. ఇలా అందరు వారి వారి సమస్యలు తీర్చుకుని ఆవిడకి ఏమన్నా తృణమో పణమో ఇవ్వబోతే నాకు ఇవన్నీ వద్దు మీరు మీ ఇంట్లో నిత్యం లలితా పారాయణం చెసి పానకం నైవేద్యం పెట్టండి అని కోరిన ఉత్తమురాలు..

ఎందరో భక్తులు ఆవిడ దగ్గర వారి వారి సమస్యలకి పరిష్కారం పొందారు...

ఒకనాడు ఆవిడ ఉన్న వీధి లో ఒకావిడకి అనారోగ్యం చేస్తుంది ఆవిడ ఎన్నో హాస్పటల్స్ తిరుగుతుంది కానీ నయం కాదు ఒకనాడు ఒక కోయవాడు కనికట్టు విద్య ఆవిడ ముందు ప్రదర్శించి ఆవిడ అనారొగ్యాన్నీ నయం చేస్తా అని నమ్మబలుకుతాడు ఆవిడ నమ్మి ఎంతో డబ్బు ఇస్తుంది ఒకనాడు ఆ దారి వెంట వెళ్తు కమలాంబికా గారు ఆవిడ ఇంటికి వచ్చేసరికి కోయవాడు చేసే వింత పూజలు చూసి ఏంటి ఇదంతా అని గద్దించేసరికి వాడు కమలాంబికా అమ్మ మోహంలో తేజస్సు
ఆగ్రహం చూసి బయపడి పారిపోతాడు తరువాత ఆవిడతో కమలాంబికా అమ్మ లలితా, ఖడ్గమాల పారాయణ చెసి పానకం నైవేద్యం గా పెట్టిస్తుంది కొంతసేపటికే ఆవిడకి స్వస్థత కలుగుతుంది ఇలా ఎవ్వరు ఏ సమస్యతో వచ్చిన ఈవిడ లలిత పారాయణ తోనే సమస్యకి పరిష్కారం చూపించేది..

ఒకనాటి రాత్రి కమలాంబికా అమ్మకి కల్లో అమ్మవారు కనిపించి నీ బిడ్డకి త్వరలో గండం ఉంది అంటుంది మరి పరిష్కారం చెప్పు తల్లి అని కమలాంబికా అమ్మ కోరగా నీకు నేను పరిష్కారం చెప్పాలా ఎలా తగ్గించుకోవాలో నీకు తెలీదా అని చెప్పి అదృశ్యం అవుతుంది అన్నట్టే కొన్ని రోజులకే ఆ పాప ఆడుకుంటూ కింద పడిపోయి కాళ్ళు చేతులు వెంటనే ఆ పాప ని తీసుకుని పూజ గదిలోకి వెళ్లి నాకు తెలిసిన మార్గం నువ్వే తల్లి అంటూ తన్మయత్వం తో లలితాసహస్త్రనామ పారాయణ ఖడ్గమాల తో చెసి నైవేద్యం పెట్టడానికి కళ్ళు తెరిచి చూడగా పిల్ల మాములుగా ఉండి ఒళ్ళో ఆడుకుంటూ ఉంటుంది దాంతో కమలాంబికా అమ్మ సంతోషించి అమ్మవారికి నైవేద్యం పెడుతుంది..

ఆ రోజు స్వప్నం లో తల్లి సాక్షాత్కారం ఇచ్చి నీకు నేను అనుగ్రహించిన శక్తిని ఏనాడూ నువ్వు స్వార్దానికి వాడుకోలేదు నీ నిష్కల్మష భక్తి నాకు నచ్చింది నీకు వాక్సుద్ది ఇస్తున్నాను ఇవాళ్టి నుండి నీ పూజ గదిలో నేను కొలువై ఉంటాను ఆ గదే నా పీఠం లా మారుతుంది అని ఆశీర్వదిస్తుంది...

మర్నాడు ఆవిడ కళ్ళు తెరిచేసరికి పూజ మండపం లొకి బాలాదేవి విగ్రహం వచ్చి ఉంటుంది ఆవిడకి ఇది అమ్మ దయే అని అర్ధం అవుతుంది..

ఇలా ఎన్నో సంఘటనలు ఆవిడ వల్ల జరిగాయి..

ఆవిడ తన వాక్ సుద్ది ని కానీ తన శక్తిని కానీ ఏనాడూ తన స్వార్ధానికి వాడుకోలేదు ఆపద అని వచ్చిన అందరికి లలితా పారాయణం ఖడ్గమాల సహితం గా చేయమని చెప్పి నైవేద్యం గా పానకం పెట్టమనేది......దాంతోనే వారి సమస్యలు తీరేవి గండాలు గట్టేక్కెవి..

అందరికి శుక్రవారం దీక్షలు ఇచ్చేదీ నవరాత్రులు కటిక ఉపవాసం ఉంటూ అమ్మవారి సేవ చేసేది.. అమ్మవారి సేవలోనే ఆవిడ తన జీవితం అంతా ముగించింది..

ఇప్పటికి ఏలూరు లో

old కరెంటు ఆఫీస్ రోడ్డు
అగ్రహారం
Tucu బ్యాంకు దగ్గర ఆ ఆశ్రమం ఉందీ

ఆ ఆశ్రమం లో ఉన్న ప్రతి విగ్రహం వెనకాల
ఏదోక సంఘటన కి సాక్షం గా ఉన్నదే...🙏

అమ్మ అందరిని చల్లగా చూడమ్మా 🙏

20/09/2022

🙏🌺జై దుర్గాభవాని🌺🙏

19/09/2022

కర్నాటకలోని ముదిగెరెలోని యోగ నరసింహ స్వామి🙏🏵️🙏

18/09/2022

నవరాత్రి ఉత్సవాలు ఎందుకు జరపాలి!?

దసరా అంటే దన్+హరా అని; అంటే సీతాపహరణ గావించిన రావణాసురుని శ్రీరాముడు పదితలలను నరికి సంహరించిన సందర్భంగా జరుపుకునే విజయోత్సవంగా కూడా దీనిని వ్యవహరిస్తూ ఉంటారు. సరిగా వానిని ఆశ్వీయుజమాసం నవమి తిధినాడు సంహరించినాడు. అందువల్ల దీనిని "దసరా వైభవం" గా దశమినాడు జరుపుతూ ఉంటారు.

ఇక దేవినవరాత్రి పూజలు చేయుట, అనునది అనాదికాలంగా వస్తున్న శాస్త్రవిధి. "అశ్వనీ" నక్షత్రంలో కలసివచ్చిన పూర్ణిమమాసమే "ఆశ్వీయుజమాసం" అవుతుంది. ఈ మాసమందు 'దేవీనవరాత్రుల'ను శరన్నవరాత్రులని పిలుస్తూ శుద్ధపాడ్యమి తిథితో ప్రారంభించి తొమ్మిది రోజులు ఈ నవరాత్రులు వైభవంగా చేస్తారు.

ప్రథమాశైలపుత్రి, ద్వితీయా బ్రహ్మచారిణీ
తృతీయాచంద్రఘంటీతి, కూష్మాండేతి చతుర్థికీ
పంచమా స్కందమాతేతి షష్టాకాత్యాయనేతి చ
సప్తమా కాళరాత్రిచ అష్టమాచాతి భైరవీ
నవమా సర్వసిద్ధిశ్చాత్ నవదుర్గా ప్రకీర్తితా.

మూర్తులు వేరైనా మూలపుటమ్మ ఒకరే! అలంకారాలు వేరైనా అమ్మదయ అందరిపట్ల ఒకటే! హిందువులు అత్యంత ప్రీతిపాత్రంగా ఎంతో వైభవంగా నిర్వహించే పండుగలలో ఈ "దసరావైభవం" ఒకటి. ఇది పదిరోజులు పండుగ అయినప్పటికి దేవిని రోజుకో అవతారంగా అలంకరించి అమ్మవారికి అర్చనలుచేసి, నవవిధ పిండివంటలతో నివేదనలుచేస్తూ విశేష పూజలతో పాటు శ్రీలలితా సహస్రనామ పారాయణ నిత్యము గావిస్తూ "శరన్నవరాత్రులు" గా వ్యవహరిస్తారు. శ్రవణానక్షత్రయుక్త 'దశమి' తిథిన విజయదశమితో ఈ దసరావైభవాలు పూర్తిచేస్తారు. దసరాకు మరోపేరు "దశహరా" అంటే! పది పాపాలను హరించేది అని అర్థం చెప్తారు దైవజ్ఞలు.

