Ping media
for the society and people
ఈ చిత్రము లోని నందీశ్వరుడు తన స్వామి కొరకు వందల ఏళ్ల గా ఎదురుచూస్తున్నాడు . ఇదే కాశీ విశ్వేశ్వర ఆలయం లో జ్ఞాన వాపి మసీదు వైపు చూస్తున్న నంది విగ్రహం . ప్రతి శివాలయం లో నంది విగ్రహం శివుని చూస్తూ ఉంటుంది . మరి ఇక్కడ నంది చూస్తున్న శివయ్య మసీదు నిర్మాణం లో మాయమయ్యాడా ?
ఇప్పటి ఇరాన్ ప్రాంతాలలో వచ్చిన కరువు కాటకాల బారి నుండి హిందూ కుష్ పర్వత శ్రేణులు దాటి వచ్చిన ప్రజలు ఇక్కడ భారత భూమిలో గణ సమూహ రాజ్యాలను క్రమేపీ ఆక్రమించుకొంటూ ఒక ప్రత్యేక సంస్కృతిని ఏర్పరిచారు .అదే వేద సంస్కృతిగా చెపుతారు . ఈ జంబూక ద్వీప భూమిలో గల శక్తివంతమైన , విజ్ఞాను లైన , పరిపాలనా దక్షులై న ప్రభువులను తమ కుయుక్తులతో హతమార్చి వారందరూ రాక్షసులుగా చిత్రీకరించి అనేక పురాణ కధలు ప్రచారం చేసారు . అరేబియా సముద్ర తీరం లోని పరామర వంశజుడైన పరుశురాముడు అనే చారిత్రిక రాజునూ పురాణ పురుషునిగా వర్ణించారు . .. అప్పటికే వున్న బౌద్ధ జైన ఆజీవక మతస్తుల ఆరామాలను ద్వాంసం చేసి ఆలయాలుగా పంచారామాలుగా మార్చేశారు . నిలువు మరియు అడ్డ నామాల శక్తి సమాన ముగా వున్న చోట హరిహర సుతులను ఆరాధించారు . .. ఆ క్రమములో వీరిపై ఎడారి మతాల వారు దాడి చేసి ఆలయాలు కొల్లగొట్టి నాశనం చేసారు . వారి ప్రార్ధన మందిరాలు నిర్మించుకున్నారు . చరిత్ర పునరావుత్తమైనది .నర జాతి చరిత్ర సమస్తం పర జాతి పీడనం .
దేశ వ్యాప్తం గా ఎందరో మహానుభావులు . ప్రతి ప్రదేశము నుండి భారత భూమి మట్టి వాసనలు , పారె సెలయేళ్ళు గలగలలు , పీడిత తాడిత అణగారిన ఆశలు -ఆశయాలు , ఆకలి కేకలు , నిర్భాగ్యుల నిస్సహాయ మూలుగులు , కూకటివేళ్ళ అక్రన్దనలు అన్నీ తెలిసిన 286 మంది మేధావులు . దార్శనికులు , ద్రష్టలు అయిన ఈ మహానుభావులందరూ ఒక చోట సమావేశం అయి రచించినదె మన భారత రాజ్యాంగం . కానీ ఆ మేధావులను మన మెవ్వరం స్మరించుకోవడం లేదు . కనీసము ఆయా రాష్ట్ర ప్రభుత్వాలైనా వారిని గుర్తించి ప్రజలకు తెలియచేయుట ప్రజా ధర్మము . ఓట్ల రాజకీయాల్లో పడిపోయి కులాలు , మతాలుగా , ప్రాంతాలుగా విడిపోతున్న ప్రజలకు రాజ్యాంగం రచించిన మహానుభావుల గురించి తెలియాలి .
అయోధ్య రామాలయం కట్టటం ఎందుకు ? బదులు గా విద్యాలయాలు , హాస్పిటల్స్ కట్ట వచ్చుగా అని ఈ మధ్య అభ్యుదయవాదులు మరియు అన్య ప్రజలు విమర్శలు మొదలు పెట్టారు . సనాతన ధార్మిక జీవనం లో దేవాలయాల పాత్ర ప్రముఖమైనది . దర్శినికులు , ద్రష్టలు , జ్ఞానులు , ఋషులు , మహర్షులు ఎందరో మన హిందూ జీవన విధానాన్ని మానవుని అభ్యున్నతి కి ప్రశాంత ప్రాకృతిక ధర్మ జీవనానికి ఉపయోగపడేలా తీర్చి దిద్దారు ... నిజానికి దేవాలయాలు ఆధునిక గ్రోత్ సెంటర్ లకు ప్రాచీన ఆకృతులు . దేశ ఆర్ధిక వ్యవస్థకు పట్టుగొమ్మలు . మన దేశ నలుమూలల గల దేవాలయాలు లేకుండా మన ఆర్ధిక వ్యవస్థ మన జాలదు . ఈ విషయం భారత ఆర్ధిక వేత్తలకు అందరకూ తెలుసు . నగదు చలామణిని ప్రోత్సహించి ప్రజలలో విశ్వాసాన్ని , ఆర్ధిక అభివృద్ధిని ప్రోత్సహించేది మన దేవాలయ వ్యవస్థ . రవాణా , ఆహార , వస్తు సరఫరా , రహదారులు ఇలా అన్ని రంగాల ఫై మన దేవాలయ వ్యవస్థ ప్రభావం కలదు . ఒక్క రోజు హుండీ ఆదాయం కోట్లలో ఉంటుంది . ఆ ప్రజా ధనం తో ఎన్నో పాఠశాలలు , అనాధ ఆశ్రమాలు , వృద్ధ ఆశ్రమాలు , అన్న ప్రసాద్ శాలలు , వైద్యాలయములు ఇంకా అనేక ప్రజా ఉపయోగకర పనులు చేపట్టవచ్చు . అందుకే దేవాలయాలు ప్రాచీన గ్రోత్ సెంటర్ లు గా ఆర్ధిక వేత్తలు పేర్కొంటారు . లౌకిక వాదం పేరిట కేవలం హిందూ దేవాలయాలపై మాత్రమే ప్రభుత్వాలు పెత్తనం చేసే విధానాన్ని నిరసిద్దాం , అంతే గానీ దేవాలయ నిర్మాణాలపై కాదు .
