Rajadhani Vartalu
You may also like
Breaking News from Capital Amarvati, AP, TS, National,International-rajadhanivartalu.com
9440662699 In print a weekly newspaper since Oct-2015.
PROFESSIONAL PROFILE
VASTITUDE MEDIA Pvt.Ltd: Founder & Managing Director - 2015 to till date
• Established a media house in 2015 to play an important role in print, digital & social media activities. Also publishing news on digital & social media plotforms like website, youtube, facebook & twitter. In addition conducting press briefs, business meet-ups
• Accredited Journalist from the government
క్షయ రోగులను ఆదుకునేందుకు ముందుకు...
క్షయ రోగులను ఆదుకునేందుకు ముందుకు రండి
కార్పొరేట్ యాజమాన్యాలకు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సిఎస్ కృష్ణబాబు వినతి
*అమరావతి: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్ (PMTBMBA) కార్యక్రమం ద్వారా క్షయ రోగులకు అదనపు పౌష్టికాహారాన్ని అందించేందుకు ముందుకు రావాలని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి కృష్ణబాబు కార్పొరేట్ సంస్థల యాజమాన్యాలకు విజ్నప్తి చేశారు. మంగళగిరి ఎపి ఐఐసి టవర్స్లోని తన ఛాంబర్లో కొహన్స్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) ఎంఎస్ ఎన్ రెడ్డి క్షయ రోగులకు బలవర్ధక ఆహారాన్ని అందచేసేందుకు కనెక్ట్ టు ఆంధ్రా సంస్థ సిఇఓ శివశంకర్ ద్వారా శుక్రవారం కృష్ణ బాబు కు రు.40 లక్షల చెక్ ను అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ కోహెన్స్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ సంస్థ స్ఫూర్తితో క్షయరోగులకు బలవర్ధకమైన ఆహారాన్ని అందచేసేందుకు కార్పొరేట్ సంస్థల యాజమాన్యాలు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యతతో ముందుకు రావాలన్నారు. రాష్ట్రంలో పేద ప్రజల ఆరోగ్యాన్ని మెరుగు పర్చేందుకు , మెరుగైన సేవలందించేందుకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఉస్తున్నారన్నారు. టిబి రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారన్నారు.
నిధుల సేకరణలో కీలక పాత్ర పోషిస్తున్న కనెక్ట్ టు ఆంధ్రా సిఇఓకు ఈ సందర్భంగా కృష్ణ బాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమీషనర్ జె. నివాస్ మాట్లాడుతూ 33,745 మంది టీబీ రోగులకు అదనపు పోషాకాహారం నిమిత్తం ఫుడ్ బాస్కెట్లను అందచేశామన్నారు. ఎన్టిఆర్, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలలో రానున్న ఆరు నెలల కాలంలో మరో 2,417 మంది టిబి రోగులకు రు. 78 లక్షల విలువైన ఫుడ్ బాస్కెట్లను అందచేయనున్నామని తెలిపారు. జాయింట్ డైరెక్టర్ (టిబి) డాక్టర్ టి రమేష్ మాట్లాడుతూ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ నివాస్ గారి సూచనల మేరకు రాష్ట్రంలోని నిరుపేద టిబి రోగులను ఆదుకునేందుకు నిక్షయ్ మిత్రలుగా రిజిస్టర్ చేసుకోవాలని తాము కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు.
కొహెన్స్ లైఫ్ సైన్సెస్ సంస్థ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) ఎంఎస్ఎన్ రెడ్డి మాట్లాడుతూ తమ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా కనెక్ట్ టు ఆంధ్రా సంస్థ సమన్వయంతో టిబి రోగులకు బలవర్ధక ఆహారాన్ని అందచేసేందుకు సహకారాన్ని అందిస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించి ఇటీవలే ఎన్టిఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావుకు తాము రు.38 లక్షల విరాళాన్ని అందచేశామన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కొహెన్స్ లైఫ్ సైన్సెస్ సంస్థ సిఎస్ఆర్ కార్యకలాపాల సమన్వయ కర్త పిఎస్ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ శ్రీ బి ఆర్ అంబేత్కర్ గారు రచించిన రాజ్యాంగ గ్రంథాన్ని ప్రజలకు పూర్తిస్థాయి లో అవగాహణ కల్పించాలి.
*సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి*
*నవంబర్ 26 న రాజ్యంగ దినోత్సవం సందర్బంగా మరియు జాతీయ న్యాయ దినోత్సవం సందర్బంగా*
డోన్ పట్టణం ;- ఎందరో మహనీయుల త్యాగఫలం
మన దేశ స్వాతంత్ర్యం. మన భారత దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి బ్రిటీషర్ల పాలన నుంచి మన భారతమాతకు విముక్తి కల్పించేందుకు ప్రాణాలు సైతం తృణప్రాయంగా అర్పించిన ప్రతి ఒక్క
మహనీయులను స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి పేర్కొన్నారు.
స్వాతంత్య్రం సిద్దించి 77సంవత్పరాలు పూర్తి చేసుకుంటున్నాము అయితె మన భారతదేశంలో చాలా మందికి మానవ హక్కల విలువలు కూడా తెలియదు. నిజానికి పూర్వం మన పెద్దలు రామాయణం,మహా భారతం ,ఖురాన్, భైబుల్ గ్రంథాలను చదివేవారు పిల్లలతో చదివించేవారు. అయితే అతి ముఖ్యమైన మన భారత రాజ్యంగ గ్రంథం పై ప్రతి ఒక్కరికి పూర్తి స్ధాయి లో అవగాహణ కల్పించాలని మన భారత ప్రభుత్వాన్ని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి వేడుకుంటున్నారు.