ఈ దేవి నవరాత్ర్యుత్సవాలు జరపడంల్లోకూడా మంచి అంతరార్థం ఉన్నదట! శరదృతువుకు ముందు వర్షరుతువు ఉంటుంది. బహుళంగా కురిసిన వానలవల్ల, చీమలు, దోమలు, కీటకాలు పెరుగుతాయి. ఈ ఋతువులో ప్రజలు రోగబాధలతో మరింతగా బాధపడుతూ ఉంటారు. వీటికి "యమదంష్ట్రము"లని పేరు. దేవి మహిషాదిజంతువులను జయించడంల్లో అంతరార్థమిదే అని దేవీభాగవతం చెప్తోంది. కావున ఆరోగ్య ప్రాప్తికి ఈ రెండు రుతువులలోను నవరాత్ర్యుత్సవం జరుపవలెనని పేర్కొంది.

🌷🌷🌷🌷

17/09/2022

🌼🌿🙏🏼 *శ్రీ గురుభ్యోనమః* 🙏🏼🌼🌿

ఎవరైనా గ్రహపీడల వల్ల బాధ పడుతున్నా, గ్రహస్థితి బాగలేకున్నా, రానున్న కాలం ఆందోళనకరంగా ఉందనిపిస్తే.. వారు ఈ క్రింద చెప్పబడిన శ్లోకలను మొదట్లోను, చివరిలోనూ శ్రీమాత్రే నమః చేర్చి (దీన్ని సంపుటీకరణ అంటారు) నుంచున్నా, కూర్చున్నా, నడుస్తున్నా, జపించడం, పఠించడం,స్మరించడం చేస్తే ఆ అమ్మవారు కరుణామయి.. ఎటువంటి గ్రహ పీడల నుండైన వారికి ముక్తినిస్తుంది.

*ఇది శ్రీ లలితా సహస్రనామస్తోత్ర భాష్య ప్రవచనంలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు చెప్పారు..*

_*శ్రీమాత్రే నమః*

భవదావసుధావృష్టిః పాపారణ్యదవానలా,_

_దౌర్భాగ్యతూలవాతూలా జరాధ్వాంతరవిప్రభా._

_భాగ్యాబ్ధిచంద్రికా భక్త చిత్తకేకిఘనాఘనా,_

_రోగపర్వతదంభోళిర్తృత్యుదారుకుఠారికా

🌼🌿 *శ్రీమాత్రే నమః*_🌼🌿

16/09/2022

🕉 శ్రీ గురుభ్యోనమః🙏🏻
శనివారం, సెప్టెంబరు 17, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం - వర్ష ఋతువు
భాద్రపద మాసం - బహళ పక్షం
తిథి:సప్తమి మ2.41 వరకు
వారం:శనివారం(స్థిరవాసరే)
నక్షత్రం:రోహిణి మ2.01 వరకు
యోగం:వజ్రం ఉ8.35 వరకు
కరణం:బవ మ2.41 వరకు తదుపరి బాలువ తె3.30 వరకు
వర్జ్యం:ఉ.శే.వ7.06వరకు &
రా8.08 - 9.53 వరకు
దుర్ముహూర్తం:ఉ5.51 - 7.28
అమృతకాలం:ఉ10.33 - 12.16
రాహుకాలం:ఉ9.00 - 10.30
యమగండ/కేతుకాలం:మ1.30 -3.00
సూర్యరాశి:సింహం
చంద్రరాశి: వృషభం
సూర్యోదయం:5.51 సూర్యాస్తమయం:6.00
కన్యా సంక్రమణం రా 10.35 నుండి
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

16/09/2022

🙏🙏🙏🙏

09/09/2022

🚩🚩 - మనుచరిత్ర.!
- సత్యనారాయన పిస్క.
-
♦️ఆంధ్ర సాహిత్యములో రామాయణ, మహాభారత,
భాగవతముల తర్వాత అత్యధిక ప్రాచుర్యమును పొందిన కావ్యము, ఆంధ్రకవితా పితామహుడుగా పేరు గడించిన అల్లసాని పెద్దనగారి అద్వితీయ ప్రబంధంమనుచరిత్రము. ఈ కావ్యము తదనంతర కాలములో వెలువడిన అనేక ప్రబంధములకు మార్గదర్శకమై, తలమానికంగా అలరారింది.

♦️మనుచరిత్ర 6 ఆశ్వాసాల మహాప్రబంధం అయినప్పటికీ,
మొదటి 3 ఆశ్వాసాలే సారస్వతాభిమానులను అమితంగా ఆకట్టుకుని, వారిని రసజగత్తులో ఓలలాడించినవని చెప్పుటలో ఏమాత్రం సందేహం లేదు.
పెద్దన కవీంద్రుల లేఖినిలో ప్రాణం పోసుకున్న 2 అద్భుతమైన సజీవపాత్రలు మన కనుల ముందు కదలాడుతూ, తమతో పాటు మనలను కూడా హిమాలయసానువుల్లోకి లాక్కెళతాయి. ఆ 2 పాత్రల్లో మొదటిది -ప్రవరుడు;రెండవది -వరూధిని.

♦️ఆర్యావర్తములోని అరుణాస్పదపురము అనే
గ్రామములో నివసిస్తున్న బ్రాహ్మణ యువకుడు ప్రవరుడు. నియమబద్ధంగా పరమ నైష్ఠిక జీవితాన్ని గడుపుతున్న ఒక ఆదర్శ గృహస్థు. ....ఇక - వరూధిని ఒక అప్సరస.
అద్భుత సౌందర్యరాశి, అపురూప లావణ్య వారాశి.
విధివైచిత్రి వలన వీరిద్దరూ అనూహ్యమైన రీతిలో, మనోహరమైన మంచుకొండల మధ్యలో, అనగా మనోజ్ఞమైన హిమగిరుల సుందరసీమలో పరస్పరం తారసిల్లుతారు.
అతిలోకసుందరియైన ఆ అచ్చర ప్రవరాఖ్యుని సౌందర్యవిభవం చూసి, అతనిపై మనసుపడుతుంది..... ప్రవరుడు అందములో ఆమెకు ఏమాత్రమూ తీసిపోడు మరి!

