Amalodbhavi

Amalodbhavi

Download this App (Free App and free Download)
U can download 40 books daily from this APP
(Religi

10/06/2019

ఇంట్లో పెరిగేది రాహుల్ గాంధీ - దేశానికి మాత్రం మోడీ కావాలి

ఏడేళ్ళ క్రితం రాహుల్ గాంధీ ఒక మాట చెప్పాడు,
"మా నాన్న రాజకీయాల్లో ఉన్నారు,మా నాయనమ్మ, ముత్తాత రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి నేను రాజకీయాల్లోకి రావటం చాలా సులువు అయ్యింది.కాని ఇదే నా అసలు సమస్య , ఈ సమస్యకి ప్రతిరూపం కూడా నేనే"

రాహుల్ గాంధీ ని ఇష్టపడే వారు కూడా అతను చాలా గారాబంగా పెరిగాడు , చిన్నప్పటి నుండి ఓ రక్షణ వలయంలో ఉన్నాడు, వాస్తవిక ప్రపంచం గురించి అవగాహన లేదు అని చెప్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే బోధి వృక్షం కింద కూడా కూర్చోలేని ఆధునిక సిద్ధార్ధుడు రాహుల్ గాంధి.ఇప్పుడు మన ఇంట్లో మనం కూడా రాహుల్ గాంధీ లనే పెంచుతున్నాం.

మనకి నరేంద్ర మోడీ అంటే ఓ అద్భుత వ్యక్తి,, కాని మన ఇంట్లో పెంచేది మాత్రం రాహుల్ గాంధిని. ఎందుకంటే మన పిల్లల్ని మనం పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో ప్రయాణించనివ్వం, రోడ్డు పక్కన ఫుడ్ తిననివ్వం, వారికి బొద్దింక అంటే తెలియదు , నల్లులు ఎలా ఉంటాయో చూడరు. తెలుగు సరిగా మాట్లాడనివ్వం, ఎందుకుంటే మన భాష మాట్లాడితే మనకి నామర్దా. వాళ్లకి పేదరికం అంటే తెలియదు. పని వాళ్ళకి ఆజ్ఞలు జారీ చెయ్యటం తప్ప వాళ్ళతో మాట్లాడటం తెలియదు. ఎప్పుడూ కార్ లోనే తిరగటం, ఆ కార్ అద్దాల్లో నుండే ప్రపంచాన్ని చూడటం, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కార్ దగ్గరికి వచ్చి అడుక్కునే తమ వయసు పిల్లల్ని చూసి భయపడటం. ఇదేగా మనం నేర్పుతోంది ? ఈ రోజుల్లో పదేళ్ళ వయసున్న పిల్లలు కూడా ఏనాడు ఒంటరిగా షాప్ కి వెళ్లి కిరాణా సామాన్లు కొనుక్కురావటం చూడలేదు. ఒక్కసారి మీరు గుర్తుచేసుకోండి, ఏ వయసులో మీరు కిరాణా కొట్టుకి వెళ్లారు ? అమ్మ చీటీ రాసి ఇస్తే అవన్నీ జాగ్రత్తగా సంచి లో వేసుకుని లెక్క చూసుకుని వచ్చారు ? మరి అదే పని మీ పిల్లలు చెయ్యలేరా ? మీ తల్లిదండ్రులకి మీ మీద ఉన్న నమ్మకం మీకు పిల్లల మీద లేకపోవటానికి కారణం మీ పెంపకం మీద మీకున్న అపనమ్మకం. మీ తల్లిదండ్రులకి ఉన్నది తమ పెంపకం మీద ఉన్న నమ్మకం. 500 మీటర్ల దూరం లో ఉన్న ప్రదేశానికి కూడా GPS ట్రాకింగ్ పెట్టుకుని వెళ్తున్నారు, ఎందుకంటే తప్పిపోతారు అనే భయాన్ని పిల్లలలో మనమే సృష్టించి సొంతంగా ఆలోచించే అవకాశాన్ని వాళ్ళు కోల్పోయేలా చేస్తున్నాం. వయసుకు మించిన బరువుతో ఉండే పిల్లలు కనీసం వాళ్ల బరువులో సగం కూడా లేని పనివాళ్ళు బ్యాగ్ లు మోసుకుంటూ వాళ్ళ పక్కన నడుస్తుంటే ఇక పెద్దయ్యాక వాళ్ళకి బాధ్యత ఎలా తెలుస్తుంది ? జీవితంలోనూ , వృత్తి లోనూ క్లిష్ట పరిస్తితి ఎదురైనప్పుడు వాళ్ళెలా ఎదుర్కుంటారు ? మనకి మనమే ఓ కృత్రిమ దీవిని సృష్టించి మన తరువాతి తరాలని పనికిమాలిన వాళ్ళు గా తయారు చేస్తూ మనం మాత్రం రాహుల్ గాంధీ ని పప్పు అంటూ ట్రోల్ చేస్తాం వాహ్ క్యా బాత్ హై ? గాంధీ వంశపారంపర్య పరిపాలనకి వ్యతిరేకంగా గెలిచి చౌకిదార్ అని పిలిపించుకుంటున్న నాయకులు కూడా తమ ఇళ్ళలో పెంచేది రాహుల్ గాంధీ లనే. ఇలాగే కొనసాగితే ఇక భవిష్యత్తులో దేశం లో మేధో వలసలు తప్ప మేధావుల పోలరైజేషన్ ఉండదు. అంతెందుకు సమాజంలో మేధావులు , తమని తాము మలచుకుని విజేతలుగా ఎదిగిన వారు కూడా తమ పిల్లలకి తన మూలాలు నేర్పటం లేదు. తాము పడిన కష్టం తమ పిల్లలు పడకూడదు అనుకుంటున్నారు తప్ప తమ విజయానికి కారణం అయిన అసలు విషయాల్ని మరిచిపోతున్నారు. అలా అని ఒకడు రిక్షా తొక్కి పైకి వచ్చాడని తన పిల్లవాడిని రిక్షా తొక్కమని అర్ధం కాదు. కనీసం ఒకసారి రిక్షా ఎక్కించి అది తొక్కేవాడి కష్టాన్ని చూపించండి.

