Marumudi Victor Prasad
SC COMMISSION CHAIRMAN ANDHRA PRADESH
ఈ రోజు బాపట్లజిల్లా బట్టిప్రోలు మండలం పెసర్లంక గ్రామంలో యన్నా సురేష్ పొలంలో భూస్వాములు దౌర్జన్యంగా వేసిన రోడ్ సంఘటనపైన విచారణ రోడ్ తొలగించమని RDO కి ఆదేశాలు పోలీస్ లకు కేసు కట్టి నిందులను అరెస్ట్ చేయమని ఆదేశాలు జారీచేయటం జరిగింది జై భీమ.
నిన్న అనగా 24-07-2024 న 11 గంటలకు కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం చినగొల్లాపాలెం లో సముద్రతీరంలో SC లకు చెందిన భూమిని దౌర్జన్యంగా కబ్జా చేసిన సంఘటన పైన విచారణ నిమిత్తంసందర్శించటం జరిగింది. జై భీమ్
కా| నాదెండ్ల బ్రమ్మయ్య హత్య కేసులో 174సెక్షన్ నుండి 302గా మార్చటానికి sc st సెక్షన్ క్రింద నమోదు చెయ్యటానికి
Sc కమిషన్ చైర్మన్ శ్రీ మారుమూడి విక్టర్ ప్రసాద్ సహకరించినందుకు
దళిత బహుజన ప్రజా సంఘాల ఐక్య వేదిక ప్రతినిధి వర్గం స్వయంగా విజయవాడ ఆఫీస్ నందు కలసి అభినందనలు తెలియదు జేయటం జరిగింది.
ఈ కార్యక్రమం లొ శిఖా సురేష్, సాదు మాల్యాద్రి వేల్పూరి నరసింహారావు, తాటికొండ నరసింహారావు, డెన్నిస్ రాయ్, నల్లపు నీలాంబరం, సమతా, నాదెండ్ల సామ్రాజ్యం, వేంపాటి విజయలక్ష్మి తదితరులు వున్నారు.
ప్రజాస్వామ్యంలో
ఓటు, చట్టం, స్వేచ్ఛ , న్యాయం, సమానత్వం , సోదరభావం తప్ప.., దాడులు , హత్యలు , చట్టాన్ని ఉల్లగించటం లాంటి దుశ్చర్యలకు తావులేదు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయితో దాడి చేయటం అత్యంత హేయమైన చర్య దీనిని అందరూ కండించాలి. ప్రజాస్వామ్యంలో ఇటువంటివాటికి తావిచ్చినవారికి ప్రజలు చట్టాల పరిధిలో జరగాల్సిన న్యాయం జరుగుద్ది.
Get well soon CM SIR
నాకు సమాజంలో మనిషిగా గుర్తింపు ఇచ్చి స్వేచ్ఛ సమానత్వంతో బ్రతికే అద్భతమైన హక్కులు ప్రసాదించి నన్ను నేడు ఇంత అత్యున్నత స్థాయిలో నిలబెట్టిన మానవహక్కుల సృష్టికర్త నా దేవుడు విష్వజ్ఞాని భారత రాజ్యాంగ నిర్మాత DR BR అంబేడ్కర్ గారి 133 వ జన్మదినోత్సవ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు జై భీమ్ లు
భీమవరం జిల్లా ఉండి మండలం వండ్రం గ్రామంలో గ్రామ సర్పంచ్ sc ల స్మశానాల్ని ధ్వంసం చేసి sc ల సమాధులపైన తన పొలానికి దారివేసిన సంఘటన పైన ఈ రోజు ఆ గ్రామాన్ని సందర్శించి సర్పంచ్ వేయించిన రోడ్ ను తీసివేయించి SC ల స్మశానాన్ని తిరిగి స్వాధీన పరిచాను, అలాగే ఎస్సీ ల నడక దారిని కూడా ఆక్రమించుకుని తన చెరువులో కలిపేసుకున్న సర్పంచ్ పైన FIR కట్టి అరెస్ట్ చేయమని RDO గారిని MRO గారికి ఆదేశాలు జారీ చేశాను. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చెయమని ఆదేశాలు జారీ చేసాను.
జై భీమ్….
