పద్మశాలి కుటుంబం

ఈ పేజీ కేవలం పద్మశాలి కులస్తులకొరకె

07/07/2023

నిన్న ధర్మవరం చేనేత
రేపు?
ఇటువంటివి చూస్తూ ఉండాలా?
ఇది మొత్తంగా #చేనేతరంగం మీద జరిగిన దాడిగా భావించాలి...
బడా బడా #వస్త్రవ్యాపారస్తులు బకాయిలు ఇవ్వడంలేదు... నెలలు గడిచిపోతున్నాయి...
డబ్బులు ఇవ్వడం లేదు... అడిగినందుకు ఇదిగో ఇలా...
బడా వస్త్రవ్యాపారస్తుల దగ్గర నిలిచిపోయిన బకాయిలు ఊర్లలోని #చేనేతవ్యాపారస్తుల(మాస్టర్ వీవేర్స్ )కు వస్తేనే...
మాలాంటి చేనేత కార్మికులకు డబ్బులు ఇవ్వగలరు...
బడా వస్త్రవ్యాపారస్తులు ఇవ్వడంలేదు...
తద్వారా మాకు ఇవ్వడంలేదు...
ప్రస్తుతం చేనేతరంగాన్ని నమ్ముకున్న మాలాంటివాళ్లకు పూటగడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది...
సాధ్యమైనంత వరకు పట్టు&జరీ ఇతరత్రా ముడిసరుకుల కోసం అప్పులు చేసేసాము... ఇక అప్పులు పుట్టవు... కాబట్టి పనులు సగానికి తగ్గిపోయాయి...
రావాల్సినచోట డబ్బులు రావట్లేదు... పైగా పనులు లేవు... చేతులలో డబ్బులు లేవు... తద్వారా చేనేతల పరిస్థితి దయనీయంగా మారిపోయింది...
పూట గడవక చాలామంది చేనేతను పక్కనబెట్టి వేరువేరు పనులకు వెళ్తున్నారు 😢😢
ఇది ఒక్క ధర్మవరం వ్యాపారులకే కాదు... అందరి పరిస్థితి ఇలాగే ఉంది... కొన్ని బయటపడలేదు అంతే...
వాళ్ళని నిర్బంధించి గుడ్డలూడదీయడం అంటే... మొత్తం #చేనేతరంగానికే జరిగిన అవమానంగా భావించాలి
ధర్మవరంలో పట్టు చీరల వ్యాపారస్తు లను సిల్క్ హౌస్ యజమానులను ఈ విధంగా చేయడం చాలా బాధాకరమైన విషయం.
ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలంటే #ఆలయ #సిల్క్స్ అధినేత #అవినాష్ గుప్తా* ఈ విధంగా అవమానపరిచి వీడియోలు వైరల్ చేసి ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరి న్యాయ పరంగా వారి మీద క్రిమినల్ కేసు పెట్టి పోలీసులు వెంటనే అరెస్ట చేస్తే తప్ప రేపు పొద్దున మన ధర్మవరం లో ఇంకొకరికి ఈ పరిస్థితి రాకుండా ఉంటుంది..

Photos from పద్మశాలి కుటుంబం's post 26/06/2023

ప్రతి పద్మశాలి బిడ్డలు అందరూ like అండ్ share చేయండి...
పద్మశాలి కుల బాంధవులారా... అందరికీ నమస్కారాలు. క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రిక బ్యూరో చీఫ్ , మన పద్మశాలి ముద్దుబిడ్డ ఆనంద్ కుమార్ నేతపై దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ గారి ప్రోద్బలంతో, దేవరకొండ డి.ఎస్.పి ఆదేశాల మేరకు చింతపల్లి పోలీసులు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద బూటకపు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడు బీసీ సామాజిక వర్గానికి ఐలయ్య యాదవ్. ఒక యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మన పద్మశాలి బిడ్డపై ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం కింద కేసు ఎలా నమోదు చేస్తారు. ఈ అక్రమ కేసు నమోదు ను మనమంతా మూకుమ్మడిగా ఖండించాలి. ఆనంద్ కుమార్ నేతకు అండగా నిలవాలి. ఆనంద్ కుమార్ నేతపై కొంతమంది ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో దూషిస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నారు.ఎమ్మెల్యే
రవీంద్ర కుమార్ గారు ఆయన అనుచరుల చేత ఆనంద్ కుమార్ నేతకు ప్రాణహాని ఉన్నది. పోలీసులు తక్షణమే ఆయనకు భద్రతను కల్పించాలి. ఈ విషయంలో పద్మశాలి కుల పెద్దలు జోక్యం చేసుకొని ఆనంద్ కుమార్ నేతకు అండగా నిలిచేందుకు కృషి చేయాలని కోరుతున్నాం.

