Gandham Chandrudu

Gandham Chandrudu

Experienced administrator working with Government of Andhra Pradesh in implementing Public Policies.

23/05/2024

అందరికీ బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు.
మానవాళికి universal కరుణ మరియు ప్రజ్ఞ ను నేర్పిన మహనీయుడు.
ఆయన మార్గం- బుద్ధిజం-‘Religion of Books’ను అనుసరించుదాం మరియు kingdom of righteousness ను ఏర్పాటు చెయ్యడానికి శ్రమిద్దాం.

అన్ని జీవరాశులు సంతోషంగా వుండాలని కోరుకుంటూ….

Happy Buddha Purnima.

The Buddha taught humanity the concepts of universal compassion and knowledge.

Let’s follow his path - Buddhism-‘religion of books’ and strive for establishing the kingdom of righteousness.

Bhavathu Sabba Mangalam- Let All Beings be Happy.

26/01/2024

Happy Republic Day. Let’s remember the words of Dr Ambedkar told and dedicate ourselves to work for ending the contradictions and bringing a social and economic democracy.
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. డా॥ అంబేద్కర్ చెప్పిన మాటల్ని గుర్తుచేసుకొని అందరం సామాజిక మరియు ఆర్థిక ప్రజాస్వామ్యం కోసం పనిచేద్దాం.

Dr. Shashi Tharoor | Ambedkar is one of the highly educated individuals at that time. #ambedkar 16/01/2024

https://youtube.com/shorts/ixuz9TLejT8?si=kx6AQ5DtWtdLHbvJ

Dr. Shashi Tharoor | Ambedkar is one of the highly educated individuals at that time. #ambedkar FAIR-USE COPYRIGHT DISCLAIMER Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as critici...

07/11/2023

Happy Students Day
Ambedkar School Entry Day

నవంబర్‌ 7వ తారీఖు, 1900 సంవత్సరం 9 సంవత్సరాల భీమ్‌రావ్‌ మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని రాజ్‌వాడా చౌక్‌లో వున్న గవర్నమెంట్‌ హై స్కూలు (ప్రస్తుతం ప్రతాప్‌ సింగ్‌ హై స్కూల్‌)లో ఇంగ్లీష్‌ మొదటి తరగతి విద్యార్థిగా జాయిన్‌ అయ్యాడు (Admission no: 1914).
ఆరోజు ఆ విద్యార్థికి కానీ, ఆయన తల్లి దండ్రులకు కానీ, వారి బంధువులకు కానీ, అక్కడ స్కూల్‌ టీచర్స్‌కి కానీ తెలిసి వుండదు- భవిష్యత్తులో ఆ భీమ్‌రావే దేశం మరియు ప్రపంచం గర్వించే స్థాయికి చేరుకొని, ఆ స్కూల్‌కి దేశానికి పేరు తెస్తాడనీ. ఆరోజు వారికి తెలియదు ఆ భీమ్‌రావ్‌ భారత రాజ్యంగ నిర్మాత డా॥ భీమ్‌రావ్‌ అంబేద్కర్‌ అవుతాడని.

డాక్టర్‌ భీమ్‌రావ్‌ అంబేద్కర్‌ స్కూల్లో అడ్మిట్‌ అవ్వడం వెనక ముందు తరాల వారి చాలా పెద్ద పోరాటమే వుంది. విద్యను కేవలం కొన్ని కులాల దైవిక హక్కుగా వుంచుకొని, జన బాహుళ్యానికి విద్యను నిరాకరించిన వ్యవస్థలో ఎన్నో తరాలుగా ఎంతో మంది విద్యకు దూరమయ్యారు. ఏ దేశానికైనా ముఖ్యమైన resource అంటే అది Human resource నే. అందునా పిల్లలు ఇంకా ముఖ్యమైన రీసోర్స్‌. ఎవరైతే మానవ వనరుల మీద దృష్టి పెట్టి అభివృద్ధి చేసుకుంటారో, ఆ దేశం ముందుకు వెళుతుంది. మానవ వనరులను నిర్వీర్యం చేసే మూఢ వ్యవస్థలను కొందరి స్వార్థం కోసం పెట్టుకున్న వారు ముందుకు వెళ్ళలేరు.

