VaarthaNidhi - Telugu

వార్తానిధి.. సమస్త వార్తల సమాహారం.

వైన్ షాప్ తరలించాలని బోడుప్పల్లో నివాసితుల ఆందోళన!! 14/04/2024

నివాసాల మధ్య వైన్ షాప్ తరలించాలి : నివాసితులు
ప్రభుత్వ అనుమతితో ఏర్పాటు చేశాం : వైన్ షాప్ యాజమాన్యం

వైన్ షాప్ తరలించాలని బోడుప్పల్లో నివాసితుల ఆందోళన!! బోడుప్పల్, వార్తానిధి: నివాస ప్రాంతాలు విద్యా సంస్థల సమీపంలో వైన్ షాపులు ఏర్పాటు చేయొద్దని నిబంధనలు సూచిస్తున....

27/02/2024

బహిరంగ ప్రదేశాల్లో అక్రమ మతపరమైన నిర్మాణాలు ఉండొద్దు : సుప్రీం కోర్టు హైదరాబాద్, వార్తానిధి: బహిరంగ ప్రదేశాల్లో అక్రమంగా మతపరమైన నిర్మాణాలు ఉండొద్దని సుప్రీం కోర్టు స్పష్టం చేసిం.....

6 ఏళ్లు నిండిన వారికే ఒకటో తరగతిలో అడ్మిషన్స్ 27/02/2024

6 ఏళ్లు నిండిన వారికే ఒకటో తరగతిలో అడ్మిషన్స్ హైదరాబాద్, వార్తానిధి: 6 ఏళ్లు నిండిన వారికే ఒకటో తరగతిలో అడ్మిషన్స్ ఇవ్వాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

రూ.500లకే సిలిండర్ పథకంలో సర్కారు మెలిక! 27/02/2024

రూ.500లకే గ్యాస్ పథకం ముచ్చట!!

రూ.500లకే సిలిండర్ పథకంలో సర్కారు మెలిక! హైదరాబాద్, వార్తానిధి: తెలంగాణ ప్రభుత్వం రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకంలో చిన్న మెలిక పెట్టింది.

ర్యాడిసన్ బ్లూ హోటల్లో డ్రగ్స్ వినియోగం! 26/02/2024

ర్యాడిసన్ బ్లూ హోటల్లో డ్రగ్స్ వినియోగం! హైదరాబాద్, వార్తానిధి: గచ్చిబౌలి ర్యాడిసన్ బ్లూ హోటల్ లో డ్రగ్స్ వాడుతున్నట్లు సమాచారం వచ్చిందని.. అందుకే ఎస్ఓ.....

విద్యార్థులకు గంజాయి చాక్లెట్ల విక్రయం! 26/02/2024

విద్యార్థులకు గంజాయి చాక్లెట్ల విక్రయం! బాలానగర్, వార్తానిధి: పాఠశాల విద్యార్థులకు గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న వ్యక్తిని బాలానగర్ పోలీసులు అరె...

తెలంగాణ బిజెపి పంచతంత్ర వ్యూహం 22/02/2024

పంచతంత్రం!

తెలంగాణ బిజెపి పంచతంత్ర వ్యూహం హైదరాబాద్, వార్తానిధి: తెలంగాణ బిజెపి రాష్ట్ర పరిధిలో విజయ సంకల్ప యాత్రను చేపట్టేందుకు ఐదు క్లస్టర్లను రూపొంద....

22/02/2024

హైదరాబాద్ నగరం కింద సొరంగాలు!! హైదరాబాద్, వార్తానిధి: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి రేవంత్ ప్రభుత్వం బహుళ భూగర్భ సొరం.....

విశాఖలో ఘనంగా నౌకాదళ మిలాన్2024 ఉత్సవాలు 22/02/2024

విశాఖలో ఘనంగా నౌకాదళ మిలాన్2024 ఉత్సవాలు విశాఖపట్నం, వార్తానిధి: భారత నౌకాదళం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఉత్సవాలు విశాఖలో ఘనంగా సాగుతున్నాయ.....