15/06/2023
Photos from పద్మశాలి కుటుంబం's post 03/05/2023

#ఆగస్ట్ 7న ఛలో ఢిల్లీ

#సేలం ర్యాలీలో వెంకన్న నేత పిలుపు

#జీరో జీఎస్టీ ఉద్యమానికి మద్దతుగా తమిళనాడు పద్మశాలి సంఘం తీర్మానం

#పద్మశాలి మహసంగమ సభలో పాల్గొన్న వివిధ రాష్ట్రాల ప్రతినిధులు

#మహా ప్రదర్శనకు వివిధ పార్టీల జాతీయ నాయకులు - కందగట్ల స్వామి



#జీరో జీఎస్టీ సాధనకై ఆగస్టు 7వ తేదీన ఢిల్లీలో జరిగే మహా ప్రదర్శనకి దేశవ్యాప్తంగా పద్మశాలి మరియు చేనేత అనుబంధ కులాలు వేలాదిగా తరలిరావాలని ఈరోజు తమిళనాడు, సేలంలో జరిగిన పద్మశాలి మహా సంగమ ర్యాలీలో జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త, అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం జాతీయ అధ్యక్షులు *యర్రమాద వెంకన్న నేత* పిలుపునిచ్చారు. చేనేత పై ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పన్నులు వేయడం దారుణమన్నారు. గత 17 నెలల ఉద్యమాన్ని ఆయన వివరించారు. ఢిల్లీలో జరిగే మహా ప్రదర్శనకు వివిధ పార్టీల జాతీయ నాయకులు హాజరవుతున్నారని అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి తెలిపారు. ఈ సందర్భంగా జీరో జీఎస్టీ ఉద్యమానికి మద్దతుగా తమిళనాడు పద్మశాలి సంఘం తీర్మానం చేసింది. తమిళనాడు రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు రవీంద్రన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రవేశపెట్టిన పలు తీర్మానాలను సభలోని వేలాది మంది పద్మశాలీలు ఎకగ్రీవంగా ఆమోదించారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి కొక్కుల దేవేందర్, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి చిలువేరు సునీత, ఇంజనీర్స్ విభాగం అధ్యక్షుడు పుట్టా పాండు రంగయ్య, కార్యదర్శి నక్క వేణుమాధవ్, కర్నాటక అధ్యక్షుడు జగదీష్, కేరళ కార్యదర్శి సుధాకరన్, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షుడు మచ్చ ప్రభాకర్ రావు, కోస్తాంధ్ర అధ్యక్షుడు జీ.వి. నాగేశ్వర రావు, తమిళనాడు నాయకులు తంగరాజన్, వేంకటాచలపతి. వరల్డ్ వీవర్స్ ఆర్గనైజషన్ సౌత్ ఇండియా ఇంఛార్జి సేతుపతి, రమేష్, గోవిందరాజన్, మహారాష్ట్ర నాయకులు సంకు సుధాకర్, చిలువేరు పురుషోత్తం, ఉమా, హేమలత తదితరులు పాల్గొన్నారు.

25/04/2023

🏏 క్రికెట్ క్రీడా ప్రపంచానికి రారాజు ప్రపంచ దిగ్గజం శ్రీ సచిన్ టెండూల్కర్ కి సిరిసిల్ల #నేతన్నలు ఈ విధంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 💐🤝🎂

Photos from పద్మశాలి కుటుంబం's post 09/04/2023

నేడు తెనాలిలో అఖిలభారత పద్మశాలి సంఘ అనుబంధ సంస్థ కోస్తా ఆంధ్ర పద్మశాలి సంఘ అధ్యక్షులు #జీ_వి_నాగేశ్వరరావు గారి అధ్యక్షతన రాష్ట్ర కార్య వర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కోస్తా ఆంధ్ర పద్మశాలి సంఘ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అన్ని జిల్లాల అధ్యక్షులు ప్రదా ప్రధాన కార్యదర్శిలు పాల్గొన్నారు...

మీటింగ్ ఎజెండా :

1. అఖిల భారత పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు కీ॥శే॥ జి. రామ్మూర్తి, కోస్తా ఆంధ్ర పద్మశాలి సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి కీ॥శే॥ గుర్రం గాంధీ తదితరులకు నివాళులు అర్పించుట.
2 . అఖిల భారత పద్మశాలి సంఘంలో వివిధ పదవులలో నియమితులైన నాయకులను పరిచయం చేయుట.
3.జిల్లా కమిటీల అధ్యక్ష ప్రధాన కార్యదర్శిలను పరిచయం చేయుట.

