VS VaruShoban

VS VaruShoban

నా ప్రయాణం సామాన్య ప్రజలతో…
నా యుద్ధం పెత్తందార్లతో…
నా లక్ష్యం పేదరిక నిర్మూలన…

08/11/2023

బీహార్ అసెంబ్లీలో సిఎం నితీశ్ క్షమాపణలు

పాట్నా : బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో, వెలుపల క్షమాపణలు తెలిపారు. మంగళవారం ఆయన సభలో జనాభా విషయంపై చేసిన ప్రసంగంలో మహిళలను అసభ్యంగా చిత్రీకరించినట్లు దుమారం చెలరేగింది. మహిళలకు ప్రత్యేకించి బాలికలకు లైంగిక పరిజ్ఞానం అవసరం అని, బాలికలకు సరైన సెక్స్ పరిజ్ఞానం ఉండటం వల్లనే రాష్ట్రంలో సంతానోత్పత్తి తగ్గిందని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగానే కాకుండా సామాజికంగా విమర్శలకు దారితీశాయి. దీనితో ఈ నేత బుధవారం అసెంబ్లీలోకి రాగానే తాను చేసిన వ్యాఖ్యలు చాలా మందికి రుచించలేదని, ఈ విషయం తనకు తెలిసిందని, రాష్ట్రంలోని మహిళలకు సరైన సాధికారికతకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలియచేయడం తమ ఉద్ధేశం అని వివరించారు. ఈ క్రమంలో మహిళకు సమగ్రరీతిలో విద్యా , అక్షరాస్యత ఇనుమడించాలనేదే లక్షం అని తెలిపారు.

ఈ క్రమంలోనే తాను జనాభా నియంత్రణలో మహిళ కీలక పాత్రకు సరైన పరిజ్ఞానం అవసరం అని తెలిపానని, ఈ దశలోఎవరైనా నొచ్చుకుంటే , అందుకు బాధ్యత వహిస్తూ తాను క్షమాపణలు తెలియచేస్తున్నానని వెల్లడించారు. తన మాటలను ఉపసంహరించుకుంటున్నానని వివరించారు. అయితే సభ ఆరంభం కాగానే బిజెపి సభ్యులు ప్రతిపక్ష నేత విజయ్‌కుమార్ సిన్హా ఆధ్వర్యంలో వెల్‌లోకి దూసుకువెళ్లారు. సిఎం రాజీనామా చేయాలని నినాదాలకు దిగుతూ ,ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. నితీశ్ చివరికి మెంటల్ తరహా అయ్యారని, ఇక సిఎం పదవికి అనర్హుడని విమర్శించారు. సిఎం రాజీనామా డిమాండ్‌ను స్పీకర్ అవధ్ బిహారీ చౌదరి తోసిపుచ్చారు. ప్రజలు, ఈ సభ విశ్వాసం పొందిన వ్యక్తి వైదొలగాలని చెప్పే హక్కు అధికారం ప్రతిపక్షాలకు లేదని తేల్చిచెప్పారు.

అయినా గందరగోళ పరిస్థితి కొనసాగింది. దీనితో సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. బుధవారం ఉదయం అసెంబ్లీ ముఖద్వారం వద్ద కూడా బిజెపి సభ్యుల నుంచి సిఎంకు నిరసన వ్యక్తం అయింది. సిఎం నితీశ్ చాలాసేపటి వరకూ గేట్ వద్దనే నిశ్చేష్టులై నిలబడ్డారు. తరువాత సభలోకి ప్రవేశించారు. శాసనమండలిలోనూ సిఎం తమ వ్యాఖ్యలకు క్షమాపణలు తెలిపారు. తాను జర్నలిస్టుల సమక్షంలో కూడా వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేసినట్లు తెలియచేసుకున్నారు.

01/10/2023

పత్తి రైతులకు కేంద్రం శుభవార్త

ఆదిభట్ల : పత్తి రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. మద్దతుధర ప్రకటించి కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తెస్తోంది. ఈమేరకు వివరాలను జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్ ఛాయాదేవి వివరాలను మీడియాకు వెల్లడించారు. పత్తిరైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తాము పండించిన పంటను దళారులకు విక్రయించరాదని కేంద్ర ప్రభుత్వం సూచించింది. పత్తిమద్దతుధర పింజపొడవు పత్తికి రూ.7020గా, మధ్యస్థ పింజపొడవు పత్తి ధర రూ.6020గా ప్రకటించింది. రైతులు తాము పండించిన పత్తిని దళారులకు విక్రయించరాదని కేంద్రం సూచించింది. అలాగే పత్తిరైతులకు కొన్ని ప్రత్యేకమైన సూచనలను చేసింది.

పత్తి తేమ శాతం 8 నుండి12 శాతం లోబడి ఉండాలని పేర్కొంది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించబడే కొనుగోలు కేంద్రాల్లో రైతులు స్వయంగా వచ్చి తమ పంటను విక్రయించాలని సూచించింది. కొనుగోలు కేంద్రాల్లో ఆధార్ ధృవీకరణ అనంతరం రైతుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపింది. రైతులు తమ ఆధార్‌కార్డును బ్యాంకు ఖాతాకు లింక్‌చేసి ఉండాలని సూచించింది. ఆధార్‌కార్డు లేని పక్షంలో రైతులు తాము నమోదుచేసుకున్న ఆధార్ నంబర్ రశీదుతో ఏదైనా దృవీకరణ పత్రముతో కొనుగోలు కేంద్రాల్లో సందర్శించాలని సూచించింది.

