Arunachala Shiva Arunachalam Updates

Arunachala Shiva Arunachalam Updates

Om Arunachaleswaraya Namah
Tiruvannamalai arunachaleswara update in Telugu language

31/01/2024

ఓం అరుణాచలేశ్వరాయ నమః 🙏

25/01/2024

🙏

24/01/2024
Photos from Arunachala Shiva Arunachalam Updates's post 24/01/2024

24/01/2024

ఓం అరుణాచలేశ్వరాయ నమః
ArunachLam

06/12/2023

అరుణాచల మహిమ

"స్కోకామయత బహుస్యాం.......

సృష్టికి పూర్వం ఏకంగా వున్న మహేశ్వరుడు, చాలా అయి తన వైభవాన్ని దర్శించి, ప్రదర్శించి చూద్దామనుకున్నాడు. అప్పుడు ఈ విశ్వం, దాని నిర్వాహకులుగా బ్రహ్మ విష్ణువులు సృజించబడ్డారు. అంతలోనే వారికి తమలో ఎవరు గొప్ప అని వివాదం ఏర్పడగా, ఒక అనంత జ్యోతిర్లింగ స్తంభం ప్రత్యక్షం అయింది.

తన తుది మొదలు తెలుసుకున్నవారే ఘనులు అని అశరీరవాణి ప్రకటించగా, బ్రహ్మ హంసరూపంతో పైకెగురుతూ ఆ లింగ శిరస్సును, విష్ణువు వరాహరూపంతో భూమిని తవ్వుతూ లింగ పాదాన్ని అన్వేషించబోయారు. విఫలురై వచ్చి ప్రార్థించగా, జ్యోతిరూప పరమేశ్వరుడు కరుణించి వారికి జ్ఞానబోధ చేసాడు. వారి ప్రార్థనపై అరుణాచల పర్వతంగాను ఆవిర్భవించాడు. అది కృత్తికా నక్షత్ర ప్రదోష సమయం కాబట్టి నాటినుంచి ఏటా అరుణగిరి శిఖరంపై గొప్పజ్యోతిని వెలిగించి ఆ దివ్యసంభవాన్ని, తత్త్వజ్ఞాన బోధను స్మరించుకుంటున్నాం. ప్రస్తుతకాలంలో కృత్తికా దీపోత్సవాన్ని 20 లక్షలకు పైగా ప్రత్యక్షంగాను, ప్రపంచమంతా టీ.వీ.లలో ప్రత్యక్ష ప్రసారాన్ని (లైవ్) పరోక్షంగాను దర్శించి పరవశిస్తున్నారు.

ఈ దీపోత్సవం గురించి సుమారు మూడువేల ఏళ్ళక్రితమే అగస్త్యశిష్య విరచిత "తోల్ కాప్పియమ్” అనే తమిళ తాళపత్రంలో ఉంది. జ్యోతిస్తంభం అరుణగిరిగా ఏర్పడినది ధనుర్మాస ఆర్ధా నక్షత్ర దివసం. ఆ లింగంనుంచి 'మాఘ కృష్ణ చతుర్దశి నిశి (అర్ధరాత్రి సమయంలో పరమేశ్వరుడు రుద్రనామంతో వెలువడి బ్రహ్మ విష్ణువు ఇంద్రాది దేవతలచే పూజింపబడినదే అత్యంత పావన మహాశివరాత్రి.

ఈ గిరిని అనాదిగా ఎందరో మహాత్ములు సేవిస్తూ వున్నప్పటికీ, భగవాన్ శ్రీరమణ మహర్షులవారు 1896 సెప్టెంబరు 1 మంగళవారంనాడు మంగళప్రదంగా ఇక్కడ కాలుపెట్టినప్పటినుండి మాత్రమే గిరివైభవం, విభూతులు విశ్వవిఖ్యాతి చెందసాగాయి. ఈ గిరిమహిమను పలు విధాలుగా ఆయన ఉదాహరించారు. మనిషికి వెన్నెముక (మేరువు) ఎలాగో విశ్వానికి గిరి అలాగ. అలాగే ఇది భూహృదయము, అనగా ప్రపంచానికి గుండె. మరియు లోకం అనే చిత్రానికి తెర వంటిది అనీ, ప్రపంచమంతా అణగారిపోగా మారక నిలిచి ఉండే తత్త్వమే అరుణాచల మని - ఇలా ఎన్నో విధాలుగా అరుణాచల తత్త్వాన్ని వర్ణించారు. వారిక్కడ జీవించిన 54 సం॥ల్లో ఎన్నడూ క్షేత్ర పొలిమేరను దాటిపోలేదు.

Videos (show all)

ఓం అరుణాచలేశ్వరాయ నమః 🙏
Om Arunachaleswaraya Namaha

Website