4. గత సమావేశపు తీర్మానాలపై సమీక్ష.
5. చేనేతపై '0' జియస్ ఉద్యమంలో మన సంఘం వహించిన పాత్రపై చర్చించుట.
6. ఆగష్టు 7న గౌ॥ ప్రధానమంత్రి వారికి చేనేత మహావస్త్ర లేఖ సమర్పణ మహాప్రదర్శన గురించి.
7. జిల్లా కమిటీలు ఏర్పాటు కాని వాటి గురించి.
8. సంఘ జమాఖర్చుల గురించి చర్చించుట.
9. కమిటీ కార్యవర్గాలకు సభ్యత్వం ఇచ్చుట గురించి.
10. సంఘానికి నిధులు సమకూర్చుట గురించి.
11. మహాసభ ఏర్పాటుకు తేదీ ఖరారు చేయుట.
12. చేనేత సమస్యలు గురించి చర్చించి, ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించుట.
13. అధ్యక్షుని అనుమతితో ఇతర విషయములు గురించి.

24/03/2023

Congrats medam

Photos from పద్మశాలి కుటుంబం's post 17/03/2023

ఓ చేనేత కుటుంబ దీన స్థితి జనగామ జిల్లా వీవర్స్ కాలనీలో చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గుండు నాగేష్ లతకు ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు చేనేతను నమ్ముకుని చేనేత పై ఆధారపడి కుటుంబాన్ని నెట్టుకు వస్తూ ఒకవైపు ఖర్చులు మరొకవైపు ఎదిగిన ముగ్గురు కూతుర్లు చేనేతపై అంతంత వస్తున్నటువంటి తనకు ఆదాయంతో కూతుర్ల పెళ్లి కోసము తనకున్న చిన్నపాటి ఇల్లును కూడా అమ్ముకొని కూతుర్ల ఇద్దరికీ పెళ్లి చేసి చేనేతను నమ్ముకుని గౌరవంగా బతుకుతూ ఏనాడూ ఎవరిని చెయ్యి చాపని అడగని గుండు నాగేష్ గత పది సంవత్సరాల క్రితం పూర్తిగా చేనేత సంక్షోభంలో ఉన్నప్పుడు ఫుట్ పాత్ మీద చిన్న వ్యాపారం చేసుకుని కుటుంబాన్ని పోషించాడు మళ్లీ చేనేతకు ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇక్కత్ సారీ డిజైన్లతో పూర్వవైభవం రావడంతో గత ఎనిమిది సంవత్సరాల నుంచి తన భార్యకు చేనేత మొగ్గాన్ని నేర్పి భార్యాభర్తలు ఇద్దరూ కిరాయి ఇంటిలో మగ్గాలు నేర్చుకుంటూ కూతుర్ల పెళ్లిల బాకీలు తెంపుకుంటూ జీవనం సాగిస్తున్న క్రమంలో రెండు కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో చేతిలో పని ఉండి కూడా ఆరోగ్యం సహకరించక హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా పూర్తిగా చితికిపోయిన కుటుంబాన్ని ప్రతి ఒక్కరు పెద్ద మనసు చేసుకొని ఆదుకోవాలని గుండు నాగేష్ భార్య గుండు లత రెండు చేతులెత్తి ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తూ చేనేత కార్మికులు పద్మశాలి కుల బాంధవులు ఈ కుటుంబానికి అండగా ఉందామని కోరుకుంటూ భారతి సొసైటీ అధ్యక్షుడు గుర్రం నాగరాజు కౌన్సిలర్ గుర్రం భూలక్ష్మి గారు చేనేత కార్మిక నాయకులు యెనగందుల కృష్ణ నేత మరియు కాముని వేణు చిద్దిరాల గణేష్ ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తూ ఆ కుటుంబానికి ఎవరికి తోచిన విధంగా వారు సహాయం చేద్దామని విజ్ఞప్తి వీవర్స్ కాలనీ జనగామ జిల్లా

25/01/2023

కొత్తరెడ్డి పాలెం, చేబ్రోలు మండలం, గుంటూరు జిల్లా, లోని పద్మశాలి బహుత్తమ సేవా సంగము మరియు గ్రామ పద్మశాలి కులస్థులందరిచే శ్రీ భద్రవతి సమేత భావనఋషీ స్వామి వారి దేవాలయ పుననిర్మాణ సందర్భంగా తేదీ 26-01-2023 నుండి 28-01-23 వరకు శ్రీ మహాగణపతి, శ్రీ సుబ్రహ్మణేశ్వర, పులివాహన, జీవధ్వజ, విమాన కలశ సహిత శ్రీ భద్రావతి సమేత శ్రీశ్రీశ్రీ భావనాఋషి స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం జరుగుతుంది కావున మన పద్మశాలి కులబందువులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంత చేయాల్సిందిగా ప్రార్ధన.... జై పద్మశాలి జైజై పద్మశాలి