రాహుల్ గాంధీ స్వతహాగా మంచివాడు , కాని రాజకీయాల్లో రాణించాలన్నా జీవితంలో ధైర్యంగా, ఆనందంగా ఉండాలన్నా కావాల్సింది మంచితనం మాత్రమే కాదు, వాస్తవిక ప్రపంచం మీద అవగాహన, మన మూలాల గురించిన జ్ఞానం. ఈ అవగాహన ని అతని చుట్టూ ఉన్న పరిస్తితులు కల్పించలేకపోయాయి. ఇప్పుడున్న సమాజం లో rags-to-riches అనే కధలు చాలా అరుదుగా కనిపిస్తాయి. అందుకే మనకి మోదీ ఒక అద్భుతంగా కనిపించాడు. ఇప్పుడు మన పిల్లలని నాయకులుగా ఎదగటానికి అవసరమైన పరిస్థితులని సమాజంలో కల్పించలేకపోతున్నాం.

పిల్లలు ఇప్పుడు పెరుగుతున్న విధానంలో Technology, business, arts, mainstream cinema లాంటి రంగాల్లో రాణించవచ్చు. ఎందుకంటే వారసత్వంగా సంక్రమించే రంగాల్లో నైపుణ్యం అనేది డబ్బు కింద పనిచేస్తుంది కాబట్టి. IIM లు IIT లు నిపుణులని తయారు చేస్తాయి, కాని నిపుణులు వేరు నాయకులు వేరు. వాస్తవిక మూలాలు తెలిసిన వాళ్ళు మాత్రమే నాయకులుగా ఎదుగుతారు. భారతదేశానికి ఆయువు పట్టు గ్రామాలు, అక్కడున్న మనుషులు ,వారి జీవితాలు. మీ కొడుకు ఏ రంగంలో అయినా నిపుణుడు అవ్వాలో నాయకుడు అవ్వాలో తేల్చుకోవాల్సింది మీరే.

ఈ కధనం రాహుల్ ని కించపరచటానికో లేక మోడీ ని ఆకాశానికెత్తటానికో రాసింది కాదు. వాస్తవానికి ఇద్దరి మీదా నాకు గౌరవం ఉంది. ఆరేళ్ళ క్రితం రాహుల్ తానింకా పెళ్లి చేసుకోనని ప్రకటించాడు. కారణం తనకి పెళ్లి మీద నమ్మకం లేక కాదు రేపు తనకి పుట్టే పిల్లలు తన స్థానం లోకి వచ్చి తనలాగే అవుతారని. మనకి అంత విశాల హృదయం లేదు కాబట్టి మన పిల్లలకి సమాజంలో వాస్తవిక జీవితాన్ని అలవాటు చేద్దాం.

