Dasarathi

Dasarathi

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dasarathi, Author, .

11/07/2023
05/11/2021

Hi Dear friends and Listeners of Patalapallaki on TORI,
Today on the occasion of 34th death anniversary of Dr. Dasarathi Krishnamacharya garu,the great poet, who fought against the dictator Nizam, wrote many poetry books like Rudraveena, Agnidhara, Timiramtho Samaram, Mahandrodhayam etc. Translated Ghalib Ghazals into Telugu, he is a linguist who learned so many languages, and wrote beautiful Telugu movie songs as a cine lyricist - doing a program dedicated to him which is going to start in few minutes on TORI EST 6-7pm, IST 3.30-4.30 am.(Sat) AEST-8-9 am(Sat).
Please tune in and listen to the program!

23/07/2021

On the 97th birth anniversary of Dr. Dasarathi, people’s poet, linguist, Telugu cine lyricist, fought against Nizam’s atrocities, translated Ghalib Geethalu, wrote so many poetry books, won so many awards, served as poet Laureate of the state etc. we are paying tribute to him on Patalapallaki program on Tori Live! Please tune in at EST-6-7pm, IST- 3.30-4.30am, AEST -8-9pm (Sat).

23/07/2021

7 years ago.. a great memory, Dr. Dasarathi, jayanthi on July, 22nd. What can I say I'm SO PROUD TO BE HIS NIECE! HE will be in peoples hearts forever with all the wonderful things he has done!🙏🙏🙏🙏

డా. దాశరధి గారి జయంతి సందర్భంగా ఆయన గురించి నా ఆలోచనలు: with M Udaya Bhanu, Gautham Kashyap, Swapna Kari, S***a Rao Venkata Voleti
దాశరధీ ఓ కవితా పయోనిధి!
అగ్నిధారలే కురిపించావా?… See More

Dasarathi Paataku Pattabhishekam-Vamsee & UKTA -Samarpana -Sasikala&Bindu -Nirvahana Sarada Akunuri 17/01/2021

Please watch "Dasarathi Paataku Pattabhishekam, in few minutes it's going to start!https://youtu.be/iFmLwn9VDqY

Dasarathi Paataku Pattabhishekam-Vamsee & UKTA -Samarpana -Sasikala&Bindu -Nirvahana Sarada Akunuri Dasarathi Paataku Pattabhishekam-Vamsee & UKTA -Samarpana -Sasikala&Bindu -Nirvahana Sarada Akunuri వంశీ ఇంటర్నేషనల్ , అమెరికా - ఇండియా యునైటెడ్ కింగ్డమ్ తెల...

Photos from Dasarathi's post 20/08/2020

This year Dr. Dasarathi award -2020 was given to Shri Tirunagari Ramanujam garu on August 15th, Saturday by the Chief Minister of Telangana Sri K. Chandrasekhar Rao at Pragathi Bhavan. The CM opined that Sri Ramanujam would remain as the literary heir to Maha Kavi Dasarathi. The CM presented Sri Ramanujam with a memento, Shawl and a cash prize of Rs.1,01,116. He said Bala Veera Sathakam, Aksharadhara, Tirunagareeyam written by Sri Ramanujam became very popular. He said, Blend of traditional and modern literature that's what makes Sri Ramanujam stand out. MP Dr. K Keshav Rao, Government’s Chief Advisor Sri Rajiv Sharma, Chief Secretary Sri Somesh Kumar, DGP Sri Mahender Reddy, Cultural Affairs Secretary Sri Srinivas Raju, Director Sri Mamidi Harikrishna, CM OSD Sri Desapathy Srinivas, Sri Ramanujam’s son Sri Srinivas and others attended.
Sri Ramanujam recited a poem he wrote praising the CM as the modern day Maha Vishnu.

‘‘శ్రీ తెలంగాణమును
శ్రీ ఖండమును సేయ
అవతరించిన యెట్టి
అపర విష్ణుడవీవు
తెలగాణమున
కోటి ఎకరాలు పారించి
పంట భూమిగ మార్చ
ప్రతిన బూనిన యట్టి
రైతు స్వామివి నీవు
జాతి నేతవు నీవు
శ్రీ కల్వకుంట్ల
క్షీరాబ్ధి చంద్రమా
శ్రీ రస్తు
శ్రీ చంద్రశేఖరా
తెలంగాణ దీపమా
విజయోస్తు’’

03/08/2020

Article about Dr. Dasarathi, lyricist by T. Sharath Chandra, in the column of Telugu cine lyricists in 'Nava Telangana.'

legendery poet dasarathi's interview courtesy: all india radio 27/07/2020

https://youtu.be/bBvhCQp64o0

https://youtu.be/bBvhCQp64o0 మహాకవి దాశరథి రేడియో ఇంటర్వ్యూ వినండి

legendery poet dasarathi's interview courtesy: all india radio తెలుగువారికి గర్వకారణమైన మహానుభావుల అపూర్వ స్వరాలను ఆకాశవాణి తెలుగు విభాగానికి చెందిన హైదరాబాద్, విజయవాడ, మద.....