♦️ప్రవరుణ్ణి మనకు పరిచయం చేసే ప్రారంభపద్యములోనే పెద్దనగారు అతణ్ణి ఆలేఖ్య తనూవిలాసుడు అనీ,మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి అనీ వర్ణిస్తారు. ఆలేఖ్య తనూవిలాసుడు అంటే లిఖించడానికి లేదా చిత్రించడానికి అలవికాని రూపసంపద కలవాడని అర్థం.
♦️ఇకపోతే, మకరాంకుడంటే మన్మథుడు; శశాంకుడంటే చంద్రుడు. వారిద్దరితో సరితూగగల సుందరాకారుడని అర్థం. కనుకనే వరూధిని అతణ్ణి చూసి ఎక్కడివాడొ ! యక్షతన యేందు జయంత వసంత కంతులన్ చక్కదనంబునన్ గెలువజాలినవాడు!
అనుకుని, అతనిపై మరులుగొంటుంది. ( యక్షతనయుడు అనగా యక్షులకు రాజైన కుబేరుని పుత్రుడు నలకూబరుడు. ఇతడు చాలా సౌందర్యవంతుడని ప్రసిద్ధి. ఇందుడంటే చంద్రుడు. జయంతుడు దేవేంద్రుని కుమారుడు. ఇతడు సైతం చాలా అందగాడని చెప్తారు. వసంతుడు మదనుని చెలికాడు. ఇక కంతుడంటే సాక్షాత్తూ మన్మథుడే ! )
♦️ప్రవరుడు మాత్రం వరూధిని వన్నెలకు, వయ్యారాలకు ఏమాత్రం విచలితుడు కాకుండా, ఆమెను సమీపించి, తాను ఆ పర్వతాలలో దారి తప్పాననీ, తమ ఊరికి త్రోవ చూపి పుణ్యం కట్టుకోమనీ ఆమెను అర్థిస్తాడు. వరూధిని ఎన్నో రకాలుగా అతణ్ణి తనవైపు ఆకర్షించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కాని, నియమ నిష్ఠలతో జీవితం సాగించే ఆ బ్రాహ్మణుడు ఆమె దారికి రాడు.
♦️అపురూప సౌందర్యరాశి, అపరరంభయైన వరూధిని ఆనాటి పాఠకులను వెఱ్ఱెత్తించి వుండాలి...... పురుషుడు స్త్రీవెంట పడటమేగాని, స్త్రీ పురుషునివెంట పడటం చూసివుండని అప్పటి రసికులు అంతులేని తమకముతో వరూధిని వెంట పడివుండాలి.
వరూధిని కేవలం విలాసిని మాత్రమే కాదు. వివేకవంతురాలు కూడా! మంచి మాటకారి. తన అందచందాలన్నీ ప్రవరుడిని ఆకర్షించడంలో విఫలం కాగా, తన వాదనాపటిమతో అతణ్ణి ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నములో సైతం ఆమెకు సాఫల్యం సిద్ధించదు. ఇంక చివరి ప్రయత్నంగా సిగ్గువిడిచి, అతణ్ణి కవ్వించి రెచ్చగొట్టడానికి అమితమైన మోహముతో అతని పైనబడి కౌగిలించుకుంటుంది.

♦️పరమ నైష్ఠికుడైన ఆ బుద్ధిమంతుడు హా శ్రీహరీ ! అని ఓరమోమిడి, ఆమెను తొలగద్రోస్తాడు........ అటుపిమ్మట, అగ్నిదేవుని ప్రార్థించి, ఆయన కరుణతో తన స్వగ్రామానికి వెడలిపోతాడు.
పై ఘట్టములు చదువుతున్నంతసేపు పాఠకులు ఎంతో
ఉత్కంఠకు లోనవుతారు. ఆ ఇరువురిలో ఎవరిది పైచేయి అవుతుందోనని ఉద్విగ్న హృదయాలతో మనస్సును
ఉగ్గబట్టుకుని కావ్యాన్ని పఠిస్తారు. వరూధిని ఎంత కవ్వించినా, ఆమె శృంగారచేష్టలకు అణుమాత్రమైనా చలించని ప్రవరుని నిగ్రహాన్ని చూసి నిర్ఘాంతపోతారు.
ఎందుకంటే, ఆనాటివరకు వారు చూసిన కావ్యనాయకులందరూ శృంగారపురుషులే ! ఇంతటి విచిత్రప్రవృత్తికలిగిన నాయకుణ్ణి
వారు ఎప్పుడూ కనీ, వినీ యెరుగరు.
♦️చివరకు శాంతమే జయించినది. శృంగారం పరాజయం పొందినది. ధర్మం ముందు కామం తలవంచినది. ధర్మవీరుడైన ప్రవరుని స్థైర్యం చెక్కుచెదరలేదు. అతని ధర్మనిష్ఠ మొక్కవోలేదు.
సౌందర్యవతులైన మదవతుల మాయలు ధీరుల చిత్తాలను చలింపజేయలేవనీ, తుచ్ఛసుఖములు మీసాలపై తేనియలనీ, ఇంద్రియసుఖాలకు లోబడినవాడు బ్రహ్మానంద పదవీభ్రష్ఠుడు అవుతాడనీ వరూదినీప్రవరుల సమావేశం లోకానికి ఉజ్జ్వలమైన ఉపదేశాన్ని అందజేస్తున్నది.
♦️ఇంతకీ, నేను చెప్పవచ్చేది ఏమిటంటే -పెద్దనగారు వరూధినీ ప్రవరుల సౌందర్యాన్ని వర్ణిస్తూ 2 పద్యాలు వ్రాశారు. ఒకటి వరూధినిని ప్రవరుడు తొలిసారి చూసినప్పుడు. మరొకటి ప్రవరుడు వరూధినికి మొదటిసారి కనబడినప్పుడు. పై 2 పద్యాలను కాస్త సూక్ష్మంగా పరిశీలిస్తే, ఆ ఇద్దరిలో గెలుపు ఎవరిని వరిస్తుందో మనం ముందుగానే గుర్తించవచ్చు !
ఇప్పుడు ఆ పద్యాలను చిత్తగించండి.
వరూధిని వర్ణన :
♦️అతడా వాత పరంపరా పరిమళ వ్యాపారలీలన్ జనా
న్విత మిచ్చోటని జేరబోయి కనియెన్ విద్యుల్లతావిగ్రహన్,
శతపత్రేక్షణఁ, జంచరీక చికురన్, జంద్రాస్యఁ, జక్రస్తనిన్,
నతనాభి, న్నవలా నొకానొక మరున్నారీ శిరోరత్నమున్.
ప్రవరుని వర్ణన :
♦️కమ్మని కుందనంబు కసుగందని మే, నెలదేటి దాటులన్
బమ్మెరవోవఁ దోలుఁ దెగబారెడు వెండ్రుక, లిందుబింబముం
గిమ్మననీదు మోము, గిరిక్రేపులు మూపులు, కౌను గానరా
దమ్మకచెల్ల! వాని వికచాంబకముల్ శతపత్ర జైత్రముల్.
పై పద్యములలో వరూధినీ ప్రవరుల శారీరకసౌందర్యం వర్ణించబడింది. వారిరువురి అవయవాలను పెద్దనగారు వేటితో పోల్చి చెప్పారో ఒకసారి పరికిద్దాము.
వరూధినిని విద్యుల్లతావిగ్రహ అన్నారు. విద్యుల్లత అనగా మెరుపుతీగ. కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతి మెరుపుతీగది. కాని, అది అస్థిరము, చంచలం. మరి, ప్రవరాఖ్యుని శరీరకాంతి ఎటువంటిది? కమ్మని కుందనంబు కసుగందని మేను అని చెప్పారు. కుందనమంటే స్వర్ణము. అనగా అచ్చమైన చొక్కపు బంగారము వంటి శరీరకాంతి కలవాడని అర్థం. బంగారము యొక్క కాంతి స్థిరమైనది కదా! వరూధిని శతపత్రేక్షణ. శతపత్రము అంటే పద్మము. పద్మముల వంటి కన్నులు ఆమెవి. స్త్రీల కళ్ళను పద్మాలతో ఉపమించడం కవులకు పరిపాటే ! మరి, పురుషుల కళ్ళను పద్మాలతో పోల్చవచ్చునా అంటే, కేవలం మహావిష్ణువు విషయములోనే ఆ పోలిక వర్తిస్తుంది. ఆయనను కవులు పద్మాక్షుడు, నళినాక్షుడు, పుండరీకాక్షుడు ఇత్యాది పదములతో వర్ణించారు. ( విష్ణుమూర్తి అవతారాలైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు పట్ల కూడా ఈ పదములను వాడినారు. ) మరి, ప్రవరుని విషయములో ఏమన్నారు పెద్దనామాత్యులు! వాని వికచాంబకముల్ శతపత్ర జైత్రముల్ అని. అంబకము అంటే బాణం, కన్ను అని అర్థాలున్నాయి. అతని కన్నులు పద్మములనే జయించినవట ! ఇక్కడే మనకు తెలిసిపోతున్నది ప్రవరునిదే గెలుపు కాబోతున్నదని !
ఆమె చంచరీక చికుర. అనగా తుమ్మెదల వంటి నల్లని కేశపాశము కలది అని అర్థం. మరి, ప్రవరుడో !ఎలదేటి దాటులన్ బమ్మెరవోవ దోలు తెగబారెడు వెండ్రుకలు అట ! ప్రాచీనకాలములో పురుషులు సైతం కేశములను పొడవుగా పెంచుకోవడం మనకు తెలిసిన సంగతే ! తేటి అంటే తుమ్మెద. ఎలదేటి అంటే గండుతుమ్మెద. దాటులు అంటే గుంపులు. వరూధిని విషయములో తుమ్మెదలు మాత్రమే చెప్పబడ్డాయి. కాని, ఇతని విషయములో గండుతుమ్మెదల గుంపులను పారద్రోలేటంత నిడుపాటి కేశములు అని చెప్పబడింది. మరి, ఎవరిది ఆధిక్యమో తెలుస్తున్నది కదా !
ఇక, వరూధిని చంద్రాస్య. అనగా చంద్రుని వంటి ముఖము కలిగినది అని. మరి, ప్రవరుని ముఖము?...ఇందు బింబమున్ కిమ్మననీదు మోము అని చెప్పారు. ప్రవరుని ముఖము చంద్రబింబమును నోరెత్తనీయదట !....ఎలావుంది ?!........
ఈవిధంగా వారిరువురి అవయవముల వర్ణనలో అన్నింటిలోనూ ప్రవరునిదే పైచేయిగా కనిపింపజేశారు పెద్దనగారు. అనగా ఆ ప్రచ్ఛన్నయుద్ధములో ప్రవరుడే విజేత కాగలడని కవీశ్వరులు మనకు చెప్పకనే చెప్పారు.
చివరగా మరొక్కమాట చెప్పి ముగిస్తాను.