01/10/2023

కొంప ముంచుతున్న అత్యాశ

హైదరాబాద్: బాధితులను అన్ని రకాలుగా దోచుకుంటున్న నేరస్థులు పెట్టుబడుల పేరుతో మోసం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్, స్టాక్‌మార్కెట్‌పై పెట్టుబడిపెట్టే వారి సంఖ్య ఎక్కువ అవుతోంది. ఇలా సంప్రదించిన వారికి మయమాటలు చెప్పి పెట్టుబడిపెట్టించి మోసం చేస్తున్నారు. కోట్లాది రూపాయలు పెట్టుబడిపెట్టించి నిండా ముంచుతున్నారు నేరస్థులు. గతంలో సైబర్ నేరస్థులు స్టాక్‌మార్కెట్‌పై ఆసక్తి చూపుతున్న వారిని టార్గెట్‌గా చేసుకుని దోచుకునే వారు, ఇటీవలి కాలంలో నేరుగా పెట్టుబడిపెట్టే వారిని కూడా టార్గెట్ చేసుకుని దోచుకుంటున్నారు. వృద్ధులను టార్గెట్‌గా చేసుకుని మోసం చేస్తున్న వ్యక్తిని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు టాటా క్యాపిట్‌లో ఉన్నతాధికారిగా పనిచేస్తున్నాడు.

వృద్ధులు టాటా క్యాపిటల్‌లో పెట్టుబడిపెట్టేందుకు ఆసక్తి చూపిగా వారికి మాయమాటలు చెప్పి వేరే కంపెనీలో పెట్టుబడిగా పెట్టించి తనకు రావాల్సిన లక్షలాది రూపాయల కమీషన్ తీసుకుని జారుకున్నాడు. నిందితుడి మాటలు నమ్మిన వృద్ధులు మూడు అనామక కంపెనీల్లో రూ.3,56,74,000 పెట్టుబడిపెట్టారు. ఏడాదికి 12శాతం లాభాలు వస్తాయని చెప్పడంతో వారు నిందితుడి మాటలు నమ్మారు. కాని పెట్టుబడి పెట్టి మూడేళ్లు అవుతున్నా ఎలాంటి లాభాలు లేకపోగా పెట్టిన పెట్టుబడి తిరిగి రాలేదు. తాము పెట్టిన పెట్టుబడి రూ.36,94,989 కావడంతో తమ డబ్బులు పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడికి మాత్రం కమీషన్ రూపంలో 47,48,000 వచ్చింది. మరో కేసులో విల్లా పేరుతో మోసం చేసి రెండు కోట్ల రూపాయలు కొట్టేశారు నిందితులు. ఈ కేసులో ఒకే కంపెనీలో పనిచేస్తున్న వారిని నిండాముంచారు. విల్లాల నిర్మాణాలు మధ్యలో ఆగిపోయాయని, వాటికి డబ్బులు అవసరం ఉందని, డబ్బులు ఇస్తే తిరిగి అధిక వడ్డీ ఇస్తామని చెప్పి రూ.2కోట్లు తీసుకుని నిండాముంచారు.

రెండు కేసుల్లో బాధితులు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గతంలో కూడా సైబర్‌నేరస్థుల స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడిపెట్టే వారిని టార్గెట్‌గా చేసుకుని మోసం చేశారు. తాము చెప్పిన కంపెనీలో పెట్టుబడిపెడితే అధికంగా లాభాలు వస్తాయని చెప్పి వాట్సాప్, టెలీగ్రాంలో సైబర్ నేరస్థులు మెసేజ్‌లు పంపిస్తున్నారు. వాటిని చూసి ఆకర్షితులైన వారిని ట్రాప్ చేసి కోట్లాది రూపాయలు దోచుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధికి చెందిన బానోతు కిరణ్‌కుమార్‌కు పశ్చిమబెంగాల్‌కు చెందిన నిందితులు పెట్టుబడికి చెందిన లింక్ పంపించాడు. దానిని క్లిక్ చేసిన బాధితుడు నిందితులతో మాట్లాడాడు. ఆన్‌లైన్‌లో రూ.86లక్షలు పంపిస్తే భారీగా లాభాలు వస్తాయని చెప్పారు. డబ్బులు డిపాజిట్ చేసిన తర్వాత లాభాలతో కలిపి వాటిని తీసుకోవచ్చని చెప్పారు. ఇది నమ్మిన బాధితుడు డబ్బులు ఆన్‌లైన్‌లో నిందితులు చెప్పిన బ్యాంక్ ఖాతాలకు పంపించాడు. కొద్ది రోజులకు మీకు భారీగా లాభాలు వచ్చాయని ఆన్‌లైన్‌లో నిందితులు చూపించారు.

దానిని విత్‌డ్రా చేసేందుకు బాధితుడు ప్రయత్నించగా సాధ్యం కాలేదు. నిందితులకు ఫోన్ చేసినా కూడా స్పందించలేదు. దీంతో తాను మోస పోయానని గ్రహించిన బాధితుడు రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇలాంటి నేరాలు చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు. నేపాల్ దేశానికి చెందిన నిందితులు సిలిగురిలో ఉంటూ కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. పలువురు బాధితుల నంబర్లు తీసుకుని ఫోన్లు చేస్తున్నారు. వీరి మాటలను నమ్మిన వారు నిండామునుగుతున్నారు. నగరానికి చెందిన ఓ వృద్ధురాలికి ముంబైకి చెందిన నిందితులు ఫేస్‌బుక్‌లో మెసేజ్ పెట్టారు. తమ ద్వారా స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించారు. దానిని నమ్మిన బాధితురాలు వారికి రూ.5కోట్లు ఇచ్చింది. వాటిని తీసుకున్న నిందితులు కొద్ది రోజులు లాభాలు వచ్చాయని చూపించారు. తర్వాత కొద్ది కాలానికి బాధితురాలికి తెలియకుండానే షేర్లను విక్రయించారు. నిందితులు ఏకంగా వారు నిర్వహిస్తున్న ఆఫీస్‌ను కూడా ఖాళీ చేసి వెళ్లి పోయారు.