అందాక ఎందుకు మొన్న జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన రాజకీయ నాయకుల వారసుల లిస్టు చూడండి. ఎవరికైనా గ్రామీణ నేపధ్యం ఉందా ? అసలు సాధారణ ప్రజాజీవితాన్ని ఎప్పుడైనా వాళ్ళు చూశారా ? రాజకీయాల్లో రాణించటానికి అవసరమైన మాతృభాషలో వాగ్ధాటి కలిగి ఉన్నారా ? "పెళ్లి " అనే పదాన్ని "పెల్లి" అని కాకుండా పెళ్లి అన్ని ఒక్కరైనా పలకగలరా ? వారి ఓటమి కి కారణం వారి వైఫల్యం కాదు. వాళ్ళని నాయకులుగా తయారు చెయ్యలేని వాళ్ళ తల్లిదండ్రులది.

10/06/2019

తిరుపతి గోవిందరాజ స్వామి రాతి విగ్రహం ఎక్కడ…?

🍂🍂🍂🌼🌼🌼🍂🍂🍂

తిరుమల శ్రీనివాసునికి అన్నగారైన గోవింద రాజస్వామి తిరుపతి వైభవాన్ని మరింత పెంచాడు. ఒకప్పుడు చిదంబరంలో ఉండే గోవింద రాజస్వామి రామానుజాచార్యుల చొరవతో తిరుపతికి తరలివచ్చారు. అయితే ఇప్పుడు గోవింద రాజస్వామి ఆలయంలో మనం చూస్తున్న విగ్రహం సుద్దతో చేసిన విగ్రహం. సాధారణంగా ఎక్కడైనా రాతి విగ్రహాలు ఉంటాయి, ఇక్కడ కూడా తొలుత రాతి విగ్రహాన్నే ఏర్పాటు చేయాలని చేయించారు. కానీ సుద్ద విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆ రాతి విగ్రహం ఏమైంది… సుద్ద విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్టించాల్సి వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

చిదంబరంలో నటరాజ స్వామితో సమానంగా పూజలు అందుకుంటున్న గోవిందరాజ స్వామిని కుళోత్తుంగ చోళుడు స్థాన భ్రష్ఠం చేసి సముద్రం పాలు చేశాడు. అదే సమయంలో కొందరు భక్తులు గోవింద రాజస్వామి ఉత్సవ మూర్తిని తీసుకుని తిరుపతి వచ్చారు. అప్పుడు రామానుజాచార్యుల వారు కూడా తిరుపతిలోనే ఉండేవారు. స్వామి వారి పరిస్థితిని తెలుసుకున్న రామానుజులు… తిరుపతిలోనే గోవింద రాజస్వామి ఆలయం ఏర్పాటు చేయాలని సంకల్పించారు. దానికి నాటి యాదవ రాజు సహకారం లభించింది. అద్భుతమైన నగరంగా గోవింద రాజస్వామి ఆలయం రూపు దిద్దుకుంది.

విగ్రహం కథ ఇక్కడే మొదలైంది

గోవింద రాజస్వామిని ప్రతిష్టించాలనే ఉద్దేశంతో శిల్పుల చేత ఓ విగ్రహాన్ని చెక్కించారు. అయితే అందులో కొన్ని లోపాను గుర్తించిన రామానుజుల వారు మరో విగ్రహాన్ని చెక్కాలని సూచించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల రామానుజుల వారు దేశ పర్యటనకు వెళ్ళాల్సి రావడం వల్ల సుద్ద విగ్రహాన్ని ప్రతిష్టించి వెళ్లారు. నాటి నుంచి నేటి వరకూ సుద్ద విగ్రహమే గోవింద రాజస్వామి ఆలయంలో పూజలు అందుకుంటుంది. అందుకే ఇక్కడ స్వామికి అభిషేకాలు ఉండవు. నూనెను మాత్రమే పూస్తారు.

రాతి విగ్రహం ఏమైంది..?

