Detroit Telugu Literary Club

Detroit Telugu Literary Club

తెలుగు చదవండి, చదివించండి, మాట్లాడండ?

1998 డిసెంబరులో ఒక ఆదివారం మధ్యాహ్నం Ann Arbor Public Library లో మొదటిసారి సమావేశమైనప్పుడు, ఇదొక క్లబ్ గా ఏర్పడుతుందని, ఇన్నాళ్ళు నిర్విఘ్నంగా నడుస్తుందని ఎవరూ ఊహించలేదు సరిగదా, ఆ ఆలోచనే ఎవరికీ రాలేదు. ఈ సమావేశం జరగడానికి సుమారు ఒక సంవత్సరం ముందు ఆరి సీతారామయ్య గారు డిట్రాయిట్ తెలుగు అసోసియేషన్ పత్రిక వార్తావాహినిలో 'తెలుగు సాహిత్యం చదివి చర్చించడానికి ఇష్టపడేవారున్నారా' అని చేసిన ప్రకటనకు ఎవరూ పె

13/09/2024

గాజుల సంచి (కథలు) - మొహమ్మద్ గౌస్

Sunday, October 6⋅2:30 – 5:30pm EST
Sri Venkateswara Temple & Cultural Center
26233 Taft Rd, Novi, MI 48374, USA

-----------------------
నాకు జరిగిన విషయాలు, నేను చూసిన సంఘటనలే కాకుండా నేను విన్న, నాతో చెప్పుకున్న మనుషుల బాధలు కూడా ఇందులో కథలయ్యాయి. వాళ్ళందరూ ఇందులో పాత్రలయ్యారు. ఒక్కొక్క కథ రాస్తుంటే ఎప్పుడో పారేసుకోనొచ్చిన జీవితం కొంచెం కొంచెంగా దొరికినట్లనిపించింది. అంతలో కరోనా వల్ల నగరజీవితానికి తాత్కాలిక విరామం ఇవ్వాల్సిరావటంతో మా ఊరిలో ఉంటూ, ఇంట్లో వాళ్ళతో గడపటానికి ఎంతో సమయం దొరికింది. ఎన్నో కథలు తెలుసుకోవటానికి అవకాశం దొరికింది. వారమంతా పని చేసుకుంటూ, వారాంతాల్లో కథలు రాసి పత్రికలకి పంపేవాడిని. ఆలస్యమైనా రాసిన కథలన్నీ పత్రికల్లో వచ్చాయి. రాసుకుంటూ రాసుకుంటూ ఇన్ని కథలయ్యాయి. ఇందులో ఉన్న యాసంతా నేను వింటూ, మాట్లాడుతూ పెరిగిన యాస.

ఈ కథలన్నీ రాసుకున్నాక “వీటిలో మా యాసంతా భద్రంగా ఉంది కదా' అనే ఒక ఆలోచన చాలా హాయినిచ్చింది. ఇవన్నీ పుస్తకంగా వస్తూ ఉండటం ఇంకా ఎక్కువ హాయిగా, కొంత దిగులుగా (కారణం తెలియదు) ఉంది.

కథలన్నీ చేరాల్సిన చోటులకీ, చదవాల్సిన మనుషులకీ చేరతాయని ఆశిస్తూ......

- మొహమ్మద్ గౌస్

05/08/2024

చర్చాంశం: టాటా కథలు - హరీష్ భట్ (అనువాదం:మంజులూరి కృష్ణకుమారి)

Sunday, September 1⋅2:30 – 5:30pm (EST)
Sri Venkateswara Temple & Cultural Center
26233 Taft Rd, Novi, MI 48374, USA

https://calendar.app.google/a93RoVKBa3UZijrZ8

పరిచయం - మొదటి కథ

ఇదొక విభిన్నమైన కథల పుస్తకం. 150 ఏళ్ళకు పైగా గుర్తింపుపొందిన వ్యవస్థ కలిగిన టాటాల చరిత్రలో వైవిధ్యం కలిగి స్ఫూర్తిని నింపే చాలా కథల సంకలనం.

భారతదేశంలో ప్రధాన కార్యాలయం కలిగిన అనేక సంస్థలతో కూడిన అతిపెద్ద భారతీయ కార్పొరేట్ నెలవు టాటా. ప్రపంచ వ్యాప్తంగా 700 మిలియన్ల వినియోగదారులు టాటా ఉత్పత్తులు, సేవలు ఉపయోగించడానికి కారణం అవి సాధించిన మొక్కవోని నాణ్యత, మన్నికలతోబాటు, పదిహేను దశాబ్దాలకు పైబడి టాటా మాత్రమే పొందిన విశ్వసనీయత.

ఈ సుదీర్ఘవర్తుల కాలరేఖపై కొన్నివేల, అందమైన, అబ్బురపరిచే టాటా కథలు మనల్ని ఉత్తేజపరచి, ప్రేరేపించి మన జీవితాలను సార్థకం చేసుకునేందుకు తోడ్పడతాయి.

ఈ కథలు అసాధారణ, దీర్ఘకాల, దీప్తిమయ వైవిధ్యభరిత జీవితాలను, టాటా విజయాలను ప్రతిఫలిస్తాయి. కానీ వాటి సారాంశం చాలా సాధారణ స్త్రీ, పురుష సమూహాలను కదిలించటం. మనకు అవి ఎన్నో లోతైన పాఠాలను అందిస్తాయి.

దేనికైనా ఒక తొలి కథ ఉంటుంది. అది టాటా సంస్థ ఎలా పుట్టింది అనేది!