మన సంస్కృతికి మూలాధారం అయిన వేదాలు , రామాయణ భారత పురాణాలు గురించి ఇంకా లోతు గా ఆధార సహితముగా పరిశోధనలు జరగాల్చి ఉన్నవి . ఎక్కడో శున్యం లో కాలప్రవాహ లో కొంత ఖాళీ కనపడుతున్నది .ఆ ఖాళీ అనేక సందేహాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నది . రామాయణం కామన్ ఎరా కు ముందు 5 వేల సం . లు నాడు జరిగితే మరి గుర్రాల మాటేమిటి ?
గుర్రం ,, ఆధునిక డీ ఎన్ ఏ పరీక్షల ప్రకారముగా గుర్రాల జాతి కామెన్ ఎరా కు ముందు 4 వేల సం .ల నుండి మాత్రమే వున్నదని నిరూపిత మైనది . ప్రస్తుత ఉక్రేన్ , ఉజ్బేకిస్తాన్ ప్రాంత పర్వత శ్రేణుల్లో ఈ గుర్రాలు ఆవిర్భవించాయని చెబుతున్నారు . . ఈ గుర్రాలు కామన్ ఎరా కు 3 వేల సం . ల నాడు మాత్రమే మనిషులకు మచ్చిక అయ్యాయని తెలుస్తున్నది . భారత భూమిలో కామన్ ఎరా కు ముందు 5 వేల సం . లకు పూర్వం వున్న సింధు నాగరికిత లో గుర్రాల ప్రసక్తి లేదు .పురావస్తు పరిశోధనల ప్రకారముగా భారత భూమిలో కామన్ ఎరా కు ముందు 2 వేల సం .లనుండి మాత్రమే గుర్రాల ఉనికి కలదు అని తెలుస్తున్నది . కాబట్టి ఇంకా పరిశోధనలు జరగాలి . మాయం అయిన కాలం లో ఎం జరిగినది?
కాలం కుబుసం విడిచిన కాల నాగులా ముందుకు సాగుతుంది . నిన్నటి వరకు అపరిచుతులు , నేడు చలికి ఒకరికొకరు చేతులు పెనవేసుకొని కలసిపోయి సాగిపోతున్నారు . చలిగాలులు కు ఉబ్బిపోయి నాని పోయిన చిక్కటి చీకటి , నాలుగువైపులనుండి అంధకారం లా అలుముకొనే వేళ , మనిషి మనిషిలోకి తెరుచుకొని - సహజీవనమనే సరికొత్త కావ్య జీవితాన్ని ఆవిష్కరించుకొని మానవుని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రకృతి . సంక్రమణం లోనే సరికొత్త క్రాంతి , అదే సంక్రాంతి . భోగ భాగ్యాలు , సరికొత్త క్రాంతులు , పాడి పశువుల లోగిళ్ళలో భారతీయత వెళ్లి విరియాలి .
జ్ఞాన సముపార్జనే మోక్షమునకు సోపానము . యోగులు , మహర్షులు , మహాత్ములు అందరూ భరత భూమి లో ఉత్తరం దిక్కున వున్న హిమాలయాల వైపు చూసేవారు . మహాభారతం లో స్వర్గారోహణం ఉత్తరం వైపుకు వెళ్ళుట దీనికి నిదర్శనం . ఆది శంకరులవారు హిమాలయాలే జ్ఞాన సంపద కేంద్రాలుగా దర్శించి శారదా పీఠం ఏర్పాటుచేశారు . ఇప్పటికీ సనాతన సంస్కృతికి ఉత్తరాన వున్న హిమాలయాలే కేంద్రబిందువులు .
అది మధ్యంత రహితుడు శ్రీ మహావిష్ణువు దర్శన భాగ్యమే మోక్షము . అదే జ్ఞాన సంపద . వీటి సాధన కొరకు సాధకులు ఉత్తర దిక్కు కు వెళ్లాలని సూచనయే ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వార దర్శనం . 🙏
తంత్ర మార్మిక యోగ శాస్త్రం లో భగ పూజ క్రతువు సంక్లిష్టమైనది . లిప్త / హంస కాలం లో మానవుడు తనను తాను మరచిపోయేది సంయోగ భావప్రాప్తి సమయం లోనే అనేది అందరకూ తెలీచినదే . అయితే ఆ క్షణం లో పురుషుడు గానీ స్త్రీ గానీ బీజాక్షర తంత్ర పదములు జపించగలిగితే అద్భుత యోగములు కలుగుతాయని ప్రాచీన తంత్ర మార్మిక యోగం చెపుతున్నది .
అనేక మంది తాంత్రికులు ఈ సాధనలో భాగముగా నగ్న పూజలు , భగ పూజలు చేస్తుంటారు . చాలామంది గురువులు ఈ క్రమములోనే లైనఁగిక ఆరోపణలతో జైళ్ల పాలు అయ్యారు .
దీనినే ఆధునీకరించి ఆచార్య రజనీష్ ' ఓషో ' కార్యక్రమములు బోధనలు చేసారు . వీరి బోధనలు కట్టుబాటు లేని విచ్చలవిడి మరియు విశృంఖల శృంగారానికి దారి తీసి భారత పార్లమెంట్ లో చర్చకు దారి తీసిన విషయం తెలీచిన్దే . ఓషో ఆశ్రమం లో ఒక్కో సన్యాసిని కనీసం 90 మంది తో లింగిక సంబంధాలు పేట్టుకునేవారని చెప్పేవారు .
ఆచార్య రజనీష్ అంతరంగికురాలుతో ఇందిరా గాంధీ తో ప్రత్యేక సంభందాలు ఉండేవని తెలిసినది . లక్ష్మి అనే పేరుగల సదరు మహిళతో ఇందిరా గాంధీ రాజకీయ విముఖత తో వుండే తన కుమారుడు రాజీవ్ ను మార్చగలిగినది అని చాలా మంది భావించారు .
ఇప్పటికీ ఈ ప్రక్రియను అనేకమంది రహస్యం గా సాధన చేస్తుంటారని ప్రతీతి .
ప్రకృతి లో ఎన్నో వైవిధ్యభరిత జీవరాశి కలదు . కీటకాలు , పక్షులు , జంతుజాలం వేటికి వాటికీ ప్రత్యేకత లతో ఎంతో వైవిద్యం కలదు . కొన్ని కీటకాలను ప్రత్యేకముగా పెంచుతారు . అనేక వ్యాధుల నివారణ లో ఈ కీటకాల ను ఉపయోగిస్తారు . వాటిలో ' బీటల్ స్టార్ ' అనే ప్రత్యేక కీటకం ఎన్నో వ్యాధుల నివారణ లో ఉపయోగిస్తారు .