23/07/2020

దాశరథి‌

నేను తెలుగు కవితను చదవడానికి అలవాటుపడుతున్న తొలినాళ్లలో దాశరథి కవిత అన్న సంపుటిని చదివాను. నాకు బాగా నచ్చింది‌. అప్పటికి శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని చదివాను. రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి అనువాదాన్ని చదివాను.

ఆ స‌ంపుటిలో
"నీళ్లలో నిప్పు మాదిరి‍, నిప్పులోన
నీళ్లమాదిరి, కష్టాల నీడలందు
సుఖము నివసించునంట, ఉస్సురను వేడి
ఊర్పులోన పరీమళాలున్నవంట"

వంటి వి ఎన్నో నాకు నచ్చాయి. వారి పద్యరచన కూడా నాకు నచ్చింది. "నా తెలంగాణ కోటి రతనాల వీణ" అనడమూ, "అగ్నిధార", "హిమజ్వాల" వంటివి అనడమూ, "పూలను ముద్దుపెట్టుకొని ముండ్లను వద్దనబోకు నీవు; నీ కేలటు తాకినంత పులకింపవె కంటకముల్ సుమమ్ములై" అనడమూ, "ఉదయాకాశ పతాకం / యెదలో కదలాడే నేడు" అనడమూ, "నవయువక‌ రక్తనాళాల నడుమ పారు/ నూత్న‌ చైతన్యధార అనడమూ, " మా నిజాం రాజు జన్మ జన్మాల బూజు" అనడమూ, "తెలుగు నింగి దారులలో / వెలుగు పులుగు రెక్కలార్చి / చిమ్మి వైచె తరతరాల/ చిక్కని‌ చీకట్లనెల్ల" అనడమూ నాకు బాగా నచ్చాయి. ఇలా ఆ దాశరథి కవిత సంపుటిలో నాకు నచ్చినవి ఎన్నో ఉన్నాయి. నిజానికి వారి మహాంధ్రోదయం లోనే గౙల్ భావజాలం మనకు కనిపిస్తింది.

ఇరవై ఏళ్ల క్రితం నాకు పరిచయమైన దాశరథి గారిపై ఇప్పటికీ గౌరవం తగ్గలేదు. ఇంకా ఎక్కువయింది. సాధారణంగా కవులకుండే దుర్గుణాలు, చవకబాఱుతనం, నీచత్వం లేని ఉన్నతమైన వారు దాశరథి అని తరువాతి నాళ్లలో తెలుసుకున్నాను. నాకు ఎంతో సంతోషం వేసింది.

ఒక ఉన్నతమైన కవి దాశరథి ఒక‌ ఉన్నతమైన మనిషి కూడా.

ఒకసారి దాశరథి స్వయంగా పి.బి. శ్రీనివాస్ గారికి వ్రాసిన ఉత్తరం చదివాను. దాశరథి గారు ఎంతగొప్ప వారో తెలిసింది. ఒక కవి, అందులోనూ తెలుగు కవి అంత మానసిక పరిపక్వతతో, సంస్కారంతో జీవించడం మహోన్నతమైన విషయం.

కవుల్లో అందులోనూ తెలుగు కవుల్లో దాశరథి అంత మహోన్నతమైన వ్యక్తులు వేళ్లపై లెక్కించగలిగినంత మంది మాత్రమే ఉంటారు.

దాశరథి ఒక ఉన్నతమైన కవి. ఒక ఉదాత్తమైన మనిషి.

ఇవాళ మన అందఱికీ వారి జన్మదినం. తెలంగాణ ప్రభుత్వం కూడా దాశరథి జన్మదినాన్ని వేడుకగా జరుపుతోంది. ఆనందం.

"సత్యానికి గెలుపన్నది
సత్యంరా మానవుడా!
అన్యాయంతో స్వర్గం
అందదురా దానవుడా!"

