govinddh7

govinddh7

revaluation

Photos from Jaibharat Samajika viplava ranbheri
's post 09/11/2023
22/08/2023

Jaibharat Movement samajika viplava ranabheri

*మిత్రులారా..*
*దీన్ని లక్షల, కోట్ల మందికి చేరేలా..,*
*తెలంగాణలో రాజకీయ పార్టీల అధినేతల కళ్లు తెరుచుకునేలా..*
*సోషల్ మీడియాలో విస్తృతంగా.. వైరల్* *చెయ్యాలని విజ్ఞప్తి చేస్తున్నాం!

ఇది ప్రజల డిమాండ్ !
ప్రజాస్వామిక డిమాండ్ !!
*బీసీల కుర్చీలపై అగ్రకులాల కబ్జా ఎన్నాళ్లు?*
రాజకీయాలలో మనకి రావాల్సిన న్యాయమైన వాటాకై
ప్రశ్నిద్దాం! పోరాడుదాం!!
రండి!! ఈ ఉద్యమంలో చేయి కలపండి!
జైభారత్ సామాజిక విప్లవ రణభేరి అధ్వర్యంలో మొదలైన ఈ ప్రచార ఉద్యమాన్ని కోట్లాది మందికి చేరవేద్దాం!
ప్రతి ఒక్కరం షేర్ చేద్దాం! స్టేటస్ పెట్టుకుందాం!! మన చేత పది మందికి చేరవేద్దాం!!!
జై భారత్ ! జై జై భారత్

Photos from govinddh7's post 22/08/2023

గిరిజన మహిళ లక్ష్మిని హింసించిన పోలీసులను, బాధ్యులైన ఉన్నతాధికారులను శిక్షించాలి..!!!



movement
https://youtube.com/

Burqa ke upar Jor, Jabardasti mat karo! - Khd. Saira sk 14/08/2023

https://youtu.be/mDU1qjaQmOc

Burqa ke upar Jor, Jabardasti mat karo! - Khd. Saira sk Message Of Khd. Saira sk, National President, JAIBHARAT, on 23rd July 2023 @ Re-organising Meet of JAIBHARAT MUSLIM REVOLUTIONARY FORUM (JMRF) held at Khan ...

11/05/2023

Jaibharat Movement

20/03/2023

#జైభారత్

16/03/2023

#ఛలో సంగారెడ్డి

Photos from govinddh7's post 15/03/2023

#జైభారత్ _సామాజిక విప్లవ _రణభేరి #చల్లో సంగారెడ్డి #మార్చ్ 26ఉదయం 10గం అంబేడ్కర్ భవన్ లో......☝️ మర్రిని వివరాల కోసం 7032372326
9553822307
khd. Raju, Lavanya
jai bharat

14/03/2023

విజయవిహారం రమణమూర్తి గారు ఇటీవల రాసిన అష్ప్హాఖ్ - బిస్మిల్ ల అద్భుత అమరగాథ పుస్తకంలో..

90 ఏళ్ల క్రితం రామ్ ప్రసాద్ బిస్మిల్ రాసిన మాటలు ఇవ్వాల్టి భారతదేశానికి చక్కగా సరిపోతాయి.

