Cpm Kurupam

Cpm Kurupam

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Cpm Kurupam, Politician, .

Photos from Cpm Kurupam's post 05/07/2024

*అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC) జగన్నాధపురం ఆసుపత్రిలో రెగ్యులర్ డాక్టర్ని నియమించాలని జిల్లా వైద్యాధికారిని(DMHO)పార్వతిగారికి.పట్టణ సిపిఎం కమిటి వినతిపత్రం ఇచ్చాము*
ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి గొర్లి వెంకటరమణ,పాకల సన్యాసిరావు,బంకురు సూరిబాబు మాట్లాడుతూ! పట్టణంలో జగన్నాధపురం యు పి హెచ్ సి ఆసుపత్రిలో ప్రతిరోజు 50 మంది నుంచి 100 మంది వరకు రోగులు ఓపి విభాగంలో తమ అనారోగ్య సమస్యలు గూర్చి వస్తుంటారని పేషెంట్స్ ని చూడడానికి డాక్టరు లేకపోవడం వలన రోగులు ఇబ్బంది పడుతున్నారని, ప్రస్తుత డెప్యుటేషన్ డాక్టర్ ఎన్వి విద్యా కుమార్ గారు అందుబాటులో ఉండడం లేదని ఇలాంటి ఆసుపత్రిలో వైద్యుని కొరత ఉందని రోగులకి ఇబ్బంది లేకుండా రెగ్యులర్ డాక్టర్ని నియమించాలని లేదా ఉన్న డాక్టర్ని రెగ్యులర్ చేయాలని కోరారు.*ఆమె సానుకూలంగ స్పందించి సమస్య పరిష్కరిస్తామని అన్నారు*.

05/07/2024

మీ ఆరోగ్యం మెరుగుపడాలంటే చక్కెర, మతం రెండింటిని తగ్గించాలి.

Photos from Cpm Kurupam's post 05/07/2024

*మహిళలకు చేయూత నగదు 18,750/:రూ"లు. ఇవ్వాలని అఖిల భారత మహిళా సంఘం (ఐద్వా) జిల్లా కార్యదర్సి రెడ్డి శ్రీదేవి ఆద్వర్యంలో జిల్లా కలెక్టరు కార్యాలయం ముందు నిరశన తెలపి! అనంతరం ఏఓ ఎ.వేణుగోపాలరావుగారికి వినతిపత్రం ఇచ్చారు*
ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కమిటీ సభ్యులు గెద్ద తులసి,బౌరోతు గౌరమ్మ, దాసరి మంగమ్మ,,బెలగాం రవణమ్మ,విజయగౌరి, సిఐటియు పట్టణ నాయకులు బంకురు సూరిబాబులు పాల్గొన్నారు. *ఈ సందర్భంగా జిల్లా ఐద్వా కార్యదర్శి రెడ్డి శ్రీదేవి మాట్లాడుతూ! పాత ప్రభుత్వం మహిళలందరికీ చేయూత డబ్బులు 18,750 నాలుగో విడతలో విడుదల చేసిందని, అతి తక్కువ మందికి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అయ్యాయని,ఎక్కువ మంది మహిళలకు చేయూత డబ్బులు జమ కాలేదని అన్నారు.అర్హులైన అందరికీ చేయూత డబ్బులు ఇప్పటి ప్రభుత్వం జమ చేయాలని లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని అన్నారు*

05/07/2024

మీ ప్రభుత్వాన్ని విశ్వాసించలేం....

04/07/2024

జూలై 10 కార్మిక డిమాండ్స్ డే ను జయప్రదం చేయండి.
సిఐటియు కార్మిక వర్గానికి పిలుపు .
దేశంలో, రాష్ట్రంలో జరిగిన ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వాలు కొలువు తీరాయి. గత ప్రభుత్వాల ఆలంబించిన కార్మిక వ్యతిరేక విధానాలు పై అలుపెరగని పోరాటాన్ని కార్మిక వర్గం నిర్వహించింది ,దాని ఫలితంగా గత పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో పాలకవర్గాలకు ప్రజలు, కార్మికులు సమస్యలు పరిష్కరించని పాలకవర్గాలకు హెచ్చరికలను పంపారు.
ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం గత రెండు దఫాలుగా పెట్టుబడిదారీ వర్గానికి సేవలు చేస్తూనే వచ్చింది. ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున పిఎఫ్ చెల్లించని యజమానులకు ప్రభుత్వం వేసే జరిమానాపై పెద్ద ఎత్తున రాయితీ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారుల తొత్తుగా మారింది.
అందుకే సిఐటియు జూలై 10న దేశవ్యాప్తంగా డిమాండ్స్ డే ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందు ఉంచాలని నిర్ణయం చేసిందని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్. వై నాయుడు కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.
గురువారం మక్కువ లో జరిగిన విలేకరుల సమావేశంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు జి కృష్ణతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గానికి కనీస వేతనం 26,000 ఇవ్వాలని, దీనికి గాను గతంలో వేసిన కమిటీ సిఫార్సులు అమలు చేయాలని, పిఎఫ్, ఈఎస్ఐ చట్టాలను అమలు జరిపి, రిటైర్ అవుతున్న కార్మిక వర్గానికి సగం జీతం పెన్షన్ గా ఇవ్వాలని, రాష్ట్రంలో రికవరీ చేసిన వీఆర్ఏల డీఏను తిరిగి జీతాలకు కలిపి చెల్లించాలని, స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని, ప్రైవేటీకరణ విధానాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు .
ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు పవన్, ఎం కృష్ణ, లక్ష్మణరావు పాల్గొన్నారు.