అన్న దాశర్థథి గారి మాటలనూ, ఈ సందర్భంగా వారినీ స్మరించుకుంటూ...

మీతో
రోచిష్మాన్
9444012279

Photos from Dasarathi's post 22/07/2020

Dr. Dasarathi Jayanthi Celebrations!

Photos from Dasarathi's post 22/07/2020

Dr. Dasarathi Jayanthi celebrations...

22/07/2020

దాశరథి తెలంగాణ కవితా పయోనిది
గురివిందగింజ నీతి మీద గుండెల్లో మండే కవితాక్షరాల్ని శరాలుగా సందించిన యోదుడు
గుంటనక్క ఏషాలపై గుడ్లురిమి చూసి కళ్లలోంచి అగ్నిధారల్ని కురిపించిన తీక్షువు
అనుక్షణం ఆయన గానం తెలంగాణం
అనునిత్యం మా సంవాదం దాశరథిం
ఈ నేలలున్నన్నాళ్లు
ఈ కాలం సాగినన్నాళ్లు
మమ్మావహించే ప్రాణం
దాశరథి కవితా గానం

22/07/2020

[3:35 PM, 7/22/2020] Sesham Purushothama Chari: మహాకవి,కళాప్రపూర్ణ దాశరథి !
భువిలో విరిసిన ఈ పారిజాతం... ఏ దివికెగసి పోయెనో ? గత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవి, డాక్టర్ దాశరథి కృష్ణమా చార్య... బంధుత్వ పరంగా మా నాన్నగారి అక్కయ్య తనయుడు కావటంతో నాకు మేన బావ అవుతారు. ఆయన 1976లో ఢిల్లీ వచ్చినపుడు మా ఇంటికి వస్తానన్నారు. కాని రాలేకపోయారు. అప్పుడు నేను ఢిల్లీలోని ఘజియాబాద్ కు చెందిన భారతీయ వైమానిక దళంలో పనిచేస్తూ వుండే వాణ్ణి. సరే ! ఎందుకు రాలేదని అడుగుతూ నేను ఉత్తరం వ్రాస్తే, ఆయన నాకిచ్చిన సమాధానం యిది !

డీయర్ పురుషోత్తం ! నీ ఆగష్టు 7.1976 ఉత్తరం నా చేతికందింది. అందులో నీవు ఇంతకు ముందు కొన్ని ఉత్తరాలు వ్రాసానని అన్నావు. కాని అవి నాకు అందలేదు. బహుశ నీకు నా అడ్రస్ లోని మార్పు తెలీనట్లుంది. నా పాత అడ్రస్ కు చేరిన ఉత్తరాలన్నీ ఇక్కడికే తిరిగి వస్తున్నాయి. ప్రస్త్తుతం నీ ఉత్తరం అలాగే అందింది.

ఆంధ్ర యూనివర్సిటీ వారు తమ 48’వ వార్షిక స్నాతకోత్సవం లో నాకు జరిగిన 'డాక్టరేట్ ఆఫ్ లెటర్స్ 'బిరుదు ప్రదానం ఉత్సవం తరువాత ఆ మార్గపు వంతెన క్రిందుగా ఎంతో ప్రవాహం కొనసాగింది. ఆ వెంటనే ఆగ్రా యూనివర్సిటీ వారు తమ 47’వ వార్షికోత్సవంలో మరో 'డాక్టరేట్ ఆఫ్ లెటర్స్ ' అర్హతని అంటగట్టారు.

ఆగ్రానుంచి తిరిగి వస్తూ ఢిల్లీలో ఆగి ఓడజను యితర భాషల రచయితలతో కలిసి భారత ప్రధాన మంత్రి గారిని వారి సఫ్దర్ జంగ్ నివాస గృహంలో కలిసాను. దాదాపు ఒక గంట వారి ఇంట గడిపాక ప్రధాని మాతో గ్రూప్ ఫోటో దిగారు. దాన్ని నీవు కలిసినపుడు చూపిస్తాను. నీవింకా ఘజియాబాద్ లోనే వున్నావనుకుని నీ దగ్గరకు వద్దామనుకున్నాను కాని విపరీతమయిన చలి బాధతో బాటు వొంట్లో కొద్ది నలత కూడా ఏర్పడి ఆ యిబ్బందితో రావటానికి వీలు పడలేదు. ఢిల్లీ చేరాక జనపథ్ హోటల్లో వున్నాను. అదే సమయంలో (28-2-76న) శ్రీమతి లక్ష్మీ రఘు రామయ్య గారు అధ్యక్షత వహించిన మన రాష్ట్ర పార్లమెంటుమెంబర్ల సమావేశంలో పాల్గొన్న సభ్యులకి నా సందేశాన్నిఅందజేశాను.