'భారతదేశంలో అన్నింటికంటే పెద్ద లోపం ఏమిటంటే ఈ దేశంలో యువకులు నగర జీవనానికి మరిగారు. యువకులు మంచి ఇస్త్రీ బట్టలు ధరించడానికీ, మంచి రోడ్ల పైన తిరగడానికీ, మంచి తీపీ-పులుపూ వున్న, రుచికరమైన భోజనం చేయడానికీ, విదేశీ వస్తువులు నిండివుండే బజారుల్లో విహరించడానికీ, టేబుల్-కుర్చీ పైన కూర్చోవడానికీ, విలాసాలకీ బానిసలై బతకడానికీ అలవాటు పడిపోయారు.
వీళ్ళు గ్రామీణ జీవితాన్ని వట్టి నీరసమైనదిగా, శుష్కమైనదిగా భావిస్తారు. వీళ్ళ అభిప్రాయంలో గ్రామాల్లో కేవలం అర్థ-నాగరీకులు. లేదా అడవి మనుషులు నివసిస్తారు.
ఒకవేళ ఈ ఇంగ్లీష్ స్కూళ్లలో చదువుకునే విద్యార్థి ఎవరైనా ఏదైనా పనిపడి తన సంబంధీకులు వున్న ఏదైనా గ్రామానికి వచ్చాడంటే చూడాలి. అతను ఏదైనా పుస్తకాన్ని వెంట తెచ్చుకుంటాడు. వేరే కూర్చుని చదువుకుంటాడు, లేదా చదువుతూ చదువుతూ కునుకు తీస్తాడు.
ఎవరైనా గ్రామీణుడితో మాట్లాడాలని అతనికి ఆలోచనైనా రాదు. లేదా మాట్లాడటం తన గౌరవానికి భంగం అని అనుకుంటాడు.
తమ పిల్లల్ని ఇంగ్లీషు స్కూళ్లలో చదివించే గ్రామాల్లోని జమీందార్లు ధనికులు కూడా ఇలాగే ఆలోచిస్తారు. ఎలాగైనా తమ పిల్లలు ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదిస్తే చాలనుకుంటున్నాడు
గ్రామీణ బాలకుడు ఎప్పుడైనా పట్టణానికి వెళ్లి, దాని మెరుగుని చూశాక, అతని నెత్తిమీద కూడా ఫ్యాషన్ దెయ్యం ఎక్కి కూర్చుంటుంది. ఫ్యాషన్ గా తిరగాలనే పిచ్చి అతనికి ఉన్నంతగా మరెవరికీ ఉండదు. కొన్నాళ్లలో అతడి ఆచరణలో కూడా ఈ తేడా కనిపించేస్తుంది. ఇటువంటి తీరు తెన్నులు పాఠశాలల్లో వుండే పిల్లలకి అలవాటై, వాళ్ళని దురభ్యాసాలకి నిలయాలుగా మార్చేస్తాయి.
జీవితాంతం తననే సంస్కరించుకోలేనివాడు, ఇక గ్రామీణుల్ని ఏం సంస్కరించగలడు. బూడిద?..'

ఈ పుస్తకం అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాల్లో లభిస్తోంది..
పేజీలు -300. .
పుస్తకానికై khd. Rajini 9848030089 khd Govind Lavanya 7032372326 కి కాల్ చేయండి.

Motivating 'Khadignasi' Philosophy Attracting Youth | Vijaya Viharam Editor Ramana Murthy Interview 12/03/2023

https://youtu.be/k8kpGHW5nWI

Motivating 'Khadignasi' Philosophy Attracting Youth | Vijaya Viharam Editor Ramana Murthy Interview Subscribe to Janagalam Channel Support Independent Journalism విప్లవ చరిత్రలో సరికొత్త పథం... '...

దేశాన్నీ, మతాన్నీ కలపడం తప్పు!- విజయవిహారం రమణమూర్తి 11/03/2023

https://youtu.be/fHzSFhjMbew

దేశాన్నీ, మతాన్నీ కలపడం తప్పు!- విజయవిహారం రమణమూర్తి మహనీయుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ వర్థంతిని పురస్కరించుకుని 20.1.2023న జైభారత్ కేంద్ర కార్యాలయం ఖాన్ అబ్దుల్ గఫార్ ఖ....

11/03/2023

https://www.facebook.com/jaibharatpublications9848030089?mibextid=ZbWKwL

జైభారత్ పబ్లికేషన్స్ నుండి వెలువడిన పుస్తకాల వివరాలు తెల్సుకోవడానికి పైన ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పేజీని లైక్ చేయండి.