Photos from Cpm Kurupam's post 04/07/2024

జిల్లా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి
ప్రజాశక్తి పార్వతీపురం రూరల్
జిల్లాల రైతులు ఎదుర్కొంటున్న వ్యవసాయ సంబంధిత సమస్యలను నూతన ప్రభుత్వం గుర్తించి తక్షణమే పరిష్కరించి పార్వతీపురం మన్యం జిల్లా వ్యవసాయ పరంగా అభివృద్ధికి తోడ్పడాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం కృష్ణమూర్తి రెడ్డి లక్ష్మీ నాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం జాయింట్ కలెక్టర్ శోభిక ను ఆమె కార్యాలయంలో కలిసి వినతి అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా ఏర్పడిన తరువాత జిల్లాలో పారిశ్రామికంగా గాని వ్యవసాయపరంగా గాని అభివృద్ధి ఏమాత్రం జరగలేదని, జిల్లాలో ఒక్క పరిశ్రమ కూడా లేకపోవడం తీరని లోటని అన్నారు. అలాగే జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు ఉన్నప్పటికీ అవి పరిపూర్ణంగా పూర్తి కాలేకపోవడంతో రైతులు సాగు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. దీర్ఘకాలంగా పార్వతీపురం సీతానగరం గరుగుబిల్లి మండలాల రైతులు ఎదురుచూస్తున్న జంజాయతి ప్రాజెక్టు సమస్యను పరిష్కరించి సత్వరమే పూర్తి చేయాలని అన్నారు. పార్వతీపురం మండలంలో ఆడారు రిజర్వాయర్ను తక్షణమే పూర్తి చేయాలన్నారు. గుమ్మడి గడ్డపై రిజర్వాయర్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలన్నారు వెంగళ రాయి రిజర్వాయర్ అదనపు ఆయికట్టు కాలువల పనులు పూర్తి చేస వారికి సాగునీరు అందించాలన్నారు
పెద్ద గడ్డకు ఎడమ కాలువ నిర్మించి లిఫ్ట్ ద్వారా సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు తోటపల్లి ఎడమ కాలువ సిమెంటు లైనింగు సత్వరమే పూర్తి చేయాలని కంచర గడ్డ కనుమలగడ్డ నువ్వులు గడ్డ పాలగడ్డ కేదారి పురం గడ్డ తాడికొండ గడ్డ తదితరు గడ్డలపై మినీ రిజర్వాయర్లు నిర్మించడం వలన రైతులకు ఎనలేని లాభం కలుగుతుందని వెంటనే వాటిపై దృష్టి సారించాలని కోరారు. వెంగల్ రాయ పెద్దగడ్డ తోటపల్లి కాలుబాలకు సిమెంటు లైనింగులు సత్వరమే పూర్తి చేయాలని తోటపల్లి పెద్దగడ్డ నిర్వాసితుల పునరావాసం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు లచ్చయ్యపేట షుగర్ ఫ్యాక్టరీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పునః ప్రారంభించాలని తద్వారా చెరుకు సాగును అభివృద్ధి చేసి రైతులను అదనపు లబ్ధి చేకూర్చాలని కోరారు. జిల్లాలోని ఏకైక జ్యూట్ మిల్ జూట్ మిల్లును తెరిపించాలని అలాగే రైతులు పండించే టమాటో చింతపండు కూరగాయలు నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజీలు నిర్మించాలని కోరారు లచ్చయ్యపేట షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో చెరుకు తరలింపుకు రవాణాచార్జీలు ప్రభుత్వమే లేదా ఫ్యాక్టరీ భరించే ఏర్పాటు చేయాలని అన్నారు మొక్కజొన్న పత్తి అపరాలు జీడి తదితర పంటల సేకరణకు ప్రభుత్వం సాలూరు పార్వతీపురం పాలకొండ కురుపాములలో మార్కెట్లను ఏర్పాటు చేయాలన్నారు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు బోధి యజమానితో సంబంధం లేకుండా జారీ చేయాలని పంటలకు ప్రభుత్వం ప్రకటించిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ తో బ్యాంకు రుణాలు ఇవ్వాలని కోరారు. అందించిన జాయింట్ కలెక్టర్ ఈ సమస్యలను తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి కేశవ నాయుడు రైతు సంఘం ఉపాధ్యక్షులు బంటు దాసు నాయకులు బి అప్పారావు బోను గౌర నాయుడు తదితరులు పాల్గొన్నారు.

04/07/2024

బీహార్ లో గత 15 రోజుల్లో కూలిపోయిన ఏడోవ బ్రిడ్జి
డబుల్ ఇంజన్... ట్రబుల్ ఇంజన్

Photos from Cpm Kurupam's post 04/07/2024

విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు ఆశయాల సాధన దిశగా గిరిజన యువతి యువకులు ముందుకు రావాలి

అల్లూరి సీతారామరాజు 127 జయంతి సభలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం నాయకులు లక్ష్మయ్య పిలుపు

పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో అల్లూరి సీతారామరాజు 127 వ జయంతి సందర్భంగా జూనియర్ కాలేజ్ సెంటర్లో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి ముందుగా నీళ్లుతో శుభ్రం చేస్తూ పూలమాలతో ఘన నివాళులు అర్పించిన అనంతరం సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సాంబమూర్తి గిరిజన సంఘము నాయకులు లక్ష్యము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ఉపేంద్ర వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రెడ్డి శివుని నాయుడు పార్వతీపురం మన్యం జిల్లా కళింగ వైశ్య సంఘం అధ్యక్షులు వడ్డీ గాంధీ గారు మాట్లాడుతూ ఎవరి పేరు చెప్పితే బ్రిటిష్ వారి గుండెల్లో రైలు పరిగెత్తే పరిస్తితుందో ఎవరి పేరు చెప్పితే బ్రిటిష్ వారి సైన్యం గజ గజ వణికి పోయారో అలాంటి వ్యక్తి అయినా విప్లవ జ్యోతి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి సభ కొమరాడ మండల కేంద్రంలో జరగడం చాలా శుభ పరిణామం ఆయన 18 97 జులై 4వ తేదీన జన్మించారని 1924 మే 7వ తేదీన అతి చిన్న 27 సంవత్సరాలు కాలంలో వీర మరణం బ్రిటిష్ వారి చేతిలో కాల్చి చంపబడ్డారని ఈయన గిరిజన ప్రజల కోసం అలుపెరగని పోరాటం చేసిన స్వతంత్ర యోధుల్లో ఈయన ఒక వ్యక్తి అని భారత స్వతంత్ర చరిత్రలో ఒక మహా జ్వాల శక్తి ఈయన సాయిధ పోరాట స్వతంత్ర ఉద్యమానికి ఒక ప్రత్యేక అధ్యయనం చేసిన వ్యక్తి ఈయన
బ్రిటీస్ పాలకులను ఎదిరించి సాయుధ పోరాటం చేసిన వ్యక్తి విప్ల వీరుడు అల్లూరి సీతారామరాజు
నిరక్షరాస్యులు అమాయకులు నిరుపేదలు అయినా తన అనుచరులతో అతి పరిమిత వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఢీకొన్న వ్యక్తి ఈయన
తెలుగు దొరలను ఎదిరించిన తెలుగు బిడ్డ బ్రిటిష్ వారిని బెదిరించిన భారతీయుడు వెన్ను చూపని విప్లవ వీరుడు మన భారత దేశ స్వాతంత్ర స0గ్రామంలో మరో సమిద
ఇలాంటి అల్లూరి సీతారామరాజు యొక్క ఆశయాల సాధన దిశగా గిరిజన యువతి యువకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల పైన గిరిజనులపై జరుగుతున్న దాడులు పైన స్వేచ్ఛగా పాల్గొని పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈరోజు గిరిజనులు పైన దాడులు జరిపే విధంగా రకరకాలు చట్టాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తేవడంతో పాటు తాత ముత్తాతల నుండి ఉన్న గిరిజనులకున్న హక్కులను ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాసే పరిస్థితి ఉందని ముఖ్యంగా జీవో నెంబర్ 3 అమలు చేయాలని 1/70 చట్టం పగడ్బందీ అమలు చేయాలని గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక డిఎస్సి నీ ప్రకటించాలని అన్ని గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యాలు మంచినీటి సౌకర్యం కల్పించే విధంగా విద్య వైద్యం సకాలంలో అందించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు రాబోయే రోజుల్లో పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు యొక్క ఘన నివాళి సందర్భంగా ఆయన యొక్క స్ఫూర్తితో ముందుకు గిరిజన యువతి యువకులు రావాలని ఈ సందర్భంగా గిరిజన యువతీ యువకులకు కోరుచున్నాము ఇలా పోరాటాలు చేసి మన సమస్యలు సాధించుకున్నప్పుడే అల్లూరి సీతారామరాజు గారికి ఇచ్చిన ఘన నివాలని ఈ సందర్భముగా తెలియజేస్తున్నాం.