అలా విద్యను కొందరికి మాత్రమే పరిమితం చేసిన వ్యవస్థను, 1854లో ఈస్ట్‌ ఇండియా కంపెనీ ‘‘జన బాహుళ్యానికి’’ విద్యను అందించడానికి ‘‘క్రియాశీలక చర్యలు తీసుకుంటామని’’ వారి Board of Directors resolution pass చేయడం ద్వారా ‘‘అందరికీ విద్య ప్రభుత్వ బాధ్యత’’ అన్న కాన్సెప్ట్‌ వచ్చింది.
Resolution అయితే పాస్‌ చేశారు కానీ, అమలు మాత్రం అంతంత మాత్రమే. అందునా దళిత వర్గాలకు అస్సలు విద్య అందలేదు. 1881లో బాంబే రెసిడెన్సీ మొత్తం ప్రైమరీ స్కూల్‌ విద్యార్థులలో దళిత విద్యార్థుల శాతం ఒకటి కంటే తక్కువ (కానీ వారి జనాభా మాత్రం 13 శాతం పైనే). హైస్కూల్‌ మరియు కాలేజ్‌లలో వారి సంఖ్య సున్నా.
``````````````````````
భీమ్‌రావ్‌ తండ్రి రామ్‌జీ మాలోజీ సక్పాల్‌. 1866లో 18 సంవత్సరాల వయసులో బాంబే ప్రెసిడెన్సీ ఆర్మీలోని Sappers and Miners Regiment లో చేరారు. (ఆర్మీ రికార్డ్స్‌ ప్రకారం ఆయన పేరు Ramnak Malnak) ఆర్మీలోని వారికి, వారి కుటుంబ సభ్యులకు చాలా తక్కువ ఖర్చుతో విద్యని అందించేవారు. అందులో వున్న కొందరు సైనికులకు టీచర్స్‌గా ట్రైనింగ్‌ ఇచ్చేవారు.
అలా ట్రైనింగ్‌ ఇవ్వబడిన వారిలో భీమ్‌రావ్‌ తండ్రి ఒకరు. కొన్ని సంవత్సరాల తరువాత ఆయన Mhow లోవున్న ఆర్మీ స్కూల్‌కి హెడ్‌ మాస్టర్‌గా పని చేశారు. అలా ఆయనకు విద్యపై మక్కువ ఏర్పడిరది.
పద్నాలుగు మంది సంతానంలో ఏడు మంది చనిపోగా, బ్రతికిన వున్న మిగతా ఏడుగురికి విద్యనిందించడానికి ఆయన ప్రయత్నం చేశారు. బ్రతికిన నలుగురు ఆడపిల్లలు చిన్న వయసులోనే పెళ్ళి అవ్వడం వలన ప్రైమరీ స్కూలింగ్‌ కూడా పూర్తి చెయ్యలేక పోయారు. మిగిలిన వారిలో పెద్దోడు బలరాం. ప్రైమరీ స్కూలింగ్‌ పూర్తి చేశాడు, కానీ అంతకంటే ముందుకు వెళ్ళలేకపోయాడు. రెండో వాడు ఆనందరావు, ప్రైమరీ పూర్తిచేశాడు. హైస్కూల్‌ మధ్యలో ఆపి కుటుంబానికి తోడుగా వుండాల్సి వచ్చింది. చిట్ట చివరి వాడు పద్నాలుగవ సంతానం అయిన అంబేద్కర్‌ మాత్రమే ఎటువంటి ఆటకం లేకుండా పూర్తి విద్యను కొనసాగించగలిగాడు.
`````````````````````````
బ్రిటీష్‌ ఆర్మీలో పనిచేసి రిటైర్‌ అయిన తరువాత కుల వ్యవస్థ దురాగతాలను తట్టుకోలేక, దళిత పెన్షనర్స్‌ అందరు, వారి వారి గ్రామంలో కాకుండా, అందరూ కలిసి రత్నగిరి జిల్లాలోని దాపోలి మున్సిపాలిటీలో ఒక సెపరేట్‌ కాలనీ ఏర్పాటు చేసుకొన్నారు.
1892లో Martial Classes ను మాత్రమే ఆర్మీలోకి తీసుకొనే వ్యవస్థను బ్రిటీష్‌ వారు introduce చేశారు. Mahars Martial Class కాదు అని పక్కన పెట్టడం వలన కొత్త recruitment లేకపోగా, వున్న వారిని- అందులో ముందుగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారిని బలవంతంగా రిటైర్‌ చేయించారు. అలా అంబేద్కర్‌ తండ్రి 1893లో రిటైల్‌ అయ్యి దాపోలిలో సెటిల్‌ అయ్యాడు.
