Iamvedic
This is for people who love , who believe vedic and epic of bharatha dese . we are global citizens ..world is a bhartha varsham . my book is geetha
అన్ని ఆగమాలకంటే ముందుగా ఆచారం ఏర్పడింది.
ఆచారం నుంచి ధర్మం పుట్టింది.
ధర్మానికి ప్రభువు అచ్యుతుడు.
ఆచరించడం వలన స్థిరపడింది ధర్మం.
జీవితాన్ని ఉద్ధరించేది ధర్మం.
ధర్మం ఏ విధంగా ఉండాలో నిర్దేశించిన వాడు విష్ణువు
కనుక ధర్మానికి ప్రభు వు విష్ణువే.
భారతీయ జీవన విధానానికి పూర్వులు అద్భుతమైన ఆచారాలు ఏర్పరిచారు. ఉత్తమమైన జీవన విధానానికి ఏర్పరిచినవే షోడశ సంస్కారాలు. శిశువు పుట్టక ముందు 3.. పుట్టిన తర్వాత 13 సంస్కారాలు మనిషిని ఉత్తమమయిన మార్గంలో పయనింపజేసి, ముక్తిని పొందడానికి దోహదం చేస్తాయి. అవి..
1 గర్భాదానం:
వివాహానంతరం సత్సంతానం కోసం నిర్వహించే పవిత్ర ఆచారం
2 పుంసవనం:
గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఈ సంస్కారం చేస్తారు
3 సీమంతోపనయనం:
గర్భవతిని దుష్టశక్తులు చేరకుండా ఉండేందుకు ఈ సంస్కారం నిర్వహిస్తారు
4 జాతకర్మ:
బలానికి, తెలివి తేటలకు ప్రతీకలయిన నెయ్యి, తేనెలను బిడ్డ చేత నాకించే కార్యక్రమం
5 నామకరణం:
పిల్లలకు పేరు పెట్టే కార్యక్రమం. బాహ్య ప్రపంచంలో గుర్తింపుకే కాక వేద కర్మలకు ఇది అవసరం
6 నిష్క్రమణ:
నిష్క్రమణమంటె బిడ్డను మొదటిసారిగా ఇంట్లోంచి బయటకు తీసుకురావడం. సాధారణంగా నాలుగో నెలలో బయటకు తీసుకువచ్చి సూర్య నమస్కారం చేయిస్తారు
7 ఉపవేశనం:
బిడ్డ ఐదో నెలలో చంద్రోదయ సమయంలో చంద్రకాంతి శిశువుపై ప్రసరించే విధంగా కూర్చోబెట్టడం
8 అన్నప్రాశనం:
శిశువుకు అన్నం తినిపించే కార్యక్రమం
9 చూడాకరణం:
పుట్టు వెంట్రుకలు తీయించడం
10 కర్ణవేద:
చెవులు కుట్టించి.. కర్ణాభరణాలు ధరింపజేసే కార్యక్రమం
11 అక్షరాభ్యాసం:
అయిదు సంవత్సరాల లోపే చేసే క్రతువు ఇది. చిన్నారులతో అక్షరాలు దిద్దిస్తారు
12 ఉపనయనం:
యజ్ఞోపవీత ధారణతో.. గాయత్రీ ఉపదేశంతో.. వేదాద్యాయానికి, బ్రహ్మచర్యాశ్రమానికి, యజ్ఞనిర్వహణకు ఈ సంస్కారం అధికారాన్ని కలిగిస్తుంది
13 ఉపాకర్మ:
ఉపనయనం అయిన తర్వాత యజ్ఞొపవీతంతో కట్టిన జింక చర్మాన్ని వచ్చే శ్రావణ పౌర్ణమి నాడు సమంత్రకంగా తీసివేయడాన్ని ఉపాకర్మ అంటారు. ఈ కర్మ తర్వాత శాస్త్రాధ్యయనం ప్రారంభించవచ్చు
14 స్నాతకం:
ఈ సంస్కారం బ్రహ్మచర్య వ్రతానికి చివరిదశ. విద్యాబుద్ధులు నేర్చుకోవడం పూర్తయిన సందర్భంలో.. ఇంటికి చేరుకునే ముందు గురుకులంలో నిర్వహిస్తారు. శిశ్యుడు బ్రహ్మవేత్త అవుతాడు. ఆ తర్వాత అతడు గృహస్థాశ్రమం లేదా సన్యాసాశ్రమం స్వీకరించవచ్చు
15 వివాహం:
వివాహం ఒక ప్రధానమైన సంస్కారం. అన్ని ఆశ్రమాలకు మూలాధారం. ఇది సర్వోన్నతం
గుమ్మడికాయ ఇంటికి ఉంటే కాలభైరవుడు రక్షణగా ఉన్నట్లు గుర్తు.🍈🍈
*మీ ఇంటి ముందు దిష్టిగుమ్మడికాయ కట్టారా..?*
ఒకవేళ మీ ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ కట్టకపోతే వెంటనే సూర్యోదయ సమయంలో ఒక తెల్లగుమ్మడికాయ తీసుకొని దానికి పసుపు, కుంకుమ రాసి దాన్ని ఇంటి ముందు ఉట్టిలో వేలాడదీయండి.
