VSR24 న్యూస్
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from VSR24 న్యూస్, Media/News Company, .
https://youtu.be/asd5t6T7wu4
#సబ్ స్క్రైబ్ మై ఛానెల్ #
వెళుతున్న లారీలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు కృష్ణాజిల్లా : బాపులపాడు మండలం, వీరవల్లి వద్ద జాతీయ రహదారిపై అగ్నిప్రమాదం.- లారీ విజయవాడ వైపు నుండి ఏలూరు వైపు వ.....
ఏలూరుజిల్లా : జంగారెడ్డిగూడెం పురపాలక సంఘ సమావేశంలో కౌన్సిలర్లు ఆందోళన, అవినీతి కమీషనర్ ను సస్పెండ్ చేయాలంటూ ప్ల కార్డులతో నిరసన
టి.నరసాపురం మండలం మాజీ ఎంపీపీ, తెదేపా ఏపీ రాష్ట్ర కార్యదర్శి శీలం వెంకటేశ్వరరావు కు మాతృవియోగం. శీలం పైడమ్మ అనారోగ్యంతో విజయవాడ ప్రైవేట్ ఆస్పత్రి లో మంగళవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు.ఆమె మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
ఏలూరు జిల్లా......
👉జంగారెడ్డిగూడెం లో స్థానిక ఓ రెస్టారెంట్ లో పని చేస్తున్న ఒరిస్సా కి చెందిన యువకుడు అనుమానాస్పద స్థితిలో ఫ్యాను కి ఉరి వేసుకొని అత్మ హత్య.....
👉కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న జంగారెడ్డి గూడెం పోలీసులు....
*ఏలూరు జిల్లా ఏలూరు ఒకటవ పట్టణ పరిధిలో సత్యనారాయణ థియేటర్లో కేజీఎఫ్ సినిమా చూస్తూ మృతి చెందిన గుర్తు తెలియని యువకుడు. ఆచూకీ తెలిసినవారు ఒకటో పట్టణ ఇన్స్పెక్టర్ 9440796604 వారికి తెలియజేయగలరు*
👉నువ్వొక అమ్మకి , అబ్బకి పుట్టి ఉంటె నీ 2014 లో నీ టీడీపీ ప్రవేశ పెట్టిన మానిఫెస్టో నీ తీసుకురా..... ఎమ్మెల్యే ఉన్న మట్లఎలిజా
----------------------------------------------------
👉చింతలపూడి నియోజకవర్గం ప్రగడవరం పంచాయతీ అక్కంపాలెంలో వైసీపీ , టీడీపీ మధ్య తోపులాటలు
👉అక్కంపాలెం గ్రామంలో సోమవారం రాత్రి బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న చింతమనేని
👉 దళితులను కులం పేరుతో దూషించారంటూ చింతమనేనిపై తిరగబడ్డ స్థానిక దళితులు.. దీంతో కార్యకర్తలు , నాయకులతో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయిన చింతమనేని
👉సీఎం వైయస్ జగన్ ను అసభ్య పదజాలంతో పాటు చింతలపూడి మండలం ప్రగడవడం దళిత సర్పంచ్ నీ కులం పేరుతో దూషించినట్లు ఆరోపణలు..
👉చింతమనేని పై చింతలపూడి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన ప్రగడవరం సర్పంచ్...
👉దెందులూరు నుండి వచ్చి మా గ్రామంలో గొడవలు సృస్తున్నారని , సీఎం జగన్ ను ఎందుకు దూషిస్తున్నారని ప్రశ్నించిన సర్పంచ్
👉నా ఇష్టం.. రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్తా నీకు సమాధానం చెప్పేదేంటి రా.. మాదిగ నా కొడకా అంటూ కులం పేరుతో దూషించి దాడి చేసినట్లు ఫిర్యాదులో తెలిపిన సర్పంచ్
👉టిడిపి దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమేని ప్రభాకర్ పై ఫైర్ అయిన ఎమ్మెల్యే ఎలిజా.
👉చింతమనేని వ్యాఖ్యలని ఖండించిన ఎమ్మేల్యే ఎలిజా.
👉నువ్వొక అమ్మకి , అబ్బకి పుట్టి ఉంటె నీ 2014 లో నీ టీడీపీ ప్రవేశ పెట్టిన మానిఫెస్టో నీ తీసుకురామన్న ఎమ్మెల్యే
👉నీ టీడీపీ మానిఫెస్టో తో మా వైసీపీ మానిఫెస్టో తో బహిరంగ చర్చకు సిద్దమా. అంటూ చింతమనేని కి సవాల్ విసిరిన చింతలపూడి ఎమ్మెల్యే ఉన్న మట్ల ఎలిజా.....