భారత ప్రభుత్వం మన దేశ ప్రజలందరికి ప్రతి కుటుంబానికిి ఒక గ్రంథం ఇవ్వాలని అలాగే దేశ ప్రజలకు మన రాజ్యాంగ గ్రంథం పై అవగాహణ కలిగించే విధంగా ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయించాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి కోరారు. అలాగే ముఖ్యంగా యువతకు మన రాజ్యాంగం పై పూర్తి స్తాయి లో అవగాహణ కల్పించడం వల్ల గ్రంథంలో విషయాలు తెల్సుకోవడం వల్ల తప్పు ఏదో మంచి ఏదో తెలుస్తుంది. తప్పులకు ఎలాంటి శిక్షలు ఉంటాయో తెల్సుకోవడం వల్ల యువత మంచి మార్గంలో నడిచే అవకాశం ఉంటుంది. భారత ప్రభుత్వం, ప్రజా ప్రతి నిధులు, అధికారులు, ప్రజా సంఘాలు, మేధావులు, స్వచ్చంద సేవా సంస్థలు, సామాజిక కార్యకర్తలు అందరు సంయుక్తంగా కలిసి మన దేశ ప్రజలందరికి మన రాజ్యాంగ గ్రంథంలోని ముఖ్యమైన అంశాలను అవగాహణ కల్పించే ఏర్పాటు చేయించాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి కోరారు. మన రాజ్యాంగ గ్రంథంలోని అన్ని విషయాలు తెల్సుకొని దేశాన్ని ముందుకు నడిపించాల్సిన భాద్యత ప్రతి ఒక్కరి పై ఉన్నదన్నారు.
Hope this will only help to better people's lives and Development of state
తాడేపల్లి...
*మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ*
*డిసెంబర్ 9 నుండి ఏపిలో కులగణన ప్రక్రియ మొదలవుతుంది*
సమగ్ర కులగణన చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం...
సమగ్ర కులగణన పేదవాడి జీవితానికి భద్రత...
ప్రజల జీవన స్థితి మారడానికి కులగణన అవసరం...
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జనగణన తప్ప కులగణన జరగలేదు.
సామాజిక సాధికారిత కు చిరునామా..ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి...
కులగణన కోసం కుల సంఘాల నాయకుల అభిప్రాయాలు సేకరిస్తున్నాం..
ప్రాంతీయ సమావేశాలు నిర్వహించి ఆయా వర్గాల అభిప్రాయాలు సేకరిస్తున్నాం..
మన రాష్ర్టంలో జరిగే కులగణన దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది...
సమగ్ర కులగణన సామాజిక కోణంలో జరుగుతుంది..
ప్రతిపక్షాలకు కులగణన అంటే వెన్నులో వణుకు పుడుతోంది...
incomplete and falsified writings from Eenadu
- క్వార్డ్జ్మైనింగ్పై 'ఈనాడు' రాతలు పూర్తి అవాస్తవం
incomplete and falsified writings from Eenadu incomplete and falsified writings from Eenadu
- క్వార్డ్జ్మైనింగ్పై 'ఈనాడు' రాతలు పూర్తి అవాస్తవం
- దేవుడిమాన్యంలోక్వార్జ్ట్మైనింగ్జరగడం లేదు
- 2012లో దేవాదాయశాఖరమాదేవికి 10 ఎకరాలభూమికిలీజు
- ఈ భూమిలోమైనింగ్లీజులను 2022లోనే రద్దుచేశాం
- 2021లో 25
ఎకరాలదేవుడిమాన్యంనుదేవాదాయశాఖనుంచిఇద్దరులీజుకుతీసుకున్నారు
- భూమిలీజుకుతీసుకున్నవారుమైనింగ్కోసం దరఖాస్తు కూడా చేయలేదు
- అసలు మైనింగ్అనుమతులేలేకుండా 50 వేలటన్నులతవ్వకంసాధ్యమా?
- ఆ ప్రాంతంలో ఎటువంటిమైనింగ్జరగడం లేదు
- గతంలో జరిగినమైనింగ్ఫోటోలతో 'ఈనాడు' వక్రీకరణకథనం
- రాజకీయంగాబురదచల్లేందుకేప్రజాప్రతినిధిదోపిడీ అంటూ కట్టుకథ
- 50 వేలటన్నులక్వార్డ్జ్తవ్వకంఆరోపణలుఅర్థరహితం
-గనులశాఖసంచాలకులు శ్రీ విజివెంకటరెడ్డి
అమరావతి:
1) ఈనాడుదినపత్రికలో 'క్వార్డ్జ్ కొల్లగొట్టారు' అనేశీర్షికనప్రచురించినకథనం పూర్తి అవాస్తవమనిరాష్ట్రగనులశాఖసంచాలకులు శ్రీ విజివెంకటరెడ్డి ఒక ప్రకటనలోఖండించారు. ఈనాడు కథనంలో ఆరోపించినట్లుదేవుడిమాన్యంలోఎటువంటిమైనింగ్కార్యకలాపాలుజరగడం లేదని స్పష్టంచేశారు. అసలు మైనింగేజరగకపోతే, ఏకంగా 50 వేలటన్నులక్వార్ట్జ్తవ్వారనేఆరోపణలుఅర్థరహితమనిపేర్కొన్నారు.
2) పల్నాడుజిల్లాకారంపూడిమండలంసింగరుట్లలక్ష్మీనరసింహస్వామిఆలయభూముల్లోక్వార్జ్ట్తవ్వకాలకుమైనింగ్ శాఖ ఎటువంటిఅనుమతులు మంజూరు చేయలేదు. 2012లో దేవాదాయశాఖ ఈ ఆలయపరిధిలోనిబ్లాక్ 28 ప్రాంతంలో పదిఎకరాలభూమినిరమాదేవిఅనేవ్యక్తికిమైనింగ్కార్యకలాపాలకోసంలీజుకుఇచ్చింది. సదరు వ్యక్తి మైనింగ్ శాఖ నుంచిలీజుఅనుమతులుపొందారు. అయితే 2022లో ఈ మైనింగ్అనుమతులనుగనులశాఖరద్దు చేయడం జరిగింది.
3) 2021లో లక్ష్మీనరసింహస్వామిదేవాలయానికి చెందిన ఇరవైఅయిదుఎకరాలభూమినిమైనింగ్కార్యకలాపాలకోసంవినియోగించుకునేందుకుగానూదేవాదాయశాఖ అధికారులు వేలంనిర్వహించారు. ఈ వేలంలోఇరువురువ్యక్తులు 12.5 ఎకరాల చొప్పున వేలంలోదక్కించుకున్నారు. అయితేక్వార్జ్ట్తవ్వకాలకోసంసదరువ్యక్తులుమైనింగ్ అధికారులకు ఎటువంటి దరఖాస్తు చేయలేదు. ఈ ప్రాంతంలో క్వార్జ్ట్మైనింగ్లీజులనుగనులశాఖజారీ చేయలేదు.