న్యూఢిల్లీలో రైసీనా డైలాగ్ సమావేశాలు 22/02/2024

న్యూఢిల్లీలో రైసీనా డైలాగ్ సమావేశాలు

న్యూఢిల్లీలో రైసీనా డైలాగ్ సమావేశాలు న్యూఢిల్లీ, వార్తానిధి: భౌగోళిక, రాజకీయాలు, ఆర్థిక విషయాలపై జరుగుతున్న రైసినా డైలాగ్ సదస్సు న్యూఢిల్లీలో జరుగు...

ఫ్రీబస్ పథకం వల్ల నరకం చూస్తున్నామని ఆర్టీసీ డ్రైవర్ ఆవేదన.. 22/02/2024

ఫ్రీ బస్ పథకం తెచ్చిన తంటాలు..

ఫ్రీబస్ పథకం వల్ల నరకం చూస్తున్నామని ఆర్టీసీ డ్రైవర్ ఆవేదన.. హైదరాబాద్, వార్తానిధి: ప్రభుత్వ ఫ్రీ బస్ పథకం వల్ల నరకం చూస్తున్నామని ఓ ఆర్టీసీ డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేస్తున్.....

దేవాలయాలపై కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ పన్ను! 22/02/2024

దేవాలయాలపై పన్ను!!

దేవాలయాలపై కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ పన్ను! కర్ణాటక, వార్తానిధి: అధిక ఆదాయం ఉన్న దేవాలయాలపై పన్ను విధించేందుకు ఉద్దేశించిన కొత్త ఎండోమెంట్స్ బిల్లుకు కర్....

ఈనెల 30 నుంచి శౌర్య జాగరణ యాత్ర 15/09/2023

విశ్వహిందూ పరిషత్ (VHP) స్థాపించి 60 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా.. ప్రపంచవ్యాప్తంగా VHP షష్టిపూర్తి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని పరిషత్ ప్రచార ప్రముఖ్ పగడాకుల బాలస్వామి తెలిపారు.

ఈనెల 30 నుంచి శౌర్య జాగరణ యాత్ర హైదరాబాద్, వార్తానిధి: విశ్వహిందూ పరిషత్ (VHP) స్థాపించి 60 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా.. ప్రపంచవ్యాప్తంగా VHP షష్ట....

ఉపాధ్యాయ బదిలీల్లో ధ్రువపత్రాల రీవెరిఫికేషన్ చేయాలి : తపస్ 15/09/2023

రంగారెడ్డి జిల్లా, వార్తానిధి: 2023 ఉపాధ్యాయ బదిలీల్లో అవకతకవలను నివారించేందుకు ధ్రువపత్రాల రివెరిఫికేషన్ చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) కోరింది. ఈ మేరకు సంఘం నాయకులు పలు అంశాలతో కూడిన వినతి పత్రాన్ని రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ భూపాల్ రెడ్డికి అందజేశారు.

ఉపాధ్యాయ బదిలీల్లో ధ్రువపత్రాల రీవెరిఫికేషన్ చేయాలి : తపస్ రంగారెడ్డి జిల్లా, వార్తానిధి: 2023 ఉపాధ్యాయ బదిలీల్లో అవకతకవలను నివారించేందుకు ధ్రువపత్రాల రివెరిఫికేషన్ చేయా.....

ప్రత్యేక పాయింట్స్ రద్దు చేసి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి : తపస్ 12/09/2023

రంగారెడ్డి జిల్లా, వార్తానిధి: ప్రమోషన్లు, బదిలీల కోసం తప్పుడు ధ్రువ పత్రాలు సమర్పించిన ఉపాధ్యాయులకు ప్రత్యేక పాయింట్స్ రద్దు చేసి ఇతర ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) కోరింది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టరుకు వినతి పత్రాన్ని సమర్పించింది.