04/07/2024

మన్యం జిల్లా సీతంపేట మండలం గిరిజన సంఘం ఆఫీస్ లో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారాం రాజు 127 జయంతి సభ. సీతారాం రాజు చిత్ర పటానికి పూల మాల వేసిన సంఘం నాయకులు ఎం. తిరుపతి రావు, జె. శ్రీరాములు, బి. రామ్మోహన్ తదితరులు.

Photos from Cpm Kurupam's post 04/07/2024

ఉపాధి హామీ పనులు చేసిన కూలీలు కు 8 వారాల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని రెండవ పూట పని రద్దు చేయాలి, సంవత్సరానికి ₹200 రోజులు పని రోజుకూలి 400 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో పాలకొండ మండల అభివృద్ధి( Mpdo) కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు దూసి దుర్గారావు మాట్లాడుతూ ఉపాధి కూలీలు ఈ సంవత్సరం ఏప్రిల్ నెల నుండి తీవ్రమైన ఎండలో రెండుపూటలా పని చేశారు చేసిన పనికి కూలీలు కు సుమారు 5 వారాలు నుండి 8 వారాల వరకు వేతనాలు పెండింగ్ లో వున్నాయి గత 7 నెలలు గా ఉపాధి కూలీలకు వ్యవసాయ పనులు లేక ఇటు చేసిన ఉపాధి పనులకు బిల్లుల రాక తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారుమాట్లాడుతూరెండు పూటలు పని చేయడం వలన కూలీలు పనివద్దకు సుమారు సరాసరి ఒక రోజు కు 7 కిలోమీటర్ల దూరం నడుస్తున్నారు దీనివలన కూలీల ఆరోగ్యం దెబ్బతింటుంది, వ్యవసాయ పనులు, ఇంటి పనులు చేసుకోవడానికి ఆటంకంగా వుంది, యంత్రాలు పెరగడం తో వ్యవసాయ పనులు బాగా తగ్గిపోయి కూలీలు వలసలు వెళ్లి పోయే ప్రమాదం వుంది కాబట్టి సంవత్సరానికి 200 రోజులు పని దినాలు కల్పించాలి, రోజు కూలీ 400/ రూపాయిలు పెంచాలి, మేట్ లకు ఇచ్చిన ప్రోత్సాహం ఇవ్వాలి, పార, పలుగు, తట్ట ల నిర్వాహణకు డబ్బులు వేయాలి, మంచి నీరు, మజ్జిగ సరఫరా చేయాలి పై సమస్యలు అన్ని పరిష్కారం చేయవలసిందిగా కోరుతున్నాం ఎంపీడీవో కార్యాలయంలో సమస్యలతో కూడిన వినతి పత్రం సమర్పించడమైనది ఈ కార్యక్రమంలో సిఐటియు పాలకొండ మండల కమిటీ కార్యదర్శి కాదా రాము వ్యవసాయ కార్మిక సంఘం ప్రతినిధులు పిట్ట త్రినాధ ఎన్ని యశోదమ్మ బి అంకమ్మ పట్నాన సరోజిని కుర్మాన రాములమ్మ గొట్టాపు లక్ష్మణరావు కు రాకుల లక్ష్యము తదితరులు పాల్గొన్నారు

04/07/2024

సాహసానికి సంకల్పానికి అల్లూరి ఓ సంకేతం...
దేశభక్తికి త్యాగనిరతికి రామరాజు మా ఆదర్శం....

03/07/2024

తే 3/7/24 న పార్టీ సీనియర్ నాయుకులు వంజరాపు సత్యం నాయుడు గారిని పలగర గ్రామం లో వారి ఇంటి వద్ద పరామర్శించిన పార్టీ సెక్రటే రియట్ సభ్యులు ఎం. తిరుపతి రావు, కె. గంగునాయుడు.

Photos from Cpm Kurupam's post 03/07/2024

*గరుగుబిల్లి మండలం శివ్వం గ్రామ దళితుల భూ సమస్య పరిష్కారం చేయండి జిల్లా రెవెన్యూ అధికారి (డిఆర్ఓ) జి కేశవ నాయుడు గారిని కలిసిన సిపిఎం పార్టీమాజీ ఎంపీ సిపిఎం పార్టీ నాయకులు పి మధు సీనియర్ నాయకులు ఎం కృష్ణమూర్తి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు*
నాయకులు మాట్లాడుతూ 1970 లో దళితులకు 22 ఎకరాల 80 సెంట్లు భూమి ప్రభుత్వం ఇచ్చిందని అప్పటినుండి దళితులు సాగు చేస్తుంటే శివం గ్రామ పెత్తందారులు సర్వేనెంబర్ 102 కి ఇంజక్షన్ తెచ్చి ప్రభుత్వం ఇచ్చినటువంటి 2o నుండి 30 సర్వే నంబర్లు గల ప్రభుత్వ భూమికి ఇంజక్షన్ ఉందని దళితులను భయపెట్టి రెవెన్యూ వారి పోలీసులు సహకారంతో భూమి నుండి దళితులను వెళ్ళగొట్టారని దళితులకు ఎస్ఎఫ్ఏ లోను వీళ్ళ పేర్లు ఉన్నాయి ఇన్ కార్పొరేషన్ అయ్యింది వన్ బి ఉంది సాగులో ఉన్నారు అయినా రెవెన్యూ అధికారులు పెత్తందారులకు కొమ్ము కాస్తున్నారని కావున దళితులు న్యాయమైన సమస్యను పరిష్కారం చేసి వాళ్ళ భూమి వాళ్ళకి ఇవ్వాలని డిఆర్ఓ గారిని కోరారు డిఆర్ఓ గారు స్పందించి న్యాయం చేస్తామని చెప్పారు నాయకుల వెంట సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు కొల్లి గంగునాయుడు యమ్మల మన్మధరావు ఎం తిరుపతిరావు నారాయణస్వామి ఎల్లయ్య లక్షణ ఫకీర్ అమ్మ వివిధ ప్రజా సంఘాలు నాయకులు దళితులు పాల్గొన్నారు

