Yakanna Erra

Yakanna Erra

hai

10/10/2024

కూకట్పల్లిలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు.... రిపోర్టర్ ఎర్ర యాకన్న.

30/09/2024

YAKS with Krishna

08/09/2024

*నింగికెగిసిన జర్నలిస్టు యోధుడు జలగం శేఖర్..!*

*-మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న ప్రజా జర్నలిస్టు*

*-ఎంతో మంది యువ జర్నలిస్టులకు అతడోక స్ఫూర్తి*

*-గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కలం కార్మికుడు*

*-హైదరాబాద్ ఓ ప్రైవేట్ లో లివర్ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ మృతి*

*-బక్కచిక్కిన శేఖర్ పార్థివ దేహాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి*

*-కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని హామీ*

*-శేఖర్ మృతితో శోక సంద్రంలో తోటి జర్నలిస్టు లోకం*

*హైదరాబాద్ / సెప్టెంబరు 08/ జర్నలిస్టు సూర్య బ్యూరో:*

తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టు (ఐజేయూ 143) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు TV5 ప్రతినిధి జలగం శేఖర్ గత కొంతకాలంగా లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితం తుదిశ్వాస విడిచారు.
*మహబూబాబాద్* జిల్లా పరిధిలోని *పాలకుర్తి* నియోజకవర్గంలోని *పెద్ద వంగర* మండలం *చిన్న వంగర* గ్రామానికి చెందిన *జలగం శేఖర్* *ప్రగతి శీల విద్యార్థి నాయకుడిగా* ఎన్నో *ప్రజా పోరాటాలు చేసి విద్యార్థి లోకానికి ధైర్యాన్ని* అందించాడు. పాలకులు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై *ప్రశ్నించాలంటే జర్నలిజమే నిజమైన ఆయుధమని* నమ్మి గత *20 సంవత్సరాలుగా* వివిధ ఛానళ్ళలో పని చేసి ప్రస్తుతం TV5 లో పని చేస్తు *TV5 శేఖర్గా తన మార్క్ ను చాటుకున్నాడు.*
ప్రజా సమస్యలపై తన కలం గళంతో పాలకులను ప్రశ్నిస్తూ *ప్రజా జర్నలిస్టు* గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు.
ప్రస్తుతం వివిధ పత్రికలు, ఛానళ్ళలో పని చేస్తున్న *ఎంతో మంది యువ జర్నలిస్టులకు స్ఫూర్తిగా నిలిచాడు.*
గత కొంతకాలంగా *లివర్ సంబంధిత వ్యాధితో* బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచాడు. శేఖర్ మృతి చెందిన వార్త విన్న తోటి జర్నలిస్టు లోకం శోక సంద్రంలో మునిగి పోయారు.

*టీవీ 5 శేఖర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి - మాజీ మంత్రి ఎర్రబెల్లి*

శేఖర్ మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసుపత్రికి వెళ్ళి బక్క చిక్కిన శేఖర్ పార్థివ దేహాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు.
శేఖర్ భార్య సునీత, ఇద్దరు కుమారులను ఓదార్చి తమ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
గొప్ప జర్నలిస్టు యోధుడు జలగం శేఖర్ అని టీవీ 5 శేఖర్ కుటుంబాన్ని
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి కోరారు.
శేఖర్ మృతి జర్నలిస్టు లోకానికి తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు.

Photos from Yakanna Erra's post 24/08/2024

Yaks@Secretariat

13/08/2024

జాతీయ కిక్ బాక్సింగ్ 5వ ఛాంపియన్ సాధించిన వల్లూరి అర్జున్ కు సన్మానించిన ఎమ్మార్పీఎస్ నాయకులు...