1854 ‘అందరికీ విద్య ప్రభుత్వ భాద్యత’ అని దానికి క్రియాశీలక చర్యలు తీసుకుంటామని రిజల్యూషన్‌ పాస్‌ చేసిన ఇంకా ఎక్కడా కూడా గవర్నమెంట్‌ funded స్కూల్స్‌లో దళితులను అడ్మిట్‌ చేసుకోడం లేదు.
దాపోలిలో వున్న గవర్నమెంట్‌ ఫండెడ్‌ స్కూలులో చేర్చుకోమ్మని జూలై1892 మరియు సెప్టెంబర్‌ 1892లో ముందు దాపోలి మున్సిపాలిటీకి, నవంబర్‌ 1892 బ్రిటీష్‌ అసిస్టెంట్‌ కలెక్టర్‌కి, జనవరి 1893లో జిల్లా కలెక్టర్ కి విన్నపం పెట్టుకున్నారు, అక్కడ సెటిల్‌ అయిన రిటైర్డ్‌ దళిత పెన్షనర్స్‌.
దాపోలిలో వున్న స్కూల్‌కి వరండా కట్టడానికి ఖర్చు భరిస్తే, ఆ ఖర్చుతో వరండా కట్టి అక్కడ (తరగతి గది బయట, వరండాలో) దళితుల పిల్లలను కూర్చోబెట్టుకోవానికి అగ్రకుల దాపోలి మున్సిపల్‌ ప్రెసిడెంట్‌ ఒప్పుకున్నాడు. అది కూడా కార్యరూపం దాల్చలేరు.
వీరంతా మళ్ళీ నవంబర్‌, 1893 District కలెక్టర్‌ను కలిసారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. అందరు మళ్ళీ ఫిబ్రవరి, 1894లో రెవెన్యూ కమిషనర్‌ M.J. Nugent ను కలిసి అప్పీల్‌ చేశారు. Nugent వారిపట్ల సానుభూతితో మునిసిపల్‌ ప్రెసిడెంట్‌కు warning ఇచ్చి దళితుల పిల్లలను చేర్చుకోమని చెప్పారు.
అప్పుడు కూడా ఈ పిల్లలు మిగతా అగ్రకుల పిల్లలకు నాలుగైదు మీటర్ల దూరంలో గోనెసంచుల మీద (నేలపై కూర్చుంటే నేల అపవిత్రమవుతుందట) కూర్చోబెట్టుకోవడానికి ఒప్పుకున్నాడు. ఈ పిల్లలు ఎవరి గోనెసంచి వారే తెచ్చుకొని మళ్ళీ స్కూల్‌ ముగిసిన తరువాత దాన్ని తీసుకొని వెళ్ళాలి. ఇది దాపోలి (Dapoli) స్కూల్‌ వరకే.
మిగతా స్కూల్స్‌లో వరండాలోనే (తరగతి గది బయట -దాని వలన తరగతి లోపల టీచరు చెప్పినా వినబడేవి కాదు. బోర్డు మీద రాసిన కనపడేది కాదు. ఒక విధంగా విద్య నేర్చుకోవాలన్న ఆశయం నీరుగారిపోయింది) వీరికి కూర్చోవడానికి అనుమతి.
అలా తన ముందు తరం వారు చేసిన శాంతియుత వినూత్న పోరాటం ద్వారా విద్య అన్నది అందుబాటులోకి వచ్చింది. అలా 1900 సంవత్సరంలో రాజ్‌ వాడ చౌక్‌లోని స్కూల్లో అంబేద్కర్‌ జాయిన్‌ అయ్యి, అక్కడి నుండి వెనుదిరిగి చూసుకోకుండా చదివి ప్రపంచ మేధావి అయ్యారు.
అంబేద్కర్‌ గారు నిత్య విద్యార్థిగా వుంటూ ప్రపంచ విద్యార్థులందరికీ ఆదర్శమయ్యారు. అవకాశం కల్పిస్తే అందరూ వారి వారి పూర్తి సామర్థ్యానికి ఎదుగుతారు అనడానికి అంబేద్కర్‌ ఒక నిదర్శనం.

