Srinivasulu Reddy Kotamreddy
Incharge Nellore city Assembly constituency | Ex-Chairman, NELLORE URBAN DEVELOPMENT AUTHORITY(NUDA), Nellore, AndraPradesh.
అధికారం కోసం పార్టీలో చేరిన వారు.. దాడులకు పాల్పడం సరికాదు - టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి..
- తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ.. ఇలాంటి వివాదాలకి, ఘర్షణలకి మా పార్టీలో చోటు ఉండదు..
- జహీర్ పై.. ఇటీవల వైసిపి నుంచి టిడిపిలో చేరిన వర్గం దాడి చేయడం దారుణం..
- పార్టీ కోసం కష్టపడి పని చేసిన జహీర్ ను.. ఇబ్బంది పెట్టడం సరికాదు
- ఈ దాడుల వ్యవహారాన్ని మంత్రి నారాయణ గారి దృష్టికి తీసుకెళ్తా.. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూస్తాం..
ఇంచార్జ్ మంత్రి ఫరూక్ ని మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి ..
DRC మీటింగ్ కోసం నెల్లూరు జిల్లాకు వచ్చిన ఇన్చార్జి మంత్రి ఫరూక్ ను టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.. పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఆయనకి పుష్పగుచ్చం అందించి.. శాలువాతో ఘనంగా సత్కరించారు..
అమరజీవికి కోటంరెడ్డి నివాళి..
అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలను తెలుగుదేశం పార్టీ స్మరించుకుంటుందని టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి అన్నారు.. ఆత్మకూరుబస్టాండ్ లో ఉన్న పొట్టిశ్రీరాములు విగ్రహానికి మంత్రి నారాయణ, వక్ప్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తో కలిసి ఆయన పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు.. ఆర్యవైశ్యుల సంక్షేమానికి మంత్రినారాయణ, తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని కోటంరెడ్డి అన్నారు.
ఇచ్చిన మాట కోసం ఎంతదూరమైనా వెళ్లే మనస్థత్వం చంద్రబాబుది - టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి..
సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చిత్తశుద్దితో పనిచేస్తున్నారని టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి అన్నారు.. ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఎంతదూరమైనా వెళ్లే మనస్థత్వం చంద్రబాబుది అంటూ ఆయన కొనియాడారు.. 9వ డివిజన్ లో మంత్రి నారాయణతో కలిసి దీపం-2లో భాగంగా ఉచిత గ్యాస్ కనెక్షన్స్ ను లబ్దిదారులకు అందజేశారు..
దీన్ దయాల్ నగర్ లో పించన్ల పంపిణీలో పాల్గొన్న టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి..
వాలంటీర్లు లేకుండానే.. ఎక్కడా జాప్యం జరక్కుండా.. పించన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్నామని టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి అన్నారు.. దీన్ దయాల్ నగర్ లో మంత్రి నారాయణ, వక్ప్ బోర్డు చైర్మన్ అజీజ్ లతో కలిసి ఆయన పించన్లను పంపినీ చేశారు.. అనంతరం వైసీపీ నేతలు ఇసుక మీద చేస్తున్న రాద్దాంతంపై కోటంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.. ప్రజలే వైసీపీ నేతల్ని కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు.
తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసే నా ప్రియ శిష్యుడు.. నిత్యం నాతోనే ఉంటూ.. పార్టీ బలోపేతం కోసం పని చేస్తున్న కరీముల్లా కి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఇలాంటి సంతోషమైనా ఆహ్లాదకరమైన పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ..
మీ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి
టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
మాజీ నుడా చైర్మన్
నెల్లూరు సిటీ పరిధిలో ఇసుక రీచ్ పరిశీలించిన మంత్రి నారాయణ గారు మరియు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి గారు, ప్రజలు ఇబ్బంది పడకుండా నాలుగు ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు
దీంతో రిచ్ ల వద్ద రద్దీ తగ్గనుంది, టాక్స్ లు తీసేసి ఎవరైనా ఇసుకను ఉచితంగా తీసుకెళ్లవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.
రీచ్ ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని,రీచ్‌లలో మిషన్లు పెట్టకూడదు పొరపాటున పెడితే వాటిని పోలీసులు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు
sreenivasulureddy
పేదలకు ఉచితంగా ఇసుకను ఇస్తుంటే మీకెందుకు కడుపు మంట...? టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి ప్రశ్న..
