Telangana Rythu Sangham Jayashankar Bhupalpally

Telangana Rythu Sangham Jayashankar Bhupalpally

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Telangana Rythu Sangham Jayashankar Bhupalpally, Political organisation, .

28/09/2023

హరిత విప్లవ మార్గదర్శకుడు, ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త MS స్వామినాథన్ మరణం వ్యవసాయ రంగానికి తీరని లోటు.
- తెలంగాణ రైతు సంఘం

1960లలో అధిక దిగుబడినిచ్చే గోధుమలు, వరి రకాలను అభివృద్ధి చేయడంలో, ప్రచారం చేయడంలో స్వామినాథన్ కీలక పాత్రకు గుర్తింపుగా 1987లో స్థాపించబడిన ప్రపంచ ఆహార బహుమతికి మొదటి గ్రహీత అని అన్నారు. 1988లో MS స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను స్థాపించాడని గుర్తు చేశారు. 2004 లో రైతులపై జాతీయ కమీషన్ అధ్యక్షుడిగా స్వామినాథన్ కనీస మద్దతు ధరను అందించాలని సిఫార్సు చేశారని అన్నారు. ఉత్పత్తి యొక్క సమగ్ర వ్యయం+50%కి సమానంగా ఉండాలని చెప్పారు. చారిత్రాత్మకమైన రైతుల పోరాటంలో ఇది ఒక ముఖ్యమైన డిమాండ్‌గా మిగిలిపోయిందని అన్నారు. మోడీ ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఇది ఇంకా అమలు కాలేదని అన్నారు. తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ స్వామినాథన్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోందని అన్నారు.

15/09/2023

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం - మహిళల పాత్ర
వెబినార్ I బత్తుల హైమావతి, ఐద్వా సీనియర్ నాయకురాలు Iనిర్వహణ : తెలంగాణ రైతు సంఘం - రాష్ట్ర కమిటి

19/06/2023

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల తహసిల్దార్ గారికి వినతి పత్రం అందిస్తున్న తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి చింతల రజనీకాంత్, రైతులు

18/06/2023
ఆడవాళ్ల ఆత్మగౌరవం కోసం ఇండ్ల పోరాటం61 కేంద్రాలను చుడుతూ బస్ యాత్ర | S Veeraiah Interview | T10 15/06/2023

ఆడవాళ్ల ఆత్మగౌరవం కోసం ఇండ్ల పోరాటం..

నిర్బంధాలు పోరాటాన్ని అపలేవు..

ఇండ్లొచ్చే వరకు రాజీలేని పోరాటం..

తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక కన్వీనర్ ఎస్ వీరయ్య స్పెషల్ ఇంటర్వ్యూ

ఆడవాళ్ల ఆత్మగౌరవం కోసం ఇండ్ల పోరాటం61 కేంద్రాలను చుడుతూ బస్ యాత్ర | S Veeraiah Interview | T10 ఆడవాళ్ల ఆత్మగౌరవం కోసం ఇండ్ల పోరాటం61 కేంద్రాలను చుడుతూ బస్ యాత్ర | S Veeraiah Interview | T10 Bus Jatha. Telangana Prajasanghala...

14/06/2023
Photos from Telangana Rythu Sangham Jayashankar Bhupalpally's post 10/06/2023

నల్లబెల్లి మండల కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్ లో జరిగిన తెలంగాణ రైతు సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభించిన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి, వేదికపై అవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి అబ్బాస్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, వరంగల్ జిల్లా కార్యదర్శి ఈసంపెల్లి బాబు, మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి శెట్టి వెంకన్న.

03/03/2023

కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్‌ అనుకూల రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిఐటియు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఆన్‌లైన్‌ బహిరంగ సభ మార్చి 4వ తేదీన సాయంత్రం 6 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, దొడ్డి కొమరయ్యహాల్‌లో జరుగుతుంది.

Photos from Telangana Rythu Sangham Jayashankar Bhupalpally's post 19/11/2022

జిల్లా నూతన కమిటీని ఎన్నికైంది. జిల్లా అధ్యక్షులు ఆత్మకూరి స్వామి యాదవ్(కాటారం), ఉపాధ్యక్షులు రాదరపు మల్లయ్య(మహముత్తరం), జిల్లా కార్యదర్శి చింతల రజినీకాంత్(చిట్యాల), సహాయ కార్యదర్శి గాదె లక్ష్మయ్య(మలహార్), కమిటీ సభ్యులు ఓదెలు(ముత్తరం), బొట్ల రమేష్, చిలపాక భద్రయ్య(రేగొండ),నీలాల దేవేందర్, కట్టేకోల్ల పర్వతాలు( కాటారం)లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Photos from Telangana Rythu Sangham Jayashankar Bhupalpally's post 19/11/2022

తేది : 19.11.2022
*నవంబర్‌ 27న నల్గొండలో జరిగే తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర 2వ మహాసభలను జయప్రదం చేయండి.*

తెలంగాణ రైత సంఘం రాష్ట్ర 2వ మహాసభలు నవంబర్‌ 27,28,29 తేదీల్లో నల్గొండ జిల్లా కేంద్రంలో జరగనున్నాయని, ఈ మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మూడ్ శోభన్ అన్నారు.