ఇటీవల ఈ కీటకం 75 లక్షలకు జపాన్ లో విక్రయము జరుగుట ప్రతి ఒక్కరినీ ఆచ్చర్యం కలుగ చేసినది .అదే ' బీటల్ స్టార్ ' అనే కీటకం ఈ రికార్డ్ సాధించినది . లుకానిదే జాతి కి చెందిన స్టాగ్ బీటల్ జీవిత కాలము 7 సం . కుళ్ళిన చెట్లు , ఆకుల రసములు తింటూ ఈ కీటకాలు జీవిస్తాయి . ఎన్నో భయంకర వ్యాధుల నివారణ లో ఈ కీటకాల ను వాడుతారు . అందువలనే ఈ కీటకాలు అంత ఖరీదు పలుకుతున్నాయి . దీని తలపై 5 అంగుళాల నల్లని కొమ్ములు ఈ కీటకం కు ప్రత్యేకతను తెచ్చాయి .అధిక ఉష్ణత వాతావరణం లో మాత్రమే ఈ కీటకాలు మనుగడ సాగిస్తాయి . ప్రకృతి వైవిధ్యాన్ని మనిషి అర్ధం చేసుకొని ప్రకృతికం గా జీవించాలి stag beetal
సోమేపల్లి వారి కుటుంబ సమూహము లో ఒక ధృవతార రాలి పోయింది . రచయిత ల సంఘాలకు అధ్యక్షుడుగా సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసారు . ప్రతి సం . ఔత్సాహిక రచనలు ప్రోత్సహిస్తూ సభలు నిర్వహిస్తూ సాహీతీ సేద్యం లో గొప్ప హాలికునిగా వెలుగొందారు . ప్రభుత్వ అధికారిగా పులిచింతల ప్రాజెక్ట్ నిర్మాణం లో కీలక పాత్ర వహించి ఒక రైతు గా తోటి రైతాంగానికి చిరస్థాయిగా మేలు కలిగించిన మహోన్నతుడు . నరసారావు పేట పార్లమెంట్ సభ్యుని కార్యదర్శిగా ఎన్నో మంచి పనులకు శ్రీకారం చుట్టారు . వారి మరణం అభిమానులకు తీరని లోటు . చిరస్మరణ మైన వారి యశస్సు అజరామరణం . వారి ఆత్మకు శాంతి కలగాలని దివ్యంజిలి ఘటిస్తున్నాము . 🙏🙏🙏🙏🙏
ప్రకృతి ని ప్రేమించి ఆరాధించే హిందూ ధర్మము నకు విరుద్ధం గా పరిశోధన ల పేరిట మానవాళి వికృతికి ఎందరో శాస్త్రవేత్తలు ప్రయత్నించారు . పాచ్యత్త ప్రపంచం లో వీరందరూ ప్రముఖులుగా పేరొందుట విశేషం .
చింపాంజీలకు మనిషి వీర్యం ఎక్కించి హైబ్రిడ్ మనిషిని సృష్టించే ప్రయోగం ' ఇవనోవిచ్ ' అనే రష్యన్ బియాలజిస్ట్ 1910 లో ఆస్ట్రియా దేశం గ్రాజ్ లో జరిగిన వరల్డ్ కాంగ్రెస్ లో ప్రతిపాదించినపుడు అందరూ వులిక్కిపడ్డారు .అప్పటికే ఇతను జంతువుల వీర్య ప్రయోగాలతో మేలు జాతి గుర్రాలను సృష్టించారు . రష్యన్ ప్రభుత్వ నిధులతో ఇవనోవిచ్ 1926 లో పశ్చిమ ఆఫ్రికా లో గినియా ప్రాంతం నకు వెళ్లి చింపాంజీల ఫై ప్రయోగాలు చేసాడు ... అయితే గినియా లోని కిండియా నగరం లోని చింపాంజీలు కు గర్భధారణ వయస్సు రాకపోవటం తో ఇవనోవిచ్ పారిస్ వెళ్లిపోయాయడు . అక్కడ చింపాంజీలు మచ్చిక చేసుకోవటం లో నైపుణ్యం సంపాదించాడు .
తిరిగి ఆఫ్రికా కు వచ్చి మూడు చింపాంజీలకు మానవ వీర్యాన్ని ఎక్కించుటకుఁ ప్రయత్నాలు ప్రారంభించారు . ఒరుంగుటన్ చింపాంజీ ల వీర్యాన్ని ఆఫ్రికా మహిళలకు ఎక్కించే ప్రయత్నం చేసారు .
ఇటువంటి ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి . అదే సమయం లో రష్యాలో పరిస్థితులు మారిపోయి సాంస్కృతిక విప్లవం మొదలు అయినది . 1930 లో రష్యన్ సీక్రెట్ పోలీసులు ఇవనోవిచ్ ను అరెస్ట్ చేసి కజఖ్ లో అల్మా అట్టా జైలు లో ఉంచారు . 1931 లో అనారోగ్యకరణములతో జైలు నుండి విడుదల అయ్యి పక్షవాతం తో మరణించారు .ఆ విధం గా మానవాళికి ఇవనోవిచ్ వికృత ప్రయోగాల బెడద తప్పినది .
శంభో శివ శంభోహః కార్తీకం శివ కేశవులకూ ఇష్టమైన మాసం . మరి గీతాచార్యుడు మాసానాం మార్గశీర్ష హ అని ఎందుకు చెప్పాడు అంటే వైష్ణవులు గుడ్లు ఉరుమి చూస్తారు . శివాయహ్ విష్ణు రూపేణా శివః అంటే అవును అని అంగీకరిస్తారు . ఆకలి వేసిన వాడు అరిస్తే కూతలంటారు , కారుకూతలంటారు , కానీ అన్నీ అమిరినవాడు అరిస్తే వేదం అంటారు , అదే మంత్రం అంటారు . జీవులు విచిత్రం గా జీవిస్తారు . ఈ చన్నీళ్ళ స్నానాలూ , నైవేద్యాలూ , భోగాలూ అన్నీ అన్నార్తుల కోసమే అంటే ఒప్పుకోరేమో ? ఆరోగ్య సూత్రాలంటే అసలు వినరు కాబోలు . మతం మత్తులో నే సమాజానికి వైద్యం చేయాలి కాబోలు . ఏది ఏమి అయినా సామాన్యునికి ఇంత పుష్టికర నైవేద్య ఫలహారాలు దక్కేది కార్తీక మాసం లోనే ..