♦️శ్రీరామచంద్రుని ఏకపత్నీవ్రతము జగత్ప్రసిద్ధము. ఐనప్పటికీ, ఆంధ్ర సారస్వతములో మనుచరిత్ర అవతరణానంతరము లోకములో పరస్త్రీవిముఖతకు ప్రవరాఖ్యుడే ప్రతీకగా నిలిచిపోయాడు. ఎవరైనా మగవాడు మగువలతో మాట్లాడటానికి సంశయిస్తే అబ్బో! వాడు ప్రవరాఖ్యుడురా! అంటారు. దీనినిబట్టి ప్రవరుని పాత్ర చిత్రణలో పెద్దన ఎంత కౌశలం ప్రదర్శించారో మనకు తెలుస్తున్నది.

🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

08/09/2022

శుభోదయం 🌷

🙏🏾 శ్రీ కృష్ణ శతకం 🙏🏾
- (శ్రీ నరసింహ కవి.)

♦ #నారాయణ పరమేశ్వర
ధారా ధర నీలదేహ దానవవై రీ
క్షీరాబ్ధిశయన యదుకుల
వీరా నను గావు కరుణ వెలయఁగ కృష్ణా.ll

భావం:–
♦నారాయణుడు, పరమేశ్వరుడు నీలదేహుడు, రాక్షసవైరి, క్షీరాబ్దిశయనుడు, యదువీరుడు అను బిరుదులతో విహరించే ఓ కృష్ణా ! దయతో నన్నుగావుమయ్యా.

❤❤❤❤ ❤❤❤❤ ❤❤❤

31/08/2022

🕉 శ్రీ గురుభ్యోనమః🙏🏻
బుధవారం, ఆగష్టు 31, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం - వర్ష ఋతువు
భాద్రపద మాసం - శుక్ల పక్షం
తిథి:చవితి మ1.57 వరకు
వారం:బుధవారం(సౌమ్యవాసరే)
నక్షత్రం:చిత్ర రా11.48 వరకు
యోగం:శుక్లం రా11.27 వరకు
కరణం:భద్ర మ1.57 వరకు తదుపరి బవ రా1.27వరకు
వర్జ్యం:ఉ7.47 - 9.22 & తె5.17నుండి
దుర్ముహూర్తం:ఉ11.35 - 12.25 &
రా10.51 - 11.37
అమృతకాలం:సా5.22 - 6.59
రాహుకాలం:మ12.00 - 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 - 9.00
సూర్యరాశి:సింహం
చంద్రరాశి:కన్య
సూర్యోదయం:5.48
సూర్యాస్తమయం:6.13
శ్రీ వినాయక చతుర్థీ
శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

29/08/2022

🙏🌺మణిద్వీప వర్ణన మహాత్యం🌺🙏

🌺శ్రీచక్ర బిందు రూపిణి శ్రీ రాజరాజేశ్వరి శ్రీదేవి శ్రీ మహావిద్య శ్రీ మహాత్రిపురసుందరి శ్రీ లలితా జగన్మాత అమ్మవారు నివాసముండే పవిత్ర ప్రదేశమే మణి ద్వీపం. పదునాలుగు లోకాల అనంతరం సర్వలోకంలో ఆమె కొలువై వున్నారు. యావత్‌ జగతిని పరిరక్షించే అమ్మవారి మదిలో ఏర్పడిన ఆలోచనలకు అనుగుణంగా ఈ లోకం ఉద్భవించింది. నాలుగువైపులా అమృతంతో కూడిన సముద్రం సరిహద్దులుగా వున్న ఈ ద్వీపాన్ని వర్ణించాలంటే మన శక్తి చాలదు. మహిమాన్వితమైన అమ్మవారు చింతామణి గృహంలో పరివేష్టితయై వుంటారు. దేవీ భాగవతంలో మణి ద్వీపం గురించిన వర్ణన వుంది. అంతులేని వజ్రాలు, రత్నాలు, ముత్యాలు లాంటి నవనిధులతో పాటు బంగారు మయమైన కొండలు ఈ ద్వీపంలో వున్నాయి. అనేక ప్రాకారాల అనంతరం అమ్మవారు దర్శనమిస్తారు.🌺
🌺మొదట వచ్చే ఇనుప ప్రాకారంలో భూమండలంలోని రారాజులు వుంటారు.వీరు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను పంపుతుంటారు. అనంతరం కంచుతో చేసిన రెండో ప్రాకారం వుంటుంది. పచ్చటి అరణ్యములతో, వివిధ రకాల జంతువులు, పక్షుల కిలకిలరావాలతో ఆ ప్రాంతం ప్రతిధ్వనిస్తుంటుంది. ఇలా అనేక ప్రాకారాలు దాటిన అనంతరం చింతామణి గృహంలో అమ్మవారు వుంటారు. జ్ఞాన మండపంలో భక్తులకు దర్శనమిస్తారు. ముక్తి మండపంలో మంత్రులతో చర్చలు నిర్వహిస్తారు. వైకుంఠం, కైలాసం కంటే అద్భుతమైన ప్రపంచం అమ్మవారి నివాసం. యావత్‌ విశ్వంలో ఎక్కడా లభించని అనంతమైన సంపద అక్కడ వుంటుంది. అన్నింటినీ మించి అమ్మ సన్నిధిలో వుండటమే మహావరం. అందుకనే మణిద్వీప వర్ణన పారాయణం చేస్తుంటారు. ఈ పారాయణంతో ఇంట్లోని వాస్తుదోషాలు తొలగిపోతాయి. సకల శుభాలు కలుగుతాయి. అమ్మవారి అనుగ్రహంతో అన్ని ఐశ్వర్యాలూ లభిస్తాయి.🌺

28/08/2022
28/08/2022

🕉 శ్రీ గురుభ్యోనమః🙏🏻
సోమవారం, ఆగష్టు 29, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం - వర్ష ఋతువు
భాద్రపద మాసం - శుక్ల పక్షం
తిథి:విదియ మ2.30 వరకు
వారం:సోమవారం(ఇందువాసరే)
నక్షత్రం:ఉత్తర రా11.20 వరకు
యోగం:సాధ్యం రా2.20 వరకు
కరణం:కౌలువ మ2.30 వరకు
తదుపరి తైతుల రా2.28వరకు
వర్జ్యం: ఉ5.51 - 7.31
దుర్ముహూర్తం:మ12.26 - 1.16 &
మ2.55 - 3.45
అమృతకాలం:మ3.49 - 5.29
రాహుకాలం:ఉ7.30 - 9.00
యమగండ/కేతుకాలం:ఉ10.30-12.00
సూర్యరాశి:సింహం
చంద్రరాశి:కన్య
సూర్యోదయం:5.48
సూర్యాస్తమయం:6.16
శ్రీ బలరామ జయంతి
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