4) వాస్తవాలు ఇలా ఉంటే... పల్నాడుకు చెందిన ప్రజాప్రతినిధిక్వార్జ్ట్మైనింగ్పేరుతోదోపిడీ చేశారని 'ఈనాడు' పత్రిక తన కథనంలో ఆరోపించడంవిడ్డూరంగాఉంది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో జరగనిమైనింగ్నుంచిఏకంగా 50 వేలటన్నులకు పైగా తవ్వకం, ఎగుమతి కూడా జరిగిపోయినట్లుతన కథనంలో పేర్కొనడం పూర్తి అవాస్తవం. అసలు మైనింగ్అనుమతులేఇవ్వకపోతే... మైనింగేజరగకపోతే... ప్రభుత్వానికిరాయల్టీఎలా వస్తుంది? కేవలంఊహాత్మకఆరోపణలతోప్రభుత్వానికిరాయల్టీదక్కలేదంటూఈనాడు పత్రిక అభూతకల్పననుతనపత్రికలోఅచ్చేసింది.
5) రాష్ట్రంలోఅక్రమమైనింగ్ కార్యకలాపాలను అరికట్టేందుకుప్రభుత్వం ప్రతి జిల్లాకు విజిలెన్స్స్వ్కాడ్లను ఏర్పాటు చేసింది. మైనింగ్పై ఎక్కడ ఆరోపణలువచ్చినా ఈ బృందాలుఆకస్మికతనిఖీలునిర్వహించి, బాధ్యులైనవారిపైచర్యలుతీసుకుంటున్నాయి. అలాగేఅన్ని చోట్ల చెక్ పోస్ట్లు కూడా ఏర్పాటు చేసిమైనింగ్అక్రమరవాణానుఅడ్డుకుంటున్నాం. ఇంతపకడ్భందీచర్యలుతీసుకుంటూఉంటేఇంతపెద్ద ఎత్తున క్వార్జ్ట్అక్రమమైనింగ్, రవాణాసాధ్యమా?
6) ఇటువంటి తప్పుడు కథనాలనుప్రచురిస్తూప్రభుత్వంపైప్రజల్లోఅపోహలుకల్పించేందుకఈనాడు పత్రిక ప్రయత్నిస్తోంది. కనీసంవాస్తవాలనుతెలుసుకునేందుకుసంబంధిత అధికారులను కూడా సంప్రదించకపోవడంసమంజసంకాదు. ఇటువంటి తప్పుడు రాతలపైఈనాడుపైచట్టపరమైనచర్యలుతీసుకుంటాం.
సత్య సాయి బాబా సేవలు అందరికీ ఆదర్శనీయం
ఘనంగా సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 42వ స్నాతకోత్సవం
ముఖ్య , గౌరవ అధితులుగా గా భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ,రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరు
98 వ బాబా జయంతి వేడుకల్లో బాగంగా పుట్టపర్తి పర్యటన
పుట్టపర్తి: మానవసేవే మాధవసేవ అని బోధించిన శ్రీ సత్య సాయి సేవలు అందరికీ ఆదర్శనీయమని భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పేర్కొన్నారు.
బుధవారం ప్రశాంతి నిలయంలోని సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ లో శ్రీ సత్య సాయి బాబా యూనివర్సిటీ 42 వ స్నాతకోత్సవంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిధి గా హాజరవ్వగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గౌరవ అతిధి గా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో శ్రీ సత్య సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లర్నింగ్ (ఎస్.ఎస్.ఎస్. ఐ.హెచ్ ఎల్) ఛాన్స్.లర్ కే చక్రవర్తి రిటైర్ ఐఏఎస్, వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ బి రాఘవేంద్ర ప్రసాద్,రాష్ట్ర మహిళా, పిల్లలు, వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్స్ సంక్షేమ శాఖ మంత్రి కె.వి ఉష శ్రీ చరణ్, సత్యసాయి సెంటర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు ఎస్ ఎస్ నాగానంద్ , తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తూ... పుట్టపర్తిలో శ్రీసత్యసాయి 98వ జయంతి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.నేడు భగవాన్ సత్య సాయి బాబా సమాధిని దర్శించే సౌభాగ్యం కలిగిందన్నారు. ప్రశాంతి అనగా ఆధ్యాత్మిక శాంతి అని అన్నారు. సదా సత్యం పలకాలని, సదా ధర్మాన్ని ఆచరించాలన్న బాబా వాక్కులను నిజ జీవితంలో అలవరుచుకొని విద్యార్థులు ముందుకు సాగాలన్నారు. భగవాన్ సత్యసాయిబాబా తాను బోధించిన మానవతా విలువలు, ఆధ్యాత్మికత కలగలిపి ఆధునిక విజ్ఞానాన్ని అందించేందుకు చక్కటి విద్యా వ్యవస్థను నెలకొల్పారన్నారు. మనమందరం ఆధ్యాత్మిక చింతన ,కరుణ,పరోపకారం కలిగి సత్యసాయిబాబా అడుగుజాడల్లో నడవాలన్నారు. సత్యసాయి భారతీయ విద్యావిధానంలో అనాదిగా అమలవుతున్న గురుకుల విద్యా విధానానికి మెరుగులుదిద్దుతూ, నేటి సమాజ అవసరాల మేరకు మార్పులు చేసి నూతన గురుకుల విధానాన్ని అమలయ్యేలా విద్యా వ్యవస్థలను రూపొందించారన్నారు. మానవతా విలువలు, ఆధ్యాత్మికత, శాస్త్ర సాంకేతిక అంశాలతో కూడిన సమ్మిళిత విద్యను బోధిస్తూ అత్యద్భుతమైన ఫలితాలతో ప్రపంచంలోనే మేటి విద్యాసంస్థల సరసన నిలిపారన్నారు. సత్యసాయి విద్యాసంస్థలు ఉత్తమ ప్రమాణాలతో కూడిన ఆదర్శ విద్యను అందిస్తున్నాయన్నారు. అందువల్లే సత్యసాయి విద్యాసంస్థలు విలువల నిలయాలుగా నిలచాయన్నారు. భగవాన్ సత్యసాయి బాబా ప్రజలకు వైద్య, విద్యా,మంచినీరు వంటి ఎన్నో సేవలు అందించారాన్నారు.భగవాన్ సత్యసాయిబాబా సేవలను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు వారి అడుగుజాడల్లో నడవాలని సూచించారు. గోల్డ్ మెడల్ సాధించిన, క? కాన్వకేషన్ పొందిన విద్యార్థులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు
రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ... బాబా సత్యసాయిబాబా 42 వ స్నాతకోత్సవం లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, ప్రేమ,సాధన వంటి వాటిని అలవర్చుకొని జీవితంలో అభివృద్ధి చెంది దేశానికి సేవలు అందించాలన్నారు శ్రీ సత్య సాయి బాబా విద్యాసంస్థల్లో నేటి ఆధునిక విద్యతోపాటు సమగ్ర సమైక్యతను నెలకొల్పే ప్రాచీన కాల గురుకుల విద్య వ్యవస్థను కూడా పాటిస్తూ విద్యార్థుల జీవితంలో విలువలతో కూడిన విద్యను అందిస్తున్నారన్నారు. ప్రపంచమంతా వసుదైక కుటుంబమని ప్రతి ఒక్కరూ సేవా గుణం కలిగి జీవించాలని సూచించారు. అలాగే విద్యార్థులు అందరూ ధర్మం సత్యాన్ని పాటించి ధర్మో రక్షిత రక్షితః అనే సిద్ధాంతాన్ని పాటిస్తూ జీవితంలో ఉన్న స్థాయికి చేరాలని విద్యార్థులకు సూచించారు. అలాగే కాన్వకేషన్ పొందిన విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
వివిధ రంగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన శ్రీసత్యసాయి బాబా
విద్యాసంస్థల విద్యార్థులకు పట్టాలతో పాటు 21 మందికి బంగారు పతకాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విద్యార్థులకు అందించారు.