03/07/2024

ఉపాధి హామీ పనులు చేసిన కూలీలు కు 8 వారాల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని రెండవ పూట పని రద్దు చేయాలి, సంవత్సరానికి ₹200 రోజులు పని రోజుకూలి 400 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో మండల అభివృద్ధి( Mpdo) కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉపాధి కూలీలు ఈ సంవత్సరం ఏప్రిల్ నెల నుండి తీవ్రమైన ఎండలో రెండుపూటలా పని చేశారు చేసిన పనికి కూలీలు కు సుమారు 5 వారాలు నుండి 8 వారాల వరకు వేతనాలు పెండింగ్ లో వున్నాయి గత 7 నెలలు గా ఉపాధి కూలీలకు వ్యవసాయ పనులు లేక ఇటు చేసిన ఉపాధి పనులకు బిల్లుల రాక తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు జన్నీ ఈశ్వరరావు తాడంగి గాసి మాట్లాడుతూరెండు పూటలు పని చేయడం వలన కూలీలు పనివద్దకు సుమారు సరాసరి ఒక రోజు కు 10 కిలోమీటర్ల దూరం నడుస్తున్నారు దీనివలన కూలీల ఆరోగ్యం దెబ్బతింటుంది, వ్యవసాయ పనులు, ఇంటి పనులు చేసుకోవడానికి ఆటంకంగా వుంది, యంత్రాలు పెరగడం తో వ్యవసాయ పనులు బాగా తగ్గిపోయి కూలీలు వలసలు వెళ్లి పోయే ప్రమాదం వుంది కాబట్టి సంవత్సరానికి 200 రోజులు పని దినాలు కల్పించాలి, రోజు కూలీ 400/ రూపాయిలు పెంచాలి, మేట్ లకు ఇచ్చిన ప్రోత్సాహం ఇవ్వాలి, పార, పలుగు, తట్ట ల నిర్వాహణకు డబ్బులు వేయాలి, మంచి నీరు, మజ్జిగ సరఫరా చేయాలి పై సమస్యలు అన్ని పరిష్కారం చేయవలసిందిగా కోరుతున్నాం సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు పాల్గొని మద్దతు తెలిపారుఈ కార్యక్రమంలో చింత జోగయ్య గెమ్మేల బోడమ్మ మెల్లిక అయోధ్య కూనేటి చినబాబు తాడంగి సన్నం కోరాడ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

Photos from Cpm Kurupam's post 03/07/2024

*శివ్వాం దళితుల భూ సమస్య పరిష్కరించకపోతే ఆందోళణ ఉదృతం చేస్తాం.... దళితులపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలి ...*
*మాజీ ఎంపీ సీపీఎం నాయకులు పి మధు డిమాండ్.....*
పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం దళితుల భూసమస్య అనేక సంవత్సరాలుగా పరిష్కరించకుండా రెవెన్యూ యంత్రాంగం సాగదీస్తున్నదని, 1970 లో రెవెన్యూ యంత్రాంగం శివ్వాం గ్రామ దళితులకు 22 ఎకరాలు 80 సెంట్ల భూమిని ప్రభుత్వం మంజూరు చేసి డి పట్టాలను కూడా ఇచ్చిందని, ఆ భూమిని అప్పటినుండి దళితులు సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారని ,ఆ భూమిపై పెత్తందారులు కన్ను పడి తరచూ దళితులపై దాడులకు పాల్పడుతూ దురాక్రమణలకు పాల్పడుతున్నారని విమర్శించారు. దళితుల సాగు చేసుకుంటున్న భూమిపై తప్పుడు సర్వే నెంబర్ల తో కోర్టు లో ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చి, రెవిన్యూ పోలీస్ యంత్రాంగం ద్వారా దళితులను ఆ భూమి నుంచి అన్యాయంగా తొలగించారని విమర్శించారు, దళితులు పట్టాదారు పాస్ పుస్తకాలు,1B అడంగల్ కలిగి ఉన్నారని ,ఇంతటి న్యాయమైన హక్కు కలిగిన దళితులు పట్ల అగ్రవర్ణాల వారు దురాగతాలకు పాల్పడుతున్నప్పటికీ రెవెన్యూ పోలీస్ యంత్రాంగం అగ్రవర్ణ పెత్తందార్ల పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా దళితులపై తప్పుడు కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని హెచ్చరించారు. ఈ సందర్భంగా బుదవారం వివాదాస్పద భూములు పరిశీలించేందుకు నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు మా భూముల వద్దకు వెళ్లకుండా అడ్డుకునేందుకు మీరు ఎవరని పి మధు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం నాయకులు పి మధు ,దడాల సుబ్బారావు ఆధ్వర్యంలో దళితులు కు చెందిన భూములను పరిశీలించారు *అనంతరం గ్రామంలో జరిగిన సభలో పి మధు మాట్లాడుతూ ...* ఇప్పటికైనా న్యాయమైన దళితులు భూ సమస్య పరిష్కారం చేయాలని లేనియెడల దళితుల పక్షాన సిపిఎం, వ్యవసాయ కార్మిక సంఘం ఇతర ప్రజా సంఘాలు ఉద్యమిస్తాయని తెలిపారు ,దళితులపై దాడులు చేస్తే ప్రతిదాడులు కూడా సిద్ధమయ్యే పరిస్థితిని రెవెన్యూ పోలీసు యంత్రాంగం తేవద్దని హెచ్చరించారు .*వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దండాల సుబ్బారావు మాట్లాడుతూ న్యాయమైన దళితుల సమస్యను రెవిన్యూ యంత్రాంగం పెత్తందారులకు కొమ్ముకాసి పరిష్కారం చేయకుండా నీరుగార్చడం దుర్మార్గమైన చర్యని ,దీనిని ఎట్టి పరిస్థితులలోనూ సహించేది లేదని హెచ్చరించారు , సిపిఎం నాయకులు ఎం కృష్ణమూర్తి మాట్లాడుతూ ఇంతటి న్యాయమైన భూసమస్య పరిష్కారం చేయడంలోనే ప్రభుత్వ యంత్రాంగం విఫలమైతే సామాన్య పేదలకు ఏం న్యాయం చేస్తారని, తక్షణమే రెవెన్యూ అధికారులు శివ్వాం దళితుల భూసమస్య పరిష్కారం చేసి దళితుల భూమి దళితులకు అప్పగించాలని లేనియెడల ఈ సమస్యను జిల్లా వ్యాప్త సమస్యగా పరిగణించి జిల్లా వ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.... వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు అధ్యక్షతన శివ్వాం గ్రామం లో జరిగిన సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు, నాయకులు వై మన్మధరావు ,ఎం తిరుపతిరావు, బి వి రమణ, కొల్లి సాంబమూర్తి, మండంగి శ్రీనివాసరావు, గ్రామ దళిత పెద్దలు రేగిడి ఎల్లయ్య, లక్ష్మణరావు ధనంజయ, శివ తదితరులు పాల్గొన్నారు* అనంతరం పార్వతీపురం జిల్లా రెవెన్యూ అధికారి వారికి శివ్వాం దళితుల సమస్య పరిష్కారం కోరుతూ వినతి పత్రం సమర్పించి సమస్య తీవ్రతను అధికారులకు తెలియజేయడం జరిగింది.....