28/08/2022

🙏🌺మహారాష్ట్రలోని కొల్హాపూర్, శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో మా లక్ష్మి మాతకు అందమైన తమలపాకుల ఆకు అలంకరణ.🌺🙏
🌺ఈ అలంకరణ సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరుగుతుంది మరియు స్థానికుల అభిప్రాయం ప్రకారం, చూసిన వారి జీవితాలలో విజయం మరియు శ్రేయస్సును తెస్తుందని. 🌺

26/08/2022

దండం దశగుణం భవేత్ !!
ఈ దండం ఆ దండం కాదు!అంటే..నమస్కారం కాదు!
ఇక్కడ దండం అంటే కర్ర.
కర్ర పది రకాలుగా ఉపయోగ-
పడుతుందని సుభాషితకారుని వచనం.
"విశ్వామిత్రాహి పశుషు
కర్దమేషు జలేషు చ
అన్ధే తమసి వార్ధక్యే
దండం దశగుణం భవేత్ !!"
ఈ శ్లోకం అర్ధం ఏమిటంటే.....,,,.
వి-------పక్షుల పట్ల(చెదరగొట్టుటకు)
శ్వ------కుక్కలపట్ల(తోలుటకు)
అమిత్ర---శతృవులపట్ల(ఆత్మ రక్షణకు)
అహి---పాముల పట్ల
పశుషు----జంతువుల పట్ల
కర్దమేషు----బురదల యందు(పడిపోకుండుగ)
జలేషు ---నీటియందు(లోతు తెలుసుకొనుటకు)
అన్ధే---------గుడ్డితనమందు
తమసి--------చీకటి యందు
వార్ధక్యే-------ముసలితనమునందు
దండం దశగుణం భవేత్ !
ఇలా పదిరకాలుగా కర్రను ఉపయోగిస్తామని చెప్పే....
సంప్రదాయికంగా వస్తున్న శ్లోకం..ఇది!

26/08/2022

🚩🚩-శశికపూర్ -🚩🚩

#శశికపూర్ కు బాల్యం నుంచి ఒక్కటే తెలుసు.
అదే యాక్టింగ్తండ్రి పృధ్వీరాజ్ కపూర్ పెద్ద నటుడు.
అన్న రాజ్ కపూర్ స్టార్. మరో అన్న షమ్మీ కపూర్ ది అదే దారి . తనకేం తక్కువ? 'ఆగ్', 'ఆవారా' సినిమాల్లో రాజ్ కపూర్ కు చిన్నప్పటి వేషం వేసేశాడు. అందరూ బాగా చేస్తున్నావ్ అన్నారు. ఇంకేంటి? పెద్దయ్యాక స్టార్ కావడమే.
పెద్దయ్యాడు. స్టార్ కాలేదు. రోజులు, వారాలు, సంవత్సరాలు గడిచిపోయాయి. మా నాన్న... మా తాత అక్కడ చెల్లవు. నువ్వు గొప్పవాడివా కాదా అది తేల్చు ముందు అన్నారు. ఏవో ఒకటి రెండు సినిమాలు వచ్చాయి. కాస్తో కూస్తో ఆడుతూ ఉన్నాయి.కొన్ని డింకీలు నెమ్మదిగా పేరు వచ్చింది. ఫ్లాప్ హీరో! హీరోయిన్లు శశికపూర్ పేరు చెప్తేనే పారిపోతున్నారు.
అతడు తప్ప ఎవరైనా సరే, ఏం చేయాలి?
అప్పుడొక ఆపద్భాందవు రాలు అతడికి తారసపడింది. నీకేంవోయ్ చాలా మంచి యాక్టర్ వి అని ధైర్యం చెప్పింది. నీ పక్కన నేను యాక్ట్ చేస్తాను ఉండు అని ముందుకు వచ్చింది. హీరోయిన్ నంద! ఇద్దరూ కలిశారు. పూలు విరబూసే కాలం వచ్చింది. విరబూశాయి.
జబ్ జబ్ పూల్ ఖిలే
పెద్ద హిట్. మ్యూజికల్ హిట్. ఒక రొమాంటిక్ హీరో జన్మెత్తాడు. అవును. పులి కడుపున పులే పుడుతుంది. కాకుంటే పంజా దెబ్బ కొంత ఆలస్యంగా తగిలింది. శశి కపూర్ విజృంభించాడు. 'నీంద్ హమారి ఖ్వాబ్ తుమ్హారే', 'రూఠా న కరో' 'మొహబ్బత్ ఇస్కో కెహెతే హై'... అన్నీ నందాతోనే. అన్నీ హిట్. ఇవి వస్తుండగానే అటు బి. ఆర్. చోప్రా 'వక్త్, ఇటు మన 'ప్రేమించి చూడు' రీమేక్ 'ప్యార్ కియా జా.....! సినిమాల వెంట సినిమాలు. సరిగ్గా అప్పుడే బెంగాల్ నుంచి ఒక పిల్లతెమ్మెర బయలుదేరి బొంబాయి తీరాన్ని తాకింది. పేరడిగితే 'రాఖీ' అన్నారు. శశి కపూర్ తో ఒక సినిమా అని కూడా అన్నారు. బంగారం ఉంది. తావి వచ్చింది. బంగారానికి
తావి అబ్బడం అంటే ఏమిటో ప్రేక్షకులకు తెలిసింది.
ఖిల్ తే హై గుల్ యహా ఖిల్ బిఖర్ నే కో.... 'షర్మిలీ' సూపర్ డూపర్ హిట్. అందులోని పాటలు... ఇప్పటికీ హిట్.
"సరే... ఇవన్నీ ఎవరైనా చేయగలరు. దేశం ఉలిక్కిపడేలా చేయగలగాలి. అలాంటి పాత్ర ఒకటి తగలాలి.. తగిలింది. అదే దీవార్..
అమితాబ్ కంటే శశికపూర్ వయసులో పెద్దవాడు. కాని 'దీవార్ 'లో అతడి తమ్ముడి వేషం వేశాడు. సినీ పరిశ్రమ దస్తూర్ అలాగే ఉంటుంది. 'రోటీ కపడా మకాన్'లో తాను లీడ్ రోల్ చేస్తున్నప్పుడు అమితాబ్ చేతులు కట్టుకుని చాలా చిన్నపాత్ర వేస్తున్నాడు. ఇవాళ అతడు స్టార్ డమ్ కు వస్తే తాను చిన్న పాత్ర వేస్తున్నాడు. కాని అతడికి తెలుసు. పాత్ర చిన్నదైనా గొప్ప నటుడికి ఒక్క సన్నివేశం చాలు. ఒక్క డైలాగైనా ఏం? ఆ సినిమాలో ఆ నిర్మానుష్యమైన రాత్రి..... ఆ పాతకాలపు వంతెన....
స్మగ్లర్ గా మారిన అన్న... నీతి కోసం
నిలబడిన ఇన్స్పెక్టర్ తమ్ముడు....అన్న తనని తాము సమర్ధించుకుంటున్నాడు ..తమ్ముడి మీద అధిక్యం ప్రదర్శిస్తున్నాడు.
"మేరే పాస్ బిల్డింగ్ హై.. ప్రాపర్టీహై.. బ్యాంక్ బేలన్స్ హై.. బంగ్లా హై... గాడీ హై... తుమ్హారే పాస్ క్యా హై?'....
తమ్ముడు జవాబు చెప్పాలి. ఎలా చెప్పాలి?
పొగరుగా కాదు. అహంకారంగా కాదు. తల ఎగరేస్తూ కాదు. ఆదర్శం ఎంత వినమ్రంగా ఉంటుందో అంత వినమ్రంగా జవాబు చెప్పాడు.
'మేరే పాస్ మా హై'....చిన్న డైలాగ్. దేశమంతా లేచి చప్పట్లు కొట్టింది. ఇవాల్టికీ కొడుతూనే ఉంది.
మేరే పాస్ మా హై..
అమితాబ్, ధర్మేంద్ర, రాజేష్ ఖన్నా, జితేంద్ర, శతృఘ్న సిన్హా.. ఈ దుమారంలో వీళ్ల కంటే ఎక్కువగా బిజీని అనుభ వించినవాడు శశి కపూర్. ఎక్కువ సంపాదించినవాడు కూడా..
ప్రతి సినిమాలో శశికపూర్ కావాలి. ఏ పాత్ర అయినా అతడే వేయాలి. ఎందుకంటే ఏ పాత్ర వేసినా తాను సినిమాకు బలంగా నిలుస్తాడు. అంతే తప్ప సినిమాను తనకు బలంగా చేసుకోడు. అది గమనించిన అమితాబ్ శశికపూర్ ను దశాబ్దాల పాటు వదల్లేరు.
'సుహాగ్, 'దో ఔర్ దో పాంచ్', 'కాలా పత్తర్, 'కభీ కభీ ', 'త్రిషూల్', 'షాన్'... ఒక దశలో పత్రికలు శశికపూరిని అమితాబ్ ఫేవరెట్ హీరోయిన్'గా కితాబిచ్చాయి. తేడాగా ఉన్నా ప్రశంస ప్రశంసే. బిజీ కొనసాగింది.
అది కూడా ఎంతగా అంటే రాజ్ కపూర్ అడిగితే 'సత్యం శివం సుందరం' కు శశికపూర్ దగ్గర డేట్స్ లేవు! దాంతో ఒళ్లు మండిన రాజకపూర్ అతడికి "టాక్సీ కపూర్' అని బిరుదు ఇచ్చాడు. రోజుకి రెండు మూడు షిప్టుల్లో పని చేస్తూ ఎప్పుడూ ఒక స్టుడియో నుంచి ఇంకో స్టుడియోకి ప్రయాణిస్తూ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర సినిమాలు సైన్ చేస్తున్నాడని రాజ్కపూర్ కంప్లెయింట్.
కాని తానేం చేయగలడు? అన్నను మించిన తమ్ముడు.
కాని నిజానికి ఇదంతా నటన. కాదు కాదు ఇదసలు నటనే కాదు. శశి కపూర్ కి ఆ సంగతి బాగా తెలుసు. 'థర్డ్ రేట్ స్టంట్ మేన్ కు ఇవ్వాల్సిన వేషాలన్నీ నాకిస్తున్నారు' అని చిరాకు పడ్డాడు చాలాసార్లు తనలోని నటుణ్ణి అతడు ఈ చెత్త సినిమాలతో మరణశయ్య ఎక్కించలేదు. సజీవంగా ఉంచ డానికి తండ్రి వారసత్వంగా వదిలివెళ్లిన 'పృథ్వీ థియేట 'ర్స్' బాధ్యతలు తీసుకున్నాడు. ఇంగ్లిష్ నాటకాలు వేశాడు. ఇస్మాయిల్ మర్చంట్ తో కలిసి అనేక ఇండో అమెరికన్ సినిమాల్లో నటించాడు.
సత్యజిత్ రే దర్శకత్వంలో సినిమాల కోసం, టీవీ కోసం యాక్ట్ చేశాడు. అంతటితో ఊరుకోక తానే సొంత నిర్మాణ సంస్థ- ఫిల్మ్స్ వాలాస్ స్థాపించి శ్యామ్ బెనగళ్ (కలియుగ్, జునూన్), గోవింద్ నిహలాని (విజేత), అపర్ణా సేన్ (36 చౌరంగీ లేన్) వంటి పారలల్ దర్శకులతో పారలల్ సినిమాలు తీశాడు. డబ్బు సంపాదించడం ఉద్దేశం కానే కాదు. చిన్న ఫ్రేమ్... చిన్న షాట్.. చిన్న డైలాగ్... ఒక నటుడి ఆకలి తీర్చేది. ప్రయోగాలకు వెనుకాడలేదు. గిరిష్ ' 'కర్నాడ్ దర్శకత్వంలో 'ఉత్సవ్... శ కపూర్ ఏదో అనుకుని తీశాడు. దేశం మరేదో అనుకుని చూసింది. పెద్ద హిట్ వెంట వైఫల్యం లేకపోతే మజా ఏముంది? 'అజూబా' తీశాడు. ముక్కు "కాలింది. మంచిదే.
హిందీ సినిమాల్లో రొమాంటిక్ హీరో అంటే దేవ్ ఆనంద్. తర్వాత?
శశి కపూర్. అందరు హీరోయిన్లు ఆయన పక్కన నటించడానికి ఇష్టపడ్డారు. సాతన, ముంతాజ్, మౌసమి చటర్జీ, జీనత్ అమాన్, హేమమాలిని... ఆ. సినిమాలూ ఆ పాటలూ జనం మెచ్చారు.
శశికపూర్ ఖాతాలో చాలా హిట్ పాటలున్నాయి. లిస్టు రాస్తే వేళ్లు నొప్పి పుడతాయి. 'హమ్ చేస్తే అంటుకుని వెంట బడతాయి.