కార్యక్రమానికి ముందు ట్రస్ట్ సభ్యులు ముఖ్య అతిథులను సన్మానించారు.వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ బి రాఘవేంద్ర ప్రసాద్ కాన్వగేషన్ పొందిన విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
అంతకుముందు భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము భారత వాయుసేన విమానంలో ఒడిశా నుంచి బుధవారం మధ్యాహ్నం సత్యసాయి విమానాశ్రయానికి ద్రౌపది ముర్ము చేరుకున్నారు.అనంతరం రాష్ట్రపతి సాయి కుల్వంత్ హాలు లో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ గోరంట్ల మాధవ , ఎమ్మెల్యేలు దుద్దుగుంట శ్రీధర్ రెడ్డి, తిప్పేస్వామి, జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు,వివిధ విద్యా సంస్థల అధికారులు, విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.
అమరావతి:
విఐటి-ఏపి విశ్వవిద్యాలయంలో 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహణ
విఐటి-ఏపి విశ్వవిద్యాలయంలో 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ది. 20, నవంబర్ 2023 నాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ పద్మిని (లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగం విశ్రాంత అధ్యాపకులు, తిరుపతిలోని ఎస్‌వీ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ మాజీ ప్రిన్సిపాల్) హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ స్వేచ్ఛా భారతదేశం కోసం స్వాతంత్ర్య పోరాటంలో గ్రంథాలయాల ప్రాముఖ్యత గురించి వివరించారు మరియు భారతదేశ స్వాతంత్ర్యం వైపు ప్రజలను ప్రేరేపించడంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషించాయని, ప్రజలలో పఠన అలవాట్లను మెరుగుపరచడం యొక్క ప్రాముఖ్యతను ఆమె నొక్కిచెప్పారు మరియు ఈ రోజుల్లో ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ వనరుల ప్రభావంతో పఠన అలవాట్లు క్షీణించాయి మరియు సరైన అంశాన్ని ఎంపిక చేయడం నుండి పరిశోధనపై పరిశోధన స్కాలర్‌లు మరియు మార్గదర్శకులకు ఆమె కొన్ని విలువైన విషయాలు తెలియచేసారు.
విశ్వ విద్యాలయ వైస్ ఛాన్సలర్ డా|| ఎస్ వి కోటా రెడ్డి మాట్లాడుతూ, ఉన్నత విద్యలో విఐటి-ఎపి యూనివర్శిటీ లైబ్రరీ పాత్రను తెలియచేస్తూ యెన్ఐఆర్ఎఫ్ వంటి జాతీయ స్థాయి ర్యాంకింగ్స్‌లో విశ్వవిద్యాలయం యొక్క అభివృద్ధి చెందుతున్న పాత్రను కూడా తెలియచేసారు.
యూనివర్సిటీ లైబ్రేరియన్ డా|| సిహెచ్. వీరాంజనేయులు IEEE-IEL, Elsevier Science Direct, Springer, Web of Science, Bentham Science మొదలైన వివిధ ప్రింట్ మరియు ఈ-జర్నల్స్ సబ్‌స్క్రిప్షన్‌లు మరియు విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాలకు సంబంధించి లైబ్రరీలో అందుబాటులో ఉన్న వివిధ ఈ-పుస్తకాలపై మాట్లాడారు.
చివరిగా డా|| వినిత్ సరోహా (కస్టమర్ కన్సల్టెంట్, ఎల్సేవియర్ సైన్స్ డైరెక్ట్ ) ద్వారా ఇ-బుక్స్, ఇ-జర్నల్స్ మరియు ఇ-డేటాబేస్‌ల పరంగా విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్‌లు మరియు ఫ్యాకల్టీ సభ్యులకు ఓరియెంటేషన్ సెషన్ నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఫోటో శీర్షిక: 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా జరిగిన సభలో ప్రసంగిస్తున్నముఖ్య అతిథిగా ప్రొఫెసర్ పద్మిని (లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగం నుంచి విశ్రాంత అధ్యాపకులు, తిరుపతిలోని ఎస్‌వీ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ మాజీ ప్రిన్సిపాల్ ) తోపాటు విశ్వ విద్యాలయ వైస్ ఛాన్సలర్ డా|| ఎస్ వి కోటా రెడ్డి , యూనివర్సిటీ లైబ్రేరియన్ డా|| సిహెచ్. వీరాంజనేయులు
12 రోజులుగా సొరంగంలోనే ఉండిపోయిన 41 మంది కార్మికులు
ఉత్తరాఖండ్‌లో నిర్మాణంలో ఉన్న సొరంగం నవంబరు 12న కూలిన సంగతి తెలిసిందే. అందులో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు వర్టికల్ డ్రిల్లింగ్ ప్రారంభించాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. శిథిలాలు, సొరంగం ప్రవేశ ద్వారం మధ్య దూరం ఎంత ఉందో అధ్యయనం చేయడానికి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఓ) మోహరించిన రోబోటిక్ డ్రోన్ తో రెండుసార్లు సర్వే చేశారు. కానీ డ్రోన్ శిథిలాల నుంచి 28 మీటర్లకు మించి వెళ్లలేకపోవడమే కాకుండా, అది పాడయిపోయింది. దీంతో సమస్య మొదటికి వచ్చింది. దీంతో పైపు డ్రిల్లింగ్ మిషన్ ద్వారా మంగళవారం ఉదయం పైపులు నెట్టడం ప్రారంభించారు. లోపల చిక్కుకుపోయిన కార్మికులకు అధికారులు ప్లాస్టిక్ బాటిళ్లలో ఆహారాన్ని పంపిణీ చేశారు. కూలీలు ఆరోగ్యంగా ఉండేందుకు పైపుల ద్వారా కిచెడీ, నారింజ, అరటిపండ్లు, యాపిల్స్ పంపిణీ చేశారు. కిచెడీని ప్లాస్టిక్ బాటిళ్లలో వేసి పైపు ద్వారా కిందకు దించారు. కమ్యూనికేషన్‌ను నిర్వహించడానికి ఛార్జర్‌తో కూడిన ఫోన్‌ను పంపనున్నట్లు అధికారులు తెలిపారు.