👉గత కొంత కాలంగా చింతలపూడి నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలకు తెరలేపారని చింతమనేని పై ఆరోపణలు
👉మాజీ మంత్రి పీతల సుజాతను టార్గెట్ చేస్తూ ఓ ప్రత్యేక గ్రూప్ తో నియోజకవర్గంలో పర్యటిస్తున్నారంటూ చింతమనేని పై బలపడుతున్న ఆరోపణలు
👉 ప.గో.జిల్లా తాడేపల్లిగూడెం మండలం కృష్ణాయపాలెంలో ఉరుసు సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లో చోరీ.
👉 వేసవికాలం నేపథ్యంలో ఇంటి బయట పడుకున్న వృద్ధ దంపతులు.
👉 ఘాడనిద్రలో ఉన్న సమయంలో ఇంట్లోకి దూరి, రూ 3,20,000/- నగదు ఎత్తుకెళ్లిన దుండగుడు.
👉 కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రూరల్ పోలీసులు.
డబ్బులు పోగు చేసాం
బైకుల ర్యాలి జేసాం
డీజే పెట్టాం
పెట్రోల్ కొట్టాం
బ్యానర్ గట్టాం
దండలు వేశాం
మైకులు పెట్టాం
స్టేజిలు గట్టాం
కేకులు కోసం
కేకలు వేశాం
ర్యాలీ చేసినంత మంది
ఓట్లు కూడా వేసుకోలేం
ఇక చాలులే బడాయి
అయిపోయింది
ఆ ఒక్కరోజు లడాయి
ఆ దండలెప్పుడో వాడిపోయాయి
సిద్ధాంతం ఒంటబట్టక
పల్లెలెప్పుడో ఓడిపోయాయి
మళ్లీ వర్ధంతికో జయంతికో
బంతిపూల ర్యాలిలో కలుసుకుందాం
బై బై భీం ..
మళ్లీ జయంతికి కలుద్దాం
జగ్జీవన్ రాం
పచ్చల రాజేష్
16.04.2022.
To see more posts like this and join ALL INDIA MADIGA RESERVATION PORATA SAMITHI, click here 👇👇
https://kutumbapp.page.link/nYXvksnqbRfM3Rjf8?ref=MRCQN
https://www.facebook.com/284924868277246/posts/4319522988150727/
(update : ఈ అమ్మాయి నిడదవోలులోని మునిపల్లి . తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించిన రాజమండ్రి త్రీటౌన్ పోలీసులు. మెసేజ్ అన్ని గ్రూపుల్లోకి ఫార్వర్డ్ చేసి అమ్మాయిని క్షేమంగా ఇంటికి చేరడానికి సహకరించిన మిత్రులు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు👏👏👏)
తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం
ఈ అమ్మాయి ఏవరో తెలియదు. ఇంట్లో నుండి పారిపోయి వచ్చేసింది.
ఏ విధమైన సమాచారం ఇవ్వడంలేదు. సంబంధం లేని విషయాలు చెప్పుతుంది. ఈమె ప్రస్తుతం దిశ పోలీసులు ఆధీనంలోని స్టేట్ హోంలో ఉంది.
ఈమె ఆచూకీ తెలిసిన వారు దీశా మహిళ పోలీసు +919652179423 నెంబర్ కు ఫోన్ చేసి తెలియజేయగలరు.
😍 👌👌
❤️ 😍
తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం
ఈ అమ్మాయి ఏవరో తెలియదు. ఇంట్లో నుండి పారిపోయి వచ్చేసింది. ఏ విధమైన సమాచారం ఇవ్వడంలేదు. సంబంధం లేని విషయాలు చెప్పుతుంది. ఈమె ప్రస్తుతం దిశ పోలీసులు ఆధీనంలోని స్టేట్ హోంలో ఉంది. ఈమె ఆచూకీ తెలిసిన వారు దిశా మహిళ పోలీసు +919652179423 నెంబర్ కు ఫోన్ చేసి తెలియజేయగలరు.
26 జిల్లాలకు విద్యా శాఖ కేటాయించిన కోడ్ లు
ప్రెస్ నోట్
Cr.No.118/2022 u/s 304 Part-II r/w 34 IPC, Sec.25(1A), 27 (2) Arms Act-1959 of
T. Narasapuram PS on 06.04.2022
ఈరోజు అరెస్టయిన నిందితుల పేర్లు:
A3: షేక్ రంగా వలి S/o ఖాసిం, 50 సంవత్సరాలు; దూదేకుల, జీలుగుమిల్లి (V) & (M).