అన్నమయ్య గృహ సాధన చైతన్య యాత్ర - 105 :2022 నవంబర్ 15,-శ్రీ సాయిరాం ఆలయం, ఉట్నూర్, ఆదిలాబాద్ జిల్లా. 10/03/2023

https://youtu.be/AqF6bqCprng

అన్నమయ్య గృహ సాధన చైతన్య యాత్ర - 105 :2022 నవంబర్ 15,-శ్రీ సాయిరాం ఆలయం, ఉట్నూర్, ఆదిలాబాద్ జిల్లా. అన్నమయ్య గృహ సాధన సమితి, జైభారత్ ల సంయుక్త ఆధ్వర్యంలో, శ్రీ విజయ శంకర స్వామి నేతృత్వంలో అన్నమయ్య గృహ సాధన చైతన్య...

10/03/2023

https://www.facebook.com/jaibharatpublications9848030089?mibextid=ZbWKwL
పుస్తకం కొరకు కkhd. రజినీ publiction incharge ని సంప్రదించవచ్చు....
9848030089
కుల వ్యతిరేక పోరాట యోధులు జోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే.....

09/03/2023

Jaibharat publications
మజ్హబ్ నహీ సిఖాతా..
—----------------------
వేల సంవత్సరాల కిత్రం.. ప్రపంచంలో నాగరికతలు కన్ను విప్పకముందు, ప్రపంచంలో ఆలోచనలు బయటికి రాకముందు, ఇక్కడ కూర్చున్నటువంటి.. ఋషులు ఋగ్వేదంలో ‘ఏకం సత్ విప్రా బహుధా వదని' అని రాశారు (అంటే) ఉన్నది ఒక్కటే, అది ఏదైనా కానీ, దాన్ని పండితులు పలు విధాలుగా వ్యాఖ్యానిస్తారు (అని)!

దీన్ని ప్లూరలిటీ, బహుళత్వం అంటారు.
ఇదీ భారతదేశం అంటే...! ఇది భారతదేశం అంటే..!
నువ్వు ప్రేమించదల్చుకుంటే ప్రేమించు, ఎందుకంటే.. ప్రపంచంలో ఎవ్వడూ చెప్పలేదు. ఈ మాటని..!

వేల సంవత్సరాల క్రితం.. ఈ దేశంలో వున్నటువంటి జైనులు 'అనేకాంతవాదం' అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని కనిపెట్టారు. దాన్ని 'సప్తభంగి వాదం' అంటారు. వాళ్లు చెప్పింది ఏమిటంటే - నువ్వు అనుకున్నది ఒక్కటే సత్యం కాదు, ఒకేసారి సత్యం ఒక్కటే వుండక్కర్లేదు.. 7 సత్యాలు వుంటాయి అని చెప్పారు! ఏడు అంటే ఎన్నో వుంటాయి అని అర్దం!

ఇప్పటిదాక ప్రపంచంలో ఎవ్వడు మాట్లాడినా.. నేను మాట్లాడిందే ట్రూత్, నేను మాట్లాడిందే కరెక్ట్, నువ్వు మాట్లాడింది తప్పు, నిన్ను చంపడమే నా బాధ్యత, నిన్ను చంపడమే నా కర్తవ్యం.. - అన్నారు. ఇది బయట వుంది!

నువ్వు మాట్లాడింది కూడా సత్యం కావచ్చు. నేను మాట్లాడిందే కాదు, ఇంకా చాలా సత్యాలు వుండొచ్చు.. ఎందుకు ఆవేశ పడతావు? ఈ మాటలు (భారత దేశంలో..) ఒక్కళ్లు కాదు, (ఎందరో) పదే పదే చెప్పారు..!
ఎందుకు భారతదేశంలోనే కబీర్ పుట్టాడు?
ఎందుకు భారతదేశంలో నానక్ పుట్టాడు?
ఎందుకు భారతదేశంలో గాంధీజీ పుట్టాడు?
ఎందుకు భారతదేశంలో గఫార్ ఖాన్ పుట్టాడు?
ఎందుకు భారతదేశంలో రవిదాస్ అద్భుతమైనటువంటి కవిత్వం రాశాడు?