బాధితురాలు ఫోన్ చేసినా నిందితులు స్పందిచడం మానివేశారు. దీంతో తాను మోసపోయానని గ్రహించి నగర సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్టు చేశారు. నగరానికి చెందిన యువకుడికి క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని ఫేస్‌బుక్‌లో ఓ వ్యక్తి మెసేజ్ పంపించాడు. దీనిని నమ్మిన యువకుడు తాను డబ్బులు పెట్టడమే కాకుండా తన స్నేహితులతో కూడా డబ్బులు పెట్టుబడి పెట్టించాడు. బాధితుడి నుంచి సైబర్ నేరస్థులు రూ.16లక్షలు తీసుకున్న తర్వాత ముఖం చాటేశారు. దీంతో యువకులు నిండా మునిగారు, నగర సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అధికంగా ఆశపడితే….
చాలా కేసుల్లో బాధితుల అత్యాశ వల్లే నేరస్థుల బారిన పడుతున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. ఒక కంపెనీలో పెట్టిన పెట్టుబడిపై లాభాలు రావాలంటే చాలా కాలం వేచి ఉండాలని, కానీ చాలా మంది పెట్టుబడి దారులు తక్కువ సమయంలో అధికంగా లాభాలు రావాలని ఆశపడడంతో నేరస్థుల చేతుల్లో పడి మోసపోతున్నారు. ఏదైనా కంపెనీలో పెట్టుబడిపెట్టు ముందు నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుని పెట్టాలి. ఇలా చేయకుండా ఆన్‌లైన్‌లో పరిచయమైన వారు, ముక్కుమోహం తెలియని వారి మాటలు నమ్మి పెట్టుబడి పెడితే లాభాల మాట దేవుడెరుగు ఉన్న డబ్బులు కోట్లాది రూపాయలు నేరస్థులు చేతుల్లో పెడుతున్నారు. ఇలా అత్యాశకు పోయిన వారు నిండిముగునుగుతున్నారు.

11/07/2023

అజ్ఞానం తో రేవంత్ రెడ్డి

హైదరాబాదు: అమెరికా లో ఉచితాల గురించి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశాడని రాష్ట్ర జల వనరుల సంస్థ ఛైర్మన్ వి ప్రకాశ్ ఖండిస్తున్నామన్నారు.
మొన్న ఈ మధ్యలో ధరణి ఎత్తేస్తాం అన్నాడు దానితో రాష్ట్ర రైతులు అందరూ ఆందోళన వ్యక్తం చేశారు

మళ్ళీ ఇప్పుడు అజ్ఞానం తో రేవంత్ రెడ్డి రైతులకు మూడు గంటల విద్యుత్ సరఫరా సరిపోతుంది అన్నాడు.కానీ 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడంతో దేశానికి అన్నం పెట్టే రాష్ట్రాంగా తెలంగాణ రైతులు ఎదిగారు.

24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల తో ఇవాళ దేశంలోనే అత్యధిక వరి పంట పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ.

*మరి అలాంటప్పుడు ఉచిత విద్యుత్ అవసరం లేదని అపరిపక్వ మాటలు మాట్లాడం కరెక్ట్ కాదు.రేపు రానున్న రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు,రైతు బంధు ను కూడా వద్దంటాడు ఈ రేవంత్.*

రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్న.

రేవంత్ రెడ్డి ఇలాంటి వాక్యాలు చేయడం కొత్త ఎం కాదు.

08/07/2023

బెంగాల్ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌లో 9 మంది మృతి

పశ్చిమ బెంగాల్‌లో మూడు అంచెల పంచాయతీ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమైంది. పోలింగ్‌కు సంబంధించి జరిగిన హింసాత్మక ఘటనలలో 9 మంది మరనించినట్లు అధికారులు తెలిపారు. మృతులలో ఐదుగురు టిఎంసి సభ్యులతోపాటు బిజెపి,, సిపిఎం, కాంగ్రెస్‌కు చెందిన ఒక్కో కార్యకర్త ఉన్నారు. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి మద్దతుదారుడు ఒకరు కూడా మృతులలో ఉన్నట్లు అధికారులు చెప్పారు.

పోలింగ్ సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘర్షణలలో పలువురు గాయపడ్డారు. రెండు పోలింగ్ బూత్‌లలో బ్యాలట్ బాక్సులు ధ్వంసమయ్యాయి. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలోగల 3,887 సీట్లలో ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. బరిలో ఉన్న 2.06లక్షల మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 5.67 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. ఉదయం 9 గంటల వరకు 10.26 శాతం పోలింగ్ నమోదైంది.

07/07/2023

తెలంగాణలో తేలికపాటి వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం జార్ఖండ్ పరిసరాల నుండి సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తన కొనసాగుతోంది.దీని ప్రభావంతో రాగల 24గంటల్లో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది.

