Dr.B.R Ambedkar Jashuva Pule Periyar Literature Foundation

SYAM

16/12/2022
11/11/2022

మిత్రులకు ఆహ్వానం
సామాజిక తత్వవేత్త *పోతులూరి వీరబ్రహ్మం.- తాత్వికత* అంశం పై బ్రాడీపేటలోని సి. పి. ఎం. జిల్లా కార్యాలయంలో నవంబర్ 5వ తేది *శనివారం సాయంత్రం 5 గంటలకు* సెమినార్ జరుగును. ఈ సెమినార్ లో *పోతులూరి వీరబ్రహ్మం 8వ తరం ముని మనవడు నొస్సం వీరభద్ర స్వామి,* గౌరవ శాసనమండలి సభ్యులు, దళిత బహుజన ఉద్యమ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొంటారు.
కావున మీరు తప్పనసరిగా హాజరు కావాలని కోరుతున్నాము.

నిర్వాహులు
బి. విల్సన్, బి.శ్యాంబాబు
*డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - జాషువా - పెరియార్ - పూలే ఫౌండేషన్, గుంటూరు.*

Photos from Dr.B.R Ambedkar Jashuva P**e Periyar Literature Foundation's post 08/11/2022
17/07/2022

అచ్చ గిరిజన కవిత్వం దుర్ల

ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాదరావు

అచ్చ గిరిజన కవిత్వం దుర్ల అని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాదరావు అన్నారు. ఆదివారం ఉదయం నగరంలోని ఓ హోటల్లో
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ - జాషువా - పెరియార్ - పూలే లిటరేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుర్ల కవితా సంపుటి ఆవిష్కరణ జరిగింది. కవి బి.విల్సన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి బి.శ్యాoబాబు మోడరేటర్ గా వ్యవహరిoచారు.
దుర్ల కవితా సంపుటిని విరసం నాయకులు సి ఎస్ ఆర్ ప్రసాద్, అరసం నాయకులు పెనుగొండ లక్ష్మీనారాయణ, సామాజిక న్యాయవాది పలుకూరి ప్రసాద్, ఆంధ్రా మేధావుల ఫోరం కో కన్వీనర్ తాటికొండ నరసింహారావులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాదరావు మాట్లాడుతూ అచ్చమైన గిరిజన కవిత్వం దుర్ల అన్నారు. దుర్ల కవిత్వాన్ని రాసిన మల్లీపురం జగదీష్ స్వయంగా గిరిజనుడు కావడం కవిత్వానికి మరింత వన్నె తెచ్చిందన్నారు. అరసం నాయకులు పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ దుర్ల వంటి మంచి కవిత్వాన్ని రాసినకవి తన శిష్యుడు కావడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. విరసం నాయకులు సి.ఎస్. ఆర్. ప్రసాద్ మాట్లాడుతూ సమాజ విస్మరణకు గురవుతున్న గిరిజనులు పోరాటాలతో తమ ఉనికిని చాటుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్యం దినపత్రిక సంపాదకులు చల్లా మధుసూదన్ రావు,
సీనియర్ పాత్రికేయులు బండారు సురేష్, మనసు ఫౌండేషన్ సభ్యులు పారా అశోక్, హైకోర్టు సీనియర్ న్యాయవాది సంజీవరెడ్డి మార్పుల, కవులు ఎస్.ఎం.సుభాని, మస్తాన్ వలి, భీమ్ సేనా సేవా దళ్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపు నీలాంబరం, కాపు శ్రీనివాస్, దళిత బహుజన పరివర్తన సంఘం నాయకులు జొన్నలగడ్డ శ్రీకాంత్
యువ న్యాయవాది వీర మణీoద్ర పాల్గొన్నారు.

Photos from Dr.B.R Ambedkar Jashuva P**e Periyar Literature Foundation's post 23/05/2022

పరువు హత్యలు నాగరిక సమాజానికి మాయని మచ్చ
ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్యవర ప్రసాద్, కేఎస్ లక్ష్మణరావు