ఎందుకు భారతదేశంలో.. మళ్లీ.. మళ్లీ.. ఒక్కటే గొంతు.. అది ఉపనిషత్తులు కావచ్చు. .. బౌద్ధం కావచ్చు, ..మరేదన్నా కావచ్చు .. ఇవన్నీ ఒకే విషయాన్ని మాట్లాడాయి..!

భారతదేశం గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఒక్కసారి ఎల్లోరా గుహల దగ్గరకి వెళ్లండి. ఔరంగాబాద్ లో వుంటాయి అవి. మహారాష్ట్రలో, నన్ను అడిగితే భారతదేశంలో మొదటి వింత ప్రపంచపు వింతల్లో మొదటి వింత - ఏదని
అడిగితే నేను - ఎల్లోరా గుహలకే ఓటు వేస్తాను..!

తాజ్ మహల్ నాకు వింత అని అనిపించలేదు. తాజ్ మహల్ - ఒక బిల్డింగ్ కట్టి దానికి పాలరాయిని క్లాడింగ్ చెయ్యడం అనేది పాజిబుల్ అవుతుంది.

వాళ్లు ఎల్లోరాలో ఆలయాల్ని ఎలా సృష్టించారంటే.. ఓ కొండ కొండ మొత్తాన్ని ..ఆలయం దాంట్లోనే (ఆ కొండలోనే..) వుంది ఆ కొండలో .. ఆలయం కాకుండా మిగతా భాగాన్ని తీసేశారు..!

జస్ట్ ఇమాజిన్.. ఎక్కడి నుంచో రాళ్లు తెచ్చి పెట్టడం కాదు.
ఈ హాలు వుందనుకోండి ఇక్కడ, లోపల వున్నది. బయట వున్నది. ఆ తలుపు.. అవన్ని తీసేస్తే హాలు అవుతుంది. అటువంటివి మూడు నాలుగు అంతస్థుల టెంపుల్స్ కట్టారు. వాళ్లు, కట్టలేదు. అది (ఆ టెంపుల్) కాని మిగతా (కొండ) భాగాన్ని తీసేసారు..! ఒక కొండలో.... అది (ఆ టెంపుల్) కాని మిగతా భాగాన్ని తీసేసి.. (అలా) అటువంటి టెంపుల్స్ కట్టారు.

ఒక్కొక్కటిగా (కట్టారు). అటువంటి ఆలయాల్ని సృష్టించడానికి వంద ఏళ్లు పడుతుంది. అద్భుతం అది కాదు. అద్భుతం ఏమిటంటే అక్కడ సుమారుగా ఒక యాభై.. అరవై గుహలు వున్నాయి.
నేను ఊరికే.. జ్ఞాపకం మీద మాట్లాడుతున్నాను.
(వాటిల్లో…) కొన్ని గుహలు హిందువులకు సంబంధించినవి. కొన్ని జైనులకి సంబంధించినవి. కొన్ని బౌద్ధులకి సంబంధించినవి.
ఇవి ఒకళ్లంటే ఒకళ్లకి పడని (విభిన్న మతస్తుల)వి.