గమనిక : ఎవరైనా విరాళాలు దాతలు. తమ పెరు. ఊరి పెరు comment చెయ్యండి

21/11/2022

*ఉమ్మడి ఆంధ్రప్రదేశ్* ఉద్యోగ సంఘ
నేతగా సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలు చేసి వారి డిమాండ్లను సాధించిన గొప్ప *ఉద్యోగ సంఘ నాయకులు జీని రామూర్తి గారు.* పదవీ విరమణ అనంతరం పద్మశాలీలను ఏకంచేసి అఖిల భారత పద్మశాలి సంఘ అధ్యక్షుడిగా సంఘాన్ని నడిపిన ఆదర్శ నాయకులు.
వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ రథసారధిగా చారిత్రాత్మక ఉద్యమాలు చేసిన *చేనేతల మహా నాయకుడు*
కో - ఆపరేటివ్ బ్యాంకింగ్ రంగంలో నూతన ఒరవడి సృష్టించి భావనాఋషి కో - ఆపరేటివ్ బ్యాంక్ ను ఏర్పాటు చేసి చైర్మన్ గా చేనేతలకు రుణ సౌకర్యాలు కల్పించి గొప్ప మేలు చేసిన *ఆదర్శ జీవి జీని రామ్మూర్తి గారు.* జీని రామూర్తి గారి మృతి ఉద్యోగులకు, చేనేత సమాజానికి, తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ,.స్వర్గీయ జీని రామ్మూర్తి గారికి జోహార్లు అర్పిస్తున్నాం.

09/11/2022

అందరూ share చేయండి....
పరిసర ప్రాంతాల్లో ఉన్న పద్మశాలి కులస్తులందరు విచ్చేసి కార్యక్రమన్నీ విజయవంతం చేయవాలిసిందిగా ప్రార్ధన

Photos from పద్మశాలి కుటుంబం's post 24/09/2022

జై మార్కండేయ.... జై జై మార్కండేయ..... పద్మశాలి కీర్తి మకుటం అయిన పద్మావతి అమ్మవారు పద్మశాలి ఆడపడుచు గా గత 25 సంవత్సరాలు గా ఎన్నో కష్టాలతో ప్రతిసారి తాత్కాలిక ఉత్తర్వుల ద్వారా పుట్టింటి చీర సారే ని సమర్పించే స్థాయి నుండి పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ *శ్రీమతి జింకా విజయలక్ష్మి* గారి పట్టుదలతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు
*శ్రీ YS జగన్మోహన్ రెడ్డి* గారి ఆశీస్సులతో ప్రతి సంవత్సరం కార్తీక మాసం బ్రహ్మోత్సవాల లో సింహ వాహన సేవ రోజున శాశ్వత ఆలయ గౌరవ మర్యాద ల తో *పుట్టింటి చీర సారె* లాంఛనాలను ఉత్తర్వులు జారీ చేయటం జరిగింది. ఈ విధమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో శాశ్వత గౌరవ మర్యాదలు లభించడం ఎంతో ప్రతిష్టాత్మకం, మహా పర్వదినం గా రాష్ట్ర పద్మశాలీయులే కాకుండా భారత దేశం లో ని ప్రతి పద్మశాలీయులు గర్వపడాల్సిన రోజు, ఈ సందర్భంగా పద్మశాలి కార్పొరేషన్ చైర్పర్సన్ మన ఆడ పడచు *జింకా విజయ లక్ష్మి* గారికి పద్మశాలీయ కుల బాంధవులు అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటునాము

07/08/2022

"ప్రపంచ చేనేతల దినోత్సవం"
వినటానికి ఎంత గొప్పగా ఉందొ....

🦋 ఇది చిత్రం కాదు తెలుగు రాష్ట్రాల్లో నేతన్న పరిస్థితికి దర్పణం...✍️

పోగు పోగు కలిపి పడుగు పట్టి మొలకట్టి నేసిన గుడ్డకి వెల కట్టలేని ఈ సమాజం... అంతటి అద్భుతాన్ని తీర్చి దిద్దిన నేతన్నాను గుర్తించలేక పోతుంది... ప్రపంచానికి బట్టనందించే నేతన్నకు ఒంటిమీద మంచి బట్ట లేకుండెను.... కడుపు నిండా తిండి లేదు😢😢😢 ఎన్ని ప్రవుత్వాలు మారినా నేతన్నల బ్రతుకులు మార్చలేకుంది...😞😞😞

నా చేనేత సహోదరి,సహోదరులకు ప్రపంచ చేనేత "కష్టాలు" గుర్తు చేసుకునే రోజు శుభాకాంక్షలు..

కనీసం ఈ ఒక్క రోజైనా చేనేతలను గుర్తు చేసుకుంటునందుకు సంతోషం..😭🙏🏻

06/08/2022

మనలో ఒక పెద్ద మనిషి ప్రధాని పిలుపు మేరకు గ్రూప్ dp గా జాతీయ జండా ని పెట్టండి అని అని అడిగా దాని ఆయన సమాధానం ఇది వ్యక్తుల మీద పార్టీల మీద వున్న ద్వెషాన్ని ఇలాంటి సందర్భాల్లో జాతీయ పతాకం మీద చూపడం ఎంత వరకు సబబు చెప్పండి మిరే