ఆర్టికల్ 370 రద్దు సమర్ధిస్తూ సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినది . రాజ్యాంగ రచన చేసిన 247 మంది బాబా సాహెబ్ అధ్యక్షతన జరిగిన సమావేశం లో ఆనాడే ఈ విషయం స్పష్ట పరిచారు . నెహ్రు గారి ప్రత్యేక శ్రద్ద తో ప్రవేశపెట్టబడిన ఈ 370 ఆర్టికల్ ను వ్యతిరేకిస్తూ అంబెడ్కర్ నిస్సహాయ మౌనం ను ఆశ్రయించారు .
మహా శక్తీ మాత సతీ దేవి పేరిట గల సతీ సరోవర్ కు కశ్యప మహర్షి వరాహ మూల న గండి పెట్టి నీటిని బయటకు పంప గా ఏర్పడిన భూభాగమే ఈ కశ్యపు పురి , నేటి కాశ్మీరు . వరాహ మూల ప్రాంతమే బరహ మూలగా , నేటి బారా ముల్లాగా ప్రసిద్ధి .పూర్తి వేదభూమిగా అవతిరించిన కాశ్మీర్ దుస్థికి కారణము పాలకులకు ఎడారిమతము ల ఫై వున్న అభిమానమే కారణం .
నేటికీ భారత్ అధీనములో కేవలం 43 శాతం కాశ్మీర్ భూభాగం కలదు . మ్యాప్ ల లో చూపించేది వాస్తవం కాదు .370 ఆర్టికల్ ద్వారా కాశ్మీర్ కు స్వయంప్రతిపత్తి అధికారాలు ఇవ్వబడ్డాయి .ఇక్కడ బయటివారు భూములు కొనగూడదు . ఇక్కడ స్త్రీ లను పెళ్లాడితే సదరు స్త్రీలకూ ఎటువంటి కాశ్మీరీ హక్కులు వుండవు . రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు లేకుండా కేంద్రము జోక్యం చేసుకోకూడదు .
ఇవన్నీ క్రమేపీ ఎడారిమతలను ప్రోత్సహించే చర్యలు .చివరకు లక్షలాది పండిట్ కుటుంబాల ఊచకోతకు దారితీసాయి . కొన్ని వుళ్ళు ఖాళీ అయిపోయి పరాయి మతస్తుల కబ్జాలోకి వెళ్లిపోయాయి . వేదం మూగబోయినది , హిందుమనవతుల రోదనలు క్రమేపి ఎడారిమత ప్రార్ధనులుగా మారాయి .
370 ఆర్టికల్ రద్దు తరువాత ఇన్ని ఏళ్లకు పరిస్థితులు కుదుటపడుతున్నాయి . హిందువులు జాగృతం కాక పోతే ప్రతి ప్రాంతం కాశ్మీరు లా అవుతుంది .
అతడు ఓడిపోతున్నాడు , క్రమేపీ నిశ్శబ్ద జీవిగా మారిపోతున్నాడు .ఆమె అద్భుత విజయాలు చవిచూస్తున్నది . సామజిక సంఘర్షణలో మగవాడు క్రమేపీ కనుమరుగు అవుతున్నాడు . ఇటీవల దేశం లోని ఆత్మహత్యల గణాంకాలను పరిశీలన చేస్తే 80 శాతం మగవారే ఉండుట ఆలోచింప చేస్తున్నది .
మారుతున్న సామజిక పరిస్థితుల్లో మగవానిపై తీవ్ర మానసిక ఒత్తిడి పెరుగుతున్నది . ఆర్ధిక , ఉద్యోగ , కుటుంబపర ఒత్తిడి తో దేహ వైఫల్యం వెరసి నువ్వేం మగాడివిరా అన్న వెక్కిరింతలు కలసి మగవానిని కృంగదీస్తున్నాయి నాన్న వెనుకబడ్డాడు అనేకంటే మగ జాతే వెనుకబడి పోతున్నది అనుట కరెక్ట్ .
పెళ్లి కావటం లేదని , పెళ్లి అయినకా సర్దుబాటు వైఫల్యం , విడాకులు ఇస్తే తిరిగి పెళ్లి కాలేక పోవుట , ఇంటి బాధ్యతలు , సామజిక బంధాలు మరియు వైఫల్యాలు , పొంతన లేని ఆదయ వ్యయాలు , ఆడవారి వ్యామోహాలు , డాబుసరి వేధింపులు ఇంకా బయటకు చెప్పుకోలేని బాధలు , భయాలు ఇవన్నీ మగజాతిని నిశ్శబ్ద , నిర్లిప్త జీవనం లోకి నెట్టివేస్తున్నాయి .
ఆడవాళ్లవే కన్నీళ్లు కావు , మగవానివి కూడా కన్నీళ్లే కానీ సానుభూతికి నోచుకోవు .అందుకే క్రమేపీ ఆమె రాజ్యం విస్తరిస్తున్నది , అతడు మౌనం ని ఆశ్రయిస్తున్నారు .
తెల్ల బంగారం , పచ్చ బంగారం , ఎఱ్ఱ బంగారం లు గా ప్రసిద్ధి చెందిన ప్రత్తి , పొగాకు , మిరప పంటల భూములు ఇవి . పాత దండు బాట గా పిలుచుకునే ఓల్డ్ మద్రాస్ రోడ్ కు ఇరువైపులా వుండే ఈ సారవంత మినా భూములు బాపట్ల జిల్లా పర్చూరు , కారంచేడు , పెదనందిపాడు మండల గ్రామాల్లో వున్నాయి . ప్రస్తుత మిచౌన్గ్ తుఫాను ధాటికి ఈ పంటపొలాలన్నీ చెరువుల్లా మారి వాగుల్లా ప్రవహిస్తున్నాయి . లక్షలాది రూపాయల రైతు పెట్టుబడులు నీటి పాలు అయ్యాయి .
ప్రకాశం, నెల్లూరు జిల్లాల పొగాకు రైతులకు నమస్కారం🙏
తేదీ 4-12-2023,
సమయం 7 pm.
దయచేసి ఎక్కువమంది రైతులకు ఈ విషయం చేరేలా ""షేర్ "" చేయవలసినదిగా విజ్ఞప్తి🙏
గత పోస్ట్ లో పెట్టిన విధంగా ప్రకాశం,నెల్లూరు జిల్లాల లో కురుస్తున్న భారీవర్షాలు 6 వ తేదీ ఉదయం వరకు వరకు కొనసాగే అవకాశం కనిపిస్తుంది.