మీకెందుకురా చదువూ? అన్న వాళ్ళను చదువును దూరం చేసిన/చేస్తున్న వ్యవస్థలను దాటుకొని అందరూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ...

25/10/2023

Dear Friends,
Opened a WhatsApp channel for better communication

whatsapp.com

15/08/2023

Dr B R Ambedkar గారు ఈ విధంగా చెప్పారు-

".....మనం వైరుధ్యాల జీవితంలోకి ప్రవేశించబోతున్నాం. రాజకీయాల్లో, మనకు సమానత్వం ఉంటుంది మరియు సామాజిక మరియు ఆర్థిక నిర్మాణంలో, ఒక మనిషి ఒక విలువ అనే సూత్రాన్ని నిరాకరిస్తూనే ఉంటాము. ఈ వైరుధ్యాల జీవితాన్ని మనం ఎంతకాలం కొనసాగించాలి? మన సామాజిక మరియు ఆర్థిక జీవితంలో సమానత్వాన్ని ఎంతకాలం నిరాకరిస్తాము? మనం దానిని చాలా కాలం పాటు నిరాకరిస్తూనే ఉంటే, మన రాజకీయ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేయడం ద్వారానే అలా చేస్తాం. వీలైనంత త్వరగా మనం ఈ వైరుధ్యాన్ని తొలగించాలి, లేకపోతే అసమానతతో బాధపడుతున్న వారు ఈ రాజ్యాంగ సభ చాలా శ్రమతో నిర్మించిన ప్రజాస్వామ్య నిర్మాణాన్ని పేల్చివేస్తారు.

….మనం ఒక దేశం అని నమ్మడంలో, మనం ఒక గొప్ప భ్రాంతిని కలిగి ఉన్నాము. వేల కులాలుగా విడిపోయిన మనుషులు దేశం ఎలా అవుతారు? ప్రపంచం యొక్క సామాజిక మరియు మానసిక కోణంలో మనం ఇంకా ఒక దేశం కాదని మనం ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. కేవలం రాజకీయ ప్రజాస్వామ్యంతో సంతృప్తి చెందడం కాదు. సామాజిక ప్రజాస్వామ్యం పునాదిగా ఉంటే తప్ప మన రాజకీయ ప్రజాస్వామ్యం కొనసాగదని మనం గమనించాలి. సామాజిక ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? దీని అర్థం స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వాన్ని జీవిత సూత్రాలుగా గుర్తించే జీవన విధానం.