గడిచిన 24గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. వికారాబాద్ జిల్లా మదనపల్లిలో అత్యధికంగా 31.5మి.మీ వర్షం కురిసింది. శంకర్‌పల్లిలో 30, లింగాపూర్‌లో 25, నవాబ్ పేటలో 24.8, మల్లాపురంలో 23.5, వీపనగండ్లలో 22.5, చెన్నపురావుపల్లిలో 22.3, తెల్కపల్లిలో 21.5 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు పడ్డాయి.

19/05/2023

రజనీకాంత్‌పై ప్రశ్నిస్తే వెక్కిరించిన రోజా!
చెన్నై: ఒకప్పటి నటి, ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా ఇటీవల తమిళనాడులోని తిరుచెందూర్‌లో ‘మురుగన్’ ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్లారు. ఆ సందర్భంలో మీడియాతో మాట్లాడినప్పుడు విలేకరులు ‘ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు ఏపికి రజనీకాంత్ వచ్చారని, ఎన్టీఆర్‌ని ప్రశంసించారని, చంద్రబాబును ఆకాశానికెత్తారు’ అని అనప్పుడు రోజా స్పందన విచిత్రంగా ఉండింది. ‘చంద్రబాబు విజనరీ ఉన్న నేత’ అంటూ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యపై ఆమె విచిత్రమైన ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. ఇది రజనీకాంత్ ఫ్యాన్స్‌కు కోపాన్ని తెప్పించింది. ఆమె వ్యంగ్యంపై వారు మండిపడ్డారు. మీడియా వేదికగా ఆమె క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

07/05/2023

ఈ నెల 9న తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదల..
ఈ నెల 9వ తేదీన (మంగళవారం నాడు) తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డులో మంగళవారం ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు సమాచారం .

కాగా ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షలు మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలకు ఐదు లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ ఫలితాల కోసం ఇంటర్ బోర్డు వెబ్ సైట్ tsbie.cgg.gov.in కు లాగిన్ అవ్వొచ్చు.

07/05/2023

ఆస్తి పంచలేదని తల్లి మృతదేహాన్ని ఆసుపత్రిలోనే ఉంచిన కూతుళ్లు

ఆస్తి పంపకాలు జరుపలేదనే నేపంతో మృతి చెందిన తల్లి శవాన్ని తీసుకెళ్లడానికి కన్న కూతుళ్లు నిరాకరించారు. దారుణమైన ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ బి నగర్ కాలనీకి చెందిన కిష్టవ్వ 70 అనారోగ్యంతో భాద పడుతుండటంతో కుటుంబ సభ్యులు గత నెల 21న ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె సుమారు పది హేను రోజుల పాటు చికిత్స పొందుతు శనివార రాత్రి మృతి చెందింది.మృతురాలికి ముగ్గురు కూతుళ్లు కాగా ఒక కూతురు మృతి చెందింది.ఎల్లవ్వ, పెంటవ్వ ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతురాలి పేరు పైన ఇళ్లు, డిపాసిట్ పేరిట లక్షా 70 ఉన్నాయి. వీటికి మృతురాలి బంధువు ఒకరు నామినీగా ఉన్నారు. కిష్టవ్వ బతికుండగా ఆస్తి పంపకాలు జరుపలేదని డిపాజిట్ డబ్బులు తమకు ఇప్పించేంత వరకు తల్లి శవాన్ని తీసుకుళ్లెమని ఇద్దరు కూతుళ్లు శవాన్ని ఒదిలేసినట్లు డ్యూటీ డాక్టర్ మౌనిక తెలిపారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది మార్చురిలో వృద్దురాలి శవాన్ని ఉంచారు.

05/05/2023

సెల్‌ఫోన్ కోసం ప్రాణాలు పోగొట్టుకున్న యువతి

సెల్‌ఫోన్ పోయిందని చెల్లెతో గొడవ పడి అక్క సూసైడ్ చేసుకున్న ఘటన రేగొండ మండలంలోని రామన్నగూడెం గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం రామన్నగూడెం తండాకు చెందిన జగ్గు రమ్య(22) నర్సింగ్ చదువుతుంది. ఇటివల ఇంటికి వచ్చింది. తన సెల్‌ఫోన్ గురువారం ఉదయం కనిపించకపోవడంతో తన చెల్లితో గొడవపడింది. దానితో నానమ్మ స్వరూప, తండ్రి రవి మరొక సెల్ కొనిస్తామని చెప్పారు.

ఇంకెప్పుడు కొనిస్తారని ఆగ్రహించి తీవ్ర మనస్తాపపం చెంది కుటుంబ సభ్యుల ఎదుటనే ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం పరకాల సివిల్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్‌కు తరలిస్తున్న క్రమంలో మార్గమద్యంలో మృతి చెందినట్లు తెలిపారు.

16/04/2023

నా బిడ్డను ఆదుకోండి..ఓ తల్లి ఆవేదన

వారిది రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం ..సజావుగా సాగుతున్న వారి జీవితం లో ఒక్కసారిగా అనుకొని సంఘటన చోటు చేసుకుంది. వివరాలోకి వెళితే… సిద్దిపేట పట్టణంలోని 28వ వార్డు ముర్షద్ గడ్డలో నివాసం ఉంటున్న రాజు రాజేశ్వరి దంపతుల కుమారుడు దయాకర్ (14) కు అరుదైన నరాల వ్యాధి క్రోనిక్ ప్రోగ్రెసివ్ సర్వికల్ డిస్టోనియా అండ్ జెనెటిక్ ఏటియాలాజీ సోకింది. దీంతో తల్లిదండ్రులు వారి దగ్గర ఉన్న డబ్బులు దయాకర్ చికిత్సం కోసం ఖర్చు చేశారు. మెరుగైన చికిత్స కోసం రూ. 5 లక్షల నుంచి 10 లక్షల వరకు అవసరం ఉండవచ్చని డాక్టర్లు చెప్పారు.