"పర్ దేశీయోంసే న అభియా మిలానా' (జబ్ జబ్ ఫూల్ ఖిలే)
'తుమ్ బిన్ జావూ కహా' (ప్యార్ కా మాసమ్) 'లిబ్రే జో ఖత్ తురే' (కన్యా దాన్) 'వాదా కరో నహీ చోడోగే తుమ్ మేరా సాథ్' (ఆ.. గలే లగ్ జా ) 'ఏక్ డాల్ ఫర్ తోతా బోలే' (చోర్ మచాయే షోర్) "కెహదూ తుమే యా చుప్ రహూ' (దీవార్)
షారూక్ ఖాన్ చాలా రుణపడి ఉన్నాడు శశి కపూర్ కి .
'దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే' టైటిల్ శశికపూర్ యాక్ట్ చేసిన 'చోర్ మచాయే షోర్' సినిమా పాటలోనిదే.
ఇటీవల వచ్చిన 'జానే తూయా జానేనా.... హిట్ సినిమా కూడా శశికపూర్ పాటే. ఇంకా వేయి పాటలు ఉండవచ్చు.

కాని # శశి కపూర్ అంటే ఒకే పాట... ఒకటే జ్ఞాపకం.. ఖిల్ తే హై గుల్ యహా.. ఖిల్ కే బిఖర్ నే కో.
దాదాసాహెబ్ పాల్కే 2015 లో అందుకున్నారు ..2017 డిసెంబర్
4 గున తన 79వ ఏట తిరిగిరాని లోకానికి వెళ్లిపోయారు ఈ శశి కపూర్..

(క్రెడిట్స్ : ఖాదిర్ గారు.)

26/08/2022

కార్యసిద్దిని చేకూర్చే శక్తివంతమైన ఆంజనేయ స్వామి శ్లోకాలు . . .!!.

హనుమంతుడు కార్యసాధకుడు. భక్తితో హనుమంతుడిని కొలిచిన వారికి వారి కోరికలు తప్పక నెరవేరతాయి. భక్తులు వారి వారి కోరికను అనుసరించి ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు.
1. విద్యా ప్రాప్తికి:-
పూజ్యాయ, వాయుపుత్రాయ వాగ్ధోష వినాశన!
సకల విద్యాంకురమే దేవ రామదూత నమోస్తుతే!!

2. ఉద్యోగ ప్రాప్తికి :-
హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వా పీడా వినాశినే!
ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూపా నమోస్తుతే!!

3. కార్య సాధనకు :-
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిమ్ వద!
రామదూత కృపాం సింధో మమకార్యమ్ సాధయప్రభో!!