A4: సింగ్ చంద్ర మోహన్ సింగ్ S/o రాజా సింగ్, 40 సంవత్సరాలు, నక్కల కులం, 5వ వార్డు, వెంకటాపురం, ఏలూరు.
06.04.2022న ఇప్పటికే అరెస్టు చేసిన నిందితుల పేర్లు:
A1) కోర్సా రాజీవ్ కుమార్, S/o జోగేశ్వరరావు, 28 సంవత్సరాలు, ST-కోయ, తీగలపల్లి (V), టి.నరసాపురం (M).
A2) కోర్సా నరసింహ @ నరసింహారావు, S/o వీధరావు, 23 సంవత్సరాలు, ST కోయ, తీగలపల్లి (V)
మృతిని పేరు: -
చీదర కృష్ణ S/o వీరాస్వామి, 27 సంవత్సరాలు, ST-కోయ, పాత చీపురుగూడెం (V), దమ్మపేట (M), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ రాష్ట్రం.
-o0o-
మృతుడు చీదర కృష్ణ స్వస్థలం దమ్మపేట కాగా, అత్తగారిది తీగలపల్లి. మృతుడు మరియు నిందితులు కోర్సా రాజీవ్ కుమార్ & కోర్సా నరసింహలు స్నేహితులు. సుమారు 2 సంవత్సరాల క్రితం నిందితులు ఇద్దరు, జీలుగుమిల్లికి చెందిన షేక్ రంగా వలి (A-3) మధ్యవర్తిత్వం ద్వారా, ఎలురుకి చెందిన సింగ్ చంద్ర మోహన్ సింగ్ (A-4) దగ్గర రెండు సింగిల్ బ్యారెల్ muscle లోడ్ (SBML) నాటు తుపాకులను, కుందేళ్ళు మొదలైన జంతువులను వేటాడేందుకు, ఒక్కొక్కటి Rs.5000/- కి అక్రమంగా కొనుక్కుని వారి దగ్గర ఉంచుకున్నారు..
మృతుడు తీగలపల్లి వచ్చినప్పుడల్లా, రాజీవ్ కుమార్ మరియు నరసింహ లతో కలసి జంతువుల వేటకు వెళ్ళేవాడు. అదేవిదంగా, మృతుడు 05.04.2022 భార్యతో కలిసి అత్తగారింటికి తీగలపల్లి వచ్చాడు. అదేరోజు రాత్రి సుమారు 9 గంటలకి ముగ్గురు కలిసి నరసింహకి చెందిన AP37 CZ 9895 నంబరుగల మోటార్ సైకిల్ పై తీగలపల్లి నుండి వేటకి బయలుదేరారు. ఆసమయంలో నరసింహ మోటార్ సైకిల్ నడుపుచుండగా, నరసింహకి చెందిన తుపాకీని మృతుడు పట్టుకొని మద్యలో కూర్చోగ; రాజీవ్ కుమార్ తన తుపాకీని పట్టుకొని చివర కూర్చుని ఉన్నారు.
మార్గంలో రాత్రి 10.30 గంటలకు గౌరి శంకరపురం (వి) సమీపంలోకి చేరుకున్నప్పుడు, వాహనం కదులుతుండగా రాజీవ్ కుమార్ తన ఎడమ చేతిలో ఉన్న తుపాకిని, కుడి చేతికి తుపాకిని మార్చడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో తుపాకీ నేలకు తగిలి పేలడం వలన మృతుని తల వెనుక వైపు తగిలి భలమయిన గాయం అయ్యి అక్కడక్కడే చనిపోయినాడు.
మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు T. నరసాపురం PS లో కేసు నమోదు చేయబడింది, అదే రోజున నిందితులు రాజీవ్ కుమార్ మరియు నరసింహలను అరెస్టు చేసి రెండు SMBL తుపాకీలను స్వాధీనం చేసుకుకోవడం జరిగింది.
షేక్ రంగా వలి మరియు సింగ్ చంద్ర మోహన్ సింగ్ లను ఈ రోజు అరెస్ట్ చేసి, చంద్ర మోహన్ సింగ్ నుండి ఈ క్రింది వాటి సీజ్ చేయడం జరిగింది.