శనివారం భూపాలపల్లిలోని శ్రామిక భవన్ లో తెలంగాణ రైతు సంఘం జిల్లా 2వ మహాసభలు ఆత్మకూరి స్వామి యాదవ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా శోభన్ మాట్లాడుతూ.. నవంబర్‌ 27న రైతుల భారీ ప్రదర్శన అనంతరం బహిరంగ సభ జరుగుతుందన్నారు. నవంబర్‌ 28న మహాసభలు ప్రారంభమౌతాయని, ఈ సభలకు అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్‌ అశోక్‌ దావలే, హనన్‌మోల్లా, సహాయ కార్యదర్శి డాక్టర్‌ విజూ కృష్ణన్‌ పాల్గొని ప్రసంగిస్తారు. రాష్ట్ర నలుమూలల నుండి ప్రతినిధులు, సౌహార్థ ప్రతినిధులు హాజరవుతారు. కౌలు, పాలు, మహిళా, పత్తి, చెరుకు, రైతులు పాల్గొంటారు. రైతుల ఆదాయం ప్రభుత్వ విధానాల ఫలితంగా తగ్గుతుందని అన్నారు. ఉపకరణాల ధరలు విపరీతంగా పెరుగుతున్న స్థితిలో కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలు పెంచకపోవడం వల్ల రైతులు రుణగ్రస్తులు అమవుతున్నారన్నారు. కనీస మద్దతు ధరలను శాస్త్రీయంగా నిర్ణయించకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారన్నారు. మార్కెట్లను కార్పొరేట్‌ చేతుల్లో పెట్టడానికి ఈనామ్‌ తెచ్చారు. మార్కెట్ల నుండి ప్రభుత్వం వైదోలిగే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. ఎరువుల సబ్సిడీలు తగ్గించడానికి పిఎం ప్రణామ్‌ పథకాన్ని తెచ్చిందన్నారు.విత్తన పరిశోధనలను పూర్తిగా విరమించి ఇతర దేశాల నుండి బహుళజాతి సంస్థల టెక్నాలజీని దిగుమతి చేసుకుంటున్నారన్నారు. ఫసల్‌ బీమా పథకం అమలుకాకపోవడంతో రైతులు ఇబ్బదులకు గురౌతున్నారన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం వాటిల్లినప్పటికీ రైతులకు ఎలాంటి పరిహారం అందడంలేదన్నారు. ధరణి వెబ్‌సైట్‌లో తప్పులు ఉండడం వల్ల రైతులకు ప్రభుత్వ పథకాలు వర్తిచడంలేదు. ప్రైవేట్‌ వడ్డీల భారం భరించలేక పేద, మధ్యతరగతి రైతులు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ప్రైవేట్‌ వ్యాపారుల వల్ల రైతులు వరి, పత్తి, పప్పు ధాన్యాలు, నూనెగింజల అమ్మకంలో ఏటా 5 వేల కోట్ల నష్టపోతున్నారన్నారు. రైతులు ఎక్కువగా మోసాలకు గురౌతున్నారు. డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెరగడంతో వ్యవసాయ యాంత్రీకరణ చార్జీలు విపరీతంగా పెంచుతున్నారు. రైతులు భరించలేకపోతున్నారు. వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్‌ చేసి అమ్మడం వల్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. రైతాంగ పడే ఇబ్బందులను రాష్ట్ర మహాసభలలో చర్చించి భవిష్యత్‌ పోరాటాలకు రూపకల్పన చేస్తామని అన్నారు. రైతు ఉద్యమాలకు పోరాటాల పురిటిగడ్డ నల్గొండలో జరిగే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని రైతులను కోరారు. అనంతరం జిల్లా నూతన కమిటీని ఎన్నికైంది. జిల్లా అధ్యక్షులు ఆత్మకూరి స్వామి యాదవ్(కాటారం), ఉపాధ్యక్షులు రాదరపు మల్లయ్య(మహముత్తరం), జిల్లా కార్యదర్శి చింతల రజినీకాంత్(చిట్యాల), సహాయ కార్యదర్శి గాదె లక్ష్మయ్య(మలహార్), కమిటీ సభ్యులు ఓదెలు(ముత్తరం), బొట్ల రమేష్, చిలపాక భద్రయ్య(రేగొండ),నీలాల దేవేందర్, కట్టేకోల్ల పర్వతాలు( కాటారం)లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చేపురి ఓదెలు పాల్గొన్నారు.

అభినందనలతో..
జిల్లా కార్యదర్శి
చింతల రజినీకాంత్
8185096930

Photos from Telangana Rythu Sangham Jayashankar Bhupalpally's post 23/07/2022

భారీగా ఇసుక మేటలు..కంట తడి పెడుతున్న రైతులు...
-ప్రభుత్వం ఆదుకోవాలి వేడుకోలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం లెంకలగడ్డ గ్రామంలో గోదావరి వరద నీటికి పంట భూముల్లో భారీగా ఇసుక మేటలు పెరుకుపోయాయి. వరద ప్రవాహానికి పంట భూముల్లో కాల్వలు ఏర్పడ్డాయి.పంట భూముల్లోని ఇసుక మెటలను తొలగించి ప్రభుత్వం తమని అడుకోవలని రైతులు కోరుతున్నారు..

Videos (show all)

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం - మహిళల పాత్ర వెబినార్ I బత్తుల హైమావతి, ఐద్వా సీనియర్ నాయకురాలు
కార్పొరేట్ల ప్రయోజనాలు-రైతులకు ఉరి
" వ్యవసాయ రంగం పరిణామక్రమం" పై సారంపల్లి మల్లారెడ్డి
"ప్రస్తుత పరిస్థితులు- కరోనా- భూ సమస్యలు" పై  నంద్యాల నరసింహా రెడ్డి
"ప్రస్తుత పరిస్థితులు- కరోనా- భూ సమస్యలు" పై  నంద్యాల నరసింహా రెడ్డి

Website