02/07/2024

అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీల సమస్యలు పరిష్కారం కోరుతూ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారికి యూనియన్ ఆధ్వర్యంలో వినతి.
జూలై రెండవ తేదీన మంగళవారం అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ సాలూరు నియోజకవర్గంలో ఉన్న అంగన్వాడీ ప్రాజెక్టుల అధ్యక్ష కార్యదర్శులు మరియు సెక్టార్ నాయకులు మరియు సిఐటియు నాయకులు

సాలూరు శాసనసభ్యులు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సాలూరు ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు శశికళ ,గౌరీశ్వరి ,పాచిపెంట ప్రాజెక్టు అధ్యక్ష ,కార్యదర్శులు పార్వతి, దాలమ్మ నాయకులు బంగారమ్మ ,జయ ,
తిరుపతమ్మ ,నారాయణమ్మ, సుశీల, జ్యోతి,సీత ,సత్యవతి, చిన్నమ్మి, సిఐటియు నాయకులు కె ఈశ్వరరావు, ఎన్వై నాయుడు పాల్గొన్నారు.

02/07/2024

Bsnl అదిరిపోయే ఆఫర్...

Photos from Cpm Kurupam's post 02/07/2024

**ఉపాధి బకాయిలు చెల్లించాలి, రెండు పూటలా పని రద్దు చేయాలి**
**********************
*"ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు*
**********"************
ఉపాధి కూలీలు బకాయిలు చెల్లించాలని రెండు పూటలా పన రద్దు చేయాలని సంవత్సరానికి ₹200 రోజులు పని కల్పించాలని 400 రూపాయలు కూలీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మక్కువ ఎంపీడీవో ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు, గిరిజన సంఘం జిల్లా నాయుకులు టి ప్రభాకర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు చేసిన 14 రోజుల్లో బిల్లులు చేయాలని చట్టం లో వున్నప్పటికీ గత 5 వారాలు నుండి బిల్లులు చెయ్యలేదని గత, 7 నెలలు నుండి వ్యవసాయ పనులు లేక, ఇటు ఉపాధి బిల్లులు కాక కూలీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు, ఎన్నికల ముందు బిల్లులు చేసినట్లు ఎన్నికలు అయినతరువాత బిల్లులు చెయ్యడం లేదని అన్నారు, అలాగే వ్యవసాయము లో యాంత్రీకరణ పెరుగుతున్న కొద్దీ వ్యవసాయ పనిదినాలు తగ్గిపోతున్నాయి అని అన్నారు అందుకని ప్రభుత్వం 200 రోజులు పని దినాలు పెంచి,400/ రూపాయిలు కూలీ ఇవ్వాలని డిమాండ్ చేశారు, మెడికల్ కిట్లు, టెంట్లు ,మంచినీరు, మజ్జిగ సరఫరా చేయాలి అని డిమాండ్ చేశారు, పార , పలుగు, తట్ట ల నిర్వాహణ కోసం డబ్బులు వెయ్యాలని అన్నారు ఈ కార్యక్రమం లో గిరిజన సంఘం నాయకులు అడ్డమెస్వరావు, వెంకటరావు, రమేష్, భాస్కరరావు పాల్గొన్నారు

02/07/2024

పాఠశాలలో పనిచేస్తున్న స్విపర్లకు కనీస వేతనం ఇప్పించి, ఉద్యోగ భద్రత్త కల్పించాలని కోరుతూ సాలూరు సీఐటీయూ ఆధ్వర్యంలో మంత్రి సంధ్యారాణికి వినతిపత్రం ఇస్తున్న కార్మికులు, నాయకులు

02/07/2024
02/07/2024

*శివ్వాం దళితులపై దాడి చేసిన పెత్తందారుని వెంటనే అరెస్టు చేయాలి, దళితులు భూమిని వెంటనే దళితులపై పెత్తందారులదాడిని ఖండిస్తూ జూలై మూడో తేదీ సిపిఎం పార్టీ మాజీ ఎంపీ, పి మధుగారు పర్యటన,సభ, సిపిఎం పత్రిక విలేకరులపత్రికా విలేకరుల సమావేశం*
సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే సుబ్బారావమ్మగారు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు, కార్యదర్శివర్గ సభ్యులు ఎం తిరుపతిరావు, వై. మన్మధరావు, వి. ఇందిరా, కె.గంగునాయుడు పార్వతీపురం సుందరయ్య భవనంలో పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గరుగుబిల్లి మండలం
శివ్వాం గ్రామంలోని దళితులకు చెందిన భూములను గ్రామంలోని పెత్తందారులు ఆక్రమించుకునేందుకు గత అనేక సంవత్సరాలుగా ప్రయత్నాలు చేసారు .
దళితులు పట్టా భూమి సాగు చేస్తున్న భూముల వద్దకు సాగుకు వచ్చి దళితులపై దాడికి పాల్పడ్డారు ఇది హేయమైన చర్యగా సిపిఎం భావిస్తుంది. దళితులపై దాడి చేసిన వారిని అట్రాసిటీ చట్టం ప్రకారం పెత్తందారుల వెంటనే అరెస్టు చేయాలని సిపిఎం పార్టీ మన్యం జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తున్నాం.
1970లో ప్రభుత్వం శివ్వాం గ్రామంలోని 14 దళిత కుటుంబాలకు సర్వే నెంబర్లు: 20,21, 23 ,26, 29, 30 లలో *22* ఎకరాల *80* సెంట్ల కు డీ పట్టాలు మంజూరు చేసిందనీ, అప్పటినుండి దళితులు ఆ భూములను సాగు చేసుకొనీ జీవనం సాగిస్తున్నారని తెలిపారు ,ఈ క్రమంలోనే శివ్వాం గ్రామానికి చెందిన బీసీ కులానికి చెందిన కొంతమంది పెద్ద వ్యక్తులు సర్వేనెంబర్ 102 లో ని భూమికి కోర్టు ద్వారా ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చి ఆ ఇంజక్షన్ ఆర్డర్ ఈ దళితుల భూమి పై తెచ్చినట్లు అధికారులను నమ్మబలికి దళితులు ఆ భూములు సాగు చేయకుండా వెళ్ళగొట్టారు. వ్యవసాయ కార్మిక సంఘం కెవిపిఎస్ ఆధ్వర్యంలో దళితులు తమ భూమిని కాపాడుకునేందుకు అనేక దశలో ఆందోళనలు, అధికారులతో రాయబారాలు చేపట్టినప్పటికీ గరుగుబిల్లి మండల రెవెన్యూ అధికారులు రికార్డులను పరిశీలించకుండా తాత్సారం చేసారు. వీరికి పట్టాలి ఇచ్చి ఉన్నందు న వీరి సాగుకు ఉపక్రమించగా దీని ఫలితమే ఈరోజు దళితులకు, బీసీ లకు మధ్య ఘర్షణలో దాడి జరిగింది దీనికి ప్రధానంగా రెవెన్యూ యంత్రాంగం యొక్క నిర్లక్ష్య ధోరణి కారణం ఇప్పటికైనా అధికారులు దళితుల పేరున రికార్డుల్లో నమోదు చేయబడిన ప్రకారం దళితులకు సదరు భూమి అప్పగించాలని, ఇతరులను ఆ భూమిపై రాకుండా నిరోధించాలని దళితులకు చెందిన భూమిపై అన్యాక్రాంతానికి, దాడికి పాల్పడిన పెత్తందారులు ఇతరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తుంది. దళితులపై దాడులకు పాల్పడిన వారినీ కఠినంగా శిక్షించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలని, దళితులపై పెత్తందారులు పెట్టిన అక్రమ కేసులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దళితుల పక్షాన పోరాడతామని హెచ్చరించారు. దీనికి స్థానిక తహసిల్దార్ కే జయ ,డిఎస్పి కృష్ణారావు లు స్పందిస్తూ శివ్వాం దళితుల భూ సమస్య న్యాయమైనదని, ఈ సమస్య పరిష్కారానికి కొద్దిరోజుల్లోనే చర్యలు చేపడతామని. ఇందులో భాగంగా జూలై మూడవ తేదీన సిపిఎం పార్టీ రాజ్యసభ మాజీ ఎంపీ పి మధుగారు మండలంలో శివ గ్రామాన్ని పర్యటించటం జరుగుతుందని ఈ ఉద్యమాన్ని ఈ సమస్యపై జిల్లా వ్యాప్తంగా దళితులను, పేదలను సమీకరించి ఉద్యమాన్ని ఉధృతం చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం.