జైనులు, జైన మతంలో కూడా శ్రీకృష్ణుడి ప్రస్తావన వుందని అంటారు. వాళ్లు ఏమని నమ్ముతారు. అంటే.. అర్జునుడు జైన మతం తీసుకుంటా వుంటే కృష్ణుడు ఆపుచేశాడని (నమ్ముతారు). వాళ్లు (అలా) నమ్మి ఈ కృష్ణుడు అందుకే (అర్జునుడ్ని ఆపినందుకే) నరకానికి పోతాడు అని అనుకుంటారని.. నేను విన్నాను. నిజమో కాదో నాకు తెలియదు.
ఆశ్చర్యం ఏమిటంటే.. ఈ దేశంలో కృష్ణుడు మహా పాపి, నరకానికి వెళతాడు అనేటువంటి మతం అలాగే వుంది, కృష్ణుడు దేవుడు అని నమ్మే మతం కూడా దాని పక్కనే వుంది. ఈ అన్ని గుహలు ఒక్క రోజు కట్టలేదు వాళ్లు. ఒకరోజు హిందూ గుహలు కట్టి వుంటారు, లేదా జైన గుహలు కట్టి వుంటారు. తరువాత ఇంకో (మతం) గుహలు, తరువాత బౌద్ధ గుహలు..!
(ఇవి నిర్మాణమౌతున్న..) ఈ వందల సంవత్సరాల్లో (ఏ రోజైనా.. ఈ గుహలు కట్టేవాడు..(అప్పటికే కట్టి ఉన్న) పాతవన్నీ పగలగొట్టేద్దామని అనుకోలేదు. అలా వుండనిచ్చాడు. ఆ తరువాత వచ్చినవాడు.. ఈ పాత వాటిని) రెండింట్నీ.. బద్దలు కొడదాము అనుకోలేదు. వాడు కూడా (వాటిని) వుండనిచ్చాడు. ఇది అద్భుతం.
ఇది ఎక్కడ జరగలేదు. నో వేర్. నో వేర్.

అందువల్ల.. జర్మనీ కావచ్చు, అమెరికా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు.. మరే దేశమైనా . కావచ్చు.. ఆ దేశంలో ఒక భాష వుంటుంది, ఆ దేశానికి ఒక బోర్డర్ వుంటుంది. భారతదేశంలో (ఒకటి కాదు, రెండు కాదు..) ఏడు, ఎనిమిది వందల భాషలు వున్నాయి. ఎక్కడన్నాచూపించండి, ఇలాంటి అద్భుతం మీరు!

భారతదేశంలో.. ప్రపంచంలో ఎన్ని మతాలు వున్నాయో.. అన్నీ.. ఇక్కడ వున్నాయి. చూపించండి ఇలాంటిది మీరు ఎక్కడన్నా! చూపించండి!
ఎన్ని మతాలు ప్రపంచంలో వున్నాయో... (అన్నీ ఇక్కడ ఉన్నాయి..! ఇదొక (మతాల) మ్యూజియం లాంటిది. అన్నీ.. ఇక్కడ భారతదేశంలో వున్నాయి..! పార్సీ మతస్థులు ఎప్పుడో ఇరాన్ నుంచి ఇక్కడికి.. వచ్చారు. అక్కడ అణచివేతని తట్టుకోలేక.. ఇక్కడికి వచ్చారు. వాళ్లు వచ్చినప్పుడు ఇక్కడి (భారత దేశపు రాజు గారు (పార్సీలకి) చెప్పాడట. వీళ్లు ఓడల మీద వస్తే... ఈ పార్సీ మతస్థులు... ఆ రాజుగారు అన్నాడట మీరు వచ్చారు అక్కడి నుంచి. (కానీ..) మా రాజ్యంలో ప్లేస్ లేదు (అని). ఈయన (భారతదేశపు రాజుగారు) ఒక నిండుగా వున్నటువంటి పాల గ్లాన్ని వాళ్ల ముందు పెట్టాడు. ఈ రాజు గారి అభిప్రాయం ఏమిటంటే నా దేశం.., నా రాజ్యం.. ఈ నిండుగా గ్లాస్ మాదిరిగా నిండిపోయి ఉంది - అని.
అప్పుడు ఈ మత నాయకుడు, ఈ పార్సీల నాయకుడు.. ఏం చేశాడంటే.. - తన జేబులోనుంచి పంచదార తీసి, ఒక స్పూన్ తీసుకుని, దాంట్లో (ఆ పాలల్లో) కలిపి.. తిప్పి.. ఆయనకి (ఆ పాలని మళ్లీ వెనక్కి ఇచ్చాడు. అంటే మేం (పాలల్లో) పంచదారలాగ ఈ దేశంలో కలిసిపోతాం, మీకేమీ ఇబ్బంది కలిగించం - అని.