ఆ తర్వాత కొనసాగిన నా విదేశీయానంలో ఫెడరేషన్ ఆఫ్ మలేసియా , రిపబ్లిక్ అఫ్ సింగపూర్ యాత్ర ఎంతో విజయవంతంగా ముగిసింది. ఆ పరంగా గడిచిన యాత్రలో మొదటి ఇరవయి రోజుల్లోనే ఓ పద్దెనిమిది సభలను ఉద్దేశ్యించిమాట్లాడాను. మలేసియా తప్పక చూడాలసిన దేశం ! దేశమంతా ఓ ప్రక్క పచ్చదనం విల్లివిరుస్తుండగా మరో ప్రక్కన రబ్బరు, లోహాల అధునాతన యంత్రాగారాలు పనిచేస్తున్నాయి . రాత్రి వేళలో చిక్కటి అడవులగుండా సాగిన కారు ప్రయాణం భయంకరంగా తోచింది. చాలా కాలంగా ఈ దేశంలోనిస్థానికులపై ఎరుపు జాతివారి బీభత్సం కొన సాగుతోంది. ప్రతి రోజు వార్తా పత్రికలలోనూ, టెలివిజన్ లోనూ ఆ జాతికీ , సైన్యానికీ మధ్య జరిగే సంఘటనల వివరాలే అధికంగా కనిపిస్తాయి. “ఎరుపు జాతిని అణగ దొక్కండి… లేదా అంతరించిపొండి ! “అన్నది ఈ దేశ ప్రభుత్వ నినాదంగా రూపు దిద్దుకుంది. ఈ దేశానికి దగ్గరలో లావోస్ ,కాంబోడియా , వియత్నాం లాంటి కమ్యూనిస్ట్ దేశాలున్నాయి. థాయిలాండ్ దేశం కూడా ఎరుపు వారి చేతిలో నలుగుతోంది. మలేసియా లో దుమ్ము ధూళీ కంటికి కనిపించవు. ఎన్ని మైళ్ళ ప్రయాణ మయినా సుఖంగా సాగుతుంది.

మలేసియాలోని 'పెనాంగ్' అనే ద్వీపవనం కూడా చూడదగ్గది. చిక్కటి అడవి మధ్యలో “కౌలాలంపుర్” విమానాశ్రయం నిలిచి వుంది. మలేసియాలో చైనీయులు అధిక సంఖ్యలో కనిపిస్తారు. దాదాపు ముప్ఫయి శాతం చైనీయులున్న ఈదేశంలో అందమయిన యువతుల చేతుల్లోనే రకరాకాల దుకాణాలు , సూపర్ మార్కెట్లు, హోటళ్లు, రెస్టారెంట్లు నడుస్తున్నాయి. దేశ వ్యాపార లావాదేవీలన్నీ చైనీయుల చేతుల్లోనే మగ్గుతున్నాయి.

“మలయులు” అంటే “భూమిపుత్రు”లని అర్థం ! వీరు చాల పేదవారు. కాని ప్రభుత్వం వారి చేతుల్లోనే నడుస్తోంది. ప్రజల్లో 11% భారతీయులు వున్నారు. వారిలో తమిళులధికం. తెలుగు వారు కూడా కొద్ది సంఖ్యలో కనిపిస్తారు.

సింగపూర్ దేశం ఓ ప్రత్యెక తరహాలో కనిపిస్తుంది ఈ దేశంలో కూడా మలయ భాషే అధిక ప్రచారంలో వుంది. అలాగే ప్రక్కనున్న ఇండోనేషియా సియాం , అన్నం దేశాల్లో కూడా మలయ భాషనే అధికారికంగా ఉపయోగిస్తున్నారు ఏదయితేనేమి ఈ యాత్ర నాకెంతో తృప్తిని కలిగించింది.

తిరిగి వచ్చాక హైదరాబాద్ లో ఎన్నో సమావేశాల్లో నా అనుభవాల్ని సభికులకు వెల్లడించాను. అక్కడ నేను చూసిన చైనా, మలయ భాషా చిత్రాల వివరాల్ని కూడా అందరికీ తెలియ చేశాను.

నా కొత్త అడ్ద్రసును నోటు చేసుకో !. నీవు బెంగళూరుకు వచ్చి ఎన్నాళ్ళయ్యింది ? .........