12 SBML తుపాకులు – 12
సుమారు 20 కిలోల ఫైర్ చెయ్యడానికి ఉపయోగించే పెల్లెట్లు
నాటు తుపాకి కి చెందిన 10 విడి భాగాలు A-4 ఇంటి నుండి స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టు చేసినవారు :- శ్రీ MVS మల్లేశ్వరరావు CI అఫ్ పోలీస్ CTP Circle
మరియు సహకరించిన సిబ్బంది :- శ్రీ M.కుటుంబరావు SI, T.నర్సాపురం పోలీస్ స్టేషన్
:- శ్రీ చెన్నారావు SI, చింతలపూడి పోలీస్ స్టేషన్
:- శ్రీ K.వెంకన్న తడికలపూడి పోలీస్ స్టేషన్
:- శ్రీ.P.హనుమంతరావు PC 2121 T.నర్సాపురం పోలీస్ స్టేషన్
:- శ్రీ.T.రమేష్ PC 1511 T.నర్సాపురం పోలీస్ స్టేషన్
పై వారి అందరకి రివార్డు కోసం శ్రీ ఏలూరు జిల్లా S.P గారికి సిఫార్సు చేయడమైనది.
ఏలూరు జిల్లా, జీలుగుమిల్లి మండలం, చంద్రమ్మ కాలనీలో ప్రేమించిన యువతి ఫోన్ ఎత్తట్లేదని పురుగుల మందు తాగిన యువకుడు...
చికిత్స పొందుతూ రాజమండ్రి ఆసుపత్రిలో మృతి చెందిన సమితి అశోక్ కుమార్ (25) అనే యువకుడు...
దమ్మపేట మండలం,ముష్టిబండ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం...
ఏలూరు జిల్లా,టి.నర్సాపురం మండలం.అప్పలరాజుగూడెం గ్రామానికి చెందిన గర్భిణీ, ఆమె భర్త సత్తుపల్లి హాస్పిటల్ కి వెళ్తుండగా ముష్టి మండ గ్రామం వద్ద డిసిఎం వ్యాన్ ఢీకొని గర్భిణి అక్కడికక్కడే మృతి.
తీవ్రంగా గాయపడిన భర్తను సత్తుపల్లి హాస్పిటల్ కి తరలింపు.
తుపాకీ పేలి...ఓ వ్యక్తి మృతి
టి.నరసాపురం మండలం, తీగలపల్లి గ్రామానికి చెందిన కొరసా నరసింహారావు, కొరసా రాజీవ్ కుమార్ లు ఈ నెల 5వ తేది రాత్రి 9 గంటల సమయంలో AP 37 CZ 9895 నెంబర్ గల HF Delux మోటర్ సైకిల్ పై చీపురుగూడెం గ్రామం, దమ్మ పేట మండలం , భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన చీదర కృష్ణ ను ఎక్కించుకుని, వారి వెంట రెండు నాటు తుపాకులు తీసుకుని కృష్ణాపురం అటవీ ప్రాంతానికి వేటకు వెళ్ళినట్లు, ఆ అటవీ ప్రాంతంలో ఒక నాటు తుపాకీ రాత్రి 11 గంటల సమయంలో ప్రమాదవశాత్తు పేలి చీదర కృష్ణ కు తల వెనుక భాగంలో తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు కొరసా నరసింహారావు, కొరసా రాజీవ్ కుమార్ లు గ్రామ పెద్దలకు చెప్పగా... మృతుణ్ణి చీపురుగూడెం గ్రామం, దమ్మ పేట మండలం , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కు 6-4-2022 న తీసుకు వెళ్ళినట్లు, మృతుణ్ణి పరిశీలించగా తల వెనుక భాగంలో గాయం అయ్యి, ఒళ్లంతా రక్తం అయ్యి చనిపోయి ఉన్నట్లు తగు చర్య నిమిత్తం మృతిని భార్య ఫిర్యాదు చేసినట్లు, దీనిపై కేసు నమోదు చేసి చేసినట్లు టి.నరసాపురం మండల ఎస్ ఐ ఎం కుటుంబరావు తెలిపారు.
ఏలూరు జిల్లా కలెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన వె. ప్రసన్న వెంకటేష్
ఏలూరు 04: ఏలూరు జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా పలువురు మత పెద్దలు, కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కు ఆశీర్వచనం అందజేశారు.
అదే విధంగా జిల్లాలో వివిధ శాఖలకు నియమించబడిన పలువురు అధికారులు జిల్లా కలెక్టర్ ని మర్యాద పూర్వకంగా కలిసారు.
సంపూర్ణ అభివృద్ధి లక్ష్యంగా పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా పున:ర్ వ్యవస్థీకరణ చేసిన ఏలూరు.
పదవి బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ పి.అరుణ్ బాబు మహాత్మా గాంధీకి నివాళి అర్పించి, శాంతి కపోతలను నింగిలోకి వదిలారు.