ప్రత్యేక పాయింట్స్ రద్దు చేసి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి : తపస్ రంగారెడ్డి జిల్లా, వార్తానిధి: ప్రమోషన్లు, బదిలీల కోసం తప్పుడు ధ్రువ పత్రాలు సమర్పించిన ఉపాధ్యాయులకు ప్రత్యేక ...

30/08/2023

వార్తానిధి పాఠకులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు

Lokkalyan Margలో ప్రధాని మోడీ రక్షాబంధన్ వేడుకలు 30/08/2023

దిల్లీలోని లోక్ కల్యాణ్ మార్గ్ 7లో రక్షాబంధన్ వేడుకలు అంబరాన్ని అంటాయి. చంద్రయాన్-3 విజయాలు చిన్నారులు పంచుకుంటూ ఉండగా ఆనందోత్సాహాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ వేడుకలను జరుపుకున్నారు. వారి ఆనందంతో తాను సంబరపడ్డారు.

Lokkalyan Margలో ప్రధాని మోడీ రక్షాబంధన్ వేడుకలు వార్తానిధి, దిల్లీ: దిల్లీలోని లోక్ కల్యాణ్ మార్గ్ 7లో రక్షాబంధన్ వేడుకలు అంబరాన్ని అంటాయి.

అగస్టు 21న తపస్ ఆధ్వర్యంలో మహా ధర్నా 19/08/2023

అగస్టు 21న తపస్ ఆధ్వర్యంలో మహా ధర్నా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) విద్యా రంగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం మహాధర్నాను చేపట్టనుంది.

తపస్ ఆధ్వర్యంలో రంగారెడ్డి కలెక్టరేట్ ముందు ధర్నా 10/08/2023

తపస్ ఆధ్వర్యంలో రంగారెడ్డి కలెక్టరేట్ ముందు ధర్నా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) ఆధ్వర్యంలో కొంగరకలాన్ లోని రంగారెడ్డి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు.

Photos from VaarthaNidhi - Telugu's post 29/07/2023

బోడుప్పల్ వక్ఫ్ బాధితుల జేఏసీ సమావేశం పద్మావతి కాలనీ ద్వారకా భవనులో శనివారం జరిగింది. వక్ఫ్ బోర్డు బాధిత కాలనీల్లో సమస్యను వివరిస్తూ ఫ్లెక్సీ లు ప్రదర్శించాలని నిర్ణయించారు. త్వరలోనే కార్యాచరణ ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు, సభ్యులు, మునిసిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

27/07/2023

జాతీయ ఉపాధి హామీ పథకం కింద తోటలను పెంచుకోవాలనుకునే వారు ఈ నెల 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గ ప్రక్రియ వల్ల ఇది ఇప్పటి దాకా ఎక్కువగా ప్రచారంలోకి రాలేదని దుబ్బాక ఎమ్మెల్యే, బీజేపీ నేత రఘునందనరావు గురువారం అన్నారు.

ఈ పథకం కింద భూమి చూపించిన అర్హులైన వారికి మొక్కలు పంపిణీ చేస్తారన్నారు. ఆ తర్వాత మెయింటెనెన్స్ కోసం ఖాతాలో డబ్బులు జమ చేస్తారని వివరించారు.

ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి పట్టాదారులు, ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులు అందరు కూడా దీనికి అర్హులన్నారు. ఉపాధి హామీ జాబ్ కార్డు ఉన్నవారు పథకానికి దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. మామిడి, జామ, నిమ్మ, దానిమ్మ, సీతాఫలం, మునుగ, కొబ్బరి, డ్రాగన్ ఫ్రూట్ సహా పండించుకోవచ్చు అని పేర్కొన్నారు. అర్హులు అందరు కూడా ఈ నెల 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ నాయకులు దీనికి విస్తృత ప్రచారం కల్పించాలి' అని కోరారు.