రెక్కాడితే కాని డొక్కాడని పరిస్ధితుల్లో ఉన్న కుటుంబం కావడంతో తన బిడ్డను ఆదుకోవాలని ఆ తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన కనిపించిన వారిని వేడుకుంటున్నారు. దయగల వారు తోచినంత సహాయం అందించి తన బిడ్డను ఆదుకోవాలని , చికిత్స త్వరితగతిన అందించకపోతే బాలుడి ప్రాణానికే ప్రమాదమని డాక్టర్లు చెప్పినట్లు తల్లిదండ్రులు తెలిపారు. సహాయం చేయదలచిన వారు. బాలుడి గురించి ఏదైనా సమాచారం తెలుసుకోవాల్సిన వారు దయాకర్ తల్లిదండ్రుల ఫోన్ నెంబర్ 9959722581 కు ఫోన్ పే కానీ గూగుల్ పే చేయవచ్చని అలాగే అకౌంట్ నంబర్ 7311838327 ఎపిజివిబి హైదరాబాద్ రోడ్ బ్రాంచ్, Ifsc కోడ్ :SBINORRAPGB లో గల అకౌంట్ నెంబర్‌కు పంపించవచ్చని తెలిపారు.

16/04/2023

బ్రతుకుదెరువు కోసం వచ్చి అగ్నికి ఆహుతి

సూర్యపేట జిల్లా మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామానికి చెందిన రేట్నేని జెన్నయ్య, భద్రయ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు , ఒక కుమారుడు రేట్నేని నరేష్ (36) తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన సుమ (30) వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు సాత్విక్(7), జస్విత్ (5) నరేష్ తల్లి భద్రమ్మ గత కొద్ది సంవత్సరాలుగా కాన్సర్ వ్యాధితో బాధ పడుతుంది.తల్లి దండ్రులను పోషించుకోవడం కోసం తన భార్య పిల్లలతో హైద్రాబాద్‌కు వలస వచ్చి ఒక ప్రైవేట్ వాహనం డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పని ముగించుకుని శనివారం రాత్రి సుమారు 2 గంటలకు కుషాయిగూడలోని రూం కి వెళ్లి పడుకున్నాడు.

కాగా ఆదివారం ఉదయం నాలుగు గంటల సమయంలో తాను ఉంటున్న అద్దె ఇంటి పక్కన ఉన్న టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం జరిగి తాను ఉంటున్న ఇంటికి మంటలు అలుముకోవడంతో మంటల నుండి తాను ,తన భార్య సుమ,చిన్న కుమారుడు జశ్విత్‌ను రక్షించుకోవడం కోసం తీవ్ర ప్రయత్నం చేసినప్పటికి అప్పటికే మంటలు ఎక్కువ కావడంతో మంటల్లో కాలి అక్కడికక్కడే మృతి చెందారు. నరేష్ పెద్ద కుమారుడు సాత్విక్ తన మేనత్త ఇంటికి వెళ్ళడంతో అతను బ్రతికాడు. ఇది ఇలా ఉండగా ఒకే ఇంట్లో ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంటిని పోషించే కుమారుడు , కోడలు , ముక్కు పచ్చలారని మనవడు అగ్నికి ఆహుతి కావడంతో ఆ వృద్ధ తల్లిదండ్రుల దుఖం ఆపడం ఎవరి తరం కావడం లేదు. అనాథగా మారిన పెద్ద కుమారుడు సాత్విక్ అమ్మ, నాన్నలు కావాలని ఏడవడంతో వచ్చిన బంధువులు , గ్రామస్తులు దుఖః సముద్రంలో మునిగిపోయారు.

15/04/2023

కల్తీ మద్యం కాటుకు ఇరవై మంది మృతి

బీహార్‌లో మరోసారి కల్తీమద్యం కాటేసింది. మోతీహారి జిల్ల లక్ష్మీపూర్, పహార్‌పూర్, హర్సిద్ధి బ్లాకులలో శుక్రవారం రాత్రి మద్యం సేవించిన కొంతమంది పరిస్థితి విషమించింది. ఇప్పటివరకు దాదాపు 20 మంది మృతి చెందగా, మరో అరడజను మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కల్తీమద్యంతో కూడిన ట్యాంకును మోతీహారీకి తీసుకు వచ్చి స్థానికులకు పంపిణీ చేశారని, ఇదే ఈ దుర్ఘటనకు దారి తీసిందని స్థానిక వర్గాలు చెప్తున్నాయి. కాగా దీనిపై పోలీసులు కానీ, ఇతర అధికారులు కానీ ఇప్పటివరకు ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు.

బీహార్‌లో నితీశ్‌కుమార్ ప్రభుత్వం 2016లోనే మద్యపాన నిషేధాన్ని విధించంది.అయినప్పటికీ రాష్ట్రంలో విచ్చలవిడిగా కల్తీ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ కల్తీ మద్యాన్ని తాగి అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఏడాదిజనవరిలో కూడా సివాన్‌లో కల్తీమద్యం తాగి నలుగురు చనిపోయారు. ఈ ఘటనకు సంబంధించి మద్యాన్ని విక్రయించిన 16మందిని అరెస్టు చేశారు.