- అందరికీ అమ్మఒడి అని చెప్పిన జగన్.. ఇంటికి ఒక్కరికే ఇచ్చిన విషయం వైసీపీ నేతలకు గుర్తు లేదా..?
- ఏడాదికి 15 వేలు అని చెప్పి.. మొదటి ఏడాది 14వేలు . తర్వాత ఏడాది 13వేలు ఇచ్చి.. చివరి సంవత్సరం ఎగ్గొట్టేశాడు..
- ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వకపోవడంతో విద్యార్థులకి ఆయా కాలేజీ యాజమాన్యాలు ఇప్పటికి కూడా టీసీలు ఇవ్వలేదు..
- వైసీపీ నేతలు అబద్దాలు చెప్పుకుని బతుకుతున్నారు..
- వైసీపీ ప్రభుత్వం కన్నా.. మా హయాంలోనే సామాన్యులకు ఇసుక ఫ్రీగా దొరుకుతుంది..
- ఉచితంగా ఇసుకను ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మాదే..
- వైసీపీ హయాంలో ఇసుకను దోచుకున్నారు.. కోట్ల రూపాయల ప్రకృతి సంపదను కొల్లగొట్టారు..
- వైసీపీ హయాంలో 5వేలకు దొరికే ఇసుక.. ఇప్పుడు వెయ్యి రూపాయలకే వస్తోంది..
- మీలాగా మేం కేసులు పెట్టాలనుకుంటే.. ఒక్క వైసీపీ నేత కూడా రోడ్డుమీదకు వచ్చే దైర్యం చెయ్యడు.
- నిరుపేదల కడుపు నింపే అన్న క్యాంటీన్ ను వైసీపీ మూసేస్టే.. మా ప్రభుత్వం రాగానే తిరిగి ప్రారంభించాం
- వైసీపీ ఇక అధికారంలోకి రాదని గ్రహించిన ఆ పార్టీ నేతలు.. మా ప్రభుత్వంపై కావాలనే బురద చల్లుతున్నారు
- విద్యా దీవెన వసతి దీవెన పేరుతో విద్యార్థులని మోసం చేసి ఒక్కొక్కరికి జగన్ 50 వేలు బాకీ పడ్డారు
రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు పరితపిస్తుంటే.. వైసీపీ నేతలకు అది నచ్చడం లేదని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.. గత ప్రభుత్వంలో ట్రాక్టర్ ఇసుక 15 వేలకి వైసీపీ నేతలు అమ్ముకుంటే.. ఇప్పుడు కేవలం 1500కే ఇసుక అందుబాటులోకి వచ్చిందని ఆయన వెల్లడించారు.. నాలుగు నెలల తర్వాత బయటకు వచ్చిన వైసీపీ నేతలు ప్రభుత్వం పై విమర్శలు చేయడం సిగ్గుచేటు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.. ప్రభుత్వం కక్ష సాధిస్తుందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించడం సిగ్గుచేటు అన్నారు.. తాము కక్షపూరితంగా వ్యవహరించి ఉంటే.. వైసీపీ నాయకుడు ఇంటి నుంచి బయటికి రావడానికి కూడా భయపడేవాడని కోటంరెడ్డి అన్నారు.. గత ఐదేళ్ల వైసిపి హయాంలో రాష్ట్రం అన్ని రంగాలలో దివాలా తీసిందని విమర్శించారు.. అందరికీ అమ్మబడి ఇస్తానని చెప్పిన జగన్.. అధికారంలోకి రాగానే ఇంట్లో ఒక్కరికే ఇస్తానని మాట మార్చిన విషయం వైసిపి నేతలకి గుర్తు లేదా అంటూ ప్రశ్నించారు.. ఏడాదికి 15వేలు ఇస్తానని చెప్పి.. మొదటి ఏడాది 14000, రెండో ఏడాది 13000 ఇచ్చి, చివరి సంవత్సరం ఎగ్గొట్టేసాడని మండిపడ్డారు. ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వకపోవడంతో.. టీసీలు రాక విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. వైసీపీ నేతలు అబద్ధాలు చెప్పుకొని బతుకుతున్నారని.. ఇసుకను ఉచితంగా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మాదే అంటూ ఆయన అభిప్రాయపడ్డారు.. వైసీపీ యొక్క అధికారంలోకి రాదని గ్రహించిన పార్టీ నేతలు మా ప్రభుత్వం పై బురద చల్లుతున్నారంటూ మండిపడ్డారు.. ఇప్పటికైనా వైసీపీ నేతలు బుద్ధి తెచ్చుకొని ప్రవర్తించాలంటూ హితవు పలికారు.. ఈ మీడియా సమావేశంలో నగర అధ్యక్షుడు మామిడాల మదు, కువ్వారపు బాలాజీ, అంచురి శ్రీనివాసులు నాయుడు, జహీర్, మొయుదిన్, కేపీ చౌదరి,తంబీ. సుజన్, నారాయణ రెడ్డి సుధా ఇతర నేతలు పాల్గొన్నారు.