27/07/2023

నేషనల్ డెవలప్ మెంట్ ఇంక్లుజివ్ అలయన్స్ (I.N.D.I.A) పేరిట తమకు వ్యతిరేకంగా కూటమి కట్టిన విపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. నాడు మహాత్మా గాంధీ క్విట్ ఇండియా నినాదం చేశారని, ఇప్పుడు అవినీతి, రాజకీయాలను దేశం నుంచి పారదోలేందుకు క్విట్ ఇండియా అనాల్సి వస్తోందని విమర్శించారు.

"క్విట్ ఇండియా అన్నది మహాత్మాగాంధీ నినాదం. అవినీతిపరులు, బుజ్జగింపు రాజకీయాలు చేసేవారు, మందీమార్బలంతో రాజకీయాలు చేయాలనుకునేవారు దేశం విడిచిపోవాలంటే మేం ఇవాళ క్విట్ ఇండియా (I.N.D.I.A) అంటున్నాం.

గతంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఇండియా అంటే ఇందిరానే, ఇందిరా అంటే ఇండియానే అని ప్రచారం చేసుకున్నారు. కానీ ప్రజలు ఆమెను ఓడించారు. ఇప్పుడీ అహంకారులు మరోసారి అలాంటి నినాదమే చేస్తున్నారు.

కాంగ్రెస్ ఒక దశాదిశ లేని పార్టీ. కుంభకోణాల్లో చిక్కుకున్న కంపెనీలు ఎలా పేర్లు మార్చుకున్నాయో, కాంగ్రెస్ పార్టీ మిత్ర పక్షాలు కూడా అలాగే కొత్త పేర్లతో వస్తున్నాయి" అంటూ మోదీ ధ్వజమెత్తారు.

26/07/2023

నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో

తెలుగు రాష్ట్రాల్లో బాలికలు, మహిళల మిస్సింగ్ కేసుల వివరాలను కేంద్ర హోంశాఖ వెల్లడించింది.

ఏపీలో 2019 నుంచి 2021 వరకు 7,928 మంది బాలికలు, 22,278 మంది మహిళలు మిస్సయ్యారని పేర్కొంది.

తెలంగాణలో 8,066 మంది బాలికలు, 34,495 మంది మహిళలు కనిపించకుండా పోయారని తెలిపింది.

26/07/2023

చారిత్రాత్మక కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయ పవిత్రతను దెబ్బతీసేలా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలను తీసుకోవాలని తెలంగాణ ప్రాంత విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది. పరిషత్ నాయకులు మాట్లాడుతూ నిందితులపై ప్రత్యక్ష సాక్షి లిఖితపూర్వక ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

Photos from VaarthaNidhi - Telugu's post 26/07/2023

న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని కొత్త ఐటీపీఓ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్-కమ్-కన్వెన్షన్ సెంటర్‌ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సెంటర్ నిర్మాణంలో భాగస్వాములైన కార్మికులను ఆయన ఘనంగా సత్కరించారు. భారతదేశంలో కాన్ఫరెన్స్ టూరిజాన్ని పెంచేందుకు ఈ సెంటర్ దోహదపడుతుందని ప్రధాని అన్నారు.

26/07/2023

కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంతో ఒరిగేదేమీ లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు మూడూ ఒక్కటేని చెప్పారు. ఈ మూడు పార్టీల మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ మూడు పార్టీలు పలుసార్లు తెలంగాణను పాలించాయని చెప్పారు.