22/07/2020

అతడు దాశరధి! రుద్ర భావ శరధి!

అతడు
భావాల ఇటుకలతో అభ్యుదయ భవనాన్ని కట్టిన అక్షర మేస్త్రీ
సమకాలీన సమాజ చీకటి దృశ్యాలపై
అక్షర పద్య కిరణాల వెలుగులను
పంచిన కవన సూర్యుడు
అణచి వేతపై-ఆధిపత్య దుర్మార్గంపై
అగ్ని, రుద్ర వీణల ఉద్రేక రాగాలను పలికించి
గడ్డకట్టుకు పోతున్న గుండెలను
తిరుగుబాటుకు వాస్తవ ప్రతీకలుగా నడిపించిన భావ వైణికుడు
జైలు గోడలను అక్షరపోరాట
చిత్రకళకు
కాన్వాసుగా మార్చుకున్న
ఆగ్రహ కుంచె పట్టిన చిత్రకారుడు
భావ తిమిరంపై సమరం చేసిన క్రాంతి గోళం
ఆయనది మనసును వెన్నగా మార్చిన కవిత్వం
సాహస వీరత్వాలకు
దర్శకత్వం చేసిన గంభీర కవిత్వం
మలయ మారుతమై పూల సువాసనలను
మనసులోతులకు పాకించిన కవిత్వం
హేతువాద స్పృహతో మెదడు మకిలిని వదిలించిన వాస్తవిక కవిత్వం
ఎవరా కవి? ఎవరాకవి?
అతడే-అతడే దాశరథి
తెలంగాణ హృదయ రవి
* మహాకవి దాశరథి జయంతి యాదిలో
వల్లభాపురం జనార్దన
9440163687

22/07/2020

Dr. Dasarathi gari picture by Giridhar Arasavalli garu. Thank you so much Giridhar garu!

22/07/2020

ఈ రోజు మా పెదమామయ్య మహాకవి డా. దాశరథి గారి జయంతి సందర్భంగా పొద్దు (నిజామా బాద్) పత్రికలో ప్రచురిత మైన నా ఆర్టి కల్

విశ్వ కవి డా. దాశరథి
యం.ఉదయ భాను


నిజాం నిరంకుశ పాలనలో యావత్ తెలంగాణా జాతి
నిజాం పేరు చెబితేనె గడగడా వణికి పోయేవారు. ప్ర్జజలు తల్లి లాంటి తమ మాతృభాష తెలుగు మాట్లాడే అవకాశమే లేదు. . తెలుగు తల్లిని సగానికి చీల్చి,బొట్టు తాళి తీసేసి మొహన ముసుగు వేసి దౌర్జన్యంగా ఉర్దూ మాట్లాడమని హింసిస్తున్నట్టుగా ఉండేది . తెలుగువారందరి మీదా ఉర్దూ భాషను బలవంతంగా రుద్దేవారు . అలాంటి భయానక కాలం లో నిజాం ను పేరు పెట్టి బహిరంగంగా తిట్టిన మహా కవి దాశరథి.

" ఓ నిజాము పిశాచమా !కానరాడు
నిన్ను బోలిన రాజు మాకెన్నడేని
తీగలను తెంపి అగ్నిలో దించినావు
నా తెలంగాణా కోటి రతనాల వీణ...."

అంటూ తన కవిత్వంతో తెలంగాణా ప్రజలను జాగృతం చేశాడురాజాకర్లు, నైజాం పోలీసులు తన్ కోసం గాలిస్తుంటే తప్పించుకు తిరుగుతూ రాచరిక పాలనపై ఒక వంక "అగ్ని ధార" కురిపిస్తూ మరొక వంక రుద్ర విణ పలికిఅంచిన విప్ల వయోధుడు దాశరథి.

విశ్వ కవి స్థాయికి ఎదిగిన ఈ జాను తెనుగు కవి వరంగల్ జిల్లా చిన గూడూరులో జులై 22 న జన్మించారు. 1949 తొలి కాయం అగ్ని ధార వ్రాసారు. 1950 లో " రుద్ర వీణ" మ్రోగించారు. . 1956 లో పునర్నవం. 59 లో మహాబోధి రచించారు. తన విద్వత్తు ను కేవలం తెలుగు నెల కే పరిమితం చేయ లేదు 1961 లో గాలిబ్ గజల్స్ ను " గాలిబ్ గీతాలు" పేరున అనువదించి తన కీర్తి ప్రతిష్టలను ఖండాంతరాలకు వ్యాపింపజేసాడు. మూల భావాలకు ఏ మాత్రం విఘాతం కలగకుండా అవి తేట తెలుగు కవితలే అనిపించేటంత మధురంగా గాలిబ్ గీతాలను అనువదించారు. ఇవే కాక అమృతాభిషేకం . కవితా పుష్పకం , తిమిరంతో సమరం ప్రసిద్ధ కావ్యాలు.