Photos from Cpm Kurupam's post 01/07/2024

*కార్మిక ఉద్యమలే కొరటాలకు ఘనమైన నివాళ్ళు*
• కె. సుబ్బరావమ్మ సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు
• కొరటాల సత్యనారాయణ 18 వ వర్ధంతి సందర్బంగా పార్వతీపురంలో నివాళ్లు

కార్మిక కర్షక పోరాట ఉద్యమాలకు కొరటాల సత్యనారాయణ జీవిత చరిత్ర మోగమని, ఉద్యమాలకు స్ఫూర్తి అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె. సుబ్బారావమ్మ అన్నారు. కొరటాల సత్యనారాయణ 18 వ వర్ధంతి సందర్బంగా సోమవారం పార్వతీపురం సుందరయ్యభవనంలో అయన చిత్రపటానికి సుబ్బరావమ్మ, సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు పూలమాల వేసి నివాలర్పించారు. ఈ సందర్బంగా సుబ్బరావమ్మ మాట్లాడుతూ కొరటాల సత్యనారాయణ ఆంధ్ర కమ్యూనిస్ట్ ఉద్యమ నేతలలో ప్రముఖుడని, భారత కమ్యూనిస్టు పార్టీ- మార్క్సిస్టు (సి.పి.ఎం) యొక్క పాలిట్‌బ్యూరో సభ్యుడని తమ శైలిలో కీలక పాత్ర పోషించారాని అన్నారు. అయన స్పూర్తితో నేడు నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం 2019లో తెచ్చిన మూడు రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ నిర్బంధాలను లెక్క చేయకుండా రైతాంగం పెద్ద ఎత్తున చారిత్రాత్మక ఉద్యమం నిర్వహించిందని దీంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదని తెలిపారు. ఆ సందర్భంగా నరేంద్ర మోడీ స్వయంగా పార్లమెంటులో రైతులకు క్షమాపణలు చెప్పి మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకుంటున్నామని ప్రకటించారని అన్నారు. రైతుల ప్రతినిధులతో చర్చించి మద్దతు ధరలిచ్చేలా పార్లమెంటులో చట్టం తెస్తామని, విద్యుత్‌ సవరణ బిల్లు ఉపసంహరించుకుంటామని హామీ ఇచ్చారని, కాని ఆ చట్టాలను మరో రూపంలో అమలు చేస్తూ రైతు కేంద్రంగా ఉన్న మన వ్యవసాయాన్ని కార్పొరేట్‌ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నది. కేరళ తరహాలో రాష్ట్రంలో రైతు రుణ విమోచన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి మార్కెట్‌ ఒడుదుడుకులలో రైతుకు అండగా నిలవాలని. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైసిపికి ఉత్తరాంధ్ర ప్రజలు పెద్ద గుణపాఠం నేర్పారు. దీని నుండి తెలుగుదేశం ప్రభుత్వం పాఠాలు నేర్చుకోవాలని అన్నారు. వెనుకబడ్డ ప్రాంతాల సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని, లక్షలాది మంది కౌలురైతులకు ప్రభుత్వం అండగా నిలవాలని పత్తి, మిరప, చెరుకు, పొగాకు వంటి వ్యాపార పంటలు పండించే రైతులు మార్కెట్‌ ఒడిదుడుకులకు తీవ్రంగా నష్టపోతున్నారని, మన్యం జిల్లాలో ధాన్యం రైతులు ప్రభత్వం నుండి వందల కోట్ల రూపాయలు బకాయిలు రాక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. శివ్వం గ్రామంలో భూస్వాములు దళితులపై చేసిన దాడిని సిపిఎం తీవ్రంగా ఖండించి, దళితులకు అండగా, భూస్వాములకు ఎదురు నిలిచిందని అటువంటి పోరాటాల స్పూర్తితో కొరటాలకు అర్పించే నిజమైన నివాళని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై. మన్మధరావు, వి.ఇందిరా పట్టణ కార్యదర్శి గొర్లి వెంకటరమణ సిపిఎం నాయకులు గంట జ్యోతి, పి. రాము తదితరులు పాల్గొన్నారు.