“స్వాతంత్ర్యం సంతోషించదగ్గ విషయం. అయితే ఈ స్వాతంత్ర్యం మనపై మరిన్ని బాధ్యతలను మోపిందని మనం మరచిపోకూడదు. స్వాతంత్ర్యం ద్వారా, ఏదైనా తప్పు జరిగితే బ్రిటిష్ వారిని నిందించే సాకును మనం కోల్పోయాము. ఇకమీదట తప్పు జరిగితే, మనల్ని మనం తప్ప మరెవరినీ నిందించలేము. విషయాలు తప్పుగా జరిగే ప్రమాదం ఉంది. కాలం వేగంగా మారుతోంది."

"రాజ్యాంగాన్ని రూపొందించడంలో మా లక్ష్యం రెండు-

(1) రాజకీయ ప్రజాస్వామ్య రూపాన్ని నిర్దేశించడానికి, మరియు

(2) మన ఆదర్శం ఆర్థిక ప్రజాస్వామ్యమని మరియు అధికారంలో ఉన్న ప్రతి ప్రభుత్వం ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని తీసుకురావడానికి కృషి చేయాలని సూచించడం”

Dr B R Ambedkar said,

“…….We are going to enter into a life of contradictions. In politics, we will have equality and in social and economic structure, continue to deny the principle of one man one value. How long shall we continue to live this life of contradictions? How long shall we continue to deny equality in our social and economic life? If we continue to deny it for long, we will do so only by putting our political democracy in peril. We must remove this contradiction at the earliest possible moment else those who suffer from inequality will blow up the structure of democracy which this Constituent Assembly has so laboriously built up.”

There is no nation of Indians in the real sense of the world, it is yet to be created. In believing we are a nation, we are cherishing a great delusion. How can people divided into thousand of castes be a nation? The sooner we realise that we are not yet a nation, in a social and psychological sense of the world, the better for us.

We must do is not be content with mere political democracy. We must note that our political democracy can not last unless there lies at the base of it social democracy. What does social democracy mean? It means a way of life which recognizes liberty, equality and fraternity as the principles of life.

Independence is no doubt a matter of joy. But let us not forget that this independence has thrown on us greater responsibilities. By independence, we have lost the excuse of blaming the British for anything going wrong. If hereafter things go wrong, we will have nobody to blame except ourselves. There is a greater danger of things going wrong. Times are fast changing.

Our object in framing the Constitution is two-fold:

(1) To lay down the form of political democracy, and

(2) To lay down that our ideal is economic democracy and also to prescribe that every Government whatever is in power shall strive to bring about economic democracy. The directive principles have a great value, for they lay down that our ideal is economic democracy.”

ఆనాడు బాబా సాహెబ్ అంబేద్కర్ గారు సూచించిన విధంగా ఆర్థిక మరియూ సామాజిక స్వాతంత్ర్యాన్ని, హెచ్చుతగ్గులు లేని అందరూ సమానమైన భారత దేశాన్ని నిర్మించేందుకు అందరం కృషి చెయ్యాలనీ కోరుకుంటూ…

అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ….
Happy Independence Day to All…

Photos from Gandham Chandrudu's post 07/08/2023

చిన్నప్పుడు బండెనక బండిగట్టి పదహారు బండ్లు గట్టి......పాట వింటూ పెరిగాం.
ఆ పాట అప్పటికీ ఇప్పటికీ ఎల్లప్పటికి మరిచిపోలేని పాట అనడంలో సందేహం లేదు.

ఆ పాట అంతలా popular కావడానికి గద్దర్ voice, ఆ lyrics దోహదపడ్డాయి.