26/07/2023

మహారాష్ట్రలోని లోక్ సభ స్థానాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారిస్తున్నారని సమాచారం. ఇందుకు రహస్య సర్వే జరుగుతున్నట్లు చర్చ జరుగుతోంది. ఎంపీగా పోటీ చేసేందుకు నాందేడ్, ఔరంగాబాద్, షోలాపూర్, లాతుర్, ఉస్మనాబాధ్ లోక్ సభ స్థానాల్లో అనుకూలమైన స్థానం కోసం చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే జరిగితే ఈసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా మంత్రి కేటీఆర్ ముఖం తెరపైకి వస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

26/07/2023

The Greater Hyderabad Municipal Corporation’s (GHMC) disaster management wing is on high alert as the city is expected to be hit by heavy rains on Wednesday till evening.

“Heavy rainfall is expected to continue over the city until the evening. Citizens may dial 9000113667 for DRF assistance,” a tweet by the Director Of Enforcement Vigilance & Disaster Management of the municipal body said.

26/07/2023

2004లో అప(UPA) ప్రభుత్వం ఏర్పడడానికి బాటవేసిన వారెవరు?

నాటి కమ్యూనిస్టుపార్టీ (మార్క్సిస్టు) ప్రధాన కార్యదర్శి హరికిషన్ సింగ్ సూర్జిత్ ఒకరైతే, సెఫాలజిస్టుగా ముద్ర పడిన యోగేంద్రయాదవ్ రెండవవాడు.

ఆనాటి ఎన్నికల తర్వాత ఫలితాలు అందరినీ విస్మయ పరిచాయి. భాజపా 44 స్థానాలను కోల్పోయింది. కాంగ్రెసు 28 స్థానాలను గతంలోకంటే అధికంగా గెలుచుకొంది. వామపక్షాలు ఎన్నడూ లేనివిధంగా 61స్థానాల్లో గెలిచాయి. డిఎంకె కూటమి 40స్థానాల్లో గెలిచింది.

తెదేపా తాను ఘోరంగా ఓడిపోవటమేగాక, నాటి ఆంధ్రప్రదేశ్ లో భాజపా తనకున్న 7స్థానాలనూ కోల్పోవడానికి కారణమైంది.

అటువంటి స్థితిలో ఎన్డీఏ కూటమిలో లేని అన్ని పార్టీలను కూడగట్టి భాజపాకి వ్యతిరేకంగా ప్రభుత్వం ఏర్పడితీరాలని ప్రబోధించి అది సాధ్యమయ్యేలా చూసింది హరికిషన్ సింగ్ సూర్జిత్.

ఇందులో యోగేంద్ర యాదవ్ పాత్ర ఏముంది అని గదా, మీప్రశ్న?

ఎన్నికలకు మూడునెలల ముందే సెమినార్ పత్రికలో ఆయన ఒక వ్యాసం వ్రాశాడు. ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఎవరు ఏవిధంగా ఏర్పరచగలరనే విషయమై నాలుగు రకాల అవకాశాలున్నాయని ఆ వ్యాసంలో వివరించాడు.

1) భాజపా, దానిమిత్రపక్షాలకూ 272స్థానాలకుమించివస్తే మరల ఎన్డీయే ప్రభుత్వమే వస్తుంది.

2) పాతిక-ముప్పై స్థానాలు తక్కువ పడినా, ఇంతకు ముందు కూటమిలో లేని పక్షాలనుండి సహకారం తీసుకొని, క్రొత్తగా మరికొన్ని భాగస్వామ్యం పక్షాలను కూర్చుకొని ఎన్డీయే మళ్లీ ప్రభుత్వం ఏర్పరచగలదు.

3) కాంగ్రెసు, దాని మిత్రపక్షాలకూ కలిపి ఆధిక్యం లభిస్తే, కాంగ్రెస్ నాయకత్వాన ప్రభుత్వం ఏర్పడగలదు.

4) ఎన్డీఏ 240 చేరుకోలేక, కాంగ్రెస్, దానిమిత్రపక్షాలూ కలిసి 190- 200స్థానాలుకూడా సాధించలేని స్థితి ఏర్పడితే, భాజపా వ్యతిరేక పక్షాలన్నీకలిసిపోయి, అప్పటివరకు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకొన్నది, కత్తులు దూసుకొన్నదీ హాయిగా మరిచిపోయి, చెట్టాపట్టాల్ వేసుకొని ప్రభుత్వ మేర్పరుస్తాయి.