ఇట్ హ్యపెండ్. అలా జరిగింది..
మీరు చూడండి.. ఏ దేశంలోనైనా మైనారిటీలు వస్తే వాళ్లు ఏదన్నా పనికిరాని పనులు చేసుకుంటూ, రోడ్ల మీద ఏరుకుంటూ, లేకపోతే వేరే పనులు చేసుకుంటూ వుండాలి.
కానీ ఇవ్వాళ భారతదేశంలో అత్యంత సంపన్నులు ఎవరున్నారంటే (వాళ్లు) పార్సీలే. కానీ వాళ్లంతా కలిపితే చాలా తక్కువ మంది వుంటారు. వాళ్ల మత ఆచారాలు..హిందువులకి, లేదా ఇక్కడి ఈదేశంలో వున్నటువంటి వాళ్లకి.. ఏ మాత్రం పొసగనివి. అయినా, వాళ్లు భారతదేశంలో సక్రమంగా, హ్యాపీగా ఉన్నారు ఇవ్వాల్టి దాకా.. ఇదీ.. భారతదేశం అంటే.

-ఎక్కడా జరగలేదు ఇటువంటిది. ఏ దేశంలో జరగలేదు ఇది.
ముస్లింలు భారతదేశంలో మొట్టమొదట ఎక్కడి నుంచి వచ్చారో.. చాలా మందికి తెలియదు. పాకిస్తాన్ వెర్రిబాగుల వాళ్లు ఏం అనుకుంటారంటే, సింధు నది తీరాన ఖాసిమ్ అనేటువంటి ఒక సేనాని రూపంలో.. (ఇస్లాం వచ్చింది అనుకుంటారు..!) ఆయన (ఖాసిమ్ సింధులో..) రాజుల్ని ఓడించాడు. అక్కడ మొట్టమొదటి ఇస్లాం వచ్చింది.. (అని అనుకుంటారు.)
తప్పు. అది శుద్ధ తప్పు.
సుమారుగా ప్రవక్త (జీవించి వున్నటువంటి కాలంలోనే.. ఆయనకు కొంచెం అటు ఇటు కాలంలోనే.. భారతదేశానికి ఇస్లాం వచ్చింది. ఎక్కడికి వచ్చింది అంటే కేరళకి వచ్చింది. కేరళలో ఇవ్వాల్టికి కూడా.. ఆరోజు కట్టినటువంటి మసీదులు వున్నాయి. ఆశ్చర్యం ఏమిటంటే.. ఆ మసీదులు ముస్లింలు కట్టలేదు. హిందువులు కట్టారు. ఇంకొక్క ఆశ్చర్యం చెప్తాను మోప్లా ఉద్యమం అనేటువంటి దాన్ని గురించి.. మీరు తెలుసుకుని వుంటారు. దాన్నే.. మోప్లా తిరుగుబాటు అంటారు కేరళలో. మోప్లా తిరుగుబాటు ముస్లింలు చేసినది. దాంట్లో మతోన్మాదం వుందని, దాంట్లో స్వాతంత్ర్య ఉద్యమం వుందని వివాదం ఉంది. ఎవరెవరి.. వివాదాలు పక్కన పెడదాం.
అసలు వాళ్లని మోప్లాలు అని ఎందుకు అంటారు. మీరు గమనించాలి. ముస్లింలని మోలు అని ఎందుకు అంటారంటే, కేరళలో - మోప్లా అనే మాట మాపిళ్లై అనే మాట నుంచి వచ్చింది. మాపిళ్లై అంటే (స్థానిక భాషలో) అల్లుడు అని అర్ధం. ముస్లింల్ని (అరబ్బుల్ని) ఇక్కడ వున్నటువంటి ప్రజలు అల్లుళ్లుగా భావించి, పిల్లల్ని ఇచ్చి.. పెళ్లి చేశారు. అందుచేత.. వాళ్ల పేరు అల్లుళ్లుగా.. స్థిరపడింది - ఇక్కడి కొచ్చిన అరబ్బుల పేరు. అందుచేత వాళ్లు మోప్లాలు అయ్యారు. ఇది ఎక్కడా జరగలేదు. ఎంత అద్భుతం చెప్పండి ఇది.
నే వేర్ ఇట్ హ్యాండ్.