ముందు రోజు సాయంత్రం తెచ్చుకొని తరువాత రోజు సూర్యోదయ సమయంలో దాన్ని ఇంటి ముందు అలంకరించండి. రెండు అగరబత్తీలు వెలిగించి దానికి ధూపం చూపించండి. ప్రతీ రోజు అంటే ఇంట్లో పూజ చేసుకున్నపుడు దానికి ఒక అగరబత్తిని వెలిగించి గుచ్చండి.
ఇంటి ముందు గుమ్మడికాయ ఉండటం వలన ఇంట్లోకి వచ్చేటటువంటి నకారాత్మక శక్తిని అంటే నెగిటివ్ ఎనర్జీని అది రాకుండా అడ్డం పడుతుంది. మన ఇంటి మీద చూపించేటటువంటి చెడు ప్రబావాన్ని అది లాక్కుంటుంది.
ఒకవేళ మీరు తరచుగా బూడిద గుమ్మడికాయలు కడుతున్నప్పుడల్లా కొద్ది రోజులకే కుళ్లి పోతున్నాయంటే మీ ఇంటి మీద ఎక్కువగా నరఘోష, నరద్రుష్టి, నరపీడ ఉందని గుర్తుంచుకోండి. మీకు తగలవలసినటువంటి ఆ దోషాన్ని ఆ గుమ్మడికాయ లాక్కొని చెడిపోతుందని గమనించాలి.
వెంటనే ఆ పాడైపోయినటువంటి గుమ్మడికాయను పారేసి వేరొక గుమ్మడికాయని కట్టాలి.
ఇంట్లో అద్దెకు నివసిస్తున్న వారైనా కూడా ఇంటి ద్వారబంధానికి పైన ఈ యొక్క గుమ్మడికాయను ఖచ్చితంగా కట్టుకోవాలి.
గుమ్మడికాయ ఇంటికి ఉంటే కాలభైరవుడు రక్షణగా ఉన్నట్లు గుర్తు. ఇంటి ముందుకు వచ్చేటటువంటి దోషాలు అంటే నరఘోష, నరపీడ, నరదృష్టి, నరశాప నకారాత్మక శక్తిని అంతా కూడా కాలభైరవ స్వరూపమైనటువంటి గుమ్మడికాయకు ఉంది కాబట్టి గుమ్మడికాయ విషయంలో ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయకండి.
పాడైపోయినప్పుడల్లా కొత్తది కట్టేయాలి.ఇప్పటివరకు అసలు గుమ్మడికాయను కట్టకపోతే వెంటనే కొత్త గుమ్మడికాయను తీసుకువచ్చి కట్టేయండి. ఇలా గురువారం రోజు గానీ.. ఆదివారం రోజు గానీ కట్టాలి..
స్వస్థి.....
*సనాతన ధర్మస్య రక్షిత-రక్షితః*