మంత్రి నారాయణ గారిని విమర్శించే అర్హత ఎవరికీ లేదు.
వైసిపి వాళ్ళు ఆక్రమణ చేసిన పంట కాలువను సర్వే చేసి తిరిగి త్రవ్వించండి.
- ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్.
ఉచిత ఇసుక విషయంలో MLC చంద్రశేఖర్ రెడ్డి మంత్రి నారాయణ గారిని విమర్శించడం విడ్డూరం.
-ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్.
తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం.. నాయకుడంటే గౌరవం కల్గి.. పార్టీ కోసం క్రమశిక్షణగా పనిచేసే
5వ డివిజన్ యువత ప్రెసిడెంట్ కరిముల్లాకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. అల్లాహ్.. దయతో.. కరిముల్లా సంతోషంగా ఉండాలని.. పార్టీలో మంచి పదవులు అధిరోహించాలని కోరుకుంటూ..
మీ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి..
నుడా మాజీ చైర్మన్..
రాష్ట ప్రధాన కార్యదర్శి..
45వ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ చిరంజీవిని పరామర్శించిన కోటంరెడ్డి..
తెలుగుదేశం పార్టీ 45వ డివిజన్ ఉపాధ్యక్షుడు చిరంజీవికి చెయ్యి విరగడంతో ఇంటి వద్ద ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు.. డివిజన్ అధ్యక్షుడు సుజన్ ద్వారా సమాచారం తెలుసుకున్న టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు.. త్వరగా కోలుకొని ప్రజలకు అందుబాటులో ఉండాలని.. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.. ఈ కార్యక్రమంలో డివిజన్ ముఖ్య నాయకులు ఉన్నారు..
దేవాలయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కోటంరెడ్డి..
టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి.. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.. ఈ సందర్భంగా కోటంరెడ్డి ఆయన ఆత్మీయంగా పలకరించారు.. అనంతరం పలు రాజకీయ విషయాలను చర్చించారు..
నెల్లూరు నగరంలో 43వ డివిజన్ శాది మంజిల్ మౌళిక సదుపాయాలు కల్పనకు జరిగిన సమావేశంలో పాల్గొన్న కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి గారు.
నగర నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండండి.. భారీ వర్షాల నేపథ్యంలో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి విజ్ఞప్తి..
నెల్లూరు జిల్లాకు రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో.. నెల్లూరు నగరం నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి.. తీవ్రమైన పెనుగాలులు పిడుగులు పడే అవకాశం ఉంటుంది.. అవసరమైతే తప్ప ఇంట్లోంచి ఎవరు బయటకు రావద్దు.. విద్యుత్ స్తంభాలను ఎవరు ముట్టుకోవద్దు.. భారీ వర్షాల కారణంగా ఎవరు బయటకు వచ్చి ఇబ్బంది పడొద్దు.. మీకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తిన స్థానికంగా ఉండే తెలుగుదేశం పార్టీ నేతలకు సమాచారం ఇవ్వండి.. మాతోపాటు మా పార్టీ కార్యకర్తలు అందరూ ప్రజలకు అందుబాటులో ఉంటారు..
కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి
టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నేత హరి రెడ్డి..
టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ని జనసేన నేత హరి రెడ్డి, అయన స్నేహితులు మర్యాదపూర్వకంగా కలిశారు.. బాలాజీ నగర్ లో ఉన్న ఆయన నివాసానికి వెళ్లి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం జ్ఞాపికను అందజేశారు.. ఈ సందర్భంగా హరి రెడ్డి మాట్లాడుతూ.. సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కోటంరెడ్డి విశేష కృషి చేశారని గుర్తు చేశారు.. ఆయన్నీ మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా వెల్లడించారు..