కేవలం కవిత్యం రాయడమే కాదు రాసిన కవిత్వాన్ని అంతే అందంగా , హృదయాలను కదిలించేలా కవితా గానం చేయ గలిగిన దిట్ట. ఆయన ఆధ్వర్యం లో తెలుగు నేల నాలుగు చెరగులా అనేక కవి సమ్మేళనాలను విజయవంతంగా నిర్వ్హింహించ బడ్డాయి..
సమకాలీన రాజకీయ, సాంఘిక ,అర్ధిక , సాంస్కృతిక సంఘఠనలతో ప్రేరేపితుడై మానవదృక్ఫదంతో పుంఖాను ఫుంఖాలుగా రచనలు చేసారు.
" రానున్నది ఏది నిజం
అది ఒక్కటే సోషలిజం ..." అని ఘంఠా పదంగా చెప్పారు.

అలాగే తన కవితా పుష్పకం లో
" మంచి కవిత్వం ఏ భాషలో ఉంటే
అది మా భాష....
మంచి కవి ఎవరైతే అతడు నా మిత్రుడు
ఈ కవితా సౌధం పుష్పక విమానం వంటిది
ఆనంద లోకాల సంచారానికి ...." అంటూ
అందరిని ఆహ్వానించాడు.
దాశరథి కవిత్వం పడి గట్టు పదాలతో వ్రాసింది కాదు అది
ఆశువుగా ... ఆవేశంగా హృదయాంతరంగాల్లోనుండి పెల్లుబుకి వచ్చింది .

దాశరథి విప్లవకారులకు విప్లవకారుడిగా , అభ్వుదయ
వాదులకు అభ్వ్దదయ వాదిగా పండితులకు పండితుడిగా, సినిమా లోకానికి సినీకవిగా ఎవరు భావించిన రీతిలో వారి మనిషిగా కనపడే ప్రత్యేక వ్యక్తిత్వం ఆయనది.

1976 ఆగ్రా విశ్వ విద్యాలయం వారు గౌరవ డాక్టారేట్ తో సన్మానించారు. వెంకటేశ్వరా విశ్వ విద్యాలయానికి విజిటింగ్ ప్రొఫేసర్ గా , కేద్ర సాహిత్య అకాడమీ కౌన్సిల్ సభ్వుడిగా నూ , అకాశవాణి, దూరదర్షన్ లకు గౌరవ ప్రయోక్తగా పనిచేసారు. 1977 లో దాశరథి గారు ఆంధరప్రదేశ్ ఆస్థాన కవిగా నియమించ బడ్డారు.
సినమా రంగం లో కూడా ఆయనది విశిష్ఠ మైన స్థానం . వీణ పాటలకు ఆయన పెట్టింది పేరు వీణ మీటకనే వీణ పాటల మేటి అనిపించుకున్నారు .
ఆయన లోని భావుకతకు పరాకాష్ట అనతగ్గ గీతం
" ఏ దివిలో విరిసిన పారి జాతమో..... " అలాగే భక్తి భావానికి
మహోన్నత గీతం " నడిరేయి ఏ జాములో ... స్వామి నిను చేర దిగి వచ్చునో..."

సాహిత్య రంగం లో ఆయన చేపట్టని ప్రక్రియ లేదు. నాటకాలు., కథలు, నవలలు , విష్లేషణలు , వ్యాసాలు కొ కొల్లలుగా రాసారు. ఇలా అన్ని రంగాలలో నిష్ణాతుడుగా పేరు నొందాడు దాశరథి.
ఆయన నాలుగడుగుల మనిషే అయినా ఆయనను ఎరిగిన వారికి నాలుగు నిలువెత్తుల మావత్వమున్న మహామనిషిగా గోచరిస్తాడు.