4. గ్రహదోష నివారణకు :-
మర్కటేశ మహోత్సాహా స్రవ గ్రహ నివారణ!
శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయామ్ ప్రభో!!

5. ఆరోగ్యమునకు :-
ఆయుః ప్రజ్ఞ యశోలక్ష్మీ శ్రద్ధా పుత్రాస్సుశీలతా!
ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే!!

6. సంతాన ప్రాప్తికి :-
పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్!
సంతానం కురమే దేవ రామదూత నమోస్తుతే!!

7. వ్యాపారాభివృద్ధికి :-
సర్వ కళ్యాణ దాతరమ్ సర్వాపత్ నివారకమ్!
అపార కరుణామూర్తిం ఆంజనేయం నమామ్యహమ్!!

8. వివాహ ప్రాప్తికి :-
యోగి ధ్యే యాం ఘ్రి పద్మాయ జగతాం పతయేనమః!
వివాహం కురమేదేవ రామదూత నమోస్తుతే!!

ఈ శ్లోకాలను ఆయా కార్యసిద్ధిని కోరుకునేవారు 40 దినాలు నిష్ఠతో స్మరిస్తూ, ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి శక్తికొద్దీ ప్రదక్షణా సంఖ్యా నియమాన్ని అనుసరించి ప్రదక్షణాలు చేసి ఆ స్వామిని పూజిస్తే తమ తమ కార్యాలలో విజేతలు అవుతారు.

25/08/2022

🕉 శ్రీ గురుభ్యోనమః🙏🏻
శుక్రవారం, ఆగష్టు 26, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం - వర్ష ఋతువు
శ్రావణ మాసం - బహుళ పక్షం
తిథి: చతుర్దశి ఉ11.39వరకు తదుపరి
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:ఆశ్రేష రా7.01 వరకు
యోగం:పరిఘము తె3.44 వరకు
కరణం:శకుని ఉ11.39 వరకు తదుపరి చతుష్పాత్ రా12.20వరకు
వర్జ్యం:ఉ6.46 - 8.31
దుర్ముహూర్తం:ఉ8.17 - 9.07 &
మ12.27 - 1.17
అమృతకాలం:సా5.16 - 7.01
రాహుకాలం:ఉ10.30 - 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 - 4.30
సూర్యరాశి:సింహం
చంద్రరాశి:కర్కాటకం
సూర్యోదయం:5.47
సూర్యాస్తమయం:6.18
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

23/08/2022

🙏🌺 ఓం గం గణపతయే నమః 🌺🙏

🌺మందార చెట్టు మొదట్లో గణపతి నివాసం ఉంటాడు మందారుడు జిల్లేడు మిత్రులు ఓసారి ఓ మహర్షిని ఎగతాళి చేస్తే మందార చెట్టుగాను జమ్మి చెట్టగాను వారు జన్మించవలసి వచ్చింది వారి వేడుకోలుతో మునివారి శాపాన్ని వరంగా మార్చాడు🌺
🌺మందార జమ్మిలను గణేశునికి అర్పిస్తే కానీ కార్యము ఉండదు. పోను దోషము ఉండదు లభించిని అదృష్టము ఉండదు గురువుకి పెద్దలకు మందార జమ్మిలను ఇచ్చి నమస్కరిస్తే మహా పూజ చేసిన ఫలం కలుగుతుంది
ఇలాగే ఏ పూజ సామాగ్రి లేనప్పుడు జమ్మి ఆకు సమర్పించి పూజిస్తే సకల పూజా ద్రవ్యాలతో చేసిన ఫలం కలుగుతుంది
పార్వతీదేవి పుణ్యక వ్రతం చేయడం ద్వారా సర్వవిఘ్ననాలను తొలగించే గణపతి జన్మించాడు ఆ గణేశుని జన్మ వృత్తాంతము చదవటం ద్వారా పుత్ర సంతతి కలుగుతుంది ధనం లేని వారికి ధనం భార్య లేని వారికి భార్య ధనాన్ని పోగొట్టుకున్న వారికి పూర్వ వైభవం పాటు సమస్త కోరికలు తీరుతాయని బ్రహ్మవైవర్త పురాణం తెలియజే స్తుంది
మన అందరి విఘ్నలు తొలగించాలని గణపతిని కోరుకుంటూ ఓం గం గం గణపతయే నమః 🌺

22/08/2022

ఒక బ్రాహ్మణుడు ఒక సంపన్నుని గృహం లో భాగవత ప్రవచనం ఇస్తున్నారు..అదే సమయంలో ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించి, ఒక మూల దాక్కున్నాడు.

భాగవతంలో కృష్ణుడు వేసుకున్న ఆభరణాల వర్ణన జరుగుతోంది. తల్లి యశోద, కృష్ణుడికి ఏమి నగలు వేసి పంపించిందోో చెప్తున్నారు. దొంగ చాలా ఉత్సాహంగా వింటున్నాడు.

భాగవత ప్రవచనం పూర్తి అయ్యేదాకా ఉండి, బాల కృష్ణుడు కనిపిస్తే నగలు దొంగలిద్దాము అని అనుకున్నాడు. దానికోసం ఆ బ్రాహ్మణుడి వెంట పడ్డాడు.

బ్రాహ్మణుడు భయపడి ‘నా దగ్గర ఏమీ లేదు ‘ అని అన్నారు.
దొంగ, మీ దగ్గర ఉన్న డబ్బుకి నేను ఆశ పడటంలేదు. మీరు చెప్పిన, నగలు ధరించిన కృష్ణుడు, ఆవులు దగ్గర ఉండే కృష్ణుడు, ఎక్కడ ఉంటాడో చెప్పండి’ అని అన్నాడు.

బ్రాహ్మణుడు ఆలోచించి, “బృందావనంలో యమునా నది తీరం దగ్గరకు రోజూ ఇద్దరు పిల్లలు వస్తారు. ఒక పిల్లవాడు నల్ల మబ్బు రంగులో ఉండి , పిల్లన గ్రోవి వాయిస్తూ ఉంటాడు. ఇంకో పిల్లవాడు తెల్లగా ఉంటాడు , తెల్లటి పట్టు వస్త్రము ధరించి ఉంటాడు. ఆ నల్ల మబ్బు ఛాయలో , పిల్లన గ్రోవి వాయిస్తూ ఉండే వాడే, నేను భాగవతంలో చెప్పిన కృష్ణుడు”అని ఆ దొంగ నుండి తప్పించుకోటానికి చెప్పాడు.

దొంగ బ్రాహ్మణుడి మాట నమ్మి బృందావనానికి వెళ్ళాడు.యమునా నది తీరం వద్ద కూర్చుని, ఆ ఇద్దరి పిల్లల రాక కోసం ఎదురు చూశాడు. ఇంతలో
పిల్లన గ్రోవి వినిపించింది , ఇద్దరు పిల్లలు వస్తున్నారు.ఆ అందమైన దృశ్యం చూసి చెట్టు దిగి, పిల్లల దగ్గరకు వెళ్ళాడు దొంగ.

బాల కృష్ణుడిని చూడగానే, దొంగ మనసులో ఆనందం కలిగి, అతని కళ్ళమ్మట నీళ్లు కారుతూ, ‘ఏ తల్లి కన్న బిడ్డో, ఇంత అందంగా ఉన్నాడు ‘ అని అనుకున్నాడు.

ఈ విధంగా దొంగ ఆలోచనలో మంచి మార్పు వచ్చింది..

తరువాత చూస్తే, దొంగ భుజం మీద నగలు నిండి ఉన్న ఒక మూట ఉంది. అది తీసుకుని,ఆ దొంగ బ్రాహ్మణుడి దగ్గరకి వెళ్లి, జరింగింది అంతా చెప్పాడు.