ఈ వర్షాలకు పోగతోటలు చాలా ప్రాంతాలలో ""పొదిగి ""పోయే ప్రమాదం, మరియు గాలికి పడిపోయే ప్రమాదం ఉన్నది. రైతు సోదరులు .
ఈ పరిస్తితి నాకు చాలా బాధాకరం గా ఉన్నది😢.
ఈ పరిస్థితులలో రైతులు వర్ష ఆగిన వెంటనే ఈ క్రింది చర్యలు చేపడితే చాలా వరకు తోటలు కోలుకోవడానికి అవకాశం ఉన్నది.
1. ముందుగా మీరు ""ధైర్యంగా"" ఉండండి. ఇది మనకు కొత్త కాదు, ఇలాంటివి గతంలో చాలా చూశాము.
గత సంవత్సరం కూడా చూశాము.👍👍👍👍👍👍👍👍👍👍👍
2. వర్షా ఆగిన వెంటనే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పొలాల్లో ఉన్న నీరు బయటకు పోయే మార్గాలు చూసి, నీరు బయటకు పంపండి. అవసరం అయితే ""చిన్న మోటార్ల"" సాయంతో నీరు బయటకు పంపండి.
3. ప్రతి 20 సాళ్ళకు ఒక సాలును ""పారతో ""లోతుగా వెల్లవేసి బయటకు దారి చూయించండి. దీనివలన భూమిలో ఉన్న అధిక తేమ త్వరగా బయటకు పోతుంది.
5. పడిపోయిన మొక్కలు లేపి కాళ్ళతో మొక్క చుట్టూ తొక్కించండి. ఇలా చేస్తే వెంటనే కొత్త వేర్లు పుట్టి మొక్క త్వరగా కోలు కుంటుంది.
6. పొదిగిన మొక్కలకు
""పొటాషియం నైట్రేట్"" అనే ఎరువును 200 గ్రాములు 10 లీటర్ల నీటిలో కలిపి మొక్కలు తడిసెలా పిచికారి చెయ్యండి. ఇది మొక్కలు త్వరగా మామూలు దశకు రావడానికి ఉపయోగపడుతుంది.
7. వయస్సు 45 రోజుల కన్నా తక్కువగా ఉన్న తోటలకు
ఎకరాకు 10 నుండి 20 కిలోల"" ""అమ్మోనియం సల్ఫేట్""
ఎరువును మొక్క మొదల్లలో కాన్డానికి రెండు వైపులా
""4 అంగుళాల "" దూరంలో
""గచిక🪄 ""
సహాయంతో పెట్టండి. షుమారుగా మొక్కకు ఒక"" టీ స్పూన్""🥄 పడుతుంది. దీనివలన మొక్క త్వరగా తెప్పరిల్లు కుంటుంది.
6. భూమి అదునుకు రాగానే సాధ్యమయినంత త్వరగా లోతుగా సేద్యం చెయ్యండి. దీనివలన భూమిలో ఉన్న నీరు త్వరగా ఆవిరి అయ్యి మొక్కలు త్వరగా కోలుకుంటాయి.
7. ముందు పోస్ట్ లో పెట్టిన విధంగా ఈ వాతావరణానికి "లీఫ్ బ్లైట్" (ఆకు మచ్చ) తెగులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వర్షం ఆగగానే
""అమిష్టార్ టాప్"" అనే మందును పిచికారి చెయ్యండి.
గమనిక,👇
ఈ విషయం సాటి రైతులకు తెలియజేయండి. Aacharya Kodali srinivas garu
Shout out to my newest followers! Excited to have you onboard! Chinni Somesh, Satyanarayana SatyanarayanaSatyanarayana
వృక్షోరక్షః రక్షితః ఎలినినో అని , ఇంకా రకరకాల కారణాలు చెపుతుంటారు వర్షాభావ పరిస్థితుల్లో . ప్రకృతికి రైతుకి పంటకి విడదీయరాని సంబంధం వున్నది . అందుకే మన పూర్వీకులు చెట్లకు ప్రాధాన్యత నిచ్చారు .
పచ్చదనం ఉన్నచోట్ల వర్షాలు బాగా పడుతాయని ఆధునిక శాస్త్ర విజ్ఞానం అంగీకరించింది . కనుమరుగు అయిన జ్యోతిష్య బిందు శాస్త్రము లో మానవుని జన్మనక్షత్రానికి ఒక్కో చెట్టును పూజనీయముగా పేర్కొన్నారు .
27 నక్షత్రాలు , 9 రాశులు , 8 దిక్పాలకులు కుల పేరిట చెట్లును బిందు శాస్త్రం ఉదాహరించినది . ఆయా చెట్ల గాలి శ్వాసించినచో మనిషికి రోగములు రావని ఆధునిక వైద్య శాస్త్రం అంగీకరించింది .
అటు ప్రకృతికి , ఇటు మానవునికి మేలు కలిగించేలా మన వీరన్నపాలెం గ్రామములో ఆయా చెట్లను ఒకే చోట ఉండేలా ఏర్పాటు చేయటం జరిగినది .
3 సం ల క్రితం చేపట్టిన ఈ కార్యక్రమము ఈ కార్తీక పౌర్ణమి నాటికీ ఒక రూపు దాల్చటం అందరికీ ఆనందదాయకం .ఈ వనం లో 35 కొబ్బరి , 75 ఆయుర్వేద జన్మ నక్షత్రములు మరియు 45 వివిధ రకముల పండ్ల మొక్కలు ఏర్పాటు చేసాము . రాబోయే నవ తరములకు పచ్చని గ్రామీణ వాతావరణం అందించాలన్నదే మా సంకల్పం .
ఇదే స్ఫూర్తి తో ప్రతి ఒక్కరూ చెట్లను సంరక్షిస్తారని ఆశిస్తున్నాము . గ్రామ ప్రారంభములో వున్న ఈ వనం ను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవచ్చు మరియు ఆరోగ్యాన్ని పొందండి . సర్వే జనః సుఖినో భవంతుహు .. 🙏 30 సం ల క్రితం శత ప్రతిష్ట ఆచార్యులు ఆదేశములతో గ్రామనైరుతీ దిక్కున ఆంజనేయ మందిరము ను శ్వేత నాగు పరివారము కొరకు నిర్మించటం జరిగినది . ఆచార్యుల అనుజ్ఞ ప్రకారముగా ద్వి పుష్కర కాలము తరువాత దేవరహస్యము బహిర్గతము చేసాము . ఇపుడు ప్రకృతి మాత అనుజ్ఞతో బిందు శాస్త్ర ప్రకారముగా ఈ వనమును ఏర్పాటు చేయుట జరిగినది .