సోమవారం టన్నెల్ నిర్మాణ నిపుణుల అంతర్జాతీయ బృందం అక్కడికి చేరుకుంది. ఇంటర్నేషనల్ టన్నెలింగ్ అండ్ అండర్ గ్రౌండ్ స్పేస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్నాల్డ్ డిక్స్ కూడా రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ 10వ రోజుకు చేరుకోవడంతో అధికారులు స్వయంగా సంఘటన స్థలంలో పర్యవేక్షిస్తున్నారు. ఇక మంగళవారం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) చార్ ధామ్ మార్గంలో సిల్క్యారా సొరంగం బార్‌కోట్ చివర నుంచి నిలువు డ్రిల్లింగ్ పని చేపట్టనుంది. అందులో కొంత భాగం నవంబర్ 12న కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఓఎన్‌జీసీ డ్రిల్లింగ్ చీఫ్ దీనిపై ఈ రోజు నివేదిక సమర్పించే అవకాశం ఉంది. మొత్తం 1,150 మీటర్లలో టన్నెల్‌కు 970 మీటర్ల మేర యాక్సెస్ రోడ్డును బీఆర్‌ఓ పూర్తి చేసింది. మరోవైపు RVNL విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసింది. దీన్ని జిల్లా యంత్రాంగం తనిఖీ చేస్తోంది. నవంబర్ 26 నాటికి వర్టికల్ డ్రిల్లింగ్ పూర్తవుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అత్యవసర సేవల కోసం శిథిలాల గుండా 150 ఎంఎం స్టీల్ పైపును ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి మూడో ప్రయత్నం జరుగుతోంది.
నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (NHPC), సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ (SJVNL) సిల్క్యారా చివరన 1-1.2 మీటర్ల వ్యాసం కలిగిన బోర్‌వెల్‌ను తవ్వే పనిని చేపట్టాయి. రోడ్డు, రవాణా, రహదారుల శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ మాట్లాడుతూ.. సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులకు ప్రభుత్వం మల్టీవిటమిన్‌లు, యాంటిడిప్రెసెంట్స్, డ్రైఫ్రూట్స్‌ను పంపిస్తోందన్నారు. అయితే కేవలం ఒకే ప్లాన్‌పై పనిచేయకుండా, కార్మికులను వీలైనంత త్వరగా రక్షించడానికి ఒకే సమయంలో ఐదు ప్లాన్‌లతో పనిచేస్తున్నట్లు తెలిపారు. రెస్క్యూ మిషన్ కోసం తమ వద్ద అన్ని వ్యవస్థలు ఉన్నాయని, విదేశీ కన్సల్టెంట్ల నుంచి కూడా సహాయం పొందుతున్నట్లు తెలిపారు. సొరంగం పైన ఒక స్థలాన్ని గుర్తించి నిలువు డ్రిల్లింగ్ చేసేందుకు పనులు ప్రారంభమవుతున్నాయన్నారు. అక్కడ నుంచి సుమారు 300-350 అడుగుల వరకు ఒక రంధ్రం వేస్తామన్నారు. అందుకు ఇప్పటికే పెద్ద డ్రిల్లింగ్ యంత్రాన్ని తెప్పించారు. ప్రస్తుతం దీనిని అసెంబుల్ చేస్తున్నామని, త్వరలో శిథిలాల తవ్వేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. నవంబర్ 12 ఉదయం 5:30 గంటల ప్రాంతంలో సిల్క్యారా సొరంగంలో కొంత భాగం కూలిపోయింది. వారం రోజులు గడిచినా 41 మంది కూలీలను ప్రభుత్వం ఇప్పటివరకు రక్షించలేకపోవడంతో బాధిత కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయి.
విశాఖ హార్బర్ అగ్ని ప్రమాదానికి కారణాలు ?
విశాఖ హార్బర్ అగ్ని ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ విచారణలో ఫిషింగ్ హార్బర్‌లో అర్థరాత్రి లంగర్ వేసిన బోటులో పార్టీ జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. క్రికెట్ బెట్టింగ్, గొడవల నేపథ్యంలో అగ్నిప్రమాదం ఘటన జరిగిందన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. అయితే, ఈ సంఘటనకు సంబంధించి మొదట యూ ట్యూబర్, లోకల్ బాయ్ నానీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం రాత్రి ప్రమాద ప్రాంతంలోని బోటులో స్నేహితులతో కలిసి యూట్యూబర్ నాని ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు లోకల్ బాయ్ నాని పేరుతో యూట్యూబ్ నిర్వహిస్తున్న అతనికి బోటు ఉంది. ఆరోజే అతడి భార్యకు ఘనంగా సీమంతం నిర్వహించారు. ఈ క్రమంలో ఫ్రెండ్స్ కూడా పార్టీ అడగడంతో ఆదివారం రాత్రి బోటులో మందు పార్టీ ఇచ్చాడు నాని. ఈ పార్టీలో జరిగిన గొడవతో కావాలనే కొంతమంది బోటుకు నిప్పు అంటించారని, అది ఇతర బోట్లకు అంటుకుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు బోటు అమ్మకానికి పెట్టిన క్రమంలో అడ్వాన్స్ విషయంలో జరిగిన వివాదం కూడా ఘటనకు కారణం అన్న వాదన వినిపిస్తోంది.