ది 26-2-2024 న గుంటూరు జిల్లా కొల్లిపర మండలం తుములూరులో నారది ఉమామహేశ్వరరావు హత్య కేసు విషయం పైన ఈ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించి హత్యకు సంబంధించిన వివరాలు సేకరించడం జరిగింది. ఈ హత్యకేసులో ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేయటం జరిగింది, రేపు ఉమామహేశ్వరరావు తల్లి పేరున మొదటి తఫా compensation Rs 4,12, 500 ఇవ్వమని ఆదేశాలు జారీ చేశాను. చట్టం ప్రకారం మృతుని అక్కకు జాబ్ తల్లికి పొలం వెంటనే ఇవ్వమని ఆదేశాలు జారీ చేయటమైనది.
ఈరోజు పామర్రులో జరిగిన జగనన్న విద్యా దీవెన కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రీవర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం జరిగింది.
శ్శ్రీకాకుళం జిల్లా రణస్థలంమండలం పైడిభీమవరం గ్రామంలో Dr BR అంబేడ్కర్ సామాజికన్యాయ భవనం శంకుస్థాపన కార్యక్రమంలో
ఏలూరు జిల్లా బిమడోలు మండలం కోరుకొల్లు పంచాయితీ రత్నాపురం గ్రామంలో ఎస్సీ లకు చెందిన భూమిని భూస్వామి స్వాధీనపరుచుకున్న విషయమై నిన్న సంబదిత అధికారులతో ల్యాడ్ మీదకు వెళ్ళటం జరిగింది
ఈ రోజు విజయవాడ హనుమంతరాయగ్రంధాలయంలో జరిగిన సఫాయి పారిశుద్ధ కర్మీకుల అవగానా సదస్సులో పాల్గొనటం జరిగింది.
జై భీమ్
ఈ రోజు మచిలీపట్నం collector office లో మన ఉమ్మడి రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారి జన్మదిన వేడుకల్లో పాల్గొనటం జరిగింది. నాతోపాటు వేదికపైన జిల్లా కలక్టర్ గారు R D O గారు సోషల్ వెల్ఫేర్ D D గారు.
మనదేశంలోని కోట్లాది ప్రజల స్వేచ్ఛ సమానత్వం సమన్యాయం కోసం హక్కులకోసం తన నలుగురు బిడ్డల్ని కోల్పోయి …… తన జీవితాన్ని కూడా త్యాగం చెసి….. పిడకలు అమ్మి తనకుటుంబాన్ని పోషించడమే కాకుండా ……. విశ్వజ్ఞాని Dr BR అంబేడ్కర్ గారు విదేశాల్లో చదువుకునే రోజుల్లో డబ్బులు పంపి చదివించిన త్యాగాల తల్లి ,, నాతల్లి ,, మాతారమాబాయి అంబేడ్కర్ గారి జన్మదినం సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు… 7-2-1898
విజయవాడ అంబేడ్కర్ స్మృతివనం వేలాది సందర్శకులతో కోలాహలంగా కేరింతలతో క్రిక్కిరిసిపోయింది
ఈరోజు విజయవాడ స్వరాజ్మైదానంలో Dr BR AMBEDKAR గారి 125 అడుగుల విగ్రహం వద్ద నేడు బౌద్ద బిక్షు బంతేజీ దమ్మతేరోగారి ఆధ్వర్యంలో అంబేడ్కర్గారి స్మృతివనం సందర్శన… ఉద్దవందనం జై భీమ్ అంబేడ్కర్ ఆలోచనా విధానం నినాదాలతో అంబేడ్కర్ స్మృతివనం ప్రాంగణం దద్దరిల్లింది….. నా చెత బుద్ధిష్ట్ క్యాలెండర్ , గోడపత్రిక , బ్రోచర్ ఆవిష్కరణ చేయించారు…
ఆ పవిత్ర స్మృతివనం లో Law department deputy secretary శ్రీ వెలగపల్లి వెంకటేశ్వరావు గారు group 11 పరీక్షలకు విద్యార్థులకు ఫ్రీ మెటీరియల్ ఇవ్వటం జరిగింది 2 గంటలపాటు ఆ పవిత్రప్రాంగణంలో ఎంతో ఉత్సాహంగా మనశాంతి గా భక్తితో అంబేద్కర్ గారిని దర్శించుకున్నాము….