బండెన్క బండి గట్టి, పదహరు బండ్లు గట్టి
యే పల్లే బోతవ్ కొడుకో నైజాము సర్కరోడా
నాజీల మించినవ్ రో నైజాము సర్కరోడా

పోలీసు మిల్ట్రీ రెండు బలవంతులానుకోని
నువు పల్లెలు దోస్తివి కొడుకో, ఓహో పల్లెలు దోస్తివి కొడుకో
అహ పల్లెలు దోస్తివి కొడుకో నైజాము సర్కరోడా

జాగీరుదారులంతా, జామీనుదారులంతా
నీ అండా జేరి కొడుకో నీ అండా జేరి కొడుకో
నైజాము సర్కరోడా

ఈ పురుషులంత గలిపి, ఇల్లాలమంత గలిపి
వడిసేల రాళ్ళు నింపి వడివడిగ గట్టితేనూ
కారాము దెచ్చి నీకు కండ్లల్ల జల్లితేనూ
ఈ మిల్ట్రి వారి పోరు ఈ మిల్ట్రి వారి పోరు
నైజాము సర్కరోడా

చుట్టుముట్టు సూర్యపేట, నట్టనడుమ నల్లగొండ
నువ్వుండేదైద్రబాదు, దాని పక్కా గోలుకొండ
గోలుకొండా కిల్ల కింద గోలుకొండా కిల్ల కింద
నీ గోరి గడ్తం కొడుకో నైజాము సర్కరోడా

రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీలు సృష్టించిన బీభత్సాల కంటే నైజాం ఆకృత్యాలు మీరిపోయాయని, రాజకీయ ఎత్తుగడలతో బలవంతులంతా కలిసి ప్రజలని దోచుకొన్నారనీ, రైతులని శారీరకంగా మానసికంగా హింసించిన నీకు గోల్కొండ కోట కింద శ్మశానం కడతామని గద్దర్ తన కోపాన్ని వెళ్ళగ్రక్కాడు.
ప్రజలు తల్చుకుంటే ఎంతటి వారైనా తలవంచాల్సిందే.

బ్రిటిష్ government ను భారత దేశం నుండి పారద్రోలడానికి విదేశాలలో వున్న భారతీయులు మొదలు పెట్టినదే Ghadar movement. Ghadar అంటే (Revolution) విప్లవం అని అర్థం.
ఆ movement ను ఆదర్శంగా తీసుకొని తన పేరు ను గుమ్మడి విఠల్ రావు నుండి గద్దర్ గా మార్చుకొని ప్రజలలో చిరస్థాయిగా నిలిచిన వారి మరణం తెలుగు ప్రజలకే కాకుండా భారతీయులందరికీ తీరని లోటు

శోక తప్త హృదయంతో......వారి మరణానికి సంతాపం తెలియచేస్తున్నాను.

05/05/2023

Let every living being be happy.
Bhavathu Sabba Mangalam.
Happy Buddha Purnima

14/04/2023

Remembering Babasaheb on his birth anniversary...

11/04/2023

Remembering the Mahatma on his birth anniversary…

23/03/2023

Discrimination based on Caste is prohibited in India and institutions/city councils/countries across the globe now.

Harvard University joins the list by adding Caste to its non-discrimination policy.
Historic moment!💙

https://provost.harvard.edu/files/provost/files/non-discrimination_and_anti-bullying_policies.pdf?utm_source=SilverpopMailing&utm_medium=email&utm_campaign=AMG%20ADAB%20policies%203.22.23%20(1)

Photos from Gandham Chandrudu's post 06/03/2023

Seems some one created a fake account on Instagram with my name and profile pic.
I’m notifying my friends and others to be informed of this.
Thank you

CHANDRUDU | Award Winning ShortFilm | by John Sreedar 29/01/2023

Wonderful short film by John Sreedar and excellent acting by Revanth Gh and Mastar Kalyan.
Congratulations to the entire team for being selected at Ontario Film Festival
https://www.oniff.ca/copy-of-films-2020

Based on this FB post https://m.facebook.com/story.php?story_fbid=3957686037625394&id=100001521106249&mibextid=Nif5oz

This short film ends with a relevant question. Ten year old boy asks his father, “ What is Caste?” Caste has different connotations to different people.
For me Caste is “putting a hundred kg stone on the head of an underfed child whose hands and legs are firmly tied and asking him/her to compete in a hundred meter running race with other children who are well fed and trained for the race for years”

What does caste mean to you ?