సమాజంలో ఇటీవలి
కాలంలో పెరిగిపోయిన పరువు హత్యలు నాగరిక సమాజానికి మాయని మచ్చ అని ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్య వరప్రసాద్, కేఎస్ లక్ష్మణరావులు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - జాషువా - పెరియార్ - పూలే లిటరేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్రాడీపేటలోని మద్రాస్ కాఫీ హోటల్లో చితి పుస్తకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి కవి బి.విల్సన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్య వరప్రసాద్, కేఎస్ లక్ష్మణరావులు మాట్లాడుతూ ఇటీవల పెరుగుతున్న పరువు హత్యలు నాగరిక సమాజానికి మాయని మచ్చని ఆవేదన వ్యక్తం చేశారు. పరువు హత్యలు నేపథ్యంగా ప్రముఖ రచయిత పెరమాల్ మురుగన్ రచించిన చితి పుస్తకాన్ని ఆవిష్కరించడం సందర్భోచితంగా ఉందన్నారు. పరువు హత్యలను నివారణకు ప్రత్యేక చట్టాలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, కవి పాపినేని శివశంకర్ మాట్లాడుతూ పరువు హత్యల్లో ఎక్కువ భాగం చిన్న కులాలవారే హత్యలు గావించ బడుతున్నారని వివరించారు. అభ్యుదయ రచయితల సంఘం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అగ్ర కుల ఉన్మాద హత్యలు పరువు హత్యలుగా చిత్రీకరించబడటం దారుణమన్నారు. సభ్య సమాజం మొత్తం పరువు హత్యలను ముక్త కంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కార్యదర్శి బీ.శ్యాంబాబు, డాక్టర్ డి.సిహెచ్.అంజయ్య, కాపు శ్రీనివాస్, కన్న విద్యా సంస్థల డైరెక్టర్ కన్న మాస్టారు, ఎవి ఫౌండేషన్ అధ్యక్షులు అన్నవరపు నాగమల్లేశ్వరరావు, మధు తదితరులు పాల్గొన్నారు.

10/04/2022

దేశ భవిష్యత్తు డాక్టర్ అంబేద్కరే
అద్వితీయుడు పుస్తకావిష్కరణలో డొక్కా మాణిక్య వరప్రసాద్

దేశ భవిష్యత్తు డాక్టర్. ఆర్.అంబేద్కర్ మాత్రమేనని ఎమ్మెల్సీ మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ పేర్కొన్నారు ఆదివారం ఉదయం 11 గంటలకు ఏసీ కాలేజ్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ భవన్లో అంబేద్కర్ జాషువా పూలే పెరియార్ లిటరేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన అద్వితీయుడు పుస్తకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ అధ్యక్షుడు శ్యాంబాబు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ డొక్కా మాట్లాడుతూ దేశ భవిష్యత్తు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మాత్రమేనన్నారు. దేశభక్తి అంటే ఇతర మతస్తులను వ్యతిరేకించడం కాదని దేశ రాజ్యాంగాన్ని ప్రేమించడమే అన్నారు కానీ దురదృష్టవశాత్తు మైనారిటీ మతాలను చిన్న కులాలను అణగదొక్కడమే దేశ భక్తి గా ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మరో అతిథి ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ అంబేద్కర్ గొప్ప దేశభక్తుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కవి, పాత్రికేయుడు బి.విల్సన్, జడ్జి జస్టిస్ జేసుదానం,
ఐఆర్ఎస్ అధికారి jబి.రాజేశ్వరరావు
కన్న విద్యా సంస్థల డైరెక్టర్ కన్న మాస్టారు, డాక్టర్ డి.సిహెచ్.అంజయ్య, నాగార్జునా యూనివర్సిటీ ప్రొఫెసర్ వి.అంజిరెడ్డి పాల్గొన్నారు.

07/04/2022

అద్వితీయుడు పుస్తకావిష్కరణ

ఈనెల 10వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు గుంటూరు నగరంలోని అంబేద్కర్ భవన్లో అంబేద్కర్ - జాషువా - పూలే - పెరియార్ లీటరేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో
అద్వితీయుడు(అంబేద్కర్ స్మారకోపన్యాసాల సంకలనం) పుస్తకావిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. కవి, జర్నలిస్ట్ బి.విల్సన్ మోడరేటర్ గా వ్యవహరించనున్న ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ అధ్యక్షులు బి.శ్యాంబాబు అధ్యక్షత వహిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాదరావు, విశిష్ట అతిథులుగా ఐఆర్ఎస్ అధికారి బి.రాజేశ్వరరావు, ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు, ఇండియన్ లేబర్ పార్టీ రాష్ట్ర నాయకులు పిల్లి శ్యాం ప్రసాద్, ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ, కన్న విద్యా సంస్థల డైరెక్టర్ కన్న మాస్టారు, డాక్టర్ డి.సిహెచ్.అంజయ్య, నాగార్జునా యూనివర్సిటీ ప్రొఫెసర్ వి.అంజిరెడ్డి పాల్గొంటారు.

Photos from Dr.B.R Ambedkar Jashuva P**e Periyar Literature Foundation's post 05/04/2022

అచంచల దేశభక్తుడు, అభివృద్ధి కాముకుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్

మాజీ మంత్రి, శాసనమండలి సభ్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్.