14/04/2023

ఎల్లుండి మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష

రాష్ట్రంలో మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో ప్రవేశాల కోసం ఆదివారం(ఏప్రిల్ 16) ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు 6వ తరగతిలో ప్రవేశాలకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7 నుంచి 10 తరగతులలో ప్రవేశాలకు పరీక్ష ఉంటుందని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షకు 70,041 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.

14/04/2023

బోన్ క్యాన్సర్‌తో చిన్నారి పోరాటం..

అభం శుభం తెలియని ఆ చిన్నారి పసిపాపకు పెద్ద కష్టం వచ్చింది. తనకు ఏం జరుగుతుందో అని కూడా తెలియని ఆపాపకు పెద్ద వ్యాధి సోకింది. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన కర్ల తిరుపతి కూతురు కర్ల సాత్విక(11) బోన్ క్యాన్సర్ తో భాదపడుతుంది. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుటుంబంలో మహామ్మారి వ్యాధి చీకటిని మిగిల్చింది. సాత్విక ప్రస్తుతం గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతుంది. గత కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురవుతుంది. దీంతో కరీంగనర్, హైద్రబాద్, వరంగల్ ఆస్పత్రికి వెళ్లి ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు వైధ్యం చేయిస్తువస్తున్నారు.

కానీ పూర్తి స్థాయిలో సాత్విక కోలుకోవాలంటే ఆపరేషన్ చేయాలని వైధ్యులు తెల్చిచెప్పారు. వైధ్య ఖర్చుల కోసం ఆపన్న హస్తం అందించాలని వేడుకుంటున్నారు. రూ.8లక్షల వరకు ఖర్చు అవుతుందని, వైధ్య సహాయం చేసి తన కూతురు ను కాపాడాలని తల్లిదండ్రులు ప్రాధేయ పడుతున్నారు. దాతలు పంపిచాల్సిన ఫోన్ నెంబర్ , గూగుల్ పే, ఫోన్ పే నెంబర్ లు :9059243891, 9490548827.

12/04/2023

పది రోజుల్లో పెళ్లి.. ఇంతలోనే యువతి ఏం చేసిందంటే?

పది రోజుల్లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకోవాల్సిన యువతి కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండల పరిధిలోని రేగుళ్ళ గ్రామంలో చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని తుమ్మలగూడెం పంచాయితీ, రేగుళ్ళ గ్రామానికి చెందిన జనగం మానస (20)కు అదే గ్రామానికి చెందిన చప్పిడి ప్రశాంత్ అనే యువకుడితో వివాహం జరిపించేందుకు పెద్దలు నిర్ణయించారు. ఈ నెల 22న ముహూర్తం ఖరారు చేశారు. సోమవారం మృతురాలి తండ్రి పుల్లయ్య, అన్న చందు మధ్య చిన్న గొడవ జరిగి, ఈ విషయంపై బుధవారం తండ్రి పుల్లయ్య కరకగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

మంగళవారం రాత్రి అన్న పెళ్ళి పత్రికలను కాలపెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మనస్థాపానికి గురైన మానస పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు కరకగూడెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో వైద్యుల సలహా మేరకు మణుగూరు వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మానస తుది శ్వాస విడిచింది.

12/04/2023

భర్తను హత్య చేసిన భార్యకు జీవిత ఖైదు

భర్తను హత్య చేసిన కేసులో భార్యకు జీవిత ఖైదు విధించిన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ వర్మ కథనం ప్రకారం… ముహమ్మద్ సోహెల్ (30), రేష్మా (25) బేగంలు భార్యాభర్తలు. ఇరువురు పలు ప్రాంతాలలో తిరుగుతూ భిక్షాటన చేసి జీవనం సాగించేవారు. ఫుట్‌పాతులు, దుకాణాల ముందు గల చబుత్రాలపై నిద్రించేవారు. భర్త వేధింపులు భరించలేక ఒక రోజు రాత్రి రేష్మా అతనిని హత్య చేసింది.

చాంద్రాయణగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలోని ఒక దుకాణం ముందు సోహెల్ అనుమానాస్పదస్థితిలో చనిపోయి ఉన్నాడన్న సమాచారం మేరకు అప్పటి ఇన్‌స్పెక్టర్, ప్రస్తుత చార్మినార్ ఏసీపీ రుద్ర భాస్కర్, సిబ్బంది రేష్మాను అదుపులోకి తీసుకొని మృతుడు సోహెల్ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.పోలీసులు రేష్మాను విచారించగా అమె సమాధానాలు చెప్పటంలో తడబడింది. అతరువాత అసలు విషయం వెల్లడించింది. దీంతో పోలీసు ఆమెపై కేసు నమోదు చేశారు. కేసు పూర్వాపరాలను విచారించిన నాంపల్లి కోర్టు బుధవారం తుది తీర్పు ఇచ్చింది.

నిందితురాలు రేష్మాకు జీవిత ఖైదు, 500 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు నిచ్చింది.

10/04/2023

బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ పండు తినండి..

హైదరాబాద్: ప్రస్తుత సమాజంలో అతి పెద్ద సమస్య ఊబకాయం. విపరీతమైన బరువు పెరిగి దాన్ని తగ్గించుకోవడానికి నానా కష్టాలు పడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఇక కొంతమంది భోజనం మానేసి పడరాని పాట్లు పడుతున్నారు.బరువు తగ్గడం కోవసం కొంతమంది రన్నింగ్,వ్యాయామం చేస్తుంటారు. మరి కొంత మంది ఉపవాసాలు ఉండటం, డైట్ చేయడం,రాత్రి సమయంలో రైస్ కు బదులు చపాతీలు తినడం, అలాగే పండ్లు ఎక్కవగా తీసుకుంటారు. అయితే, కొన్ని పండ్లలో అధికంగా షుగర్ ఉండే అవకాశం ఉంది. ఫలితంగా బరువు పెరుగుతారే తప్ప తగ్గరు.