Photos from పద్మశాలి కుటుంబం's post 27/06/2022

చేనేత శిల్పి నల్ల పరందములు గారు అగ్గిపెట్ట లో పట్టె చీర సృష్టిస్తే అవి ప్రదర్శనకు మాత్రమే ఉంచే వాళ్ళు అవి చూసిన ప్రతి సారి ఏదో తెలియని వెలితి కనపడేది.... ఇన్నాళ్లకు నల్ల పరందములు గారి తనయుడు #నల్ల_విజయ్ అన్న గారు ఎంతో శ్రమించి ఇన్నాళ్లకు #అగ్గిపెట్టెలో_పట్టె_చీర_అంటే_ప్రదర్శనకు_కాకుండా_మీరు_ఇప్పుడు_ఆ_చీరలు_కట్టుకునే_విధంగా కూడా తయారు చేశారు... గతం లోను తామర నారతో చీర నేసి #పద్మశాలీల_చేనేత_కళాని_ప్రపంచానికి_మరొకసారి_వెలుగెత్తి_చూపారు చేనేత శిల్పి గా తండ్రికి తగ్గ తనయుడిగా మీరు చాలా గ్రేట్ సూపర్ విజయ్ అన్న

17/05/2022

జ్ఞానవాపి మసీద్ లో కోర్టు వారు నియమించిన కమిటీ కనుగొని నిర్ధారించిన ఒరిజినల్ పురాతన శివలింగం .

Photos from పద్మశాలి కుటుంబం's post 27/04/2022

#బెంగుళూరు పర్యటన విజయవంతం

#మాజీ ప్రధాని #దేవేగౌడతో సహా మూడు రాజకీయ పార్టీల నుండి #ఏడుగురు పార్లమెంట్ సభ్యుల #సంతకాలు

#కర్ణాటక రాష్ట్ర #మెజార్టీ రాజ్యసభ సభ్యులు మద్దతు

#కొత్త ఉత్సాహాన్ని నింపిన కర్ణాటక ఎంపిలు

#ఇప్పటివరకు జీరో జీఎస్టీ ఉద్యమానికి #ఎనిమిది రాష్ట్రాల నుండి #ఆరు రాజకీయ పార్టీల #30 మంది పార్లమెంటు సభ్యుల మద్దతు ఈ ఉద్యమాన్ని ముందుండి నడుపుతున్న అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షులు #యర్రమాద_వెంకన్న_నేత గారికి ధన్యవాదాలు


Poonam Kaur

20/04/2022

ఓ నేతన్న ని కళకు శతకోటీ వందనాలు🙏🙏🙏

16/04/2022

జై పద్మశాలి జై జై పద్మశాలి

08/04/2022

భారతీయ హిందూ సంప్రదాయం తో కూడా ఫ్యాషన్ శో లు నిర్వహించొచ్చు.. ఇది...అద్భుతం...అనిర్వచనీయం...రెండు కళ్ళు చాల లేదు చూడడానికి...ఇది కదా మా సనాతనం నేర్పిన సంప్రదాయం....

05/04/2022

అందరూ share చేయండి...
మన వాళ్ళకి ఇంకా సిగ్గు లేదు మన బాధల గురించి వేరే ఎవరో పోయి చట్టసభల్లో మాట్లాడితే ఏమి తెలుస్తాది మన బాధలు ఏమిటో మనమే చట్టసభల్లో మాట్లాడి పొట్లాడి మనకు ఏమి కావాలో తెచ్చుకోవాలి ఇంకెన్నాళ్లు వేరే వాళ్ళ మీద ఆదరపడుతారు

02/04/2022

మీకు మీ కుటుంబ సభ్యులకు కలియుగాబ్ది,
శాలివాహన శకం, 5124 వ సంవత్సరం "శుభకృత"
నామ నూతన సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు💐💐💐

14/03/2022

పడుగు పేక కలుపు... చేయెత్తి నిలుపు.. అప్పుడే మన జాతి గెలుపు

06/03/2022

పద్మశాలియ కులభాంధవులు వేటపాలెం

Photos from పద్మశాలి కుటుంబం's post 27/02/2022

ప్రతి పద్మశాలి కులస్తులకు ఉపయోగకరమైన విషయం... అందరూ చేయండి

శివరాత్రి సందర్భంగా గుంటూరు జిల్లా, నరసరావుపేట దెగ్గర #కోటప్పకొండకి విచ్చేయుచున్న పద్మశాలి కుల బందువులకు కోటప్పకొండ లోని శ్రీ పద్మశాలి సత్రం నందు పద్మశాలి బహుత్తమ సంగం వారి ఆధ్వర్యంలో శివరాత్రి పర్వదినాన అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది.. కావున కులబందువులు అందరూ వేలాదిగా విచ్చేసి ఈ మహత్తరమైన కార్యాన్ని విజయవంతం చేయలసిందిగా కోరుకుంటున్నాం