ఆనందభాష్పాలతో ఆ బ్రాహ్మణుడు కృష్ణుడిని చూసిన చోటు, తనకు చూపించమని దొంగని అడిగాడు. ఇద్దరూ కలిసి ఆ చోటికి వెళ్ళగానే, దొంగకి కనిపించిన బాల కృష్ణుడు, బ్రాహ్మణుడికి, కనిపించలేదు. అప్పుడు బ్రాహ్మణుడు నిరాశతో కృష్ణుడిని ,నీవు ఒక దొంగని అనుగ్రహించావు , నాకు కూడా దర్శనం ఇవ్వవా?” అని బాధపడ్డాడు.

అప్పుడు అపారమైన కరుణ గల కృష్ణ భగవానుడు ఇలా అన్నారు ‘ నీవు భాగవత పురాణమును కేవలము ఒక కథగా చదివావు , కాని , దొంగ, నువ్వు చెప్పిన కథని, మాటలని మనస్ఫూర్తిగా నమ్మాడు. అపార నమ్మకం , సమర్పణ "శరణాగతి" ఉన్న చోటే నేను ఉంటాను.” అని చెప్పాడు....

22/08/2022

ఓం అరుణాచలేశ్వరాయ నమః

22/08/2022

#మంగళసూత్రము...

మన హిందూ సోదరీమణుల దౌర్భాగ్య పరిస్థితి ఏమిటంటే.. నవీనత పరాకాష్టకి వెళ్లి #మంగళసూత్రము ను త్యజించడం లేదా పక్కన పెట్టడం పరిపాటిగా మారింది. అంతేకాక ఈ సినిమాలు, టీవీల పుణ్యమా అని అది ఒక ఆట వస్తువుగా మారిపోయింది.
మన ఖర్మ కొద్దీ మన బంధు మిత్ర గణాల నుండి వచ్చే వాట్సాప్ లు ఫేస్బుక్ లలో వచ్చే ఫోటోలు కూడా ఎక్కువ శాతం మంగళసూత్రాలు, బొట్టు, గాజులు లేకుండా ఉన్నవే. ఇది చాలా అరిష్టం..

క్షీరసాగర మధన సందర్భంలో మాంగళ్య వివరణ...

“మ్రింగెడివాడు విభుండని మ్రింగెడిదియు
గరళమనియు మేలని ప్రజకున్
మ్రింగుమనే సర్వమంగళ
మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో!

పరమశివుడు భయంకరమైన హాలాహలాన్ని త్రాగి కూడా చిరంజీవి గా ఉన్నడంటే అది ఆయన గొప్ప కాదట.., అమ్మ పార్వతీ దేవి కంఠాన ఉన్న మాంగల్యాభరణం గొప్పదనమట.

“మాంగల్యం తంతునానేనా
మమజీవన హేతునా!
కంఠే భద్నామి సుభగే
త్వం జీవ శరదాంశతం”

ఓ సుభగా! నా జీవనానికి ఆధారమైన ఈ మంగళ సూత్రాన్ని నీ కంఠానికి కడుతున్నాను. నువ్వు దీనిని ధరించి నా జీవితాన్ని నిలుపుతావు. అటువంటి నువ్వు నూరేళ్ళు జీవించు, అంటే పుణ్యస్త్రీ గా, ముత్తయిదువు గా సకల సౌభాగ్యాలతో జీవించు అని స్పష్టముగా తెలుస్తున్నది..

పూర్వం భారతదేశంలో మాతృస్వామిక వ్యవస్థ విరాజిల్లినప్పుడు ఎటువంటి ఆచారాలు, కట్టుబాట్లు ఉండేవి కాదు. బలవంతుడిదే రాజ్యం అన్న రోజులవి..

భారతావనిలో పిండారీలు, థగ్గులు వంటి కిరాత జాతుల వారు వలస వచ్చారు. ఒక తెగకు చెందిన స్త్రీలను మరొక తెగకు చెందిన పురుషులు ఎత్తుకొని పోయేవారు. మహిళ మెడలో మంగళసూత్రం కనిపిస్తే చాలు ఏ హాని చేయకుండా విడిచి పెట్టేవారు. కిరాతకులు కూడా ఈ మంగళ సూత్రాన్ని గౌరవించారు. అలా కోట్లాది మగువల మాన ప్రాణాలను కాపాడిందీ మంగళసూత్రం. అందుకే అప్పటి నుండీ ఆడపిల్ల పుడితే బాల్యంలోనే పెళ్ళి చేసి మాంగల్యం వేసేవారు.

ఆదిశంకరాచార్యుల వారు వ్రాసిన సౌందర్య లహరి పుస్తకములో కూడా మంగళ సూత్రానికి విశేష విశిష్టత కల్పించారు.

మంగళసూత్రంలో ముత్యం, పగడం ధరింపజేసే సాంప్రదాయం మనది, ఎందుకంటే..,

ముత్యం చంద్ర గ్రహానికి ప్రతీక. చంద్రుడు దేహ సౌఖ్యం, సౌందర్యం, మనస్సు, శాంతి, ఆనందములకు, అన్యోన్య దాంపత్యములకు కారకుడు, శారీరకంగా నేత్రములు, క్రొవ్వు, గ్రంథులు, సిరలు, ధమనులు, స్తనములు, స్త్రీల గుహ్యావయములు, నరములు, ఇంద్రియములు, గర్భధారణ, ప్రసవములకు కారకుడు..

పగడం కుజ గ్రహనికి ప్రతీక. కుజ గ్రహ దోషాల వలన అతికోపం, కలహాలు, మూర్ఖత్వం, సామర్ధ్యము, రోగము, ఋణపీడలు, అగ్ని, విద్యుత్భయములు, పర దూషణ, కామ వాంఛలు, దీర్ఘ సౌమాంగల్యము, దృష్టి దోషము యిత్యాదులు మరియు శారీరకంగా ఉదరము, రక్తస్రావము, గర్భస్రావము, ఋతు దోషములు మొదలగునవి.

ఖగోళంలో ముఖ్యమైన నక్షత్రాలు 27. ఆ 27 నక్షత్రాలలో చంద్రుడు 27 రోజులు సంచారం గావించి 28 వ రోజున కుజునితో కలిసే రోజే స్త్రీకి ఋతు సమయం. అంటే అర్ధం..., ఆరోగ్యమైన స్త్రీకి 28 వ రోజులకు ఋతు దర్శనమవాలి.

భారతీయ సాంప్రదాయ స్త్రీలకు మంగళ సూత్రములో ముత్యం మించిన విలువైనది లేనే లేదు., దానికి తోడు జాతి పగడం ధరించడం మన మహర్షులు చెప్పటంలో విశేష గూడార్ధమున్నది.. అదేమిటంటే ముత్యం, పగడం ధరించిన పాత తరం స్త్రీలలో ఆపరేషన్ అనేది చాలా అరుదైన విషయం. కాని నేటితరం స్త్రీలలో కానుపు ఆపరేషన్తోనే జరగటం సర్వ సాధారణమై పోయింది.

ముత్యం, పగడం సూర్యుని నుండి వచ్చే కిరణాలలో ఉండే ఎరుపు (కుజుడు) తెలుపు (చంద్రుడు) స్వీకరించి స్త్రీ భాగంలోని అన్ని నాడీ కేంద్రములను ఉత్తేజపరచి శరీరకంగా, భౌతికంగా ఆ జంట గ్రహాలు స్త్రీలలో వచ్చే నష్టాలను, దోషాలను తొలగిస్తాయనటంలో ఎటువంటి సందేహం వలదు.

కనుక చంద్ర కుజుల కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంత ప్రాముఖ్యం వహిస్తాయో అలాగే ముత్యం, పగడం రెండూ కూడా కలిపిన మంగళసూత్రం స్త్రీకి అత్యంత శుభ ఫలితాలు సమకూర్చగలవు.

పాశ్చాత్య అనుకరణ వెర్రిలో ఊగుతున్న మన ఆడ కూతుర్లను మందలించైనా తిరిగి మన ధర్మం వైపు తీసుకుని వద్దాం.. దీని విశిష్టతని అర్ధం అయ్యే వరకు తెలియపరచండి...

సనాతన హిందూ ధర్మాన్ని గౌరవించండి - పాటించండి..

Website