భారతదేశం, ఇక్కడికి వచ్చిన ప్రతి ఆలోచననీ, ప్రతి మతాన్నీ.. అక్కున చేర్చుకుంది. లాలించింది. తన క్వాలిటీస్ తను కొన్ని ఇచ్చింది. కొన్ని స్వీకరించింది. ఇదీ భారతదేశం!

ఇది నేను ప్రేమించే దేశం!
-మజ్ఞబ్ నహీ సిఖాతా.. ఆపస్ మె బైర్ రఖ్ నా
హిందీ హై హమ్.. హిందీ హై హమ్
వతన్ హై హిందూసితా హమారా..
సారే జహాసే అచ్ఛా హిందూ సీతా హమారా' అని ఇక్బాల్ మహా కవి రాసినటువంటి గీతం, 'మాలో మేం శత్రుత్వాలు పెట్టుకోవడం అనేది, మతం నేర్పించదు మాకు ఇక్కడ మేం భారతీయులం మేం, భారతీయులం, హిందుస్తాన్ మా దేశం' అని భావం.
'హిందూ' అనేటువంటి మాట కూడా నాకు తెలిసి (ఎక్కువగా) ముస్లింలే భారతదేశంలో (వాడుకలో) పెట్టారు.

జైభారత్ జాతీయ ప్రధానకార్యదర్శి విజయవిహారం రమణమూర్తి JAIHO గుంటూరు ప్రసంగం నుండి.
—-----------—-----------—-----------
పూర్తి ప్రసంగం కొరకు ఈ పుస్తకం చూడండి:
దౌర్భాగ్యం.. ద్విజాతి సిద్ధాంతాన్ని ఆరాధించినవాళ్లు ఈ దేశ పాలకులయ్యారు..!!
వెల:25/-
పుస్తకం కొరకు సంప్రదించండి:
జైభారత్ పబ్లికేషన్: 9848030089
—-----------—-----------—-----------
ఇదే ప్రసంగం you tube లో ఈ లింక్ లో చూడగలరు
https://youtu.be/yw3fJB3303Y

చీమలు పెట్టిన పుట్టల్ని పాములు ఆక్రమించాయి.. - ఖదిజ్ఞాసి విజయవిహారం రమణమూర్తి 09/03/2023

https://youtu.be/56GMlxvJq-M

చీమలు పెట్టిన పుట్టల్ని పాములు ఆక్రమించాయి.. - ఖదిజ్ఞాసి విజయవిహారం రమణమూర్తి 2022 డిసెంబర్ 23న అచ్చంపేటలో జరిగిన 'జైహో తెలంగాణ రాష్ట్ర సమ్మేళనం'లో జైభారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఖదిజ్ఞాసి వి.....

అంబేడ్కర్ వాదివి కావాలంటే నువ్వు కుల నిర్మూలనవాదివి కావాలి!!! - విజయవిహారం రమణమూర్తి 09/03/2023