జంషెడ్జీ టాటా కథ

ఈ కథ భారతదేశ పశ్చిమ ప్రాంతంలో గుజరాత్ లోని 'నవసారి' నగరంలో చిన్న ఇంటిలో మొదలవుతుంది. 1839 మార్చి 3వ తేదీన ఫార్సీ జొరాస్ట్రియన్ మతాచార్యుల కుటుంబానికి చెందిన 'నుస్సర్ వాంజీ టాటా'కు కుమారుడు జన్మించాడు. ఆ కుర్రవాడే టాటా సంస్థను స్థాపించిన జంషెడ్జీ టాటా. తండ్రితో కలసి ఉండటానికి జంషెడ్జీ తన పదమూడో ఏట ముంబైకి వెళ్ళాడు.

ఎల్ఫిన్స్టోన్ కళాశాలలో చదివిన అతను పుస్తక పఠనం పట్ల మక్కువ పెంచుకున్నాడు. చార్లెస్ డికెన్స్, విలియం మేక్పీస్ థాకరేలు అతని అభిమాన రచయితలు. మార్క్ ట్వైన్ హాస్య రచనలను ఆనందించేవాడు. పుస్తకాలు అతనికి ప్రపంచపు అద్భుతద్వారాలు

-------------------------
వ్యక్తిగతంగా రాలేనివారు Zoom ద్వారా పాల్గొనవచ్చు. అన్ని సమావేశాలకు ఒకటే Zoom meeting link:https://wayne-edu.zoom.us/j/98625758646...

డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి పాతికేళ్ళ పండగ || సత్కారం || వంగూరి చిట్టెన్ రాజు 06/12/2023

డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి పాతికేళ్ళ పండగ || సత్కారం || వంగూరి చిట్టెన్ రాజు సెప్టెంబర్ 30-అక్టోబర్ 1,2023 తారీకులలో జరిగిన డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి పాతికేళ్ళ పండగ లో వంగూరి చిట్టెన్ రాజ....

డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి పాతికేళ్ళ పండగ|| DTLC - KARUNASRI JANDHYLA - PART I of III 10/10/2023

డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి పాతికేళ్ళ పండగ|| DTLC - KARUNASRI JANDHYLA - PART I of III సెప్టెంబర్ 30-అక్టోబర్ 1,2023 తారీకులలో జరిగిన డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి పాతికేళ్ళ పండగ కు శుభాకాంక్షలు - YR 1991 "కర...

డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి పాతికేళ్ళ పండగ || DTLC - Srini Pinnamaneni 09/10/2023

డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి పాతికేళ్ళ పండగ || DTLC - Srini Pinnamaneni సెప్టెంబర్ 30-అక్టోబర్ 1,2023 తారీకులలో జరిగిన డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి పాతికేళ్ళ పండగ లో జరిగిన సమావేశం లో డి...

డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి పాతికేళ్ళ పండగ|| DTLC - శృంగవరపు నిరంజన్ 05/10/2023

డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి పాతికేళ్ళ పండగ|| DTLC - శృంగవరపు నిరంజన్ సెప్టెంబర్ 30-అక్టోబర్ 1,2023 తారీకులలో జరిగిన డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి పాతికేళ్ళ పండగ లో జరిగిన సమావేశం లో ఉత...

1 2 1 burrakata: బుర్రకత (కనుబరుపు కళలు) : తెలుగు నడక 23/10/2022

వీర, అద్భుత, కరుణ రసాలను కలగలిపి గానం చేస్తూ, జనంలో ఆనందం, ఆవేశం, ఆవేదన, ఉద్రేకం, ఉత్సాహం వంటి తలపులను తట్టి లేపే కళారూపం

1 2 1 burrakata: బుర్రకత (కనుబరుపు కళలు) : తెలుగు నడక వీర, అద్భుత, కరుణ రసాలను కలగలిపి గానం చేస్తూ, జనంలో ఆనందం, ఆవేశం, ఆవేదన, ఉద్రేకం, ఉత్సాహం వంటి తలపులను తట్టి లేపే కళ...

01/09/2022

https://fb.watch/fgEkzPy6dY/

#తెలుగు_నడక

22/08/2022

https://fb.watch/f3cSzXv49O/

#తెలుగు_నడక

తెలుగువాణి స.వెం.రమేశ్ ప్రత్యేక ఇంటర్వ్యూ | #Teluguvani Foundation | DTLC 20 Years Celebrations 09/08/2022

తెలుగువాణి స.వెం.రమేశ్ ప్రత్యేక ఇంటర్వ్యూ | #Teluguvani Foundation | DTLC 20 Years Celebrations తెలుగు జాతి తప్పక చూడవలసిన ఇంటర్వ్యూ | తెలుగువాణి స.వెం.రమేశ్ | DTLC 20 Years Celebrations | Myra MediaSpecial interview with Teluguvani Sa.Vem.Ramesh garuM...

Ellalu Leni Telugu - YouTube 27/07/2022

ఎల్లలు లేని తెలుగు

Ellalu Leni Telugu - YouTube Share your videos with friends, family, and the world

Ellalu Leni Telugu - YouTube 27/07/2022

ఎల్లలు లేని తెలుగు - సా వెం రమేశ్
#

Ellalu Leni Telugu - YouTube Share your videos with friends, family, and the world

16/07/2022
స వెం రమేష్ గారితో హర్షణీయం 10/07/2022

స వెం రమేష్ గారితో హర్షణీయం స.వెం.రమేశ్ గారు జీవితమంతా తెలుగు భాషా ప్రాచుర్యానికే అంకితం చేసిన అపురూపమైన మనిషి. హర్షణీయంతో ఆయన మనం కోల్పోత.....

05/07/2022