తిరుపతిలో మంచినీటి కుంటగా పిలిచే నృసింహ తీర్థం వద్ద గోవింద రాజస్వామి రాతి విగ్రహాన్ని ఉంచారు. నాటి నుంచి నేటి వరకూ ఆలనా పాలనా లేక ఆ విగ్రహం అక్కడే ఉంది. ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. మీరు కూడా చూడాలనుకుంటే… తిరుపతి రామచంద్ర పుష్కరిణి ఎదురుగా ఉండే మంచి నీటి కుంట వద్ద చూడవచ్చు. గత చరిత్రకు దర్పణంగా నిలిచే ఇలాంటి వాటి విషయంలో ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అలా పూజలు అందుకోవలసిన గోవింద రాజ స్వామి… చిన్న లోపాల కారణంగా ఆరు బయటే కొలువ తీరాల్సి వచ్చింది. సుద్దతో చేసిన స్వామి ఆలయంలో వైభవోపేతంగా వెలిగిపోతున్నారు.

🍂🍂🍂🌼🌼🌼🍂🍂🍂

Photos from Amalodbhavi's post 09/05/2019
02/03/2019

*పాపం జనాలు ...! ఏమిటీ గందరగోళం*
🥀

ఆ మధ్య అంటే చాన్నాళ్ళ క్రిందట ఒక రాజు గారు
‘ఉప్పా ..! మీరు ఉప్పు తింటున్నారా?
అడవిలో జంతువులూ ఉప్పు తినట్లేదు, ఆకాశంలో పక్షులూ ఉప్పు తినట్లేదు మరి మనుషులెందుకు ఉప్పు తింటున్నారు?
ఛీ ఛీ’ అన్నాడు.

జనమంతా ఉప్పుని విసిరికొట్టారు.
*

అంతటితో ఊరుకున్నాడా? ‘నూనా, నెయ్యా -మీరంతా నూనె తాగుతున్నారా ? నెయ్యి తింటున్నారా?’ మళ్ళీ సేమ్ డైలాగ్ ‘అడవిలో జంతువులకి నూనె మిల్లులున్నాయా, అవి డబ్బాలు డబ్బాలు నూనె తాగుతున్నాయా?’ అన్నాడు.

నూనె చుక్క లేకుండా బజ్జీలూ, గారెలూ, పకోడీలు అనబడే పిండి వంటల్ని ఎలా వొండుకోవాలో జనాలందరికీ వొలిచి చేతిలో పెట్టి చెప్పాడు కూడా.
*
సరే,జనమంతా నూనె డబ్బాలకి సెలవిచ్చి చుక్కనూనెతో తాలింపులు పెట్టారు ...!

జనాలంతా ఒకపక్క ఎండు రొయ్యలయ్యి, బుద్ధిగా మాటవినే దశకొచ్చారన్న నమ్మకం కుదిరాక, ఒకానొక మంచిరోజు చూసుకుని కృష్ణానది పక్క మాంచి స్థలంలో
‘ప్రకృతి ఆహార ఆశ్రమం’ అని మొదలైంది.

రోజుకింత, నెలకింతని ప్యాకేజ్ రూపంలో వసూళ్లు
చేస్తూ ప్రజలకి ఉప్పూ,నూనె లేని
విందులు చేస్తూ మూడు పచ్చి కూర ముక్కలూ ఆరు ఆకుకూర రసాలతో
నిత్యనూతనంగా విలసిల్లుతుంది ..!
*
సరే ఇది ఇలా ఉండగా, ఇంకొకడు ఎవరో రాగి చెంబులు ....రాగి చెంబుల్లో నీళ్ళు నింపి చంద్రుడు ఎదురుగ్గా పెట్టి,తెల్లారి ఆ నీళ్ళు తాగితే అసలు చావే రాదనీ ఘంటాపధంగా చెప్పాడు. ఇంకేవుంది ఇక కొట్లలో పడి
రాగి చెంబుల వేట ...!

కాస్త గట్టి బుర్రోడు గురువుగారు చెప్పిన దానికి ఇంకాస్త తోక తగిలిచ్చి అతుకేయని రాగి చెంబు..! షాపుల్లోకెళ్ళి లిప్ స్టిక్ వేసుకున్న పెదాలతో రాగి చెంబులున్నాయా అని నాజూగ్గా అడగటం మొదలైంది.

అలా అలా వెన్నెల్లో పెట్టిన రాగి చెంబుల్లో నీళ్ళు తాగుతూ, ఉప్పు నూనె పులుపూ తీపీ లేని రాజు గారి వంటలు తింటూ రెండు వందల యేళ్ళు గ్యారింటీ అనుకుంటున్న దశలో గబుక్కున మరొహడు ఉద్బవించాడు!
*
“నూనె మానేసారా ? పిచ్చోల్లారా
మిల్లులో ఆడించిన కొబ్బరి నూనె వంద గ్రాములు తాగండి, ఇక చూడండి!’ అన్నాడు ..