జై పద్మశాలి జై మార్కండేయ

18/02/2022

ఫ్రెండ్స్, నాఐడి రీచ్ ను 80% తగ్గించారు. కావున దయచేసి నా పోస్టులు కనపడిన వెంటనే #జై_పద్మశాలి అని కామెంట్లు చేయండి ఫ్రెండ్స్

14/02/2022

ప్రతి ఒక్కరు చేయండి
మదుర మీనాక్షి అమ్మవారి గుడిని పైట కొంగు పైన చేర్చడమే కాకుండా ప్రపంచం లోని 7 వింతలు చీర బోర్డర్ లో చిత్రీకరించిన నేతన్న అబ్దుత కళ నైపుణ్యానికి అభినందనలు

13/02/2022

*పోచంపల్లి చేనేత కళాకారుడు బోగ బాలయ్య అద్భుత ప్రతిభ*

పోచంపల్లికి చెందిన చేనేత కళాకారుడు బోగ బాలయ్య 18 నెలలు కష్టపడి పదివేల రంగులను ఉపయోగించి డబుల్ ఇకట్ నైపుణ్యంతో భారతదేశ పఠము మరియు చరఖా వచ్చేటట్లు నేశారు. గతంలో కూడా వీరు చేనేత మగ్గం పై అనేక ప్రయోగాలు చేశారు. సహజ రంగుల అద్దకంలో బాలయ్య గారికి అనుభవం ఉంది. వీరి ప్రతిభను గుర్తించి 2021లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుతో సత్కరించింది. తెలంగాణ రాష్ట్ర చేనేత మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ ఎల్. రమణ మరియు అనేక మంది ప్రముఖులు బాలయ్య గారి కళా నైపుణ్యాలను కొనియాడారు. భవిష్యత్తులో జాతీయ అవార్డుతో సహా మరిన్ని పురస్కారాలు పొందాలని కోరుకుంటున్న

Photos from పద్మశాలి కుటుంబం's post 11/02/2022

*తేదీ:-11-02-2022,*
*ఘంటశాల*
*కృష్ణాజిల్లా ఆంధ్ర ప్రదేశ్*

#శ్రీశ్రీశ్రీ_భద్రావతి_సమేత_శ్రీ_భావనాబుషి స్వామి వారి దేవాలయము మరియు శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారు, శ్రీ సరస్వతి దేవి వారు ఉపాలయాలు మూలవిరాట్టు విగ్రహ ప్రతిష్ట ,ధ్వజస్తంభం మరియు ఆలయ శిఖరం ప్రతిష్ట మహోత్సవానికి ముఖ్యఅతిథిగా
#రాపోలు_ఆనంద_భాస్కర్ గారు హాజరయ్యారు.

08/02/2022

రథసప్తమి ( సూర్య జయంతి ) శుభాకాంక్షలు ..

సూర్య గమనమే కాలవేగానికి ప్రమాణం.
సూర్యునకు కూడా పురోగమనమేకానీ, తిరోగమనం లేదు. ఆయన వేసే ప్రతి అడుగు కాలవేగానికి, కాలగమనానికి కొలబద్ద.
ఈనాడు మనం లెక్కించే సెకన్లు, నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలకు ఆధారం సూర్యుడే.

కాలః పచతి భూతాని
కాలం సంహరతే ప్రజాః
కాలః సుప్తేషు జాగ్రర్తి
కాలోహి దురతిక్రమః

కాలమే సకల ప్రాణులను పుట్టిస్తుంది. కాలమే సర్వప్రాణులను సంహరిస్తుంది. లీనమై నిదురించిన కాలమే తిరిగి మేల్కొంటుంది, సృష్టి క్రమాన్ని ప్రారంభిస్తుంది. అందుకే కాలధర్మాన్ని ఎవ్వరూ అతిక్రమించలేరు.

Photos from పద్మశాలి కుటుంబం's post 05/02/2022

ఈ రోజు అనగా ది.05-2-2022 శనివారం కొత్తరెడ్డి పాలెం, చేబ్రోలు మండలం గుంటూరు జిల్లాలో వేంచేసి ఉన్న #శ్రీ_భద్రావతి_సమేత_భావనా_ఋషీ_స్వామివారి కల్యాణ మహోత్సవం సందర్భంగా సాయంత్రం గ్రామోత్సవంలో భాగంగా గ్రామ పద్మశాలి కులస్తులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైనది😍😍😍

Photos from పద్మశాలి కుటుంబం's post 05/02/2022

ఈ రోజు అనగా ది.05-2-2022 శనివారం కొత్తరెడ్డి పాలెం, చేబ్రోలు మండలం గుంటూరు జిల్లాలో వేంచేసి ఉన్న #శ్రీ_భద్రావతి_సమేత_భావనా_ఋషీ_స్వామివారి కల్యాణ మహోత్సవం పద్మశాలీ దంపతుల చేతులమీదుగా గ్రామ పద్మశాలి కులస్తులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైనది😍😍😍

Photos from పద్మశాలి కుటుంబం's post 04/02/2022
03/02/2022

పద్మశాలి కుల బందువులకు మార్కండేయ జయంతి శుభాకాంక్షలు

03/02/2022

ప్రతి ఒక్కరు చేయండి
అందరికి మార్కండేయ జయంతి పండుగ శుభాకాంక్షలు..