జగద్గిరిగుట్ట:-

గోవాలో జరిగిన జాతీయ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ పోటీలో గెలుపొందిన వల్లూరి అర్జున్ అనేక విజయాలు సాధించాలని మహాజన వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర యాకన్న అన్నారు. మంగళవారం జగద్గిరిగుట్ట రిక్షా పుల్లర్ కాలనీ ప్రాంతంలోని అర్జున్ నివాసంలో ఆయనను కలిసి శాలువాతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వల్లూరి అర్జున్ ఇంకా అనేక విజయాలు సాధించి తాను అనుకున్న లక్ష్యాలు చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు వల్లూరి బాబు, చెమిటి వెంకన్న, చిప్పలపల్లి బాబురావు, కందుకూరి జయశంకర్ మాదిగ, ఎర్ర విజయ్ మాదిగ, నరేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

13/08/2024
07/07/2024

Happy father's day to Daddy

07/07/2024

Happy birthday to you Sir

15/06/2024

YAKS @ Forest

06/06/2024

YAKS @ TAJ Mahal

05/06/2024

YAKS@OU

28/05/2024

*అనారోగ్యంతో బాధపడుతున్న రేణుకకు అపన్న హస్తం అందించిన ఆకాంక్ష ఫౌండేషన్*

జగద్గిరిగుట్ట లోని రాజీవ్ గృహకల్ప లో నివసిస్తున్న రేణుక కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ఆకాంక్ష ఫౌండేషన్ అధ్యక్షులు సిహెచ్ వి రామారావు వారు నివసిస్తున్న గృహానికి వెళ్లి ఆపన్న హస్తం అందించారు. వారికి కావలసిన మెడికల్ కిట్టు, బియ్యం,నిత్యవసర వస్తువులు, పండ్లు అందించారు. వారికి మనో ధైర్యం కలుగా చేసి, భవిష్యత్తులో అండగా ఉంటమని తెలిపారు. సహాయం అందించిన ఆకాంక్ష ఫౌండేషన్ కి బాధితురాలు రేణుక, వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆకాంక్ష ఫౌండేషన్ సభ్యులు నవీన్ రామోజీ, అనిల్, సీనియర్ జర్నలిస్టులు ఎర్ర యాకయ్య, చంద్ర , తదితరులు పాల్గొన్నారు.

27/05/2024

అప్పన్న హస్తం కోసం ఎదురుచూపులు .... మందులకు డబ్బులు లేని వైనం ... ఛావే శరణ్యం అంటున్న బాధితురాలు రాధిక, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి వేడుకోలు.....

జగద్గిరిగుట్ట:-

అంతు చిక్కని వ్యాధితో బాధపడుతూ మందులకు డబ్బులు లేని వైనంతో బాధపడుతూ తన కూతుర్ని చాదుకోవడానికి బిక్షాటన చేస్తూ మందులు కొనుక్కోలేని స్థితిలో చావే శరణ్యం అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వేడుకుంటున్న బాధితురాలు వైనం జగద్గిరిగుట్టలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా రాజోలు పట్టణానికి చెందిన నవీను రాధిక దంపతులు బ్రతుకుతెరువు కోసం హైదరాబాద్కు వచ్చి జగద్గిరిగుట్టలో స్థిరపడ్డారు. జగద్గిరిగుట్ట డివిజన్ రాజీవ్ గురకల్ప ప్రాంతంలోని బ్లాక్ నెంబర్ 22 ప్లాట్ నెంబర్ 4లో నివాసం ఉంటుండగా ఒక కూతురు పుట్టింది. ప్రస్తుతం పాప వయసు సుమారు ఆరు సంవత్సరాల కుంటుందని తెలుస్తుంది. 2016లో పెళ్లయిన తర్వాత 2018 లో పాప పుట్టడంతో అంతకుముందే 2012లో ఒకసారి రాధిక అనుకోకుండా కింద పడిపోవడంతో కాలు ప్యాక్చర్ కాగా రాధిక సన్నగా ఉండటంతో కాలులో ఐరన్ రాడు వేయడానికి వీలుపడకపోవడంతో సన్నటి వైరు ద్వారా జీడిమెట్ల నారాయణ హృదయాలయం ఆసుపత్రిలో చికిత్స చేసిన తర్వాత ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉంటూ అంతుచిక్కని వ్యాధితో బాధపడుతూ బిడ్డను పోషించుకోలేక మందులకు డబ్బులు లేకపోవడంతో భిక్షాటన చేస్తూ వచ్చిన డబ్బులు బిడ్డ పోషణ సరిపోకపోవడం తో మందులు కొనలేని స్థితిలో ఉంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని అపన్న హస్తం కోసం వేడుకుంటుంది. దయచేసి ఇలాంటి అభాగ్యురాలను ఆపదలో ఉన్న వాళ్ళని సచ్చన్న సంస్థలు ముందుకు వచ్చి ఆదుకోవాలని ఎవరైనా దయగలవారు నా నెంబర్ కు 888560120 గూగుల్ పే ఫోన్ పే ద్వారా ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్నారు.