కానీ జామ పండులో తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్ కంటెంట్‌ ఉండే ఈ పండు ఒక సూపర్ ఫుడ్ అని డైటీషియన్లు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారికి దీన్ని రిఫర్ చేస్తున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్‌లు, ఐరన్, క్యాల్షియం, విటమిన్ C పుష్కలంగా ఉంటాయి. రోజువారీ డైట్‌లో ఒక జామపండును తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇది బరువు తగ్గించడంలో సహాయ పడుతుంది. శరీరాన్ని ఆరోగ్యంగానూ ఉంచుతుంది.

10/04/2023

పెళ్లి కావడం లేదని యువకుడు ఆత్మహత్య

యువకుడు మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది.పోలీసులు , గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం త్రిపురారం మండలంలోని బొర్రాయిపాలెం గ్రామానికి చెందిన తంగెళ్లపల్లి శ్రీకాంత్‌చారి (26) తనకు పెళ్లి సంబందాలు కుదరటం లేదని మనస్థాపానికి గురై సోమవారం క్రిమి సంహారక మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిపారు. మృతుడు శ్రీకాంత్‌చారి మిర్యాలగూడలోని జనరేటర్ మెకానిక్‌గా పనిచేస్తూ ఉన్నారు.

సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డిమందు తాగి ఆవిషయం ఫోన్ ద్వారా తన స్నేహితుడికి సమాచారం తెలియజేశాడు. అతను మృతుడి బంధువులకు సమాచారం అందించగా వెంటనే చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీకాంత్‌ తుదిశ్వాస విడిచినట్లు తెలిపారు. మృతుడి తండ్రి వెంటరత్నచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గుండు శోభన్ బాబు తెలిపారు.

07/04/2023

చీర కట్టిన అల్లు అర్జున్..

పుష్ప సినిమాతో అల్లు అర్జున్ స్లైలిస్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ అయ్యాడు. అభిమానుల అంచనాలకు కథతో మెప్పించాలనుకొనే హీరోలు ఎలాంటి పాత్ర వెయ్యడానికి అయినా సిద్ధపడతారు. అలాంటి హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు.పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్ చాలా కష్ట పడ్డాడు. డైరెక్టర్ భుజం పైకెత్తి ఉండాలని చెప్పడంతో రోజు మొత్తం ఎత్తిన చెయ్యి దించకుండా షూటింగ్ చేసే వాడట. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ సరికొత్తగా డీ గ్లామర్‌గా కనిపించడంతో పాటు తన నటనతో ఈ సినిమాను నిలబెట్టాడు.

పుష్ప అంటూ ఫ్లవర్ అనుకున్నావా.. ఫైర్ అంటూ చెప్పిన డైలాగులు ప్యాన్ ఇండియా లెవల్లో పేలాయి. తాజాగా అల్లు అర్జున్‌ సరికొత్త అవతారంలో కనిపించారు.ఇక రేపు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ ను రిలీజ్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. అయితే ఈ పోస్టర్ రేపు రిలీజ్ చేయాల్సి ఉండగా.. అప్పటికే సోషల్ మీడియాలో లీక్ అవ్వడంతో అధికారికంగా ప్రకటించారట. పోస్టర్ లో అల్లు అర్జున్ చీర కట్టి కాళికా మాత అవతారంలో ఫుల్ పవర్ ఫుల్ గా కనిపించాడు. ఇక పోస్టర్ లో బన్నీ చీరతో, ఒంటి నిండా నగలతో, ఒక చేత్తో గన్ తో కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది

06/04/2023

గురుకులాల్లో 9,231 ఉద్యోగాలకు నోటిఫికేషన్

నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలోని గురుకులాల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 9,231 పోస్టులకు గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు 9 నోటిఫికేషన్లను విడివిడిగా విడుదల చేసింది. డిగ్రీ కళాశాలల్లో 868 అధ్యాపక, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. అలాగే, జూనియర్ కళాశాలల్లో 2,008 లెక్చరర్లు, పాఠశాలల్లో 1,276 పిజిటి, 434 లైబ్రేరియన్, 275 ఫిజికల్ డైరెక్టర్, 134 ఆర్ట్, 92 క్రాఫ్ట్, 124 మ్యూజిక్, 4020 టిజిటి పోస్టులను భర్తీ చేయనున్నట్లు షార్ట్ నోటిఫికేషన్లలో పేర్కొంది.

ఈ నెల 12 నుంచి పన్ టైం రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 17 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని కన్వీనర్ మల్లయ్య భట్టు తెలిపారు. సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన వర్గాల సంక్షేమ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ సొసైటీలకు వేర్వేరుగా ఉద్యోగ ఖాళీలకు సంబంధించి పయో పరిమితి, విద్యార్హత., ఇతర వివరాలతో పూర్తి నోటిఫికేషన్లు దరఖాస్తుల ప్రారంభమైన రోజు నుంచి తమ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని కన్వీనర్ పేర్కొన్నారు.

06/04/2023

సలేశ్వరం జాతరలో తొక్కిసలాట..

నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అడవిలోని సలేశ్వరం లింగమయ్య జాతరలో అపశృతి చోటుచేసుకుంది. లింగమయ్య దర్శనానికి కాలి నడకన వచ్చిన ఇద్దరు భక్తులు గుండెపోటుతో మృతి చెందారు. మృతుల్లో నాగర్‌కర్నూల్ జిల్లా నాగర్‌కర్నూల్ మండలం వనపట్ల గ్రామానికి చెందిన గొడుగు చంద్రయ్య(55), రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్‌కు చెందిన విజయ (40) మహిళ ఉన్నారు. లోయలోకి వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో ఆయాసంతో వీరిద్దరు గుండెపోటుకు గురై మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

తొక్కిసలాట కాని, ఊపిరాడకపోవడం వల్ల కాని వీరు చనిపోలేదని గుండెపోటుతో మృతి చెందారని నాగర్‌కర్నూల్ ఎస్పి కె. మనోహర్ తెలిపారు. ఇద్దరు భక్తులు మృతి చెందిన విషయం ఆ నోట ఈనోట వ్యాప్తి చెందడంతో సలేశ్వరం క్షేత్రంలో ఉన్న భక్తుల్లో ఒక్కసారిగా అలజడి రేగినట్లు ప్రత్యేక సాక్షులు తెలిపారు. ఇదే క్రమంలో స్వల్పంగా తొక్కిసలాట జరిగి పలువురికి గాయాలైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో వనపర్తికి చెందిన అభిషేక్ అనే యువకుడు కూడా గాయపడి అస్వస్థతకు లోనైనట్లు సమాచారం.

06/04/2023

రామ్ చరణ్ కంటే ఉపాసన వయసులో ఎంత పెద్దదో తెలుసా?

టాలీవుడ్‌లో అద్భుతమైన జంటల్లో రామ్ చరణ్, ఉపాసన ఒకరు. మెగాభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుల్లో వీళ్లకో ప్రత్యేక గుర్తింపు ఉంది. వీళ్లిద్దరు పెళ్లి చేసుకొని పది యేళ్లు గడిచిపోయాయి. రామ్ చరణ్, ఉపాసన ఎన్నో ఏళ్లు ప్రేమించుకొని ఆ తర్వాత ఇరువురు కుటుంబ సభ్యుల పెద్దల అంగీకారంతో 2012 లో ఒకటయ్యారు.

ఇక పెళ్లైన ఇన్ని సంవత్సరాల ఉపాసన పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది. అయితే తాజాగా వీరికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రామ్ చరణ్ కంటే ఉపాసన వయసులో ఎంత పెద్దదో తెలిస్తే షాక్ అవుతారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే నిజానికి రామ్ చరణ్ కంటే ఉపాసన నాలుగు యేళ్లు పెద్దదంట. వయసు తో సంబంధం లేకుండా పెళ్లి చేసుకొని ఇద్దరు చాలా సంతోషంగా గడుపుతున్నారు.

06/04/2023

నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్..

మండలంలోని అందవెల్లి గ్రామంలో మండలానికి చెందిన ధనుర్కార్ పాండు గుండి గ్రామానికి చెందిన రాసిపల్లి నానజీ వద్ద గత ఏడాది అప్పుగా తీసుకున్న నగదును తిరిగి చెల్లించుటకై గుండి గ్రామానికి చెందిన ఆసిఫాబాద్ నుండి ఆటోలో వస్తు ఉండగా జేబులో ఉన్న 40 వేల రూపాయలు దారిలో పడిపోయాయి. కాసేపటికి అటు వైపు నుండి వస్తున్న ఆసిఫాబాద్‌కి చెందిన ఆటో డ్రైవర్ ఎస్‌కే సలీం గమనించి మొదటగా అక్కడే ఉన్న

బెల్లంపల్లికి చెందిన ప్రవేట్ ఉద్యోగి మిట్టపల్లి శ్రీకాంత్ అనుకోని ఆయనకు ఇవ్వగా శ్రీకాంత్ గ్రామ సర్పంచ్ జబరి ఆరుణ రవిందర్‌కు ఇచ్చారు. విషయం తెలుసుకోని గ్రామాస్తులకు విచారించగా రోదిస్తూ దారి పొడుగునా వెతుకుతున్న ధనుర్కార్ పాండువని తెలుసుకోవడంతో వారికి ఎఎంసి చైర్మన్ గాదావేణి మల్లేష్, సర్పంచ్ జబరి అరుణ రవిందర్ చేతుల మీదుగా గ్రామస్తుల సమక్షంలో నగదును అందించారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు.

05/04/2023
Want your business to be the top-listed Convenience Store in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

Bandi sanjay arrest in tenth question paper leak
Telugu comedy

Category

Address


1-7-695/Ramnagar
Hyderabad
500020

Other Newsstands in Hyderabad (show all)
THUG TV THUG TV
Hyderabad, 500001

WE LOVE TO EXPOSE FAKE NEWS AND COLLECT VIRAL NEWS ALL AROUND THE MEDIA AND EDITE IT AND MAKE YOU FUNNY AND SUPPORTING OUR YOUTUBE CHANNEL.

The Tv Show The Tv Show
Hyderabad

We as The Tv Show will entertain and educate you round the clock,and will provide information happen

scary stories scary stories
Hyderabad
Hyderabad, 500001

hi in this page we, will bring you some spine chilling stories and haunted stories and experience

CricTales CricTales
Kothapet
Hyderabad, 500035

Stories and updates of Cricket National and international