ఈ కార్యక్రమంలో డి అర్ వో సత్యనారాయణ మూర్తి, జడ్పీ సీఈవో హరి హరనాథ్, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రైతులకు 9గంటలు నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి - తెదేపా ఏపీ రాష్ట్ర కార్యదర్శి శీలం వెంకటేశ్వరరావు
టి.నరసాపురం విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద తెదేపా ధర్నా
టి.నరసాపురం మండలం, మక్కినవారిగూడెం గ్రామంలో మక్కినవారిగూడెం క్రికెట్ అసోసియేషన్ ఎంసిఎ వారి ఆధ్వర్యంలో ఆదివారం చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంసిఏ అధ్యక్షులు డివివి సత్యనారాయణ మాట్లాడుతూ 2017 అక్టోబర్ నుండి నేటి వరకు ఎంసీఏ ద్వారా ఎంతో మందికి విద్య, వైద్యం, ఉపాధి నిమిత్తం అర్హులైన వారందరికీ కూడా మా వంతు సేవ చేయడం జరిగింది అని తెలిపారు. అలాగే భవిష్యత్తులో కూడా ఎంసీఏ దృష్టికి పై సమస్యల ద్వారా ఇబ్బంది పడుతున్న వారి గురించి తెలియజేసిన ఎడల మా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది అని తెలియజేశారు. అలాగే మన గ్రామం లో ఉన్నటువంటి యువత ఎంసీఏ వారికి సహకరించి మరి కొంతమంది ఆపన్నులకు సేవచేసే కార్యక్రమంలో భాగస్వాములు కాగలరని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వి గోపి, ఏవి గణేష్, ఎన్ విజయ్, జె నారాయణ, ఆర్ వి రామాచారి, ఎల్లపు బ్రదర్స్, సిహెచ్ శివ, సిహెచ్ మణికంఠ, వై సూరి, ఎంసీఏ సభ్యులు, కార్మికులు, వ్యాపారులు,తదితరులు పాల్గొన్నారు.
అర్ధరాత్రి వేడుకలు లేవు
మద్యం, మాంసం వాసనలు లేవు.. నడివీధులలో హారన్ హోరులు లేవు ! చెవులు హోరెత్తించే సంగీతపు డి.జె లు లేవు !
మందు గ్లాసుల గలగల లేదు
కృత్రిమ దీపాల కళకళ లేదు
బార్ ల ముందు బారులు లేవు
HAPPY NEW YEAR హగ్గులు లేవు... పెగ్గులు లేవు... కెమికల్ రంగుల ముగ్గులు లేవు...
నిన్న అర్ధరాత్రి అస్తమిస్తున్న అమావాస్య చీకట్లు..వేపపువ్వూ వాసనలు ఉన్నాయి...మామిడికాయ పుల్లదనం, ఆరోగ్యాన్నిచ్చే పచ్చడి ఉంది...
వీధుల్లో నూతన వస్త్రాల తళతళలు... దివ్యాశిస్సుల కోసం దేవాలయ దర్శనాలు...
గడపగడపనా టి.వి.లో పంచాంగ శ్రవణాలు...
ఇంటింట షడ్రుచుల పచ్చడి...
ఇదీ తెలుగుదనం అంటే...!
అదీ మన కొత్త సంవత్సరం ఉగాది !
బుట్టాయగూడెం మండలం లో మరో దారుణం
👉 కొవ్వాడ గ్రామనికి చెందిన తాటికొండ అనిల్ (27) అనే వ్యక్తిని నాటు తుపాకి తో కాల్చి చంపిన గుర్తుతెలియని వ్యక్తులు.
👉 సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్న పోలీసులు.
ఒక్కో బాధిత కుటుంబానికి రూ.లక్ష జనసేన ఆర్థిక సాయం: పవన్
అమరావతి: ఏపీలో అప్పుల బాధలతో రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. గోదావరి జిల్లాల్లోనే 80 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు.
సాగును నమ్ముకున్నవారి పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.లక్ష జనసేన ఆర్థిక సాయం అందిస్తుందని పవన్ పేర్కొన్నారు. ఉగాది పూట ఆ కుటుంబాలు బాధతో ఉండకూడదనే వారికి కొంతైనా ఊరటనిచ్చేలా జనసేన పక్షాన ఆర్థిక సాయం అందించనున్నట్టు వెల్లడించారు. త్వరలోనే ప్రతి బాధిత కుటుంబాన్నీ పరామర్శిస్తానన్నారు. ఆర్థికసాయం అందించే ప్రక్రియ కూడా మొదలవుతుందని పవన్ పేర్కొన్నారు.