John Sreedhar చేసిన అద్భుతమైన షార్ట్ ఫిల్మ్ . రేవంత్ Actor Revanth Gh & మాష్టర్ కళ్యాణ్ చాలా బాగా నటించారు. ఒంటారియో ఫిల్మ్ ఫెస్టివల్ లో select కాబడింది. Team అందరికీ అభినందనలు.
ఇది ఈ https://m.facebook.com/story.php?story_fbid=3957686037625394&id=100001521106249&mibextid=Nif5oz FB post నుండి inspire అయ్యింది.
ఈ షార్ట్ ఫిల్మ్ “Caste అంటే ఏమిటీ ? “ అని ఒక చిన్న అబ్బాయి వాళ్ల నాన్నని అడగడంతో ముగుస్తుంది.
Caste ఒక్కొక్కరికీ ఒక్కో విధంగా కనిపిస్తుంది.
నాకు కులం అంటే, “ ఒక బక్కచిక్కిన బాలుడి తల మీద వంద కేజీల బరువు పెట్టి, కాళ్ళూ చేతులూ కట్టి వేసి, బలిష్టంగా వుండి , దాని కోసమే సంవత్సరాలుగా training తీసుకున్న వారితో వంద మీటర్ల పరుగు పందెం లో పాల్గొనమనటం”
మీ ఉద్దేశం లో Caste అంటే ఏమిటి?

https://youtu.be/szVDbPBjQyw

CHANDRUDU | Award Winning ShortFilm | by John Sreedar Chandrudu is a short film that describes caste discrimination in India before the 2000s and how footwear is associated with the hierarchical system in societ...

16/01/2023
Photos from Gandham Chandrudu's post 31/12/2022

Happy new year. May 2023 bring brighter future for all.

19/12/2022

Keep believing in yourself.

06/12/2022

Remembering the great soul Babasaheb on his death anniversary.
Let every Indian perform their duty of abiding, upholding, and protecting the Constitution of India

మహా పరినిర్వాణ దినం- బాబాసాహెబ్ అంబేద్కర్ వర్దంతి సందర్భంగా ఆయనను గుర్తుచేసుకుంటూ…. ప్రతి భారతీయుడు భారత రాజ్యాంగాన్ని పాటించే, పరిరక్షించే డ్యూటీ ని చేస్తారని కోరుకుంటున్సాను.

01/12/2022

Walking in the same lanes treaded by many legends. Completed a course successfully at Harvard Law School. Moment of joy for me to have studied in the same school where Obama has studied ~32 years back. Belief in yourself makes anything possible.
మహనీయులు నడిచిన దారిలో….
దాదాపుగా 32 సం॥ క్రితం ఒబామా చదివిన హార్వార్డ్ లా స్కూల్ లో ఒక కోర్సు పూర్తి చెయ్యడం జరిగింది. నమ్మకంతో ముందుకువెల్లితే ఏదైనా సాద్యమే.


#ఒబామా #నమ్మకం #అవకాశం

26/11/2022

Belief and Opportunity.

Indian Constitution has enabled me to reach one of the best universities in the world from illiteracy of many generations. Constitution has changed the lives of millions for better.
Deep gratitude to the Constitution of India.
Happy Constitution Day

నమ్మకం మరియు అవకాశం.

వేల సంవత్సరాల నిరక్షరాస్యత నుండి ప్రపంచంలో వున్న అత్యుత్తమ విశ్వవిద్యాలయానికి చేరుకోగలిగాను.
అలాంటి నమ్మకాన్ని & అవకాశాన్ని ఇచ్చిన రాజ్యాంగానికి ఎంతో రుణపడి వున్నాను.
రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు.

#నమ్మకం #అవకాశం

Videos (show all)

Keep believing in yourself.
Small gestures go a long way. #JaiBhim movie scene and #BaalikeBhavishyathhu (Girl is the Future) programme side by side...