01/07/2024

మనిషి జబ్బుని నయం చేయడానికి డాక్టర్ వయ్యావు
సమాజానికి పట్టిన రోగాన్ని తగ్గించడానికి విప్లవంగా మారవ్
డాక్టర్స్ డే శుభాకాంక్షలు

Photos from Cpm Kurupam's post 01/07/2024

**తోలుంగ్యూడకు, బడ్డడ గూడకు, తియ్యాల గూడ కు మంచినీటి బోర్లు తియ్యాలని డిమాండ్ చేస్తూ కురుపాం ఆర్.డబుల్. యు. ఎస్. కార్యాలయం ఎదుట గిరిజన సంఘం ఆధ్వర్యంలో ధర్నా బైఠాయించారు **
**అనంతరం జే ఈ కి మామూరాండం ఇచ్చారు 8 రోజుల్లో తోలుంగ్యూడ కు బోర్ వేస్తామని హామీ ఇచ్చారు ఎస్టిమేట్ కూడా నాయకులు కు అందచేశారు బుద్దడ గూడ, టియ్యాల గూడలుకు ఎస్టిమేట్ లు వేస్తామన్నారు ఈ కార్యక్రమం లో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు, గిరిజన సంఘం నాయకులు ఎం. శ్రీను,అడ్డమేశ్వరై, వెంకట రావు, భాస్కరరావు, రమేష్ పాల్గొన్నారు**

Photos from Cpm Kurupam's post 01/07/2024

ఉపాధి హామీ వేతనదారులకు ఐదు నెలల బకాయి బిల్లులు చెల్లించాలని సీతానగరం ఎంపీడీఓ ఆఫీస్ వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన..

Photos from Cpm Kurupam's post 01/07/2024

*రెండు పూటల ఉపాధి పని రద్దు చేయాలి.*
• ఎ.పి వ్యవసాయ కార్మిక సంఘం
• పార్వతీపురం కలక్టరేట్ వద్ద ఉపాధి కార్మికుల ధర్నా
• జెసి శోబితకు వినతి పత్రం ఇస్తున్న కార్మికులు, నాయకులు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పధకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పనిని కర్తవ్యంగా పెట్టుకుందని, అందులో భాగమే ఉపాధి కూలీలపై పని భారమని వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ నాయకులు రెడ్డి వేణు, పి.రాము, జి.వెంకటరమణ అన్నారు. ఉపాధి కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని జిల్లా వ్యాప్తపిలుపులో భాగంగా సోమవారం పార్వతీపురం సుందరయ్యభవనం నుండి కలక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం జాయింట్ కలక్టర్ శోభితకు వినతాపత్రాన్ని అందించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ జిల్లాలో పనిచేయుచున్న ఉపాధి కూలీలు గత మూడు నెలలుగా ఎండలో ఎండి రోజుకు రెండు పూటలా ఉదయం సాయంత్రం పనిచేస్తే ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క విధంగా సుమారు ఐదు వారాల బిల్లులు బకాయిలు ప్రభుత్వం చెల్లించలేదని అన్నారు. గత ఆరు మాసాలుగా అటు వ్యవసాయ పనులు లేక ఇటు చేసిన ఉపాధి పనులకు కూలి రాక కూలీలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని అన్నారు. వెంటనే ప్రభుత్వం కలుగజేసుకొని ఉపాధి కూలీల బకాయిలు చెల్లించాలని . అలాగే రెండు పూటలా పనిచేయడం వల్ల కూలీలు రోజుకు రెండు వైపులా 10 కిలోమీటర్ల వరకు వరకు మండుటెండల్లో నడవాల్సి వస్తుందని దీనివల్ల కూలీల ఆరోగ్యం ఇప్పటికే దెబ్బ తినే పరిస్థితి కనిపిస్తుందని అలాగే కొంతమంది ఆసుపత్రిలో చేరే పరిస్థితి ఉందని ఇలాంటి సందర్భంలో, వ్యవసాయ పనులు, ఇంటి పనులు చేసుకోవడానికి తీవ్ర ఆటంకంగా మారిందని అన్నారు. కాబట్టి రెండు పూటలా పనిని రద్దుచేసి ఒక్క పూట పనిఇవ్వాలని అలాగే యాంత్రికరణ పెరగడం వలన వ్యవసాయంలో పని దినాలు భారీగా తగ్గాయని అందుకు సంవత్సరానికి 200 రోజులు పని దినాలు కల్పించాలని ,రోజుకూలి 400 రూపాయలు తగ్గకుండా వేతనం ఇవ్వాలని పాత పద్ధతి లాగా మేట్లకు ప్రోత్సాహం ఐదు రూపాయలు ఇవ్వాలని, అలాగే పని చేసే చోట మౌలిక పరిస్థితులైన పారా, పలుగు తట్ట మెయింటెనెన్స్ కు డబ్బులు వేయాలని, మజ్జిగ ,మంచినీరు కూలీలకు సరఫరా చేయాలని మెడికల్ కిట్లు ఇవ్వాలని, టెంట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్య వెంటనే పరిష్కరించకపోతే రాబోయే రోజులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు జి. సింహాచలం, హెచ్ పెంటయ్య, ఎస్. చంద్ర, జె. శివుడు, కె. బూసన, ఎస్. కోమల, కె. ఆది తదితరులు పాల్గొన్నారు.

01/07/2024

రైతు తాను పండించిన పంటకు ఏ రోజైతే ధరను తానే నిర్ణయించగలడో ఆ రోజు మన దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు
ప్రపంచ వ్యవసాయ దినోత్సవ శుభాకాంక్షలు