సముద్రంలో వేటకు వెళ్లి, వలకు పడిన చేపల దృశ్యాలను, యూట్యూబ్‌ర్ లోకల్ బాయ్ నాని అప్‌లోడ్ చేస్తాడు. ఇలా అతనికి యూట్యూబ్, సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే లోకల్ బాయ్ నాని ఈ ప్రమాద దృశ్యాలను షూట్ చేసి తన యూ ట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేశాడు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందో, ఎవరు కారకులో తెలియడం లేదని నాని ఆ వీడియోలో చెప్పాడు. అయితే ప్రమాద సమయంలో తాను అక్కడ లేనని నాని చెబుతున్నాడు. ఆ సమయంలో అక్కడ లేకపోతే అగ్ని ప్రమాద సంఘటనను నాని వీడియో తీసి యూ ట్యూబ్‌లో ఎలా పెట్టాడనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయంపై యూ ట్యూబర్ నానీని పోలీసులు విచారించారు. అయితే, మొదటి బోట్ తగలబడిన సమయం రాత్రి 11.15 గంటలుగా పోలీసులు గుర్తించారు. 11.45 గంటలకు నాని అక్కడకి వచ్చినట్టు మొబైల్ ట్రాకింగ్ ద్వారా తెలుసుకున్నారు. తన బోట్ కాలిపోతుందన్న సమాచారంతోనే అక్కడకు వెళ్లానని నాని పోలీసులకు తెలిపాడు. ఆ టైమ్‌లో నాని ఎటు వెళ్లాడు.. మొబైల్ లొకేషన్‌ను ఎక్కడ ఉంది అనే దానిపై కూడా పోలీసులు చెక్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తొలుత నాని చూట్టూ సాగిన విచారణ.. మళ్లీ క్రికెట్ బెట్టింగ్ వైపు మళ్లింది. క్రికెట్ బెట్టింగ్, గొడవల నేపథ్యంలో ఘటన జరిగిందన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. బెట్టింగ్ ముఠాల మధ్య ఘర్షణ నేపథ్యంలోనే ప్రమాదం జరిగిందన్న కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు. క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడ్డ స్థానిక యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మొత్తానికి..విశాఖ షిఫింగ్ హార్బర్ అగ్ని ప్రమాదం మొత్తం లోకల్‌బాయ్ నాని చుట్టూనే తిరుగుతోంది. మరి పోలీసులు చివరకు ఏం తేలుస్తారో చూడాలి.
స్కిల్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం..
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన స్కిల్ కేసు మలుపులు మీద మలుపులు తిరుగుతోంది. స్పెషల్ లీవ్ పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం అనేక ప్రశ్నలను లేవనెత్తింది. ముఖ్యంగా హైకోర్టు వ్యవహరించిన తీరుపై అభ్యంతరం చెప్పింది. హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరించిందని ఆరోపిస్తోంది. ట్రయల్ కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా బెయిల్ ఎలా ఇస్తారంటోంది ఏపీ ప్రభుత్వం. కేసు విచారణ కీలక దశలో ఉండగా హైకోర్టు జోక్యం సరికాదని, అయినా ట్రయల్ కోర్టులోని అంశాన్ని హైకోర్టు ఎలా నిర్ధారిస్తుందని ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళింది.
స్కిల్ కేసులో సెప్టెంబర్ 9న చంద్రబాబు అరెస్ట్ కాగా, సెప్టెంబర్ 10 నుంచి అక్టోబర్ 31వరకు రాజమండ్రి జైల్లో ఉన్నారు. అయితే, అనారోగ్య కారణాలతో అక్టోబర్ 31న చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఏపీ హైకోర్టు. 20 రోజుల తర్వాత రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీనిపైనే ఏపీ ప్రభుత్వం అభ్యంతరం చెబుతోంది. ట్రయల్ కోర్టు పరిధిలోని అంశంపై హైకోర్టు జోక్యం ఏంటనేది ఏపీ ప్రభుత్వం వాదన.
ఇదిలాఉంటే.. ఇంకా మద్యం కంపెనీలకు అనుమతుల్లో అక్రమాలు జరిగాయని చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
స్కిల్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం..
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయబోతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన స్కిల్ కేసు మలుపులు మీద మలుపులు తిరుగుతోంది. స్పెషల్ లీవ్ పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం అనేక ప్రశ్నలను లేవనెత్తింది. ముఖ్యంగా హైకోర్టు వ్యవహరించిన తీరుపై అభ్యంతరం చెప్పింది. హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరించిందని ఆరోపిస్తోంది. ట్రయల్ కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా బెయిల్ ఎలా ఇస్తారంటోంది ఏపీ ప్రభుత్వం. కేసు విచారణ కీలక దశలో ఉండగా హైకోర్టు జోక్యం సరికాదని, అయినా ట్రయల్ కోర్టులోని అంశాన్ని హైకోర్టు ఎలా నిర్ధారిస్తుందని ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్తోంది.
స్కిల్ కేసులో సెప్టెంబర్ 9న చంద్రబాబు అరెస్ట్ కాగా, సెప్టెంబర్ 10 నుంచి అక్టోబర్ 31వరకు రాజమండ్రి జైల్లో ఉన్నారు. అయితే, అనారోగ్య కారణాలతో అక్టోబర్ 31న చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఏపీ హైకోర్టు. 20 రోజుల తర్వాత రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీనిపైనే ఏపీ ప్రభుత్వం అభ్యంతరం చెబుతోంది. ట్రయల్ కోర్టు పరిధిలోని అంశంపై హైకోర్టు జోక్యం ఏంటనేది ఏపీ ప్రభుత్వం వాదన.
ఇదిలాఉంటే.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో బాబు ముందస్తు బెయిల్‌పై మంగళవారం విచారణ జరగనుంది. గతంలో ఈ కేసులో హైకోర్టు ఇవాళ్టివరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అంతేకాకుండా ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ విచారణపై సైతం స్టే కొనసాగుతోంది.
మద్యం కంపెనీలకు అనుమతుల్లో అక్రమాలు జరిగాయని చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
యువకుల ఆకస్మిక మరణాలకు కొవిడ్ టీకా కారణం కాదు!