జైభారత్ కుల నిర్మూలనకి కట్టుబడింది..!
మత సామరస్యం కోసం, కుల నిర్మూలనకోసం, మహిళావిముక్తి కోసం, పీడిత కులాల, ఆదివాసీల, మైనారిటీల, బాలల, లైంగిక మైనారిటీల హక్కుల కోసం, అవినీతి నిర్మూలన కోసం, వివక్షల, మతోన్మాదాల, విద్వేషాల, అసమానతల అంతం కోసం, ప్రజాస్వామ్యరక్షణ కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం, అధ్యయన వ్యాప్తి కోసం, సకల ప్రాణుల హక్కుల కోసం.. ఇటువంటి ఎన్నెన్నో మహోన్నత ఆశయాల కోసం, విలువల కోసం.. నిర్విరామంగా పోరాటాల్ని నిర్మిస్తూ.. - 5 రాష్ట్రాల్లో.. నిబద్ధమైన, పటిష్టమైన క్యాడర్ కలిగిన విప్లవ వేదికగా ఎదుగుతూ, - మరో 7 రాష్ట్రాల్లోకి తన కార్యకలాపాల్ని విస్తరిస్తూ, - సమగ్రమైన సైద్ధాంతిక అవగాహనతో, నిబద్ధమైన ఆచరణతో - 'భారతీయ విప్లవానికి కొనసాగింపుగా ముందడుగు వేస్తున్న - వేయి వెల్గుల విప్లవ జ్వాలా విస్ఫోటం - జైభారత్ !
( రణభేరి పాంప్లెట్ నుండి తీసుకోబడింది)....
మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి.... క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మిత్రులారా.... వీడియో రూపంలో రమణమూర్తి గారి ప్రసంగం

అంబేడ్కర్ వాదివి కావాలంటే నువ్వు కుల నిర్మూలనవాదివి కావాలి!!! - విజయవిహారం రమణమూర్తి 2019లో 'కులోన్మాదులారా ఖబడ్దార్!' నినాదంతో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో, జైభారత్ అధ్వర్యంలో జరిగిన 46 రణభేరిసభల్లో భా...

25/02/2023

Jaibharat Movement నేడు(25.02.2023) రాజమండ్రిలో జరుగుతున్న ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్లీనరీ సమావేశాల్లో భాగంగా జైభారత్ తరపున మాట్లాడుతున్న జైభారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఖదిజ్ఞాసి రమణమూర్తి

13/02/2023
13/02/2023

Jai Bharat movement

12/02/2023

stop use plastic 🙏

12/02/2023

movement
కుల నిర్ములన ప్రవక్త బాబా సాహెబ్ అంబెడ్కర్ ని చంపుతానంటూ మాట్లాడిన హమారా ప్రసాద్ అరెస్టును స్వాగతిస్తున్న ఆంద్ర ప్రదేశ్ జైభారత్ ఎస్ సీ పోరాట వేదిక,కఠినంగా శిక్షించాలని ప్రభుత్వంన్నీ డిమాండ్..*☝️☝️

speech of 'vijayavihaaram' Ramanamurty on Religions and their relevance 11/02/2023

కొన్ని ప్రశ్నలు నేను అడుగుతాను .. వాటికి సమాధానాలు వెతికిన తర్వాత మతాల్ని ఫాలో కావాలో లేదో మీరు తేల్చుకోండి - ఖదిజ్ఞాసి విజయవిహారం రమణమూర్తి

speech of 'vijayavihaaram' Ramanamurty on Religions and their relevance speech of 'vijayavihaaram' Ramanamurty on Religions and their relevance

Videos (show all)

#youtube #jaibharat #publictionsinstagram #reelsinstagram 👉🏻 తనకు ఎదురైన వివక్షకీ, అవమానానికీ.. దాక్షాయణి తన ప్రదర్శనతో ...
Jaibharat Movement #reelsinstagram #public #bc #Facebook #YouthPower #Youtube #jaibarath #jaibharat samajika viplava ran...
#జైభారత్ #JaiBharat #Chalo #vijayawada #ranabheri govinddh7
#ఛలో సంగారెడ్డి
#సామాజిక ఉద్యమ కారులు అందరూ తప్పక చదవాల్సిన పుస్తకం.......https://www.facebook.com/jaibharatpublications9848030089?mibex...

Website