అంగరంగ వైభోగంగా మహాలక్ష్మి అమ్మవారి ఊరేగింపు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించిన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ శనివారం చింతలపూడి చేరుకుంది. చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు సింగిరెడ్డి భరత్ రెడ్డి, ఆసుపత్రి సూపరిండెంట్ రసూల్, ఆసుపత్రి సిబ్బంది తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ను చింతలపూడిలో ప్రారంభించారు. ప్రసవం తర్వాత బాలింతలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా సురక్షితంగా... ఉచితంగా ఇంటివద్దకు చేర్చే ఈ కార్యక్రమమును వృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి కి,ఎమ్మెల్యే, ఎంపీ లకు కృతజ్ఞతలు తెలియజేశారు.
పోలవరం సిఐ విజయ్ బాబు అధ్వర్యంలో పోలవరం ఎస్ఐ శ్రీనివాస్ కి రాబడిన సమాచారం పై శనివారం, 02.04.2022 వ తేది నాడు పోలవరం ఎస్ఐ, తమ సిబ్బంది తో కలిసి ఇటుకుల కోట గ్రామ పంచాయతీ శివారు కోడి పందాలు నిర్వహిస్తున్న వారిపై దాడులు నిర్వహించి 11 మంది వ్యక్తులను అదుపులో తీసుకొని, వారి వద్ద నుండి 3 కోడి పుంజులను,02 కోడి కత్తులను, 9,500 రూ.లను స్వాధీనం చేసుకొని వారి పై పోలవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ తెలియజేసినారు.
నంది అవార్డులను అందిచిన మల్లాది విష్ణు
సమాజంలో వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారిని గుర్తించి ప్రోత్సహించాలని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. శుక్రవారం రాత్రి విజయవాడ శ్రీ హనుమంతరాయ గ్రంథాలయ ఆవరణం లో విజయ శ్రీ సాంస్కృతిక సేవా సంస్థ, ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ ల ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అందించిన వారిని గుర్తించి మయూరి నంది అవార్డులను మల్లాది విష్ణు అందజేశారు. ఈ అవార్డుల్లో పశ్చిమ గోదావరి జిల్లాలోని కళా రంగంల్లో సేవలందిస్తున్న జంగారెడ్డిగూడెం మండలానికి చెందిన జానపద కళాకారులు ఎల్ ఆర్ కృష్ణ బాబు, రంగస్థల కళాకారులు బుద్ధాల సత్యనారాయణ, సమాజ సేవకులు శీలం రామచంద్రరావు, టి నర్సాపురం మండలానికి కి చెందిన బుర్రకథ కళాకారులు వీరమల్ల సత్యనారాయణలను, కరోనా సమయంలో పలు సేవా కార్యక్రమాలు, ఆక్సిజన్ అందజేసిన కామవరపుకోట యాంటీ కరోనా టీం సభ్యులు వీరమల్ల మధు, దుర్గాప్రసాద్, కర్వేపాకు శ్రీను, సౌజన్ లను నిర్వాహకులు ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో లో విజయశ్రీ సాంస్కృతిక సేవా సంస్థ వ్యవస్థాపక, గౌరవ అధ్యక్షులు తటవర్తి సూర్యనారాయణ, బండారు నరసింహారావు, ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ నిర్వాహకులు గోళ్ల నారాయణరావు, తదితరులు పాల్గొన్నారు.
ప్రజా వ్యతిరేక YCP ప్రభుత్వం నశించాలి
ప.గో: బుట్టాయిగూడెం మండలం జగ్గిశెట్టిగూడెం లో దారుణం.
👉పొలం లో మేకల మందకు కాపలాగా పడుకున్న వ్యక్తి దారుణ హత్య
👉 మంచం పై పడి ఉన్న తల లేని మొండెం..
👉 మృతుడు వనముల పర్వతాలు గా (60) గుర్తింపు
👉 సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్న పోలీసులు.
👉ప.గో బట్టాయు గూడెం మండలం జగ్గిసెట్టి గూడెం లో జరిగిన హత్య కు ఉపయోగించిన గొడ్డలి లభ్యం...
👉స్థానిక ఉర చెరువు గట్టు వద్ద హత్య ఉపయోగించిన గొడ్డలినీ కనుగొన్న పోలీసులు...
👉గొడ్డలి ఆధారం మృతుడి తల కోసం చెరువులో గాలిస్తున్న పోలీసులు....