స్వాతంత్ర సమరయోధునిగా, ఐదు దశాబ్దాల సుదీర్ఘ పార్లమెంటేరియన్ గా, ఉప ప్రధాని గా, కీలక శాఖల మంత్రిగా పనిచేసిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అచంచల దేశభక్తుడు, సమాజ అభివృద్ధి కాముకుడని రాష్ట్ర మాజీ మంత్రి శాసనమండలి సభ్యులు డొక్కా మాణిక్యవరప్రసాద్ పేర్కొన్నారు.

పీడిత జననాయకుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి సందర్భంగా స్థానిక విజ్ఞాన మందిరం ఎదురు గా ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ రాజకుమారి, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్ రావు, శాసనసభ సభ్యులు కిలారు వెంకట రోశయ్య, శాసన మండలి సభ్యులు కేఎస్ లక్ష్మణరావు, మద్య నియంత్రణ అమలు కమిటీ చైర్మన్ V లక్ష్మణ్ రెడ్డి, మిర్చి యార్డు అధ్యక్షులు చంద్రగిరి ఏసురత్నం, జి డి సి సి బ్యాంక్ అధ్యక్షులు లాల్ పురం రాము, పలు దళిత ప్రజా సంఘాల నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర హోమ్, రక్షణ, రైల్వే, వ్యవసాయ, విద్య, వంటి అనేక కీలక శాఖల మంత్రిగా ఆయన వేసిన పునాదులు నేడు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు మెజారిటీ ప్రజల మన్ననలు పొందుతున్నాయని చెప్పారు.

కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాకుమాను పున్నారావు, దాసరి జాన్ బాబు, పచ్చల ఆనందరావు, అత్తోట జోసఫ్, గనిక ఝాన్సీ రాణి, మేడిద బాబురావు, మాదిగ జన సేవా సమితి అధ్యక్షులు పీ మోహన్ రావు, కార్యదర్శి P సత్య రాజ్ తదితరులు పాల్గొన్నారు

02/04/2022

అందరూ ఆహ్వనితులే

Want your organization to be the top-listed Non Profit Organization in Guntur?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address

Guntur
Other Nonprofit Organizations in Guntur (show all)
Janaprabhanjanam Samajika Seva Samstha Janaprabhanjanam Samajika Seva Samstha
Guntur, 522004

Serve The Needy...

UPF Silver Jubilee Celebrations UPF Silver Jubilee Celebrations
Gundarao Pet
Guntur, 522OO4

యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ - గుంటూరు రజతోత్సవ సంబరాల వేదిక

DANA Foundation DANA Foundation
Dr. No 25-22-493/90, Ramaiah Nagar
Guntur, 522004

We dream, and work with infallible determination and purpose towards achieving a brighter tomorrow. We determine to work towards establishment of old age homes, Orphanages. We also...

Amma Charitable Trust - Guntur Amma Charitable Trust - Guntur
Nallapadu-Guntur Road
Guntur, 5220004

AMMA CHARITABLE TRUST,Guntur was established by Sri Swamy Gnana Prasanna Giri with the holy blessings and support of all the human beings in the year 1994 for giving best services ...

Swéccha Swéccha
Guntur, 522019

Swéccha is a group formed by few MBBS students, which aims at organizing Free Medical Camps for school students majorly from backward areas and government schools.

guntur serve the needy guntur serve the needy
Guntur
Guntur

SOCIAL SERVICE

Indian Red Cross Society  Guntur District Branch Indian Red Cross Society Guntur District Branch
ZP Compound
Guntur, 522004

The Indian Red Cross Society (IRCS) is a voluntary humanitarian organization to protect human life and health based in India. It is part of the International Red Cross and Red Cres...

Shree Raja Mathangeeshwaree P*etham Shree Raja Mathangeeshwaree P*etham
Koyavari Street
Guntur, 522017

Welcome to the Official Page of Shree Raja mathangeeshwaree P*etham. Shree Raja Mathangeeshwaree P*e

Bishop chowdari chukka  organization and Orphanage Bishop chowdari chukka organization and Orphanage
Guntur, 522004

Bishop chowdari chukka Orphanage and organization

The Advent Cry The Advent Cry
Seventh Day Adventist Church
Guntur

The Advent Cry Media Ministry aims to proclaim the final message, to the Church aided by the Latter

KVPS Guntur KVPS Guntur
Brodipet
Guntur

ఆత్మగౌరవం సమానత్వం కుల నిర్మూలన పోరాటాలు వర్ధిల్లాలి

USHA foundation USHA foundation
Guntur

#donate_and_share, Every_single_rupee_matters. #giving_is_not_just_make_a donation, it's_about_making a difference. #give_of_your_hands _to serve_and_your_hearts_to_love. ...