“నేను చెప్పింది తప్ప మీరు ఇంకేవీ తినకూడదు...! నో నో అంటే నో.... !” అన్నాడు ..!

ఇంకేవుంది కొబ్బరి చిప్పలు సంచిలో యేసుకుని గానుగలంట బడ్డారు జనం ....! వారి ప్రొడక్ట్స్ మనకందుబాటులో కొచ్చె! మంచిరోజు కోసం మనమంతా ఎదురు చూద్దాం ...!
*
సీమనుంచో కర్నాటకనుంచో ఇంకో స్వతంత్ర శాస్త్రవేత్తనంటూ .. ‘పురుగుమందులు తింటున్నారా ? ఇళ్ళల్లో రోగాల పంట పండిస్తున్నారా? ‘ అంటూ జనాలను ఆహార జ్ఞాన దారుల్లో పరుగులు పెట్టిస్తున్నాడు.

‘పురుగు మందులు లేని చిరుధాన్యాలు! తినండీ మీ ఆరోగ్యాన్ని మీరే సంరక్షించుకోండి’ అని ఆషాడ మాసం డిస్కౌంట్ లెక్క ప్రజలకి ఆరోగ్య విజ్ఞానాన్ని చవగ్గా పంచి పెడుతున్నాడు.
*
‘చిరు’ధాన్యాలు యేహ్ ‘చిరంజీవి’ ధాన్యాలు కాదు,
‘చిరు’ ధాన్యాలు ‘సిరి ధాన్యాలు’ అంటూ, పాలు తాగితే హార్మోన్స్ ఇన్ బాలన్స్ అయి చస్తారు ...’సిరి ధాన్యాలు తినండి -చావకుండా కలకాలం బ్రతకండీ’ అంటున్నాడు.

ఇంకేవుంది, తెల్లటి మొలకొలుకల అన్నం కర్నూలు సోనా బియ్యపు అన్నం తినే బెబక్కాయిలు “సామలున్నాయా? అరికలున్నాయా , సొజ్జలున్నాయా” అని షాపులాల్లని పరుగులు దీయిస్తున్నారు।
*
వీళ్ళంతా ఇలా ఉన్నారు నేనేం తక్కువా అంటూ ''మట్టి కుండల్లో వండుకుని తినడం మంచి ఆరోగ్యం'' అని మూలనున్న మరో మట్టి శాస్త్రవేత్త పురావస్తు గృహంలో నిద్ర లేచి మట్టి కుండ యాష్ ట్యాగ్ అన్నాడు ..

విచిత్రం ఏంటంటే, వీళ్ళెవరూ డాక్టర్ లు కాదు ...ఆరోగ్య శాస్త్రం చదువుకున్న వైద్యులని మాత్రం ధాటీగా విమర్శిస్తారు ...

రోగాల పేరు వినగానే కోళ్ళ ఫారంలో కోళ్ళు లెక్క ఇలా గిజగిజలాడిపోతారు కానీ
ఆ ఉపన్యాసాలు చెప్పే వాళ్ళు కానీ, ఈ వినే జనాలు కానీ మిద్దె మీద మొక్కలు పెట్టుకుందాం అనుకుంటారే కానీ ,
‘పురుగు మందులని బ్యాన్ చేయమ’ని ప్రభుత్వాలను అడగరు.

ఆరోగ్యానికి హానికదా ‘లిక్కర్ బ్యాన్ చెయ్యండీ’ అని అస్సలు అడగరు ...

ధూమపానం చెరుపున చేస్తుందీ ‘సిగిరెట్ బ్యాన్ చెయ్యండీ’ అని కూడా అడగరు ....

చెయ్యాల్సింది చేయకుండా ఎంతకాలమని వాళ్ళు చెప్పారని, వీళ్ళు చెప్పారనీ ఆరోగ్యం కోసం చెంబులేసుకుని , సంచులేసుకుని పరిగేడతారు?

ఇకనయినా పరుగులాపి ప్రంశాతంగా జీవించండి.

మన పూర్వీకులన్నీ తిని చక్కగ పనిచేసుకున్నారు.మనం పని మాని ఇలాటివాటివెనుక గంతులేస్తున్నాము!

నిజం గ్రహించరా నరుడా....!🥀

Photos from Amalodbhavi's post 19/02/2019

Gogineni's Convention Center
Opp.to Hotel Amalodbhavi,
Ibrahim patnam
Gogineni Venkateswara rao Garu
Mobile : 9397843999