భారత రాజ్యాంగ దినోత్సవము గా జరుపుకొనే నవంబర్ 26 న ముంబయి మారణ కాండ జరగటం విచారకరం . భారత దేశ సార్వభౌమత్వం పై దాడి గా అభివర్ణించారు . 166 మంది ప్రాణాలను గాలిలో కలిపేసిన కసబ్ కసాయి సేన చివరకు భారత వీరత్వం ముందు తలలు వాల్చేసినది . మన దేశ భద్రత డొల్లతనాన్ని , పాలకుల నిర్లక్ష్యాలని ప్రపంచానికి చాటిన ఈ సంఘటన ప్రజలను ఉలిక్కి పడేలా చేసినది .
1977 నవంబర్ 19 . ఆంధ్ర తీర ప్రాంతం చీరాల - మచిలీపట్టణం మధ్య సముద్ర తీరం ఫై రాకాసి జలఖడ్గం అర్ధరాత్రి సమయం లో విరుచుకు పడ్డ రోజు ఇది . వేల మంది ప్రజలు , లక్షల్లో పశువులు పంటలు భూములు నాశనము అయ్యాయి . దివి సీమ ఉప్పెనగా ఈ ప్రళయ జల ఖడ్గానికి పేరు .
ప్రకృతి ప్రళయాకారము మానవులు ను భయవిహ్వలుగా నిస్తేజముగా చేసినది . మడ అడవులు , సహజసిద్ధ తీర పొదలు కొంతప్రాంతాన్ని రక్షించాయి .ఆ తరువాత కాలం లో కూడా మనిషి ఈ సంఘటన నుండి గుణపాఠం నేర్చుకోకుండా సహజ తీరప్రాంతాన్ని ఇప్పటికీ నాశనం చేస్తున్నారు .అభివృద్ధి పేరిట తీరప్రాంతం లో ఇసుక తవ్వకాలు , రొయ్యలు , చేపల వ్యవసాయం , మడ అడవుల నరికివేత నిరాటంకముగా చేస్తూ ప్రకృతిని నాశనం చేస్తున్నారు .
రాబోవు తరముల భవిష్యత్తు కొరకు ఈ ప్రకృతి హననాన్ని అరికట్టుటకు మేధావులు , ప్రజలు చైతన్య పర్చాలి .ప్రతి ఒక్కరూ విరివిగా చెట్లును నాటండి . తీరప్రాంతాన్ని రక్షించండి . ప్రకృతిని రక్షించండి - ప్రకృతి మానవాళిని రక్షిస్తుంది .
ఓమ్ నమో నాగేశ్వరాయః ది 17 - 11 - 23 న మూడవ ఙఝాము నుండి పర్చూరు మండలం వీరన్నపాలెం గ్రామము నందలి అభయ ఆంజనేయ స్వామి ఆలయ మందిరము వల్మీకము నందు వేంచిసి యున్న స్వామి వారికీ విశేష పూజలు జరుగును . కాబట్టి భక్తులందరూ స్వామి వారిని సేవించుకొని సత్ కుటుంభ సౌఖ్యములు పొందగలరు .. 🙏
కార్తీక మాసము శివ కేశవులకు అత్యంత ప్రీతికరము .ఈ మాస ప్రారంభం లో చతుర్ధీ తిధి రోజున హిందూ సమాజము నాగులకు భక్తి శ్రద్దలతో పూజలు జరుపుకొంటారు . నాగులచవితి గా జరుపుకొనే ఈ రోజు ది 17 - 11 - 2023 న హిందూ స్త్రీలు నాగుల పుట్టల వద్ద కు వెళ్లి పాలు , చలిమిడి లను స్వామి వారికీ సమర్పించెదరు . 200 సం లకు పూర్వం శ్వేత నాగు పరివారం సంచరించిన అడవి ప్రాంతమే నేటి వీరన్నపాలెం గ్రామము లోని అభయ ఆంజనేయ స్వామి ఆలయ మందిరం .
సర్ప ఆకారము కలిగిన వై క్రోమోజోములు ఈదుకొంటూ పోయి స్త్రీ అండమును ప్రవేశించుట యే జీవుని ఆవిర్భావం . కుండలినీ సాధకులు పాము చుట్టలుగా పడిఉన్న కుండలినీ శక్తిని మానవుని దేహములో మేల్కొల్పుటకు కఠోర సాధన చేయుదురు
ది 17 - 11 - 23 న మూడవ ఙఝాము నుండి పర్చూరు మండలం వీరన్నపాలెం గ్రామము నందలి అభయ ఆంజనేయ స్వామి ఆలయ మందిరము వల్మీకము నందు వేంచిసి యున్న స్వామి వారికీ విశేష పూజలు జరుగును . కాబట్టి భక్తులందరూ స్వామి వారిని సేవించుకొని సత్ కుటుంభ సౌఖ్యములు పొందగలరు .. 🙏.
కార్తీక మాసము శివ కేశవులకు అత్యంత ప్రీతికరము .ఈ మాస ప్రారంభం లో చతుర్ధీ తిధి రోజున హిందూ సమాజము నాగులకు భక్తి శ్రద్దలతో పూజలు జరుపుకొంటారు . నాగులచవితి గా జరుపుకొనే ఈ రోజు ది 17 - 11 - 2023 న హిందూ స్త్రీలు నాగుల పుట్టల వద్ద కు వెళ్లి పాలు , చలిమిడి లను స్వామి వారికీ సమర్పించెదరు . 200 సం లకు పూర్వం శ్వేత నాగు పరివారం సంచరించిన అడవి ప్రాంతమే నేటి వీరన్నపాలెం గ్రామము లోని అభయ ఆంజనేయ స్వామి ఆలయ మందిరం .