ఆయనకు ప్రాంతీయత ను ఆపాదించడం అంటే ఆయన ఖ్యాతిని మన చేతులారా మనం తక్కువ చేస్తున్నట్టె లెక్క . ఎందుకంటే ఆయన అనేక పర్యాయాలు అమెరికా ,యూరప్, మలేషియా, సింగపూర్ రష్యా ఇత్యాది దేశాలు పర్యటించి తన కవితల తో వారిని ఉర్రూతలూగించి తన కవితా పటిమను విశ్వ వ్యాప్తి చేసిన మహా కవి ఆయన.
ఆయన కవితకు ఎల్లలు లేవు తెలుగు భాష జీవించి నంత కాలం ఆయన కవిత్వం సజీవంగా ఉంటుంది . తెలుగు సాహితీ ప్రియులందరికీ చిరస్మరణీయుడు విశ్వ కవి. డాక్టర్ దాశరథి.

20/07/2020

Sharath Chandra's article about Dr. Dasarathi garu on the occasion of his birth anniversary, Jayanthi on July, 22.

SPEECH ON DASHARATHI'S PATRIOTIC POETRY 10/07/2020

Please watch this video of Tirunagari Sharath Chandra about the people's poet, patriotic poet, Dr. Dasarathi.

https://www.youtube.com/watch?v=VQVxhwZuAf0&authuser=0

SPEECH ON DASHARATHI'S PATRIOTIC POETRY Dasharathi poetry

15/04/2020

|| తొలి తెలుగు గౙల్ గానంగా తొలిసారి‌ ||

తొలి తెలుగు గౙల్ 1965లో వచ్చింది.‌ నాన్న గారు దాశరథి రచన అది.‌ అధారాలతో ఈ చారిత్రిక సత్యాన్ని తొలిసారి రోచిష్మాన్ నిరూపించారు. ఇంతవఱకూ ఆ గౙల్ పాడబడలేదు. ఇదిగో తొలిసారి తొలి తెలుగు గౙల్ ఇప్పుడు గానమయింది.

గాయకులు కేశిరాజు కృష్ణ సంగీతం చేసి గానం చేశారు. చాలా చక్కగా‌ స్వర పఱిచారు. చాలా చక్కగా పాడారు. కృష్ణకు అభినందన.

తొలి తెలుగు గౙల్ తొలిసారి పాడిన వారుగా కేశిరాజు కృష్ణ నమోదు అయ్యారు.

14-4- 1965 న ఆంధ్రప్రభ వారపత్రికలో ఉగాది గౙల్ గా అచ్చయింది. సరిగ్గా 55 ఏళ్లు గడిచాక ఇవాళ గానంగా రూపొంది విడుదలవడం విశేషం.

గౙల్ లోగిలి, తెలుగు గౙల్ సాహితీ సౌధం‌ ల సమర్పణలో ,
గానంగా రూపొందిన నాన్న గారు వ్రాసిన తొలి తెలుగు గౙల్ ను గౙల్ ప్రపంచానికి ఆనందంగా అందిస్తున్నాను.

వినండి.

దాశరథి లక్ష్మణ్.

24/03/2020

నేటి తో వికారి నామ సంవత్సరం వెళ్లిపోతూ, రేపు శార్వరి ఉగాది లోకి అడుగుపెడుతున్నాం. అందరికీ ముందస్తు ఉగాది శుభాకాంక్షలు .గతంలో 1960 లో శార్వరి నామసంవత్సర వేళ ఉగాదికి హైదరాబాద్ నుండి వెలువడుతుండిన ఆంధ్రజనత దినపత్రికలో దాశరథి గారు రాసిన ఈ కవిత నేటి వర్తమానానికి అద్దం పడుతూండడం కవి ద్రష్ట అనడానికి నిదర్శనమనిపించడం లేదూ..!

నేటి కరోనా కల్లోల వేళ కవి 'కోకిల వెక్కిరింత' కవితలో ఒకచోట అన్నట్లు....

జబ్బుపడిన ఈ లోకం
జబ్బ చరచి నిలుచున్నది

క్వశ్చన్ చేసెడి కోకిల
కాశ్చర్యం కలుగురీతి
ఆన్సర్ చెప్పందర్రా
ఆశావాదులు మీరు

సమూహాలలో కలవక ఇంటిపట్టున ఉండడమే ప్రశ్నార్థకమవుతున్న ఈ కాలానికి ఆన్సర్ మరి!

Photos from Dasarathi's post 14/10/2019

DASARATHI AUDITORIUM @ MCR HRD JUBILEE HILLS, HYDERABAD.