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి బాధితులకు సత్వర న్యాయం చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్ చెప్పారు.స్థానిక కలెక్టరేట్లో మంగళవారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద గుర్తించిన బాధిత కుటుంబాలకు చెందిన నలుగురికి ఉద్యోగ నియామక పత్రాలను జిల్లా కలెక్టర్ వి. ప్రసన్న వెంకటేష్ అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు చెందిన శీర్ర వంశీని రెవిన్యూ డిపార్ట్మెంట్ లో ఆఫీస్ సబార్డినేట్ గా, శీలం ప్రసన్నను డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆఫీసు సబార్డినేట్ గా, భీమడోలు మాణిక్యాలరావును మరో శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా , డి కవితను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో కుక్/ స్వీపర్ గాను నియమిస్తూ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ షేక్ సాబ్జి, మేదర అజయ్ బాబు, చవ్వాకుల వెంకటేశ్వరరావు, లావేటి ప్రవల్లిక, జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ) డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్, జాయింట్ కలెక్టర్ పి .పద్మావతి, డిఆర్ఓ వి.డేవిడ్ రాజు, నరసాపురం సబ్ కలెక్టర్ విష్ణు చరణ్, సాంఘిక సంక్షేమ శాఖ జె డి ఎస్ మధుసూదన రావు,తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ పేరు పెట్టాలి - దళిత సేన
పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు గోదావరి సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమం లో 20-03-2022 తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు , పశ్చిమగోదావరి జిల్లా ఇంచార్జ్ డి ఆర్ ఓ డేవిడ్ రాజుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దళిత సేన తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షులు జుజ్జువరపు రవి ప్రకాష్ కలిసి ఏలూరు నగరంలో పూర్వం నుండి ప్రభుత్వ జూనియర్ కాలేజీ గా, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గా ఉన్న ఈ కాలేజీలకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని, ఈ కాలేజీలో చదివే విద్యార్థులు అత్యధికంగా ఎస్సీ , ఎస్టీ, బిసి మైనారిటీ బడుగు బలహీన వర్గాలకు చెందిన పేద విద్యార్థులు ఎక్కువమంది చదువుకుంటున్నారు అని , ఈ కాలేజీలకు అంబేద్కర్ పేరు పెట్టినట్లయితే విద్యాభ్యాసంలో మంచి ప్రేరణ కు లోనయ్యి విద్యలో ఉన్నత శిఖరాలకు చేరుతారని, అదేవిధంగా ఏలూరు నగరానికి మంచి పేరు వస్తుందని తెలిపి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా దళిత సేన ఇంచార్జ్ కాకర్లమూడి వెంకటరావు, దళిత సేన ఏలూరు నగర అధ్యక్షులు సురేష్, తదితరులు పాల్గొన్నారు.
టి.నర్సాపురం, మార్చి 28: దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె లో భాగంగా టి.నర్సాపురం సొసైటీ సెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ, ప్రదర్శన కార్యక్రమం వామ పక్ష పార్టీ లు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. తహశీల్దార్ కార్యాలయం వద్ద ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లు రద్దు చేయాలని ,ప్రతి కార్మికులకు 26000/- రూపాయలు కనీస వేతనం అమలు చేయాలని, స్కీమ్ వర్కర్ల ఉద్యోగం గుర్తించి కనీస వేతనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, భవన నిర్మాణ ,హమాలి ,ఆటో కార్మిక సంక్షేమ పథకాలు అమలు చేయాలని, సిపిఎస్ రద్దు చేసి ఓ పి ఎస్ పున:రుద్ధరించాలని, గ్రామీణ ఉపాధి పథకం 200 రోజులు పెంచి రోజు వేతనం 600/-రూపాయలు ఇవ్వాలని, పట్టణ ప్రాంతాలు కూడా విస్తరించాలని, నిత్యవసర వస్తువులు, డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను నియంత్రించాలని, సార్వత్రిక సమ్మె ను జయప్రదం చేయాలని ఈ కార్యక్రమంలో అంగన్వాడీ, ఆశ, అన్ని రంగాల కార్మికులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం నాయకులు మద్దతు తెలియజేశారు .అలాగే యుటిఎఫ్ నాయకులు మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో మండల నాయకులు మురళి, మహిళా సంఘం మండల కార్యదర్శి మడకం కుమారి, విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి గౌరీ, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కొయ్యలగూడెం టుబాకో కేంద్రం లో పొగాకు కొనుగోళ్ళను ప్రారంభించిన పోలవరం ఎమ్మేల్యే తెల్లం బాలరాజు , ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్
చింతలపూడి పరిధిలో టి. నర్సాపురం మండలము, బొర్రంపాలెం గ్రామానికి చెందిన కోమటి అంజిబాబు అనే వ్యక్తి మీద పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ ఉత్తర్యుల మేరకు P D Act కింద అదుపులోకి తీసుకోవడం ఆయినది అని చింతలపూడి సెబ్ ఇనస్పెక్టర్ సుంకర సాయి స్వరూప్ తెలిపారు. గతంలో ఆరు కేసులు ఉండటంతో..., సారా వ్యాపారం మీద ఉండడం వల్ల, నాటు సారా అమ్మడం మూలాన యిటువంటి చర్య తీసుకోవడం అయినది అని, అదే విధంగా ఇతరులు ఎవరైన సారా వ్యాపారం నిరంతరంగా చేస్తూవుంటేే... వారి మీద కూడా ఇటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని, ఈ సారా అమ్మకాలకి దూరంగా ఉండవలసిందిగా ఆయన తెలిపారు.