నాటి శ్వేతనాగ ఛాయలతో స్వామివారు ఈ ఆలయములో వల్మీకములో వున్నారు . వ్యవసాయ ఆధారిత ప్రజలకు నాగులు చేయు మేలు సర్వదా శుభకరం .భూసారాన్ని పరిరక్షించుట లో , పంటలకు కీడు చేయు ఎలుకల సంతతి ని పరిమితం చేయుటలో నూ నాగులు ది అద్వితీయ పాత్ర .నీటిలోని విష పదార్ధాలు తొలగించుటలో తాబేళ్లు తరువాత పాత్ర సర్ప రాజులదే . ప్రాచీన భారతము లో నాగవంశ ప్రభువులు ఈ భూమి ని ఎలినారు . వారికీ ప్రత్యేక రాజ్యం కలదు .విలువైన సంపదలు కాపాడుటకు పూర్వులు నాగ బంధన ప్రక్రియ వాడుట నేటికీ తిరువనంత పురం పద్మనాభ ఆలయ 6 వ గది నందు గమనించవచ్చు ... ది 17 - 11 - 23 న మూడవ ఙఝాము నుండి పర్చూరు మండలం వీరన్నపాలెం గ్రామము నందలి అభయ ఆంజనేయ స్వామి ఆలయ మందిరము వల్మీకము నందు వేంచిసి యున్న స్వామి వారికీ విశేష పూజలు జరుగును . కాబట్టి భక్తులందరూ స్వామి వారిని సేవించుకొని సత్ కుటుంభ సౌఖ్యములు పొందగలరు .. 🙏.
హే కృష్ణ జగద్గురుహః ఒక చారిత్రిక యోధుడు . పురాణ పురుషునిగా మార్చి వేసి దేవుడు ను చేశారు . తన దార్శినికతో భూత భవిష్యత్ వర్తమానాలను సరిగ్గా అంచనా వేసి వర్తమానం లో స్థిరం గా నిలబడే సిద్ద పురుషుడు . జీవితమంతా పోరాటాలతో ఇంటా బయటా లౌకిక ప్రపంచాన్ని ఆవిష్కరించిన లౌకిక యోధుడు .వ్యక్తిత్వ వికాసము లో భగవద్గీత ను మించిన గ్రంధం ప్రపంచం లో ఇప్పటివరకూ రాలేదు . కృష్ణు ను భోద నే భగవద్గీత .
మానవ సంఘర్షణాత్మక జీవనం లో 700 అంశాలను వివరించి పరిష్కారములు చూపిన గీతా బోధకుడు . ఇప్పటికి 5528 సం . ల క్రితం ఈ నేలపై ది 18 -07 - 3228 ( కామన్ ఎరా కు ముందు ) శ్రావణ మాస అష్టమ తిధి బుధవారం అర్ధరాత్రి జన్మించి దేహమే దేవాలయముగా జీవుడే డైవముగా లోకానికి చాటిన గొప్ప యోగి . జీవితములో ప్రతి క్షణము ను , ప్రతి వ్యక్తిని , ప్రతి సంఘర్షణను బాధ్యత తో ఎదుర్కొని ఆదర్శ మానవ జీవనాన్ని చాటిన మహనీయుడు . .. ది 18 - 02 - 3102 ( కామన్ ఎరా ముందు ) నాడు కీకారణ్యం లో అనామకునిగా తనువు చాలించిన కర్మజీవి . చారిత్రక ధన్య జీవి మరియు ఆది గురువు శ్రీ కృష్ణుని జీవితము సమస్త మానవాళికి ఒక ఆదర్శ ఉదాహరణ . నమో కృష్ణ , కృష్ణం వన్డే జగత్ గురుహః 🙏 చీకట్లు ప్రార ద్రోలి వెలుగులకు ఆహ్వానం పలికే దీపాల పండుగ శుభాకాంక్షలు ..
అహింసో పరమో ధర్మః ధర్మ హింస తదేవచ , అహింస అనేది మంచిదే కానీ ధర్మమే హింసించ బడుచున్నపుడు ఎదురుతిరిగి హింస చేయాలి . ఇపుడు ప్రజాస్వామ్యము అను ధర్మము హింసించబడుతున్నది . కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం ప్రతి ఒక్క ఓటరు ధర్మము . ఒక్కసారి తప్పుడు ప్రలోభాలకు లొంగి ఓటును తప్పుడు గుర్తు కు వేశామా , రాష్ట్రం దేశం సర్వనాశనం అవుతాయి . మన కళ్ళముందే ఎన్నో ఉదంతాలు చూసాం , అనుభవించాం . మౌనముగా , నిస్సహాయముగా , నిరాశగా వేదనలు , బాధలు , కుమిలిపోయే రోదనలు విన్నాము . ప్రజాస్వామ్యములో ప్రజలే ప్రభువులు అనేది ఒట్టిమాట . ప్రతి నియోజకవర్గానికి ఒక సామంత రాజు , ప్రతి రాష్ట్రానికి ఒక రాజు , దేశానికి చక్రవర్తి లు గా మారి చివరకు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు . ప్రజల పన్నుల ధనము తో అభివృద్ధి , సంక్షేమం , ఉచితాల మాయలు చూపి దేశసంపదను చాటుగా దోసుకొంటున్నారు . ప్రజలు ఎప్పుడూ ఆర్ధికంగా ఎదగలేక పోతున్నారు కానీ ప్రజా నాయకులు మాత్రం కోట్లు కూడబెట్టుకొంటున్నారు . రాజకీయం సేవ కొరకు కాదు సంపాదన కొరకు అని ప్రజలకు అర్ధం అయ్యేలా చేసారు . బడుగులు , బలహీనులు అంటూ ప్రేమలు వలకబోస్తూ వారిని ప్రత్యర్థుల ఫై తప్పుడు కేసుల రక్షణ కవచం లా చేసుకొంటున్నారు . యుద్ధం శాంతి ని కలిగిస్తుంది . అది స్మశాన శాంతి అయినా ప్రశాంతముగా నే ఉంటుంది . కాబట్టి ఓటరులందరూ ఆలోచించండి . ప్రజాస్వామ్యాన్ని కాపాడండి . ఓటు ను సక్రమముగా వినియోగించండి . దేశాన్ని కాపాడండి . ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటానికి కళాకారులు , రచయితలు , అభ్యుదయవాదులు , సమాజ సేవకులు , ప్రశ్నించే గళములు , పెన్ను వీరులు తమ తమ పద్ధతుల్లో ప్రజలను చైతన్య పరచి , సమాజ హితము కొరకు ప్రజలకు ఓటు హక్కు ఫై అవగాహన కలిగించ వలసినదిగా మనవి .