Photos from Cpm Kurupam's post 01/07/2024

*ఉపాధి కూలీలకు సంబంధించి పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి, రెండు పూటలా పని రద్దు చేయాలి, సంవత్సరానికి 200 రోజులు పని దినాలు పెంచాలి ,400 రూపాయలు కూలి ఇవ్వాలి కొమరాడ ఎంపీడీవో కార్యాలయము ధర్నా*
**********************
* *ఆంధ్రప్రదేశ్ ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో🙏 ఎంపీడీవో కార్యాలయం వద్ద ధర్నా అనంతరం ఎంపీడీవో ఎం మల్లికార్జున రావు గారికి ఏపీవో బాలకృష్ణ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది**
**********************
వినతి పత్రం ఇచ్చిన అనంతరం ఎంపీడీవో కార్యాలయం వద్ద నుండి వ్యవసాయ కార్మిక సంఘం కమిటీ సభ్యులు రెడ్డి శివుని నాయుడు సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ కొమరాడ మండలంలో పనిచేయుచున్న ఉపాధి కూలీలు గత మూడు నెలలుగా ఎండలో ఎండి రోజుకు రెండు పూటలా ఉదయం సాయంత్రం పనిచేస్తే ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క విధంగా సుమారు ఐదు వారాల బిల్లులు బకాయిలు ప్రభుత్వం చెల్లించలేదని అన్నారు గత ఆరు మాసాలుగా అటు వ్యవసాయ పనులు లేక ఇటు చేసిన ఉపాధి పనులకు కూలి రాక కూలీలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని అన్నారు. వెంటనే ప్రభుత్వం కలుగజేసుకొని ఉపాధి కూలీల బకాయిలు చెల్లించాలని . అలాగే రెండు పూటలా పనిచేయడం వల్ల కూలీలు రోజుకు రెండు వైపులా 10 కిలోమీటర్ల వరకు వరకు మండుటెండల్లో నడవాల్సి వస్తుందని దీనివల్ల కూలీల ఆరోగ్యం ఇప్పటికే దెబ్బ తినే పరిస్థితి కనిపిస్తుందని అలాగే కొంతమంది ఆసుపత్రిలో చేరే పరిస్థితి ఉందని ఇలాంటి సందర్భంలో, వ్యవసాయ పనులు, ఇంటి పనులు చేసుకోవడానికి తీవ్ర ఆటంకంగా మారిందని అన్నారు. కాబట్టి రెండు పూటలా పనిని రద్దుచేసి ఒక్క పూట పనిఇవ్వాలని అలాగే యాంత్రికరణ పెరగడం వలన వ్యవసాయంలో పని దినాలు భారీగా తగ్గాయని అందుకు సంవత్సరానికి 200 రోజులు పని దినాలు కల్పించాలని ,రోజుకూలి 400 రూపాయలు తగ్గకుండా వేతనం ఇవ్వాలని పాత పద్ధతి లాగా మేట్లకు ప్రోత్సాహం ఐదు రూపాయలు ఇవ్వాలని, అలాగే పని చేసే చోట మౌలిక పరిస్థితులైన పారా, పలుగు తట్ట మెయింటెనెన్స్ కు డబ్బులు వేయాలని, మజ్జిగ ,మంచినీరు కూలీలకు సరఫరా చేయాలని మెడికల్ కిట్ లు ఇవ్వాలని, టెంట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్య వెంటనే పరిష్కరించకపోతే రాబోయే రోజులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ఉపేంద్ర రైతు నాయకులు గులిపల్లి శ్రీరాములు నాయుడు ఎం శంకర్రావు వ్యవసాయ కూలీలు ధర్మ పోలిలాయుడు సింహాసనం లక్ష్మి పార్వతి వెంకటరావు సుబ్బారావు సన్యాసిరావు లక్ష్మణరావు పాల్గొన్నారు

కొమరాడ ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉపాధి కూలీలతో ధర్నా చేస్తున్న ఫోటో నాయకులు మాట్లాడుతున్న ఫోటో వీడియో ఎంపీడీవో గారికి ఏపీఓ గారికి వినతిపత్రం ఇస్తున్న ఫోటో చూడగలరు

30/06/2024

**ఉపాధి పనులు చేసిన కూలీలకు బకాయిలు వెంటనే చెల్లించాలి, రెండు పూటలా పని రద్దు చేయాలి, సంవత్సరానికి 200 రోజులు పని దినాలు పెంచాలి ,400 రూపాయలు కూలి ఇవ్వాలి**
**********************
**రేపు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మండల ఆఫీసుల వద్ద ధర్నా**
**********************
ఉపాధి కూలీలకు బిల్లులు చెల్లించాలని రేపు జూలై 1వ తేదీన ఎంపీడీవో ఆఫీసుల వద్ద ధర్నా ఉందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి తెలియజేశారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కోల్లి గంగు నాయుడు మాట్లాడుతూ ఉపాధి కూలీలు గత మూడు నెలలుగా ఎండలో ఎండి రోజుకు రెండు పూటలా ఉదయం సాయంత్రం పనిచేస్తే సుమారు ఐదు వారాల బిల్లులు బకాయిలు ప్రభుత్వం చెల్లించలేదని అన్నారు గత ఆరు మాసాలుగా అటు వ్యవసాయ పనులు లేక ఇటు చేసిన ఉపాధి పనులకు కూలి రాక కూలీలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని అన్నారు. వెంటనే ప్రభుత్వం కలుగజేసుకొని ఉపాధి కూలీల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే రెండు పూటలా పనిచేయడం వల్ల కూలీలు రోజుకు పది కిలోమీటర్ల వరకు నడవాల్సి వస్తుందని దానివలన కూలీల ఆరోగ్యం దెబ్బతింటుందని, వ్యవసాయ పనులు, ఇంటి పనులు చేసుకోవడానికి తీవ్ర ఆటంకంగా మారిందని అన్నారు. కాబట్టి రెండు పూటలా పనిని రద్దుచేసి ఒక్క పూట పనిఇవ్వాలని డిమాండ్ చేశారు. యాంత్రికరణ పెరగడం వలన వ్యవసాయంలో పని దినాలు భారీగా తగ్గాయని అందుకు సంవత్సరానికి 200 రోజులు పని దినాలు కల్పించాలని ,రోజుకూలి 400 రూపాయలు తగ్గకుండా ఇవ్వాలని డిమాండ్ చేశారు పాత పద్ధతి లాగా మేట్లకు ప్రోత్సాహం ఐదు రూపాయలు ఇవ్వాలని, పారా, పలుగు తట్ట మెయింటెనెన్స్ కు డబ్బులు వేయాలని, మజ్జిగ ,మంచినీరు కూలీలకు సరఫరా చేయాలని మెడికల్ కిట్ లు ఇవ్వాలని, టెంట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై రేపు సోమవారం జూలై 1వ తేదీన ఎంపీడీవో ఆఫీసుల వద్ద ధర్నా ఉన్నదని దానికి ఉపాధి కూలీలంతా రావాలని కోరారు.

Videos (show all)

అది మోడీ చేతులో కీలు బొమ్మ...- వి. శ్రీనివాసరావు
కురుపాం సిపిఎం అభ్యర్థి మండంగి రమణ ను గెలిపించండి.
నయవంచన10 సంత్సరాల నిరంకుశపాలననాలుగో దారుణ మోసం#Vote4Left #CPIMAP #VoteForLeft #Vote4INDIA #SaveIndia #cpmkurupam
అరకు పార్లమెంట్ సమగ్రాభివృద్ధికి సిపిఎం అభ్యర్థి అప్పలనరసను గెలిపించండి.
విదేశీ కార్పొరేట్ బహుళజాతి వ్యాపార సంస్థలకు బిజెపి స్వేచ్ఛ హక్కులు అందిస్తుంది.దీనివల్ల పట్టణంలో రిటైర్ మార్కెట్, చిన్న ...
గరుగుబిల్లి మండలం నాగూరు బహిరంగ సభలో పాల్గొని మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు,ఎమ్మెల్యే అభ్యర్థ...
కొమరాడ మండలంలో పంటలను ధ్వంసం చేస్తున్న గజరాజులు..పట్టించుకోని ప్రభుత్వం, అటవీ శాఖ అధికారులు..భయాందోళనలో ప్రజలు..#YSRCong...
వాడ వాడలా ప్రచారంలో దూసుకుపోతున్న సిపిఎం అభ్యర్థి మండంగి.రమణన్న..#VoteForMandangiRamana #VoteForAppalanarsa #Vote4Left #...
కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థి మండంగి.రమణ గారికి మద్దతుగా రాజ్యాంగ పరిరక్షణ వేదిక,ప్రత్యేక హోదా,విభజన హామీల సాధన సమితి ర్యాల...

Website