భక్త మార్కండేయ కథ....

పూర్వం మృకండుడు అనే రుషి ఉండేవారు. మృకండుడు శివుని గురించి ధ్యానం చేసుకునే సమయంలో మృగాలు అతడిని రాసుకుంటూ పోయినా కూడా పట్టించుకునేవాడు కాదట. అలాంటి మృకండునికి మరుద్వతి అనే సాధ్వి భార్యగా ఉండేది. భగవన్నామస్మరణలో హాయిగా జీవితాన్ని గడుపుతున్న ఆ దంపతులకి ఒకటే లోటు. వారికి పిల్లలు లేరు! సంతానభాగ్యం కోసం వారిద్దరూ వారణాశి క్షేత్రానికి చేరుకుని శివుని పూజించడం మొదలుపెట్టారు. ఆ దంపతుల దీక్షకు మెచ్చిన శివుడు వారి ముందు ప్రత్యక్షం అయ్యాడు. కానీ ఆ పరమేశ్వరునికి వారిని పరీక్షించాలని అనిపించిందో ఏమో… `మీకు తప్పకుండా పుత్రసంతానాన్ని ప్రసాదిస్తాను. కానీ ఎలాంటి పుత్రుడు కావాలో మీరే నిర్ణయించుకోండి. సుదీర్ఘకాలం జీవించే దుర్మార్గుడు కావాలా లేకపోతే పదహారు సంవత్సరాలు మాత్రమే జీవించే గుణవంతుడు కావాలా?` అని అడిగాడు. `వ్యక్తిత్వం లేనివాడు ఎన్ని రోజులు ఉంటే మాత్రమేం, మాకు గుణవంతుడైన అల్పయుష్కుడే కావాలి` అని కోరుకున్నారు మృకండుని దంపతులు.

అచిరకాలంలోనే ఆ దంపతులకు వెలుగురేఖలాంటి ఓ బాలుడు కలిగాడు. మృకండుని కుమారుడు కాబట్టి అతనికి మార్కండేయుడు అన్న పేరు వచ్చింది. శివుని మాటలకు తగినట్లుగానే మార్కండేయుడు సకలగుణాభిరాముడు! బాల్యం తీరకుండానే సకల శాస్త్రాలనూ ఔపోసన పట్టాడు మార్కండేయుడు. మరో పక్క వ్యక్తిత్వంలోనూ తనకు సాటి లేదనిపించుకున్నాడు. ఇలా ఉండగా ఓసారి మృకండుని ఆశ్రమానికి సప్తరుషులు వచ్చారు. మార్కండేయుని చూడగానే అతనికి త్వరలోనే ఆయుష్షు తీరనుందని వారికి అర్థమైంది. మార్కండేయుని బ్రహ్మదేవుని వద్దకు తీసుకుపోయారు సప్తరుషులు. మార్కండేయుని చూసిన బ్రహ్మ, అతడిని నిరంతరం శివారాధన చేస్తూండమని సూచించాడు. అందరూ కలిసి, శివనామస్మరణ చేత అకాలమృత్యవు దరిచేరదని మార్కండేయునికి తెలియచేశారు.


పెద్దల మాటల మేరకు ఒక శివలింగం ముందర కూర్చుని శివధ్యానాన్ని మొదలుపెట్టాడు మార్కండేయుడు. ఒకపక్క అతని మృత్యుఘడియలు సమీపిస్తున్నాయి. మరో పక్క నోటి నుంచి శివనామస్మరణ ఆగడం లేదు సరికదా ఒకో నిమిషం గడిచేకొద్దీ మరింత జోరుగా సాగుతోంది. యముని ఆదేశం మేరకు మార్కండేయుని తీసుకురావడానికి బయల్దేరారు యమభటులు. కానీ మార్కండేయుని తీసుకురావడం కాదు కదా! అతని దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయారు. ఇక ఆ పిల్లవాడిని తానే స్వయంగా తీసుకురావాలనుకున్నాడు యముడు. తన వాహనమైన మహిషాన్ని అధిరోహించి, యమపాశాన్ని చేతపట్టి మార్కండేయుని వైపు సాగిపోయాడు. `ఆ ధ్యానాన్ని ఆపి ఇవతలికి రా! నీ మృత్యువు సమీపించింది` అని హుంకరించాడు యముడు. కానీ యముని మాటలను విన్న మార్కండేయుడు ఇవతలికి రాలేదు సరికదా, గట్టిగా ఆ శివలింగాన్ని పట్టుకుని మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం మొదలుపెట్టాడు.