ఏ అసురుడు ? ఏ శక్తీ ? ఏ ఈశుడు ? ఎవరు వీళ్లంతా ? జీవపరిణామ ములో ఎక్కడా కానరారు . వీళ్లంతా మానవాతీత శక్తులు . ఏ జీవులు ? ఏ జీవకులు ? దేహో దేవాలయః మనిషి దేహమే దేవాలయము . శారీరిక దుర్బలత్వం తో , పురుడు పురస్కారాలతో స్త్రీ తన మాతృ స్వామ్య వ్యవస్థకు , శక్తీ తత్వానికి సమాజాన్ని దూరం చేసుకొని గూడుకే పరిమితం . పురుష శక్తుల విశృంఖల విజృంభణాలు మొదలు మొదలు అయ్యాయి . బుద్ధం శరణం అంటూ , న విష్ణుం పృద్విహి అంటూ జీవక , ఆజీవకలు మొదలు అయ్యాయి . మనిషి మెదడులోని భయాందోళనలు అన్నీ పురాణాలూ , శ్రుతులు , జ్ఞానాలుగా మారాయి . నేనే విష్ణుః నేనే శివాహు అంటూ మానవులుని భ్రాంతిలో ముంచాయి . అనేక భావనలు , భ్రాంతులు , భయాలు మనకు పంచ భూతలను ప్రసాదించాయి . విభిన్న పోకడలు , తర్కానికి అందని స్తోత్రాలు మానవునికి మరో లోకం చూపించాయి . నిజాలిని తట్టుకోలేని మానవుని మేధస్సు భ్రాంతిలో జీవించటమే మంచిది .
భారతీయ న్యాయ వ్యవస్థ గురించి మునుపెన్నడూ లేని విధముగా ఈ మధ్య చర్చినీయాం అయినది .బ్రిటిష్ వారి మై లార్డ్ విధానము ఇంకా కొనసాగటం విస్మయకరము .ఎందరో అభాగ్యులు విచారణకు నోచుకోకుండా జైళ్లలో మగ్గిపోవటం విచారకరం .
ముఖ్యమైన వ్యక్తుల విషయములో వేగము చూపించే న్యాయ ప్రక్రియ సామాన్య ప్రజల ఆవేదనలు పరిగణ లోకి తీసుకోక పోవటం ప్రజాస్వామ్య దేశపు విడ్డురం గా చెపుతారు .
మన దేశం లో విచారణ ఖైదీలు 4 లక్షలు పైనే ఉండుట ఆచ్చర్యకరం .వీరిలో నిరుపేదలు , బలహీన వర్గాల వారు ఎక్కువగా వున్నారు . వీరి మానసిక , శారీరిక ఆరోగ్యాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి . వీరికి ఆర్టికల్ 21 ద్వారా రాజ్యాంగ రక్షణ వున్న కూడా ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు .
సెక్షన్ 436 ఏ ప్రకారముగా నేరం ఆరోపించిన ప్రకారముగా సదరు నిందుతుడు తన గరిష్ట శిక్షా కాలములో సగము కాలము నిర్బంధం లో ఉంటే తనను విడుదల చేయాలి . కానీ వాస్తవ ప్రక్రియలో అలా జరుగుట లేదు అనటానికి ఆంధ్ర లో కోడికత్తి కేసు పెద్ద ఉదాహరణ .
ఇప్పటికి అయినా రాజ్యాంగ నిపుణులు సామాన్యుల హక్కుల విషయం లో పెద్ద ఎత్తున చర్చ జరగాలి . ప్రజా హక్కులు కాపాడాలి .
నీరు జీవులన్నిటికీ ఆధారం . హిందూ పురాణాల్లో మొదటగా పేర్కొన్నది నీటి లో మత్యవతారమె . బైబిల్ లో జలప్రళయం లో దేవుడు పడవలో ఒక్కో ప్రాణి జీవుల్లో నుండి ఒక్కరిని కాపాడుకొంటాడు . ఇలా నీరు అన్ని జీవులకు లోపలా బయటా ఆధారం . మనము తీసుకొనే నీటి వలన మన జీవితములు ఆధారపడ్డాయి . ఎన్నో వ్యాధులకు కలుషిత నీరు మాత్రమే కారణం . అటవీ ప్రాంతాల్లో కూడా బాటిల్ వాటర్ తాగాల్సిన పరిస్థితి . పొలముల్లో వినియోగించిన క్రిమినాశన మందులు గ్రామాల్లో వాననీటిలో కలసి చెరువులు కుంటలలో చేరుతున్నాయి . ప్రజల్లో ఎక్కువమందికి ఈ నీరు జీవాధారము .ఈ నీరు తప్ప వేరే గత్యంతరం ప్రజలకు లేకపోవుట దురదృష్టకరం . ఇప్పుడు మెల్ల గా ఈ నీటిలో ప్లాస్టిక్ రేణువులు కూడా కలిసిపోయాయి . నీరు ఎక్కువ కాలం ప్లాస్టిక్ బాటిల్స్ నందు నిల్వ ఉంచటం , ఎక్కడికక్కడ ప్లాస్టిక్ నిల్వలు పేరుకుని భూమిలో సముద్రం లో కలిసి నశించకుండా ఉండిపోవటం జరుగుతున్నది . ఈ ప్లాస్టిక్ రేణువులు మన చుట్టూ నీరు ను కలుషితం చేయుట మనిషి స్వయంకృత అపరాధం . కాన్సర్ మరియు అంతుబట్టని రోగములకు ఈ నీరు ప్రధాన కారణం . వైద్య మాఫియా ను పోషిస్తూ తమను తాము జీవచ్ఛవాలుగా మార్చుకొంటూ సమిధలు అవుతున్న ప్రజలు మేల్కోవాలి .
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Category
Contact the business
Telephone
Website
Address
500085
Indian School Of Business
Hyderabad
Bringing you #technews that matter (and that doesn't) !
1/17, Road No 14, Banjara Hills
Hyderabad, 500034
VN Telugu brings you the Latest News, Politics, Current Affairs, Cricket, Sports, Business and Cinema
Kathamandu Nepal
Hyderabad
हम इस पेज पर knowledge के लिय ही पोस्ट करते हैं। कृपया आप इस पेज को follow कर सकते हैं�
Banjara Hills
Hyderabad, 50001
Ttv News Is a cable network based channel This Page Gives you News Update Mostly About Khammam District And Telangana State too And it is Runned by Shaik Ahmed Pasha Correspondent...