17/05/2024

పత్రికా ప్రకటన

Dt. 17-05-2024

ప్రియమైన ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా
మిత్రులకు

అందరికి నమస్కారం!

మీ నిరంతర మద్దతుకు యూనివర్సిటీ నుంచి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

18-05-2024న ఉదయం 11.00 గంటలకు TS EAPCET-2024 ఫలితాలు

శ్రీ. బుర్రా వెంకటేశం, ఐఏఎస్, ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఉన్నత విద్యాశాఖ,

తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, హైదరాబాద్
జెఎన్‌టి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి,
ప్రొఫెసర్ వి.వెంకట రమణ, వైస్-చైర్మన్, ప్రొఫెసర్. SK మహమూద్, వైస్-ఛైర్మన్ మరియు డాక్టర్ శ్రీరామ్ వెంకటేష్, కార్యదర్శి, TSCHE మరియు యూనివర్సిటీ అధికారులు గోల్డెన్ జూబ్లీ కాన్ఫరెన్స్ హాల్, అడ్మిషన్స్ భవనం, JNTUH, కూకట్‌పల్లి, హైదరాబాద్‌లో.

TS EAPCET-2024 ఫలితాలు మరియు ఫలితాల విశ్లేషణకు సంబంధించిన CD JHUB ఈవెంట్ సెంటర్, అడ్మిషన్స్ బిల్డింగ్, JNTUH, కూకట్‌పల్లి, హైదరాబాద్‌లో ఉదయం 11.00 గంటలకు ఇవ్వబడుతుంది.

CD కింది అంశాలను కలిగి ఉంటుంది.

1. TS EAPCET-2024 పరీక్షలో ఇంజినీరింగ్ మరియు అగ్రికల్చర్ & ఫార్మసీ స్ట్రీమ్‌ల మార్కులతో పాటు ర్యాంక్‌లు ఉంటాయి. (ఫలితాలలో వెబ్‌సైట్ అభ్యర్థి అతని/ఆమె ఫలితాలను పొందేందుకు నిర్వచించిన బాక్స్ లో అతని/ఆమె హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేయాలి. CDలోని ఫీల్డ్‌లు అభ్యర్థి పేరు, H.T. నంబర్, సబ్జెక్ట్ వారీగా సాధారణ మార్కులు, మొత్తం మార్కులు, స్థితి - అర్హత / అర్హత లేదు మరియు ర్యాంక్)

2. ఇంజినీరింగ్ మరియు అగ్రికల్చర్ & మెడికల్ స్ట్రీమ్‌లలో టాపర్స్ (టాప్ టెన్).

3. హాజరు వివరాలు.

4. ఏకీకృత ఫలితాలు.

CD కోసం పాస్‌వర్డ్ ఉదయం 11:15 గంటలకు విడుదల చేయబడుతుంది.

ఫలితాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి

ఫలితాల ప్రకటన తర్వాత https://eapcet.tsche.ac.in.

దయచేసి ఈవెంట్ కోసం సీనియర్ రిపోర్టర్‌ని నియమించవచ్చు. ఇంకా ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా స్నేహితులు

లైవ్ స్ట్రీమింగ్ కోసం ముందుగానే అన్ని ఏర్పాట్లు చేయాలని అభ్యర్థించారు.

JNTUH & TSCHE తరపున, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరినీ ఇందులో చేరాలని నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను.

తదనంతరము మధ్యాహ్నం 01:00 గంటలకు భోజనం చేయవలసిందిగా కొరుచున్నాను.