ఇక యమునికి ఏం చేయాలో దిక్కుతోచలేదు. ఆఖరి ఆస్త్రంగా తన పాశాన్ని మార్కండేయుని మీదకు వదిలాడు. కానీ మార్కండేయునితో పాటుగా ఉన్న శివలింగానికి ఆ పాశం తగలగానే శివుడు కాలరుద్రుడై బయటకు ఉరికాడు. తన మీదకీ, తన భక్తుని మీదకీ పాశాన్ని విడుస్తావా అంటూ యముడిని ఒక్కపెట్టున సంహరించాడు. ఆ సందర్భంలోనే శివునికి `కాలాంతకుడు` అనే బిరుడు వచ్చింది. అంటే కాలాన్ని/మృత్యువుని సైతం అంతం చేసినవాడు అని అర్థం. కానీ యుముడే లేకపోతే ఈ లోకంలో చావుపుట్టుల జీవనచక్రం ముందుకు సాగేదెలా! అందుకని దేవతలందరి ప్రార్థన మేరకు శివుడు శాంతించి తిరిగి యముడిని జీవింపచేశాడు. అయితే మార్కండేయుని జోలికి అతను ఇక రాకూడదనీ, ఆ మాటకు వస్తే శివభక్తులు ఎవ్వరినీ కూడా నరకానికి తీసుకుపోకూడదనీ హెచ్చరించి వదిలివేశాడు పరమేశ్వరుడు.

Want your organization to be the top-listed Non Profit Organization in Guntur?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

కొత్తరెడ్డి పాలెం,  చేబ్రోలు మండలం,  గుంటూరు జిల్లా, లోని    పద్మశాలి బహుత్తమ సేవా సంగము మరియు గ్రామ పద్మశాలి కులస్థులంద...
జ్ఞానవాపి మసీద్ లో కోర్టు వారు నియమించిన కమిటీ కనుగొని నిర్ధారించిన ఒరిజినల్ పురాతన  శివలింగం .
భారతీయ హిందూ సంప్రదాయం తో కూడా ఫ్యాషన్ శో లు నిర్వహించొచ్చు.. ఇది...అద్భుతం...అనిర్వచనీయం...రెండు కళ్ళు చాల లేదు చూడడాని...
అందరూ share చేయండి...మన వాళ్ళకి ఇంకా సిగ్గు లేదు  మన బాధల గురించి వేరే ఎవరో పోయి చట్టసభల్లో మాట్లాడితే ఏమి తెలుస్తాది మన...
పడుగు పేక కలుపు... చేయెత్తి నిలుపు.. అప్పుడే మన జాతి గెలుపు
ప్రతి ఒక్కరు #share చేయండిమదుర మీనాక్షి అమ్మవారి గుడిని పైట కొంగు పైన చేర్చడమే కాకుండా ప్రపంచం లోని 7 వింతలు చీర బోర్డర్...

Telephone

Address

Guntur
Other Community Organizations in Guntur (show all)
Naredco AP Property Show Naredco AP Property Show
#5-90-7, 1st Lane, 1st Cross, Chandramouli Nagar
Guntur, 522006

NAREDCO Property Show 2019 is a platform for all to buy, sell or invest in the real estate industry.

The Heart of Giving The Heart of Giving
D. No. 18-5-252, 1st Lane, Santhinagar, Koritepadu
Guntur, 522007

Bhskaran Agro Tech Bhskaran Agro Tech
Guntur, 522001

A Organic Fertilizer and Pesticides Company

Yadav Youth Ap Yadav Youth Ap
Guntur, 522007

community related page..

Grama Ward Sachivalaya Employees Association Andhra Pradesh 13/2020 Grama Ward Sachivalaya Employees Association Andhra Pradesh 13/2020
GUNTUR
Guntur, 522004

GWSEA AP 13/2020 is an Association of Andhra pradesh Gramaward sachivalayam employees.

AWAAZ committee AP AWAAZ committee AP
Dwaraka Nagar
Guntur, GUNTUR

అభివృద్ధి రక్షణ లౌకికవాదం

Jamiat Youth Club Guntur Andhra Pradesh Jamiat Youth Club Guntur Andhra Pradesh
Nehru Nagar 1stline
Guntur, 522001

jamait youth club Is a part of jamait ulama I Hind provide to India create the social workers any

Sri Raja Venugopala Swamy Temple Pedakurapadu Sri Raja Venugopala Swamy Temple Pedakurapadu
Pedakurapadu Guntur
Guntur, 522402

A peaceful Vishnava daevalayam

V Royal Park Hotel V Royal Park Hotel
# 6-7-72, 2/2 Arundelpet
Guntur, 522002

Restaurant, Rooms & Banquet Halls 0863 - 6699 999, +91 9100655533 2/2 Arundelpet, Guntur-522002, AP.

Boyapati veeraiaha gari muta Boyapati veeraiaha gari muta
Sangadigunta
Guntur, 522003

Serve the people until you die for society.