దేశ యువకుల్లో ఆకస్మిక మరణాల ప్రమాదాన్ని కొవిడ్ టీకాలు పెంచాయన్న వాదనలు సరికావని ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) వెల్లడించింది. పోస్ట్ కొవిడ్ హాస్పిటలైజేషన్, లైఫ్స్టైల్, కుటుంబంలో ఆకస్మిక మరణాలు, అప్పటివరకు వెలుగులోకి రాని అనారోగ్యాలు వంటివి కారణమని వివరించింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 47 ఆసుపత్రుల్లో పరిశోధనలు చేసింది. 2021 అక్టోబర్- నుంచి 2023 మార్చ్ మధ్య కాలంలో ఆకస్మికంగా మరణించిన 18-45ఏళ్ల వారి ఆరోగ్య చరిత్రను పరిశీలించింది. వారి కొవిద్ టీకాలు ముందు పరిస్థితులు, అనంతర పరిస్థితులు, కుటుంబంలో ఆకస్మిక మరణాలు, స్మోకింగ్, డ్రగ్స్ అలవాట్లు (మరణానికి 48గంటల ముందు వరకు) వంటి అంశాలపై డేటాను సేకరించింది.
"ప్రస్తుతం స్మోక్ చేస్తున్నారా లేదా? మద్యం తాగుతున్నారా? డ్రగ్స్ తీసుకుంటున్నారా? వంటివి ఆకస్మిక మరణాలకు కారణాలుగా ఉన్నాయి. ఆ అలవాట్లేవీ లేని వారితో పోల్చుకుంటే అలవాట్లు ఉన్న వారు ఆకస్మిక మరణానికి గురయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది," అని ఐసీఎంఆర్ అధ్యయనం పేర్కొంది. కొవిడ్ అనంతరం దేశంలో ఆకస్మిక మరణాలు పెరుగుతున్నాయని, వీరిలో యువకులే ఎక్కువగా ఉన్నారన్న నివేదికలను దృష్టిలో పెట్టుకుని ఈ స్టడీని నిర్వహించింది ఐసీఎంఆర్.
ఆకస్మిక మరణాలకు, కోవిడ్ మధ్య ఏదైనా లింక్ ఉందా? అన్న విషయంపై ప్రస్తుతం క్లారిటీ లేదని ఐసీఎంఆర్ అధ్యయనం వెల్లడించింది. భారత్ యువకుల ఆకస్మిక మరణాలపై ఇప్పటివరకు పెద్దగా దర్యాప్తు జరగలేదని పేర్కొంది.అయితే, కొవిడ్ కారణంగా గుండె సమస్యలు, గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఐసీఎంఆర్ అధ్యయనం వెల్లడించింది. కానీ ఇవి లేకుండా రోగులు ఆకస్మిక మరణానికి గురయ్యే అవకాశాలు చాలా తక్కువని స్పష్టం చేసింది.
మణిపూర్లో ‘యూఎఫ్ఓ’ కలకలం..
రఫేల్ జెట్స్ గాలింపు
మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో యూఎఫ్ఓ (అన్ఐడెంటిఫైడ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్) గురుపట్టని ఎగిరే వస్తువు కనిపించిందని, దీంతో భారత ప్రభుత్వం రఫేల్ యుద్ద విమానాలను పంపిందని సోషల్ మీడియోలో దృశ్యాలు హల్ చెల్ చేస్తున్నాయి.
మణిపూర్ రాజధాని ఇంఫాల్ ఎయిర్పోర్ట్కు సమీపంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు ఒక యూఎఫ్ఓ కనిపించిందని వార్తలు వచ్చాయి. దీంతో పలు కమర్షియల్ ఫ్లైట్స్ రాకపోకలకు ఇబ్బంది కలిగింది. కొంతసేపటి తర్వాత.. విమానాల కార్యకలాపాలు యథాతథంగా కొనసాగాయి. మణిపూర్లో యూఎఫ్ఓ కనిపించిందన్న వార్తతో.. అక్కడికి సమీపంలోని ఓ ఎయిర్బేస్ నుంచి రెండు రఫేల్ విమానాలు గాలింపు చర్యలు చేపట్టాయని రక్షణ శాఖ అధికారి మీడియాకు చెప్పినట్లు సమాచారం. "రఫేల్లో అడ్వాన్స్డ్ సెన్సార్లు ఉన్నాయి. యూఎఫ్ఓలు కనిపించాయని చెబుతున్న ప్రాంతంలో రఫేల్ విమానాలు గాలింపు చర్యలు చేపట్టాయి. కానీ అక్కడ వాటికి ఏం కనిపించలేదు," అని ఆ డిఫెన్స్ అధికారి వెల్లడించారు.
భారత వాయుసేనకు చెందిన ఈస్టెర్న్ కమాండ్ తాజా పరిణామాల మధ్య ఒక కీలక ప్రకటన చేసింది"ఇంఫాల్ విమానాశ్రయం నుంచి అందిన విజువల్ ఇన్పుట్స్ ఆధారంగా ఎయిర్ డిఫెన్స్ రెస్పాన్స్ సిస్టెమ్ని యాక్టివేట్ చేశాము. ఆ తర్వాత.. యూఎఫ్ఓగా చెబుతున్న ఆ చిన్న పరికరం.. కనిపించలేదు," అని ట్వీట్ చేసింది.
ఇలాంటి వార్తలు ఎక్కువగా అమెరికాలో వినిపిస్తుంటాయి. ఆరు నెలల క్రిందట ఒక పెద్ద బెలూన్ వచ్చిందని, మొదట అంతుబట్టని ఎగిరే వస్తువుగా దానిని భావించినప్పటికీ ఆపై చైనా నిఘా బెలూన్ గా గుర్తించి పేల్చివేశామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
బంగాళాఖాతంలో అల్పపీడనం భారీ వర్షాలు
నేడు కృష్ణా, బాపట్ల, అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది.
బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్, పరిసర ప్రాంతాల్లో ఈనెల 25న తుఫాను ఆవర్తనం చెందే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 26 నాటికి ఆ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడవచ్చని వెల్లడించింది. అనంతరం ఇది పశ్చిమ - వాయువ్య దిశగా ప్రయాణించి ఈశాన్య బంగాళాఖాతం, అండమాన్ పరిసరాల్లో ఈ నెల 27 నాటికి వాయుగుండంగా బలహీన పడుతుందని పేర్కొంది.
తమిళనాడు, కేరళ పరిసరాల్లో సముద్రమట్టానికి 3.1 కిలో మీటర్ల ఎత్తులో మరో తుఫాను ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిస అవకాశం ఉందని వెల్లడించింది. ఈ ప్రభావంతో మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణాను అప్పులపాలు చేశారు
కోదండరాం ఆవేదన
పనిరాని పథకాలతో లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. రూ.30 కోట్లతో పూర్తయ్యే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.1.50 లక్షల కోట్లకు పెంచి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని పేర్కొన్నారు.