Photos from TS Director Culture's post 24/07/2019
Photos from Dasarathi's post 24/07/2019
19/07/2019

On July 22nd is the 92nd birth anniversary of Dr. Dasarathi, the poet, cine lyricist- I'm doing a special program today Friday, 19th EST, 7-8pm, IST - 4.30am - 5.30am, AEST - 9am-10am on TORI, Patalapallaki. Please don't forget to listen.... it will have the beautiful songs and poetry written by him. You can call and share your memories with him in case you have or about his songs and poetry too.

05/04/2019

ప్రజాకవి దాశరధి గారి అభిమానులకు శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు...!

ఆంధ్రులకు ఉగాది గొప్ప పండగ
ఈ పండుగ జరపాలి నిండుగా;
గుండె బలంతో యెండలనెదిరించి
గుమగుమలాడాలి మల్లెచెండుగా

చెట్టులేని పట్టణాల పాడదు పికము
పండులేని కొమ్మమీద వాలదు శుకము
కవితే ఒక పికముగా, నవతే ఒక శుకముగా
కనిపించాలి ఉగాదికి తెలుగుల జగము

నరకాన్ని చేయాలి స్వర్గఖండము
విషం విరిగి, కావాలి అమృత భాందము
హృదయంలో అనురాగం కుసుమించేలా
మదనుడు చేబూనాలి ఇక్షు దండము.

("జ్వాలా లేఖిని," కవితా సంపుటి నుండి)

దాశరథి కృష్ణమాచార్య - వికీపీడియా 11/01/2019

https://te.m.wikipedia.org/wiki/దాశరథి_కృష్ణమాచార్య

దాశరథి కృష్ణమాచార్య - వికీపీడియా తెలంగాణ ప్రజల కన్నీళ్లను 'అగ్నిధార'గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య (జూలై 22, 1925...

07/11/2018

దీపావళి

భూపావళి బుగ్గి చేసి
కోపావళి నగ్గిద్రోసి
దీపావళి జరపండో
దేశ దేశ జనులారా!
తెలంగాణ ఘనులారా!!

వ్యక్తులు పరిపాలించే
శక్తి నశించింది నేడు
రక్తంలో అణు వణువూ
శక్తి గడించింది నేడు.

చీకటి దయ్యం వొకటే
లోకానికి రాజైతే
ఆకాశం నిలువబోదు!
అర్థరాత్రి విలువలేదు!!

కోటి కోటి దీపాలను
బాటలలో కోటలలో
నాటండి ప్రజలారా!

వేటాడండి తమస్సును
కాలపు కళ్ళెమును లాగి
కదం వెనక్కు తొక్కించే
ఘను లంతా నడుం విరిగి
కదల్లేక నశించారు.

మనం వెనక్కి నడవం!
జనం వెనక్కి నడవదు
మనం జనం, జనం మనం
జనం లేనిది మనం లేము.

చల్లని చము రుంటేనే
జ్వాలావళి, కీలావళి;
ప్రజాబలం వుంటేనే
ప్రభుత్వాలు, రాజ్యాలూ.

లోకానికి మూల మూల
ఆకలితో కేక వేయు
నిరుపేదా! జరుపుకోర
మరో దివ్య దీపావళి.

దాశరథి కవితలు

06/11/2018

It’s Dr. Dasarathi’s 31st death anniversary on Nov. 5th. Even though it’s more than 30 yrs since he left the world, his works as a ‘Praja Kavi,’( people’s poet), fought with his pen writing against the despotic ruler Nizam who tortured people will always be remembered by his great fans and Telugu people who like Telugu Litt. Dasarathi the poet, awakened people and created awareness about the exploitation of poor people under Nizam’s rule by calling him, ‘Nizam Raju Tara taraala booju,’( Nizam king is like centuries cobwebs.)
His translation of Ghalib geetalu is a great gift to Telugu people! His famous poetry books still give inspiration to so many people, ‘Agnidhara,’ ‘Timiramtho Samaram’ ‘Mahandhrodhayam,’ ‘Rudraveena,’ ‘Punarnavam,’ ‘Kavitapushpakam,’ etc. are very popular.
As a lyricist he gave us such wonderful Telugu movie songs which are considered as most beautiful, lovely lyrics and have their own place in the Telugu movie songs.
Let’s enjoy one of the sweet and beautiful songs by Dr. Dasarathi garu..He’ll always be in the hearts of Telugu people who love good poetry, songs etc.
E Divilo Virisina- Telugu Movie Kanne Vayasu_1973_ Full HD Video Song - YouTube.mp4

Videos (show all)

Website