విధేయతతో

కన్వీనర్, TS EAPCET-2024

13/05/2024

ఓటు వేసిన Yaks

16/04/2024

Kanker Encounter: లోక్‌సభ ఎన్నికలకు ముందు ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. కాంకేర్ జిల్లాలోని ఛోటైబైథియా పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్పర్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో పలువురు జవాన్లు కూడా గాయాల పాలైనట్లు సమాచారం. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, తుపాకులు, మందు గుండు సామాగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్

కల్పర్ అడవుల్లో మావోయిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారం అందుకున్న భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. భద్రతా బలగాల రాకను గమనించిన మావోయిస్టులు.. వారిపైకి కాల్పులు జరిపారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. దీంతో భద్రతా బలగాలు కూడా ఎదురు కాల్పులు ప్రారంభించినట్లు తెలిపాయి. ఈ క్రమంలోనే 29 మంది మావోయిస్టులు చనిపోయినట్లు తెలిపారు. ఆ కాల్పుల్లో బీఎస్ఎఫ్ ఇన్‌స్పెక్టర్, మరో ఇద్దరు జవాన్లకు కూడా తీవ్ర గాయాలు అయినట్లు తెలిసింది.

సంఘ‌ట‌న స్థలి నుంచి ఏకే 47 తుపాకులు, ఇత‌ర ఆయుధాలు, పేలుడు ప‌దార్థాల‌ను భారీగా భద్రతా బ‌ల‌గాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇక చనిపోయిన 29 మందిలో కొంత మంది మావోయిస్టుల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వివరాలను కాంకేర్ ఎస్పీ ఇంద్రకళ్యాణ్ ఐలెసెల ధృవీకరించారు. లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఈ నెల 19 వ తేదీన అంటే మరో మూడు రోజుల్లో ఉందనగా.. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది.

14/04/2024

కూకట్పల్లి సర్కిల్ హైదర్నగర్ డివిజన్ ప్రాంతంలోని ప్రధాన రహదారిలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133 జయంతి పురస్కరించుకొని పూలమాలవేసి నివాళులర్పిస్తున్న ఎర్ర యాకన్న, రామారావు, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

11/04/2024

ముస్లిం సోదర్లందరికి రంజాన్ పండుగ శుభాాంక్షలు.... ఎర్ర యాకన్న

10/04/2024

YAKS News

Want your business to be the top-listed Media Company in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

కూకట్పల్లిలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు.... రిపోర్టర్ ఎర్ర యాకన్న.
Happy father's day to Daddy
Happy birthday to you Sir
LIVE VIDEO.. తప్పిన హెలికాప్టర్ ప్రమాదంప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో కూడిన హెలికాప...
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్...
బీఎస్పీని వీడుతున్నా : RS ప్రవీణ్ కుమార్TG: BSP రాష్ట్రాధ్యక్షుడు RS ప్రవీణ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. బహుజన్ సమాజ్ పా...
*Breaking News:**BRS ఎమ్మెల్యే మృతి..**సికింద్రాబాద్ కంటోన్మెంట్ BRS పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత (37) యాక్సిడ...
*లంచం తీసుకుంటూ ACB వలకు చిక్కి ఏడ్చేసిన మహిళ అధికారి.*ఇంటర్నెట్ డెస్క్: ఓ ప్రభుత్వ అధికారిణి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక...

Telephone

Website

Address

Hyderabad
500037

Other Media/News Companies in Hyderabad (show all)
Raghu Raghu
Hyderabad, 500003

Gadgets4U Gadgets4U
Indian School Of Business
Hyderabad

Bringing you #technews that matter (and that doesn't) !

Today Massage Today Massage
House #no166/B
Hyderabad, 71000

ALLAH jis ko chahe Izzat de jis ko chahe zillat de

Trending Topics Trending Topics
Hyderabad, 500001

Trending News

VN Telugu VN Telugu
1/17, Road No 14, Banjara Hills
Hyderabad, 500034

VN Telugu brings you the Latest News, Politics, Current Affairs, Cricket, Sports, Business and Cinema

168 dhesala bige company 168 dhesala bige company
Begampet
Hyderabad, 500016

Shahis Media Telugu Shahis Media Telugu
Ayyappa Society
Hyderabad

Channel inside you

Telangana Andhra news Telangana Andhra news
Chandulal Baradari
Hyderabad, 500064

TAN NEWS

Point Blank Point Blank
Hyderabad

POINT BLANK TV TELUGU

Apchannel Apchannel
Hyderabad, 500038

business videos

Habeeb  Media Production Habeeb Media Production
Hyderabad

complate solution of social media degital marketing and promotion

Mr. gaurav Mr. gaurav
Kathamandu Nepal
Hyderabad

हम इस पेज पर knowledge के लिय ही पोस्ट करते हैं। कृपया आप इस पेज को follow कर सकते हैं