ఈ ఎన్నికలు తెలంగాణ ఆత్మగౌరం, సీఎం కేసీఆర్అహంకారానికి మధ్య జరుగుతున్నాయని టీజేఎస్ ఛైర్మన్ కోదండరాం అన్నారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించి ఫామ్ హౌస్ కే పరిమితం చేయాలని ప్రజలను కోరారు. తెలంగాణ పీపుల్స్ జేఏసీ, తెలంగాణ సమాఖ్య-జాగో తెలంగాణ, భారత్ బచావో సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటరు చైతన్య కార్యక్రమంలో పాల్గొన్నారు.
1200 మంది బిడ్డల ప్రాణ త్యాగలతో వచ్చిన తెలంగాణ ఈ రోజు కేసీఆర్ కుటుంబ పాలనలో బంధి అయిపోయిందని కోదండరాం ఆవేదన వ్యక్తం చేసారు. ప్రశ్నించే గొంతులను ఆయన నొక్కేస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైన్ సరిగా లేదని చెప్పినందుకే తనపై కక్ష సాధించారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులతో ఆడుకుంటుందని మండిపడ్డారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుండా పదేళ్లుగా నిరుద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. పేపర్ లీకేజీలపై ఒక్కమాట కూడా మాట్లాడని మంత్రి కేటీఆర్.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే నోటిఫికేషన్లు వేస్తామనడం సిగ్గుచేటన్నారు. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించి కేసీఆర్తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ మాయ మాటలు నమ్మి ఓటు వేస్తే మరో ఐదేళ్లు తిప్పలు తప్పవని హెచ్చరించారు.
తెలంగాణాలో ప్రియాంక గాంధీ సుడిగాలి పర్యటన
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచార జోరును పెంచారు. ఇప్పటికే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మల్లిఖార్జున ఖర్గే లాంటి కాంగ్రెస్ అగ్రనేతలు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, మరోసారి ప్రియాంక గాంధీ తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు నవంబరు 24న రానున్నారు.
మూడు రోజుల్లో పది నియోజక వర్గాల ప్రచార సభల్లోనూ, ర్యాలీల్లోనూ పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఈ నెల 24వ తేదీన ఉదయం 11 గంటలకు పాలకుర్తి, మధ్యాహ్నం 2 గంటలకు హుస్నాబాద్, సాయంత్రం 4 గంటలకు ధర్మపురి, 25వ తేదీన పాలేరు, ఖమ్మం, వైరా, మధిర నాలుగు నియోజక వర్గాలల్లో ప్రచారం నిర్వహిస్తారు. 25 రాత్రికి ఢిల్లీ వెళ్లనున్న ప్రియాంక గాంధీ, 27ఉదయం తిరిగి వస్తారు. ఉదయం 11 గంటలకు మునుగోడు, మధ్యాహ్నం 2 గంటలకు దేవరకొండ, 4 గంటలకు గద్వాల్ ప్రచార సభల్లో ప్రయాంక గాంధీ పాల్గొని ప్రచారం చేస్తారు.
రాహుల్ గాంధీ పర్యటన వివరాలు:
నవంబర్ 24 నుంచి 26వ తేదీ వరకు రాహుల్ గాంధీ తెలంగాణాలో ప్రచారం నిర్వహించనున్నారు. 24న జుక్కల్, మెదక్, తాండూరు, ఖైరతాబాద్‌లల్లో రాహుల్ గాంధీ ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరనున్నారు రాహుల్. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ గ్యారంటీలు, మేనిఫెస్టోను ప్రజలకు మరింతగా వివరించనున్నారు.
ఇప్పటికే ఈ ముగ్గురు రాష్ట్రంలో పర్యటించి కాంగ్రెస్ తరుఫున పోటీ చేస్తున్న అభ్యర్దులను గెలిపించాలని కోరారు. నవంబర్ 19న కొమురం భీం ఆసిఫాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభలో పాల్గొన్న ప్రియాంక గాంధీ.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండు లక్షలు ఉద్యోగాలు తీస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు, బీఆర్ఎస్, బీజేపీలపైనా విమర్శలు గుప్పించారు.
రానున్న మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
రానున్న మూడురోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తెలంగాణలోని ఎన్నికల ప్రచారానికి అంతరాయం ఏర్పడే అవకాశాలున్నాయి.
హైదరాబాద్ నగరంలోని ఆరు జోన్లు చార్మినార్, ఖైరతాబాద్, కూకట్ పల్లి, ఎల్బీనగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి పరిధిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం వేళల్లో నగరంలో పొగమంచు వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
హైదరాబాద్ నగరంలో కనిష్ట ఉష్ణోగ్రత 18-20 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత 30-32 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్లడించింది.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు గాలులలో సగటు సముద్ర మట్టం వద్ద నుండి ఏర్పడిన ద్రోణి శ్రీలంక నుంచి నైరుతి, ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోంది. తమిళనాడు తీరానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టము నుంచి 3.1 కి.మీ ఎత్తు వరకు ఉన్న ఉపరితల అవర్తనము కొనసాగుతోంది. వీటి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Contact the business
Telephone
Website
Address
6-45/1
Guntur
522237
Opening Hours
Monday | 8:30am - 9pm |
Tuesday | 8:30am - 9pm |
Wednesday | 8:30am - 9pm |
Thursday | 8:30am - 9pm |
Friday | 8:30am - 9pm |
Saturday | 8:30am - 9pm |
Sunday | 8:30am - 9pm |
AURANDALPETA 4/5TH LINE OPPOSITE HELP HOSPITAL
Guntur, 522002
We Do Best Service in SOCIAL MEDIA,WEB SITES,INSTAGRAM,SEO,YOUTUBE
14/3, Arundelpet
Guntur, 522002
మా ఈ పేజీ లో రాజకీయ సందడిలో జరిగే ఘటనలు, సినిమా, సంగీతం గురించి ఉంటాయి
S NO-120 , 2ND FLOOR, ANNAPURNA WHOLE SALE CLOTH MARKET, OPPOSITE PADMAJA PETROL BANK, KAKANI Road
Guntur, 522001
SOCIAL MEDIA AGENCY
Bharath Pet 0 Line, Sri Nagar Colony
Guntur, 522002
Desham TV is a newly emerged satellite channel in the galaxy of media for all the Telugu people wherever they reside.
2-76/1 Vejendla Guntur
Guntur, 522213
270* Digital Media Startup helping businesses and startups to grow their digital presence.