ఏజెన్సీ ప్రాంతానికి చెందిన యువత కు పోటీ పరీక్షలలో ప్రాధాన్యత కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ఏజెన్సీ ప్రాంతాలలో అనేక రకాలైన కార్యక్రమాలను పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, పోలవరం డిఎస్పీ లత కుమారి నిర్వహించి, ఏజెన్సీ ప్రాంతాల్లో నివాసముంటున్న పోటీ పరీక్షలలో ప్రావీణ్యత సంపాదించుట కొరకు విద్యార్థినీ, విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ను ఉచితముగా గతంలో పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్న నేపథ్యంలో ఏజెన్సీ యువతీ,యువకులను పోటీ పరీక్షల వైపు దృష్టి మళ్లించి, జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలనే ఆశను కల్పించారు. పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మల పూర్తి సహకారంతో పోలవరం డిఎస్పీ లత కుమారి , ఐ టి డి ఏ పి. ఓ. ఒ. ఆనంద్, కె ఆర్.పురం సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం బుట్టాయిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ ఉచిత కోచింగ్ నిర్వహించడానికి పోలవరం సబ్ డివిజన్ పోలీసులు నిర్వహించిన రాత (స్క్రీనింగ్ టెస్ట్) పరీక్షలకు మంచి స్పందన వచ్చింది. ఏజన్సీ మండలాలకు చెందిన అనేక మంది యువతీ,యువకులు ఈ రాత పరీక్షకు ఉత్సాహముగా హాజరవ్వడం పోలీసులను సైతం ఆశ్చర్య పరిచింది. అనేక మంది యువత ఈ పరీక్షలు నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. వేలాది రూపాయలు పెట్టి పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకునే అవకాశం లేని వారికి ఇదొక మంచి వేదికగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
👉ప.గో బుట్టాయిగూడెం మండలం రెడ్డిగణపవరం లో విషాదం...
👉కడుపు నొప్పి వస్తుంది అని టాబ్లెట్ కోసం మందుల దుకాణం వద్దకు వెళ్లిన కవులురి నాగేశ్వరావు(55)...
👉 దీనితో నాగేశ్వరరావు కు మందుల దుకాణం యజమాని బి.నాగేశ్వరమ్మ వెంట వెంటనే చేసిన మూడు ఇంజక్షన్ లు....
👉 దీనితో ఇంటికి వెళ్ళి కుప్పకూలిపోయిన మృతుడు నాగేశ్వరరావు....
👉 మందుల దుకాణం ఎదుట మృతదేహం తో ఆందోళన చేస్తున్న బందువులు....
కృష్ణా: నూజివీడు ట్రిపుల్ ఐటీ హాస్టల్ భవనంపై నుండి దూకి విద్యార్థిని ఆత్మహాత్యయత్నం.
మూడు అంతస్తుల బిల్డింగ్ పై నుండి దూకి తీవ్రగాయాలతో నాలుగు గంటలు రోడ్డుపై పడి వున్న విద్యార్థినిని గుర్తించని సెక్యూరిటీ సిబ్బంది.
ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మారడపు హారిక స్వస్థలం రాజమండ్రి.
ఆత్మహత్యయత్నంకు పాల్పడిన హారిక పరిస్థితి విషమం.
చేతిపై గాయాలు కూడా ఉన్నట్లు గుర్తించడంతో పాటు మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలింపు.
హారిక కు వెన్నెముక, కాళ్ళు, చేతులకు తీవ్రంగా గాయాలయ్యాయి.
ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది, విచారణ చేపట్టిన పోలీసులు.