(ఇక్కడ ఉపయోగించిన పదజాలాన్నే యోగేంద్ర యాదవ్ ఉపయోగించాడని అనుకోవద్దు. అతడు చేసిన ప్రతిపాదనల సారాంశమది)

ఆ నాల్గవ పద్ధతిలోనే చివరికి ప్రభుత్వం ఏర్పాటైన సంగతి మనకు తెలిసిందే.

ఇప్పుడు కూడా అటువంటి పద్ధతిలోనే - సమాన అవగాహనతోగాని , ఉమ్మడి కార్య ప్రణాళికతోగాని సంబంధం లేకుండా, సమాన వైరం ప్రాతిపదికగా భాజపా బలం 272కి తగ్గితే చాలు, ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయెన్స్ ప్రభుత్వాన్ని ఏర్పరచగలమని ఉత్సాహపరచ యత్నిస్తున్నాడు.(21జులై నాటి ఆంధ్రజ్యోతిలో ఆయన వ్రాసిన వ్యాసం చూడండి)

ఇటీవల రాహుల్ గాంధీ చేసిన సకల సదుపాయాలతో కూడిన భారత్ జోడో పాదయాత్రకు కావలసిన యోజనలను రూపొందించినది యోగేంద్ర యాదవే నన్న సమాచారం మీకు తెలిసే ఉంటుంది.

"జుడేగా భారత్, జీతేగా ఇండియా" అంటూ ప్రజలముందు ఒక క్రొత్త ప్రణాళికను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు. దీనిలో దాగిఉన్న ప్రమాదాలను గమనించి జాగరూకులమై మనప్రజానీకం వ్యవహరించ వలసి యున్నది.


Article credits : Vijayasaradhi Vaddi

Want your business to be the top-listed Media Company in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

VHP demands to take action against culprits at Karmanghat Hanuman temple

Address


Hyderabad
500001
Other News & Media Websites in Hyderabad (show all)
Zeta Web Zeta Web
6-3-679, II-IV Floors, Elite Plaza, Durga Nagar, Somajiguda
Hyderabad, 500082

A Byte of Sport A Byte of Sport
Plot # 20, NCL Colony
Hyderabad, 500055

Sink your teeth into a delectable dose of sporting bytes.

Ruposhi Bangla News Ruposhi Bangla News
Cherllapaly Hyderabad
Hyderabad, 500051

To Our Readers, Welcome to RuposhiBanglanews, As every internet user, you may also search or research your Queries so that you can find reliable articles and trustable sources whi...

Adya TV Adya TV
Hyderabad
Hyderabad, 500004

Adya TV Which will Constantly keep you updated with the Latest Breaking News

MemeCopy Guru MemeCopy Guru
Ameerpet
Hyderabad

Just For Fun

Trending Topics Trending Topics
Hyderabad, 500001

Trending News

NewsTides.com NewsTides.com
Sufi Chambers Building, 4th Floor, Banjara Hills
Hyderabad, 500002

Newstides is your one-stop portal for everything you need to know and stayinformed. Newstides provides you with all-inclusive coverage of news across all channels direct from sourc...

Vartamanam Vartamanam
Hyderaba
Hyderabad

News Portal

Telugu Mark Telugu Mark
HYDERABAD MADHURANAGAR
Hyderabad, 500073

SSC Digital SSC Digital
Hyderabad

Telugu Garrage Telugu Garrage
HYDERABAD
Hyderabad

ఇచ్చట అన్ని లభించును... AtoZ

Top Trending Topics Top Trending Topics
Hyderabad
Hyderabad, 500045

Most Telugu Entertainment & Latest News Updates Please Like, Share,& Click Follow